పొన్నగంటి కూర పప్పు
కంటిచూపు తగ్గుతోందన్న విషయం మన ఇంట్లోని బామ్మలు, అమ్మమ్మల చెవినబడితే
వెంటనే వాళ్లు రోజూ పొన్నగంటి కూర తినమని సలహా ఇస్తారు. నిజానికి చూపు పోయినవాళ్లకీ చూపు తెప్పించగలదనే అర్థంలో దీన్ని ‘పోయిన కంటి కూర’ అని పిలిచేవారు.
అదే వాడుకలో పొన్నగంటి అయింది. ఈ ఆకునే సంస్కృతంలో మత్స్యక్షి అనీ, ఇంగ్లిషులో డ్వార్ఫ్ కాపర్‌లీఫ్, సెసైల్ జాయ్‌వీడ్ అనీ పిలుస్తారు. సామాన్యుడి బంగారు భస్మంగానూ దీన్ని పిలుస్తారు.
ఇందులో పోషకాలు
వంద గ్రాముల ఆకులో
60 క్యాలరీల శక్తి , 12గ్రా. పిండిపదార్థాలూ, 4.7గ్రా. ప్రొటీన్లూ, 2.1గ్రా. పీచూ,
146మి.గ్రా. కాల్షియం, 45 మి.గ్రా. పొటాషియంలతోబాటు ఎ, సి- విటమిన్లూ
పుష్కలంగా లభ్యమవుతాయి.
పొన్నగంటి కూర పప్పు కి
కావలిసిన పదార్థాలు
1. పొన్నగంటి కూర ఒక కట్ట
2. కందిపప్పు కప్పు
3.పచ్చిమిర్చి 3
4. కరివేపాకు
5. పసుపు కొద్దిగా
6. ఉప్పు రుచికి సరిపడ
7. వెల్లుల్లి రెబ్బలు 6
8. నీళ్లు తగినన్ని
1. పొన్నగంటి కూర ఒక కట్ట
2. కందిపప్పు కప్పు
3.పచ్చిమిర్చి 3
4. కరివేపాకు
5. పసుపు కొద్దిగా
6. ఉప్పు రుచికి సరిపడ
7. వెల్లుల్లి రెబ్బలు 6
8. నీళ్లు తగినన్ని
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్ ,ఎండుమిర్చి 2,
ఇంగువ కొద్దిగా ,ఆయిల్ 2 స్పూన్స్
మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్ ,ఎండుమిర్చి 2,
ఇంగువ కొద్దిగా ,ఆయిల్ 2 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా పొన్నగంటికూరను బాగుచేసుకుని ,శుభ్రంగా కడిగి ,
సన్నగా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ,వేడెక్కాక ,
కందిపప్పును వేసి ,
కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపుకుని ,
ఒకసారి కడిగి ఒక గిన్నె లోకి ,
పప్పును ,పొన్నగంటికూరను వేసి ,
తగినన్ని నీళ్లు పోసుకుని ,
కుక్కరులో పెట్టి ఉడికించుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి , వేడెక్కాక ,ఆయిల్ వేసి,
పైన చెప్పిన పోపు దినుసులను , వెల్లుల్లి రెబ్బలను వేసి,
దోరగా వేగాక ,
కరివేపాకు ,పచ్చిమిర్చి లను వేసి ,
అవి వేగాక ,
ఉడికిన పప్పు మిశ్రమాన్ని ,పసుపు , తగినంత ఉప్పును వేసి,
బాగా కలిపి ,దగ్గర పడేంత వరకు ఉంచి ,
స్టవ్ ఆఫ్ చేసుకుంటే పొన్నగంటికూర పప్పు రెడీ.

వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుంది
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
" వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.