Saturday, 4 April 2026

శ్రీ లలితా దేవి యొక్క మొదటి పది నామాలు

  శ్రీ లలితా దేవి యొక్క మొదటి పది నామాలు


 ఈ శ్లోకంతో ప్రారంభమవుతాయి:

శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ |

చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా ||

ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా |

రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా ||


పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు:


లలితా నామాలను పఠించడం వల్ల కలిగే కొన్ని ముఖ్య ఫలితాలు:


మానసిక ప్రశాంతత: మనసులోని అలజడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది.

ఆరోగ్యం: నిత్యం పఠించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.

ఐశ్వర్యం: ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలిగి, దారిద్య్రం తొలగుతుంది.

రోగాలను హరించే నామాలు కలిగిన శ్లోకం

 రోగాలను హరించే నామాలు కలిగిన శ్లోకం:

"సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణీ |

అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మష నాశినీ ||"


ముఖ్యమైన నామాల అర్థాలు:


పై శ్లోకంలో ఉన్న ఈ మూడు నామాలు  కోరుకున్న ఫలితాలకు నిదర్శనం:

సర్వవ్యాధి ప్రశమనీ 

సమస్తమైన శారీరక మరియు మానసిక వ్యాధులను నయం చేసే తల్లి.

సర్వమృత్యు నివారిణీ : 

అకాల మృత్యువు (అపమృత్యువు) దరిచేరకుండా రక్షించేది.

కలికల్మష నాశినీ 

కలియుగ దోషాల వల్ల కలిగే బాధలను, పాపాలను హరించేది.


సేకరణ