Saturday, 17 February 2018

నెయ్యి వాడకం వలన ప్రయోజనములు :

నెయ్యి వాడకం వలన ప్రయోజనములు :

1. నెయ్యిలో ఉండే  K2 , CLA (Conjugated Linoleic Acid)  లు యాంటి యాక్సిడెంట్స్ గా పనిచేస్తాయి
2. నెయ్యి తింటే జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గిపోవడమే కాదు ఆహారం కూడా స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.
3. నెయ్యి వల్ల గ్యాస్ స‌మ‌స్య‌లు ఉండ‌వు.
4. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వాళ్ళు, నెయ్యిని త‌మ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల విట‌మిన్ “ఎ” పుష్క‌లంగా ల‌భించి నేత్ర స‌మ‌స్య‌లు తగ్గుముఖం పడతాయి.
5. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌నే అపోహ ఉంది. అయితే నిజానికి నెయ్యి వల్ల చెడు కొలెస్ట్రాల్‌ పెరగదు.. నెయ్యి మంచి కొలెస్ట్రాల్‌ నే పెంచుతుంది.
6. గ‌ర్భిణీ మ‌హిళ‌లైతే నెయ్యిని క‌చ్చితంగా తీసుకోవాల్సిందేన‌ని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే నెయ్యిని రోజూ తింటే ఎన్నో పోషకాలు గ‌ర్భిణీ స్త్రీలకు, పుట్టబోయే పిల్లలకి ల‌భిస్తాయి.
7. నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు నిర్ధారించాయి.
8.  ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, మొటిమ‌లు కూడా పోతాయి.
9. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా నిర్భ‌యంగా నెయ్యిని తిన‌వ‌చ్చు. అయితే అతి అనర్ధదాయకం.

10. నెయ్యిలో ఉండే యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ వల్ల నెయ్యిని తింటుంటే శ‌రీరంపై అయిన గాయాలు, పుండ్లు తగ్గడమే కాదు రకర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ కూడా ల‌భిస్తుంది.
11.  రోజూ ఆహారంలో తప్పనిసరిగా నెయ్యిని తీసుకుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

12.ఆయుర్వేదం
“నెయ్యి” పాజిటివ్ ఫుడ్‌ అని చెప్తోంది. అంతేకాదు ఇది మిగ‌తా కొవ్వులు, నూనెల్లా కాదు శ‌రీరానికి ఎంతో మంచిది అని వివరణ కూడా ఇచ్చింది.

ఎంతో ఉపయోగకరమైన,  రుచిగా ఉండే నెయ్యిని వాడడము..ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి....