విహారి....
సమయం ఉదయం 9 గంటలుఅవుతోంది.
అందరూ ఆఫీసులో తమ తమ సీట్లలో ఆసీనులవుతున్నారు.
అంతలో ఒక బెంజ్ కారు వచ్చి పోర్టికోలోఆగింది.
వాచ్ మాన్ గబగబా వచ్చి కారు డోర్ తీసి సెల్యూట్ చేసాడు ,
అందు లోంచి విహారి అతని స్నేహితుడు వినోద్ దిగారు.
ఆ బాగ్ ఇలా ఇవ్వు నేను పట్టుకువస్తాను అన్నాడు వినోద్.
ఇదిగో అంటూ ఇచ్చాడు .
ఇద్దరు లోపలికి వెళ్లారు అందరు
good morning చెపుతుంటే,
విష్ చేస్తు తన చాంబర్ లోకి అడుగు పెట్టాడు విహారి .
వినోద్ అతని చిన్ననాటి స్నేహితుడు
ఎంబీఏ చదివాడు.
ఈ రెండువిషయాలు దృష్టిలో ఉంచుకొని అతనికి తన
పి ఏ గా పోస్టింగ్ ఇచ్చాడు.
ఆఫీసులో పీఏ .
ఆఫీస్ గేట్ దాటితే మంచి స్నేహితులు గా మారిపోతారు .
ఇద్దరూ చాంబర్లో వున్నప్పుడు క్లోజ్ గానే వుంటారు .
ఇవాళ ప్రోగ్రామ్స్ ఏమిట్రా అంటూ తన సీట్ లో కూర్చున్నాడు.
ఉదయం 10 .30 నుంచి 11.30 వరకు ఇంటర్వూస్ ఉన్నాయి.
ఆ తరువాత మన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి 12 గంటలకు ప్రెస్ మీటింగు1.30
లంచ్ విత్ delegates. 2.30 నుంచి వాళ్ళతో మీటింగ్. కొత్త టెండర్ల ఫైనలైజ్ చెయ్యాలి .
అది సంగతి అన్నాడు వినోద్.
ఇంటర్వ్యూ కి ఇవాళ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అని అడిగాడు విహారి .
ప్రైమరీ లెవెల్ ఇంటర్వ్యూస్ జనరల్ మేనేజర్ చేసేశారు.
ఫిల్టర్ చేయగా 10 మంది మిగిలారు .
వాళ్లలో మనము ఫైనలైజ్ చెయ్యాలి .
సరే ముందు కాఫీ చెప్పు .
వాళ్ళు వచ్చేస్తే మనం మొదలు పెడదాం అంటూ అప్లికేషన్ ఫైల్ చూడటం మొదలు పెట్టాడు.
ఇంక మొదలు పెడదామా, అంటూ
ఒకొక్క రిని లోపలకి పంపించ మని
ఇంటర్ కం లో చెప్పాడు.
ఇంటర్వ్యూ లు మొదలు అయ్యాయి .
వినోద్ చేస్తున్నాడు.
విహారి మధ్య లో కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు.
అందరిని ఇంటర్వ్యూ అయ్యాక బైట వెయిట్ చేయమని చెపుతున్నాడు.
మూడో అభ్యర్థి ....సుహాసిని ని లొపలికి పంపించారు.
లోపలకి రాగానే ఒకసారి పరిశీలనగా చూసాడు విహారి.
మధ్య తరగతి కుటుంబం.
బాగా చదివిన వర్ఛస్సు కనిపిస్తోంది.
తాను కష్టాలలో ఉన్నట్టు , ఈ ఉద్యోగం తనకి ఎలాగైనా రావాలని భావన ఆమె ముఖం లో కనిపిస్తోంది.
ఆమెని ఎక్కడో చూసినట్లు ఫీలింగ్.
ఆమె లోపలికి రాగానే మనసులో ఏదో అనుభూతి.
గుండె వేగం పెరిగింది...
తెలియని ఆనందం ఆమె ముఖం చూడగానే అనిపిస్తుంది...
ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది... అనుకున్నాడు విహారి...
పదేళ్ల క్రితం చదువులకు విదేశాలు వెళ్లి ఈమధ్యే వచ్చాను.
ఈమధ్య కాలం లో అయితే పరిచయం ప్రసక్తే లేదు... మరి ఎక్కడ చూసాను అబ్బా అనుకుంటున్నాడు విహారి...
మనసుకి తెలుస్తోంది బాగా కావలిసిన
వ్యక్తి గా...
కానీ ఎక్కడ పరిచయమో తెలియట్లేదు... అయినా కొంత మంది అంతే....
వాళ్ళ ఆహార్యం చూస్తే అలాగే
అనిపిస్తుంది.. లే ..
అనుకుని ఇంటర్వ్యూ పూర్తి చేసి బైట వెయిట్ చేయమన్నాడు...
ఏది ఆ బయో డేటా ఒకసారి
ఇలాగ ఇవ్వు అన్నాడు.
వినోద్ ఇచ్చాడు
పేరు , అర్హత అన్ని చూస్తూ ఒక చోట ఆగిపోయాడు..
డాటర్ ఆఫ్ రాఘవ రావు...రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని ఉంది..
అప్పుడు గుర్తుకు వచ్చింది...రాఘవరావు మాస్టారు...
చిన్నప్పుడు చదువులో వెనుక పడితే ఆయనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చెప్పేవారు.. ఆ తరువాత అన్నీ మంచి మార్కులతో పాస్ అయ్యేను.
మంచి ప్రోత్సాహం ఇచ్చేవారు.. ఆ తరువాత మళ్ళీ వెనుకకు తిరిగి చూసుకోలేదు...
కాలేజీ లో చేరినా ఆయనని అప్పుడప్పుడు కలిసి సలహాలు తీసుకుంటూ ఉండే వాడిని...
ఒకరకం గా పై చదువులకు అమెరికా వెళ్ళను అంటే , ఆయనే ప్రోత్సహించి పంపేరు.
ఆయన మాటలు ఇప్పటికి మర్చిపోలేదు...
" నీకు అవకాశం ఉంది. బాగా చదువుకుంటే ఇంకో పది మందికి ఉద్యోగాలు ఇచ్చే సామర్ధ్య ము వస్తుంది...
ఆస్తమాను నీ కోసమేనా , కొంచెం సమాజం శ్రేయస్సు కోసం కూడా ఆలోచించాలి కదామరి " ...
అని నచ్చ చెప్పారు...
ఆ మాటలు నన్ను ఆలోచింప చేశాయి..
అంతే మారు మాట్లాడకుండా
నాన్న గారి కోరిక ప్రకారం విదేశాలు వెళ్లి బాగా చదువుకుని ..ఇక్కడికి వచ్చి ఈ ఫ్యాక్టరీ పెట్టి అంతమంది కి ఉపాధి కల్పించే అవకాశం వచ్చింది..
నేను ఈ రోజు ఈ స్థాయి లో ఉన్నాను అంటే ఆయన నాకు చూపించిన మార్గమే... అనుకున్నాడు...
ఇండియా వచ్చిన తరువాత ఆ ఊరు వెళ్ళి.. కలుద్దామని ప్రయత్నాలు చేశాను.. కానీ ఆయన అప్పటికే రిటైర్ అయ్యి...వేరే ఊరు వెళ్లిపోయారని తెలిసింది...
ఎలాగైనా ఆ అడ్రెస్ పట్టుకోవాలని..ప్రయత్నాలు చేసినా దొరకలేదు...
తరువాత ఫేక్టరీ హడావిడి లో ఆ విషయం మరచి పోయాను...
మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన ఆచూకీ తెలిసింది...
ఒరేయ్ వినోద్ ఆ సుహాసిని ని ఒక సారి పిలిపించు...అన్నాడు..
సరే అంటూ ఇంటర్కం లో చెప్పాడు... తాను మళ్ళీ లోపలికి వచ్చింది..
రండి కూర్చోండి.. అన్నాడు విహారి.. రాఘవరావు గారు అంటే ..
విలేజ్ లో స్కూల్ హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు ఆయనే గా..అని అడిగాడు...
అవునండీ... మా నాన్నగారు మీకు తెలుసా...అని అడిగింది.
అవును బాగా తెలుసు... ఆయన
ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అని అడిగాడు...విహారి
ఈ ఊరిలో నే ఉంటున్నాం..అంది ...
ఒకప్పుడు నేను ఆయన స్టూడెంట్..అన్నాడు విహారి
వృధ్యాప్యం కదా ఇంట్లోనే
ఉంటు న్నారు.. అంది..
నన్ను గుర్తు పట్టారా అని అడిగాడు..
.క్షమించండి.. చాలామంది స్టూడెంట్స్ కదా .
గుర్తు పట్టలేక పోయాను...అంది..
నిజమే లెండి అది పాయింటే...అన్నాడు.
మా నాన్న గారు మీకు తెలుసు అంటున్నారు..
వీలుంటే ఈ ఉద్యోగం నాకు ఇప్పించండి... ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నాము...
అది మీకు నా qualification సరిపోతే... కొంచం ప్రాధాన్యం ఇమ్మని అడుగుతున్నా...
ఇలా అడగడం తప్పు అని తెలుసు...
కానీ పరిస్థితులు ...ఆడిగేలా చేశాయి..
కష్టపడి పనిచేస్తాను...అంది వినమ్రంగా...
అయ్యో అంతలా అడగాలా...
మీ నాన్న గారు మంచితనం,
నాకు తెలుసు... ఎంతో మందిలో స్ఫూర్తి నింపి అభివృద్ధి లోకి వచ్చేలా చేశారు..
అందులో నేనూ ఒకడిని...
ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు ప్రాధాన్యం ఇస్తాను... సరేనా ..
ఇంక మీరు వెళ్లొచ్చు...
మీ నాన్నగారి ని ఆడిగానని నమస్కారములు చెప్పు...
నేనె స్వయం గా వచ్చి కలుస్తానని చెప్పు అన్నాడు...
అలాగే అండి అంటూ..బైటకి వచ్చింది...
ఒరేయ్ వినోద్ ఆ అమ్మాయిని కార్ లో ఇంటిదగ్గర దిగపెట్టి రమ్మను మన డ్రైవర్ ని.
మనకి అడ్రెస్ తెలుస్తుంది అన్నాడు...
అలాగే కారులో ఉన్న ఫ్రూట్ బాస్కెట్ కూడా పంపు.. మాస్టారు గారికి... అన్నాడు విహారి.
అలాగే అంటూ బైటకి వచ్చి...
సుహాసిని గారు ఒక్క నిమిషం,
నాతో రండి అంటూ తనతో తీసుకుని వెళ్ళాడు...
డ్రైవర్ ని పిలిచి అమ్మాయి గారి ని
వారి ఇంటి దగ్గర దిగపెట్టి రా...
కారులో ఫ్రూట్ బాస్కెట్ ఉంది ...
నువ్వే వాళ్ళ ఇంటిలో పెట్టి రా.
రేపు బాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి..అన్నారు.
ఇల్లు అడ్రస్ సరిగ్గా చూసి రా...
అని చెప్పాడు..
అలాగే సార్ అన్నాడు డ్రైవర్...
ఇప్పుడు ఎందుకు.. అండి నేను బస్ లో వెడతాను అంది...
అంత తెలిసిన వారైనా ,
ఆలోచించి అవకాశం ఉంటే ఇస్తాను అన్నాడు అంటే ..
ఈ ఉద్యోగం చాన్సు లు తక్కువే... అనుకుని
నిరాశ గా నాకు అలవాటే అండి ఎన్నో ఇంటర్వ్యూ లు చూస్తున్నా...పరవాలేదు బస్ లో వెళ్ళిపోతాను అంది..
మావాడి సంగతి మీకు పూర్తి గా తెలియదు...
చిన్నప్పుడు వాడితో కలిసి చదువుకున్నా అని ..
వాడి తో కలిసి తిరిగి ఫ్రెండ్ అయినందుకు... ఇండియా రాగానే నన్ను పిలిచి మరీ,
తన సెక్రెటరీ గా పెట్టుకున్నాడు..
అలాంటిది మిమ్మలిని వదిలేస్తాడా... నిజానికి
మేము మీ అడ్రెస్ గురించి చాల కాలం గా వెదుకుతున్నాం...కానీ దొరకలేదు..
అదృష్టం కొద్దీ ఇవాళ మీరే ఇంటర్వ్యూ కి వచ్చారు...
మా వాడు ఎవరి ని అంత తొందరగా మరచి పోడు అండి...
పైగా మాస్టర్ గారి అమ్మాయి ..మీరు... నిరాశ పడకండి..
అంతా మంచే జరుగుతుంది... అన్నాడు వినోద్.
రేపు మాస్టర్ గారిని కలవడానికి తన ప్రోగ్రాంలు అన్ని క్యాన్సల్ చేసేసాడు...తెలుసా అన్నాడు...
మరి ఈ పళ్ళు అవి అంది...
భలే వారే ఇది మా ఆచారం కాదండి...
మా బాస్ ఆర్డర్..అన్నాడు..నవ్వుతూ...
కార్ వెళ్ళిపోయింది...
మళ్ళీ ఛాంబర్ లోకి వచ్చాడు...
ఇవాళ కొత్తగా కనిపిస్తున్నావ్..
ఎప్పుడూ ఇలా చేయలేదు నువ్వు...
ఏంటి బాస్ , ఏమిటి విషయం...అన్నాడు...
అవును రా...ఇన్నాళ్లు వెతికినా దొరకలేదు ఆయన అడ్రస్...
ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు దొరికింది ..
నేను వెతుకుతున్న మనిషి ఈయనే.. అన్నాడు..
ఎలాగైనా ఆయనని కలవాలనే నీ సంకల్పం ఆయన అడ్రస్ దొరికే లా చేసింది..
సరే మరి ఆ అమ్మాయికి అపోయింట్మెంట్ ఇచ్చేయనా.. అని అడిగాడు...
వద్దు... నేను చెపుతాను...
మిగతా ఇంటర్వ్యూ లు ఫినిష్ చేసి...
కావలిసిన వాళ్లకి లెటర్స్ తయారు చెయ్ అన్నాడు విహారి...
మరి ఆ అమ్మాయి అపోయింట్మెంట్ ఏమిటి చేద్దాం..అన్నాడు, వినోద్ .
రేపు ఫైనలైజ్ చేద్దాం..
ఇప్పుడు
నెక్స్ట్ అజండా లో కి వెళదాం అన్నాడు విహారి...
ఒకే...అంటూ కాన్ఫరెన్సు ఏర్పాట్లు చేయడానికి.. బైటకి వెళ్ళాడు...
విహారి కాస్త రిలాక్స్ గా చైర్ లో వెనక్కి వాలి..కళ్ళు మూసుకుని గతం లోకి వెళ్ళాడు...
ఆ రోజుల్లో...ఎంత బాగుండేది ఈ అమ్మాయి..
కుందనపు బొమ్మ లా ,
అచ్చ తెలుగు ఆడపిల్ల లా తెలుగు తనం ఉట్టి పడుతూ.. చూసే వారు ఎవరికైనా గౌరవ భావం ఏర్పడేలా ఉండేది...
మృదు స్వభావం..
బాగా చదువుకునేది...
ఎంతైనా మాస్టారు అమ్మాయి కదా బాగానే చదువుతుంది లే అనుకునే వాళ్ళం..
క్లాస్ లో తానే ఫస్ట్.. కానీ...
ఎప్పుడూ ఆ అహం ఉండేది కాదు...
తన ప్రవర్తనకు ఇష్టపడని వాళ్ళు ఉండరు... అలాగే నాక్కూడా..తనంటే ఇష్టం ఏర్పడింది...
కానీ చదువు కునే వయసు కదా అప్పుడు ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు..
ఇప్పుడు స్థిర పడిన తరువాత..
మనసుకి అనిపిస్తోంది..ఆ ఇష్టం ..ఇష్టం మాత్రమే కాదు...ప్రేమిస్తున్నానేమో అని అవును
ఆ ఇష్టం ఇప్పుడు ప్రేమగా మారింది..
అది నా గుండెకు తెలిసింది..
కానీ నాకు తెలియలేదు...
తాను ఎవరో తెలియదు ముందు... కానీ లోపలికి రాగానే .. తనని చూడగానే ఏదో ఉద్విగ్నత... ఒకరకమైన ఆనందం... మనసుకి ఏదో భావన... ఏర్పడ్డాయి...
ఇప్పుడు ఎవరో తెలిసిన తరువాత..
ఆ భావన బలపడింది...
అవును తనే నేను వెతుకుతున్న అమ్మాయి...
నా జీవిత భాగస్వామి...
కానీ నా ప్రపోజల్ కి తాను వప్పుకుంటుందా..
అసలే కష్టాలు అంటోంది..
భాద్యత ల మధ్య...ఇలాంటి విషయాలపై ప్రాధాన్యత ఇవ్వదు...
కానీ ఆ అమ్మాయి నా జీవిత భాగస్వామి అయితే ..
ఎంత అదృష్టం...
తనతో నా జీవితం సంతోషం గా ఉంటుంది ...
అయినా ఇప్పుడు ఎందుకు ఇలా ఉద్యోగానికి రావాల్సి వచ్చిందో... మరి ..
ఆయనికి ఒక కొడుకు ఉండాలి కదా..వాడేమి చేస్తున్నాడో...
తాను కూడా ఖాళీ గా ఉంటె తనకి ముందు జాబ్ ఇవ్వాలి...
అన్ని రేపు మాస్టారు గారి ఇంటికి వెళితే గాని తెలియదు...అనుకుంటూ ఉండగా ..
డోర్ తెరుచుకుని వినోద్ వచ్చాడు...
అంతా రెడి.. మీటింగ్ స్టార్ట్ చేయవచ్చు.. నీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు...
అంత వరకు కళ్ళు మూసుకుని ఉన్న విహారి,ఆలోచన లోనించి బైటకి వచ్చి,
ఒకసారి కళ్ళు తెరచి నవ్వుతూ పద అంటూ లేచాడు...
ఏంటి అన్నా... అంత దీర్ఘం గా ఆలోచిస్తున్నావు అంటే అది ఖచ్చితంగా ఆఫీస్ విషయం కాదు...
ఎందుకంటే
నువ్వు ఆఫీస్ కి సంబంధించిన ఎలాంటి నిర్ణయము అయినా ఇట్టే తీసుకుంటా వు..
నీ సామర్ధ్యం అలాంటిది.
ఇంతలా ఆలోచిస్తున్నావు అంటే...
ఇది ఖచ్చితంగా ఆ అమ్మాయి గురించే అయి ఉంటుంది...
నిజం చెప్పారా అన్నాడు..
నువ్వు నిజం గానే నా ఫ్రెండ్ వి రా...
నా మనసు ఇట్టే కనిపెట్టేస్తావు.
అవి అన్ని తరువాత మాట్లాడదాం...
అంటూ డోర్ హ్యాండిల్ మీద చేయి వేసాడు...
ఆగరా బాబు..
ఆ తలుపు దాటితే...నీలో బాస్ బైటకి వచ్చేస్తాడు....
ముందు చెప్పు.. నువ్వు ప్రేమించింది
ఆ అమ్మాయినే కదా...అన్నాడు...వినోద్..
అవును...ఈ విషయం నీతోనే మొదట చెప్పాను....ఎంతైనా ఫ్రెండ్ వి కదా ..ఈ విషయం లో నువ్వే హెల్ప్ చేయాలి... అన్నాడు...
కంగ్రాట్స్ రా ...తను నీకు కరెక్ట్ జోడి...
అందుకే నా ...సారు గారు
అపోయింట్మెంట్ లెటర్ ఆపుచేశారు... అన్నాడు వినోద్..
అవును కానీ తన మనసులో ఏముందో... తన పరిస్థితి ఏమిటో తెలియదు.. అడిగిన తరువాత కాదంటే ..మనసు కి బాధ గా ఉంటుంది... అందుకే ...ఆలోచిస్తున్నా..
ఆమె మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే..పెళ్లి....
లేక పోతే మన వేరే ఊరిలో ఉన్న బ్రాంచ్ కి మేనేజర్ గా వేసేయ్...ఇక్కడ చూస్తూ.. ఉండలేను.. అన్నాడు..విహారి
ఒరేయ్... నీ ఫ్రెండ్ ని నేను ఉండగా.. నీకు లోటు రానిస్తానా...
నీ పెళ్లి భాద్యత నాది.. ఇంకా ఆ విషయం నాకు వదిలేయ్...అన్నాడు...
సరే పద వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అంటూ మీటింగ్ హల్ కి బయలుదేరి వెళ్లారు.
*****
ఆ మరునాడు ఉదయం విహారి, వినోద్ మాస్టారు గారి ఇంటికి వెళ్లారు...బెల్ కోట్టగానే సుహాసిని ...తలుపు తీసింది.. గుడ్ మార్నింగ్ సుహాసిని గారూ...అంటూ పలకరించాడు వినోద్... రండి సర్ అంటూ లోపలికి ఆహ్వానించింది.. విహారి డ్రైవర్ కేసి తిరిగి చూసాడు... వెంటనే డ్రైవర్ ఫ్లవర్ బొకే తీసుకుని వచ్చి విహారి కి ఇచ్చాడు...అది తీసుకుని లోపలికి వచ్చారు.. మాస్టారు హాలులో పడక కుర్చీ లో కూర్చుని ఉన్నారు... నమస్తే మాస్టారు అంటూ .. బొకే ఇచ్చి, కాళ్ళకి దండం పెట్టాడు.
ఎవరు నాయనా నువ్వు... అంటూ అడిగారు కళ్ళజోడు సవరించు కుంటూ...
అదే నాన్నా నిన్న చెప్పాను కదా..
.నేనొక ఇంటర్వ్యూ కి వెళితే.. మీ స్టూడెంట్ అని చెప్పారు ఆయనే ఈ విహారి గారు...అంటూ పరిచయం చేసింది...
నేను మాస్టారు...మీ విహరిని...
నన్ను అమెరికా పై చదువులకు ఒప్పించి పంపించారు కదా...మీ మాట పై వెళ్ళాను...
బాగా చదువుకుని...ఇక్కడే ఫేక్టరీ పెట్టాను..
. మీరు ఆశీర్వదించి నట్లుగా ..
ఈ రోజు ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాను.... అన్నాడు విహారి...
ఆ ఆ...గుర్తుకు వచ్చావు...
వృధాప్యం కదా
వెంటనే గుర్తుకు రాలేదు.... చాలా సంతోషంగా ఉంది..నిన్ను చూస్తుంటే...
అమ్మాయి అబ్బాయి కి కాఫీ అది పట్టుకుని రా అన్నాడు...
ఆబ్బె ఇప్పుడు అవేమి వద్దండి...
ఇండియా కి రాగానే నేను మీ గురించి వాకబు చేశా...
కానీ అడ్రెస్ దొరకలేదు...
వీడు నా క్లాస్మేట్ వినోద్.. ఇప్పుడు నా దగ్గరే సెక్రెటరీ గా ఉంటున్నాడు... అంటూ పరిచయం చేశాడు...
నమస్తే సర్ అంటూ కాళ్ళకి దండం పెట్టాడు.... సంతోషంగా ఉండు నాయనా అంటూ ఆశీర్వదించారు... ఆ రోజు మీ మాటలు విన్నాను కాబట్టే ఈ రోజు ఈ స్థాయి లో ఉన్నాను అండి.. చాలా సంతోషం గా ఉంది మిమ్మలిని కలిసినందుకు అన్నాడు విహారి.
..మీ అమ్మగారు నాన్న గారు ఎలా ఉన్నారు... అన్నారు...బాగానే ఉన్నారు..
. వాళ్ళు వస్తామన్నారు... ముందు నేను కలిసి..
తరువాత తీసుకుని వస్తాను అన్నాను..
.తప్ప కుండా తీసుకుని రా బాబు.. అయినా
మీరు ఏంటి సర్ ఇక్కడ ఇలా ...
తాను ఉద్యోగానికి రావడం ఏమిటి...
మీకో అబ్బాయి ఉండాలి కదా
ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు... అన్నాడు..
.అదా ..అది అంతా ఓ పెద్దకధ...
ఇప్పుడు అదంతా ఎందుకు లే బాబు...అన్నారు..
.అన్నట్టు ఆంటీ ఎలా ఉన్నారు ఎక్కడ కనబడలేదు...అంటూ అడిగాడు విహారి..
. అదిగో అలా మంచం మీద ఉంది...అంటూమంచం మీద పడుకుని ఉన్న ఆవిడని చూపించారు..
అయ్యో అసలు ఏమి జరిగింది మాస్టారు...
మీరు చెప్పి తీరాల్సిందే అన్నాడు...
బైట ఎవరో వస్తే మాట్లాడటానికి వెళ్ళింది సుహాసిని..
వాడు కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు...
ఒరేయ్ ఎవరో చూడరా...అంటూ పంపించాడు...
వినోద్ కూడా బైటకి వెళ్ళాడు...
సుహాసిని గారు ఏమిటి సంగతి ..
ఎందుకు ఇతను గట్టిగా మాట్లాడుతున్నాడు..అంటూ వచ్చాడు..
అతను వినోద్ ని చూడగానే
వినోద్ భయ్యా మీరు ఏమిటి ఇక్కడ...అంటూ విష్ చేసాడు...
ఏమిటి నరసింగ్ ఇలా వచ్చావు..అన్నాడు...
.ఏమి లేదు సర్..
.ఈ ఇంటిమీద అప్పు చేశారు...
వడ్డీ కూడా కట్టట్లేదు....
ఇలాగ అయితే ఇల్లు వేలం వేయాల్సి వస్తుంది అంటూ చెవుతుంటే అర్థం చేసుకోవట్లేదు...
.కొంచెం టైం కొంచెం టైం అంటూ గడిపేస్తున్నారు...అన్నాడు నరసింగ్.
వీళ్ళు మా అతిధులు...వాళ్ళ ముందర అల్లరి చేయద్దు...ప్లీస్..అన్నా ,
మనం మళ్ళీ మాట్లాడుకుందాం , ప్రస్తుతం దయచేసి ఇక్కడి నుంచి వెళ్లి పోండి అంటూ ప్రాధేయ పడింది...
సుహాసిని గారు..ఇతను మాకు తెలిసిన వాడే...
నేను మాట్లాడి టైం ఇప్పిస్తా...
ముందు మీరు లోపలికి వెళ్ళండి...
అంతా ..నేను చూసుకుంటాను ...అన్నాడు...వినోద్
అదికాదండి..అంటూ ఏదో అన బోతుంటే...
ముందు మీరు లోపలికి వెళ్ళండి అంటూ
లోపలికి పంపించాడు.
లోపల విహారి ఉన్నాడు... అన్నాడు...
విహారి అన్న వచ్చాడా...
మరి చెప్పవే ....నేను పోయి మళ్ళీ వస్తా...అన్నాడు నరసింగ్...
వీళ్ళు ...తనకి బాగా కావలిసిన వాళ్ళు..
నువ్వు మళ్ళీ ఇక్కడి కి రావద్దు..
ఎంత ఇవ్వాలో మొత్తం అన్న సెటిల్ చేస్తాడు...
నువ్వు ఆఫీస్ కి వచ్చి నన్ను కలు.. సరేనా...నువ్వు మళ్ళీ కాగితాలు ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి వస్తావు... అర్థం అయ్యిందా... అన్నాడు గట్టిగా..
మీ వాళ్ళని...తెలియక గట్టి గా మాట్లాడాను...
భయ్యా ని మన్నించమని ఆడిగానని చెప్పు...
మరి నే పోతున్నా..
అరె బండి తీయరా బయ్...అంటూ వెళ్లిపోయారు...
వినోద్ లోపలికి వచ్చాడు.... ఎవరు రా అది అని అడిగాడు విహారి...
ఆ నర్సింగ్ గాడు...
లోపల నువ్వు ఉన్నావని చెప్పాను...అంతే .
.సారి చెప్పి వెళ్ళిపోయాడు..అన్నాడు వినోద్...
ఏమంటాడు...అని అడిగాడు విహారి.
ఈ ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు ట...
అందుకే ఏరియా బాగుంది కదా అని
అడిగే వాళ్ళు లేరు అని ఎలాగైనా లాగేసుకుందామని...చూస్తున్నాడు... అన్నాడు... వినోద్
అసలు ఏమైంది మాస్టారు..ఇప్పటికైనా చెప్పండి అన్నాడు...
నేను చెపుతా అంటూ సుహాసిని... మొదలు పెట్టింది...
అన్నయ్య అమెరికా వెళ్లి చదువుకోవడం కోసం ,అప్పు చేయాల్సి వచ్చింది..
అక్కడ చదువు అయ్యాక , అక్కడే జాబ్ లో జాయిన్ అయ్యాడు...
మొదట్లో కొన్నాళ్ళు డబ్బు పంపించేవాడు... తరువాత అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని , ఒకరోజు ఫోటోలు పంపించాడు...
పెళ్లి పెద్దవాళ్ళకి చెప్పి చేసుకో వచ్చు కదా...ఎందుకు ఇలా చేశావ్ , నీకో చెల్లెలు ఉంది కదా , దానికి పెళ్లి ఎలా అవుతుంది... కొంచెం అయినా ఆలోచించక్కరలేదా...
అని నిలదీసి అడిగారు ఫోన్ లో ..
నా జీవితం నా ఇష్టం అంటూ , ఫోన్ పెట్టేసాడు....
అంతే ఆ తరువాత మళ్ళీ కాంటాక్ట్ చేయలేదు...
వాడి మీద బెంగ తో అమ్మ మంచం పట్టింది...
వాడు ఇక్కడికి రాకుండా ఉండడానికి ఏదో వంక పెట్టి మాయమై పోయాడు..
వీళ్లకి అది అర్థం కాదు ఏదో ఒకరోజు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది..వైద్యం
చేయిస్తున్నాం.కానీ ఫలితం లేదు.... మందులు శరీరానికి పనికి వస్తాయి కానీ ,మనసు కి కాదుగా...ఆలోచనలు పెట్టుకోవద్దు అంటే వినదు...బెంగతో మందులు కూడా సరిగ్గా ప్రభావం చూపట్లేదు...
..ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఇంట్లో తిరుగుతోంది.... అంది బాధగా...
పాపం ఆడపిల్ల , దాని రెక్కల కష్టం మీద ఆధారపడి బ్రతుకుతున్నాం.... అన్నారు మాస్టారు..
అలా అనొద్దని ఎన్ని సార్లు చెప్పాను...నాన్నా,
వాడు కొడుకు, నేను కూతురు అంతే తేడా..
ఇద్దరం మీ పిల్లలమే బాధ్యత లు సమానం గానే పంచుకుంటాం...
నేనూ చదువుకున్నాను గా...ఉద్యోగం
చేస్తున్నాను.ఇంతకు ముందు ఆఫీస్ లో ఆ మేనేజర్ ప్రవర్తన బాగుండక ,
రాజీపడలేక రాజీనామా చేయాల్సి వచ్చింది...
దేశం గొడ్డు పోలేదు ..
ఇది కాకపోతే ఇంకొకటి...
కాకపోతే టైం పడుతుంది...
ఈ లోగా భరించాలి తప్పదు గా అంది సుహాసిని...
మీ మానసిక దేర్యము కి అభినందించకుండా ఉండలేక పోతున్నా....అన్నాడు విహారి..
జీవితమే అన్ని నేర్పిస్తుంది అంది వైరాగ్యం గా నవ్వుతూ....
ఎన్నాళ్ళు అని కష్ట పడుతుంది ...
దీనిని ఒక అయ్య చేతిలో పెట్టాలి కదా...
మేము పెద్ద వాళ్ళము అయ్యాము...
పాపం కుటుంబ భారం అంతా ఇదే మొస్తోంది అన్నారు మాస్టారు...
కనీసం అప్పు అయినా తీర్చేయరా అంటే,నన్ను కన్నారు గాబట్టి చదివించాల్సిన బాధ్యత మీదే కదా ..అందుకే .చదివించారు..అంటాడు
.ఇంగ్లీష్ పిల్లని చేసుకున్నానని నన్ను కాదన్నది మీరు...
నేనేమి చేయను... అంటూ వాదిస్తాడు
ఇక ఏమనాలి వాడిని .
ఒకపక్క కుటుంబం గడవాలి..
మరో పక్క వాడికోసం చేసిన అప్పు తీర్చాలి...
వచ్చిన కాస్తో కూస్తో కుటుంబ అవసరాలకే సరిపోతుంది...
పైగా దీని వైద్యం..
వాడి గురించి ఆలోచించకే అంటే వినదు...అంటూ నిట్టూర్చారు మాస్టారు...
నిజానికి ఇండియా రాగానే మిమ్మలిని కలిసే ప్రయత్నం చేశాను...
కానీ మీ ఆచూకీ తెలియలేదు...
ఎక్కడి కి వెళ్లిపోయారో తెలియదు..
. లేకపోతే ఇంత దూరం రానిచ్చే వాడిని కాదు...
మీ వాడిని నాలుగు పీకి ఇక్కడికి రప్పించేయానా...అన్నాడు..
వద్దులే బాబు...వాడి పాపాన వాడే పోతాడు...
వాడికి మనసులో మా మీద ప్రేమ ఉండాలి గాని..
కొడితే నో తిడితే నో పుట్టదు...
మా తల రాత ఇంతే
అనుకుంటాము...
మమ్మలిని " వాడు " కాదనుకుంటున్నాడు..
కానీ మేము కాదుగా..
వాడి సంగతి వదిలేయ్ బాబు ,
ఎంతైనా కొడుకే కదా అన్నారు మాస్టారు....
అది రా అమ్మ ,నాన్న అంటే...ప్రేమకి ,త్యాగానికి ప్రతిరూపాలు... ఆ మూర్ఖుడికి వీళ్ళ విలువ తెలియట్లేదు... అన్నాడు.. వినోద్
విహారి కి కోపం వచ్చే సింది...
ఒరేయ్ వినోద్ నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు...
ఆ నర్సింగ్ గాడు వీళ్ల ఇంటి పేపర్ లతో అరగంటలో ఇక్కడ ఉండాలి...అన్నాడు..
ఇదిగో పావు గంట లో ఇక్కడ ఉంటాడు... అంటూ ఫోన్ చేయడానికి బైటకి వచ్చాడు.
నర్సింగ్ కి ఫోన్ చేసాడు..
అన్న నీమీద బాగా కోపం గా ఉన్నాడు..
అది కాదు భాయ్..మీ వాళ్ళు అని తెలియక రుబాబ్ చేసినా...
అయినా వచ్చేసా గా ...
నేనేమి పెద్దగా ఏమి అనలేదు భయ్యా...
ఆ పక్క ఇంట్లో ఓ పొట్టోడు ఉన్నాడు..
వాడు జరంత ఎక్కువే చేసిండు... అన్నాడు...
నువ్వు ఈ ఇంటి కాగితాలు పట్టుకుని,
పది నిమిషాలలో ఇక్కడ ఉండాలి అన్నాడు అన్న...
"లేకపోతే " ...
వద్దు పూర్తి చేయద్దు...
ఆ మాత్రం టైం చాలు...
..నేను ఐదు నిమిషాలు లో నీ ముంగిట ఉంటాను..అన్నాడు..
సర్ మని జీప్ వచ్చి ఆగింది... అందు లోనించి కాగితాలు పట్టుకుని నర్సింగ్, ఇంకా నలుగురు రౌడీ లు దిగారు...
పక్కింటి గోడ మీదనుంచి,
వీళ్ళు మళ్ళీ వచ్చారు ఏమిటి...
ఈ సారి ఖాళీ చేయించడం ఖాయం అనుకున్నాడు..
ఏమిటండి మళ్ళీ వచ్చారు..
ఖాళీ చేయిస్తే వెంటనే చేయించేయండి.. నుసెన్సు తట్టుకోలేక పోతున్నాం...
ఇలా రౌడీ లు, గుండాలు అస్తమాను వచ్చిపోతుంటే...
మాకు పరువు తక్కువగా నూ, నుసెన్సు గాను ఉంది అన్నాడు...
అసలు ఈ పొట్టోని మూలం గా కదూ.. మాటర్ అన్న దాకా పోయింది...
ఒరేయ్ ఆడిని ఎత్తుకు రారా....
నా చేతిలో అయిపోయాడు... ఇవాళ అంటూ..పురమా ఇంచి...
గబ గబా పేపర్ లు తీసుకుని వెళ్లి విహారి చేతిలో పెట్టాడు..
చేతులు కట్టుకుని నుంచున్నాడు...
ఇంతలో బ్రహ్మి ని కూడా తీసుకుని వచ్చారు ..నర్సింగ్ మనుషులు...
అక్కడ చేతులు కట్టుకుని నుంచున్నారు... అందరూ...
మాఫ్ కర్ నా భాయ్... తెలియ క జరిగిన పొరపాటు.... అన్నాడు..
నాకు కాదు మాష్టారి చేతి లో పెట్టు... అన్నాడు విహారి...
కాగితాలు మాస్టారు చేతిలో పెట్టి...
సార్ ఇవిగో మీ పేపర్లు...
మీ అప్పు మొత్తం మాఫ్ చేసిన...
అంటూ ఆయన చేతిలో పెట్టాడు...
పరవాలేదు బాబు ,ఎలాగో అలా మీ అప్పు తీర్చేస్తాము...కొంచెం టైంఇవ్వు చాలు అన్నారు మాస్టారు...
అదేం లేదు సార్ అన్న చెప్పినాక , నేను మళ్ళీ ఈ చుట్టుపక్కలకి కూడా రాను... మీరు కంగారు పడకండి... చుడు చెల్లెమ్మా , నా ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంది గా ...నీకు ఏదైనా సమస్య వస్తే నాకు ఫోన్ చెయ్...నేను చూసుకుంటా....అన్నాడు నర్సింగ్...
మరి నేను పోయి రానా విహారి భాయ్ అన్నాడు....
ఏంటి బెదిరిస్తున్నవట...
అంటే అడిగే వాళ్ళు లేరు అనా...
ఏదో అప్పిచ్చి ...ఇల్లు లాగేసుకుందామనా...అని అడిగాడు కోపం గా...
ఆబ్బె అలాంటి ది ఏమి లేదు అన్నా...
నేను కేవలం అప్పు ఎప్పుడు తీరుస్తారని మాత్రమే అడిగా...
ఇదిగో ఈ పొట్టోడు..
తెగ రెచ్చి పోయాడు... అంటూ
డిప్ప మీద ఒక్కటిచ్చాడు...
ఏంటండి కొడతారేమి టి.. అయాం ఫ్రమ్
డీసెంట్ ఫామిలీ... తెలుసా ..
మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి చెత్త నాయాల...
అంటూ మళ్ళీ పీకాడు...
అసలు ఇది అంతా నీ మూలం గా కాదూ.. అస్తమాను అప్పుల వాళ్ళు వస్తే మీ పరువు పోతోంది.. అంటూ రెచ్చి పోయావ్.
.పైగా కత్తి చూపించాడు సర్...అన్నాడు...
ఒరేయ్ పొట్టి...
ఇలా రా రా, అని గట్టి గాపిలిచాడు ..విహారి..
ఏమిటి నన్ను " రా " నా...నన్ను అంటూ అడిగాడు...
అవును రా నిన్నే ఇలాగ రారా అన్నాడు విహారి.....
అరే ఎల్లు బే అంటూ ముందుకి తోసాడు నర్సింగ్......
ఆ ఎలతామండి... తోస్తారేమిటి....రెస్పెక్ట్ లేకుండా...
ఎందుకండి దగ్గరకి పిలిచారు... కొట్టరు..కదా అని అడిగాడు భయం భయం గా...లాగి లెంపకాయ కొట్టాడు విహారి... చెంప మీద వేలి ముద్రలు పడ్డాయి....
చెంప రాసుకుంటూ...
ఎందుకు లెండి ఇక్కడి నుంచే మాట్లాడతా...అన్నాడు....
రమ్మన గానే రాక పోతే ఇంకా గట్టిగా కొడతాను...తరువాత నీ ఇష్టం అన్నాడు విహారి....
పర్లేదు సర్...అన్నాడు బ్రహ్మి..
పర్లేదు ఏంట్రా...నేను ఏమైనా నీకు సారి చెపుతున్నానా...అన్నాడు..
రా ఇలాగ అంటూ అరిచాడు....
భయపడుతూ దగ్గరికి... వచ్చాడు... లాగి లెంపకాయ ఇచ్చాడు.. గబ గుయ్ మంది.. రమ్మంటే రావేంట్రా... నీ లెవెల్ కి ,
నేనే , నీ దగ్గరకి వచ్చి కొట్టాలా...అంటూ ఇంకోటి..పికాడు.. సార్ బుగ్గలు వాచిపోతున్నాయి ...ఇంక ఆపమని చెప్పండి సార్... అంటూ బ్రతిమాలాడు. మాస్టారిని...
ఆడ పిల్ల కష్టాలలో ఉంది... వీలైతే సాయం చేయాలి కానీ , రాళ్లు వేస్తావు రా..అసలు మనిషి వేనా నువ్వు.. అయినా
ఏంటి రా కత్తి చూపిస్తున్నవట..
అంత మొగోడి వా అన్నాడు విహారి...
ఆబ్బె అదేం లేదు సార్....ఇంట్లో కూరలు తరుగుతూ...
ఏదో శబ్దం వస్తే అలాగే వచ్చేసా....వీళ్ళేమో బెదిరించానని అనుకున్నారు... అంతే సార్...
అయిన నేను వంట చేసుకోవాలి....
వస్తా సార్...అంటూ బయలుదేరబోయాడు..
ఆగు...ఈ వంట ,
ఏమిటి రా అన్నాడు...
ఆదా ఒకసారి మా బాస్ విషయంలో
ఇలాగే కొంచెం కల్పించు కున్నాను...
వాడు... ఉద్యోగం లోనించి పీకేశాడు... అప్పటి నుంచి మా ఆవిడ ఆఫీస్ కి , నేను వంటకి...ఫిక్స్ అయిపోయాం...అన్నాడు మూసి మూసి గా నవ్వుతూ....
నీకు నోటి దూల బాగా ఎక్కువ రోయ్... అన్నాడు వినోద్...
ఏదో మీదయ అన్నాడు బ్రహ్మి..
ఈడు మారడు...అంటూ ఒకటి పీకాడు వినోద్...
నర్సింగ్ ఇంక నువ్వు వెళ్ళు... నీ కాంటాక్ట్ సంగతి నేను చూసుకుంటాను....అన్నాడు విహారి...
థాంక్స్ అన్నా... అంటూ బయలుదేరి వెళ్లి పోయాడు...
మరి నేనూ వస్తా ను సర్... అంటూ బయలుదేరబోయాడు బ్రహ్మి... నువ్వు ఎక్కడికి ...నీతో పని ఉంది... ఆగు..
అన్నాడు...
నాతో పనులు ఏముంటాయి సార్...ఏదో కూరలు తరుక్కోవడం....వంట చేసుకోవడం...తప్ప అన్నాడు
ఆ అదే చేద్దువు గాని.... రోజు ఉదయం సాయంత్రం ఇక్కడికి వచ్చి కూరలు తరిగేసి వెళ్ళిపో...సరేనా..నెల పాటు.. అదే నేను నీకు వేసిన శిక్ష... అన్నాడు....
శిక్ష లు ఏమిటండి ...మీరేమయినా జడ్జి ఆ..శిక్ష లు వేయడానికి... అన్నాడు...
మళ్ళీ లెంపకాయ ఇచ్చాడు...విహారి..
చ్ఛి... దీనమ్మ బ్రతుకు... తబల కన్నా దారుణమైపోయింది...నా ఫెస్..అంటూ గోనిగాడు...
ఏంట్రా అన్నావు..అన్నాడు...
ఆబ్బె ఏమి లేదండి.... నాకు అలవాటైన పనిని శిక్ష గా వేశారు... అంటున్నా...
ఎల్లుండి నుంచి వచ్చి చేస్తా మంచి రోజు..రేపు నాకు కొంచెం పని ఉంది... అన్నాడు బ్రహ్మీ..
ఇవాళ కూడా మంచిదే అన్నాడు..విహారి
ఓహో ...
ఇవాళ కూడా మంచిదే ట... కాలండర్ కూడా చూసేసారన్న మాట...అన్నాడు..
ఈ మాత్రం దానికి కెలండర్ ఎందుకు.. నువ్వే చెప్పావు గా ఎల్లుండి మంచిది అని... రేపు తీసేస్తే..ఇవాళ మంచిదే గా...అన్నాడు విహారి..
అదికూడా నేనె చెప్పానా ..నా గొయ్యి నేనె తవ్వుకున్నా అన్నమాట....సరే.. ఆ కత్తి పీట ఇలా పారేయండి... అన్నాడు బ్రహ్మి
ఏ నీదగ్గర కత్తి ఉంది గా ...దానితో కానియ్...అన్నాడు
మరి కూరలు అన్నాడు....అవి కూడా నువ్వే తీసుకుని రావాలి....
నీ డబ్బుతో....అన్నాడు..ఇంకా చూస్తావేమి....పో బయలు దేరు అన్నాడు...విహారి...
బ్రహ్మి బయలు దేరి వెళ్ళిపోయాడు...
*******
ఇంక అసలు విషయానికి వద్దాం... అంటూ మొదలు పెట్టాడు విహారి...
నేను చిన్నప్పటి నుంచి మీ అమ్మాయి అంటే ఇష్టం... ఆఫ్ కోర్సు అందరి తో స్నేహం గా ఉంటూ...బాగా చదువుకునే ఆ అమ్మాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదు....
ఆ ఇష్టమే ఇప్పుడు పెద్ద అయ్యాక ...ప్రేమ గా మారింది అని తెలుసుకున్నాను...
తాను నా జీవిత భాగస్వామి అయితే ...
నా లైఫ్ హ్యాపీగా గడిచి పోతుంది అని
నా నమ్మకం....
ఆ విషయం మొదట మీకే చెపుతున్నాను..
ఇంకా తనకి ఆ విషయం తెలియదు...
తీరా అడుగుదామని వస్తే...
ఇక్కడి పరిస్థితులు అర్థం అయ్యాయి...
ఒక్క విషయం మనస్ఫూర్తిగా చెపుతున్నా...
మీ పరిస్థితులు కి జాలి పడో,
లేక మీ మీద గౌరవం తో నో ఈ మాట అడగట్లేదు... తన మీద ఉన్న ప్రేమతో మిమ్మలిని తనని నాకిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాను ..
.మీ అభిప్రాయం చెప్పండి సార్..అన్నాడు విహారి...
అమ్మాయి కి ఎలాగూ పెళ్లి చేయాలి...
తనని ఇష్టపడే వాడు అయితే సుఖపడుతుంది అని నా నమ్మకం..
కానీ మీ అంతస్థు కి మేము తగమేమో బాబు అన్నారు...
ప్రేమ ముందు డబ్బుకు విలువ ఉండదు మాస్టారు... మీరు ఒప్పుకుంటారన్న నమ్మకం తో నే వచ్చాను...
అదీ మీ అమ్మాయి మనస్ఫూర్తిగా ఇష్ట పడితేనే... ఇంకో విషయం..నేనేదో సహాయం చేశానని కృతజ్ఞతతో ఒప్పుకోవద్దు....
నా ప్రేమను అర్థం చేసుకుని ఒప్పుకో మని అడుగుతున్నాను...
నువ్వు మొదటి నుంచి నాకు తెలుసు...
నాకేమి అభ్యంతరం లేదు...
మరి నీకో అంటూ వాళ్ళ ఆవిడ వైపుకి చూసారు... ఆవిడ కళ్ల లో ఆనందం కనిపిస్తోంది.
. ఒప్పుకో మని సైగ చేసింది..అమ్మా సుహాసిని
అమ్మ కూడా ఒప్పుకుంది...
మరి నీ అభిప్రాయం కూడా చెపితే బాగుంటుంది అన్నారు...
నా కీ పెళ్లి ఇష్టం లేదు నాన్న గారు...
ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్లి పోతే ..
.మిమ్మలిని ఎవరు చూస్తారు... అంది..
మా సంగతి సరే ముందు నీ జీవితం ఒడ్డున పడాలి కదా తల్లి...
మాకు వచ్చే వయసే కానీ తగ్గేది కాదు...
వాడి దారి వాడేలాగు తీసుకున్నాడు...
కనీసం నీ బాధ్యత అయినా తీర్చుకోవాలి గా...అన్నారు...
ఆయన మీ నాన్న గారు అయితే..
నాకు గురువు గారు..
ఆయన్ని ఎలా వదిలేస్తా అనుకున్నారు...
వాళ్ల బాధ్యత కూడా మనదే అవుతుంది.
.. ఇంకా మీకు మొహమాటం అయితే.
..మీకు ఎలాగూ జాబ్ వస్తుంది కదా.
..పెళ్లి అయిన తరువాత..
ఎలాగూ ఆఫీస్ కి వస్తారు.
. ఆ జీతం వాళ్ళ కోసం ఇచ్చేయండి... అన్నాడు విహారి..
ఎందుకో ..మీకు నామీద ప్రేమ కన్నా..మా కుటుంబం పట్ల జాలి ఎక్కువగా కనిపిస్తోంది.. అందుకే ఒప్పుకో లేక పోతున్నాను.
క్షమించండి అంది...
ఇప్పుడు నా ప్రేమ ని రుజువు చేసుకోవడం ఎలా...
ఇప్పటికిప్పుడు నేనేమి చేయలేను...
మీరు నమ్మితే నమ్మండి... లేదంటే ...లేదు...
ఇదిగో మీ అపోయింట్మెంట్ లెటర్...
మా వేరే ఊరిలో బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ నెలకి 50,000 శాలరీ...కోర్టర్స్ అన్ని ఇస్తాం..
వెళ్లి జాయిన్ అవ్వండి..
ఇంక నేను చేసేది ఏముంది...
.బాగా ఆలోచించి చెప్పండి..
ఈ పెళ్లి ఇష్టమైతే...ఆ కవర్ చింపేయండి.. లేదంటే ...ఆ ఊరు వెళ్లి జాయిన్ అవ్వండి...
.మరి నేను వస్తాను మాస్టారు అంటూ లేచి నమస్కారం పెట్టాడు...
లోపల కోపం బాధ అన్నీ కలబోసి ...ఒకరకమైన ..చిరాకు వచ్చేసింది
విహారి కి...
అరే ఇలాగ అనేసింది ఏమిటి.. అనుకుంటూ ఇప్పుడు ఏమి చేయాలి అంటూ సందిగ్దత లో ఉండి పోయాడు వినోద్...
తనంతట తాను నమ్మితే గాని ఈ పెళ్లి కి వప్పుకోదు...
ఇప్పుడు ఎలాగబ్బా అంటూ ఆలోచిస్తున్నాడు... పద రా ఇంకా ఇక్కడ ఉండి ఏమి చేస్తాం... అంటూ గుమ్మం దాకా వెళ్ళివెనక్కి తిరిగి చూసాడు... మనసు మార్చుకుంటుందేమో అన్న ఆశతో... వినోద్ ఇంకా అక్కడే కూర్చుని ఉన్నాడు...
ఆమె లో ఏ మార్పు కనబడలేదు...హు అనుకుంటూ...
జేబు లోంచి తన పర్సు తీసి వినోద్ కి ఇచ్చి...
అడ్వాన్స్ ఎంత కావాలో ఇచ్చేసి రా...
మళ్ళీ నన్ను కలవద్దని...చెప్పు...
ఇక్కడ నుంచే ఆ ఊరు వెళ్లి పొమ్మని చెప్పు ...అంటూ పర్సు వినోద్ చేతిలో పెట్టి బయటికి వెళ్లి పోయాడు విహారి...
పర్స్ చూడగానే తనకి గుర్తుకు వచ్చింది..
విహారి పర్సు లో చిన్నప్పటి ఫ్రెండ్స్ ఫోటో ఉంటుంది....
తనకి ఒకసారి ...చూపించాడు విహారి...
అందులో ముఖ్య స్నేహితులతో పాటు ఈ అమ్మాయి కూడా ఉంది..
.ఐడియా వచ్చేసింది...
సుహాసిని గారు కొంచెం మంచినీళ్లు ఇస్తారా తాగేసి వెడతా అన్నాడు..వినోద్..
అలాగే అండి అంటూ కిచెన్ లోకి వెళ్ళింది... వెంటనే పర్సు లోనించి...ఫోటో తీసి.... అక్కడ టేబుల్ పైన ఉన్న రెడ్ స్కెచ్ పెన్ తో ఆ అమ్మాయి ఫేస్ మీద లవ్ సింబల్ హార్ట్ బొమ్మ గిసేశాడు...
మళ్ళీ పెన్ అక్కడ పెట్టేసాడు..
ఇంతలో మంచి నీళ్ళు తీసుకుని వచ్చింది.. సుహాసిని..
ఆ నీళ్లు తాగేసి ఇంక వస్తానండి అంటూ ఇదిగో అండి అడ్వాన్స్ ..అంటూ కాష్ తీసాడు వినోద్... అలా కాష్ తీస్తూ ఫోటో కింద పడేసాడు....
కింద పడ్డ ఫోటో ని సుహాసిని తీసింది...
అందులో తన ఫోటో ఉండడం..దాని మీద లవ్ సింబల్ చూసింది..
ఆ ఫోటో ఇవ్వండి సుహాసిని గారు...
అది వాడు ఎప్పటి నుంచో పర్స్ లో ఉంచుకున్నాడు...
ఇదిగో ఈ సింబల్ చూసారా...
వాడు చిన్నప్పటి నుండి మిమ్మలిని ఇష్టపడుతున్నాడు....
మీ పరిస్థితులు చూసి కాదు అని....
వస్తానండి మరి అంటూ...ఆ అమ్మాయి చేతిలో పర్సు వదిలేసి బైటకి వచ్చేసాడు..
వీడు ఇంకా రాడేమి టి అంటూ విసుగు గా కార్ దగ్గర నుంచున్నాడు.. విహారి,
బైటకి వస్తూ లోపలికి చూసాడు వినోద్
తన ప్లాన్ ఏమైందో అని..
ఆమె అపోయింట్మెంట్ లెటర్ చింపేస్తోంది..
హమ్మయ్య అనుకుని .
కొంచెం నెమ్మది గా కార్ దగ్గరకి నడుస్తున్నాడు... ఇంతలో.. సుహాసిని వెనుక నుండి పరిగెత్తు కుంటూ వచ్చి విహారి ని కౌగలించుకొని..
మీ పర్సు లో ఉన్న ఈ ఫోటో సాక్షి....
నమ్ముతున్నాను అండి...మీరు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారని...
నాకు మిమ్మలిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే..
నాకు మీరు అంటే ప్రేమే..
కానీ మీరు కాదంటే లోకువ అయిపోతాను అని బైట పడలేదు...
తరువాత భాద్యత లు నా నోరు కట్టేసాయి..
అంది ఆర్తిగా...
అనందం లో పొంగి పోయాడు..
.తన ఫోటో లో లవ్ సింబల్ ఎలా వచ్చింది అబ్బా అనుకుంటూ...
ఆమె కౌగిలి లోనించి.. వినోద్ వైపు చూసాడు...
వినోద్ కన్ను గీటి...బొటన వేలు చూపించాడు...
ఓహో ఇది నీ పనా....థాంక్స్ రా అంటూ కృతజ్ఞతతో చూసాడు వినోద్ వైపు.....
అలా ఆ ప్రేమ కథ పెళ్లి పీట ల వైపు ...ప్రయాణం సాగించింది.....
శుభం..
( కధ, కధనం ,పేర్లు, పాత్రలు కేవలం కల్పితం... ఎవరిని ఉద్దేశించి నది కాదు...)