Friday, 28 August 2020

శ్రీకృష్ణునికి సంబంధించిన వివిధ మంత్రాలు

 


శ్రీకృష్ణునికి సంబంధించిన వివిధ మంత్రాలు


ఈ మంత్రాలను జపిస్తే సుఖ-శాంతులతోపాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలలో చెప్పబడి ఉంది.

శ్రీకృష్ణ భగవానుని మూల మంత్రం :

" కృం కృష్ణాయ నమః "

ఇది శ్రీకృష్ణుని మూల మంత్రం. ఎవరైతే తమ జీవితాన్ని సుఖ-శాంతులతో గడపాలనుకుంటున్నారో అలాంటివారు ప్రాతఃకాలాన్నే నిద్రలేచి స్నానపానాదులు కావించి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మనిషి అన్ని రకాల బాధలు, కష్ణాలనుంచి విముక్తుడౌతాడని పురాణాలు చెపుతున్నాయి.

ఓం శ్రీం నమః శ్రీ కృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా "
ఈ మంత్రాన్ని సప్తదశాక్షర మహామంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఐదు లక్షల సార్లు జపిస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది. జపం చేస్తూ హోమం నిర్వహించాలి. ఇలాంటి సమయంలో దశాంశ అభిషేకం, తర్పణం చేయాలని పురాణాలు సూచిస్తున్నాయి. ఎవరికైతే ఈ మంత్రం సిద్ధిస్తుందో వారికి సర్వం లభిస్తుందంటున్నాయి పురాణాలు.

" గోవల్లభాయ స్వాహా "
ఈ మంత్రాన్ని సప్తాక్షరాల మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని జపించే సాధకులకు అన్నిరకాల సిద్ధులు ప్రాప్తిస్తాయి.

" గోకులనాథాయ నమః "
అష్టాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అతని కోరికలన్నీ ఫలిస్తాయి.

" క్లీం గ్లౌం క్లీం శ్యామలాంగాయ నమః "
ఈ దశాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని జపిస్తే అన్ని కోరికలు నెరవేరి అన్నిరకాల సిద్ధులు సిద్ధిస్తాయి.

ఓం నమో భగవతే శ్రీ గోవిందాయ "
దీనిని ద్వాదశాక్షర శ్రీ కృష్ణ మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి ఇష్టకామ్యార్థి సిద్ధిస్తుంది.

" ఐం క్లీం కృష్ణాయ హ్రీం గోవిందాయ శ్రీం గోపీజనవల్లభాయ స్వాహా "
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి వాగీశత్వం ప్రాప్తిస్తుంది.

ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం శ్రీం శ్రీ "
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారి బాధలు తొలగి శుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు.

ఓం నమో భగవతే నందపుత్రాయ ఆనందవపుషే గోపీజనవల్లభాయ స్వాహా "
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి, వారు కోరుకున్న వస్తువులు లభిస్తాయి.

" లీలాదండ గోపీజనసంసక్తదోర్దండ బాలరూప మేఘశ్యామ భగవన్ విష్ణో స్వాహా "
ఈ మంత్రాన్ని ఎవరైతే ఒక లక్షసార్లు జపిస్తూ నెయ్యి, చక్కెర మరియు తేనెలో నువ్వులు అక్షతలు కలిపి హోమం చేస్తుంటారో వారికి స్థిరమైన లక్ష్మి సిద్ధిస్తుంది.

" నందపుత్రాయ శ్యామలాంగాయ బాలవపుషే కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా "
ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ పాలు, చక్కెరతో చేసిన పాయసం ద్వారా హోమం చేస్తారో వారి మనోభీష్టాలు నెరవేరుతాయి.

ఓం కృష్ణ కృష్ణ మహాకృష్ణ సర్వజ్ఞ త్వం ప్రసీద మే. రమారమణ విద్యేశ విద్యామాశు ప్రయచ్ఛ మే "
ఈ మంత్రాన్ని జపిస్తే అన్ని రకాల విద్యలు నిస్సందేహంగా ప్రాప్తిస్తాయంటున్నారు పండితులు.

(సేకరణ)


మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు

 మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు


సుందరకాండ అద్భుతమైన పారాయణం, ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు..

1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి

శ్లోకం : ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||

21 దినములు , 108 సార్లు , శక్తి కొలది తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేయాలి.

2. విద్యాప్రాప్తికి

ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను . 3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన

3. భూతబాధ నివారణకు

3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 దినములు పారాయణ చేయవలెను . 1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన

4. సర్వ కార్య సిద్దికి

64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు 40 దినములు పారాయణ చేయవలెను .శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను

5. శత్రు నాశనముకు

51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను .

6. వాహనప్రాప్తికి

8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను .

7. మనః శాంతికి

11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .

8. స్వగృహం కోరువారికి

7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి 40 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను .

9. యోగక్షేమాలకు

13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.

10. ఉద్యోగప్రాప్తికి

63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను . శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను .

11. రోగ నివారణకు

34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము , 21 దినములు పఠించవలెను. శక్తి కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను .

12. దుఃఖనివృత్తికి

67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను

13. దుస్వప్న నాశనానికి

27వ సర్గ ఏకాగ్రతతో 1 సార్లు ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .

14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు

33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి , 21 దినములు నిష్ఠతో పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .

15. ధనప్రాప్తికి

15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి 40 దినములు పఠించవలెను.*
*అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము 32 వ సర్గ 1 సారి , 40 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).

16. దైవాపచారా ప్రాయశ్చిత్తం

38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు 27 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను .

17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు

19 వ అతినిష్ఠతో రోజుకు ఒకసారి 1 సంవత్సరము పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు

సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి

మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి 68 రోజులు చదువవలెను. నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును .

19. కన్యా వివాహమునకు

9 దినములలో ఒకసారి పూర్తిగా 68 దినాలలో పఠించవలెను. సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు ప్రతిరోజు పఠించవలెను. అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను .

20. విదేశీ యానమునకు

1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5 సార్లు 30 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .

21. ధననష్ట నివృత్తికి

55వ సర్గ నిష్ఠతో 3 సార్లు 30 దినములు పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, పనస నివేదన చేయవలెను.

22. వ్యాజ్యములో విజయమునకు

42 సర్గ అతి ఏకాగ్రతతో 3
సార్లు , 21 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను .

23. వ్యాపారాభివృద్ధికి

15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు 21 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను .

24. పుత్ర సంతానానికి

ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో 68 రోజులు పారాయణ చేయవలెను . శక్తి కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ , నివేదన చేయవలెను. శక్తి కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును .

25. ఋణ విముక్తికి

28 వ సర్గ చాలా నిష్ఠగా , రోజుకి 1 సారి 41 రోజులు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను .

(సేకరణ)

 ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది


పుష్ప ప్రసాదం
ఓం నమః శివాయ

దేవునికి విడి పూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యక ఫలితం లబిస్తుంది
దేవునికి వేసే పుష్పాలు విచ్చుకున్నట్లు అయితే..
మీ జీవితం..భవిష్యతు.. భాగుంటుంది

1.దేవునికి కాగితం పూల మాలను వేస్తే..
నిత్య దరిద్రులు అవుతారు

2.దేవునికి ప్లాస్టిక్ పూలమాలను వేస్తే..
చర్మ వ్యాధి వస్తుంది.

3.ఒకరు పూజ చేస్తున్నప్పుడు మరొకరు
ఒక పువ్వు తీసుకొని పూజ చేస్తే..
గ్యాస్ట్రిక్ వ్యాధి వస్తుంది.

4.పాడయిన పూలతో పూజ చేస్తే..
దేహంలో అయిన గాయాలు నయం కావు.

5.పురుగులు ఉన్న పూలతో పూజ చేస్తే..
పుండ్లలో పురుగులు ఎక్కువ అవుతాయి.

6.సువాసన నిండి ఉన్న పూలతో పూజ చేస్తే..
మీ జీవితం సుఖమయం అవుతుoది.

7.పూజకు ముందే పూల వాసనను ఎవరైతే చూస్తారో వారికీ అస్తమా ,హృదయ సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు.

8.ఎవరైతే దేవుని పూజకు మొగ్గలను వాడతారో
వారి చిన్న పిల్లలకు ఆరోగ్య లోపం ఏర్పడుతుంది.

9.ఎవరైతే దేవునికి కనకాంభరం పూలతో పూజచేస్తారో వారికీ జేవితంలో ప్రశాంతత లబించదు .
కనకాంబరం పూలు పూజకు పనికిరావు.

10.విచ్చని పూలతో పూజ చేస్తే..
మీ పనులు చాలా ఆలస్యం గానూ ,
కొన్ని సార్లు చేస్తున్న పనులు నిలిచిపోతాయి

ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది..

దేవునికి జాజి పూలు..
అర్పించి
ప్రసాదం స్వీకరిస్తే ..
మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి
మంచి గుణం వస్తుంది .
ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి


పారిజాత పువ్వుని
అర్పిస్తే ....
కాల సర్ప దోషం నివారించబడి
మనస్సుకు శాంతి లబిస్తుంది.

రుద్రాక్ష పువ్వును
అర్పిస్తే ...
ఎన్ని కష్టాలు వచ్చిన అంతిమ విజయం
మీదే అవుతుంది.

లక్కీ పువ్వుతో పూజిస్తే ....
భార్య పిల్లలతో కలహాలు లేకుండా
సంతోషంగా ఉంటారు.

పద్మం లేదా కమలంతో పూజిస్తే .....
సమస్త దారిద్ర నివారణ.
శ్రీమంతులు అవుతారు.

మల్లె పువ్వుతో పూజిస్తే ......
అన్ని రోగాలు నయం అవుతాయి .
ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గన్నేరు పూలతో పూజిస్తే..
కవులకు కల్పనా సాహిత్యం వృద్ది చెందుతుంది.

కల్హార పుష్పం తో పూజిస్తే ...
అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి
ఆకర్షణ పెరుగుతుంది.

పాటలీ పుష్పంతో పూజ చేస్తే ..
వ్యాపార వ్యవహారంలో అధిక లాభం వస్తుంది.

కంద పుష్పంతో పూజ చేస్తే ....
ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.

తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే ...
దేవునిఫై భక్తి అధికం అవుతుంది.

నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే ... జేవితంలో సుఖం ,శాంతి ,ప్రశాంతత లబిస్తుంది.

కణగాలే పుష్పం ...దీనితో దేవునికి పూజ చేస్తే.. మనస్సును పట్టి పీడిస్తున్న భయం , భీతి తొలగిపోతాయి
గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక భాదలు తొలగిపోతాయి .
విద్య ప్రాప్తి సిద్దిస్తుంది .
దుర్గా దేవికి ఈ పూలతో పూజ చేస్తే
దేవి అనుగ్రహంతో శత్రువుల నిర్మూలన అవుతుంది.

అశోక పుష్పాలతో దేవికి పూజ చేస్తే .... జేవితంలో.. సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి

నల్ల కలువ పుష్పాలతో శ్రీ శన్నైచ్చర మహారాజుకు పూజ చేస్తే అన్ని రకాల
శని సమస్యలు తొలగిపోతాయి

పాదరి పుష్పంతో పూజ చేస్తే ...
అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.

మాలతి పుష్పంతో దేవునికి పూజ చేస్తే..
అన్ని పాపాలు తొలగిపోతాయి.

పున్నాగ పుష్పం... ఈ పువ్వుతో శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ,శ్రీ గోపాల కృష్ణదేవునికి పూజ చేస్తే మగ సంతానం కలుగుతుంది .

వకుళ పుష్పం ... శ్రీ భూవరాహ స్వామికి ,
శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ఈ పూలతో పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగం వస్తుంది.

ఉత్ఫల పుష్పం ...జీవితంలో చాల కష్టాలు పడేవారు ప్రతిరోజు విష్ణు సహస్ర నామం
మహాలక్ష్మి సహస్ర నామం పఠించి..
ఉత్ఫల పుష్ఫంతో పూజ చేస్తే..
జీవితంలో చాలా అభివృద్ధి చెoదుతారు.

తెల్లని జిల్లేడు పువ్వుతో ... గణేశునికి ,శంకరునికి ,సూర్యదేవునికి చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలగి ,ఆరోగ్య్యం సిద్దిస్తుంది.

ద్రోణ పుష్పం ... ఈ పువ్వుతో సోమవారం ఈశ్వరునికి పూజ చేస్తే..శత్రువుల నాశనం , మిత్రలాభం అవుతుంది.
అధికారం ప్రాప్తిస్తుంది.

భందూక పుష్పం ... ఈ పుష్పంతో దుర్గా దేవికి మంగళవారం .శుక్రవారం పూజ చేస్తే..
బంధువులు క్షేమంగా ఉంటారు.

అగసి పువ్వుతో .... దేవికి పూజ చేస్తే..
పాపాలు తొలగిపోతాయి.

సురభి పుష్పం ... శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి సురభి పుష్పంతో పూజిస్తే ఇష్టార్ధం సిద్ధిస్తుంది.

పొద్దు తిరుగుడు పుష్పంతో పూజ చేస్తే .... పువ్వును హోమం పూర్ణాహుతికి వేస్తె
అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.

(సేకరణ)

Friday, 21 August 2020

శ్రీ వినాయక వ్రతకల్పం

 శ్రీ వినాయక వ్రతకల్పం


పూజకు కావలసిన సామగ్రి

పసుపు, కుంకుమ, గంధం, అగరువత్తులు, కర్పూరం, తమల పాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరి కాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యిలేక నూనె, దీపారాధన వత్తులు. వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసం, భక్ష్యాలు.

వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించు కోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసి, దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో వుంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి.

వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు, పూలు వేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ వుంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు, కుంకుమలు అవుతాయి కాబట్టి చేతికింద ఒక శుభ్రమైన గుడ్డను వుంచుకుంటే బాగుంటుంది.

ఆచమనం

ఓం కేశవాయ స్వాహాః
నారాయణాయ స్వాహాః
మాధవాయ స్వాహాః
(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)

గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

దైవ ప్రార్థన

(గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను).

1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం

2. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన:

3. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం

4. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.

తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.

{ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.}

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||

భూతోచ్చాటన: (క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)

శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే

తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.

ప్రాణాయామం (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం)

ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||

||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||

కారణము: (గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అంటారు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అంటారు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా)

ప్రాణాయామం

సంకల్పము: (ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి, ఏ పనిచేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అంటారు.) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ………………. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను)

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజేఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

షోడశోపచారపూజ

ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥

శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ

ఆవాహయామి

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥

ఆసనం సమర్పయామి

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥

ఆర్ఘ్యం సమర్పయామి

గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥

పాద్యం సమర్పయామి

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥

ఆచమనీయం సమర్పయామి.

దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥

మధుపర్కం సమర్పయామి.

స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥

పంచామృత స్నానం సమర్పయామి.

గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥

శుద్దోదక స్నానం సమర్పయామి.

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥

వస్త్రయుగ్మం సమర్పయామి.

రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥

ఉపవీతం సమర్పయామి.

చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥

గంధాన్ సమర్పయామి.

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥

అక్షతాన్ సమర్పయామి.

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥

పుష్పాణి పూజయామి.

అథాంగ పూజ

(పుష్పములతో పూజించవలెను)

గణేశాయ నమః - పాదౌ పూజయామిఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామిశూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామివిఘ్నరాజాయ నమః - జంఘే పూజయామిఅఖువాహనాయ నమః - ఊరూ పూజయామిహేరంబాయ నమః - కటిం పూజయామిలంబోదరాయ నమః - ఉదరం పూజయామిగణనాథాయ నమః - నాభిం పూజయామిగణేశాయ నమః - హృదయం పూజయామిస్థూలకంఠాయ నమః - కంఠం పూజయామిగజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామివిఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామిశూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామిఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామిసర్వేశ్వరాయ నమః - శిరః పూజయామివిఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి

ఏకవింశతి పత్రపూజ

(21 విధముల పత్రములతో పూజింపవలెను)

సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామిహరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామిశూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.

శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా

ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్వైమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

ఓం సుప్రదీప్తాయ నమః

ఓం సుఖనిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః

ఓం హయగ్రీవాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహంత్రే నమః

ఓం విశ్వనేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం ఆశ్రితవత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బల్వాన్వితాయ నమః

ఓం బలోద్దతాయ నమః

ఓం భక్తనిధయే నమః

ఓం భావగమ్యాయ నమః

ఓం భావాత్మజాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకర ప్రభాయ నమః

ఓం సర్వాయ నమః

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వకర్త్రే నమః

ఓం సర్వ నేత్రే నమః

ఓం నర్వసిద్దిప్రదాయ నమః

ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః

ఓం కుంజరాసురభంజనాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థఫలప్రియాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళసుస్వరాయ నమః

ఓం ప్రమదాయ నమః

ఓం జ్యాయసే నమః

ఓం యక్షికిన్నరసేవితాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం గణాధీశాయ నమః

ఓం గంభీరనినదాయ నమః

ఓం వటవే నమః

ఓం జ్యోతిషే నమః

ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః

ఓం అభీష్టవరదాయ నమః

ఓం మంగళప్రదాయ నమః

ఓం అవ్యక్త రూపాయ నమః

ఓం పురాణపురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ?

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అపాకృతపరాక్రమాయ నమః

ఓం సత్యధర్మిణే నమః

ఓం సఖ్యై నమః

ఓం సారాయ నమః

ఓం సరసాంబునిధయే నమః

ఓం మహేశాయ నమః

ఓం విశదాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖలాయ నమః

ఓం సమస్తదేవతామూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః

ఓం విష్ణువే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్తజీవితాయ నమః

ఓం ఐశ్వర్యకారణాయ నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విష్వగ్దృశేనమః

ఓం విశ్వరక్షావిధానకృతే నమః

ఓం కళ్యాణగురవే నమః

ఓం ఉన్మత్తవేషాయ నమః

ఓం పరజయినే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥

ధూపమాఘ్రాపయామి॥

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే

దీపందర్శయామి।

సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,

భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,

నైవేద్యం సమర్పయామి।

సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక

సువర్ణపుష్పం సమర్పయామి.

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం

తాంబూలం సమర్పయామి।

ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ

నీరాజనం సమర్పయామి।

అథ దూర్వాయుగ్మ పూజాసవరించు

గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।

నమస్కారము, ప్రార్థన

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన,

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన,

పునరర్ఘ్యం సమర్పయామి,

ఓం బ్రహ్మవినాయకాయ నమః

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,

ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్

వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

శ్రీ వినాయక వ్రత కథ

గణపతి జననము

సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।

భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు। గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అన్నాడు। విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు। శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు। గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించాడు। అయినా మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది। నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు। శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు।

అక్కడ పార్వతి భర్త రాక గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది। దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసినది। ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది।

శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు।

జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించాడు। గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి:

గణేశుడు అగ్రపూజనీయుడు

ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది। శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు। శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు। "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు। కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు। గజాననుడుమిగిలిపోయినాడు। త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించాడు। వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు। నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు। అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు। వినాయకునికే ఆధిపత్యము లభించినది।

చంద్రుని పరిహాసం

గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।

(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు।

చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించాడు.

ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడింది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడింది.

శ్యమంతకోపాఖ్యానము

చంద్ర దర్శనం నీలాపనింద: ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.

అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయింది.

నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.

ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.

అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించింది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఒక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.

అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు.

అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కానఅప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.

శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.

వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.

పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు... సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః

సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడింది.

సర్వేజనాః సుఖినో భవంతు.

విఘ్నేశ్వర చవితి పద్యములు

ప్రార్థన :

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.

తలచెదనే గణనాథునితలచెదనే విఘ్నపతిని దలచినపనిగాదలచెదనే హేరంబునిదలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌

అటుకులు కొబ్బరి పలుకులుచిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌నిటలాక్షు నగ్రసుతునకుబటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

వినాయక మంగళాచరణము

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌.

మరొక పద్యం కూడా విద్యార్థులకు ఉచితమైనది.

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!

ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్థనా శ్లోకము

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి

Monday, 17 August 2020

యమకృత శివకేశవ స్తుతి


యమకృత శివకేశవ స్తుతి అనారోగ్యంతో.. బాధపడుతున్నవారు.. ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు.. నిత్యం ఈ స్తోత్రం చదవాలి. మన జీవితం లొ ఒక్కసారి అయిన ఈ నామాలు చదవాలి. కాశీఖండము లోని యముని చే చెప్పబడిన శివుడు..విష్ణువు ఇద్దరు తో కూడిన నామాలు ఒక్కసారి చదివినా అనేక జన్మల పాపాలు పోతాయి.. ఈ నామాలనూ ప్రతిరోజు పటించే వాళ్ళకి యమ దర్శనం వుండదు.. యముడు స్వయంగా తన యమభటులు కు ఈ శివకేశవ నామాలు ఎవ్వరు భక్తితో రోజు చదువుతూ వుంటారో వారి జోలికి మీరు పోవద్దు అనిచెప్పాడు... గోవింద మాధవ ముకుంద హరే మురారే ,శంభో శివేచ శంకర శశిశేఖర శూలపానే ! దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !! గంగాధరాంధకరిపో హర నీలకంఠ , వైకుంఠ కైటభరిపో కమలాబ్జపానే ! భూతేశ ఖండపరశో మృడ చండికేశ , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !! విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే ,గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ ! నారాయణాసుర నిబర్హణ ,శార్జ్గపాణే , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !! మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో, శ్రీకాంత పీతవసనాంబుదనీల శౌరే ! ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !! లక్ష్మిపతే మధురిపో పురుషోత్తమాద్య, శ్రీకంఠ దిగ్విసన శాంతి పినాకపానే ! ఆనందకంద ధరణీధర పద్మనాభ , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !! సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ, బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపానే ! త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌలే , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !! శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే , భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ! చానూరమర్దన హృషీకపతే మురారే , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !! శూలిన్ గిరీశ రజనీశకళావతంస, కంసప్రణాశన సనాతన కేశినాశ! భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !! గోపీపతే యదుపతే వసుదేవసూనో, కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర ! గోవర్దనోద్దరన ధర్మధురీణ గోప , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !! స్థానో త్రిలోచన పినాకధర స్మరారే , కృష్ణానిరుద్ద కమలానాభ కల్మషారే ! విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !! ఈ యమకృత శివకేశవ నామాలను స్మరించువారు పాపరహితులై తిరిగి మాతృగర్బమున జన్మింపరు ‌‌‌💐 ఓం శివ నారాయణాయ నమః💐

Saturday, 15 August 2020

షోడశోపచార పూజ..పండు నైవేద్యం ఫలితాలు

 షోడశోపచార పూజ

హిందువులు షోడశోపచార పూజా విధానంలో దేవుణ్ణి  పూజిస్తారు. 

షోడశ అనగా పదహారు.   

ఉపచారాలు అనగా సేవలు.


 పూజా వస్తువులు

 అవి వరుసగా

 1.ఆవాహనం = మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించాలి. 

 2.ఆసనం = వచ్చిన వారిని కూర్చోబెట్టాలి.  

 3పాద్యం = పాద పూజ చేయాలి.  

 4.ఆర్ఘ్యం = చేతులు శుభ్రపరచాలి. 

 5.ఆచమనీయం= దాహమునకు మంచి నీళ్ళివ్వడము. 

 6.స్నానం= శుభ్రమైన నీటితో అభిషేకము చేయాలి. 

 7.వస్త్రం= పొడి బట్టలు కట్టాలి. 

 8.యజ్ఞోపవీతం= యజ్ఞోపవీతమును మార్చాలి. 

 9..గంధం = శ్రీ గంధము చెట్టు చెక్కను సానపై సాదగా వచ్చిన సుగంధమును అలంకరించాలి. 

 10.పుష్పం = పువ్వులతో అలంకరించాలి. 

 11.ధూపం = అగరు బత్తీలు వెలిగించి ఉంచాలి. 

 12.దీపం = ఆవు నెయ్యి లేదా మంచి నూనెతో దీపము వెలిగించాలి. 

 13.నైవేద్యం= మడితో వండిన ఆహారమును లేదా ఫలములు, బెల్లము, మొదలగునవి సమర్పించాలి. 

 14.తాంబూలం= తమలపాకులు వక్కలు తాంబూలముగా ఉంచాలి. 

 15.నమస్కారం= మనస్పూర్తిగా నమస్కరించాలి. 

 16.ప్రదక్షిణం = మన కుడి భుజము వైపున దేవుడు ఉండేలా చూచుకొని దేవుని చుట్టూ తిరగటము.


 నైవేద్యం:-

భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి.


1. దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు .పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .


 2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిoచరాదు . చల్లారాక పెట్టాలి.


 3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.


 4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.

 ఫలాలు:--

వివిద ఫలాల నైవేద్యం - ఫలితాలు

 కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - 

భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి. 

 అరటి పండు - 

భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. 


 చిన్న అరటిపళ్లు 

నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. 

 నేరెడు పండు. 

 శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు. 

 ద్రాక్ష పండు - 

భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది. 

 మామిడి పండు - 

మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. 

నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు. 

 అంజూర పండు -

 భగవంతుడికి నైవేద్యం పెట్టిన అo జూరాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.

 సపోట పండు - 

సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి. 

 యాపిల్ పండు- 

భగవంతుడికి యాపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. 

కమలా పండు - 

భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి. 

 పనసపండు- 

పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు. 


 దీపం


 దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేకపోతే, కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి.


 ప్రతిసారీ తలస్నానం  చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.

ఇక దీపం వెలిగించేది ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. 

స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టీ ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమా చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి.

 (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వ దినాలలో, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.) 


దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి. రెండు జ్యోతులు వెలిగించాలి.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి.


ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.


ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. 

(సేకరణ)

Thursday, 13 August 2020

పాండురంగ అష్టకం

 

పాండురంగ అష్టకం


మహాయోగపీఠే తటే భీమరథ్యా

వరం పుణ్డరీకాయ దాతుం మునీన్ద్రైః ।

సమాగత్య నిష్ఠన్తమానందకందం

పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ ౧॥


తటిద్వాససం నీలమేఘావభాసం

రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్ ।

వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం

పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ ౨॥


ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం

నితమ్బః కరాభ్యాం ధృతో యేన తస్మాత్ ।

విధాతుర్వసత్యై ధృతో నాభికోశః

పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ ౩॥


స్ఫురత్కౌస్తుభాలఙ్కృతం కణ్ఠదేశే

శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్ ।

శివం శాంతమీడ్యం వరం లోకపాలం

పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ ౪॥


శరచ్చంద్రబింబాననం చారుహాసం

లసత్కుణ్డలాక్రాంతగణ్డస్థలాంతమ్ ।

జపారాగబింబాధరం కఽజనేత్రం

పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్॥ ౫॥


కిరీటోజ్వలత్సర్వదిక్ప్రాంతభాగం

సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః ।

త్రిభఙ్గాకృతిం బర్హమాల్యావతంసం

పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్॥ ౬॥


విభుం వేణునాదం చరంతం దురంతం

స్వయం లీలయా గోపవేషం దధానమ్ ।

గవాం బృన్దకానన్దదం చారుహాసం

పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ ౭॥


అజం రుక్మిణీప్రాణసఞ్జీవనం తం

పరం ధామ కైవల్యమేకం తురీయమ్ ।

ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం

పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ ౮॥


స్తవం పాణ్డురంగస్య వై పుణ్యదం యే

పఠన్త్యేకచిత్తేన భక్త్యా చ నిత్యమ్ ।

భవాంభోనిధిం తే వితీర్త్వాన్తకాలే

హరేరాలయం శాశ్వతం ప్రాప్నువన్తి ॥


॥ ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య

శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య

శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ

పాణ్డురఙ్గాష్టకం సమ్పూర్ణమ్ ॥

Friday, 7 August 2020

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం వివరణ

 శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం వివరణ


నమస్తేస్తు మహామాయే! శ్రీపేఠే సురపూజితే!
శంఖచక్రగదాహస్తే ! మహాలక్ష్మీ ! నమోస్తుతే ||

అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ ! దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు.

వివరణ : సృష్టిస్తితిలయాలకు మూలకారణమైన శక్తికి మహామాయ అనిపేరు. ఆమెయే శ్రీచక్రారూడ. సకలదేవతలుని ఆమెనే పూజిస్తుంటారు. ఆమె శంఖచక్రగదాహస్త అయి, వైష్ణవీరూపంతో మహాలక్ష్మిగా, విష్ణుపత్నిగా జగద్రక్షణ చేస్తూంది. లక్ష్మి అంటే సర్వాన్నీ చూచేది అని ఒక వ్యుత్పత్తి. కనుకనే సర్వాన్నీ రక్షించేదీ అయింది. విష్ణుపత్ని గనుక విష్ణువు ధరించే ఆయుధాలు లక్ష్మికీ వర్తించాయి. ఇది వైష్ణవీరూపం ఇందలి అయుదిసంబోధనలూ అమ్మవారిపంచప్రకృత్యాత్మకశక్తికి సంకేతాలు.

నమస్తే గరుఢారూఢేః ! కోలాసురభయంకరి!
సర్వపాపహరే! దేవి! మహాలక్ష్మి! నమోస్తుతే ||

గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లీ ! కోలుడు అనే రాక్షసునికి భయం కల్గించిన దేవీ! సకలపాపహారిణి ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారములు.

వివరణ : విష్ణుదేవుని అర్ధాంగి గనుక మహాలక్ష్మికూడా గరుడవాహనయే ! లక్ష్మీసహస్రనామస్తోత్రం 65వ శ్లోకం లో “గరుడో పరిసంస్థితా” అని ఉంది. గరుత్మంతుడు వేదమూర్తి కనుక భగవానుడు అతనిపై సంచరిస్తాడు. అంటే వేదాలపై విహరిస్తాడు. జగన్మాత అయిన లక్ష్మీదేవి కూడా వేదారూఢయే ! అమ్మవారు వేదమాత, కోలా విధ్వంశులనేవాళ్ళు స్వారొచిషమనువు కాలంవాళ్ళు. ఆకాలంలో చైత్రవంశీయుడైన ‘సురధుడు’ అనే రాజును కోలావిధ్వంశులనేవాళ్ళు జయించి, అతనికి శత్రువులయ్య్యారు. కోలుడు, విధ్వంశుడు అనే ఈ రాక్షసుల్ని అమ్మవారు లక్ష్మీ రూపంతో సమ్హరించింది. కనుక కోలాసుర భయంకరి అయింది. ఈ విషయం దేవీసప్తశతిప్రధమాధ్యాయం ఐదవశ్లోకంలో సూచితం. భగవతీనామస్మరణం సర్వపాపాల్నీ నశింపజేస్తుంది.

సర్వజ్ఞే ! సర్వవరదే ! సర్వదుష్ట భయంకరి!
సర్వదుఃఖహరే! దేవి! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

సర్వజ్ఞురాలా ! సకలవరాలు ప్రసాదించే దయామయీ! సర్వదుష్టశక్తుల్నీ తోలగించేపరాశక్తీ! అన్ని దుఃఖాలనూ హరించే లక్ష్మీదేవీ! నీకు నమస్కారములు

వివరణ : అమ్మవారు జగన్నాయకి. విష్ణుపత్ని కనుక ఆమెకు తెలియని విషయం ఉండదు. ఎవరికి ఏ సుఖం కల్గినా అది శ్రీదేవియొక్క అనుగ్రహవిశేషమే ! అమ్మ ‘సర్వజ్ఞ కనుక సర్వ దుష్టశక్తుల్నీ,దుఃఖాలనీ తొలగించి, అందరికీ సుఖశాంతుల్ని ప్రసాదిస్తూంది. బాహ్యాంతశ్శత్రువులు నశిస్తేనే జీవునికి నిజమైన ఆనందం కల్గుతుంది. ఇందుకు లక్ష్మీదేవియొక్క అనుగ్రహం చాలా ముఖ్యం.

సిద్ధిబుద్ధిప్రదే! దేవి! భుక్తిముక్తిప్రదాయిని !
మంత్రమూర్తే ! సదాదేవె ! మహాలక్ష్మి! నమోస్తుతే ||

సిద్ధినీ బుద్ధినీ ప్రసాదించేతల్లీ ! భుక్తిని, ముక్తిని అనుగ్రహించే దేవీ! మంత్రమూర్తీ! దివ్యకాంతిమయీ ! మహాలక్ష్మీ నీకు నమస్కారము.

వివరణ : అమ్మవారు కార్యసిద్ధిని, అందుకు అవసరమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇహపరసౌఖ్యాలు అనుగ్రహిస్తుంది . అమ్మ మంత్రమూర్తి కనుక ఎవరు ఎలా భావించి, పూజిస్తే వారివారికి తగినట్లుగా రక్షణ ఇస్తూంటుంది. కార్యసిద్ధీ, కార్యనిర్వహణబుద్ధీ, భుక్తీ, ముక్తీ ఇలా జీవికి అవసరమైన అన్ని దంద్వాలనూ ప్రసాదించడం అమ్మ ప్రత్యేకత. అన్ని మంత్రాలూ ‘శ్రీం’ బీజ మయాలే ! కనుక అమ్మ మంత్ర స్వరూపిణి.

ఆద్యంతరహితే ! దేవి! ఆద్యశక్తి ! మహేశ్వరి !
యోగజే ! యోగసంభూతే ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

ఆద్యంతాలు లేనిదేవీ ! ఆదిశక్తీ ! మహేశ్వరీ ! యోగం వల్ల జన్మించిన తల్లీ ! ధ్యానంలో గోచరించే జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.

వివరణ : అమ్మ ఆదిశక్తి. సృష్ఠిస్తితిలయాలకు కారణమైనది. ఈ తల్లికి మొదలు, తుది అనేవిలేవు. సర్వకాల, సర్వావస్థలలో అమ్మ చైతన్యరూపిణియై ఉంటుంది. అమ్మ ‘యోగం’ వల్ల సంభవించింది. ‘యోగ’మంటే ధ్యానం. ధ్యానంలో మాత్రమే అమ్మ సాక్షాత్కారం కల్గుతుంది. కనుక అమ్మ “యోగజ”, “యోగసంభూత” అయింది. అనగా పరమాత్మరూపిణి, జగత్ప్రభువగు విష్ణుదేవుని భార్య కనుక అమ్మ “మహేశ్వరి” అనగా జ్ఞానస్వరూపిణి.

స్థూలసూక్ష్మ మహారౌద్రే ! మహాశక్తి ! మహోదరే !
మహాపాపహరే ! దేవి ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

స్థూలరూపంతోనూ, సూక్ష్మ రూపంతోనూ, మహారౌద్రరూపంతోనూ కనిపించేతల్లీ ! మహాశక్తిస్వరూపిణీ ! గొప్ప ఉదరం గల జగజ్జననీ ! మహాపాపాల్ని హరించేదేవీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.

వివరణ : లక్ష్మీదేవి రజోగుణస్వరూపిణి. హిరణ్యవర్ణ. కనుకనే ఆమె రౌద్ర, స్థూల, సూక్ష్మ రూపాలతో ఆయా సందర్భాలలో వ్యక్తమవుతూ ఉంటుంది. భౌతికంగా భక్తులు కోరికలకై పూజించేరూపం స్థూలం. ఇది రజోగుణాత్మకం. యోగులు నిస్కాములై ధ్యానించేరూపం సూక్ష్మం! ఇది సర్వగుణాత్మకం. ఇక శత్రుసమ్హారం కావించేరూపం తామసం. ఇది రౌద్రం. ఇలా త్రివిధరూపాలతో శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేస్తూ, అమ్మవారు విష్ణుదేవుణ్ణి అనుసరించి వుంటుంది. ఆమె మహాశక్తి. ఆమె గర్భంలో సమస్త బ్రహ్మాండాలూ ఉన్నాయి. అమ్మ పాపసమ్హారిణి. సకలలోకజనని.

పద్మాసనస్థితే ! దేవి ! పరబ్రహ్మ స్వరూపిణి !
పరమేశి ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

పద్మాసనభంగిమలో కూర్చొని ఉండేదేవీ ! పరబ్రహ్మ స్వరూపిణీ ! పరమేశ్వరీ ! జగజ్జననీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.

వివరణ : లక్ష్మి పద్మం నుండి జనించింది. పద్మంలోనే నివసిన్స్తుంది. పద్మాన్నే ధరిస్తుంది. పద్మం పైనే కూర్చుంటుంది. నిల్చుంటుంది. ఇలా ఆమేసర్వమూ పద్మమే ! పద్మమంటే ఇందు లక్ష్మి ఉంటుంది. పద్యతే అత్ర లక్ష్మీః అని వ్యుత్పత్తి. అమ్మ నివసించడంవల్లనే పద్మాలకు అంతటి శోభ, మృదుత్వం, ప్రశస్తీ వచాయి. పద్మాసన – పద్మాన్నే ఆసనంగా కల్గి ఉండేది. అయ్య పరబ్రహ్మ కనుక ఆయన అర్ధాంగి యగు లక్ష్మి యు పరబ్రహ్మమే ! లక్ష్మి మహానాయకురాలు. సృష్ఠి స్థితి లయాలకు ఆమె కారణం. మాత అంటే గర్భం తనలో ఇమిడియుండునది అని వ్యుత్పత్తి. అమ్మ సకలలోకాలనూ తన గర్భం లో ధరించి సృష్ఠి చేస్తుంది. కనుక జగజ్జనని.

శ్వేతాంబరధరే! దేవి ! నానాలంకారభూషితే !
జగత్ స్థితే ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

తెల్లనివస్త్రములు ధరించిన దేవీ ! అనేకాలయిన అలంకారాలు దాల్చినతల్లీ ! లోకస్థితికి కారణమైన విష్ణుపత్నీ ! జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.

వివరణ : మహాలక్ష్మిని శ్వేతాంబరధారిణిగా వర్ణించుట ఇందలి విశేషం. సాధారణంగా సరస్వతిని శ్వేతాంబరధారిణి గా నుతిస్తారు. ఇచ్చట లక్ష్మిని విద్యాలక్ష్మి గా భావించినపుడు ఆమె సరస్వతీ స్వరూపిణి అని భక్తులు భావించి ఆ రూపంతో దర్శించాలి. అష్టవిధలక్ష్ములలో విద్యా లక్ష్మి నానాలంకారభూషితురాలు. ఆభరణాలన్నీ సువర్ణరత్నమయమైనవే ! అమ్మ జగత్తునందలి చరాచర వస్తువు లన్నింటా నిల్చి వాటిల్ని శక్తిమంతాలుగా చేస్తుంది. అది అమ్మవారి విభూతి అనగా ఐశ్వర్యం, లోక్స్థితి కి అమ్మవారే కారణం !

ఫలశ్రుతి

మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీ ర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా ||

ఇంద్రకృతం శ్రీ మహాక్ష్మ్యస్టకం సంపూర్ణం ||

ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలూ పొందుదురు. రోజుకు ఒకమారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాలనుండి విముక్తులవుతారు. రోజూ ఉదయం, సాయంకాలం రెండు సార్లూ పఠించేవాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు. మూడుకాలాల్లో ఉదయం, మధ్యాన్నం, సాయంకాలం – పఠించేవాళ్ళు సకల శత్రుబాధల్నీ తొలగించుకొని సుఖిస్తారు. అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది.
శుభాలు కల్గిస్తుంది.

సేకరణ

Tuesday, 4 August 2020

హనుమంతుని ద్వాదశ నామాలు

హనుమంతుని ద్వాదశ నామాలు - పఠన ఫలం

హనుమానంజనా సూనుః -
వాయుపుత్రో మహాబలః
రామేష్టః
ఫల్గుణ సఖః -
 పింగాక్షోsమితవిక్రమః !!
ఉధధిక్రమణశ్చైవ -
సీతా శోకవినాశకః !
లక్ష్మణప్రాణదాతా చ -
 దశగ్రీవస్య దర్పహా !!
 ద్వాదశైతాని  నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేనిత్యం..యాత్రాకాలే విశేషతః
 తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీభవేత్"..

  భావము:-
 హనుమంతుడు, ఆంజనేయుడు, వాయుపుత్రుడు, మహాబలవంతుడు, రామునికి ఇష్టమైనవాడు, అర్జునునికి మిత్రుడు,  పింగళ వర్ణము వంటి కన్నులు గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు , సముద్రమును దాటినవాడు , సీతాదేవి యొక్క దుఃఖమును పోగొట్టిన వాడు ,లక్ష్మణునకు ప్రాణదానం చేసినవాడు , రావణుని గర్వమును హరించినవాడు
 అనే హనుమంతుని పన్నెండు పేర్లను విద్యారంభము నందు , వివాహ సమయాన , ప్రయాణ సమయాలలో యుధ్ధ సమయం లో, అన్ని పనుల ఆరంభములోనూ చదివినా , విన్నా సకల విఘ్నాలూ తొలగి కార్యసిధ్ధి జరుగుతుంది.
ఈ ద్వాదశనామ స్తోత్ర పఠనం వల్ల అన్ని కాలాల్లో శుభం కలిగిస్తుంది. నిత్యం పఠిస్తే విశేష ఫలితాలు అందుతాయి. అకాల మృత్యు భయం వేధిస్తున్నా, దుస్వప్నాలు పీడిస్తున్నా ఈ స్తోత్రం విముక్తిని కలిగిస్తుంది.