మునగాకు పెసరపప్పు పొడి కూర
కావలిసిన పదార్థాలు
1. మునగాకు 2 కప్పులు
2. పెసర పప్పు ఒక కప్పు
3. పసుపు కొద్దిగా
4. పచ్చిమిర్చి 2
5. ఉప్పు తగినంత
6. నీళ్లు తగినంత
పోపు దినుసులు
మినపప్పు అర స్పూన్ ,ఆవాలు కొద్దిగా ,జీలకర్ర కొద్దిగా ,ఎండుమిరపకాయలు 2
ఇంగువ కొద్దిగా ,ఆయిల్ 2 స్పూన్స్.
తయారీ విధానం
ముందుగా మునగాకును ,పెసరపప్పును ,శుభ్రంగా కడుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ,
అందులో మునగాకును , పెసరపప్పును వేసి ,
తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి .
ఉడికిన తరువాత చిల్లుల పళ్లెం లో పోసి ,చల్లార నివ్వాలి .
స్టవ్ మీద అదే బాణలి పెట్టి ,వేడి క్కాక ,ఆయిల్ వేసి ,
పోపు దినుసులను వేసి, దోరగా వేగాక ,
ఉడికించి చల్లార బెట్టుకున్న పెసర పప్పు , మునగాకులను ,వేసి
పసుపు , తగినంత ఉప్పులను , వేసి ,
బాగా కలిపి ,తడి పోయేంత వరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకుంటే
మునగాకు పెసర పప్పు పొడి కూర రెడీ.
ఈ కూర అన్నం లోకి చపాతీలోకి బాగుంటుంది.
ఆషాడ మాసం లో మునగాకు ను తింటే మంచిది
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
" వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.