Saturday, 15 August 2020

షోడశోపచార పూజ..పండు నైవేద్యం ఫలితాలు

 షోడశోపచార పూజ

హిందువులు షోడశోపచార పూజా విధానంలో దేవుణ్ణి  పూజిస్తారు. 

షోడశ అనగా పదహారు.   

ఉపచారాలు అనగా సేవలు.


 పూజా వస్తువులు

 అవి వరుసగా

 1.ఆవాహనం = మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించాలి. 

 2.ఆసనం = వచ్చిన వారిని కూర్చోబెట్టాలి.  

 3పాద్యం = పాద పూజ చేయాలి.  

 4.ఆర్ఘ్యం = చేతులు శుభ్రపరచాలి. 

 5.ఆచమనీయం= దాహమునకు మంచి నీళ్ళివ్వడము. 

 6.స్నానం= శుభ్రమైన నీటితో అభిషేకము చేయాలి. 

 7.వస్త్రం= పొడి బట్టలు కట్టాలి. 

 8.యజ్ఞోపవీతం= యజ్ఞోపవీతమును మార్చాలి. 

 9..గంధం = శ్రీ గంధము చెట్టు చెక్కను సానపై సాదగా వచ్చిన సుగంధమును అలంకరించాలి. 

 10.పుష్పం = పువ్వులతో అలంకరించాలి. 

 11.ధూపం = అగరు బత్తీలు వెలిగించి ఉంచాలి. 

 12.దీపం = ఆవు నెయ్యి లేదా మంచి నూనెతో దీపము వెలిగించాలి. 

 13.నైవేద్యం= మడితో వండిన ఆహారమును లేదా ఫలములు, బెల్లము, మొదలగునవి సమర్పించాలి. 

 14.తాంబూలం= తమలపాకులు వక్కలు తాంబూలముగా ఉంచాలి. 

 15.నమస్కారం= మనస్పూర్తిగా నమస్కరించాలి. 

 16.ప్రదక్షిణం = మన కుడి భుజము వైపున దేవుడు ఉండేలా చూచుకొని దేవుని చుట్టూ తిరగటము.


 నైవేద్యం:-

భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి.


1. దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు .పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .


 2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిoచరాదు . చల్లారాక పెట్టాలి.


 3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.


 4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.

 ఫలాలు:--

వివిద ఫలాల నైవేద్యం - ఫలితాలు

 కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - 

భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి. 

 అరటి పండు - 

భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. 


 చిన్న అరటిపళ్లు 

నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. 

 నేరెడు పండు. 

 శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు. 

 ద్రాక్ష పండు - 

భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది. 

 మామిడి పండు - 

మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. 

నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు. 

 అంజూర పండు -

 భగవంతుడికి నైవేద్యం పెట్టిన అo జూరాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.

 సపోట పండు - 

సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి. 

 యాపిల్ పండు- 

భగవంతుడికి యాపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. 

కమలా పండు - 

భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి. 

 పనసపండు- 

పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు. 


 దీపం


 దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేకపోతే, కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి.


 ప్రతిసారీ తలస్నానం  చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.

ఇక దీపం వెలిగించేది ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. 

స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టీ ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమా చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి.

 (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వ దినాలలో, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.) 


దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి. రెండు జ్యోతులు వెలిగించాలి.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి.


ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.


ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. 

(సేకరణ)