Tuesday, 9 January 2018

మసాలా పరోటా


మసాలా పరోటా

కావలసిన పదార్థాలు
1. గోధుమపిండి - 1/4 కేజీ
2. మైదా - 1/4 కేజీ
3. శెనగపప్పు - 1/4 కేజీ
4. పాలు - 1/4 లీటరు
5. అల్లం - చిన్నముక్క
6. జీలకర్ర - 2 స్పూన్స్
7. మిరియాలు - 1 స్పూన్
8. కారం - 1 స్పూన్
9. గరంమసాలా - 1/2 స్పూన్
10. సన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీర - 1/2 కప్పు
11. నెయ్యి - 100 గ్రా
12. ఉప్పు - రుచికిసరిపడ

తయారుచేయు విధానం
ముందుగా ఒక బేసిన తీసుకొని అందులో
గోధుమపిండి, మైదాపిండి, పాలు, ఉప్పు అన్నీ వేసి
తగినంత నీరు పోస్తూ చపాతీపిండిలాగా మృదువుగా కలుపుకోవాలి.
 చివరిగా నూనె వేసి కలిపి, ఆ పిండిపైన తడిబట్ట కప్పి,
అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి.
ఈలోగా స్టవ్ వెలిగించి, ఒక చిన్న కుక్కర్ తీసుకొని,  గిన్ని పెట్టి ,
నీరు పోసి  అందులోశెనగపప్పును వేసి, బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బాణలి తీసుకొని, అందులో
జీలకర్ర, మిరియాలు సన్ననిమంటపై వేయించి తీసి,
మిక్సీ లో మెత్తగా పొడిగా చేసుకొని,
ఆ పొడిని,
దంచిపెట్టుకున్న అల్లం ముక్కల్ని, కొత్తిమీర, కారం, ఉప్పు,  గరంమసాలా పొడిని
అన్నీ పప్పులో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.            
పిండి నానినతరవాత, చిన్నచిన్న ఉండలుగా చేసుకొని,
చపాతీలాగా వత్తుకొని, దానిమీద పప్పు మిశ్రమాన్ని కొంచెం ఉంచి,
మూసేసి, చపాతీని నాలుగు మడతలు వేసి, మళ్ళీ మెల్లగా వత్తాలి.
అలా అన్నీ వత్తి పక్కన పెట్టుకొని, స్టవ్ వెలిగించి, పెనం పెట్టి,
ఒక్కొక్కటిగా పరోటాలను  నేతితో కాల్చుకోవాలి.
మసాలా పరోటా రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.