నామ త్రయం అంటే మూడు నామాలు.
అవి
"శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయ నమః,
శ్రీ గోవిందాయ నమః"
ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి
కలి ప్రేరితమైన రోగాలు రావు.
జబ్బులు ఏమైనా ఉంటే అనతి కాలంలోనే తగ్గిపోతాయి అని వచనం.
ఈ నామాలు ఒక దివ్యౌషధం లా పనిచేస్తుంది. భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది.
అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి.
అట్టి విశిష్ట నామాల్లో
మరీ విశిష్ట నామాలు
అచ్యుత,
అనంత,
గోవింద
పద్మ పురాణంలో ఈ నామ మహిమ
"అచ్యుతానంత గోవింద నామెాచ్ఛారణ భేషజాత్ నశ్యంతి సకలారోగాః సత్యం సత్యం వదామ్యహ"
అని వర్ణించబడింది.
అంటే
"ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి.
ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను"
అని దీనర్ధం.
ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా
శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట. క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి.
ఆయుర్వేద వైద్య విద్యలో ఆయనదే ప్రధమ స్థానం.
పార్వతీదేవి అడుగగా శంకరుల వారు శ్రీమన్నారయణుని లీలల గురించి,
కుార్మావతార సందర్భంలో క్షీరసాగర మథన గాథ వినిపిస్తుా ఇలా అన్నారు.
పార్వతీ ,
పాల కడలిలో లక్ష్మీ దేవి అవతరించింది.
దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతిస్తున్నారు.
ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.
ఆ హాలాహలం చుాసి దేవతలుా, దానవులుా భయపడి తలో దిక్కుకి పారిపోయారు.
పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను.
అందరుా నా పాదాలపై బడి
నన్ను పుాజించి స్తుతించ సాగారు.
అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వ దుఃఖ హరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని
"అచ్యుత, అనంత, గోవింద"
అన్న ముాడు మహా మంత్రాల్ని స్మరించుకుంటూ
ఆ మహా భయంకరమైన కాలకుాట విషాన్ని త్రాగివేశాను.
సర్వ వ్యాపి అయిన విష్ణు భగవానుని యెుక్క
ఆ నామ త్రయం యెుక్క మహిమ వల్ల సర్వ లోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది అని సాక్షాత్తూ సదా శివుడు తెలిపాడు.
శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయ నమః,
శ్రీ గోవిందాయ నమః
అన్న
"నామ త్రేయాస్త్ర మంత్రాన్ని"
పలికేటప్పుడు ఈ మహిమనంతా జ్ఞాపకముంచుకుని,
విశ్వాసం పెంచుకుని,
మంత్ర మననం చేయడం ద్వారా
అనారోగ్య బాధలు తొలగించుకుని, ఆయురారోగ్యాలను పొందవచ్చు.
నీటి గ్లాసును చేత పట్టుకుని " నామ త్రేయాస్త్ర మంత్రాన్ని" కొద్దిసేపు పలికి, ఆ నీటిని మంత్ర బలంతో శక్తివంతం చేసి, తరువాత ఆ నీటిని స్వీకరించండి
సేకరణ