Thursday, 23 July 2020

శ్రీ గురు స్తోత్రము - శ్రీ గురు గీతలో చెప్పబడినది

శ్రీ గురు స్తోత్రము - శ్రీ  గురు గీతలో చెప్పబడినది

గురుసంప్రదాయంను అనుసరించే వారు నిత్యం పఠించే యోగ్యమైన స్తోత్రము ఎంతో మానసిక శక్తిని ప్రసాదించే అద్భుత స్తోత్రం.

1) గురు ర్బ్రహ్మా గురు ర్విష్ణుః గురు ర్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్  పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

2) అఙ్ఞాన తిమిరాంధస్య ఙ్ఞానాంఙన శలాకయా
చక్షు రున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః

3) అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః

4) స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరం
త్వత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః

5) చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం స చరాచరం
అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః

6) నిమిష న్నిమిషార్ధ్వాద్వా యద్వాక్యాదై విముచ్యతే
స్వాత్మానం శివ మాలోక్య తస్మై శ్రీ గురవే నమః

7) చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం
నాద బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః

8) నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవ చ వ్యాప్తం యేన జగత్సర్వం తస్మై శ్రీ గురవే నమః

9) స పితా స చ మే మాతా స బంధుః స చ దేవతా
సంసార మోహ నాశాయ తస్మై శ్రీ గురవే నమః

10) యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతి తత్
యదానందేన నందంతి తస్మై శ్రీ గురవే నమః

11) యస్మిన్స్థిత మిదం సర్వం భాతి యద్భాన రూపతః
ప్రియం పుత్రాది యత్ప్రీత్యా తస్మై శ్రీ గురవే నమః

12).యేనేదం దర్శితం తత్వం చిత్త చైత్యాదికం తథా
జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మై శ్రీ గురవే నమః

13) యస్య ఙ్ఞాన మిదం విశ్వం న దృశ్యం భిన్న బేధతః
సదైక రూప రూపాయ తస్మై శ్రీ గురవే నమః

14) యస్య ఙ్ఞాతం మతం తస్య మతం యస్య న వేదసః
అనన్య భావ భావాయ తస్మై శ్రీ గురవే నమః

15) యస్మై కారణ రూపాయ కార్య రూపేణ భాతి యత్
కార్య కారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః

16) నానారూపమిదం విశ్వం న కేనాప్యస్తి భిన్నతా
కార్య కారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః

17) ఙ్ఞాన శక్తి సమారూఢ తత్వ మాలా విభూషణే
భుక్తి ముక్తి ప్రదాత్రేచ తస్మై శ్రీ గురవే నమః

18) అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే
ఙ్ఞానానిల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః

19) శోషణం భవ సింధోశ్చ దీపనం క్షర సంపదాం
గురోః పాదోదకం యస్య తస్మై శ్రీ గురవే నమః

20) న గురో రధికం తత్వం న గురో రధికం తపః
న గురో రధికం ఙ్ఞానం తస్మై శ్రీ గురవే నమః

21) మన్నాథః శ్శ్రీ జగన్నాథో మద్గురుః శ్రీ జగద్గురుః
మమాత్మా సర్వ భూతాత్మా తస్మై శ్రీ గురవే నమః

22) గురు రాది రనాదిశ్చ గురుః పరమ దైవతం
గురు మంత్ర సమో నాస్తి తస్మై శ్రీ గురవే నమః

23) ఏక ఏవ పరో బంధుః విషమే సముపస్థితే
గురుః సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః

24) గురు మధ్యే స్థితం విశ్వం విశ్వ మధ్యే స్థితో గురుః
గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః

25) భవారణ్య ప్రవిష్టస్య దిఙ్ఞ్మోహ భ్రాంత చేతసః
యేన సందర్శితః పంథాః తస్మై శ్రీ గురవే నమః

26) తాపత్రయాగ్ని తప్తానా మశాంత ప్రాణినాం భువి
యస్య పాదోదకం గంగా తస్మై శ్రీ గురవే నమః

27) అఙ్ఞాన సర్ప దష్టానాం ప్రాణినాం కశ్చికిత్సకః
సమ్యక్ ఙ్ఞాన మహా మంత్ర వేదినం సద్గురు వినా

28) హేతవే జగతా మేవ సంసారార్ణవ సేతవే
ప్రభవే సర్వ విద్యానాం శంభవే గురవే నమః

29)ధ్యాన మూలం గురో ర్మూర్తిః పూజా మూలం గురోః పదం

సేకరణ
మంత్ర మూలం గురో ర్వాక్యం ముక్తి మూలం గురోః కృపా

Wednesday, 22 July 2020

దారిద్ర్య దహన గణపతి స్తోత్రం


ఈ దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ప్రతీరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తాము. సకల శుభాలనూ అనుగ్రహించే ఈ  గణపతి స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే, శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.  ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం.

దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధం
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రపుల్ల వారిజాసనం భజామి సింధురాననః

కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికం
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమనూపుర ప్రశోభి తాంఘ్రి పంకజం

సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం
గృహ ప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం
కవీంద్ర చిత్తరంజకం మహా విపత్తి భంజకం
షడక్షర స్వరూపిణం భజే గజేంద్ర రూపిణం

విరించి విష్ణు వందితం విరుపలోచన స్తుతం
గిరీశ దర్శనేచ్చయా సమార్పితం పరాంబయా
నిరంతరం సురాసురైః సుపుత్ర వామలోచనైః
మహామఖేష్ట కర్మను స్మృతం భజామి తుందిలం

మదౌహ లుబ్ధ చంచలాళీ మంజు గుంజితా రవం
ప్రబుద్ధ చిత్తరంజకం ప్రమోద కర్ణచాలకం
అనన్య భక్తి మాననం ప్రచండ ముక్తిదాయకం
నమామి నిత్య మాదరేణ వక్రతుండ నాయకం

దారిద్ర్య విద్రావణ మాశు కామదం
స్తోత్రం పఠెదేత దజస్ర మాదరాత్
పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ
పుమాన్ భవే దేకదంత వరప్రాసాదాత్

ఇతి దారిద్ర్య దహన గణపతి స్తోత్రం సంపూర్ణం

సేకరణ

సూర్యభగవానుడి సర్వరోగ నివారణకు స్తోత్రం


సూర్యభగవానుడి సర్వరోగ నివారణకు స్తోత్రం

ద్వాదశార్యలు సూర్య స్తుతి


ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః |
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు || 1 ||

తా|| ఇప్పుడే ఉదయించి ఉత్తరదిక్కుగా పయనిస్తూన్న సూర్యదేవుడు నా గుండెజబ్బును, కంటిజబ్బును, (కామెర్లు) త్వరగా పోగొట్టుగాక !

నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే |
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ || 2 ||

తా|| అరనిముషంలో ఆకాశముపైరెండువేలరెండువందల రెండు యోజనాలు పయనించే పద్మబాంధవా ! నీకు నమోవాకం !

కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ |
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ || 3 ||

తా|| కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేద్రియాలు ఐదు, మనస్సు, జీవుడు, కూడా తానే అయి సకల సృష్టినీ కల్పించే ఆ ద్వాదశ మూర్తి నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించుగాక !

త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః |
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ || 4 ||

తా|| సూర్యదేవా! మూడువేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస – నీవే

శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ |
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి || 5 ||

తా|| శివరూపుడవైన నీవల్ల ఆత్మజ్ఞానమును, విష్ణురూపుడవైన నీవల్ల మోక్షమును, అగ్ని రూపుడవైన నీవల్ల ఐశ్వర్యమును, నీవల్ల ఆరోగ్యమును కోరుచున్నాను. అనుగ్రహించు.!

త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః |
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు || 6 ||

తా|| చర్మదోషాలను, కంటిదోషాలను, హృదయదోషాలను, ఇంద్రియాల దోషాలను, సూర్యదేవుడు ఒకవిధమైన కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయుగాక !

తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః |
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్ || 7 ||

తా|| చీకటిని పోగొట్టినట్టు కంటిరోగాలను (రేచీకటి జబ్బును) రోగపటలమును, గాజును పగులగొట్టినట్టు రోగాలమూలమును కాలకర్త అయిన సూర్యభగవానుడు పోగొట్టుగాక !

యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః |
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః || 8 ||

తా|| వేయికిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణభాగము చంద్రబింబము నందుండి రాత్రివేళ చీకటినంతనూ మటుమాయంచేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక !

యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం |
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే || 9 ||

తా|| ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటికచీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ అవుతుందో ఏ భాస్కరుడు ఆపదల రూపుమాపుతాడో ఆ పద్మభాందవుణ్ణి ప్రార్ధిస్తాను.

వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ) |
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి || 10 ||

తా|| వాతరోగం, చర్మరోగం, మహోదరం, అతిమేహం, గ్రహణి, భగంధరం అనే మహారోగాలను సూర్యదేవా ! నీవే పోగొట్టే దివ్యవైద్యుడవు.

ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్ |
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః || 11 ||

తా|| ధర్మార్ధ కామమోక్షములను సాధించే కర్మలను చెయ్యనియ్యక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చెండాడుగాక ! మా ఎడల కరుణ జూపించుగాక !

త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః |
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ || 12 ||

తా|| సూర్యదేవా! నీవే నాతల్లివి, నీవేదిక్కు, నాకు కావలసింది ఇచ్చే దాతవు నీవే.! నీవే ధనం, మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. రక్షకుడవు, ఆపదలను పోగొట్టే వాడవు నీవే! నన్ను అనుగ్రహించు.

ఫలశ్రుతి.

ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం |
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్ ||

ఇలాగ పన్నెండు ఆర్యావృత్తములు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి. వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది. అన్ని జబ్బులూ అంతరిస్తాయి.

శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము.

(సేకరణ)

Tuesday, 21 July 2020

శివ అనే పేరులోనే


శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది.
హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. 'శి' అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, 'వ' అంటే మహిళల శక్తి అని అర్థం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి.

శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శివపూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం.

విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూతి ధరించిన
వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతు ఉంటాడు. నరక బాధలకు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన ఆవు పేడను ఈ భస్మంలో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జప, తపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము. మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయాలి అని శాస్త్రము చెబుతుంది. ఈ కాలములో అలాగ చెయడం వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండె , నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు.

త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధారణ చెయాలి. ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి పోతాయని పెద్దల వాక్కు. ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది. మహి మాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా చేత్తోపట్టుకుని వేద మంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని 'శాంతికము' అని అంటారు.

షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని "పౌష్ఠికం" అని అంటారు. బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని "కామదం" అని అంటారు. భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి.

యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచ్చిన అగ్నితో గాని, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండములో వేసి హోమము చెయ్యాలి. అనంతరం శుబ్రమైన పాత్రలో విభుతిని నింపబడుతుంది.

బిల్వ పత్రం: శివుడికి బిల్వ పత్రం సమర్పించడం చాలా ముఖ్యం. మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడి మూడు కనులను చిహ్నం. అలాగే త్రిశూలానికి సంకేతం. ఇవి గత మూడు జన్మల పాపాలను హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

బిల్వపత్రం కోయకూడని రోజులు: బిల్వపత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజులలో ఈ బిల్వ పత్రాలను చెట్టు నుంచి తీయకూడదు. ముక్క పోయిన ఆకులను పెట్టకూడదు. నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి.

కుంకుమ వద్దు: శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూది, గంధంను మాత్రమే ఉపయోగించాలి. శివుడు చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధంను ఉపయోగించాలి.

కొబ్బరినీళ్లు వద్దు: కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు.
ఏ పండ్లు సమర్పించాలి? శివుడికి ఎలాంటి పండ్లనైనా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది. ఇది దీర్షాయుష్షుని సూచిస్తుంది.

ఇలాంటి పూలు వద్దు: సంపంగి పూలను శివుడికి ఎట్టి పరిస్థితుల్లో సమర్పించరాదు. శివుడికి వాటికి శాపం విధించినట్లు చెబుతారు ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూవులను అడుగుతాడు. దీంతో, బ్రహ్మను, సంపంగి ఇద్దరినీ పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు.

స్టీల్ స్టాండ్ : శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ ని ఉపయోగించరాదు. ఒకవేళ మీరు ఇంట్లో శివలింగం పెట్టుకుంటే, జలధార కంపల్సరీ ఉండాలి. అంటే లింగంపై నీటి కుండ కంపల్సరీ ఉండాలి. జలధార లేకుండా, శివలింగం పెట్టుకుంటే నెగటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ అవుతుంది.

పూజించే విధానం: శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలనే స్వయంగా శివుడే వివరించాడు.తులసి ఆకులను ఎట్టిపరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు. శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత పూజ మొదలు పెట్టాలి. సూర్యోదయం సమయంలో ఇలా చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చు.

మంత్రం: పూజలు చేసే సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి

Monday, 20 July 2020

గణేశ దుర్గాస్తోత్రం, రక్షాకరమైన స్తుతి


గణేశ దుర్గాస్తోత్రం, రక్షాకరమైన స్తుతి

ప్రాచ్యాం రక్షతు హేరంబశ్చాగ్నేయాం అగ్నితేజసః
యామ్యాం లంబోదరో రక్ష్యేత్ నైఋత్యాం పార్వతీసుతః
ప్రతీచ్యాం వక్రతుండస్తు వాయవ్యాం వరదః ప్రభుః
ఉదీచ్యాం గణపః పాతు ఈశాన్యాం ఈశనందనః
ఏవం దశదిశో రక్ష్యేత్ హ్యవరం విఘ్న నాయకః
హేరంబస్య దుర్గమిదం త్రికాలం యః పఠేన్నరః
కోటి జన్మ కృతం పాపం ఏకావర్తేన నశ్యతి

"తూర్పున హేరంబుడు, ఆగ్నేయములో అగ్ని సమాన తేజస్వి, దక్షిణాన లంబోదరుడు, నైఋతిలో పార్వతీసుతుడు, పడమర వక్రతుండుడు, వాయువ్యంలో వరదుడైన ప్రభువు, ఉత్తరాన గణపుడు, ఈశాన్యంలో ఈశానందనుడు, ఇలా పది దిక్కులా విఘ్ననాయకుడైన శ్రీమహాగణపతి నన్ను రక్షించుగాక. "

హేరంబుని స్మరించే ఈ రక్షాస్తోత్రాన్ని 3సార్లు పఠించేవారికి పాపసంహరణమే కాక, సంకటాలు తొలుగుతాయి. వెంటనే సమస్యా పరిష్కారం అవుతుంది. ఇది శ్రీ శివకృష్ణ సంవాదంలో ప్రబోధించిన స్తుతిగా పురాణాలు చెబుతున్నాయి.

సేకరణ

Thursday, 9 July 2020

పద్మశ్రీ. కోట శ్రీనివాసరావు గారు


సుప్రసిద్ధ నటులు, విలక్షణ  పాత్రధారి

పద్మశ్రీ. కోట శ్రీనివాసరావు గారికి  జన్మదిన శుభాకాంక్షలు తొ ...

ఆయన గురించి...

10.7.1947 లో కంకిపాడు లో జన్మించిన ఆయన , నటనా రంగం మీద ఆసక్తి తో...

నాటక రంగం లో పలు సేవలు అందించారు... ఆ తరువాత ఆయనకి ఉన్న అపార అనుభవం తో సినీ రంగం లో కి ప్రవేశించారు...
తెలుగు సినిమా చరిత్ర లో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ ని రాసుకున్న ప్రతిభాశాలి శ్రీ శ్రీనివాసరావు గారు.
ఒక్క తెలుగు లొనే కాదు తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు.
తన ప్రతిభకి అనేక నంది అవార్డ్ లు కూడా ఆయన తన సొంతం చేసుకున్నారు...
ప్రతినాయక  పాత్ర కి ఆయన పెట్టింది పేరు... అంతే కాదు...

కారెక్టర్ ఆర్టిస్ట్ గా ,సహా నటుడిగా ఆయన తనదైన విలక్షణమైన శైలి ని ప్రదర్శించి అనేక మన్ననలు పొందారు...

2001 లో చిన్న
1998 లో గణేష్
1993 గాయం ...ఇలా అనేక నందులని గెలుచుకున్నారు....

2015 లో భారత ప్రభుత్వం ఆయనని
అప్పటి ప్రెసిడెంట్ గారు అయిన శ్రీ.ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీద గా విలువైన
పద్మశ్రీ అవార్డు ని ఇచ్చి గౌరవించింది..

ఆయన  నటించిన కొన్ని చిత్రాలు...
1.అత్తారింటికి దారేది..
2.దూకుడు
3.రక్త చరిత్ర
4.బొమ్మరిల్లు
5.అతడు
6.మల్లీశ్వరి
7.గణేష్
8.అనగనగా ఒక రోజు
9.ఆహా నా పెళ్ళంటా
10.గోవిందా గోవిందా
11.శివ
12.ప్రతిఘటన

నంది అవార్డ్ లు...
1. స్పెషల్ జ్యూరీ అవార్డ్... ప్రతిఘటన
2.బెస్ట్ విలన్ ...గాయం
3.కారెక్టర్ ఆర్టిస్ట్.. లిటిల్ సోల్జర్స్
4.బెస్ట్ విలన్ ...గణేష్
5.బెస్ట్ సపోర్టింగ్.... పృధ్వి నారాయణ
6.బెస్ట్ కారెక్టర్.... ఆ నలుగురు
ఇంకా
శ్రీ అల్లు రామ లింగయ్య గారి  పురస్కారం కూడా ఆయనని వరించింది...

1978 లో ప్రాణం ఖరీదుతో ప్రారంభం అయిన ఆయన సినీ ప్రస్థానం ఇప్పటికి కొనసాగిస్తూన్నారు..

నటన అంటే ఆయనకి ప్రాణం...నటించడం కోసం ఎంతటి కష్టాన్ని అయినా పడతారు... ఏ పాత్ర చేసినా అది ఆయనకె సొంతం అనేలా తన ప్రతిభ ని ప్రదర్శిస్తారు...

విలన్ గా , కారెక్టర్ ఆర్టిస్ట్ గా...సహా నటుడిగా... కమెడియన్ గా, కామెడీ విలన్ గా ఇలా ఒకటేమిటి అనేక రకాల పాత్రలని తనదంటూ ఒక ప్రత్యేక శైలి లో అభినయించే ప్రతిభాశాలి శ్రీ కోట శ్రీనివాసరావు గారు.

ఆయన డైలాగ్స్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది...
అందరికి పెడతాండ దండం అంటూ ...ప్రతిఘటన లో...
50 లక్ష లు అన్న ఫిగర్ కి టెంప్ట్ అయిపోయాను అంటూ గోవిందా గోవిందా లో...
ఈ  ఫోన్ ఎవడు కానిపెట్టాడు రా బాబు ,
అంటూ , థాంక్స్ లాంటి మాటల తో శత్రువు లో...

పిసినారి గా .....ఆహా నాపెళ్ళంట లో
ఆ పాత్ర ని ఎప్పటికి ప్రేక్షకులు మరిచిపోరు...

గణేష్ లో తన మేకప్ ...ఎంత భయంకరమైన పాత్ర చేసి....

ఎంతో ప్రేమించే తండ్రి గా బొమ్మరిల్లు లో కారెక్టర్ ఆర్టిస్ట్ గా అంత వేరియేషన్...చూపించిన అద్భుత నటుడు శ్రీ కోట శ్రీనివాసరావు గారు...

మందుబాబులం మేము మందు బాబులం అంటూ తన గాత్రం వినిపించి అందరిని మెప్పించిన కళాకారుడు..

ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ...అనేక విజయాలతో ప్రజల హృదయాలలో ఆయన స్థానం సుస్థిరంగా ఎప్పటికి నిలిచి పోవాలని ...కోరుకుంటూ...

పద్మశ్రీ. కోట శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు... తెలుపుకుంటున్నాను...