చక్రి ఆ రోజు ఆలస్యంగా వచ్చాడు.
పైగా వర్షం పడుతోంది.
బెల్ కొట్టగానే ..
మధు వచ్చి తలుపు తీసింది...
అయ్యో తడిసి పోయారు...
ఉండండి తువ్వాలు తీసుకుని వస్తాను అంటూ చేతిలోని బాగ్ తీసుకుని
లోపల పెట్టి గబగబా తువ్వాలు తీసుకుని ఇచ్చింది...
తుడుచుకుంటూ సోఫాలో కూర్చున్నాడు... ఇంతలో వాళ్ళ నాన్నగారు గదిలోనుంచి బైటకి వచ్చారు...
ఎరా అబ్బాయి ఇంత ఆలస్యం అయింది.. ఆఫీసు లో పని ఎక్కువగా ఉందా...అని వచ్చి తాను కూడా ఇంకో కుర్చీ లో కూర్చున్నారు...
ఇదిగోనండి వేడి గా కాస్త టీ తాగండి అంటూ ఇచ్చింది మధు...
మామయ్య గారు మీకు ఇమ్మంటారా అని అడిగింది..
వద్దు అమ్మా...అన్నారు.
టీ తాగేసి రిఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్ళాడు చక్రి.
ఇవాళ భోజనము లోకి ఏమి చేస్తున్నావ్...అమ్మా.. అని అడిగారు... ఇవాళ శనివారం కదా అని పూరీ కుర్మా చేయమన్నారు అత్తయ్యగారు అంది...
ఏమిటి మీ అత్తగారు ...చెప్పారా...
నిజం గానే ...మళ్ళీ నూని సరుకు కొలెస్ట్రాల్ అంటూ క్లాస్ పీకుటుంది...
నువ్వు సరిగ్గానే విన్నావా అంటూ నవ్వుతూ అడిగారు....
అంత వెటకారం అక్కరలేదు...
నేనె చెప్పాను...60 ఏళ్ళు వచ్చాయి...
కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెపుతాను కానీ మీకు ఏమి చేయ కుండానే జరిగిందా ఇన్నాళ్లు అంటూ వచ్చి సోఫాలో కూర్చుంది...
ఇప్పుడు నేనెమన్నానని అలా విరుచుకుపడతావు...
మొన్న అడిగితే వద్దన్నావు కదా ...
ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నావ్ అని ఆలోచిస్తున్నా అంతే... అన్నారు...నవ్వుతూ....
మొన్న వద్దన్నాను కనుకనే ,
మనసొప్పక మళ్ళీ ఇవాళ చేయ మన్నాను.. అంది.
నాకు తెలుసు ..
నువ్వు కొబ్బరికాయ లాంటి దానివి.... పైకి గట్టి గా ఉన్నా...లోపల తీయగా ఉంటావు...అన్నాడు.
ఈ పొగడ్త లకేమి తక్కువలేదు....అంటూ వంటింట్లోకి వెళ్ళింది...
పిండి కలుపుతోంది..మధు...
నువ్వు పిండి కలిపి అక్కడ పెట్టెయ్... నేను పూరీలు వత్తె స్తాను...అంది..
సరే అండీ.. అంది...
కూర కూడా చేసేసాను అండీ...అంది...
సరే నువ్వు వెళ్ళు..
ఇంకా టైం ఉందిగా... తినే ముందు చేద్దాం... అంది..
అలాగే అత్తయ్య గారూ అంటూ లోపలికి వెళ్ళింది...
చక్రి ఫ్రెష్ అయి తన labtop లో ఏదో చూసుకుంటున్నాడు...
ఏమండీ అని పిలిచింది...
ఆ చెప్పు అన్నాడు..
అదే నేను చెప్పిన విషయం ఏం చేశారు అని అడిగింది ..
ఏమి విషయం అన్నాడు..
అదే నండి...హాండ్ క్రాఫ్ట్స్...online ..లో మార్కెట్ చేసే బిసినెస్ గురించి మీకు చెప్పానుగా...
నా క్లాస్ మేట్స్ ముగ్గురం కలిసి ప్లాన్ చేస్తున్నామని..
దాని గురించి...
కానీ దానికి బోలెడు ఇన్వెస్ట్మెంట్ కావాలి గా నా దగ్గర అంత లేదు...
కానీ ఇంకో విషయం అమ్మ నన్న లకి చెప్పి ఒప్పించాలి...
వాళ్ళు అసలే పాతకాలం మనుషులు... ఆడవాళ్లు ఇంట్లో ఉండాలి మగ వాళ్ళు ఉద్యోగం చేయాలి అంటారు..
డబ్బు గురించి ఆలోచన లేదు..
మా వాళ్ళు చూసుకుంటున్నారు.. అత్తయ్య ,మామయ్య గారిని మీరే ఎలాగైనా వప్పించాలి...అంది మధు...
ఆ విషయం మీరు కొంచెం చెప్పాలి... మరి..
ఈ రోజులలో ఆడ, మగ అని ఏముంది అందరూ కష్టపడుతున్నారు... విజయాలు సాధిస్తున్నారు...
సరేలే నేను మాట్లాడతాను...
మరి ఇంటిపని అటు ఆఫీస్ రెండు మేనేజ్ చేయగలవా.. అని అడిగాడు...
ఏమి పరవాలేదు.. నాది క్రియేటివ్ వర్క్ .సాయంత్రం 4 గంటలకి అయిపోతుంది... మిగతాది వాళ్ళు చూసుకుంటారు...అంది .
ఇంతలో మధు అని పిలిచింది అత్తగారు..
ఆ వస్తున్నా అండీ అని వంటింట్లోకి వచ్చింది...
ఆ మరునాడు ఆదివారం ఇంట్లోనే ఉన్నాడు చక్రి...
టిఫిన్ లు అయ్యాక..
.అమ్మ నాన్న మీతో కొంచెం మాట్లాడాలి... అన్నాడు చక్రి...
చెప్పరా అబ్బాయి ఏమిటి సంగతి... ఏమైనా విశేషామా..అని అడిగారు రావు గారు..
ఉరుకోండి నాన్న...విషయం అది కాదు అన్నాడు..
మీ ఇద్దరికి పెళ్లి చేసేసాం...
ఇంకా ఈ వయసు లో మేము కోరుకునేది మనవలనే కదరా....
తొందరగా ఎవరో ఒకరిని మా చేతిలో పెట్టేస్తే....
మాకు ఆనందం .కాలక్షేపం..అన్నారు...
మాకు పెళ్లి అయ్యి ఇంకా సంవత్సరం అయ్యింది కదా...
ఇంకా కొంచెం సెటిల్ అయితే ...బాగుంటుంది అని ...అన్నాడు చక్రి....
అలా అంటే ఎలా రా ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరిగితే నే బాగుంటుంది... అన్నారు వాళ్ళ అమ్మ గారు.
అది సరేలే అమ్మా...
ఇప్పుడు ఆ టాపిక్ కాదు...
మీ కోడలు చదువు కుంది కదా ,
తాను కూడా ఏదో బిసినెస్ చేస్తాను అంటోంది..
ఆ విషయం మీద మిమ్మలిని ఒప్పించి చేద్దామని అనుకున్నాను అన్నాడు..
అయ్యో రామ మన ఇంటా వంటా ఉందా.
ఆడవాళ్లు ఉద్యోగం అంటూ తిరిగితే ఇల్లు ఎవరు చూసు కుంటారు...
బుద్ది గా సంసారం అది చూసుకుంటూ ఇల్లు చక్క బెట్టుకుంటే..
అదే పదివేలు... అంది...
ఈ వ్యాపారాలు ఉద్యోగాలు ఏమి వద్దు అనేసింది..
మధు గుండెలో రాయి పడింది...అనుకున్నతా అయ్యింది అనుకుంది...
రాజ్యం ఈ రోజుల లో ఆడవాళ్లు కూడా బాగా చదువుకుంటున్నారు కదా ..
వాళ్ళు కూడా మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు.... అమ్మాయి కూడా చదువు కుంది కదా..
.ఏదో సరదా పడుతోంది , కొన్నాళ్ళు చేయనివ్వు...
తరువాత వీలు కానప్పుడు చూద్దాం... అప్పుడు ...అన్నారు రావు గారు...
మికేమీ తెలియదు ..
.ఇలా కోడలు బైట తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు..
మన పరువు గురించి కొంచమైనా ఆలోచించారా అంది...
ఎరా ఏమి మాట్లాడవు.. అంది రాజ్యం...
మిమ్మలిని ఎదిరించి ఈ పని చేయలేను...
ఒప్పించి చేద్దామని అనుకుంటున్నా అందుకే ఈ విషయం మీ దగ్గర ప్రస్తావించా...
మీరు ఏమంటే అదే నా నిర్ణయం..
అన్నాడు చక్రి...
చూసావా రాజ్యం..
వాళ్ళ సంస్కారం...వాడు మనల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు...
కానీ ఎదిరించట్లేదు....
ఈ రోజుల్లో.. చాలా మంది ఎలా ఉంటున్నారు...
తల్లిదండ్రులకు కొంచం కూడా విలువ ఇవ్వట్లేదు...
అమ్మాయి కూడా మౌనం గానే ఉంది...
అబ్బాయి మాట్లాడుతున్నాడు...
అన్నారు రావు గారు....
అమ్మ ఈ రోజుల్లో మనం ఏమి చేస్తున్నాము అని ఆలోచించే అంత ఖాళీ ఎవరికీ ఉండదు..
" ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో నని.."
అన్నది మన అభిప్రాయం మాత్రమే...
ఇంత కష్టపడి చదువు కుంది...
చిన్నప్పుడు వాళ్ళ తల్లి తండ్రులు ఎన్ని కలలు కాని ఉంటారో కదా..
పెళ్లి పేరుతో...
ఇలా కట్టుబాట్లు.. పెట్టి
వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లి...
ఆశయాలకి అడ్డు పడితే.. ఎలా..
మనం ఈ కట్టుబాట్లు సంకెళ్లు తెంచి..
స్వేచ్ఛ తో ,స్వచ్ఛమైన వాతావరణం కల్పించి చూద్దాం....
ఎంతటి విజయం సాధిస్తారో...చూడు.... ఒప్పుకో అమ్మా... అన్నాడు చక్రి...
ఒప్పుకో రాజ్యం అన్నారు రావు గారు...
ఒకసారి మధు వైపు చూసింది రాజ్యం...
తన కళ్ళలో ఏదో ఆశ...ఒప్పుకుంటే బాగుండును అని...
అత్తయ్యగారు.. మీరు మనస్ఫూర్తిగా ఒప్ఫకుంటే నే నండి..లేదంటే లేదు...
పెద్దల్ని ఎదిరించి.. మేము ఏమి చేయాలని అనుకోవడం లేదు...
అలా ఎన్నటికీ జరగదు కూడా...అంది వినయం గా...యెంత మంచి పిల్ల అంత చదువుకున్నా ఎంత మర్యాదగా మాట్లాడింది... ఏడాది బట్టి చూస్తున్నా.ఎప్పుడూ పొగరు గా మాట్లాడలేదు.. ఇలాటి పిల్ల ఆశల్ని... మేముకాక ఎవరు తీరుస్తారు... అనుకుంది... రాజ్యం...
తన ముఖం లో చిన్న చిరునవ్వు..వెలిసింది...
ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళింది... అత్తయ్య గారు ఒప్పు కుంటారా మమయ్యగారు అంది మధు...
ఏమో నమ్మా మొండిది...
తాను అనుకున్నదే జరగాలని అనుకుంటుంది....నాకైతే ఏమీ
అభ్యంతరం లేదు...
అది ఒప్పుకోక పోతే నేను ఏమి చేయలేను అన్నారు.. రావు గారు...
అంతే లెండి ఏమి చేస్తాం అంది...
ఈ లోగా పెట్టి తో బైటకి వచ్చింది.... రాజ్యం...
ఏమిటి రాజ్యం ఈ పెట్టి... అని అడిగారు రావు గారు...
ఉండండి చెపుతా...
అమ్మా మధు ఇలా రా...అంది
భయం గానే దగ్గరకి వెళ్ళింది...
పెట్టి ఓపెన్ చేసి ఇందులో నా నగలు ఉన్నాయి...
వాటిని తాకట్టు పెట్టి..నీ వ్యాపారానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేసుకో...
వాడి సంపాదన అంతంత మాత్రం...
ఇబ్బంది పెట్టకు.. అంది..రాజ్యం..
అమ్మా అంటూ కౌగలించు కున్నాడు చక్రి... థాంక్స్ అత్తయ్య గారు అంటూ ఆవిడ చేతులు పట్టుకుంది కృతజ్ఞతతో...
రావు గారు గర్వం గా రాజ్యం ...నువ్వు మారిపోయావ్.. అంటూ గర్వంగా చూసారు...
కానీ అత్తయ్య గారు మీరు ఒప్పుకున్నారు అది చాలు ఇవి వద్దు...
కొత్తగా వ్యాపారం పెట్టె వాళ్ళ కి బోలెడు ప్రోత్సాహకాలు ఉన్నాయి...
బ్యాక్ లు లోన్ ఇస్తున్నాయి...
అవి అన్ని నేను చూసుకుంటా...అంది..
.మీ ఇద్దరి సంతోషం కన్నా మాకు ఏమి కావాలి....
కానీ " డబ్బు వెనుక పరిగెడుతూ...విలువలు..భాద్యతలు మరచిపోవద్దు..."
అంది... తప్పకుండా అత్తయ్యగారు అంటూ కాళ్ళకి నమస్కారం పెట్టింది...
రావు గారే తన గ్యారంటీ తో బాంక్ లోన్ ఇప్పించి ...కోడలికి ప్రోత్సాహాఁ ఇచ్చారు....
అమ్మా మధు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే.
.. " బిసినెస్ లో పార్టనర్స్... వద్దు...ఎంత మందికి అయినా ఉద్యోగాలు ఇవ్వు."
.. నీకు కావలిసిన ఆర్ధిక వనరులు నేను ఏర్పాటు చేస్తాను అన్నారు రావు గారు..
ఇది నా అభిప్రాయం మాత్రమే... నిర్ణయం నీ ఇష్టం ...అన్నారు .
మీ ఇష్టం మమయ్యగారు అలాగే చేద్దాం అంది...
ఒరేయ్ చక్రి నీ సహాయం ప్రోత్సాహం చాలా అవసరం అమ్మాయికి....
ఇక నుంచి నీ ఉద్యోగమే కాదు,
అమ్మాయికి సహాయం చేయాలి కూడా అన్నారు రావు గారు...
తప్పకుండా నాన్న గారు... అన్నాడు...
.అలా మొదలై అంచెలు అంచెల గా ఎదిగి చాలా పెద్ద కంపెనీ అయింది...
ఆన్లైన్ మార్కెటింగ్ లో కోట్లలో turnover సాధించింది మధు...
ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చింది....
చక్రి కూడా ఉద్యోగం మానేసి తన భార్య కి తోడుగా ఉంటూ ఆఫీసు చూసుకుంటున్నాడు...
ఎంత ఎదిగినా, మధు లో అదే నిరాడంబరత...నిబద్ధత....అచ్చ తెలుగు చీరకట్టు... చాలా సింపుల్ గా ఉంటుంది... తాను డిజైన్ చేసిన చీరలు చాలా ప్రాచుర్యం పొంది మంచి సేల్స్ తీసుకుని వచ్చాయి... కొన్నాళ్ళకి రాజ్యం గారి స్నేహితురాలు వనజ వాళ్ల ఇంటికి వచ్చింది...
పెళ్లికి పివడానికి....వచ్చింది...
రావే వనజా చాలా కాలం అయ్యింది ...అంటూ సాదరంగా ఆహ్వానించారు రాజ్యం...
అబ్బాయి పెళ్లి.. కుదిరింది... మీరందరు తప్పక రావాలి ...
ఆయన బంధువులు ని పిలవడానికి ఊరు వెళ్లారు...
నేను స్నేహితులని పిలవడానికి ఇలా బయలు దేరాను..అంది..
.శుభం....అందరం తప్పక వస్తాం ...
అమ్మాయి మధు కాఫీ తీసుకుని రా
నా స్నేహితురాలు వచ్చింది..
ఇదిగో అత్తయ్యగారు వస్తున్నా అంటూ కాఫీ తో వచ్చింది....
మా కోడలు అంటూ
పరిచయ ము చేసింది...నమస్తే అండీ... అంది మధు...నమస్తే అమ్మా..
.నువ్వు మీ ఆయన తప్పక రావాలి..
.పెద్ద వాళ్ళు కనక మీ మావగారి పేరు రాసేసాను... అంది..
.భలే వారండి... మీరు అలాగే రాయాలి... వాళ్ళు మా పెద్ద వాళ్ళు..
.వాళ్ళని పిలిస్తే మమ్మలిని పిలిచినట్టే....అంది...
ఇంత సింపుల్ గా ఉంది...
పల్లెటూరి పిల్లా ఏమిటి అంది ఆవిడ..కొంచెం వెటకారం గా ..
.కాదులె..పట్నం పిల్లే కానీ సింపుల్ గా ఉంటుంది...
ఖాళీ కప్ తీసుకుని లోపలకి వెళ్ళి పోయింది మధు....
మరి నేను వెళ్లి వస్తా ఇంకా చాలా మందిని పిలవాలి..అంటూ వెళ్లి పోయింది..
అమ్మా మధు దాని మాటలు పట్టించుకోక...అలాగే వాగుతుంది..
గొప్పలు ఎక్కువ....అంది...
అలాంటి ది ఏమి లేదు అత్తయ్యగారు అంది...నిజం గా మా కోడలు బంగారం అనుకుంది రాజ్యం.
అందరూ పెళ్లి లో కలిశారు....రా రా రాజ్యం...అంటూ ఆహ్వానం పలికింది ...
మధు ని చూసి..
మాకు కాబోయే కోడలు ...ఇంజినీరింగ్ చేసింది...తెలుసా...అంది గొప్పగా...
అలాగా అన్నారు రాజ్యం గారు..
తాను ఆవిడకన్నా గొప్ప సంభంధం చేసుకుంటున్నాను అని తాపత్రయం.. కనిపిస్తోంది....
ఇంక మా కోడలు ఉద్యోగం చేస్తోంది ....
అసలు ఖాళీ ఉండదు ట....అంది...
చక్రి కి ఒళ్ళు మండు తోంది...
మధు అందరి తో నవ్వుతూ మాట్లాడు తోంది....
రాజ్యం గారికి కూడా కొంచెం ఇబ్బంది గానే ఉంది...కానీ సహనం వహిస్తోంది..
ఇంతలో చక్రి వచ్చి...అమ్మ ఈ సొంత డబ్బా ఏమిటి బాబు...అన్నాడు..
.నీ కో విషయం తెలుసా ...ఆవిడకట్టు కున్న చీర...మధు డిజైన్ చేసినదే...అన్నాడు....
ఈ చీర ఎక్కడ కొన్నవే చాలా బాగుంది...అంది...
ఇదా ప్రత్యేకం గా తెప్పించాను...
చాలా ఖరీదైన ది....మా లాంటి హై క్లాస్ వాళ్ళు అందరూ వాడతారు..
నువ్వు వీటి గురించి వినలేదా అంది...
ఆ విన్నానులే...అంది..
ఇంతకీ మీ కోడలు డిగ్రీ అయిన చేసిందా....అంది....
పల్లెల్లో కాలేజీ లుండవు కదా...పెద్ద గా చదివి ఉండదు అనుకుంటా....అంది...
ఏదో
బీటెక్...ఎంబీఏ , చేసింది లే...
ఇప్పుడు నువ్వు కట్టుకున్న ఖరీదైన చీర ఉందికదా...
అది మా కోడలు డిజైన్ చేసినదే....
ఓహో RR fations...లో పని చేస్తోందా అని అడిగింది...
లేదు...ఆ కంపెనీ CEO...తను... R R అంటే ...Rao and Rajyam...అని అర్థము అంది ..రాజ్యం ...
అప్పుడు ఆవిడకి తెలిసొచ్చింది... నన్ను క్షమించవే.
..ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం లో నే గొప్పదనం ఉంది...అని అర్థం అయింది...
అంది...
రాజ్యం అక్కడ ఎవరితో నో మాట్లాడుతూ ఉన్న తన కోడలి వైపు అభిమానం గా చూసింది....
తాను ఆరోజు ఒప్పుకుని ఉండనట్లయి తే...ఈ రోజు ఇంతమంది కి ఉపాధి అవకాశాలు ఉండేవి కాదు...కదా...
ఆడది అబల కాదు సబల
...అవకాశం ,ప్రోత్సాహం ఇస్తే ఎంత ఎత్తుకైనా ఎదగ గలరు అని నిరూపించింది...అనుకుంది
శుభం..