Tuesday, 28 March 2023

మంచి మనసులు.. కధ

 


                   " మంచి మనసులు "

" ఏమండీ అబ్బాయి ఏమైనా ఫోన్ చేశాడా "
అంది శాంత.
" లేదే వాడేదో బిజీ గా ఉన్నట్లు ఉన్నాడు... "
" లేకపోతే  వాడే చేసే వాడుగా "
అన్నారు రావు గారు.
" పోనీ మీరైనా ఒకసారి చేయొచ్చు గా ,
వాడికి ఖాళీ లేక మర్చిపోతే " అంది..శాంత
" అలాగే లే ,
ముందు నాకో కాఫీ ఒకటి ఇవ్వు " అన్నారు రావు
సరే అంటూ లోపలికి వెళ్ళింది శాంత
" దీనికి ఏం తెలుసు, 
నేను వాడికి ఎన్ని సార్లు ఫోన్ చేశానో..
ఒక్కసారి కూడా పలకడు...
పైగా ఫోన్ చేస్తే బిజీ గా ఉన్నా ,
మీటింగ్ లో ఉన్నా అంటూ ,
తరువాత చేస్తా అంటూ విసుక్కుంటున్నాడు..
ఖాళీ అయితే నేనే చేయనా
ఇలా అస్తమాను డిస్టర్బ్ చేయకండి అన్నాడు
అని దీనికి ఎలా చెప్పను...
బాధ పడుతుంది ."..అనుకున్నారు మనసులో...
కాఫీ పట్టుకుని వచ్చింది
" ఈ సారి ఫోన్ చేస్తే ,
ఒక్కసారి వచ్చి వెళ్ళమని చెప్పండి
చూసి రెండు సంవత్సరాలు అవుతోంది.. "
అంది ఆర్తిగా...
" నీ బాధ నేను అర్థం చేసుకోగలను ..
కానీ వాడు అర్ధం  చేసుకోవాలి గా...
ఎంత సేపు బిజి అంటాడు.."
అనుకుని
" సరేలే నేను చెబుతా...
నువ్వేమి ఇవేమీ ఆలోచించకు
నీ ఆరోగ్యం కూడా అంత బాగోలేదు..
మళ్ళీ బెంగ పెట్టుకుంటే అదో సమస్య.. "
అన్నారు రావు
" వృద్దాప్యం వచ్చేసింది...గా
పోయే ఆరోగ్యం గాని వచ్చేది కాదుగా ..
ఏవో ఉంటూనే ఉంటాయి..."  అంది..
అబ్బో దీనికేం తక్కువ లేదు...
అనుకుని
కాఫీ తాగేసి కప్ ఇచ్చారు...
" నిజానికి వాళ్ళ తప్పు ఏమి ఉండదు... "
" బాగా చదువుకోవాలి
మంచి ఉద్యోగం చేయాలి
బాగా స్థిరపడాలి అనేగా
కష్టపడి చదివిస్తాం..."
" బాగా చదువు కున్నాక..
మరి పట్నాలలో నేగా ఉద్యోగాలు...
మరి అంతంత జీతాలు ఇస్తూ
వాళ్ళు ఉరుకుంటారా ...
దానికి తగ్గ పని చేయించుకుంటారు...
మరి.."
" అన్ని మనమే అనుకుంటే ఎలా
పరిస్థితులు అర్ధం చేసుకుని అలవాటు చేసుకోవాలి... దీని తాపత్రయం దీనిదే గాని...
మరి దీనికి ఎప్పుడు అర్ధం అవుతుందో... మరి "  అనుకున్నారు స్వగతం గా...అలా పడకుర్చీ లో వెనక్కి వాలి కళ్ళు ముసుకుని..రావుగారు

" ఏది ఏమైనా కనీసం 3 నెలలకి ఒకసారి ..
అయినా కాస్త ముఖం చూపిస్తే ..
కాస్త సంతృప్తి గా ఉంటుంది..
మనవలు  పెద్దవాళ్ళు అయి పోతున్నారు... వాళ్ళతో కాస్త సరదాగా గడిపే సమయము
వస్తుందో రాదో... "
అంటూ ఆలోచిస్తూ అలాగే
నిద్రలోకి జారి పోయారు రావు...
****
రమేష్ పెద్ద కార్పొరేట్ కంపెనీ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు..
కష్ట పడి పనిచేసే తత్వం  కావడం తో తొందరగా నే ప్రమోషన్ లు వచ్చేసాయి...
ఇపుడు కీలకమైన పొజిషన్...
పని వత్తిడి ఎక్కువ కావడంతో అలాగే రోజులు గడిచిపోతున్నాయ్...
ఇలా ఉండగా ఒకరోజు తన కూతురు వచ్చింది.. " "నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అంది ."
లాబ్ టాప్ లోంచి తల ఎత్తి
" ఏం మాట్లాడాలి " అన్నాడు రమేష్..
" మా కాలేజ్ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ కోసం వేరే ఊరు వెళ్ళాలి అంటున్నారు.."
" అలా వెడితే ఆ మార్కులు కూడా కలుస్తాయి ట" అంది శైలు..
"ఇపుడు అవసరమా ,
ఏదో చెప్పి మేనేజ్ చేయలేవా  "
అన్నాడు రమేష్..
" తప్పదు లేకపోతే నేనే మానేసే దాన్ని... "
అంది శైలు
" ఎన్నాళ్ళు .." అన్నాడు రమేష్
" ఒక వారం " అంది శైలు
" అమ్మో అన్నాళ్లే..
మరి ఏర్పాట్లు " అన్నాడు రమేష్
" అన్ని వాళ్లే చూసుకుంటారు..
పైగా ఈ పక్క ఉరే..
కానీ ప్రాజెక్ట్ కోసం అక్కడే స్టే చేయమంటున్నారు.." అంతే అంది..
" మరి మీ అమ్మని ఆడిగావా"  అన్నాడు రమేష్..
" ఆ , నిన్నే అడగమంది..
" నువ్వు ఒప్పు కుంటే సరే అంది... " అన్నది శైలు..
" సరే , డబ్బు కావాలంటే అమ్మని అడుగు .."
"కానీ జాగ్రత్త.. రోజు ఫోన్ చేయాలి ..సరేనా "
అన్నాడు రమేష్..
సరే నాన్న అని అమ్మకి చెప్పడానికి లోపలికి వెళ్ళింది..
" అమ్మా నాన్న సరే అన్నారు.. "అంది..
" సరే ఆ ఏర్పాట్లు చేసుకో.
జాగ్రత్తగా  ఉండాలి ..అర్ధం అయిందా.. "
అంది తల్లి ..
సరేలే అమ్మా అంటూ లోపలికి వెళ్లి ఏర్పాటు చేస్కోసాగింది...
" ఏమండీ మీరు ఊరు వెళ్లమన్నారు ట కదా "
  అంది ఇందు...
" అవును తప్పదు ట...
జాగ్రత్తగా వెళ్లి వస్తుంది లే...
అయిన ఒకసారి వెళితే గాని స్వతంత్రం గా ఆలోచించడం రాదు..
ఎంత సేపు మనమే కూడా ఉంటే ఎలా నేర్చుకుంటారు
అన్నీ నేర్చుకోవాలి..
మనం
" వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం "  నేర్పించాలి...
" ఏమి పరవాలేదు పంపించు..."
" కాకపోతే రోజూ కాస్త వేళకు తింటోందో లేదో కనుక్కో చాలు "
అన్నాడు రమేష్..
ఆ మరునాడు శైలు కాంప్ కి వెళ్ళింది...

రెండు రోజులు బాగానే గడిచాయి రమేష్ కి తరువాత మొదలయింది
కుతురి మీద బెంగ
ఇంతకాలం ఒంటరిగా ఎక్కడికి పంపలేదు ..
ఇంటికి వస్తే ఏదో వెలితి ...
ఒక్కోరోజు భారంగా గడుస్తోంది...
పాపం రమేష్ కి ..
" కానీ తప్పదు ..అలవాటు చేసుకోవాలి " అనుకున్నాడు...
మరునాడు తన స్నేహితుడు విశ్వం  తో
ఇదే విషయాన్ని పంచుకున్నాడు...
" అదేమిటి రమేష్ ,
రేపు దానికి పెళ్లి అయితే ఎలా ..
ఆడపిల్ల అన్నాక తప్పదు గా అత్తవారింటికి  పంపించాలి.. "
"పైగా ఇపుడు,  ఆడ ఏమిటి మగ ఏమిటి అందరూ ఉద్యోగ కారణం తో ,
తల్లిదండ్రులు కు దూరంగానే ఉంటున్నారు...
ఎవరి దాకా ఎందుకు
మనం లేమా....
ఎన్నాళ్ళు అయింది రా
మీ తల్లిదండ్రులు దగ్గరకు వెళ్లి..
గట్టిగా కార్ లో కొడితే 3 నుంచి నాలుగు గంటల ప్రయాణం...
ఆ కాస్త ఖాళీ కూడా చేసుకోలేకపోతున్నాం...
మన పిల్లల దాకా వచ్చే సరికి
మనం తల్లిదండ్రులు గా ఫీల్  అయిపోతున్నాం... మన తల్లిదండ్రులు కి మనం కూడా పిల్లలమే గా ...వాళ్ళకి  కూడా మనలాగే ,
మనలని చూడాలని ఉంటుంది గా ..
పాపం బెంగతో ,
మనం ఎక్కడ ఇబ్బంది పడతామో అని
వాళ్ళ ఫీలింగ్స్ అన్ని
లోపలే అణగ తొక్కు కుని
ఏరోజుకైనా రాక పోతామా అని ఎదురుచూస్తు ఉంటారు.."

" ఈ మాటలు మనసుకి కఠినం  కలిగించే విషయం అయినా ఆలోచించ వలసిన విషయం.."
" ఈ స్పీడ్ ప్రపంచంలో పడి మనం
ఎంత తప్పు చేస్తున్నామో గ్రహించలేక పోతున్నాం.. చదువులు చెప్పించారు
ఇంత జీవితాన్ని ఇచ్చారు
ఆఫ్టర్ఆల్ వాళ్ళు మన నుంచి ఎక్సపెక్ట్ చేసేది
" ఒక ప్రేమ పూర్వక పలకరింపు... "
" మనతో కలిసి కొంత సమయం గడిపే అవకాశం..." " ఎందుకంటే చిన్నప్పటి నుండి
మన మీదే అన్ని పెట్టుకుని పెంచారు గా ,
అంటే
ఇపుడు మనం మన పిల్లలని పెంచుతున్నట్లు గా...
" అదే ప్రేమ కదా ఎక్కడైనా , ఏ తరానికైనా..."
అన్నాడు విశ్వం..
" రేపు మన పిల్లలు
ఇదే చూసి నేర్చు కుంటారు
అపుడు మనం తట్టు కోగలమా.. " అన్నాడు విశ్వం
" అవును నిజమే , ఆలోచిస్తూ ఉంటే గుర్తుకు వస్తోంది..
నేను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నానో...
పాపం నాన్న చాలా సార్లు ఫోన్ చేశారు..
కానీ ఏదో టెన్షన్ వలన సరిగ్గా ఆన్సర్ చేయలేక పోయాను..
పైగా నేనే ఫోన్  చేస్తానని విసుక్కున్నా...
నిజానికి ఆయన ఎంత ఆపేక్ష తో చేశారో...
పాపం అమ్మ కూడా
ఎదురు చూస్తూ ఉంటుంది కదా
నా పలకరింపు కోసం...
" జీతం ఇచ్చే వాడికి జీవితం ఇచ్చేస్తున్నాం
కానీ జీవితం ఇచ్చిన వాళ్లకోసం కొంత సమయం కేటాయించ లేక పోతున్నాం... "
పిల్లలు "  బాగున్నావా ,  తిన్నావా అని
పలకరిస్తే చాలు ,బోలెడు సంబరపడిపోతారు."
అలాంటి పలకరింపు కోసం ఎదురు చూపులు
చూసే ఖర్మ వాళ్ళకి రాకూడదు..
వాళ్ళకి ఇక ఇలాంటి పరిస్థితి రాకుండా
నేను ఇవాళ్టి నుండి చూసుకుంటా..
ఈ పండగకి మా ఊరు ,భార్య ,
పిల్లలతో వెడతా ..
ఈ రెండు రోజులు మా అమ్మ నాన్న లతో హాయిగా గడువుతా...
ఉద్యోగం ఎంత అవసరమో  ,
వాళ్ళకి కొంత సమయాన్ని కేటాయించడం
మన బాధ్యత అని తెలుసుకున్నా రా ,
మరి నే వస్తా...రా విశ్వం "
అన్నాడు రమేష్...
" ఆ మార్పు ఏదో , ఈ క్షణం నుండి
మొదలు పెట్టరా "  ..అన్నాడు విశ్వం..
అదెలా రా అన్నాడు రమేష్..
అది కూడా నేనే చెప్పాలా..
" ఫోన్ కొట్టు మీ నాన్నగారికి...."
అన్నాడు విశ్వం..నవ్వుతూ
" ఓహ్ ..నిజమేగా ... ఇపుడే చేస్తా "
అంటూ ఫోన్ చేసాడు..
ఉత్సాహంగా చిన్నపాటి ఉద్వేగం
నాన్న ఏమంటారో అని ...
రావు గారు ఫోన్ తీశారు..
హలో ఎవరు అన్నారు...
నాన్న గొంతు వినగానే ,
రమేష్ కి గొంతులో ఏదో తీయని  బాధ
మాట రావట్లేదు రమేష్ కి ..
కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి...
గొంతు గద్గద మైంది...
ఎవరూ  ఫోన్ చేసి మాట్లాడరేమిటి
అని మళ్ళీ అడిగి ,
కళ్ళజోడు పెట్టుకుని పేరు చూసారు ..
అబ్బాయ్ రమేష్ అని ఉంది...
ఆనందం తో ఆయన కళ్ళు మెరిసాయి
ఒసేయ్  శాంతా అబ్బాయి ఫోన్ ,అని అరచి
ఫోన్ చేసి మాట్లాడవేరా
అంతా బాగానే ఉంది గా..
కోడలు పిల్లలు బాగున్నారా
అని ప్రశ్నల వర్షం కురిపించారు..."
ఇంతలో
"  ఒసేయ్ ఎక్కడ ఉన్నావ్ 
అబ్బాయి ఫోన్ అంటూ ఆనందం గా మళ్ళీ  అరిచారు... "
ఆ ఆ  వినబడింది లెండి ,
వస్తున్నా అంది శాంత...
నాన్న మాటల్లో ఆనందం వినిపిస్తోంది రమేష్ కి
" ఈ మధ్య దానికి వినికిడి కొంచెం మందగించింది రా వృద్ధాప్యం కదా ...డాక్టర్ కి చూపిస్తా అంటే నాకేమి చెముడు లేదు ,కొంచెం వినబడదు అంతే అంటుంది పిచ్చిది.. "
అంటూ తన ధోరణి లో ఆనందం గా మట్లాడేస్తున్నారు రావు గారు
" నాన్నా.."
అన్నాడు రమేష్  మొత్తానికి గొంతు పెగుల్చు కుని
" చెప్పరా నాన్నా "
అన్నారు..రావు గారు
" నన్ను క్షమిచగలరా " అన్నాడు ...రమేష్
" అదేమిట్రా 
ఏదేదో మాట్లాడు తున్నావ్
నిన్ను క్షమించడము ఏమిట్రా..
నువ్వు అసలు ఏమి తప్పు చేశావని "
అన్నారు ఆప్యాయంగా..
" పనులు వత్తిడి వలన రాలేక పోయా
కనీసం ఫోన్ కూడా చేయలేదు
మీకు నా మీద కోపం లేదా"
అని అడిగాడు... రమేష్
ఆఫీసు అన్నాక  సవా లక్ష పనులు ఉంటాయి .."
అవి అన్ని చూసుకునే అప్పటికి
నీకు బహుశ ఖాళీ లేదేమో ..
దానికే అంత ఫీల్ అవ్వాలా " అన్నారు...రావు గారు
అందుకే మీరు " తల్లిదండ్రులు " అయ్యారు..
"  క్షమా హృదయం మీది... "
" రేపే నేను బయలుదేరి వస్తున్న "
" ఈ పండగ మీదగ్గరే జరుపుకుంటా.. "
ఈ పండగే కాదు ఇక ఎపుడు అవకాశం దొరికినా మీతోనే గడపడానికి సమయం కేటాయిస్తా...
అమ్మకి ఒకసారి ఇవ్వండి "
అన్నాడు... రమేష్
" ఇదిగో అబ్బాయి నీతో మాట్లాడుతాడుట.."
ఇదిగో ఈ చెవిలో పెట్టుకొని మాట్లాడు ,ఆ చెవి నీకు సరిగ్గా వినబడదు అన్నారు రావు గారు..
నాకు తెలుసు లెండి ...అంటూ
" ఏరా అబ్బాయ్ ఎలా ఉన్నావ్ ,
వేళకి తింటున్నావా లేదా..."
అని అడిగింది ఆప్యాయంగా
అమ్మవి కదా కొడుకు ఆకలి పట్టించుకున్నావ్...
నేనే మొద్దు గాడిని ,
స్పీడ్ ప్రపంచపు మాయలో పడి మిమ్మలిని పట్టించుకోలేదు...క్షమించవే అన్నాడు రమేష్..
అంత మాట అనకు రా అబ్బాయ్ ,
నాకు ఏడుపు వచ్చేస్తుంది... అంది...శాంత
వద్దు  తల్లీ ఇప్పుడు నువ్వు టాప్ తిప్పకు...
నీకు దండం పెడతాను...అన్నాడు రమేష్
చిన్నప్పడు ఎప్పుడు అలా అనగానే నవ్వేసేది ఆవిడ...
పోరా నువ్వు ఏమి మారలేదు.. అంటూ నవ్వేసింది..
అన్నట్టు నేను ,
మీ కొడలు , మనవలు తో
రేపు వస్తున్నానే ,
ఆ విషయం చెపుదామని ఫోన్ చేశా ..."
అన్నాడు రమేష్..
" చాలా సంతోషం రా..
జాగ్రత్తగా వచ్చేయి నీకోసం ఎదురుచూస్తూ ఉంటాం"
అని పెట్టేసింది ఫోన్.
రమేష్ ఆనందం గా ఇంటికి బయలుదేరాడు..
ఆ పండగ అందరితో సంతోషంగా గడిపాడు..
పిల్లలు తాత  , బామ్మ గారి తో సంతోషం గా గడిపారు..
శాంత ,
వాళ్ళకి బోలెడు కథలు చెప్పింది...
వాళ్ళు ఆమెతోనే పడుకున్నారు ...
ఆ రెండు రోజులు...రెండు క్షణాల్లా గడిచిపోయాయి...
బయలుదేరే సమయం వచ్చింది ...
" నాన్నా ఇక్కడ చాలా బాగుంది,
నానమ్మ , తాత గారు లు బోలెడు కబుర్లు,  కథలు చెప్పారు... "
" ఇలాంటి అనుభూతి ఇంతకు ముందు ఎన్నడూ లేదు..."
"మళ్ళీ ఇక్కడికి ఎపుడు వస్తాము "
అంది శైలు..
మళ్ళీ నెలలో సెలవులు వస్తాయి  గా
అపుడు మళ్ళీ వద్దాం అంటూ

తల్లిదండ్రులు దగ్గర
ఆశీర్వాదం తీసుకొన్నారు..
ఆనందంగా...
మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాం అంటూ బాయ్ చెప్పారు రావు గారు శాంత..

" అందరివి మంచి మనసులే ,
కానీ పరిస్థితులు లని అధిగమించి
మన ప్రేమ వాళ్ళని చేరగలిగితే ...
అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి ఉండదు..."

" ఉన్నంత కాలం వాళ్ళు ఉండరు...
ఆ తరువాత కావాలన్నా దొరకరు "
తల్లిదండ్రులు విలువ కట్టలేని
అమూల్యమైన సంపద "

" వాళ్ళు ఉన్నంత కాలం
వాళ్లకోసం వాళ్ళకి కావలిసిన
సమయాన్ని ,ఆనందాన్ని
వాళ్లకి ఇచ్చేద్దాం "
వాళ్ల ఎదురు చూపులు ,
" ఎండమావులు "
కాకుండా చూసుకునే బాధ్యత మనదే..."
           అలా చూసుకొనే అందరికి ,
                నమః సుమాంజలి  తో

మీ రచయిత
ఆచంట గోపాలకృష్ణ

ఇది కేవలం  కల్పిత కధ
పాత్రలు , కధ , కథనం అంతా కల్పితం
ఎవరిని ఉద్దేశించినది కాదు..
కధ కోసం పాత్రల చేత అలా ప్రవర్తిచేలా రాయడం జరిగింది.


Thursday, 23 March 2023

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం

 


స్తోత్రం
హరిః ఓం
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 1 ॥
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః ।అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః ।నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥
సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥
స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥
అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ॥ 6 ॥
అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం ॥ 7 ॥
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః ।హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ 8 ॥
ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః ।అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్॥ 9 ॥
సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ॥ 10 ॥
అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః ।వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ 11 ॥
వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః ।అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ 12 ॥
రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః ।అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః ॥ 13 ॥
సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః ।వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ 14 ॥
లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ 15 ॥
భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్నుర్జగదాదిజః ।అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ 16 ॥
ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః ।అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ॥ 17 ॥
వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ।అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ॥ 18 ॥
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ॥ 19 ॥
మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః ।అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః ॥ 20 ॥
మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః ।హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ 21 ॥
అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః ।అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ 22 ॥
గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః ।నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ॥ 23 ॥
అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణఃసహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥ 24 ॥
ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః ।అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ 25 ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ 26 ॥
అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః ।సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః ॥ 27 ॥
వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః ।వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ॥ 28 ॥
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః ।నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ 29 ॥
ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।ఋద్దః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ 30 ॥
అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ।ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః ॥ 31 ॥
భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ॥ 32 ॥
యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ॥ 33 ॥
ఇష్టోఽవిశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ 34 ॥
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ 35 ॥
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః ।వాసుదేవో బృహద్భానురాదిదేవః పురంధరః ॥ 36 ॥
అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః ।అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ 37 ॥
పద్మనాభోఽరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ ।మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ 38 ॥
అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ।సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ॥ 39 ॥
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః ।మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ 40 ॥
ఉద్భవః, క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ 41 ॥
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః ।పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః ॥ 42 ॥
రామో విరామో విరజో మార్గోనేయో నయోఽనయః ।వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మ విదుత్తమః ॥ 43 ॥
వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ॥ 44 ॥
ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ 45 ॥
విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయం ।అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ 46 ॥
అనిర్విణ్ణః స్థవిష్ఠో భూద్ధర్మయూపో మహామఖః ।నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః, క్షామః సమీహనః ॥ 47 ॥
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః ।సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం ॥ 48 ॥
సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।మనోహరో జితక్రోధో వీర బాహుర్విదారణః ॥ 49 ॥
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్। ।వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ 50 ॥
ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరం॥అవిజ్ఞాతా సహస్త్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥
గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః ।ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥
ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ॥ 53 ॥
సోమపోఽమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః ।వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః ॥ 54 ॥
జీవో వినయితా సాక్షీ ముకుందోఽమిత విక్రమః ।అంభోనిధిరనంతాత్మా మహోదధి శయోంతకః ॥ 55 ॥
అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనందోఽనందనోనందః సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ ॥ 57 ॥
మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ ।గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః ॥ 58 ॥
వేధాః స్వాంగోఽజితః కృష్ణో దృఢః సంకర్షణోఽచ్యుతః ।వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥
భగవాన్ భగహాఽఽనందీ వనమాలీ హలాయుధః ।ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥
సుధన్వా ఖండపరశుర్దారుణో ద్రవిణప్రదః ।దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥
త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ ।సన్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణం। 62 ॥
శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః ।గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ॥ 64 ॥
శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమా~ంల్లోకత్రయాశ్రయః ॥ 65 ॥
స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః ।విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః ॥ 66 ॥
ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః ।భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః ॥ 67 ॥
అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః ।అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥
కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః ।త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనంతో ధనంజయః ॥ 70 ॥
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥
స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥
మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥
సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః ।శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ॥ 75 ॥
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ॥ 77 ॥
ఏకో నైకః సవః కః కిం యత్తత్ పదమనుత్తమం ।లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥
సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ ।వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ॥ 80 ॥
తేజోఽవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంవరః ।ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః ॥ 81 ॥
చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః ।చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥
సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥
శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ।ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥
ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః ।అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ ॥ 85 ॥
సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః ।మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥
కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోఽనిలః ।అమృతాశోఽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ॥ 87 ॥
సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః ।న్యగ్రోధోఽదుంబరోఽశ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః ॥ 88 ॥
సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః ।అమూర్తిరనఘోఽచింత్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥
భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః ।ఆశ్రమః శ్రమణః, క్షామః సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః ।అపరాజితః సర్వసహో నియంతాఽనియమోఽయమః ॥ 92 ॥
సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః ।అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః ॥ 93 ॥
విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః ।రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥
అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠానమద్భుతః ॥ 95 ॥
సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః ।స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ॥ 97 ॥
అక్రూరః పేశలో దక్షో దక్షిణః, క్షమిణాంవరః ।విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః ।వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః ॥ 99 ॥
అనంతరూపోఽనంత శ్రీర్జితమన్యుర్భయాపహః ।చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥
అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః ।జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥
ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥
భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః ।యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః ॥ 104 ॥
యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః ।యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ ॥ 105 ॥
ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః ।దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
శంఖభృన్నందకీ చక్రీ శారంగధన్వా గదాధరః ।రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి ।
వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నందకీ ।శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు ॥ 108 ॥
శ్రీ వాసుదేవోఽభిరక్షతు ఓం నమ ఇతి ।

సేకరణ