సేమ్యా పులావ్
కావలిసిన పదార్థాలు
1 సేమ్యా 2 కప్పులు
2 ఉల్లిపాయ 1
3 పొటాటో 1
4క్యారట్ 1
5 ఫ్రెంచ్ బీన్స్ 5
6 గ్రీన్ పీస్ గుప్పెడు
7 కొత్తిమీర కొద్దిగా
మసాలా దినుసులు
1 లవంగాలు 2
2 దాల్చిన చెక్క 1
3 ఏలకులు 2
4 జీలకర్ర 1 స్పూన్
5 పులావ్ ఆకులు 2
కొబ్బరి తురుము 2 స్పూన్స్
సోంపు 1 స్పూన్
అల్లం చిన్న ముక్క
పచ్చిమిర్చి 3
నెయ్యి 1 స్పూన్
ఆయిల్ 1 స్పూన్
వేడి నీళ్లు 3 న్నర కప్పులు
ఉప్పు తగినంత
తయారీ విధానం.
ముందుగా పైన చెప్పిన కూరలను శుభ్రం గా కడిగి ,
చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
కొబ్బరి తురుము ,సోంపు , అల్లం ,పచ్చిమిర్చి ,కొత్తిమీర కలిపి ,
మెత్తని ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి
సేమ్యా ను కొద్దిపాటి నేతిలో దోరగా వేపుకోవాలి .
స్టవ్ వెలిగించి వెడల్పయిన లోతు గా వుండే బాణలి తీసుకుని వేడెక్కాక ,
ఆయిల్ మరియు నెయ్యి వేసి పైన చెప్పిన మసాలాదినుసులను వేసి ,
అవి దోరగా వేగాక ,
ఉల్లిపాయ ముక్కలు , పుదీనా ఆకులు ,కొబ్బరి పేస్ట్ వేసి ,
కొద్దిసేపు వేగనిచ్చి , తరిగిపెట్టుకున్న కూరముక్కలు కూడా వేసి ,
8- 10. నిమిషాలు మగ్గని చ్చి ,
సేమ్యా, గ్రీన్ పీస్ లను వేసి ,బాగా కలిపి ,
మూడున్నర కప్పులు వేడినీళ్లు పోసి , తగినంత ఉప్పును వేసి ,
బాగా కలిపి మూత పెట్టి ,సన్నని మంట మీద ఉడకనివ్వాలి ,
మధ్య మధ్యలో కలుపుతూ బాగా
ఉడకనివ్వాలి .నీరు అంతా పోయి విడివిడి లాడుతూ వచ్చాక ,
స్టవ్ ఆఫ్ చేసుకుని ,ఒక బౌల్లోకి తీసుకుని ,
పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
సేమ్యా పులావ్ రెడీ.
దీనిని టొమాటో సాస్ తో గాని చిల్లి సాస్ తో గాని తింటే రుచిగా ఉంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
" వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.