Friday, 30 October 2020

ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు నియమాలు

 ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు నియమాలు


ప్రకృతి యొక్క మొదటి నియమం

ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది

అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడుఆలోచనలు చేరుకుంటాయి.

ప్రకృతి యొక్క రెండవ నియమం

ఎవరివద్ద ఏమిఉంటుందో వారు దానినే పంచుకోగలరు.

సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు. దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు.
జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు.
భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు.
భయస్తులు భయాన్నే పంచగలరు.

ప్రకృతి యొక్క మూడవనియమం

మీకు మీజీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోండి.

ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి.
ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది.
మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి.
ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది.
నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది.
అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది.
దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది.
సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది.

Thursday, 22 October 2020

లలితా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సహస్త్ర నామంలో తెలిపిన వివరాలు

 అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సహస్త్ర నామంలో తెలిపిన వివరాలు


లలితా సహస్త్ర నామంలో ఎన్నో సాధన రహస్యలతో పాటు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం కూడా వివరించి ఉంది అవి ఏంటో తెలుసుకుందాము.


1. గుడాన్నప్రీత మానసా: 


 గుడాన్న నివేదనకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. గుడము అంటే బెల్లం, అన్నం అంటే బియ్యంతో వండినది అని అర్థం. గుడాన్నం అంటే బెల్లం, బియ్యం కలిపి చేసే వంట. లలితామ్మవారికి గుడాన్నం అంటే ప్రీతి. బెల్లంకి నిలువ దోషం లేదు. రోజు కొద్దిగా పానకం కానీ బెల్లం ముక్క పెట్టిన చాలు 


2. స్నిగ్ధౌదన ప్రియా: 


స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనము అంటే అన్నం, ప్రియా అంటే ఇష్టపడటం. తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకికార్థం. తెల్లటి అన్నం అనగానే తెలుపు వర్ణమని కాదు, స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని పారమార్థికార్థం. తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నం ఆ తల్లికి ఇష్టం.


3. పాయసాన్నప్రియా:


 క్షిరాన్నం పయః అంటే పాలు, అన్నం అంటే వండబడిన బియ్యం. పాలు, బియ్యానికి మధుర పదార్థం జత చేసి వండిన వంట. ఆ తల్లికి ఈ వంటకం మీద ప్రీతి ఎక్కువ. 


4. మధుప్రీతా: 


మధు అంటే తేనె అనే అర్థం కూడా ఉంది. ప్రీతా అంటే ఇష్టపడటం. తేనె వంటిపదార్థాలను ఇష్టపడటం అని బాహ్యార్థం. తేన గారెలు కలిపి నివేదిస్తే ఆమెకు చాలా ఇష్టం.


5. దద్ధ్యన్నాసక్త హృదయా: 


దధి అంటే పెరుగు, అన్నం అంటే బియ్యంతో వండినది. ఆసక్త అంటే అభీష్టాన్ని చూపడం, హృదయా అంటే అంతటి మనస్సు కలిగినది. పెరుగుతో వండిన అన్నం పట్ల ఆసక్తి కలిగిన హృదయం కలిగిన తల్లి అని అర్థం. 


6. ముద్గౌదనాసక్త హృదయా: 


ముద్గ అంటే పెసలు, ఓదనం అంటే అన్నం, ఆసక్త అంటే అభిరుచి కలిగిన, హృదయా అంటే మనసు కలిగిన అని అర్థం. ఆ తల్లికి పెసలతో వండిన అన్నమంటే ప్రీతి. పెసరపప్పు నానబెట్టి కాస్త బెల్లం వేసి పెట్టవచ్చు, పెసరపప్పు పాయసం చేసి నైవేద్యం పెట్టవచ్చు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం లో ఇది కూడా ముఖ్యమైనది.


7. హరిద్రాన్నైక రసికా:


 హరిద్రం అంటే పసుపు, అన్నం అంటే బియ్యంతో వండినది. మనం మన పరిభాషలో పులిహోరగా పిల్చుకుంటాం.ఆ తల్లికి హరిద్రాన్నం మీద ప్రీతి ఎక్కువ. అందుకే హరిద్రాన్న + ఏక అంటున్నాం. ఈ హరిద్రాన్నాన్ని అత్యంత ప్రీతిగా సేవిస్తుంది ఆ తల్లి క్రమంగా పులిహోర నివేదించి ప్రసాదం గా స్వీకరించడం పంచడం లాంటివి చేస్తుంటే వారిని జేష్ఠదేవి బాధించదు జేష్ఠ దేవి పెట్టే బాధలు తొలగి శుభం కలిగిస్తుంది.


8. సర్వౌదనప్రీతచిత్తా: (కదంబం)


 సర్వ అంటే అన్నిరకాల, ఓదనం అంటే అన్నం, ప్రీత అంటే ఇష్టపడటం, చిత్తా అంటే మనసు కలిగి ఉండటం. అన్నిరకాల  ఆహార పదార్థాలను ఇష్టపడే చిత్తం కలిగినది తల్లి అని అర్థం. అన్నిరకాల కాయగూరలు , బియ్యం, తో చేస్తారు 

తయారీ ∙కాయగూరలను శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి ∙బియ్యం, కందిపప్పులను శుభ్రంగా కడగాలి ∙కుకర్‌లో బియ్యం, కందిపప్పు, తరిగిన కూరగాయ ముక్కలు (టొమాటో వేయకూడదు), తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక, ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, ఇంగువ వేసి బాగా వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, టొమాటో తరుగు వేసి దోరగా వేయించాలి ∙ చింతపండు గుజ్జు, బెల్లం పొడి జత చేసి బాగా ఉడికించాలి ∙సాంబారు పొడి వేసి మరిగించాలి ∙బాగా ఉడికిన తరవాత ఆ గ్రేవీని ఉడికించిన బియ్యం, కందిపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి మరోమారు కొద్దిసేపు ఉడికించాలి ∙ చివరగా కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఒకసారి ఉడికించి దింపేయాలి ∙వేడి నెయ్యి జత చేసి, అమ్మవారికి నివేదన చేసి ఆ తల్లి దీవెనలు పొందుదాం.


ఇవి ఇస్తామని సహస్త్రనామం లో ఉన్న మాట నిజమే అయినా మీ శక్తి కొద్దీ భక్తితో ఏది సమర్పించిన తృప్తిగా నా తల్లి స్వీకరిస్తుంది ఇవన్నీ పెట్టగలిగే స్థితిలో మీరు నిండుగా ఉండాలి అని ఆ తల్లి స్త్రోత్రం లో పలికిస్తున్నదే తప్ప ఆత్మ నివేదన కన్నా గొప్ప నైవేద్యం ఏముంటుంది తల్లి పట్ల మనకు ఉన్న ప్రీతిని ఆమె తృప్తిగా తినాలి అనే ఉద్దేశంతో ఒక పదార్థాన్ని వండే సమయం కూడా ఉపాసన అవుతుంది ఆ సమయంలో ఎక్కువగా ఆమె గురించి ఆలోచిస్తూ చేయడం వల్ల ప్రసాదానికి అంత రుచి వస్తుంది.


( సేకరణ)

శుభాలు పొందుటకు స్త్రీలు పాటించవలసిన కొన్ని నియమాలు

 శుభాలు పొందుటకు స్త్రీలు పాటించవలసిన కొన్ని నియమాలు


భర్త అనురాగం పెరగటానికి
సంతానభాగ్యానికి సిరిసంపదలు పొందటానికి
వ్యాధులు రాకుండా వుండటానికి
ఈనియమాలు పాటించి చూడండి.

మంగళ సూత్రం లో పిన్నీసులు వుంచరాదు.
అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి వుంచుతారు .
మంగళ సూత్రం వేదమంత్రాల సహితంగా ప్రభావితము కాబడిన భర్త ఆయువు పట్టు మంగళ సూత్రము రూపములో హృదయం వద్ద చేరివున్నది.
ఇనుప వస్తువులు[పిన్నీసులు ,ఇనుముతో చేసినవి] దివ్యశక్తులను ఆకర్షించుకొను గుణముకలవి.
కనుక అవి మంగళ సూత్రములో దివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి .
భర్తకు అనారోగ్యం ,
భార్యాభర్తలపట్ల అనురాగం తగ్గటం
ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి.
కనుక వెంటనే ఈ అలవాటు సరి చేసుకోవాలి.

స్త్రీలు ధరించే గాజులు మట్టిగాజులై వుంటె చాలా మంచిది. .
ఈగాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక ,
వీని శబ్దము శుభాలను ,అనురాగాలను పెంచుతుంది.

ఇంట్లో గుర్రం బొమ్మలు వుంచుట అంత క్షేమము కాదని డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలామంది నమ్మకం .

సంపదలను ,ఎక్కువగా ప్రదర్షించటం వలన నరఘోష ఏర్పడుతుంది .
తద్వారా చెడు జరుగుతుంది.
కనుక [అలంకారాదులు] సాధారణం గా వుండేలా చూసుకోవటం సాధారణ జీవిత విధానాన్ని పాటింఛటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు..

పిల్లలు తమ మాటవినలేదనేవారు ఈ చిన్నచిట్కాలు పాటించి చూడండి.
ఆడపిల్లలకైతే ఐదుపోగుల ఎర్రదారం కుడిభుజమునకు కట్టి కుంకుమ బొట్టు పెట్టుకునే అలవాటు చేయండి . అలాగే మగపిల్లలైతే ఆకుపచ్చదారం తొమ్మిది పోగులు వేసి కుడిభుజానికి కట్టి గంధము నుదుట ధరించటం అలవాటు చేసి చూడండి పిల్లలు మీ మాటను శిరసావహిస్తారు.

ఆడపడుచులు ,అత్తమామలతో విబేధాలు ఎక్కువైతే ,
వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే
వారు పడుకునే దిండు క్రింద తులసి వేరు వుంచండి విరోధాలు తగ్గి.
వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు.

వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి
వంటకాలు ఎంతో రుచిగాను ఆరోగ్యకరం గాను వుంటాయి.


భర్త తాగి వచ్చి హింసపెడుతుంటే
ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత
ఒకచిన్నస్పూన్ [అంటె సుమారు అరగ్రాము] కరక్కాయ పౌడర్ ను ఆరు చెంచాల నీటి లో కలిపి త్రాగించండి.
ఇలా అరవై రోజులు చేస్తే వాళ్ళకు తాగుడు పై విరక్తి కలుగుతుంది.
కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలా మంచిది ,
తెల్ల వెంట్రుకలను కూడా నల్లబరుస్తుంది .
మొదట దీనిని త్రాగనని మారాం చేస్తారు.
కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటూ చేయండి
ఈ ఔషధాన్ని.తాగుడు ఖాయంగా మానుతారని పలువురు అనుభవపూర్వకంగా చెబుతున్నారు.

సుఖసంతోషాలు కరువైనవారు పసుపురంగుపూలు ధరించండి ,
క్రమేపీ స్థితి మెరుగవుతుంది.

అప్పుల బాధ ఎక్కువగావుంటె తెలుపు పూలు ధరించటం వలన రుణబాధలు తగ్గుతాయి.

ఆరోగ్యం సరిగాలేనివారు ,శరీరం నొప్పులు వున్నవారు మరువం ,మందారాలు కలిపి ధరించండి
ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.

పెళ్లిచూపులప్పుడు ఎరుపు పూలు ,పసుపు పూలు కలిపి మాలకట్టి దరించండి
వివాహం విషయం లో కన్యలకు ఎంతో శుభకరం గా ఫలితాలొస్తాయి .

మంచి తీర్ధం లో రెండు తులసి దళాలు
వేస్తే అవి మానససరోవర జలాలంత పవిత్రమవుతాయి.

కూర్చునే పీఠమునకు శుభ్రం చేసి నాలుగు మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి.
చాపైతే విభూది బొట్లు,
గుడ్డను ఆసనంగా వాడితే కుంకుమ బొట్లను పెట్టండి .

భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే గుండీలు మీరు పెట్టండి .
మీకుడిచేతిని తాకి వెళ్లమనండి.
భర్తలకు ఆరోజు సంపాదనా ,
విజయము సంతోషము వెంటనుంటాయి .

(సేకరణ)

Saturday, 17 October 2020

లక్ష్మీదేవి అష్టరూపాల విశిష్టత

లక్ష్మీదేవి అష్టరూపాల విశిష్టత



హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదలకు దేవత.
వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతున్నారు.
దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.
అష్టఐశ్వర్యాలను సిద్దించే అష్టలక్ష్ముల రూపాలు:

1. ఆదిలక్ష్మి :
'మహాలక్ష్మి' అనికూడా అంటారు.
నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం,
మరొక చేత పతాకం ధరించి,
రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.
పాలకలడలిపై నారాయణుని చెంత నిలిచి
లోకాలను కాచుకునేది ఈ ఆదిలక్ష్మే..!
ప్రాణశక్తికి, దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత.


2. ధాన్యలక్ష్మి :
హిందు సాంప్రదాయంలో వ్యవసాయం కేవలం
ఒక వృత్తి మాత్రమే కాదు..
ఒక జీవన విధానం కూడా!
అందుకే మన సంస్కృతి యావత్తు వ్యవసాయాన్ని అల్లుకుని ఉండటాన్ని గమనించవచ్చు.
ఆ వ్యవసాయం దాంతో పాటు మనజీవితాలూ కూడా సుభిక్షంగా ఉండేలా కాచుకునే తల్లే..ధాన్య లక్ష్మి. అందుకు ప్రతీకగా ఆమె ఆహార్యం మొత్తం ఆకుపచ్చరంగులో ఉంటుంది.
ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది.
రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద,
మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది. శారీరిక దారుఢ్యాన్ని ప్రసాధించే తల్లి.


3. ధైర్యలక్ష్మి :
సంపదలు లేకపోయిన..
మూడు పూటలా నిండైన తిండి లేకపోయినా..
పరువుప్రతిష్ట మంటగలసినా..కానీ ధైర్యం లేని మనిషి అడుగు ముందుకు వేయలేడు.
రేపటి గురించి ఆశతో జీవించలేడు.
అందుకు ఈ ధైర్యలక్ష్మీని తమతో ఉండమని భక్తులు మనసారా కోరుకుంటారు.
ఈమెనే 'వీరలక్ష్మి' అని కూడా అంటారు.
పేరుకు తగ్గట్లే ఎనిమిది చేతులు కలిగినది.
ఎర్రని వస్త్రములు ధరించినది.
చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము (?) తో ద‌ర్శ‌న‌మిస్తుంది.
రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.
ధైర్య సాహసాలు, మనోధైర్యాన్ని ప్రసాధించే తల్లి.


4. గజలక్ష్మి :
రాజ్య ప్రదాత.
సంపదను అనుగ్రహించడం మాత్రమే కాదు..
ఆ సంపదకు తగిన హుందాతనాన్నీ ప్రతిష్టనూ
అందించే తల్లి.
గౌరవం కలిగించని సంపద ఎంత ఉంటేనేం?
గజలక్ష్మీ సాక్షాస్తూ ఆ ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతం క్షీర సాగరమథనంలో వెలికి తెచ్చిందని ప్రతీతి. నాలుగు హస్తములు కలిగిన మూర్తి.
ఇరువైపులా రెండు గజాలు అభిషేకిస్తుంటాయి.
ఎర్రని వస్త్రములు ధరించినది.
రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది.
రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.
సకల శుభాలకు అధిష్టాన దేవత.


5. సంతానలక్ష్మి :
జీవితంలో ఎన్ని సిరులన్నా, సంతానం లేకపోతే
లోటుగానే ఉంటుంది.
తరం తమతో నిలిచిపోతుందన్న బాధ పీడిస్తుంది. ఇలాంటి వారి ఒడిని నింపే సంతాన లక్ష్మీ ఆరు చేతులతో దర్శనిమిస్తుంది.
రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించినది.
వడిలో బిడ్డ కలిగియున్నది.
ఒకచేత అభయముద్ర కలిగినది.
మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది.
బిడ్డ చేతిలో పద్మము ఉన్నది.
సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత.


6. విజయలక్ష్మి :
విజయమంటే కేవలం యుద్దరంగంలోనే కాదు...
యుద్దానికి ప్రతిబింబమైన జీవితపోరాటంలోనూ అవసరమే!
చేపట్టిన ప్రతి కార్యంలోనూ, ఎదుర్కొన్న ప్రతి సవాలులోనూ తమకు విజయాన్ని అందించమంటూ భక్తులు ఈ తల్లిని వేడుకుంటుంటాము.
వారి అభిష్టానికి అనుగుణంగా ఈ తల్లి ఎనిమిది చేతులు కలిగినది.
ఎర్రని వస్త్రములు ధరించినది.
శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించినది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.
సకల కార్యసిధ్దికి సర్వత్రా విజయసిద్దికి అధిష్టాన దేవత.


7. విద్యాలక్ష్మి :
జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ...
అటు ఆధ్యాత్మికంగాను, ఇటు లౌకికమైన జ్జానాన్ని
ఒసగే తల్లి ఈ విధ్యాలక్ష్మీ.
ఒకరకంగా సరస్వతీ దేవికి ప్రతిరూపం అనుకోవచ్చు. ఆమె వలే శ్వేతాంబరాలను ధరించి,
పద్మపు సింహాసనంలో కనిపిస్తుంటారు.
శారదా దేవి. చదువులతల్లి.
చేతి యందు వీణ వుంటుంది.
విద్యా వివేకాలకు, మన అర్హతలకు తగిన గుర్తింపు కలిగేలా చేసే తల్లి.


8. ధనలక్ష్మి :
భౌతికరమైన జీవితం సాగాలంటే సంపద కావాల్సిందే..! ఆ సంపదని ఒసగి దారిద్య్రాన్ని దూరం చేసేదే ధనలక్ష్మీ. అందుకే ఆమె చేతిలో దానానికి చిహ్నంగా బంగారు నాణేలు స‌మృద్ధికి సూచనగా సూచించే కలశం దర్శనమిస్తుంటుంది.
ఆరు హస్తాలు కలిగిన మూర్తి.
ఎర్రని వస్త్రాలు ధరించినది.
శంఖ చక్రాలు, కలశము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి.
అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.
కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లు ఉంటాయి.

(సేకరణ)

నవ దుర్గా స్తోత్రమ్

 నవ దుర్గా స్తోత్రమ్


ఈ స్తోత్రము ను ప్రతివారు ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ద దశమి వరకు శరన్నవరాత్రులలో సాయంకాల సమయమందు పఠించిన విశేష ఫలితములు సమకూరును .
గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ |
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ||
దేవీ శైలపుత్రీ
వందే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||
దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||
దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||
దేవీకాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||
దేవీకాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ || వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||
దేవీమహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||
దేవీసిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

సేకరణ

దుర్గామాత రూపాలను తలచుకుని ప్రార్థిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట

 దుర్గామాత రూపాలను తలచుకుని ప్రార్థిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయట


దుర్గాదేవిని తలచుకుని.. నవరాత్రి వేడుకలు సందర్భంగా అమ్మవారి ఆలయాలు
ఉండే ఈ దేవతలను పూజించి
ఆ దేవి యొక్క ఆశీర్వాదాలను పొందుదాం...

బెజవాడ దుర్గమ్మ..
విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై దుర్గామాత కొలువైంది. పురాణాల ప్రకారం.. కీలుడు అనే దుర్గాదేవి భక్తుడు అమ్మవారిని తన హృదయ కుహరం(గుహ)లో నివసించమని తపస్సు చేశాడు. కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన అమ్మవారం కనకదుర్గా దేవిగా కీలుని కోరిక మేరకు తన హృదయ కుహరంలో స్వయంభుగా వెలసింది. నాటి నుండి ఈ కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించిన దుర్గ కీలాద్రిగా నిలిచిపోగా.. భోళా శంకరుడు జ్యోతిర్లింగ రూపంతో స్వయంభువుడుగా ఈ ఇంద్ర కీలాద్రి మీద వెలిశాడు. దీంతో ఈ దేవాలయం దేశంలోనే ప్రసిద్ధ తీర్థయాత్రగా ప్రసిద్ధి గాంచింది.

చాముండేశ్వరి ఆలయం..
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులోని అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ చాముండేశ్వరి ఆలయం సుందరమైన చాముండి కొండలపై ఉంది. ఈ ఆలయం దుర్గాదేవి యొక్క మరో అవతారమైన చాముండి దేవికి అంకితమివ్వబడింది. ఈ మందిరం 12వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు. అయితే ఇక్కడి స్తంభం దాదాపు 330 సంవత్సరాల నాటి. ఈ అమ్మవారు భక్తులు భక్తితో ఏవైనా కోరికలు కోరుకుంటే.. కచ్చితంగా నెరవేరుస్తారు.

మానస దేవి..
మానస దేవిని భక్తితో ఏవైనా కోరికలు కోరుకుంటే.. తప్పకుండా నెరవేరుతాయని భక్తులందరి నమ్మకం. పురాణాల ప్రకారం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. హమీర్వాసియ కుటుంబ అధిపతి సేథ్ సూరజ్జల్మీ కలలో ఈ దేవత కనిపించి ఆలయం నిర్మించమని కోరింది. దీంతో అతను ఈ ఆలయ నిర్మాణ బాధ్యతను తన కుమారుడికి అప్పగించాడు. ఇది 1975 నాటికి పూర్తయ్యింది.

కామాఖ్యా దేవి
అస్సాంలోని గువహతిలోని కామాఖ్యా దేవి ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. కామాఖ్యా దేవి ఆలయం సతీ దేవి యొక్క యోని చెల్లాచెదురుగా ఉన్న ప్రదేశం అని నమ్ముతారు. నగరం యొక్క పశ్చిమ భాగంలో నీలాచల్ కొండలలో ఉన్న కామాఖ్యా దేవి ఆలయం దేశంలో ఎక్కువగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి. దుర్గా పూజ సమయంలో ఇవి చాలా ముఖ్యమైనవి.
వైష్ణో దేవి ఆలయం.. భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దుర్గా ఆలయంలో వైష్ణో ఆలయం ఒక్కటి. ఇది జమ్మూకు ఉత్తరాన 61 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రికూట పర్వతం మధ్య సముద్రమట్టానికి 1584 మీటర్ల ఎత్తులో ఉంది. పురాణాల ప్రకారం వైష్ణోదేవి విష్ణు భక్తురాలు. అందువల్ల ఆమె బ్రహ్మచార్యాన్ని అభ్యసించింది. ఈ వైష్ణో దేవి మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతి కలయికలను సూచిస్తుంది. ఈ దేవాలయం ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది.

కాళి మందిర్..
కోల్ కత్తాలోని ఉత్తరాన ఉన్న వివేకానంద వంతెన వెంట ఉన్న దక్షాణాశ్వర్ కాళి ఆలయం రామక్రిష్ణ అనుబంధానికి ప్రసిద్ధి చెందింది. దీనిని కాళీ దేవత భక్తురాలు 1855లో హుగ్లీ నది ఒడ్డున నిర్మించారు. ఈ ఆలయం కాళి దేవత యొక్క రూపమైన మాతా భవతరినికి అంకితం చేయబడింది. దుర్గా పూజ రోజులలో ఇక్కడ చాలా ముఖ్యమైన ఆచారాలు ఉన్నాయి. ఈ ఆలయం నుండి ఆధ్యాత్మికతపై ఎక్కువ శ్రద్ధ సాధించారని నమ్ముతారు.

కాళి ఘాట్..
సంవత్సరమంతా కోల్‌కతాలోని కాళి ఘాట్ ప్రాంతంలోని కాశీ ఆలయాన్ని భక్తులు సందర్శిస్తారు. సతీ దేవి యొక్క కుడి బొటనవేలు ఇక్కడ పడిందని నమ్ముతారు. ఈ ఆలయం భద్రాళిళికి అంకితం చేయబడింది. అందుకే ఇక్కడి విగ్రహం ప్రత్యేకమైనది.

కొల్లాపూర్ మహాలక్ష్మి
మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటైన కొల్హాపూర్‌లో ఉన్న మహాలక్ష్మి ఆలయం అంబబాయి దేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం నిర్మాణ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. దీనిని చాళుక్య కాలంలో నిర్మించారు. పశ్చిమ గోడలోని ఒక చిన్న రంధ్రం ద్వారా సూర్యాస్తమయం వద్ద సూర్యకిరణాలు సంవత్సరానికి రెండుసార్లు దేవత యొక్క కాళ్ళు మరియు ఛాతీపై పడతాయి. జనవరి 31 మరియు నవంబర్ 9 న సన్‌బీమ్స్; ఫిబ్రవరి 1 మరియు నవంబర్ 10 న, సూర్యకిరణాలు ఛాతీపై పడతాయి. ఫిబ్రవరి 2 మరియు నవంబర్ 11 న అన్ని కిరణాలు దేవతపై పడతాయి.

మధురై మీనాక్షి
తమిళనాడులోని వైగై నది ఒడ్డున మధురై మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు. మాతృదేవికి పవిత్రమైన ప్రార్థనా స్థలాలలో ఇది ఒకటి. ఆమె కుడి చేతితో కూర్చున్న చిలుక విగ్రహం ఉంది. ఈ ప్రదేశం యొక్క మరొక ముఖ్యాంశం దేవత యొక్క ముక్కు వజ్రాలతో నిండి ఉంటుంది.

కేరళలో..
కేరళలోని లక్ష్మీ దేవికి అంకితం చేసిన ఈ ఆలయం తీర నగరమైన కొచ్చిన్ లో ఉంది. ఇక్కడ ఉన్న విగ్రహం మాతృదేవత యొక్క మూడు వేర్వేరు రూపాలను సూచిస్తుంది. ఉదయం మహాసారస్వాతి, మధ్యాహ్నం మహాలక్ష్మి, సాయంత్రం మహాకాళి. ఇక్కడ దేవతను పూజించిన తరువాత మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు నయం అవుతారని నమ్ముతారు.

అంబాజీ ఆలయం
గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో ఉన్న అంబాజీ ఆలయం దేశంలో అత్యధికంగా సందర్శించే 51 దేవాలయాలలో ఒకటి. సతీ దేవి హృదయాన్ని ఇక్కడ తాకినట్లు భావిస్తున్నారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. దేవత యొక్క యంత్ర రూపం మాత్రమే ఇక్కడ పూజిస్తారు.

నైనా దేవి
మాతృదేవికి అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో నైనా దేవి ఒకటి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ ఆలయాన్ని మహిష్పీత్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది మహిషాసుర దేవిని ఓడించిన ప్రదేశమని నమ్ముతారు. దుర్గా పూజ సందర్భంగా చాలా మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

జ్వాలా దేవి
జ్వాలా దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉంది మరియు ఇది ఎటర్నల్ జ్వాలాను సూచిస్తుంది. 51 శక్తి పీఠాలలో ఒకటి, ఇది సతీ దేవి నాలుక పడిపోయిన ప్రదేశమని నమ్ముతారు. ఈ ఆలయంలో దుర్గాదేవి రూపంలో ఈ దేవత చెక్కబడింది.

(సేకరణ)

Monday, 5 October 2020

శ్రీ ఉమా మహేశ్వర స్తోత్రమ్

శ్రీ ఉమా మహేశ్వర స్తోత్రమ్ 

( శ్రీ ఆది శంకరాచార్య విరచితం)

అత్యంత శక్తివంతమైన స్తోత్రం
ఇది భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు

ఈ స్తోత్రం పఠించడము వలన
పార్వతి,పరమేశ్వరుల అనుగ్రహం 
లభించి వారి మధ్య  మనస్పర్థలు  తొలగుతాయి 
అని  ఉవాచ...
...


నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||

నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్టవరప్రదాభ్యాం
నారాయణేనార్చితపాదుకాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||

నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యాం
విభూతిపాటీరవిలేపనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||

నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం
జంభారిముఖ్యైరభివందితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||

నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం పంచాక్షరీపంజరరంజితాభ్యాం
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||

నమః శివాభ్యామతిసుందరాభ్యాం అత్యంతమాసక్తహృదంబుజాభ్యాం
అశేషలోకైకహితంకరాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||

నమః శివాభ్యాం కలినాశనాభ్యాం కంకాళకల్యాణవపుర్ధరాభ్యాం
కైలాసశైలస్థితదేవతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||

నమః శివాభ్యామశుభాపహాభ్యాం అశేషలోకైకవిశేషితాభ్యాం
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||

నమః శివాభ్యాం రథవాహనాభ్యాం రవీందువైశ్వానరలోచనాభ్యాం
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||

నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం జరామృతిభ్యాం చ వివర్జితాభ్యాం
జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||

నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యాం
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||

నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం జగత్రయీరక్షణబద్ధహృద్భ్యాం
సమస్తదేవాసురపూజితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః
స సర్వసౌభాగ్యఫలాని భుంక్తే శతాయురాంతే శివలోకమేతి ||

సేకరణ

Saturday, 3 October 2020

ధనదాదేవి స్తోత్రం

 ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను. 

దీనిని నిత్యం త్రికాలమున చదివినచో సర్వకార్యసిద్ది కలుగును. 

ఈ కవచం బ్రహ్మాస్త్రం వంటిది. 

సమస్త కోరికలు తీరి, విజయం లభిస్తుంది. 

ధన, వస్తు,వాహనములు, సకల ఐశ్వర్యములు ప్రాప్తించును. 

రాక్షసాది గ్రహాలు భాదించవు.

ధనదాదేవి స్తోత్రం 


నమః సర్వ స్వరూపేచ సమః కళ్యాణదాయికే l

మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతేll


మహా భోగప్రదే దేవి ధనదాయై ప్రపూరితే 

సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ll


బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి l

దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ll


ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే l

శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ll


విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణిl

మహాసత్వ గుణే నంతే ధనదాయే నమోస్తుతేll


శివరూపే శోవానందే కారణానంద విగ్రహేl

విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతేll


పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే

సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే ll