Friday, 28 February 2020

రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో

రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి..

1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
= వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
= నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
= తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
=24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
=కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
=సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
=కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
=సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
=కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
=పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?
=జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
= దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
=హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
=శ్రీరాముడు.

16. భరతుని తల్లి పేరేమిటి?
=కైకేయి.

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
=వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
=12 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
=మారీచ, సుబాహులు.

21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
=బల-అతిబల.

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
=సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
=సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
=అగస్త్యుడు.

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
=భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

27. అహల్య భర్త ఎవరు?
=గౌతమ మహర్షి.

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
=శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?
=నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
=దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
=విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
=మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
=జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
=కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
=వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
=యధాజిత్తు.

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
=మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
=గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
=శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
=గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
=భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
=మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
=తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
=జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
=నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
=అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
=విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
=అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
=గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
=శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
=జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
=మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
=బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
=జటాయువు.

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
=దక్షిణపు దిక్కు.

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
=కబంధుని.

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
=మతంగ వనం, పంపానదీ.

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
=ఋష్యమూక పర్వతం.

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
=హనుమంతుడు.

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
=అగ్ని సాక్షిగా.

61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

62. సుగ్రీవుని భార్య పేరు?
=రుమ.

63. వాలి భార్యపేరు?
=తార.

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
=కిష్కింధ.

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
=మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
=దుందుభి.

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
=మతంగముని.

68. వాలి కుమారుని పేరేమిటి?
=అంగదుడు.

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
=ఏడు.

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
=ప్రసవణగిరి.

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=వినతుడు.

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=అంగదుడు.

73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
=మామగారు, తార తండ్రి.

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=శతబలుడు.

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
=మాసం (ఒక నెల).

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
=దక్షిణ దిక్కు.

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
=స్వయంప్రభ.

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
=సంపాతి.

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
=పుంజికస్థల.

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
=మహేంద్రపర్వతము.

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
=మైనాకుడు.

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
=సురస.

84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
=సింహిక.

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
=నూరు యోజనములు.

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
=లంబ పర్వతం.

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
=అశోక వనం.

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
=రెండు.

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
=త్రిజట.

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
=రామ కథ.

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
=చూడామణి.

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
=ఎనభై వేలమంది.

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
=విభీషణుడు.

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
=మధువనం.

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
=ఆలింగన సౌభాగ్యం.

98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
=నీలుడు.

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
=నికుంభిల.

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
=అగస్త్యుడు.

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
=ఇంద్రుడు.

102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
=మాతలి.

103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
=హనుమంతుడు.

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
=శత్రుంజయం.

106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
=స్వయంగా తన భవనమునే యిచ్చెను.

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
=బ్రహ్మ.

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
=తన మెడలోని ముత్యాలహారము

Thursday, 20 February 2020

గాంధారి వంద మంది పుత్రులు పేర్లు

గాంధారికి వంద మంది పుత్రులు .
వీరినే కౌరవులుగా మహాభారతంలో పేర్కొంటారు. ఈ వంద మంది పేర్లు

1. దుర్యోధనుడు. 2. దుశ్సాసనుడు. 3. దుస్సహుడు. 4. దుశ్శలుడు. 5. జలసంధుడు. 6. సముడు. 7. సహుడు. 8. విందుడు. 9. అనువిందుడు. 10. దుర్దర్షుడు. 11. సుబాహుడు. 12. దుష్పప్రదర్శనుడు. 12. దుర్మర్షణుడు. 13. దుర్మఖుడు. 15. దుష్కర్ణుడు. 16. కర్ణుడు. 17. వివింశతుడు. 18. వికర్ణుడు. 19.శలుడు. 20. సత్వుడు. 21. సులోచనుడు. 22. చిత్రుడు. 23. ఉపచిత్రుడు. 24. చిత్రాక్షుడు. 25. చారుచిత్రుడు. 26. శరాసనుడు. 27. ధర్మధుడు. 28. దుర్విగాహుడు. 29. వివిత్సుడు. 30. వికటాననుడు. 31. నోర్ణనాభుడు. 32. నునాభుడు. 33. నందుడు. 34. ఉపనందుడు. 35. చిత్రాణుడు. 36. చిత్రవర్మ. 37. సువర్మ. 38. దుర్విమోచనుడు. 39. అయోబావుడు. 40. మహాబావుడు. 41. చిత్రాంగుడు. 42. చిత్రకుండలుడు. 43. భీమవేగుడు. 44. భీమలుడు. 45. బలాకుడు. 46. బలవర్థనుడు. 47. నోగ్రాయుధుడు. 48. సుషేణుడు. 49. కుండధారుడు. 50. మహోదరుడు. 51. చిత్రాయుధుడు. 52. నిషింగుడు. 53. పాశుడు. 54. బృఎందారకుడు. 55. దృఢవర్మ. 56. దృఢక్షత్రుడు. 57. సోమకీర్తి. 58. అనూదరుడు. 59. దఢసంధుడు. 60. జరాసంధుడు. 61. సదుడు. 62. సువాగుడు. 63. ఉగ్రశ్రవుడు. 64. ఉగ్రసేనుడు. 65. సేనాని. 66. దుష్పరాజుడు. 67. అపరాజితుడు. 68. కుండశాయి. 69. విశాలాక్షుడు. 70. దురాధరుడు. 71. దుర్జయుడు. 72. దృఢహస్థుడు. 73. సుహస్తుడు. 74. వాయువేగుడు. 75. సువర్చుడు. 76. ఆదిత్యకేతుడు. 77. బహ్వాశి. 78. నాగదత్తుడు. 79. అగ్రయాయుడు 80. కవచుడు. 81. క్రధనుడు. 82. కుండినుడు. 83. ధనుర్ధరోగుడు. 84. భీమరధుడు. 85. వీరబాహుడు. 86. వలోలుడు. 87. రుద్రకర్ముడు. 88. దృణరదాశ్రుడు. 89.అదృష్యుడు. 90. కుండభేది. 91. విరావి. 92. ప్రమధుడు. 93. ప్రమాధి. 94. దీర్గరోముడు. 95. దీర్గబాహువు. 96.ఉడోరుడు. 97. కనకద్వజుడు. 98. ఉపాభయుడు. 99. కుండాశి. 100. విరజనుడు. 101వ బిడ్డగా దుశ్శల అనే ఆడపిల్ల జన్మిస్తుంది.

Tuesday, 18 February 2020

శ్రీ మీనాక్షి స్తోత్రము


శ్రీ మీనాక్షి స్తోత్రమ్

మహిమాన్వితమైన స్తోత్రం ఇది !
సమస్త విద్యలయందారితేరిన వాడుగ, అనంతభోగలాలసుడుగ రాణించుటకు;
అన్ని విధములైన అపశ్రుతులను అణగార్చుటకు ఈ మీనాక్షి స్తోత్రమును మించినది మరొకటి లేదు.


శ్రీవిద్యే శివ వామభాగ నిలయే శ్రీరాజరాజార్చితే
శ్రీనాథధి గురుస్వరూప విభవే చింతామణీ పీఠికా
శ్రీవాణీ గిరిజానుతాంఘ్రి కమలే శ్రీశాంభవీ శ్రీశివే
మధ్యాహే ముభయద్వజాధిప సుతే మాం పాహి మీనాంబికె !!

చక్రస్థే చతుర్ చరాచర జగన్నాథే జగత్పూజితే
వార్తాళీ పరదేవతా భయకరే వక్షోజా భారాన్వితే
వేద్యే వేదకళాప మౌళిగుళికే వే విద్యుల్లతా విగ్రహే
మధ్యే పూర్ణ సుధా రాసార్ధ్రు హృదయే మాం పాహి మినాంబికె !!

కోటిరాంగద రత్నకుండలధరే కోదండ బాణాంచితే
కోకాకార కుచద్వయోప విలసత్ ప్రాలంబి హారాంచితే
మద్దారిద్ర్య భుజంగ గారుడ ఖగే మాం పాహి మీనాంబైక్ !!

బ్రహ్మే శాచ్యుత గీయమాన చరితే ప్రేతసనాంతస్థితే
పాశాదంకుశ చాపబాణ కలితే బాలేందు చూడార్చితే !!
ముద్రారాధిత దైవతే మునిసుతే మాం పాహి మీనాంబికే

గంధర్వామర యక్ష పన్నగ నుతే గంగాధ రాలింగితే
గాయత్రీ గరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే
ఖాతీతే ఖిం దారు పావక శిఖే ఖద్యోత కోట్యుజ్జ్వలే
మంత్రారాధిత దైవతే మునుసుతే మాం పాహి మినాంబికే !!

నాదే నారద తుంబురాద్య వినుతే నాదాంత నాదాత్మికే
నిత్యే  నీలవసాత్మికే నిరుపమే నీవార శూకోపమే
కాంతే కామకళే కదంబనిలయే కామే కారంతస్థితే
మద్విద్యే మ దభీష్ట కల్పలలితే మాం పాహి మీనాంబికే !!

వీణానాద నిమీలి తార్ధనయనే విప్రస్త చూళింభరే
తాంబూలారుణ పల్లవాధర యుతే తాటంక హారాన్వితే
శ్యామే చంద్రకళా వసంత కలితే కస్తూరికా పాలికే
పూర్ణే కైరవ బందురూప వదనే మాం పాహి మీనాంబికే !!

శబ్ద బ్రహ్మమయీ చరాచరమాయీ జ్యోతిర్మయీ వాజ్మయీ
నిత్యానందమయీ నిరంజనమయీ తత్త్వంమయీ చిన్మయీ
తత్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వరమయీ సదాశివమయీం మాం పాహి మీనాంబికే !!





Monday, 17 February 2020

ఉసిరి మెంతికాయ


ఉసిరి మెంతికాయ
కావలసిన పదార్థాలు
1. ఉసిరి కాయలు 500 గ్రాములు
2. ఎర్ర కారం పొడి 250 గ్రాములు
3. ఆవాలు 2 స్పూన్స్
4. మెంతులు 2 స్పూన్స్
5. నువ్వుల నూనె 250 గ్రాములు
6. ఇంగువ కొద్దిగా
7. ఉప్పు తగినంత
8. పసుపు కొద్దిగా

తయారీ విధానం

ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి ఆర బెట్టుకోవాలి.
ఆరిన ఉసిరికాయలకు గాట్లు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని వేడెక్కాక కొద్దిగా నూనె వేసుకుని మెంతులు , ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసి దోరగా వేపుకుని
చల్లార్చుకోవాలి.
చల్లారిన వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
మరల స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 5 స్పూన్స్ ఆయిల్ వేసి గాట్లు పెట్టిన ఉసిరికాయలను వేసి , కొద్దిగా పసుపు వేసి ఒక 15 నిమిషాలు వేగనిచ్చి , వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
తిరిగి అదే బాణలి లో నువ్వుల నూనె , ఇంగువ వేసి వేడెక్క నివ్వాలి .
నూనె బాగా వేడెక్కిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈనూనెలో కారం , ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి, ఆవపొడి , ఉప్పు వేసి బాగా కలిపి, దీనిలోముందుగా మనం వేపుకుని పెట్టుకున్న ఉసిరికాయలను వేసి
బాగా కలిపి పొడి సీసాలో గాని
జాడీలో గాని పెట్టుకుని 3 రోజులపాటు బాగా ఊర నివ్వాలి.
ఇలా 3 రోజులు ఊరిన తరువాత బాగాకలుపుకుని వాడుకుంటే ఘుమఘుమలాడే ఉసిరి మెంతి కాయ రెడి.
ఇది ఒక 6 నెలలపాటు నిలువ ఉంటుంది.

సూచన :

ఉసిరి ఆదివారం, మరియు రాత్రులు తినడం నిషేధం అని పెద్దలు చెపుతారు..

Subha's Kitchen
Rachana: Subha Achanta
Facebook page: Achanta Kadhalu

ఉసిరి ఆవకాయ


ఉసిరి ఆవకాయ
కావాల్సిన పదార్థాలు:

1. ఉసిరికాయలు - అర కేజీ
2. నువ్వులనూనె - పావు కేజీ
3. ఉప్పు - 50 గ్రాములు
4. కారం - 50 గ్రాములు
5. ఆవపొడి - 50 గ్రాములు
6. మెంతులు - అర స్పూన్

తయారీ విధానం :

ఉసిరికాయలని కడిగి, తడి లేకుండా పొడి బట్టతో తుడవాలి.
ఆ  తరువాత చాకుతో అక్కడక్కడ నిలువుగా గాట్లు పెట్టాలి.
మూకుడులో నూనె పోసి కొంచం కాగాకా ఉసిరికాయలను వేసి సన్నని మంట మీద వేయించాలి.
కొంచం ఎరుపు రంగు వచ్చేదాకా వేగనిచ్చి ,చల్లారనివ్వాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నువ్వుల నూనె వేసి కొంచెం సేపు కాగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని కారం, ఉప్పు , ఆవ పొడి, మెంతులు , మరియు
ముందుగా మనం వేపుకుని పెట్టుకున్న
ఉసిరి కాయలు,చిటికెడు పసుపు వేసి
బాగా కలిపి ,
అన్ని బాగా కలిసాకా పొడి సీసాలోకి  తీసిపెట్టుకుని ఒక రోజు తర్వాత వాడుకుంటే రుచిగా వుంటుంది.

కొంత మంది నిమ్మరసం కూడా కలుపుతారు. అలా కలపాలంటే ఓ పావుకప్పు నిమ్మరసాన్ని పై మిశ్రమంలో ఆఖరున కలిపితే సరిపోతుంది.
ఇది కూడా 6 నెలలపాటు నిలవ ఉంటుంది.

Subha's Kitchen
Rachana : Subha Achanta
facebook page : Achanta Kadhalu

 

ఉసిరి నిల్వ పచ్చడి


ఉసిరి నిల్వ పచ్చడి
ఈ పచ్చడిని మొదటి ముద్దలో నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని  చెబుతారు. ఇది సంవత్సరం అంత నిల్వ ఉండే పచ్చడి.
ముఖ్య సూచన :
ఆదివారం నాడు మరియు రాత్రులు తినడం నిషిద్ధం అని చెబుతారు.

 కావలిసిన పదార్ధాలు:

1. పెద్ద ( రాచ ) ఉసిరికాయలు: ఒక కేజీ
2. ఉప్పు: అర కేజీ
3. పసుపు : ఒక స్పూన్

పోపు కి కావలసిన పదార్థాలు
1. ఎండు మిర్చి
2. ఆవాలు
3. ఇంగువ
4. 2 స్పూన్ల నూనె

 తయారీ విధానం :

ముందుగా ఉసిరికాయలను కడిగి పొడి బట్టతో తుడవాలి.
ఆ తర్వాత నాలుగు  ముక్కలుగా కోసి మధ్యలో గింజ తీసేయ్యాలి.
ఆ తర్వాత ఉప్పు , పసుపు కలిపి పొడిగా వున్న సీసాలోకి తీసి పెట్టాలి.
మూడురోజుల తర్వాత తీసి చూస్తే ముక్క మెత్తబడి ఉంటుంది.
వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి .
తరువాత ఈ ముద్దను 3 రోజులు ఎండబెట్టుకోవాలి.
దీనివలన పచ్చడి పాడవ కుండా ఎక్కువ రోజులు నిల్వవుంటుంది.
మనకి కావాల్సి నప్పుడు,
ఎండబెట్టిన ఈ ముద్ద లో నించి కొంత తీసుకుని పక్కన పెట్టి... తరువాత
ఒక పాన్ లో
ఆవాలు, ఎండుమిర్చి ,మెంతులు , కొంచెం ఇంగువ వేసి దోరగా వేపుకుని ,
చల్లారాక మెత్తగా పొడి లాగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత దీనిని తీసుకున్న
ఆ ముద్ద కి కలుపుకుని
(ఇంగువ లో నూని వేసి వేడి చేస్తే దానిని ఇంగువ నూని అంటారు )
ఇంగువ నూనె ని పోసి కలుపుకుంటే
ఘుమఘుమ లాడే
ఉసిరి పచ్చడి రెడి .

* కొందరు  పొడి కారం బదులు పచ్చిమిర్చి వేసి రుబ్బుకుంటారు. పచ్చిమిర్చి తో ఉసిరి పచ్చడి రుచి చాలా బావుంటుంది .

Subha's  kitchen
Rachana : Subha Achanta

Friday, 14 February 2020

శ్రీ లక్ష్మీ సహస్ర నామావళి

 శ్రీలక్ష్మీసహస్రనామావలిః 

॥ అథ శ్రీలక్ష్మీసహస్రనామావలిః ॥

ఓం నిత్యాగతాయై నమః ।
ఓం అనన్తనిత్యాయై నమః ।
ఓం నన్దిన్యై నమః ।
ఓం జనరఞ్జిన్యై నమః ।
ఓం నిత్యప్రకాశిన్యై నమః ।
ఓం స్వప్రకాశస్వరూపిణ్యై నమః ।
ఓం మహాలక్ష్మ్యై నమః ।
ఓం మహాకాల్యై నమః ।
ఓం మహాకన్యాయై నమః ।
ఓం సరస్వత్త్యై నమః ॥ ౧౦
ఓం భోగవైభవసన్ధాత్ర్యై నమః ।
ఓం భక్తానుగ్రహకారిణ్యై నమః ।
ఓం ఈశావాస్యాయై నమః ।
ఓం మహామాయాయై నమః ।
ఓం మహాదేవ్యై నమః ।
ఓం మహేశ్వర్యై నమః ।
ఓం హృల్లేఖాయై నమః ।
ఓం పరమాయైశక్త్యై నమః ।
ఓం మాతృకాబీజరుపిణ్యై నమః ।
ఓం నిత్యానన్దాయై నమః ॥ ౨౦
ఓం నిత్యబోధాయై నమః ।
ఓం నాదిన్యై నమః ।
ఓం జనమోదిన్యై నమః ।
ఓం సత్యప్రత్యయిన్యై నమః ।
ఓం స్వప్రకాశాత్మరూపిణ్యై నమః ।
ఓం త్రిపురాయై నమః ।
ఓం భైరవ్యై నమః ।
ఓం విద్యాయై నమః ।
ఓం హంసాయై నమః ।
ఓం వాగీశ్వర్యై నమః ॥ ౩౦
ఓం శివాయై నమః ।
ఓం వాగ్దేవ్యై నమః ।
ఓం మహారాత్ర్యై నమః ।
ఓం కాలరాత్ర్యై నమః ।
ఓం త్రిలోచనాయై నమః ।
ఓం భద్రకాల్యై నమః ।
ఓం కరాల్యై నమః ।
ఓం మహాకాల్యై నమః ।
ఓం తిలోత్తమాయై నమః ।
ఓం కాల్యై నమః ॥ ౪౦
ఓం కరాలవక్త్రాన్తాయై నమః ।
ఓం కామాక్ష్యై నమః ।
ఓం కామదాయై నమః ।
ఓం శుభాయై నమః ।
ఓం చణ్డికాయై నమః ।
ఓం చణ్డరూపేశాయై నమః ।
ఓం చాముణ్డాయై నమః ।
ఓం చక్రధారిణ్యై నమః ।
ఓం త్రైలోక్యజనన్యై నమః ।
ఓం త్రైలోక్యవిజయోత్తమాయై నమః ॥ ౫౦
ఓం సిద్ధలక్ష్మ్యై నమః ।
ఓం క్రియాలక్ష్మ్యై నమః ।
ఓం మోక్షలక్ష్మ్యై నమః ।
ఓం ప్రసాదిన్యై నమః ।
ఓం ఉమాయై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం చాన్ద్ర్యై నమః ।
ఓం దాక్షాయణ్యై నమః ।
ఓం ప్రత్యఙ్గిరసే నమః ॥ ౬౦
ఓం ధరాయై నమః ।
ఓం వేలాయై నమః ।
ఓం లోకమాత్రే నమః ।
ఓం హరిప్రియాయై నమః ।
ఓం పార్వత్యై నమః ।
ఓం పరమాయై నమః ।
ఓం బ్రహ్మవిద్యాప్రదాయిన్యై నమః ।
ఓం అరూపాయై నమః ।
ఓం బహురూపాయై నమః ।
ఓం విరూపాయై నమః ॥ ౭౦
ఓం విశ్వరూపిణ్యై నమః ।
ఓం పఞ్చభూతాత్మికాయై నమః ।
ఓం వాణ్యై నమః ।
ఓం పరమాత్మికాయై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం కాలిమ్న్యై నమః ।
ఓం పఞ్చికాయై నమః ।
ఓం వాగ్మిన్యై నమః ।
ఓం హవిషే నమః ।
ఓం ప్రత్యధిదేవతాయై నమః ॥ ౮౦
ఓం దేవమాత్రే నమః ।
ఓం సురేశానాయై నమః ।
ఓం వేదగర్భాయై నమః ।
ఓం అమ్బికాయై నమః ।
ఓం ధృతయే నమః ।
ఓం సంఖ్యాయై నమః ।
ఓం జాతయై నమః ।
ఓం క్రియాశక్త్యై నమః ।
ఓం ప్రకృత్యై నమః ।
ఓం మోహిన్యై నమః ॥ ౯౦
ఓం మహ్యై నమః ।
ఓం యజ్ఞవిద్యాయై నమః ।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం గుహ్యవిద్యాయై నమః ।
ఓం విభావర్యై నమః ।
ఓం జ్యోతిష్మత్యై నమః ।
ఓం మహామాత్రే నమః ।
ఓం సర్వమన్త్రఫలప్రదాయై నమః ।
ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ।
ఓం హృదయగ్రన్థిభేదిన్యై నమః ॥ ౧౦౦


ఓం సహస్రాదిత్యసఙ్కాశాయై నమః ।
ఓం చన్ద్రికాయై నమః ।
ఓం చన్ద్రరూపిణ్యై నమః ।
ఓం అకారాదిక్షకారాన్తమాతృకాయై నమః ।
ఓం సప్తమాతృకాయై నమః ।
ఓం గాయత్ర్యై నమః ।
ఓం సోమసమ్భూత్యై నమః ।
ఓం సావిత్ర్యై నమః ।
ఓం ప్రణవాత్మికాయై నమః ।
ఓం శాఙ్కర్యై నమః ॥ ౧౧౦
ఓం వైష్ణవ్యై నమః ।
ఓం బ్రాహ్మ్యై నమః ।
ఓం సర్వదేవనమస్కృతాయై నమః ।
ఓం తస్మై నమః ।
ఓం దుర్గాసేవ్యాయై నమః ।
ఓం కుబేరాక్ష్యై నమః ।
ఓం కరవీరనివాసిన్యై నమః ।
ఓం జయాయై నమః ।
ఓం విజయాయై నమః ।
ఓం జయన్త్యై నమః ॥ ౧౨౦
ఓం అపరాజితాయై నమః ।
ఓం కుబ్జికాయై నమః ।
ఓం కాలికాయై నమః ।
ఓం శాస్త్ర్యై నమః ।
ఓం వీణాపుస్తకధారిణ్యై నమః ।
ఓం సర్వజ్ఞశక్త్యై నమః ।
ఓం సర్వజ్ఞాయై నమః ।
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః ।
ఓం ఇడాపిఙ్గలికామధ్యమృణాలితన్తు-
                 రుపిణ్యై నమః ।
ఓం యజ్ఞేశాన్యై నమః ॥ ౧౩౦
ఓం ప్రధాయై నమః ।
ఓం దీక్షాయై నమః ।
ఓం దక్షిణాయై నమః ।
ఓం సర్వమోహిన్యై నమః ।
ఓం అష్టాఙ్గయోగిన్యై నమః ।
ఓం నిర్బీజధ్యానగోచరాయై నమః ।
ఓం సర్వతీర్థస్థితాయై నమః ।
ఓం శుద్ధాయై నమః ।
ఓం సర్వపర్వతవాసిన్యై నమః ।
ఓం వేదశాస్త్రప్రమాణ్యై నమః ॥ ౧౪౦
ఓం షడఙ్గాదిపదక్రమాయై నమః ।
ఓం ధాత్ర్యై నమః ।
ఓం శుభానన్దాయై నమః ।
ఓం యజ్ఞకర్మస్వరూపిణ్యై నమః ।
ఓం వ్రతిన్యై నమః ।
ఓం మేనకాయై నమః ।
ఓం బ్రహ్మాణ్యై నమః ।
ఓం బ్రహ్మచారిణ్యై నమః ।
ఓం ఏకాక్షరపరాయై నమః ।
ఓం తారాయై నమః ॥ ౧౫౦
ఓం భవబన్ధవినాశిన్యై నమః ।
ఓం విశ్వమ్భరాయై నమః ।
ఓం ధరాధారాయై నమః ।
ఓం నిరాధారాయై నమః ।
ఓం అధికస్వరాయై నమః ।
ఓం రాకాయై నమః ।
ఓం కుహ్వే నమః ।
ఓం అమావాస్యాయై నమః ।
ఓం పూర్ణిమాయై నమః ।
ఓం అనుమత్యై నమః ॥ ౧౬౦
ఓం ద్యుతయే నమః ।
ఓం సినీవాల్యై నమః ।
ఓం అవశ్యాయై నమః ।
ఓం వైశ్వదేవ్యై నమః ।
ఓం పిశఙ్గిలాయై నమః ।
ఓం పిప్పలాయై నమః ।
ఓం విశాలాక్ష్యై నమః ।
ఓం రక్షోఘ్న్యై నమః ।
ఓం వృష్టికారిణ్యై నమః ।
ఓం దుష్టవిద్రావిణ్యై నమః ॥ ౧౭౦
ఓం సర్వోపద్రవనాశిన్యై నమః ।
ఓం శారదాయై నమః ।
ఓం శరసన్ధానాయై నమః ।
ఓం సర్వశస్త్రరూపిణ్యై నమః ।
ఓం యుద్ధమధ్యస్థితాయై నమః ।
ఓం సర్వభూతప్రభఞ్జన్యై నమః ।
ఓం అయుద్ధాయై నమః ।
ఓం యుద్ధరూపాయై నమః ।
ఓం శాన్తాయై నమః ।
ఓం శాన్తిస్వరూపిణ్యై నమః ॥ ౧౮౦
ఓం గఙ్గాయై నమః ।
ఓం సరస్వత్యై నమః ।
ఓం వేణ్యై నమః ।
ఓం యమునాయై నమః ।
ఓం నర్మదాయై నమః ।
ఓం సముద్రవసనావాసాయై నమః ।
ఓం బ్రహ్మాణ్డశ్రేణిమేఖలాయై నమః ।
ఓం పఞ్చవక్త్రాయై నమః ।
ఓం దశభుజాయై నమః ।
ఓం శుద్ధస్ఫటికసన్నిభాయై నమః ॥ ౧౯౦
ఓం రక్తాయై నమః ।
ఓం కృష్ణాయై నమః ।
ఓం సితాయై నమః ।
ఓం పీతాయై నమః ।
ఓం సర్వవర్ణాయై నమః ।
ఓం నిరీశ్వర్యై నమః ।
ఓం కాలికాయై నమః ।
ఓం చక్రికాయై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం సత్యాయై నమః ॥ ౨౦౦


ఓం బటుకాయై నమః ।
ఓం స్థితాయై నమః ।
ఓం తరుణ్యై నమః ।
ఓం వారుణ్యై నమః ।
ఓం నార్యై నమః ।
ఓం జ్యేష్ఠాదేవ్యై నమః ।
ఓం సురేశ్వర్యై నమః ।
ఓం విశ్వమ్భరాయై నమః ।
ఓం ధరాయై నమః ।
ఓం కర్త్ర్యై నమః ॥ ౨౧౦
ఓం గలార్గలవిభఞ్జన్యై నమః ।
ఓం సన్ధ్యాయై నమః ।
ఓం రాత్ర్యై నమః ।
ఓం దివాయై నమః ।
ఓం జ్యోత్స్నాయై నమః ।
ఓం కలాయై నమః ।
ఓం కాష్ఠాయై నమః ।
ఓం నిమేషికాయై నమః ।
ఓం ఉర్వ్యై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ॥ ౨౨౦
ఓం శుభ్రాయై నమః ।
ఓం సంసారార్ణవతారిణ్యై నమః ।
ఓం కపిలాయై నమః ।
ఓం కీలికాయై నమః ।
ఓం అశోకాయై నమః ।
ఓం మల్లికానవమల్లికాయై నమః ।
ఓం నన్దికాయై నమః ।
ఓం శాన్తాయై నమః ।
ఓం భఞ్జికాయై నమః ।
ఓం భయభఞ్జికాయై నమః ॥ ౨౩౦
ఓం కౌశిక్యై నమః ।
ఓం వైదిక్యై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం రూపాధికాయై నమః ।
ఓం అతిభాసే నమః ।
ఓం దిగ్వస్త్రాయై నమః ।
ఓం నవవస్త్రాయై నమః ।
ఓం కన్యకాయై నమః ।
ఓం కమలోద్భవాయై నమః ।
ఓం శ్రీసౌమ్యలక్షణాయై నమః ॥ ౨౪౦
ఓం అతీతదుర్గాయై నమః ।
ఓం సూత్రప్రబోధికాయై నమః ।
ఓం శ్రద్ధాయై నమః ।
ఓం మేధాయై నమః ।
ఓం కృతయే నమః ।
ఓం ప్రజ్ఞాయై నమః ।
ఓం ధారణాయై నమః ।
ఓం కాన్తయే నమః ।
ఓం శ్రుతయే నమః ।
ఓం స్మృతయే నమః ॥ ౨౫౦
ఓం ధృతయే నమః ।
ఓం ధన్యాయై నమః ।
ఓం భూతయే నమః ।
ఓం ఇష్ట్యై నమః ।
ఓం మనీషిణ్యై నమః ।
ఓం విరక్త్యై నమః ।
ఓం వ్యాపిన్యై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం సర్వమాయాప్రభఞ్జన్యై నమః ।
ఓం మాహేన్ద్ర్యై నమః ॥ ౨౬౦
ఓం మన్త్రిణ్యై నమః ।
ఓం సింహ్యై నమః ।
ఓం ఇన్ద్రజాలరూపిణ్యై నమః ।
ఓం అవస్థాత్రయనిర్ముక్తాయై నమః ।
ఓం గుణత్రయవివర్జితాయై నమః ।
ఓం యోగీధ్యానాన్తగమ్యాయై నమః ।
ఓం యోగధ్యానపరాయణాయై నమః ।
ఓం త్రయీశిఖావిశేషజ్ఞాయై నమః ।
ఓం వేదాన్తజ్ఞానరుపిణ్యై నమః ।
ఓం భారత్యై నమః ॥ ౨౭౦
ఓం కమలాయై నమః ।
ఓం భాషాయై నమః ।
ఓం పద్మాయై నమః ।
ఓం పద్మవత్యై నమః ।
ఓం కృతయే నమః ।
ఓం గౌతమ్యై నమః ।
ఓం గోమత్యై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం ఈశానాయై నమః ।
ఓం హంసవాహిన్యై నమః ॥ ౨౮౦
ఓం నారాయణ్యై నమః ।
ఓం ప్రభాధారాయై నమః ।
ఓం జాన్హవ్యై నమః ।
ఓం శఙ్కరాత్మజాయై నమః ।
ఓం చిత్రఘణ్టాయై నమః ।
ఓం సునన్దాయై నమః ।
ఓం శ్రియై నమః ।
ఓం మానవ్యై నమః ।
ఓం మనుసమ్భవాయై నమః ।
ఓం స్తమ్భిన్యై నమః ॥ ౨౯౦
ఓం క్షోభిణ్యై నమః ।
ఓం మార్యై నమః ।
ఓం భ్రామిణ్యై నమః ।
ఓం శత్రుమారిణ్యై నమః ।
ఓం మోహిన్యై నమః ।
ఓం ద్వేషిణ్యై నమః ।
ఓం వీరాయై నమః ।
ఓం అఘోరాయై నమః ।
ఓం రుద్రరూపిణ్యై నమః ।
ఓం రుద్రైకాదశిన్యై నమః ॥ ౩౦౦


ఓం పుణ్యాయై నమః ।
ఓం కల్యాణ్యై నమః ।
ఓం లాభకారిణ్యై నమః ।
ఓం దేవదుర్గాయై నమః ।
ఓం మహాదుర్గాయై నమః ।
ఓం స్వప్నదుర్గాయై నమః ।
ఓం అష్టభైరవ్యై నమః ।
ఓం సూర్యచన్ద్రాగ్నినేత్రాయై నమః ।
ఓం గ్రహనక్షత్రరూపిణ్యై నమః ।
ఓం బిన్దునాదకలాతీత-
      బిన్దునాదకలాత్మికాయై నమః ॥ ౩౧౦
ఓం దశవాయుజయోంకారాయై నమః ।
ఓం కలాషోడశసంయుతాయై నమః ।
ఓం కాశ్యప్యై నమః ।
ఓం కమలాయై నమః ।
ఓం నాదచక్రనివాసిన్యై నమః ।
ఓం మృడాధారాయై నమః ।
ఓం స్థిరాయై నమః ।
ఓం గుహ్యాయై నమః ।
ఓం చక్రరూపిణ్యై నమః ।
ఓం అవిద్యాయై నమః ॥ ౩౨౦
ఓం శార్వర్యై నమః ।
ఓం భుఞ్జాయై నమః ।
ఓం జమ్భాసురనిబర్హిణ్యై నమః ।
ఓం శ్రీకాయాయై నమః ।
ఓం శ్రీకలాయై నమః ।
ఓం శుభ్రాయై నమః ।
ఓం కర్మనిర్మూలకారిణ్యై నమః ।
ఓం ఆదిలక్ష్మ్యై నమః ।
ఓం గుణాధారాయై నమః ।
ఓం పఞ్చబ్రహ్మాత్మికాయై నమః ॥ ౩౩౦
ఓం పరాయై నమః ।
ఓం శ్రుతయే నమః ।
ఓం బ్రహ్మముఖావాసాయై నమః ।
ఓం సర్వసమ్పత్తిరూపిణ్యై నమః ।
ఓం మృతసంజీవిన్యై నమః ।
ఓం మైత్ర్యై నమః ।
ఓం కామిన్యై నమః ।
ఓం కామవర్జితాయై నమః ।
ఓం నిర్వాణమార్గదాయై నమః ।
ఓం హంసిన్యై నమః ॥ ౩౪౦
ఓం కాశికాయై నమః ।
ఓం క్షమాయై నమః ।
ఓం సపర్యాయై నమః ।
ఓం గుణిన్యై నమః ।
ఓం భిన్నాయై నమః ।
ఓం నిర్గుణాయై నమః ।
ఓం అఖణ్డితాయై నమః ।
ఓం శుభాయై నమః ।
ఓం స్వామిన్యై నమః ।
ఓం వేదిన్యై నమః ॥ ౩౫౦
ఓం శక్యాయై నమః ।
ఓం శామ్బర్యై నమః ।
ఓం చక్రధారిణ్యై నమః ।
ఓం దణ్డిన్యై నమః ।
ఓం ముణ్డిన్యై నమః ।
ఓం వ్యాఘ్ర్యై నమః ।
ఓం శిఖిన్యై నమః ।
ఓం సోమహన్తయే నమః ।
ఓం చిన్తామణిచిదానన్దాయై నమః ।
ఓం పఞ్చబాణాగ్రబోధిన్యై నమః ॥ ౩౬౦
ఓం బాణశ్రేణయే నమః ।
ఓం సహస్రాక్ష్యై నమః ।
ఓం సహస్రభుజపాదుకాయై నమః ।
ఓం సన్ధ్యాబలాయై నమః ।
ఓం త్రిసన్ధ్యాయై నమః ।
ఓం బ్రహ్మాణ్డమణిభూషణాయై నమః ।
ఓం వాసవ్యై నమః ।
ఓం వారుణీసేనాయై నమః ।
ఓం కులికాయై నమః ।
ఓం మన్త్రరఞ్జిన్యై నమః ॥ ౩౭౦
ఓం జితప్రాణస్వరూపాయై నమః ।
ఓం కాన్తాయై నమః ।
ఓం కామ్యవరప్రదాయై నమః ।
ఓం మన్త్రబ్రాహ్మణవిద్యార్థాయై నమః ।
ఓం నాదరుపాయై నమః ।
ఓం హవిష్మత్యై నమః ।
ఓం ఆథర్వణ్యై నమః ।
ఓం శృతయే నమః ।
ఓం శూన్యాయై నమః ।
ఓం కల్పనావర్జితాయై నమః ॥ ౩౮౦
ఓం సత్యై నమః ।
ఓం సత్తాజాతయే నమః ।
ఓం ప్రమాయై నమః ।
ఓం మేయాయై నమః ।
ఓం అప్రమితయే నమః ।
ఓం ప్రాణదాయై నమః ।
ఓం గతయే నమః ।
ఓం అపర్ణాయై నమః ।
ఓం పఞ్చవర్ణాయై నమః ।
ఓం సర్వదాయై నమః ॥ ౩౯౦
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం త్రైలోక్యమోహిన్యై నమః ।
ఓం విద్యాయై నమః ।
ఓం సర్వధర్త్ర్యై  నమః ।
ఓం క్షరాక్షరాయై నమః ।
ఓం హిరణ్యవర్ణాయై నమః ।
ఓం హరిణ్యై నమః ।
ఓం సర్వోపద్రవనాశిన్యై నమః ।
ఓం కైవల్యపదవీరేఖాయై నమః ।
ఓం సూర్యమణ్డలసంస్థితాయై నమః ॥ ౪౦౦


ఓం సోమమణ్డలమధ్యస్థాయై నమః ।
ఓం వహ్నిమణ్డలసంస్థితాయై నమః ।
ఓం వాయుమణ్డలమధ్యస్థాయై నమః ।
ఓం వ్యోమమణ్డలసంస్థితాయై నమః ।
ఓం చక్రికాయై నమః ।
ఓం చక్రమధ్యస్థాయై నమః ।
ఓం చక్రమార్గప్రవర్తిన్యై నమః ।
ఓం కోకిలాకులాయై నమః ।
ఓం చక్రేశాయై నమః ।
ఓం పక్షతయే నమః ॥ ౪౧౦
ఓం పఙ్క్తిపావనాయై నమః ।
ఓం సర్వసిద్ధాన్తమార్గస్థాయై నమః ।
ఓం షడ్వర్ణాయై నమః ।
ఓం వరవర్జితాయై నమః ।
ఓం శతరుద్రహరాయై నమః ।
ఓం హన్త్ర్యై నమః ।
ఓం సర్వసంహారకారిణ్యై నమః ।
ఓం పురుషాయై నమః ।
ఓం పౌరుష్యై నమః ।
ఓం తుష్టయే నమః ॥ ౪౨౦
ఓం సర్వతన్త్రప్రసూతికాయై నమః ।
ఓం అర్ధనారిశ్వర్యై నమః ।
ఓం సర్వవిద్యాప్రదాయిన్యై నమః ।
ఓం భార్గవ్యై నమః ।
ఓం యాజుషవిద్యాయై నమః ।
ఓం సర్వోపనిషదాస్థితాయై నమః ।
ఓం వ్యోమకేశాయై నమః ।
ఓం అఖిలప్రాణాయై నమః ।
ఓం పఞ్చకోశవిలక్షణాయై నమః ।
ఓం పఞ్చకోశాత్మికాయై నమః ॥ ౪౩౦
ఓం ప్రతిచే నమః ।
ఓం పఞ్చబ్రహ్మాత్మికాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం జగతే నమః ।
ఓం జరాజనిత్ర్యై నమః ।
ఓం పఞ్చకర్మప్రసూతికాయై నమః ।
ఓం వాగ్దేవ్యై నమః ।
ఓం ఆభరణాకారాయై నమః ।
ఓం సర్వకామ్యస్థితాయై నమః ।
ఓం స్థితయే నమః ॥ ౪౪౦
ఓం అష్టాదశచతుఃషష్టి-
      పీఠికావిద్యయాయుతాయై నమః ।
ఓం కాలికాయై నమః ।
ఓం కర్షణ్యై నమః ।
ఓం శ్యామాయై నమః ।
ఓం యక్షిణ్యై నమః ।
ఓం కిన్నరేశ్వర్యై నమః ।
ఓం కేతక్యై నమః ।
ఓం మల్లికాయై నమః ।
ఓం అశోకాయై నమః ।
ఓం వారాహ్యై నమః ॥ ౪౫౦
ఓం ధరణ్యై నమః ।
ఓం ధ్రువాయై నమః ।
ఓం నారసింహ్యై నమః ।
ఓం మహోగ్రాస్యాయై నమః ।
ఓం భక్తానామార్తినాశిన్యై నమః ।
ఓం అన్తర్బలాయై నమః ।
ఓం స్థిరాయై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం జరామరణవర్జితాయై నమః ।
ఓం శ్రీరఞ్జితాయై నమః ॥ ౪౬౦
ఓం మహాకాయాయై నమః ।
ఓం సోమసూర్యాగ్నిలోచనాయై నమః ।
ఓం ఆదితయే నమః ।
ఓం దేవమాత్రే నమః ।
ఓం అష్టపుత్రాయై నమః ।
ఓం అష్టయోగిన్యై నమః ।
ఓం అష్టప్రకృత్యై నమః ।
ఓం అష్టాష్టవిభ్రాజద్వికృతాకృతయే
                    నమః ।
ఓం దుర్భిక్షధ్వంసిన్యై నమః ।
ఓం సీతాయై నమః ॥ ౪౭౦
ఓం సత్యాయై నమః ।
ఓం రుక్మిణ్యై నమః ।
ఓం ఖ్యాతిజాయై నమః ।
ఓం భార్గవ్యై నమః ।
ఓం దేవయోన్యై నమః ।
ఓం తపస్విన్యై నమః ।
ఓం శాకమ్భర్యై నమః ।
ఓం మహాశోణాయై నమః ।
ఓం గరుడోపరిసంస్థితాయై నమః ।
ఓం సింహగాయై నమః ॥ ౪౮౦
ఓం వ్యాఘ్రగాయై నమః ।
ఓం వాయుగాయై నమః ।
ఓం మహాద్రిగాయై నమః ।
ఓం అకారాదిక్షకారాన్తసర్వవిద్యాధి-
                దేవతాయై నమః ।
ఓం మంత్రవ్యాఖ్యాననిపుణాయై నమః ।
ఓం జ్యోతిశాస్త్రైకలోచనాయై నమః ।
ఓం ఇడాపిఙ్గలికాయై నమః ।
ఓం మధ్యసుషుమ్నాయై నమః ।
ఓం గ్రన్థిభేదిన్యై నమః ।
ఓం కాలచక్రాశ్రయోపేతాయై నమః ॥ ౪౯౦
ఓం కాలచక్రస్వరూపిణ్యై నమః ।
ఓం వైశారాద్యై నమః ।
ఓం మతిశ్రేష్ఠాయై నమః ।
ఓం వరిష్ఠాయై నమః ।
ఓం సర్వదీపికాయై నమః ।
ఓం వైనాయక్యై నమః ।
ఓం వరారోహాయై నమః ।
ఓం శ్రోణివేలాయై నమః ।
ఓం బహిర్వలాయై నమః ।
ఓం జమ్భిన్యై నమః ॥ ౫౦౦


ఓం జృభిణ్యై నమః ।
ఓం జృమ్భకారిణ్యై నమః ।
ఓం గణకారికాయై నమః ।
ఓం శరణ్యై నమః ।
ఓం చక్రికాయై నమః ।
ఓం అనన్తాయై నమః ।
ఓం సర్వవ్యాధిచికిత్సకాయే నమః ।
ఓం దేవక్యై నమః ।
ఓం దేవసఙ్కాశాయై నమః ।
ఓం వారిధయే నమః ॥ ౫౧౦
ఓం కరుణాకరాయై నమః ।
ఓం శర్వర్యై నమః ।
ఓం సర్వసమ్పన్నాయై నమః ।
ఓం సర్వపాపప్రభఞ్జన్యై నమః ।
ఓం ఏకమాత్రాయై నమః ।
ఓం ద్విమాత్రాయై నమః ।
ఓం త్రిమాత్రాయై నమః ।
ఓం అపరాయై నమః ।
ఓం అర్ధమాత్రాయై నమః ।
ఓం పరాయై నమః ॥ ౫౨౦
ఓం సూక్ష్మాయై నమః ।
ఓం సూక్ష్మార్థార్థపరాయై నమః ।
ఓం ఏకవీరాయై నమః ।
ఓం విశేషాఖ్యాయై నమః ।
ఓం షష్ఠిదాయాయై నమః ।
ఓం మనస్విన్యై నమః ।
ఓం నైష్కర్మ్యాయై నమః ।
ఓం నిష్కలాలోకాయై నమః ।
ఓం జ్ఞానకర్మాధికాయై నమః ।
ఓం గుణాయై నమః ॥ ౫౩౦
ఓం బన్ధురానన్దసన్దోహాయై నమః ।
ఓం వ్యోమకారాయై నమః ।
ఓం నిరూపితాయై నమః ।
ఓం గద్యపద్యాత్మవాణ్యై నమః ।
ఓం సర్వాలఙ్కారసంయుతాయై నమః ।
ఓం సాధుబన్ధపదన్యాసాయై నమః ।
ఓం సర్వౌకసే నమః ।
ఓం ఘటికావలయే నమః ।
ఓం షట్కర్మిణ్యై నమః ।
ఓం కర్కశాకారాయై నమః ॥ ౫౪౦
ఓం సర్వకర్మవివర్జితాయై నమః ।
ఓం ఆదిత్యవర్ణాయై నమః ।
ఓం అపర్ణాయై నమః ।
ఓం కామిన్యై నమః ।
ఓం నరరూపిణ్యై నమః ।
ఓం బ్రహ్మాణ్యై నమః ।
ఓం బ్రహ్మసన్తానాయై నమః ।
ఓం వేదవాచే నమః ।
ఓం ఈశ్వర్యై నమః ।
ఓం శివాయై నమః ॥ ౫౫౦
ఓం పురాణన్యాయమీమాంసాయై నమః ।
ఓం ధర్మశాస్త్రాగమశ్రుతాయై నమః ।
ఓం సద్యోవేదవత్యై నమః ।
ఓం సర్వాయై నమః ।
ఓం హంస్యై నమః ।
ఓం విద్యాధిదేవతాయై నమః ।
ఓం విశ్వేశ్వర్యై నమః ।
ఓం జగద్ధాత్ర్యై నమః ।
ఓం విశ్వనిర్మాణకారిణ్యై నమః ।
ఓం వైదిక్యై నమః ॥ ౫౬౦
ఓం వేదరూపాయై నమః ।
ఓం కాలికాయై నమః ।
ఓం కాలరూపిణ్యై నమః ।
ఓం నారాయణ్యై నమః ।
ఓం మహాదేవ్యై నమః ।
ఓం సర్వతత్వప్రవర్తిన్యై నమః ।
ఓం హిరణ్యవర్ణరూపాయై నమః ।
ఓం హిరణ్యపదసంభవాయై నమః ।
ఓం కైవల్యపదవ్యై నమః ।
ఓం పుణ్యాయై నమః ॥ ౫౭౦
ఓం కైవల్యజ్ఞానలక్షితాయై నమః ।
ఓం బ్రహ్మసమ్పత్తిరూపాయై నమః ।
ఓం బ్రహ్మసమ్పత్తికారిణ్యై నమః ।
ఓం వారుణ్యై నమః ।
ఓం వారుణారాధ్యాయై నమః ।
ఓం సర్వకర్మప్రవర్తిన్యై నమః ।
ఓం ఏకాక్షరపరాయై నమః ।
ఓం యుక్తాయై నమః ।
ఓం సర్వదారిద్ర్యభఞ్జిన్యై నమః ।
ఓం పాశాఙ్కుశాన్వితాయై నమః ॥ ౫౮౦
ఓం దివ్యాయై నమః ।
ఓం వీణావ్యాఖ్యాక్షసూత్రభృతే నమః ।
ఓం ఏకమూర్త్యై నమః ।
ఓం త్రయీమూర్త్యై నమః ।
ఓం మధుకైటభభఞ్జన్యై నమః ।
ఓం సాఙ్ఖ్యాయై నమః ।
ఓం సాఙ్ఖ్యవత్యై నమః ।
ఓం జ్వాలాయై నమః ।
ఓం జ్వలన్త్యై నమః ।
ఓం కామరూపిణ్యై నమః ॥ ౫౯౦
ఓం జాగ్రన్త్యై నమః ।
ఓం సర్వసమ్పత్త్యై నమః ।
ఓం సుషుప్తాయై నమః ।
ఓం స్వేష్టదాయిన్యై నమః ।
ఓం కపాలిన్యై నమః ।
ఓం మహాదంష్ట్రాయై నమః ।
ఓం భ్రుకుటీకుటిలాననాయై నమః ।
ఓం సర్వావాసాయై నమః ।
ఓం సువాసాయై నమః ।
ఓం బృహత్యై నమః ॥ ౬౦౦


ఓం అష్టయే నమః ।
ఓం శక్వర్యై నమః ।
ఓం ఛన్దోగణప్రతిష్ఠాయై నమః ।
ఓం కల్మాష్యై నమః ।
ఓం కరుణాత్మికాయై నమః ।
ఓం చక్షుష్మత్యై నమః ।
ఓం మహాఘోషాయై నమః ।
ఓం ఖడ్గచర్మధరాయై నమః ।
ఓం అశనయే నమః ।
ఓం శిల్పవైచిత్ర్యవిద్యోతితాయై నమః ॥ ౬౧౦
ఓం సర్వతోభద్రవాసిన్యై నమః ।
ఓం అచిన్త్యలక్షణాకారాయై నమః ।
ఓం సూత్రభ్యాష్యనిబన్ధనాయై నమః ।
ఓం సర్వవేదార్థసమ్పతయే నమః ।
ఓం సర్వశాస్త్రార్థమాతృకాయై నమః ।
ఓం అకారాదిక్షకారాన్తసర్వ-
         వర్ణాకృతస్థలాయై నమః ।
ఓం సర్వలక్ష్మ్యై నమః ।
ఓం సదానన్దాయై నమః ।
ఓం సారవిద్యాయై నమః ।
ఓం సదాశివాయై నమః ॥ ౬౨౦
ఓం సర్వజ్ఞాయై నమః ।
ఓం సర్వశక్త్యై నమః ।
ఓం ఖేచరీరూపగాయై నమః ।
ఓం ఉచ్ఛ్రితాయై నమః ।
ఓం అణిమాదిగుణోపేతాయై నమః ।
ఓం పరాకాష్ఠాయై నమః ।
ఓం పరాగతయే నమః ।
ఓం హంసయుక్తవిమానస్థాయై నమః ।
ఓం హంసారూఢాయై నమః ।
ఓం శశిప్రభాయై నమః ॥ ౬౩౦
ఓం భవాన్యై నమః ।
ఓం వాసనాశక్త్యై నమః ।
ఓం ఆకృస్థాయై నమః ।
ఓం ఖిలాయై నమః ।
ఓం అఖిలాయై నమః ।
ఓం తన్త్రహేతవే నమః ।
ఓం విచిత్రాఙ్గాయై నమః ।
ఓం వ్యోమగఙ్గావినోదిన్యై నమః ।
ఓం వర్షాయై నమః ।
ఓం వార్షిక్యై నమః ॥ ౬౪౦
ఓం ఋగ్యజుస్సామరూపిణ్యై నమః ।
ఓం మహానద్యై నమః ।
ఓం నదీపుణ్యాయై నమః ।
ఓం అగణ్యపుణ్యగుణక్రియాయై నమః ।
ఓం సమాధిగతలభ్యార్థాయై నమః ।
ఓం శ్రోతవ్యాయై నమః ।
ఓం స్వప్రియాయై నమః ।
ఓం ఘృణాయై నమః ।
ఓం నామాక్షరపదాయై నమః ।
ఓం ఉపసర్గనఖాఞ్చితాయై నమః ॥ ౬౫౦
ఓం నిపాతోరుద్వయ్యై నమః ।
ఓం జఙ్ఘామాతృకాయై నమః ।
ఓం మన్త్రరూపిణ్యై నమః ।
ఓం ఆసీనాయై నమః ।
ఓం శయానాయై నమః ।
ఓం తిష్ఠన్త్యై నమః ।
ఓం భువనాధికాయై నమః ।
ఓం లక్ష్యలక్షణయోగాఢ్యాయై నమః ।
ఓం తాద్రూప్యై నమః ।
ఓం గణనాకృతయై నమః ॥ ౬౬౦
ఓం సైకరూపాయై నమః ।
ఓం నైకరూపాయై నమః ।
ఓం తస్మై నమః ।
ఓం ఇన్దురూపాయై నమః ।
ఓం తదాకృత్యై నమః ।
ఓం సమాసతద్ధితాకారాయై నమః ।
ఓం విభక్తివచనాత్మికాయై నమః ।
ఓం స్వాహాకారాయై నమః ।
ఓం స్వధాకారాయై నమః ।
ఓం శ్రీపత్యర్ధాఙ్గనన్దిన్యై నమః ॥ ౬౭౦
ఓం గమ్భీరాయై నమః ।
ఓం గహనాయై నమః ।
ఓం గుహ్యాయై నమః ।
ఓం యోనిలిఙ్గార్ధధారిణ్యై నమః ।
ఓం శేషవాసుకిసంసేవ్యాయై నమః ।
ఓం చపలాయై నమః ।
ఓం వరవర్ణిన్యై నమః ।
ఓం కారుణ్యాకారసమ్పతయే నమః ।
ఓం కీలకృతే నమః ।
ఓం మన్త్రకీలికాయై నమః ॥ ౬౮౦
ఓం శక్తిబీజాత్మికాయై నమః ।
ఓం సర్వమంత్రేష్టాయై నమః ।
ఓం అక్షయకామనాయై నమః ।
ఓం ఆగ్నేయాయై నమః ।
ఓం పార్థివాయై నమః ।
ఓం ఆప్యాయై నమః ।
ఓం వాయవ్యాయై నమః ।
ఓం వ్యోమకేతనాయై నమః ।
ఓం సత్యజ్ఞానాత్మికానన్దాయై నమః ।
ఓం బ్రాహ్మ్యై నమః ॥ ౬౯౦
ఓం బ్రాహ్మణ్యై నమః ।
ఓం సనాతన్యై నమః ।
ఓం అవిద్యావాసనామాయాయై నమః ।
ఓం ప్రకృతయే నమః ।
ఓం సర్వమోహిన్యై నమః ।
ఓం శక్తిధారణాశక్తయే నమః ।
ఓం చిదచిచ్ఛక్తియోగిన్యై నమః ।
ఓం వక్త్రాయై నమః ।
ఓం అరుణాయై నమః ।
ఓం మహామాయాయై నమః ॥ ౭౦౦


ఓం మరీచయే నమః ।
ఓం మదమర్దిన్యై నమః ।
ఓం విరాజే నమః ।
ఓం స్వాహాయై నమః ।
ఓం స్వధాయై నమః ।
ఓం శుద్ధాయై నమః ।
ఓం నిరుపాస్తయే నమః ।
ఓం సుభక్తిగాయై నమః ।
ఓం నిరూపితద్వయావిద్యాయై నమః ।
ఓం నిత్యానిత్యస్వరూపిణ్యై నమః ॥ ౭౧౦
ఓం వైరాజమార్గసఞ్చారాయై నమః ।
ఓం సర్వసత్పథవాసిన్యై నమః ।
ఓం జాలన్ధర్యై నమః ।
ఓం మృడాన్యై నమః ।
ఓం భవాన్యై నమః ।
ఓం భవభఞ్జిన్యై నమః ।
ఓం త్రైకాలికజ్ఞానదాయిన్యై నమః ।
ఓం త్రికాలజ్ఞానదాయిన్యై నమః ।
ఓం నాదాతీతాయై నమః ।
ఓం స్మృతిప్రజ్ఞాయై నమః ॥ ౭౨౦
ఓం ధాత్రీరూపాయై నమః ।
ఓం త్రిపుష్కరాయై నమః ।
ఓం పరాజితాయవిధానజ్ఞాయై నమః ।
ఓం విశేషితగుణాత్మికాయై నమః ।
ఓం హిరణ్యకేశిన్యై నమః ।
ఓం హేమ్నే నమః ।
ఓం బ్రహ్మసూత్రవిచక్షణాయై నమః ।
ఓం అసంఖ్యేయపరార్ధాన్త-
        స్వరవ్యఞ్జనవైఖర్యై నమః ।
ఓం మధుజిహ్వాయై నమః ।
ఓం మధుమత్యై నమః ॥ ౭౩౦
ఓం మధుమాసోదయాయై నమః ।
ఓం మధవే నమః ।
ఓం మధవ్యై నమః ।
ఓం మహాభాగాయై నమః ।
ఓం మేఘగమ్భీరనిస్వనాయై నమః ।
ఓం బ్రహ్మవిష్ణుమహేశాది-
        జ్ఞాతవ్యార్థవిశేషగాయై నమః ।
ఓం నాభౌవహ్నిశిఖాకారాయై నమః ।
ఓం లలాటేచన్ద్రసన్నిభాయై నమః ।
ఓం భ్రూమధ్యేభాస్కరాకారాయై నమః ।
ఓం హృదిసర్వతారాకృతయే నమః ॥ ౭౪౦
ఓం కృత్తికాదిభరణ్యన్తనక్షత్రేష్ట్యాచితోదయాయై
                          నమః ।
ఓం గ్రహవిద్యాత్మకాయై నమః ।
ఓం జ్యోతిషే నమః ।
ఓం జ్యోతిర్విదే నమః ।
ఓం మతిజీవికాయై నమః ।
ఓం బ్రహ్మాణ్డగర్భిణ్యై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం సప్తావరణదేశాయై నమః ।
ఓం వైరాజ్యోత్తమసామ్రాజ్యాయై నమః ।
ఓం కుమారకుశలోదయాయై నమః ॥ ౭౫౦
ఓం బగలాయై నమః ।
ఓం భ్రమరామ్బాయై నమః ।
ఓం శివదూత్యై నమః ।
ఓం శివాత్మికాయై నమః ।
ఓం మేరువిన్ధ్యాతిసంస్థానాయై నమః ।
ఓం కాశ్మీరపురవాసిన్యై నమః ।
ఓం యోగనిద్రాయై నమః ।
ఓం మహానిద్రాయై నమః ।
ఓం వినిద్రాయై నమః ।
ఓం రాక్షసాశ్రితాయై నమః ॥ ౭౬౦
ఓం సువర్ణదాయై నమః ।
ఓం మహాగఙ్గాయై నమః ।
ఓం పఞ్చాఖ్యాయై నమః ।
ఓం పఞ్చసంహత్యై నమః ।
ఓం సుప్రజాతాయై నమః ।
ఓం సువీరాయై నమః ।
ఓం సుపోషాయై నమః ।
ఓం సుపతయే నమః ।
ఓం శివాయై నమః ।
ఓం సుగృహాయై నమః ॥ ౭౭౦
ఓం రక్తబీజాన్తాయై నమః ।
ఓం హతకన్దర్పజీవికాయై నమః ।
ఓం సముద్రవ్యోమమధ్యస్థాయై నమః ।
ఓం వ్యోమబిన్దుసమాశ్రయాయై నమః ।
ఓం సౌభాగ్యరసజీవాతవే నమః ।
ఓం సారాసారవివేకదృశే నమః ।
ఓం త్రివల్యాదిసుపుష్టాఙ్గాయై నమః ।
ఓం భారత్యై నమః ।
ఓం భరతాశ్రితాయై నమః ।
ఓం నాదబ్రహ్మమయీవిద్యాయై నమః ॥ ౭౮౦
ఓం జ్ఞానబ్రహ్మమయీపరాయై నమః ।
ఓం బ్రహ్మనాడినిరుక్తాయై నమః ।
ఓం బ్రహ్మకైవల్యసాధనాయై నమః ।
ఓం కాలికేయమహోదారవీరవి-
                 క్రమరూపిణ్యై నమః ।
ఓం వడవాగ్నిశిఖావక్త్రాయై నమః ।
ఓం మహకవలతర్పణాయై నమః ।
ఓం మహాభూతాయై నమః ।
ఓం మహాదర్పాయై నమః ।
ఓం మహాసారాయై నమః ।
ఓం మహాక్రతవే నమః ॥ ౭౯౦
ఓం పఞ్చభూతమహాగ్రాసాయై నమః ।
ఓం పఞ్చభూతాధిదేవతాయై నమః ।
ఓం సర్వప్రమాణసమ్పతయే నమః ।
ఓం సర్వరోగప్రతిక్రియాయై నమః ।
ఓం బ్రహ్మాణ్డాన్తర్బహిర్వ్యాప్తాయై నమః ।
ఓం విష్ణువక్షోవిభూషిణ్యై నమః ।
ఓం శాఙ్కర్యై నమః ।
ఓం నిధివక్త్రస్థాయై నమః ।
ఓం ప్రవరాయై నమః ।
ఓం వరహేతుక్యై నమః ॥ ౮౦౦


ఓం హేమమాలాయై నమః ।
ఓం శిఖామాలాయై నమః ।
ఓం త్రిశిఖాయై నమః ।
ఓం పఞ్చలోచనాయై నమః ।
ఓం సర్వాగమసదాచారమర్యాదాయై నమః ।
ఓం యాతుభఞ్జన్యై నమః ।
ఓం పుణ్యశ్లోకప్రబన్ధాఢ్యాయై నమః ।
ఓం సర్వాన్తర్యామిరూపిణ్యై నమః ।
ఓం సామగానసమారాధ్యాయై నమః ।
ఓం శ్రోతృకర్ణరసాయన్యై నమః ॥ ౮౧౦
ఓం జీవలోకైకజీవాతవే నమః ।
ఓం భద్రోదారవిలోకనాయై నమః ।
ఓం తడిత్కోటిలసత్కాన్తయే నమః ।
ఓం తరుణ్యై నమః ।
ఓం హరిసున్దర్యై నమః ।
ఓం మీననేత్రాయై నమః ।
ఓం ఇన్ద్రాక్ష్యై నమః ।
ఓం విశాలాక్ష్యై నమః ।
ఓం సుమఙ్గలాయై నమః ।
ఓం సర్వమఙ్గలసమ్పన్నాయై నమః ॥ ౮౨౦
ఓం సాక్షాన్మఙ్గలదేవతాయై నమః ।
ఓం దేహహృద్దీపికాయై నమః ।
ఓం దీప్తయే నమః ।
ఓం జిహ్మపాపప్రణాశిన్యై నమః ।
ఓం అర్ధచన్ద్రోలసద్దంష్ట్రాయై నమః ।
ఓం యజ్ఞవాటీవిలాసిన్యై నమః ।
ఓం మహాదుర్గాయై నమః ।
ఓం మహోత్సాహాయై నమః ।
ఓం మహాదేవబలోదయాయై నమః ।
ఓం డాకినీడ్యాయై నమః ॥ ౮౩౦
ఓం శాకినీడ్యాయై నమః ।
ఓం సాకినిడ్యాయై నమః ।
ఓం సమస్తజుషే నమః ।
ఓం నిరఙ్కుశాయై నమః ।
ఓం నాకివన్ద్యాయై నమః ।
ఓం షడాధారాధిదేవతాయై నమః ।
ఓం భువనజ్ఞాననిఃశ్రేణయే నమః ।
ఓం భువనాకారవల్లర్యై నమః ।
ఓం శాశ్వత్యై నమః ।
ఓం శాశ్వతాకారాయై నమః ॥ ౮౪౦
ఓం లోకానుగ్రహకారిణ్యై నమః ।
ఓం సారస్యై నమః ।
ఓం మానస్యై నమః ।
ఓం హంస్యై నమః ।
ఓం హంసలోకప్రదాయిన్యై నమః ।
ఓం చిన్ముద్రాలఙ్కృతకరాయై నమః ।
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః ।
ఓం సుఖప్రాణిశిరోరేఖాయై నమః ।
ఓం సదదృష్టప్రదాయిన్యై నమః ।
ఓం సర్వసాఙ్కర్యదోషఘ్న్యై నమః ॥ ౮౫౦
ఓం గ్రహోపద్రవనాశిన్యై నమః ।
ఓం క్షుద్రజన్తుభయఘ్న్యై నమః ।
ఓం విషరోగాదిభఞ్జన్యై నమః ।
ఓం సదాశాన్తాయై నమః ।
ఓం సదాశుద్ధాయై నమః ।
ఓం గృహచ్ఛిద్రనివారిణ్యై నమః ।
ఓం కలిదోషప్రశమన్యై నమః ।
ఓం కోలాహలపురస్థితాయై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం లాక్షాణిక్యై నమః ॥ ౮౬౦
ఓం ముఖ్యాయై నమః ।
ఓం జఘన్యాయై నమః ।
ఓం కృతివర్జితాయై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం అవిద్యాయై నమః ।
ఓం మూలభూతాయై నమః ।
ఓం వాసవ్యై నమః ।
ఓం విష్ణుచేతనాయై నమః ।
ఓం వాదిన్యై నమః ।
ఓం వసురూపాయై నమః ॥ ౮౭౦
ఓం వసురత్నపరిచ్ఛదాయై నమః ।
ఓం ఛాన్దస్యై నమః ।
ఓం చన్ద్రహృదయాయై నమః ।
ఓం జైత్రాయై నమః ।
ఓం స్వచ్ఛన్దభైరవ్యై నమః ।
ఓం వనమాలాయై నమః ।
ఓం వైజయన్త్యై నమః ।
ఓం పఞ్చదివ్యాయుధాత్మికాయై నమః ।
ఓం పీతామ్బరమయ్యై నమః ।
ఓం చఞ్చత్కౌస్తుభాయై నమః ॥ ౮౮౦
ఓం హరికామిన్యై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం తథ్యాయై నమః ।
ఓం రమాయై నమః ।
ఓం రామాయై నమః ।
ఓం రమణ్యై నమః ।
ఓం మృత్యుభఞ్జన్యై నమః ।
ఓం జ్యేష్ఠాయై నమః ।
ఓం కాష్ఠాయై నమః ।
ఓం ధనిష్ఠాన్తాయై నమః ॥ ౮౯౦
ఓం శరాఙ్గ్యై నమః ।
ఓం నిర్గుణప్రియాయై నమః ।
ఓం మైత్రేయాయై నమః ।
ఓం మిత్రవిన్దాయై నమః ।
ఓం శేష్యశేషకలాశయాయై నమః ।
ఓం వారాణసీవాసలభ్యాయై నమః ।
ఓం ఆర్యావర్తజనస్తుతాయై నమః ।
ఓం జగదుత్పత్తిసంస్థాపన-
            సంహారత్రయీకారణాయై నమః ।
ఓం తుభ్యం నమః ।
ఓం అమ్బాయై నమః ॥ ౯౦౦


ఓం విష్ణుసర్వస్వాయై నమః ।
ఓం మహేశ్వర్యై నమః ।
ఓం సర్వలోకానామ్జనన్యై నమః ।
ఓం పుణ్యమూర్తయే నమః ।
ఓం సిద్ధలక్ష్మ్యై నమః ।
ఓం మహాకాల్యై నమః ।
ఓం మహాలక్ష్మ్యై నమః ।
ఓం సద్యోజాతాదిపఞ్చాగ్నిరూపాయై నమః ।
ఓం పఞ్చకపఞ్చకాయై నమః ।
ఓం యన్త్రలక్ష్మ్యై నమః ॥ ౯౧౦
ఓం భవత్యై నమః ।
ఓం ఆదయే నమః ।
ఓం ఆద్యాద్యాయై నమః ।
ఓం సృష్ట్యాదికారణాకారవితతయే నమః ।
ఓం దోషవర్జితాయై నమః ।
ఓం జగల్లక్ష్మ్యై నమః ।
ఓం జగన్మాత్రే నమః ।
ఓం విష్ణుపన్యై నమః ।
ఓం నవకోటిమహాశక్తిసముపాస్య-
                 పదామ్బుజాయై నమః ।
ఓం కనత్సౌవర్ణరత్నాఢ్య-
       సర్వాభరణభూషితాయై నమః ॥ ౯౨౦
ఓం అనన్తానిత్యమహిష్యై నమః ।
ఓం ప్రపఞ్చేశ్వరనాయికాయై నమః ।
ఓం అత్యుచ్ఛ్రితపదాన్తస్థాయై నమః ।
ఓం పరమవ్యోమనాయక్యై నమః ।
ఓం నాఖపృష్ఠగతారాధ్యై నమః ।
ఓం విష్ణులోకవిలాసిన్యై నమః ।
ఓం వైకుణ్ఠరాజమహిష్యై నమః ।
ఓం శ్రీరఙ్గనగరాశ్రితాయై నమః ।
ఓం రఙ్గభార్యాయై నమః ।
ఓం భూపుత్ర్యై నమః ॥ ౯౩౦
ఓం కృష్ణాయై నమః ।
ఓం వరదవల్లభాయై నమః ।
ఓం కోటిబ్రహ్మాణ్డసేవ్యాయై నమః ।
ఓం కోటిరుద్రాదికీర్తితాయై నమః ।
ఓం మాతులఙ్గమయం ఖేటం బిభ్రత్యై నమః ।
ఓం సౌవర్ణచషకం బిభ్రత్యై నమః ।
ఓం పద్మద్వయం దధానాయై నమః ।
ఓం పూర్ణకుమ్భం బిభ్రత్యై నమః ।
ఓం కీరం దధానాయై నమః ।
ఓం వరదాభయే దధానాయై నమః ॥ ౯౪౦
ఓం పాశం బిభ్రత్యై నమః ।
ఓం అఙ్కుశం బిభ్రత్యై నమః ।
ఓం శఙ్ఖం వహన్త్యై నమః ।
ఓం చక్రం వహన్త్యై నమః ।
ఓం శూలం వహన్త్యై నమః ।
ఓం కృపాణికాం వహన్త్యై నమః ।
ఓం ధనుర్బాణోబిభ్రత్యై నమః ।
ఓం అక్షమాలాం దధానాయై నమః ।
ఓం చిన్ముద్రాం బిభ్రత్యై నమః ।
ఓం అష్టాదశభుజాయై నమః ॥ ౯౫౦
ఓం మహాష్టాదశపీఠగాయై నమః ।
ఓం భూమీనీలాదిసంసేవ్యాయై నమః ।
ఓం స్వామిచిత్తానువర్తిన్యై నమః ।
ఓం పద్మాయై నమః ।
ఓం పద్మాలయాయై నమః ।
ఓం పద్మిన్యై నమః ।
ఓం పూర్ణకుమ్భాభిషేచితాయై నమః ।
ఓం ఇన్దిరాయై నమః ।
ఓం ఇన్దిరాభాక్ష్యై నమః ।
ఓం క్షీరసాగరకన్యకాయై నమః ॥ ౯౬౦
ఓం భార్గవ్యై నమః ।
ఓం స్వతన్త్రేచ్ఛాయై నమః ।
ఓం వశీకృతజగత్పతయే నమః ।
ఓం మఙ్గలానాంమఙ్గలాయై నమః ।
ఓం దేవతానాందేవతాయై నమః ।
ఓం ఉత్తమానాముత్తమాయై నమః ।
ఓం శ్రేయసే నమః ।
ఓం పరమామృతయే నమః ।
ఓం ధనధాన్యాభివృద్ధయే నమః ।
ఓం సార్వభౌమసుఖోచ్ఛ్రయాయై నమః ॥ ౯౭౦
ఓం ఆన్దోలికాదిసౌభాగ్యాయై నమః ।
ఓం మత్తేభాదిమహోదయాయై నమః ।
ఓం పుత్రపౌత్రాభివృద్ధయే నమః ।
ఓం విద్యాభోగబలాధికాయై నమః ।
ఓం ఆయురారోగ్యసమ్పత్తయే నమః ।
ఓం అష్టైశ్వర్యాయై నమః ।
ఓం పరమేశవిభూత్యై నమః ।
ఓం సూక్ష్మాత్సూక్ష్మతరాగతయే నమః ।
ఓం సదయాపాఙ్గసన్దత్తబ్రహ్మేన్ద్రాది-
                 పదస్థితయే నమః ।
ఓం అవ్యాహతమహాభాగ్యాయై నమః ॥ ౯౮౦
ఓం అక్షోభ్యవిక్రమాయై నమః ।
ఓం వేదానామ్సమన్వయాయై నమః ।
ఓం వేదానామవిరోధాయై నమః ।
ఓం నిఃశ్రేయసపదప్రాప్తి-
             సాధనఫలాయై నమః ।
ఓం శ్రీమన్త్రరాజరాజ్ఞై నమః ।
ఓం శ్రీవిద్యాయై నమః ।
ఓం క్షేమకారిణ్యై నమః ।
ఓం శ్రీం బీజ జపసన్తుష్టాయై నమః ।
ఓం ఐం హ్రీం శ్రీం బీజపాలికాయై నమః ।
ఓం ప్రపత్తిమార్గసులభాయై నమః ॥ ౯౯౦
ఓం విష్ణుప్రథమకిఙ్కర్యై నమః ।
ఓం క్లీఙ్కారార్థసావిత్ర్యై నమః ।
ఓం సౌమఙ్గల్యాధిదేవతాయై నమః ।
ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః ।
ఓం శ్రీయన్త్రపురవాసిన్యై నమః ।
ఓం సర్వమఙ్గలమాఙ్గల్యాయై నమః ।
ఓం సర్వార్థసాధికాయై నమః ।
ఓం శరణ్యాయై నమః ।
ఓం త్ర్యమ్బకాయై నమః ।
ఓం నారాయణ్యై నమః ॥ ౧౦౦౦

॥ శ్రీలక్ష్మీసహస్రనామావలిః సమాప్తా ॥

॥ ఇతి శ్రీస్కన్దపురాణే సనత్కుమారసంహితాయాం
లక్ష్మీసహస్రనామస్తోత్రాధారిత నామావలిః ॥






BACK TO TOP

Saturday, 1 February 2020

రధ సప్తమి సూర్య అష్టోత్తర శత నామావళి


సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది.
సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము
అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు.
"భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును భారతీయులే.

విధి విధానాలు

సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,
అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌.
మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.

మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆరోజున అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడయున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈయోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము.
జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.

రథసప్తమినాడు బంగారముతోగాని, వెండితోగాని, రాగితోగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయవలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.

వ్రతకథ

భవిష్యోత్తర పురాణములో రథసప్తమి వ్రత విధానాలు, విశేషమైన వర్ణనలు ఇవ్వబడ్డాయి.

ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేసెను. పూర్వము కాంభోజ దేశమున యశోధర్ముడను రాజుండెను. అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి ఎప్పుడును రోగములు వచ్చెడివి. తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడిగెను. "నీ కుమారుడు పూర్వ జన్మమున పరమలోభియైన వైశ్యుడు. రథసప్తమీ మహాత్మ్యము వలన నీ కడుపున పుట్టెను. లోభియగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యెను అని తెలిపిరి. దీనికి పరిహారమడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు. ఏవ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమీ వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందును. ఆ వ్రత మాచరించిన రాజునకు తగిన ఫలితము కలిగెను.


ఈ  క్రింది మంత్రం చెప్పు కొన్నాక అప్పుడు తలపై నుంచి స్నానం చేసిన తర్వాత తలంటు నీళ్లు పోసుకో వలెను

" సప్త సప్త మహా సప్త సప్త ద్వీపా వసుంధరా
సప్త జన్మ కృతం పాపం మకరే హంతి సప్తమి"

తలపై జిల్లేడు ఆకు రేగుపండు ఉంచుకుని స్నానం చేయవలెను

శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి
(Sri Surya Ashtottara Shatanamavali)

ఓం సూర్యాయ నమః
ఓం అర్యమ్నే నమః
ఓం భగాయ నమః
ఓం త్వష్ట్రై నమః
ఓం పూష్ణే నమః
ఓం అర్కాయ నమః
ఓం సవిత్రే నమః
ఓం రవయే నమః
ఓం గభస్తిమతే నమః
ఓం అజాయ నమః
ఓం కాలాయ నమః
ఓం మృత్యవే నమః
ఓం ధాత్రే నమః
ఓం ప్రభాకరాయ నమః
ఓం పృధివ్యై నమః
ఓం అధ్బ్యో నమః
ఓం తేజసే నమః
ఓం రాయవే నమః
ఓం ఖాయ నమః
ఓం పారాయణాయ నమః
ఓం సోమాయ నమః
ఓం బృహస్పతయే నమః
ఓం శ్రుక్రాయ నమః
ఓం బుధాయ నమః
ఓం అంగారకాయ నమః
ఓం ఇంద్రాయ నమః
ఓం వివస్వతే నమః
ఓం దీప్తాంశవే నమః
ఓం శుచయే నమః
ఓం సౌరయే నమః
ఓం శనైస్చరాయ నమః
ఓం బ్రహ్మనే నమః
ఓం విష్ణవే నమః
ఓం రుద్రాయ నామః
ఓం స్కందాయ నమః
ఓం వైశ్రవనాయ నమః
ఓం యమాయ నమః
ఓం వైద్యుతాయ నమః
ఓం జటరాయ నమః
ఓం అగ్నయే నమః
ఓం బందవాయ నమః
ఓం తేజ సాంపతయే నమః
ఓం ధర్మధ్వజాయ నమః
ఓం వేదకర్త్రే నమః
ఓం వేదాంగాయ నమః
ఓం వేదవాహనాయ నమః
ఓం కృతాయ నమః
ఓం త్రేతాయై  నమః
ఓం ద్వాపరాయ నమః
ఓం కలయే నమః
ఓం సర్వాసురాశ్రయాయ నమః
ఓం కలాయై  నమః
ఓం కాశ్టాయై నమః
ఓం ముహుర్తాయై నమ్హ
ఓం పక్షాయ నమః
ఓం మాసాయ నమః
ఓం ఋతవే నమః
ఓం సంవత్సరాయ నమః
ఓం అశ్వత్దాయ నమః
ఓం కాలచాక్రాయ నమః
ఓం విభావసవే నమః
ఓం పురుషాయ నమః
ఓం శాశ్వతాయ అనమః
ఓం యోగినే నమః
ఓం వ్యక్తా వ్యక్తా య నమః
ఓం సనాతనాయ నమః
ఓం లోకాద్యక్షాయ నమః
ఓం సురాధ్యక్షాయ  నమః
ఓం విశ్వకర్మనే నమః
ఓం తమో మఠేనమః
ఓం వరునాయ నమః
ఓం సాగరాంశవే నమః
ఓం జీమూతాయ నమః
ఓం అరిఘ్నే నమః
ఓం భూతేశాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం సర్వభూత నిషేవితాయ నమః
ఓం మణయే నమః
ఓం సువర్ణాయ నమః
ఓం బూతాదయే నమః
ఓం సర్వతోముఖాయ నమః
ఓం జయాయ నమః
ఓం విశాలాయ నమః
ఓం వరదాయ నమః
ఓం శ్రేశ్టాయ నమః
ఓం ప్రాణ ధారణాయ నమః
ఓం ధన్వంతరయే నమః
ఓం దూమకేతవే నమః
ఓం ఆది దేవాయ నమః
ఓం ఆది తేస్సుతాయ నమః
ఓం ద్వాదశాత్మనే నమః
ఓం అరవిన్దాక్షాయ నమః
ఓం పిత్రే నమః
ఓం ప్రపితాయ నమః
ఓం స్వర్గ ద్వారాయ నమః
ఓం ప్రజా ద్వారాయ నమ
ఓం మోక్ష ద్వారాయ నమః
ఓం త్రివిష్టపాయ నమః
ఓం దేవకర్త్రే నమః
ఓం ప్రశాంతాత్మనే నమః
ఓం విశ్వాత్మనే నమః
ఓం విశ్వతో ముఖాయ నమః
ఓం చరా చరాత్మనే నమః
ఓం సూక్షాత్మనే నమః
ఓం మైత్రేయాయ నమః
ఓం అరుణాయ నమః
ఓం సూర్యనారాయణాయ నమః
ఓం ఆదిత్యాయ నమః

ఇతి శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి సంపూర్ణం