మినప పుణుకులు
కావలిసిన పదార్థాలు
1. మినపప్పు 2 కప్పులు
2. బియ్యం 3 స్పూన్స్
3. ఉప్పు తగినంత
4.జీలకర్ర కొద్దిగా
5.ఆయిల్ పావు లీటరు
6. ఉల్లిపాయలు 2.
7.పచ్చిమిర్చి 3.
8. అల్లం చిన్న ముక్క
9. కొత్తిమీర కొద్దిగా
తయారీ విధానం
ముందుగా మినపప్పును ,బియ్యమును శుభ్రం గా కడిగి ,
తగినన్ని నీళ్లు పోసి 6 గంటలసేపు నానబెట్టుకోవాలి .
నానిన పప్పును కడిగి , తగినంత ఉప్పును వేసి ,
గారెల పిండి మాదిరిగా గట్టిగా రుబ్బుకుని ,
ఒక బౌల్ లోకి తీసుకోవాలి .
ఉల్లిపాయలను ,పచ్చిమిర్చి ,అల్లము ,కొత్తిమీరలను ,
శుభ్రం గా కడిగి సన్నగా తరుగుకోవాలి.
తరిగిన వీటిని జీలకర్ర , రుబ్బుకున్న మినప పిండిలో వేసి
బాగా కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
అందులో ఈ పిండిని పుణుగు ల మాదిరి గా వేసుకుని
దోరగా వేపుకుంటే మినప పుణుకులు రెడీ.
వీటిని చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ,మరియు చట్నీ తో తింటే బాగుంటాయి.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
" వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.