Thursday, 22 February 2018

అన్నం పరబ్రహ్మ స్వరూపం

​అన్నం పరబ్రహ్మ స్వరూపం

1. అరటిఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది.
2. వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని
అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,
3. అరటి ఆకులో, విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది,ఆరోగ్యవంతులుగా ఉంటారు.
4. తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది.
5. బాదం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.
6. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.
7. అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి, ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు అలా చేస్తే  దరిద్రం అంటే అవకాశం ఎక్కువ.
8. ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే
● తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం వలన దీర్గాయుష్షు వస్తుంది
●● పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది
●●● ఉత్తర ముఖంగా కూర్చుంటే  సంపద వస్తుంది
●●● దక్షిణ ముఖంగా కూర్చుంటే  కీర్తి వస్తుంది
9. అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టుట,దుర్భాష లాడుట చేయరాదు.
10. ఏడుస్తూ తింటూ ,దెప్పి పొడువరాదు.
11. ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో కంచం, పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును.
12.భోజనసమయంలో ,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట నష్టదాయకం
బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవ తేన గన్తవ్యం  బ్రహ్మకర్మ సమాధిన

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత:
 ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్

ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది.



Sunday, 18 February 2018

పాని పూరీ


పాని పూరీ 
కావలసిన పదార్థాలు:- 
  1. బొంబాయి రవ్వ (గోధుమనూక) - 1 కప్పు
  2. మైదాపిండి - 2 స్పూన్స్
  3. అప్పడాల షోడా - 1/4 స్పూన్
  4. ఉప్పు - రుచికి తగినంత
  5. నూనె - 1/4 కేజీ
తయారీవిధానం:-
ముందుగా ఒక బౌల్ తీసుకొనిఅందులో బొంబాయి రవ్వమైదాపిండిఉప్పుఅప్పడాల షోడా అన్నీ వేసికొంచెంగా గోరువెచ్చని నీరు పోసిపూరి పిండి మాదిరిగా కలపాలిపిండిని బాగా కలిపిఒక తడిబట్ట కప్పి, 30 నిముషాలు పక్కనపెట్టి నాననివ్వాలిపిండి నానిన తరవాత పెద్ద చపాతిలాగా వత్తుకొనిచిన్న పూరీలుగా చేసుకోవాలి అన్ని తయారుచేసుకున్నాక.స్టవ్ వెలిగించిబాణలి పెట్టినూనె 
పోసికాగిన తరవాత, 3 లేక 4 పూరీలను మాత్రమే నూనెలో 
వేస్తూ వేయించాలిమీడియంలో మంటను ఉంచి పూరీలను వేయించాలినూనెలో వెయ్యగానే పూరీ బాగా పైకి పొంగాలిఈవిధంగా పూరీలను తయారుచేసి పక్కన ఉంచుకోవాలి

పానీపూరీలోకి పానీ తయారుచేయు విధానం
  1. కొత్తిమీర - 1/2 కప్పు
  2. పుదీనా - 1/2 కప్పు
  3. పచ్చిమిర్చి - 2
  4. నల్ల ఉప్పు - చిటికెడు
  5. ఉప్పు - రుచికి సరిపడినంత
  6. ముందుగా కొత్తిమీరపుదీనాపచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీ లో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి
  7. ఇప్పుడు  పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకొని ఒక టీ గ్లాసు 
  8. నీరు పోసి పలుచగా చేసుకోవాలి పానీలో నల్ల ఉప్పుఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి.               కూర తయారుచేయు విధానం 
  1. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
  2. పచ్చిమిర్చి - 2 (చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి)
  3. టమాటా ముక్కలు- 1/2 కప్పు
  4. ఉప్పు - రుచికి సరిపడినంత
  5. కారం - 2 స్పూన్స్
  6. పసుపు - చిటికెడు
  7. జీలకర్ర పొడి - 1 స్పూన్
  8. ధనియాల పొడి - 1/2 స్పూన్
  9. ఛాట్ మసాలా - 1/2 స్పూన్
  10. కొత్తిమీర తరుగు - 1/4 కప్పు
  11. బఠాణీ - 1 కప్పు(పసుపుఉప్పు వేసి బాగా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి
  12. బంగాళాదుంపలు - 2 (ఉడికించి తొక్కతీసి ఉంచుకోవాలి)   
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 3 స్పూన్స్ నూనె వేసి
అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలుటమాటా ముక్కలుఉప్పుకారంపసుపుఒక్కొక్కటిగా వేసుకుంటూ పచ్చివాసన 
పోయేటట్టు కొద్దిసేపు వేయించుకోవాలిఇప్పుడు మెత్తగా ఉడికించి పక్కన ఉంచుకున్న బఠాణీ వేసుకోవాలిఉడికించిన బంగాళాదుంపని చేతితో మెత్తగా చేస్తూ బాణలిలో వేసెయ్యాలి మిశ్రమాన్ని బాగా కలుపుతూ కొద్దిగా నీరు పోసిజీలకర్ర పొడినిధనియాల పొడిని వెయ్యాలిఇప్పుడు 
 మిశ్రమంలో ముందుగా తయారుచేసి ఉంచుకున్న పానీని రెండు గరిటలు కలిపిమిశ్రమాన్ని మెత్తగా గరిటతో చేసుకోవాలిఅంతే పూరీలోకి కూర కూడా రెడీ.
ఇప్పుడు పూరీలలో తయారుచేసిన కూరని వేసి ఉల్లిపాయ ముక్కలనికొత్తిమీరని వేసుకొనిపానీని పోసుకొని  తింటే చాలా బావుంటాయి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే 
మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
Writer's
Achanta Subbalakshmi 
Achanta Subhadevi

విజ్ఞప్తి : 
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న 
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి




                      

Saturday, 17 February 2018

నెయ్యి వాడకం వలన ప్రయోజనములు :

నెయ్యి వాడకం వలన ప్రయోజనములు :

1. నెయ్యిలో ఉండే  K2 , CLA (Conjugated Linoleic Acid)  లు యాంటి యాక్సిడెంట్స్ గా పనిచేస్తాయి
2. నెయ్యి తింటే జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గిపోవడమే కాదు ఆహారం కూడా స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.
3. నెయ్యి వల్ల గ్యాస్ స‌మ‌స్య‌లు ఉండ‌వు.
4. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వాళ్ళు, నెయ్యిని త‌మ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల విట‌మిన్ “ఎ” పుష్క‌లంగా ల‌భించి నేత్ర స‌మ‌స్య‌లు తగ్గుముఖం పడతాయి.
5. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌నే అపోహ ఉంది. అయితే నిజానికి నెయ్యి వల్ల చెడు కొలెస్ట్రాల్‌ పెరగదు.. నెయ్యి మంచి కొలెస్ట్రాల్‌ నే పెంచుతుంది.
6. గ‌ర్భిణీ మ‌హిళ‌లైతే నెయ్యిని క‌చ్చితంగా తీసుకోవాల్సిందేన‌ని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే నెయ్యిని రోజూ తింటే ఎన్నో పోషకాలు గ‌ర్భిణీ స్త్రీలకు, పుట్టబోయే పిల్లలకి ల‌భిస్తాయి.
7. నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు నిర్ధారించాయి.
8.  ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, మొటిమ‌లు కూడా పోతాయి.
9. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా నిర్భ‌యంగా నెయ్యిని తిన‌వ‌చ్చు. అయితే అతి అనర్ధదాయకం.

10. నెయ్యిలో ఉండే యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ వల్ల నెయ్యిని తింటుంటే శ‌రీరంపై అయిన గాయాలు, పుండ్లు తగ్గడమే కాదు రకర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ కూడా ల‌భిస్తుంది.
11.  రోజూ ఆహారంలో తప్పనిసరిగా నెయ్యిని తీసుకుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

12.ఆయుర్వేదం
“నెయ్యి” పాజిటివ్ ఫుడ్‌ అని చెప్తోంది. అంతేకాదు ఇది మిగ‌తా కొవ్వులు, నూనెల్లా కాదు శ‌రీరానికి ఎంతో మంచిది అని వివరణ కూడా ఇచ్చింది.

ఎంతో ఉపయోగకరమైన,  రుచిగా ఉండే నెయ్యిని వాడడము..ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి....


Thursday, 15 February 2018

బొంబాయి రవ్వ వడలు


బొంబాయి  రవ్వ వడలు 
కావలసిన పదార్థాలు 
1. బొంబాయి రవ్వ  1 కప్పు ,
2. పెరుగు 1 కప్పు 
3. ఉల్లిపాయముక్కలు 1/2 కప్పు 
4. పచ్చిమిర్చి  6(ముక్కలుచేసి ఉంచుకోవాలి)
5. కరివేపాకు  5 రెబ్బలు 
6. కొత్తిమీర తరుగు  1/4 కప్పు 
7. ఉప్పు - రుచికి సరిపడినంత 
8. వంటషోడా  కొంచెంగా 
9. నూనె  1/4 కేజీ 
10. వరిపిండి  1 కప్పు 

తయారీవిధానం 
ముందుగా రవ్వలొ పెరుగును వేసి , రెండు గంటలు నానబెట్టాలి.
 ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి 
మరిగించాలి

నూనెమరిగేలోపు  నానబెట్టిన రవ్వ  పిండిలో
వరిపిండి ,ఉల్లిపాయముక్కలుపచ్చిమిర్చికరివేపాకు
కొత్తిమీర తరుగుఉప్పువంటసోడా , 
అన్నీవేసి బాగా కలిపి ,చిన్నచిన్న వడలు లాగా 
ఒక కవరు పైన వత్తుకొని, 
కాగిన నూనెలో వేసి,
 దోరగా రెండువైపులా బంగారు రంగువచ్చేవరకు వేయించుకోవాలి.  
అంతే  కరకరలాడే బొంబాయి  రవ్వ వడలు రెడీ 
  వడలని టమాటా చట్నీ లేదాకొబ్బరి చెట్నీలతో 
తింటే చాలా బావుంటాయి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.





ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే


బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవ తేన గన్తవ్యం  బ్రహ్మకర్మ సమాధిన

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత:
 ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్

ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది. ఆహారానికి పాత్రశుద్ది, పాకశుద్ది, పదార్థశుద్ది ఉండాలని స్వామి చెప్పారు. పాత్రశుద్ది మనంచేయగలం. పాకశుద్ది అంటే ఎలాంటి తలపులతో వంట చేస్తున్నారో, పదార్థశుద్ది అనగా మనం తెచ్చుకున్న పదార్ధములు మోసము చేసి తెచ్చినవో, దొంగిలించినవో మనకు తెలియదు. అన్యాయార్జన పదార్ధము అనారోగ్యాన్ని, దుర్భుద్దులను పెంచుతాయి. అందువలన ఆహారం భుజించేముందు ఆహారాన్ని దైవానికి సమర్పించి  భుజిస్తే అది ప్రసాదంగా మారి దోషరహితం అయిపోతుంది. ఎట్టి తిండియో అట్టి త్రేపు. ఆహారాన్ని బట్టి ఆలోచనలు వుంటాయి. అందువలన రజో, తమో  గుణ సంబంధమైన ఆహారాన్ని త్యజించి సాత్వికాహారము దైవానికి అర్పించి భుజిస్తే సత్ప్రవర్తన, సద్బుద్ది, సదాలోచనలు కలుగుతాయి. అన్ని యింద్రియాలకు సాత్వికాహారం యివ్వాలని స్వామి చెప్పారు.