Monday, 27 February 2017

ఎర్ర గోధుమ నూక ఉప్మా


ఎర్ర  గోధుమ నూక  ఉప్మా

కావలిసిన  పదార్థాలు
1. ఎర్ర  గోధుమ నూక  1 గ్లాసు
2. ఉల్లిపాయలు  2
3. టమాటా  1
4. అల్లం  చిన్న  ముక్క
5.   పచ్చిమిర్చి  4
6. కరివేపాకు
7. పసుపు
8. ఉప్పు  రుచికి  సరిపడా
9. ఆయిల్  4 స్పూన్స్
10. నీళ్లు  4 గ్లాసులు
11. క్యారెట్ ముక్కలు
12. కొత్తిమీర

పోపు  దినుసులు
సెనగ పప్పు  1 స్పూన్  ,మినపప్పు  1 స్పూన్  ,ఆవాలు  అర  స్పూన్  ,
జీలకర్ర  అర  స్పూన్  ఎండుమిరపకాయలు  2

తయారీ  విధానం
 ఉల్లిపాయలను  ,టమాటాలు ,   క్యారెట్ ముక్కలు ,అల్లంలను  ,సన్నగా  చిన్న ముక్కలుగా  ను ,
 పచ్చిమిర్చి ని  చీలికలుగాను  తరుగుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ఆయిల్   వేసి,
 పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి , దోరగా  వేగిన  తరువాత  ,
తరిగి పెట్టుకున్న  ఉల్లి  పాయ,  టమాటా  , క్యారెట్ ముక్కలు ,అల్లం,  పచ్చిమిర్చి,
కరివేపాకులను  వేసి  దోరగా  మగ్గిన   తరువాత  ,
4 గ్లాసుల  నీళ్లు  పోసి,  తగినంత  ఉప్పును  వేసి,
 బాగా  కలిపి  నీళ్లు  మరిగిన తరువాత  ,
నూకను వేసి  బాగా  కలిపి,  కొద్దిసేపు  ఉడకనివ్వాలి.
మధ్య మధ్యలో  కలుపుతూ  ఉండాలి .
అవసరమైతే  కొద్దిగా  నీళ్లు  చిలకరించుకోవాలి  ,
తడి  అంతా పోయి  విడి విడి  లాడుతూ  వచ్చాక,
స్టవ్ ఆఫ్ చేసి కొని,
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
 ఘుమ  ఘుమ  లాడే
ఎర్ర నూక  ఉప్మా  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi

నిమ్మకాయ కారం ముక్కలు


నిమ్మకాయ  కారం ముక్కలు

కావలిసిన పదార్థాలు
1. నిమ్మకాయలు  6
2. పచ్చిమిర్చి  3
3. పసుపు  కొద్దిగా
4. ఆయిల్  8  స్పూన్స్
5. ఉప్పు  తగినంత

కారమునకు
మినపప్పు  1 స్పూన్   , ఆవాలు  1 స్పూన్  , మెంతులు అర స్పూన్ ,
 జీలకర్ర  1 స్పూన్  , ఎండుమిరపకాయలు 6   , ఇంగువ  కొద్దిగా

తయారీ విధానం
ముందుగా  నిమ్మకాయలు  శుభ్రం గా  కడిగి తుడిచి  ,ఆరిన  తరువాత  ,
చిన్న ముక్కలుగా  తరుగుకోవాలి ,
పచ్చిమిర్చిని  కూడా  చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,ఆయిల్  వేసి  ,
పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి  దోరగా  వేపుకుని  ,చల్లార్చుకోవాలి  .
చల్లారిన  వీటిని తగినంత  ఉప్పు  వేసి ,
పొడిలాగా  గ్రైండ్  చేసుకోవాలి .
ఈ పొడిని  తరిగిన నిమ్మకాయ  ముక్కలమీద  వేసి  బాగా   కలుపుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక కొద్దిగా  ఇంగువ  ,
6 స్పూన్స్  ఆయిల్  వేసి,  వేడెక్కనిచ్చి,
కారము  కలిపిన   నిమ్మకాయ  ముక్కలపై న   వేసి ,
 బాగా  కలిపి ఊర  నిస్తే
రుచికరమైన  నిమ్మకాయ  ముక్కలు  రెడీ అవుతాయి
ఇవి  ఒక వారం  రోజులపాటు  నిల్వ  ఉంటాయి
వేడి  అన్నం లో  నెయ్యి  వేసుకుని  తింటే బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi


Saturday, 25 February 2017

క్యాబేజీ పెసర పప్పు పొడికూర


క్యాబేజీ  పెసర  పప్పు  పొడికూర

కావలిసిన పదార్థాలు
1. పెసరపప్పు  1 కప్పు  
2. క్యాబేజీ పావుకేజీ
3.   పచ్చిమిర్చి  3
4. కరివేపాకు  కొద్దిగా
5.  నీళ్లు  తగినన్ని
6.   పసుపు
7. ఉప్పు రుచికి  సరిపడా

పోపు దినుసులు
 మినపప్పు  1 స్పూన్ , ఆవాలు  అర  స్పూన్  ,జీలకర్ర  అర  స్పూన్ ,ఎండుమిరపకాయలు  2  ,
ఇంగువ  కొద్దిగా,  ఆయిల్  2 స్పూన్స్

తయారీ  విధానం
 ముందుగా  క్యాబేజీని  శుభ్రంగా  కడిగి  ,సన్నగా తరుగుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి , అందులో  తరిగిన  క్యాబేజీ  ని  ,
పెసరపప్పును  వేసి తగినన్ని  నీళ్లు  పోసి  ,ఉడికించుకుని  ,
చిల్లుపల్లెం లో  పోసి  చల్లార్చుకోవాలి.
  స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక , ఆయిల్  వేసి  ,
పైన  చెప్పిన  పోపుదినుసులను  వేసి  ,దోరగా  వేగాక  ,
పచ్చిమిర్చి  చీలికలు  ,కరివేపాకు  వేసి ,వేగిన తరువాత  ,
ముందుగా  మనం  ఉడికించి  చల్లారబెట్టుకున్న  ,
పెసరపప్పు ,క్యాబేజీ   ,పసుపు లను  వేసి   ,బాగా  కలిపి ,
 కొద్దిసేపు  మగ్గనిచ్చి , తగినంత  ఉప్పు వేసి , బాగా కలిపి  ,
స్టవ్  ఆఫ్  చేసుకుని  ఒక బౌల్ లోకి   తీసుకుని
పైన  కొత్తిమీరతో  గార్నిష్  చేసుకుంటే
పెసరపప్పు  క్యాబేజీ  పొడికూర  రెడీ  అవుతుంది
దీనిని  వేడి  అన్నంలోను  చపాతీలోనూ  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi


Friday, 24 February 2017

ఓం నమః పార్వతీపతియే హర హర హర మహాదేవ శంభోశంకర...


ఓం నమః పార్వతీపతియే హర హర హర మహాదేవ శంభోశంకర...
విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖరధారణాయ |
కర్పూరకాంతిధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౧ ||

గౌరీప్రియాయ రజనీశకళాధరాయ
కాలాంతకాయ భుజగాధిపకంకణాయ |
గంగాధరాయ గజరాజవిమర్దనాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౨ ||

భక్తిప్రియాయ భవరోగభయాపహాయ
ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౩ ||

చర్మంబరాయ శవభస్మవిలేపనాయ
భాలేక్షణాయ మణికుండలమండితాయ |
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౪ ||

పంచాననాయ ఫణిరాజవిభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయమండితాయ |
ఆనందభూమివరదాయ తమోహరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౫ ||

భానుప్రియాయ దురితార్ణవతారణాయ
కాలాంతకాయ కమలాసనపూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౬ ||

రామప్రియాయ రఘునాథవరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవతారణాయ |
పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౭ ||

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ |
మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౮ ||

గోంగూర పులుసు


గోంగూర  పులుసు
కావలిసిన  పదార్థాలు
1. గోంగూర  1 కట్ట
2. పసుపు
3. ఉప్పు  రుచికి  సరిపడా
4.  బెల్లం  కొద్దిగా
5. పచ్చిమిర్చి  3
6.  వరిపిండి  2 స్పూన్స్ 
7. నీళ్లు  తగినన్న్ని

పోపు  దినుసులు
 ఆవాలు అర  స్పూన్  ,మెంతులు  అర  స్పూన్ , జీలకర్ర  అర  స్పూన్  ,
ఇంగువ  కొద్దిగా  ,ఎండుమిరపకాయలు  2, కారం  కొద్దిగా , ఆయిల్  2 స్పూన్స్

తయారీ  విధానం
ముందుగా  గోంగూరను  శుభ్రం  చేసుకుని , శుభ్రంగా   కడిగి  ,సన్నగా  తరిగి  ,
ఒక  గిన్నెలోకి  తీసుకుని  ,పసుపు  ,తగినంత  ఉప్పు  ,బెల్లం ,పచ్చిమిర్చి  చీలికలు  ,
వేసి  తగినన్ని   నీళ్లు  పోసి ,ఉడికించుకోవాలి .
ఉడికిన  తరువాత వరిపిండిని , కొద్దిగా  నీళ్లలో  కలిపి  ,పేస్ట్ లాగ  చేసి ,
ఉడుకుతున్న పులుసులో  కలిపి  మరగనివ్వాలి .
  స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి  ,
పైన  చెప్పిన  పోపు  దినుసులు  ,కారం  ,వెల్లుల్లి  రెబ్బలు  వేసి  ,
దోరగా  వేగిన తరువాత  ,మరుగుతున్న  పులుసులో  వేసి  ,బాగా కలిపి,
స్టవ్  ఆఫ్  చేసుకుంటే  ఘుమ ఘుమ  లాడే  గోంగూర  పులుసు  రెడీ  అవుతుంది.

*గోంగూర  పుల్లటిది  అయితే  చింత పండు  అవసరం  లేదు
**గోంగూర  పులుపు  లేకపోతే   చింత పండు  వేసుకొవాలి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Thursday, 23 February 2017

ప్రసాదం బూరెలు


ప్రసాదం బూరెలు
కావలిసిన  పదార్థాలు
1. తెల్ల  గోధుమనూక  ఒక  గ్లాసు
2. పంచదార  ఒక  గ్లాసు
3. ఏలకుల  పొడి  కొద్దిగా
4. నీళ్లు  ఒక గ్లాసు
5.  పాలు  ఒక గ్లాసు
6.  నెయ్యి  అర  కప్పు
7. జీడిపప్పు  పలుకులు  8 

బూరెల  తోపునకు
 మైదా  పిండి 1 కప్పు  ,సెనగపిండి  1 కప్పు  ,వరిపిండి  1 కప్పు  ,నీళ్లు  తగినన్ని  ,
ఉప్పు  చిటికెడు  , బేకింగ్ పొడి  కొద్దిగా ,  ఆయిల్  పావులీటరు

తయారీ  విధానం
ముందుగా  సెనగ పిండి  ,వరి పిండి  ,మైదా పిండి  లను  ,
ఒక  బౌల్  లోకి  తీసుకుని  ,చిటికెడు  ఉప్పు,  బేకింగ్  పొడి  ని  వేసి ,
 బాగా  కలిపి  కొద్దీ కొద్దిగా  నీళ్లు  పోసుకుంటూ  ,
బజ్జీల  పిండి  మాదిరిగా  కలుపుకుని  ,ఒక   పక్కన  పెట్టుకోవాలి   .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక , ఒక  స్పూన్  నెయ్యి  వేసి ,
గోధుమ  నూకను  ,జీడిపప్పు  పలుకులను  ,
వేసి  దోరగా  వేపుకుని  ,ఒక  ప్లేట్  లోకి  తీసుకుని ,
దానిపైన  పంచదారను  వేసి   కలపాలి  .
స్టవ్  పైన  బాణలి  పెట్టి  నీళ్లు ,పాలు పోసి , మరిగాక
పంచదార  కలిపిన  నూకను ,నెయ్యి ని  ,ఏలకుల  పొడిని ,
వేసిబాగా కలిపి  మూత  పెట్టి  ఉడకనివ్వాలి .
మద్య  మధ్యలో  కలుపుతూ   అవసరమైతే , నెయ్యి ని   కూడా వేసి ,
 బాగా  కలిపి  దగ్గర  పడ్డాక  ,స్టవ్  ఆఫ్  చేసుకుంటే  ప్రసాదం  రెడీ .
 దీనిని  చల్లారాక  చిన్న  ఉండలుగా  చేసుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,పావు లీటరు  ఆయిల్  వేసి  ,
ముందుగా  మనం  తయారు చేసుకున్న  ప్రసాదం  ఉండలను ,
తోపు  పిండిలో  ముంచి ,ఆయిల్  లో  వేసి  దోరగా  వేపుకుంటే
వేడి  వేడి  ప్రసాదం  బూరెలు  రెడీ  అవుతాయి
ఇవి  రెండు  రోజుల  పాటు  నిల్వ  ఉంటాయి .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Thursday, 9 February 2017

హిందూ సంస్కృతి లో 8 , 18 అంకెల ప్రాధాన్యత



జయతు  హిందూ సంస్కృతి
జయతు భారతీయ  సంస్కృతి

అష్ట లక్ష్మి లు

    1. ఆది లక్ష్మి,       2. ధాన్యలక్ష్మి ,  3. ధైర్యలక్ష్మి ,  4. గజలక్ష్మి,
    5. సంతానలక్ష్మి, 6. విజయలక్ష్మి, 7. విద్యాలక్ష్మి,  8. ధనలక్ష్మి

అష్టాదశ పీఠాలు:
1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక )
2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు)
3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్)
4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక)
5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్)
6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్)
7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర)
8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర )
9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ )
10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ )
11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా)
12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్)
13. శ్రీ కామరూపిణీదేవి (గౌహతి, అస్సాం)
14. శ్రీ మాధవేశ్వరి దేవి ( ప్రయాగ, ఉత్తరప్రదేశ్)
15. శ్రీ వైష్ణవీదేవి ( జ్వాలాకేతం, హిమాచలప్రదేశ్)
16. శ్రీ మాంగల్య గౌరీదేవి ( గయా, బీహార్)
17. శ్రీ విశాలాక్షీదేవి ( వారణాశి, ఉత్తరప్రదేశ్)
18. శ్రీ సరస్వతీదేవి ( జమ్మూ కాశ్మీర్)

అష్టా దశ పురాణాలు:
1. బ్రహ్మపురాణం
2. పద్మపురాణం
3. నారద పురాణం
4. మార్కండేయపురాణం
5. విష్ణుపురాణం
6. శివపురాణం
7. భాగవతపురాణం
8. అగ్నిపురాణం
9. భవిష్యపురాణం
10. బ్రహ్మవైవర్త పురాణం
11. లింగపురాణం
12. వరాహపురాణం
13. స్కందపురాణం
14. వామనపురాణం
15. కుర్మపురాణం
16. మత్స్యపురాణం
17. గరుడపురాణం
18. బ్రహ్మాండపురాణం

అయ్యప్ప స్వామి గుడి మెట్లు:18
1. పొన్నంబలమేడు
2. గౌదేంమల
3. నాగమల
4. సుందరమల
5. చిత్తంబలమల
6. ఖల్గిమల
7. మాతంగమల
8. మైలదుమల
9. శ్రీపదమల
10. దేవరమల
11. నిలక్కలమల
12. తలప్పరమల
13. నీలిమల
14. కరిమల
15. పుతుసేరిమల
16. కలకేట్టిమల
17. ఇంచిప్పరమల
18. శబరిమల

అష్టదిక్పాలకులు:
1. తూర్పు (ఇంద్రుడు)
2. ఆగ్నేయం (అగ్ని)
3. దక్షిణం (యముడు)
4. నైరుతి (నిరుతి)
5. పశ్చిమం (వరుణుడు)
6. వాయువ్యం (వాయువు)
7. ఉత్తరం (కుబేరుడు)
8. ఈశాన్యం (ఈశానుడు)

అష్టమూర్తులు:
1. భూమి
2. ఆకాశం
3. వాయువు
4. జలము
5. అగ్ని
6. సూర్యుడు
7. చంద్రుడు
8. యజ్గ్యము చేసిన పురుషుడు.

అష్టఐశ్వర్యాలు:
1. ధనము
2. ధాన్యము
3. వాహనాలు
4. బంధువులు
5. మిత్రులు
6. బృత్యులు
7. పుత్రసంతానం
8. దాసిజనపరివారము

అష్టకష్టాలు:
1. అప్పు
2. యాచన
3. ముసలితనం
4. వ్యభిచారం
5. చోరత్వం
6. దారిద్యం
7. రోగం
8. ఎంగిలి భోజనం

అష్టఆవరణాలు:
1. విభూది
2. రుద్రాక్ష
3. మంత్రము
4. గురువు
5. లింగము
6. జంగమ మాహేశ్వరుడు
7. తీర్థము
8. ప్రసాదము

అష్టవిధ వివాహములు:
1. బ్రాహ్మం
2. దైవం
3. ఆర్షం
4. ప్రాజాపత్యం
5. ఆసురం
6. గాంధర్వం
7. రాక్షసం
8. ఫైశాచం

అష్టభోగాలు:
1. గంధం
2. తాంబూలం
3. పుష్పం
4. భోజనం
5. వస్త్రం
6. సతి
7. స్నానం
8. సంయోగం

అష్టాంగ యోగములు:
1. యమము
2. నియమము
3. ఆసనము
4. ప్రాణాయామము
5. ప్రత్యాహారము
6. ధారణ
7. ద్యానము
8. సమాధి

జయతు     హిందూ     సంస్కృతి
జయతు     భారతీయ  సంస్కృతి