అమ్మ
జగత్తు ఏలే అమ్మ వారి నుంచి
జన్మ నిచ్చే అమ్మ వరకూ...
శక్తి స్వరూపాలే...
ఆ అమ్మ లేనిదే జగత్తు లేదు
ఈ అమ్మ లేనిదే జన్మ లేదు
అమ్మ లేనిదే బ్రతుకు లేదు..
అమ్మ లేనిదే భవిష్యత్తు లేదు...
అమ్మ ఒక వ్యక్తి కాదు...
మహా శక్తి...
మరో ప్రపంచం నుంచి
మన ప్రపంచం వరకూ ...
అమ్మ లేనిదే మనుగడ లేదు...
ప్రేమ కు అర్థం అమ్మ
మమత కు అర్థం అమ్మ
సమత కు అర్థం అమ్మ
కరుణ కు అర్థం అమ్మ
త్యాగానికి అర్థం అమ్మ
గురువు కి అర్థం అమ్మ
ధైర్యానికి అర్థం అమ్మ
ఉపేక్షించేది అమ్మ
ఆపేక్షించేది అమ్మ
నిరీక్షించేది అమ్మ
రక్షించేది అమ్మ
నిను నవ మాసాలు మోస్తూ,
నిను ప్రతిక్షణం తలుస్తూ
నీ రాకకై అనుక్షణం నిరీక్షిస్తూ
నిను అనుక్షణం తలుస్తూ
నువ్వే తన లోకమని కలలు కంటూ
తన ప్రాణం పణంగా పెట్టి
నీకు జన్మ నిచ్చి
నిను రక్షించేది అమ్మ...
లాలి పాట అమ్మ
ముద్ద పాట అమ్మ (చందమామ రావే )
ముద్దు మాట అమ్మ
జోల పాట అమ్మ...
అమ్మ ని గురించి ఏమని చెప్పాలి
అమ్మని గురించి ఎంత ని చెప్పాలి
అనంత విశ్వమంత మనసు ఉన్న
అమ్మ ప్రేమ ని కొలువ గలమా
ఇంకొక దానితో పోల్చగలమా...
ఆ భగవంతుడు కూడా...అమ్మ ప్రేమకోసం...భూమి మీద అవతరించి..
ఆ ప్రేమలో తరిస్తున్నాడు....కదా
అమ్మా......
మానవాళి మనుగడకు భూమి మీద
భగవంతుడు మనకు
ఇచ్చిన వరం
అమ్మ...అమ్మ ...అమ్మ....