" అందమైన జీవితం. "
కారు హారన్ వినిపించింధి ..
ఇంటి ముందు ఆగింది .
శైలజ పిల్లలూ మీ తాత గారు వచ్చారు . లోపలికి వెళ్లి చదువుకోండి .
ఇక్కడ ఉంటే విసుక్కుంటారు అంటూ ఇద్దరినీ గబగబా పుస్తకాలు సర్దేసి లోపలి కి తీసుకెళ్లింది.
మూర్తి లోపలి కి వచ్చారు .
ఇల్లంతా సైలెన్స్ గా వుంది .
భార్య మంచినీళ్లు , కాఫీ పట్టుకుని వచ్చింది . కాఫీ తాగుతూ అబ్బాయి ఇంకా రాలేదా అన్నాడు . మీకు తెలుసుగా రోజు 9. 30 అవుతుంది అంది . కాఫీ తాగేసి ఫ్రెషప్ అయి వచ్చాడు భోజనం వడ్డించెయ్యమంటారా అని అడిగింది పిల్లలు తిన్నారా అని అడిగాడు .ఆ వాళ్ళది అయిపొయింది .
కోడలిని రమ్మంటే అబ్బాయి వచ్చిన తరువాత తింటానంది .
రోజూ తెలిసున్నదేగా మీరు రండి అంది. భోజనం అయినతరువాత ,
చెస్ బోర్డు బేగ్ లోంచి తీసి పిల్లలని పిలిచి ఇచ్చాడు రోజూ చెస్ ఆడండి తెలివితేటలూ పెరుగుతాయి అని చెప్పారు. మౌనంగా తీసుకుని లోపలి కి వెళ్లారు అమ్మా నాకు క్రికెట్ అంటే ఇష్టం కదా నాకు బాట్ కొనండి ఈ చెస్ నాకు నచ్చదు అంటూ ఆ పక్కన పెట్టేసాడు . నాకు బార్బీ కావాలి అన్నాను కదా అంది కూతురు తప్పు అమ్మ అలా అనకూడదు నాన్నగారికి చెప్పి తెప్పిస్తాలే అంది నాన్న ఎప్పుడు తీసుకురాడు తాత తిడతారని అన్నాడు. ఇంకా చాలు పడుకోండి మళ్ళీ రేపు స్కూల్ వుంది అంటూ పడుకోపెట్టేసింది 9. 30 ప్రాంతంలో వచ్చాడు బెల్ కొట్టగానే భార్య వెళ్లి తలుపు తీసింది . మూర్తి గారు , భార్య హాల్ లోనే వున్నారు . మౌనంగా గదిలోకి వెళ్ళిపోతున్నాడు ఏరా ఇవాళ కొత్త కాంట్రాక్టు టెండర్ ఏం చేసావు అని అడిగారు వేసేసాను అండి మనకే వచ్చింది అని ముక్తసరిగా సమాధానం చెప్పాడు ఇంకా ఏమిటి ఆఫీస్ విశేషాలు అని అడిగాడు ఏం లేదండి అన్నాడు అక్కడే నుంచుని సర్లే వెళ్ళు అనగానే ఒక్క గంతులో రూమ్ లోకి వెళ్ళిపోయాడు గొప్పగా తయారయ్యారు నీ పిల్లలు
సరిగ్గా సమాధానం కూడా చెప్పడం రాదు.. అన్నాడు విసుగ్గా...
మీరు నెమ్మది గా అడగచ్చు గా...అలా గట్టి గా అడిగితే తిడుతున్నారని....మరింత బిగుసుకు పోతున్నాడు... అంది... ఇదిగో మీకు ఇష్టమైన స్వీట్..అంటూ ఇచ్చింది... వాళ్ళకి ఇచ్చావా అన్నాడు....
వాడు ఇష్టపడడు... తినడు లెండి అంది...
ఎరా దీనికి ఏమి వచ్చింది.. ఇంద తీసుకో బాగుంటుంది... అంటూ చేతిలో పెట్టాడు... అది తీసుకుని...డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు భోజనం చేయడానికి.... అలా రోజూ ఇల్లంతా మౌనంగా నే ఉంటుంది...
ఆ మరునాడు సాయంత్రం నేను ఒకసారి రాఘవ దగ్గరికి వెళ్లి వస్తా... చాలాకాలం అయింది వాడి దగ్గరకి వెళ్ళి అని బయలు దేరాడు మూర్తి....

రా రా మూర్తి... చాలా కాలం తరువాత వచ్చావు. ఏమిటి విశేషాలు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు రాఘవ రావు .
మూర్తి రాఘవ రావు కాలేజ్ లో ఫ్రెండ్స్. చదువుకోవడం అయ్యాక మూర్తి వ్యాపారం లోను రాఘవ ఉద్యోగం లోను స్థిరపడ్డారు. అప్పుడప్పుడు ఇలా కలుసుకుని కాసేపు గడిపి వెళుతుంటారు మూర్తి గారు.
ఎమోయ్ మీ అన్నయ్య వచ్చాడు, కాఫీ పట్టుకుని రా అంటూ అరిచాడు.
ఇదిగో వస్తున్నా అంటూ కాసేపు అయ్యాక కాఫీ కప్ తో వచ్చింది సుజాత... ఏం అన్నయ్య గారు బాగున్నారా అంటూ పలకరించింది... కప్పు అందించింది.
అంతా బాగానే ఉన్నారమ్మా...
ఎలా ఉన్నారు మీరు పిల్లలూ... అంటూ అడిగాడు మూర్తి.
ఏదో ఇలా అబ్బాయి, కోడలు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు.. పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతే
మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా మాకు మేమే కాల క్షేపం... అంది నవ్వుతూ...
కాఫీ లు పూర్తి అయ్యేటప్పటికి అందరూ రావడం మొదలు పెట్టారు.స్కూల్ నుంచి రాగానే హాయ్ తాతయ్యా అంటూ పక్కన జేరింది... హాయ్ బంగారుతల్లి ఎలా జరిగింది ఇవాళ స్కూల్ అంటూ ముద్దు పెట్టుకున్నాడు.
ముందు స్కూల్ బాగ్ లోపల పెట్టి రా ...మీ అమ్మ వస్తే తిడుతుంది... అంది సుజాత
ఏం పరవాలేదులే...ముందు నీకో విషయం చెప్పాలి తాతయ్యా , అసలేం జరిగిందంటే అంటూ మొదలు పెట్టింది....
ముందు మూర్తి తాతగారికి నమస్తే పెట్టు... అన్నాడు రాఘవ..
నమస్తే తాత గారు అంది...
మనవడికి ట్యూషన్ ఉంది ...
ఇంకో గంటలో వస్తాడు.... దీనికి స్కూల్ నుంచి రాగానే అక్కడి విశేషాలు అన్ని చెప్పఁయాలి..
లేకపోతే కదలదు...అన్నాడు
ముందు నేను చెప్పేది విను తాతయ్యా అంటూ....ముఖం తన చిట్టి చేతులతో తిప్పేసి...చెపుతోంది.... అలాగే వింటాలే.రా ..చెప్పు అన్నాడు..నవ్వుతూ..
మిమ్మల్ని చూస్తూ ఉంటే ముచ్చటగా ఉందిరా అన్నాడు మూర్తి...
ఇదిగో ఈ పాలు తాగేసి చెప్పుకో ఆ కబుర్లు అంది సుజాత...
కప్పు పట్టుకో గానే వేడిగా ఇవ్వొద్దని నీకు చెప్పానా అంది....కోపం గా...
ఓసి గడుగ్గాయి...నన్నే తిడతావు టే...
నీ కబుర్ల కు ఆలస్యం అయిపోతోందా ,
రాచ కార్యాలు మండిపోతున్నాయని ....
నెమ్మది గా తాగేసి అప్పుడు చెప్పుకో
ఆ పనికి రాని కబుర్లు.. అంది నవ్వుతూ...
నావి ఏమి పనికి రాని కబుర్లు కాదు... ముఖ్యమైన విషయాలు కదు తాతయ్యా అంది.... అవును తల్లి...
ఇక్కడ మేము ముఖ్యమైన విశేషాలు మాట్లాడు కుంటుంటే ...నీ నస ఏమిటి లోపలికి వేళ్ళు అన్నారు....
నన్నే తిట్టిస్తావుటే... లోపలకి రా ని సంగతి చెపుతాను అంది...
తాతయ్యా మీద చుట్టూ చేయి వేసి...నమ్మని చూస్తూ నాలిక బైట పెట్టి ఎక్కిరించిది.. వేవ్వేవ్వే అంటూ... సుజాత మురిసిపోతూ వంటింట్లోకి వెళ్ళింది...
కాసేపటికి కొడుకు కోడలు మనవడు వచ్చారు. నమస్తే అంకుల్ అంటూ పలకరించాడు రమేష్...బాగున్నవా రమేష్.. అని అడిగాడు... మూర్తి
బాగున్నాను అండి... ఇప్పుడే ఫ్రెష్అప్ అయ్యి వస్తాను అంటూ లోపలకి వెళ్ళాడు. తాత గారు ఇవాళ కారమ్స్ ఆడతాను అన్నారు...ఆని అడిగాడు వివేక్.. బూట్లు విప్పుకుంటు... ఇప్పుడు కాదురా..ముందు పాలు తాగేసి హోమ్ వర్క్ లు చేసేయ్... ఆ తరువాత ఆడదాం.... రేపు ఎలాగూ సెలవే కదా... ఇప్పుడు మూర్తి గారు వచ్చారు కదా మాట్లాడు తున్నాను అన్నాడు రాఘవ. . సరే అంటూ బాగ్ తీసికుని లోపలికి వెళ్ళాడు.
వీళ్లు వస్తే అంతా సందడి... స్కూల్ కి వెళ్ళగానే అంతా నిశ్శబ్దంగా అయిపో తుంది ఇల్లు...
మళ్ళీ సాయంత్రం ఎప్పుడు అవుతుంది అంటూ ఎదురు చూడడం జీవితంలో భాగం అయిపోయింది... అన్నాడు రాఘవ..
కొంత సేపు అయ్యాక కోడలు వచ్చింది. మామయ్య గారు ఇదిగో మీ కళ్ళజోడు... నాకు దారి లొనే కదా అని తీసుకుని వచ్చేసా...మళ్ళీ మీరు వెళ్లడమెందుకని అంది... థాంక్స్ అమ్మా...నేనే వాడికి ఫోన్ చేద్దామనుకుంటున్నా...అంటూ పెట్టుకుని చూసారు... బాగానే ఉంది...అన్నాడు.
బాబాయ్ గారు మీరు ఇవాళ ఇక్కడే భోజనం చేసి వెళ్ళాలి... అందరికి వండే స్తున్నాము అంటూ లోపలకి వెళ్ళింది...
ఇప్పుడు భోజనం ఎందుకు రా ,నేను ఇంటికి వెళతాలే... అన్నాడు మూర్తి.
అదేం కుదరదు రాక రాక వచ్చావు.... నువ్వు ఉండాల్సిందే... అంటూ పట్టు పట్టాడు. అది కాదురా అక్కడ మీ చెల్లి ఒక్కర్తి తినాలిరా....అందుకే వెళతా అంటున్నా. అన్నాడు..
అదేమిటి మిగతా వాళ్ళు ఉన్నారుగా..అని అడిగాడు ఆశ్చర్యం గా..మా కుటుంబం అదొ టైప్ లే..అదో పెద్ద కధ...నేనెంత చేసినా వాళ్లలో మార్పు రాదు. అన్నాడు మూర్తి..
అదికాదు రా సరిగ్గా చెప్పు నీ సమస్య ఏమిటో...అప్పుడే కదా పరిష్కారం దొరుకుతుంది. ఇన్నాళ్లు నాకెందుకు చెప్పలేదు మరి అన్నాడు.
చెప్పేటంత పెద్ద విషయం కాదు... కానీ మనసు కి బాధ గా ఉంటుంది... దానికి కొన్ని కోరికలు ఉంటాయి కదా..
ఇంట్లో అందరూ ఉంటారు... కానీ ఎవరూ సంతోషం గా కనబడరు... ఏదో వెలితి.... అందరూ కలిసే ఉన్నా...అందరి మధ్య కనిపించని దూరం...ఉంది.. అది రోజు రోజు కి పెరిగి పోతోంది... ఏం చేయాలో అర్థం కావట్లేదు రా ....వాళ్ళకి అన్ని ఇచ్చాను.. విలువైన వస్తువులు కొన్నాను... ఇల్లు ఇచ్చాను... బాంక్ బాలన్స్ లు ఇచ్చాను.. కానీ ఏమిటో... మనవులు కూడా దగ్గరికి చేరరు... అన్నాడు బాధగా. నువ్వు చాలా డిసిప్లిన్ గా ఉంటావని విన్నాను. అన్నాడు... రాఘవ...
అవును రా..పద్ధతి ప్రకారం లేకపోతే ఎలా...నేను బిజినెస్ టెన్షన్ తో ఇంటికి వస్తా...పిల్లలు అల్లరి చేస్తారు.. కాసేపు ప్రశాంతం గా ఉండనివ్వరు.. అందుకే కోపం లో తిట్టేస్తా ..తరువాత మంచి costly gift కొనిస్తా...అయినా సరే... అన్నాడు మూర్తి.
ఇదేదో ఆలోచించాల్సిన విషయమే... అందరూ మంచి వాళ్లే... ఏదో చిన్న కన్ఫ్యూజన్... అందుకే మీ మధ్య చిన్న గాప్...ఏర్పడింది... అన్నాడు రాఘవ...
ఇంతలో కోడలు వచ్చింది... మమయ్యా భోజనాలు వడ్డించేసాము ...మీరు రండి బాబాయ్ గారు అంటూ ఆహ్వానించింది..లేవరా భోజనాలు అయ్యాక మాట్లాడుకుందాము...అంటూ లేచాడు. అదేమిటి ముగ్గురికే పెట్టారు అని అడిగాడు...మీరు ముందు చేసేయండి.. మేము తరువాత తింటాము అంది కోడలు... అదేం వద్దు...అమ్మాయి...పోద్దుటినుంచి...ఆఫీస్ లో కష్టపడి వచ్చావు... అందరం కలిసే భోజనాలు చేద్దాము...అయినా నా రూల్ తెలుసు గా...అన్నాడు...అందరూ కబుర్లు చెప్పు కుంటూ ...భోజనాలు పూర్తి చేశారు...
ఇదిగో ఇలా వారానికి ఒక సారి అయినా అందరూ కలిసి భోజనం చేయాలని అనిపిస్తుంది... కానీ అది సాధ్యం కాదు మా ఇంట్లో అన్నాడు నిర్లిప్తంగా...
పగలు అంతా ఆఫీసులో దూరంగా ఉంటారు... కనీసం రాత్రి అయిన అందరం కలిసే భోజనం చేయాలి...అనే రూల్ పెట్టాను... ఎంత బిజీ గా ఉన్నా సరే ..అందరూ కలిసే చేస్తాము...ఇలా చేస్తే ఆ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు...బలపడతాయని.. ఆ కుటుంబ సభ్యులు మధ్య బంధం బలపడుతుందని ఎక్కడో చదివా...అప్పటినుండి ..అమలు చేస్తూ వచ్చాం...అన్నాడు...రాఘవ
బాగుంది రా మీ పద్దతి...
మా కోడలు బాగా చదువు కుంది... ఉద్యోగం చేయాలని కోరిక...జగదీష్ గాడి కంపెనీ లో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్ కి అప్లై చేసింది...
కోడలు ఉద్యోగం చేయడం ఎందుకు....
ఇంట్లో పని ఎవరు చేస్తారు...
పిల్లల్ని ఎవరు చూస్తారు...
పైగా కావాల్సినంత డబ్బు ఇచ్చాను గా హాయిగా ఖర్చు పెట్టుకోండి...
అంటూ ఆ అపోయింట్ మెంట్ ఆపేసా...వాడికి ఫోన్ చేసి..
ఏ నేను చేసింది తప్పా రా అని అడిగాడు మూర్తి.
ముందు నువ్వొక విషయం గ్రహించాలి... కోడలు అంటే ఇంటికి సేవలు చేయడానికి వచ్చి న బానిస కాదు...
ఆ మాటకొస్తే కుటుంబ సభ్యులు ఎవరూ ఒకరికి ఒకరు బానిసలు కారు....
ఒకరి మీద ప్రేమతో పనులు చేస్తూ ఉంటారు...
అంటే ఒక భర్త , భార్య పిల్లల మీద ప్రేమలో కష్ట పడి పని చేసి సంపాదిస్తాడు..
అలాగే భార్య అందరి మీద ప్రేమతో బాగా వండి, కొసరి కొసరి తినిపిస్తుంది...
అప్పుడే ఆ కుటుంబము లో ప్రేమానురాగాలు పెరుగుతాయి...
చిన్న చిన్న భేషిజాలతో సంతోషాన్ని దూరం చేసుకోకు..
వాళ్ళ సంగతి ఎలా ఉన్నా నీ విలువైన జీవితంలో ఆ ఆనందాన్ని కోల్పోతున్నావుగా ..
కావాలంటే మళ్ళీ ఆ రోజులు రావు....
ఒకళ్ళ ప్రేమ ను పొందాలంటే ,
మనం ప్రేమను పంచితేనే తిరిగి మనకి
ప్రేమ వస్తుంది...
నువ్వు ఇచ్చే ఐశ్వర్య ము...మెటీరియల్ మాత్రమే...
డబ్బుని , వస్తువుల్ని ప్రేమించడం మానేసి...మనుషులను ప్రేమించి చూడు...
నీకు నచ్చినది ఇవ్వడం కాదు , వాళ్ళకి నచ్చినది ఇచ్చి చూడు...
నీవు కోల్పోయిన ప్రేమ నీకు మళ్ళీ దక్కుతుంది అన్న నమ్మకం నాకు ఉంది...
పాపం ఆ అమ్మాయి ఎంతో కష్టపడి చదువుకుంది.... ఇన్ని డిగ్రీ లు సాధించింది.. తనకి కొన్ని ఆశలు ,ఆశయాలు ఉంటాయి.. పుట్టిట్లో ఉన్నంత కాలం తల్లిదండ్రుల ప్రోత్సాహం తో అవి నెరవే ర్చుకునే దిశలో ప్రయాణం చేసి ఒకసారి పెళ్లి అవగానే...వాటి మీద నీళ్లు జల్లేసి....
వంటింటి కే..... పరిమితము చేస్తే ఎలా...
ఇప్పుడు అత్త మామ లే గా ఆమె తల్లిదండ్రులు.... మరి ఆమెని ప్రోత్సహించడం నీ బాధ్యత కాదా.....
ఒక అవకాశం ఇచ్చి చూడు.....
వాళ్ళ ఆలోచనల కి విలువ ఇచ్చి చూడు,
తగిన ప్రోత్సాహం ఇచ్చి ...వాళ్ళ ఆశయాలని నెరవేర్చు కునే విధం గా చెయ్యి...వాళ్ల కళ్ళలో వెలుగులు నింపు.... ఉద్యోగం చేస్తే ఏమవుతుంది మహా అయితే ఇంకో జీతం వస్తుంది...
అదీ మంచిదే గా...
కానీ అంతకి మించి ఆ అమ్మాయి కి ఆత్మ సంతృప్తి లభిస్తుంది...
జీవితంలో ఏదో సాధించిన ఆత్మ సంతృప్తి కి మించిన ఆనందం ఎక్కడ ఉంటుంది...
మరి ఇద్దరూ ఆఫీస్ లకి వెళ్ళిపోతే పిల్లలు కి సంస్కారం, బుద్ధులు ఎవరు నేర్పిస్తారు... అని అడిగాడు మూర్తి.
మీరు పెద్ద వాళ్ళు ఉన్నారుగా...
జీవితాన్నీ చదివిన అనుభవం ఉంది...అన్నాడు రాఘవ..
మరి నా మాట వినరు గా అన్నాడు...
ఎదుటి వారు నీ మాట వినాలంటే ..వాళ్ళకి నీ మీద ప్రేమ అనురాగం పెరగాలి...
ఇక్కడ నువ్వు చూపించాల్సింది " మమకారం.".. అధికారం కాదు.
నువ్వు చెప్పినదే వినాలంటే ఆధి కారం అవుతుంది..
వాళ్లే వచ్చి నీ చేత చెప్పించు కుంటే. ..అది గౌరవం అవుతుంది....
ఈ రెండింటికి మధ్య సన్నని గీత ఉంటుంది.. ఆ గీత దాటితే .....
అంతా ప్రేమే కనిపిస్తుంది...
ఇష్టమైన వాళ్ళు ఒక మాట అన్నా పట్టించుకొము... కానీ ఇష్టం లేని వారు ఏం మాట్లాడినా అందులో నించి ఓ తప్పు డు అర్థం తీస్తాము.... ఇది మానవ నైజం....
అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు...
ఆఫీసు లోని టెన్షన్ లు ఎప్పుడూ ఉండేవే....వాటిని ఇంట్లోకి తీసుకుని రాకూడదు.. బయటే చెప్పులతో పాటు వదిలేయాలి...ఆది నేర్చుకోగలిగితే అంతా బాగుంటుంది....
ఎంతో చిన్నది జీవితం... దానిని పాడు చేసుకోవద్దు... అయింది ఏదో అయ్యింది... మిగతా జీవితాన్ని అయినా సంతోషంగా ఉండేలా చేసుకో...
ఎంత సేపు వాళ్ళకి అది ఇచ్చాను ఇది
ఇచ్చాను అంటావు కానీ, ఆ ఇచ్చింది వాళ్ళకి ఇష్టమా కాదా అని ఆలోచించావా
కేవలం గొప్పగా ఉంది అని మాత్రమే ఆలోచిస్తున్నావు..
కొంచెం మారరా మూర్తి...
నువ్వు కొబ్బరికాయ లాంటి వాడివి... పైకి గట్టిగా ఉన్నా...లోపల నీళ్ళ లా నీ మనసు తీయనైనది.... ఆ మనసు వాళ్లకి తెలిసేలా చెయ్...
గౌరవం అనేది అవతల వారి నుండి తీసుకుంటే అధి కారం అవుతుంది.. అదే వాళ్ళంతట వాళ్ళే ఇస్తే ప్రేమ అవుతుంది....
వాళ్ళు మనపిల్లలు రా ,
తిడితే భరిస్తారు కానీ ఎదురు చెప్పరు...
ఒక స్నేహితుడి గా నీకు చెప్పగలిగే మాట ఇదే....తప్పుంటే ఈ విషయం ఇంతటితో వదిలేయ్...మూర్తీ అన్నాడు రాఘవ.
అదేం లేదురా...ఈ పరిస్థితి నుంచి బైట పడడానికె కదా నీదగ్గరకి వచ్చింది.. సరేరా నాలో మార్పు రేపటి నుంచి చూపిస్తా . మరి నేను వస్తానురా . అన్నాడు మూర్తి...కారు దాకా సాగనంపటానికి వచ్చాడు రాఘవ... మంచి గా మారాలి అనుకున్నప్పుడు వెంటనే చేసేయాలి... కానీ రేపు ఎల్లుండి అని ముహుర్తాలు చూడరు అన్నాడు నవ్వుతూ... సరే బాబూ .....ఇప్పటి నుంచే సరేనా...అంటూ కార్ పోనిచ్చాడు... దారిలో చిన్న చిన్న పనులు చూసుకుని ఇల్లు చేరాడు.....
ఈ సారి హారన్ కొట్టలేదు... నెమ్మదిగా కార్ పార్క్ చేసి స్వీట్ పాకెట్ తీసుకుని తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు. శాంత టీవీ చూస్తోంది... కొడుకు కోడలు గదిలో ఉన్నారు.... పిల్లలు పాటలు పెట్టుకుని మంచం మీద గెంతు తున్నారు... మూర్తి హాల్లోకి వచ్చి పాకెట్ టేబుల్ మీద పెట్టి శాంతా అంటూ పిలిచాడు... మీరా ఎప్పుడు వచ్చారు...అంటూ టీవీ కట్టేసి.. వచ్చింది... అన్నయ్య గారు వాళ్ళు బాగున్నారా అంటూ అడిగింది... ఇవాళ వెళ్లడం మంచిది అయింది... కొన్ని సమస్య లకి పరిస్కారం దొరికింది అన్నాడు....ఏమిటండి అది అంది... నువ్వే చూస్తావ్ గా...అన్నాడు.భోజనం చేసావా అని అడిగాడు...ఆ చేసేసాను...మీరు వాళ్ళింటి కి వెళ్లారుగా వాళ్ళు ...మిమ్మల్ని ఎలాగూ చేయకుండా పంపరు... అందుకే అంది...మంచిపని చేశావ్...నిజానికి అదే జరిగింది... ఆ పాకెట్ ఏమిటండి అంది శాంత...
ఇదా స్వీట్... మన అబ్బాయి కి ఇస్తామని దారిలో ఆగి తీసుకున్న... వాడికి ఇవ్వు..ఇష్టం గా తింటాడు అన్నాడు.... అదేదో మీచేత్తో ఇస్తే సంతోషిస్తాడు....ఒరేయ్ అబ్బాయి ఒకసారి ఇలా రా అంటూ పిలిచింది....
మూర్తి గారి గొంతు విని కోడలు పాటలు కట్టేసింది... అయిపోయింది.. ఇవాళ అందరికి క్లాస్...వద్దంటే విన్నావు కాదు... ఇప్పుడు చూడు అంది...నాకేం తెలుసు ..హారన్ కొడతారు కదా అనుకున్నా.. అన్నాడు కొడుకు
ఒక మూలకు పోయి బిక్కుబిక్కుమంటూ....
అమ్మ ఎందుకు పిలిచావు అన్నాడు...నాన్నగారు నీకు ఏదో తెచ్చారు.... తీసుకుని వెళ్ళు... అంది ..ఒరేయ్ నీకు ఇష్టమైన స్వీట్...తీసుకో అంటూ పాకెట్ ఇచ్చారు... ఆశ్చర్య పోయాడు.... ఎప్పుడు వద్దు.. అంటూ ...వేరే తీసుకుని వస్తుంటారు... అనుకుంటూ...తీసికుని..లోపలికి వెళ్లబోయాడు... ఎమ్ పరవాలేదు ఇక్కడే తిను అన్నారు....ఒకటి తిన్నాడు...ఇక నుంచి ఆ రూల్స్ లేవు....అందరూ హాల్లో కూర్చుని టీవీ చూస్తూ భోజనాలు కూడా చేయచ్చు... అన్నాడు... అన్ని నువ్వే తినేయకు ...కొన్ని ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టు అన్నాడు నవ్వుతూ... భలే వారు నాన్న గారు సిగ్గు పడ్డాడు... ఒరేయ్ మనవడా. అంటూ పిలిచాడు... అమ్మా అంటూ నసిగాడు... వెళ్ళు.. వద్దంటే విన్నవా...ఆ ఎమ్ పరవాలేదు అంటూముందుకి తోసింది
... భయం భయం గా ఆయన దగ్గరికి వెళ్ళాడు... నిన్ను తిట్టను లేరా....ఇలా రా దగ్గరికి అంటూ చేయి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు... మనవరాలిని కూడా పక్కన కూర్చో పెట్టుకున్నాడు....
ఇంకెప్పుడు ఇలా అల్లారి చేయను తాతయ్యా సారి అన్నాడు తల వంచు కుని..
తల దించుకునే అంత తప్పు నా మనవడు ఎప్పుడూ చేయడు రా.
.నేనె రూల్స్...డిసిప్లిన్ అంటూ మీ స్వాతంత్రముని లాగేసికున్నాను...
ఇక మీదట మీకు రూల్స్ లేవు....మీ ఇష్టం వచ్చినట్లు అల్లరి చేయండి... డాన్సులు చేసుకోండి... సరేనా...అన్నాడు ..
అన్నట్లు కార్ లో పాకెట్ ఉంది వెళ్లి తీసుకుని రా ...ఇది గో కీ..అంటూ ఇచ్చాడు... వాడు ఆ తాళం పట్టుకుని బైటకి పరిగెత్తాడు...
నీకు కూడా ...వెళ్లవే అంటూ మనవరాలిని తట్టాడు... అదికూడా పరిగెత్తింది...
డోర్ తెరవగానే వెనుక సీట్లో..క్రికెట్ బాట్... బార్బీ బొమ్మ ఉన్నాయి... ఒక్కసారిగా ఆనందం తో అరిచాడు... అవి పట్టుకుని లోపలికి వచ్చాడు... థాంక్స్ తాతగారు అంటూ గట్టిగా హగ్ ఇచ్చి ముద్దు పెట్టుకున్నాడు.ఆ ముద్దు లో మూర్తి గారికి ఆనందం అవధులు దాటింది... ఏమే... నీకు నచ్చిందా...అంటూ అడిగారు....
చాలా అంటే చాలా... అంది.. మరి నీ ముద్దు ఏది అన్నాడు....వచ్చి గట్టిగా ముద్దు పెట్టింది.. ఆయనకుడా...మనవరాలిని ముద్దు పెట్టుకుని... ఇంకా లోపలికి పోయి మీ అమ్మకి చూపించి ఆడుకోండి... అంటూ పంపించారు...వాళ్ళు హుషారుగా లోపలికి పరిగెత్తారు అమ్మా అంటూ....
శాంత మనసు ఆనందం తో నిండియింది...
రేపు ఆదివారం ఎక్కడికి ప్రోగ్రామ్స్ పెట్టుకోకు...సోమవారం మనం ఇద్దరం ఆఫిస్ కి వెడదాం....pa తో చెప్పి స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పు... అన్నాడు .
అలాగే అంటూ లోపలికి వెళ్ళాడు.. ఆ మరునాడు ఆలస్యంగా నిద్ర లేచాడు... ఏమండీ ఇవాళ ఇంత సేపు పడుకున్నారు... అని అడిగింది.... లక్ష్మీ..ఏం. లేదు ఇవాళ ఇంట్లోనే ఉండమన్నారు... ఎలాగూ ఆఫీస్ కి వెళ్ళక్కరలేదు కదా అని ఇంకొంచెం సేపు పడుకున్నా అంతే.... పిల్లలు ఏరి...ఎక్కడా అలికిడి లేదు... అన్నాడు... ఆ కిటికీ లోంచి చూడండి మీకే తెలుస్తుంది... అంది..
.. లాను లో అందరూ క్రికెట్ ఆడుతున్నారు... సంతోష మేసింది... నాన్న గారిలో ఈ మార్పు చాలా ఆనందం గా ఉంది అన్నాడు.... అవునండి.... అంతా కల లా ఉంది... అంది లక్ష్మీ...సరే నువ్వు కాఫీ తీసుకుని రా నేను తయారు అవుతాను అంటూ లేచి వెళ్ళాడు...
పిల్లలూ టిఫిన్ రెడి తినేసి అడుకోండి... అంటూ పిలిచింది శాంత.... ఇంకాసేపు ఆడుకుని వస్తాము నానమ్మ అన్నారు.... ఇవాళ సెలవే కదా... తినేసి అడుకోండి అంటూ లోపలికి తీసుకుని వచ్చాడు మూర్తి... అందరూ కలిసే టిఫిన్ చేశారు... చాలా ఆనందం గా ఉంది.. ఇదేగా నా మనసులో ఉన్నది... అనవసరంగా ఇన్నాళ్లు వేస్ట్ చేసాను... అనుకున్నాడు...
రండి తాతయ్యా ఆడదాం అంటూ బాట్ పట్టుకుని వచ్చాడు...ఇప్పుడు ఫుల్ గా
తినేసా రా నా వల్ల కాదు...మీరు వెళ్లి ఆడుకోండి... అంటూ పంపించారు...శాంత సంతోషం లో చాలారకాలు చేసింది... అందరూ హాయి గా కలిసి భోజనాలు చేశారు... ఇక నించి మనం రాత్రి కలిసే భోజనం చేయాలి అలాగే ఆదివారం కూడా...ఇది నా ఆర్డర్ కాదు రిక్వెస్ట్...అన్నాడు...అలాగే ..ఎంత పని ఉన్నా ఆ టైం కి వచేస్తా ...మీరు చెప్పినట్లే చేద్దాం అన్నాడు...
అమ్మా లక్ష్మీ మనం రేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ ఉంది... నువ్వు రావాలి...ఎప్పుడు నేను ఒక్కదాన్నే వస్తావు.కోడలిని తీసుకుని రావు అంటారు వాళ్ళు....అంది... అలాగే అత్తయ్య అంది...
ఏమి అక్కరలేదు... ఎప్పటి లాగే నువ్వు ఒక్కదానివే వెళ్ళు... అన్నాడు మూర్తి... ఆదేమిటీ అంది....చెప్పాను గా నువ్వు వెళ్ళు... అన్నాడు...
ఆరోజు సాయంత్రం...అమ్మా లక్ష్మీ కొంచెం కాఫీ తీసుకుని రా...అన్నాడు మూర్తి...అలాగే అంటూ వెళ్ళింది.. ఈ లోగా గేట్ చప్పుడు అయ్యింది..ఎవరో వచ్చారు చూడండి అన్నాడు....ఎవరో మీకోసమే ఆట..అంది శాంత ..
రమ్మను... అతనికోసమే చూస్తున్నాను అన్నాడు...
నమస్తే సర్... జగదీష్ గారు పంపారు... ఈ కవర్ మీకు ఇమ్మన్నారు....అన్నాడు...థాంక్స్... కూర్చో బాబు..అన్నాడు...కాఫీ వచ్చింది...అతనికి ఇవ్వు అమ్మా అన్నాడు...ఈమె నా కోడలు లక్ష్మీ... అంటూ చెప్పాడు ...నమస్తే పెట్టి లోపలికి వెళ్లిపోయింది.... కాఫీ తాగేసి మరి నేను వస్తా సారు... అంటూ వెళ్ళిపోయాడు....లక్ష్మీ ఇలా రా ఒకసారి అంటూ పిలిచాడు....వచ్చింది....
ఇదుగో ఈ కవర్ నీ కోసమే... చదువు...
నీకు ఇష్టమైతే నే ...అన్నాడు.ఆమె..కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి ఆనందం తో...తాను అప్లై చేసిన జాబ్....ప్రాజెక్ట్ మేనేజర్ . పోస్ట్...నెలకి లక్ష రూపాయల శాలరీ....
థాంక్స్ మామయ్య గారు అంటూ కాళ్ళకి దణ్డం పెట్టింది...
అయ్యో అలాటివి వద్దు....ఇన్నాళ్లు మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో ...తెలియక నేను ఇచ్చేదే సంతోషాన్ని ఇస్తుంది అన్న భ్రమ లో ఉన్నాను....నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది..ఆల్ ది బెస్ట్ అంటూ ఆశీర్వదించారు....ఆ లెటర్ అత్త గారికి చూపించి...కౌగలించుకొని మురిసిపోయింది.అయితే రేపటి నుంచి నీకు కూడా కాఫీ నేనె కలపాలి అన్న మాట...అంది... నవ్వుతూ...ఊరికే అన్నాను...జాగ్రత్తగా ఉద్యోగం చేసుకో...ఎప్పుడూ సంతోషం గా ఉండు అని ఆశీర్వదించారు..
ఆ మరునాడు కొడుక్కి ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్పే సాడు... ఇకనుంచి ఈ కంపెనీ కి సంభందించిన నిర్ణయం నువ్వే తీసుకో...
కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో...నిన్ను నమ్ముకుని ఇంతమంది ఉద్యోగులు వాళ్ల కుటుంబాలు ఉన్నాయి..
నిర్ణయాలు తీసుకునే ఆప్పుడు...ఈ విషయం గుర్తు పెట్టు కుని జాగ్రత్త గా తీసుకో.. అని చెప్పాడు... అలాగే నాన్న గారు అంటూ కాళ్ళకి దండం పెట్టాడు...
ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది...అందరూ నా వలన సంతోషం గా ఉన్నారు... అప్ప టినుంచి...ఆ ఇల్లు సంతోషాలతో నిండిపోయింది...
మన అనుకునే వాళ్ళని,మనల్ని ప్రేమించే
వాళ్ళని సంతోషం గా ఉంచడమే "అందమైన జీవితం" అనుకున్నాడు...మూర్తి...
ఇన్ని సంతోషాలకి దారి చూపించి న రాఘవ కి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని...
ఆనందం గా ఇంటికి బయలుదేరాడు....
శుభం...
(ఇది కేవలం కల్పితం.... కథ)