Thursday, 9 July 2020

పద్మశ్రీ. కోట శ్రీనివాసరావు గారు


సుప్రసిద్ధ నటులు, విలక్షణ  పాత్రధారి

పద్మశ్రీ. కోట శ్రీనివాసరావు గారికి  జన్మదిన శుభాకాంక్షలు తొ ...

ఆయన గురించి...

10.7.1947 లో కంకిపాడు లో జన్మించిన ఆయన , నటనా రంగం మీద ఆసక్తి తో...

నాటక రంగం లో పలు సేవలు అందించారు... ఆ తరువాత ఆయనకి ఉన్న అపార అనుభవం తో సినీ రంగం లో కి ప్రవేశించారు...
తెలుగు సినిమా చరిత్ర లో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ ని రాసుకున్న ప్రతిభాశాలి శ్రీ శ్రీనివాసరావు గారు.
ఒక్క తెలుగు లొనే కాదు తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు.
తన ప్రతిభకి అనేక నంది అవార్డ్ లు కూడా ఆయన తన సొంతం చేసుకున్నారు...
ప్రతినాయక  పాత్ర కి ఆయన పెట్టింది పేరు... అంతే కాదు...

కారెక్టర్ ఆర్టిస్ట్ గా ,సహా నటుడిగా ఆయన తనదైన విలక్షణమైన శైలి ని ప్రదర్శించి అనేక మన్ననలు పొందారు...

2001 లో చిన్న
1998 లో గణేష్
1993 గాయం ...ఇలా అనేక నందులని గెలుచుకున్నారు....

2015 లో భారత ప్రభుత్వం ఆయనని
అప్పటి ప్రెసిడెంట్ గారు అయిన శ్రీ.ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీద గా విలువైన
పద్మశ్రీ అవార్డు ని ఇచ్చి గౌరవించింది..

ఆయన  నటించిన కొన్ని చిత్రాలు...
1.అత్తారింటికి దారేది..
2.దూకుడు
3.రక్త చరిత్ర
4.బొమ్మరిల్లు
5.అతడు
6.మల్లీశ్వరి
7.గణేష్
8.అనగనగా ఒక రోజు
9.ఆహా నా పెళ్ళంటా
10.గోవిందా గోవిందా
11.శివ
12.ప్రతిఘటన

నంది అవార్డ్ లు...
1. స్పెషల్ జ్యూరీ అవార్డ్... ప్రతిఘటన
2.బెస్ట్ విలన్ ...గాయం
3.కారెక్టర్ ఆర్టిస్ట్.. లిటిల్ సోల్జర్స్
4.బెస్ట్ విలన్ ...గణేష్
5.బెస్ట్ సపోర్టింగ్.... పృధ్వి నారాయణ
6.బెస్ట్ కారెక్టర్.... ఆ నలుగురు
ఇంకా
శ్రీ అల్లు రామ లింగయ్య గారి  పురస్కారం కూడా ఆయనని వరించింది...

1978 లో ప్రాణం ఖరీదుతో ప్రారంభం అయిన ఆయన సినీ ప్రస్థానం ఇప్పటికి కొనసాగిస్తూన్నారు..

నటన అంటే ఆయనకి ప్రాణం...నటించడం కోసం ఎంతటి కష్టాన్ని అయినా పడతారు... ఏ పాత్ర చేసినా అది ఆయనకె సొంతం అనేలా తన ప్రతిభ ని ప్రదర్శిస్తారు...

విలన్ గా , కారెక్టర్ ఆర్టిస్ట్ గా...సహా నటుడిగా... కమెడియన్ గా, కామెడీ విలన్ గా ఇలా ఒకటేమిటి అనేక రకాల పాత్రలని తనదంటూ ఒక ప్రత్యేక శైలి లో అభినయించే ప్రతిభాశాలి శ్రీ కోట శ్రీనివాసరావు గారు.

ఆయన డైలాగ్స్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది...
అందరికి పెడతాండ దండం అంటూ ...ప్రతిఘటన లో...
50 లక్ష లు అన్న ఫిగర్ కి టెంప్ట్ అయిపోయాను అంటూ గోవిందా గోవిందా లో...
ఈ  ఫోన్ ఎవడు కానిపెట్టాడు రా బాబు ,
అంటూ , థాంక్స్ లాంటి మాటల తో శత్రువు లో...

పిసినారి గా .....ఆహా నాపెళ్ళంట లో
ఆ పాత్ర ని ఎప్పటికి ప్రేక్షకులు మరిచిపోరు...

గణేష్ లో తన మేకప్ ...ఎంత భయంకరమైన పాత్ర చేసి....

ఎంతో ప్రేమించే తండ్రి గా బొమ్మరిల్లు లో కారెక్టర్ ఆర్టిస్ట్ గా అంత వేరియేషన్...చూపించిన అద్భుత నటుడు శ్రీ కోట శ్రీనివాసరావు గారు...

మందుబాబులం మేము మందు బాబులం అంటూ తన గాత్రం వినిపించి అందరిని మెప్పించిన కళాకారుడు..

ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ...అనేక విజయాలతో ప్రజల హృదయాలలో ఆయన స్థానం సుస్థిరంగా ఎప్పటికి నిలిచి పోవాలని ...కోరుకుంటూ...

పద్మశ్రీ. కోట శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు... తెలుపుకుంటున్నాను...