Tuesday 22 December 2015

benifits of jama

జామ "
రోజు పెరటిలో దొరికే " జామ " . పోషక విలువలలో ఆపిల్ పండుతో సరితూగే జామ,
పీచు పదార్థాం అధికంగా ఉండే జామ లో విటమిన్ 'సీ' పుష్కలంగా ఉంటుంది. మనవశరీరానికి అవసరమైన బీటా కెరోటిన్లను జామ సమృద్థిగా అందిస్తుంది. 
జామ ఫలాలు తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న కండను కలిగి ఉండటమ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆరెంజ్ రంగు కండ కలిగిన జామ ఫలాలు కూడా లభిస్తుంటాయి. కండ భాగంలోని గింజలను పరిశీలిస్తే చిన్నవైనా ధృడంగ ఉంటాయి. 
తెల్ల గుజ్జు జామ పండులో కంటే ఎరుపు, ఆరెంజి రంగు గజ్జు కలిగి ఉన్న జామ పళ్లలో బీటాకారోటిన్, పాలిఫినాల్స్, కెరటి నాయిడ్స్ వంటి ఫోషకాలు పుష్కలంగా ఉంటాయి.
రోజు 3 జామాకులను నమిలితే దంతక్షయం పోతుంది. జామాకులను నీటిలో మరగించి ఆ మిశ్రమాన్ని సేవిస్తే దగ్గు, జలుబు ఇట్టే మటుమాయమవుతాయి. పండిన జామపండును రోజు ఆహారంలా తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. 
ముఖ్యంగా డైటింగ్ చేసేవారికి జామ పండు బలవర్థక ఆహారం. 
వృక్షశాస్త్ర వర్గీకరణలో 'మిర్టేసి' కుటుంబానికి చెందిన జామను 'సీడీఎమ్ గావా'గా పిలుస్తారు. ఏ మాత్రం అవకాశమున్న జామచెట్లను మీ పెరటిలో పెంచి ఇంటిల్లిపాది ఆరోగ్యవంతంగా ఉండండి.