లంకిణిని హనుమంతుడు దెబ్బకొట్టడం తర్వాత దేవతలు కుసుమవృష్టి కురిపించారు ఆంజనేయస్వామి వారిమీద.
" హనుమానంజనా సూనుః
వాయుపుత్రో మహాబలః
కపీంద్రః
పింగళాక్షశ్చ
లంకా ద్వీప భయంకరః
ప్రభంజన సుతః
వీరః
సీతాశోక వినాశకః
అక్షహంతా రామ సఖః
రామకార్య దురంధరా
మహౌషధ గిరేర్హారీ
వానర ప్రాణదాయకః
వాగీశ తారకశ్చైవ
మైనాక గిరిభంజనః
నిరంజనో జితక్రోధః
కదళీవన సంవృతః
ఊర్ధ్వ రేతా మహాసత్వః
సర్వమంత్ర ప్రవర్తకః
మహాలింగ ప్రతిష్ఠాతా
శివధ్యానపరో నిత్యం శివపూజా పరాయణః
ఇవి మొత్తం ఇరవై ఏడు నామాలు. 27 నామాలు కలుపుకుంటే దీనికి సుందరహనుమన్మంత్రము అని పేరు.