Thursday, 15 February 2018

బొంబాయి రవ్వ వడలు


బొంబాయి  రవ్వ వడలు 
కావలసిన పదార్థాలు 
1. బొంబాయి రవ్వ  1 కప్పు ,
2. పెరుగు 1 కప్పు 
3. ఉల్లిపాయముక్కలు 1/2 కప్పు 
4. పచ్చిమిర్చి  6(ముక్కలుచేసి ఉంచుకోవాలి)
5. కరివేపాకు  5 రెబ్బలు 
6. కొత్తిమీర తరుగు  1/4 కప్పు 
7. ఉప్పు - రుచికి సరిపడినంత 
8. వంటషోడా  కొంచెంగా 
9. నూనె  1/4 కేజీ 
10. వరిపిండి  1 కప్పు 

తయారీవిధానం 
ముందుగా రవ్వలొ పెరుగును వేసి , రెండు గంటలు నానబెట్టాలి.
 ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి 
మరిగించాలి

నూనెమరిగేలోపు  నానబెట్టిన రవ్వ  పిండిలో
వరిపిండి ,ఉల్లిపాయముక్కలుపచ్చిమిర్చికరివేపాకు
కొత్తిమీర తరుగుఉప్పువంటసోడా , 
అన్నీవేసి బాగా కలిపి ,చిన్నచిన్న వడలు లాగా 
ఒక కవరు పైన వత్తుకొని, 
కాగిన నూనెలో వేసి,
 దోరగా రెండువైపులా బంగారు రంగువచ్చేవరకు వేయించుకోవాలి.  
అంతే  కరకరలాడే బొంబాయి  రవ్వ వడలు రెడీ 
  వడలని టమాటా చట్నీ లేదాకొబ్బరి చెట్నీలతో 
తింటే చాలా బావుంటాయి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.