Monday, 30 April 2018

అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు

హిందూ ఋషులు జాబితా
అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు
అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న
ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష

దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.
బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.
రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.

అగ్ని మహర్షి
అగస్త్య మహర్షి
అంగీరస మహర్షి
అంగిరో మహర్షి
అత్రి మహర్షి
అర్వరీవత మహర్షి
అభినామన మహర్షి
అగ్నివేశ మహర్షి
అరుణి మహర్షి
అష్టావక్ర మహర్షి
అష్టిక మహర్షి
అథర్వణ మహర్షి
ఆత్రేయ మహర్షి
అథర్వాకృతి‎
అమహీయుడు
అజామిళ్హుడు‎
అప్రతిరథుడు‎
అయాస్యుడు‎
అవస్యుడు
అంబరీషుడు

ఇరింబిఠి‎


ఉపమన్యు మహర్షి
ఉత్తమ మహర్షి
ఉన్మోచన
ఉపరిబభ్రవుడు
ఉద్దాలకుడు‎
ఉశనసుడు
ఉత్కీలుడు

ఊర్ఝ మహర్షి
ఊర్ద్వబాహు మహర్షి

ఋచీక మహర్షి
ఋషభ మహర్షి
ఋష్యశృంగ మహర్షి
ఋషి


ఔపమన్యవ మహర్షి
ఔరవ మహర్షి

కపిల మహర్షి
కశ్యప మహర్షి
క్రతు మహర్షి
కౌకుండి మహర్షి
కురుండి మహర్షి
కావ్య మహర్షి
కాంభోజ మహర్షి
కంబ స్వాయంభువ మహర్షి
కాండ్వ మహర్షి
కణ్వ మహర్షి
కాణ్వ మహర్షి
కిందమ మహర్షి
కుత్స మహర్షి
కౌరుపథి‎
కౌశికుడు‎
కురువు
కాణుడు‎
కలి
కాంకాయనుడు
కపింజలుడు‎
కుసీదుడు

గౌతమ మహర్షి
గర్గ మహర్షి
గృత్సమద మహర్షి
గృత్సదుడు‎
గోపథుడు‎
గోతముడు
గౌరీవీతి
గోపవనుడు
గయుడు

చ్యవన మహర్షి
చైత్ర మహర్షి
చాతనుడు‎

జమదగ్ని మహర్షి
జైమిని మహర్షి
జ్యోతిర్ధామ మహర్షి
జాహ్న మహర్షి
జగద్బీజ
జాటికాయనుడు‎

తండి మహర్షి
తిత్తిరి మహర్షి
త్రితుడు
తృణపాణి

దధీచి మహర్షి
దుర్వాస మహర్షి
దేవల మహర్షి
దత్తోలి మహర్షి
దాలయ మహర్షి
దీర్ఘతమ మహర్షి
ద్రవిణోదస్సు‎

నచికేత మహర్షి
నారద మహర్షి
నిశ్ఛర మహర్షి
సుమేధా మహర్షి
నోధా
నృమేధుడు

పరశురాముడు
పరాశర మహర్షి
పరిజన్య మహర్షి
పులస్త్య మహర్షి
ప్రాచేతస మహర్షి
పులహ మహర్షి
ప్రాణ మహర్షి
ప్రవహిత మహర్షి
పృథు మహర్షి
పివర మహర్షి
పిప్పలాద మహర్షి
ప్రత్య్సంగిరసుడు
పతివేదనుడు
ప్రమోచన‎
ప్రశోచనుడు‎
ప్రియమేథుడు
పార్వతుడు
పురుహన్మ‎
ప్రస్కణ్వుడు
ప్రాగాథుడు
ప్రాచీనబర్హి
ప్రయోగుడు
పూరుడు
పాయు

భరద్వాజ మహర్షి
భృగు మహర్షి
భృంగి మహర్షి
బ్రహ్మర్షి మహర్షి
బభ్రుపింగళుడు
భార్గవవైదర్భి‎
భాగలి
భృగ్వంగిరాబ్రహ్మ
బ్రహ్మస్కందుడు‎
భగుడు‎
బ్రహ్మర్షి
బృహత్కీర్తి‎
బృహజ్జ్యోతి‎
భర్గుడు

మరీచి మహర్షి
మార్కండేయ మహర్షి
మిత మహర్షి
మృకండు మహర్షి
మహాముని మహర్షి
మధు మహర్షి
మాండవ్య మహర్షి
మాయు
మృగారుడు‎
మాతృనామ‎
మయోభువు‎
మేధాతిథి
మధుచ్ఛందుడు
మనువు
మారీచుడు

యాజ్ఞవల్క మహర్షి
యయాతి‎

రురు మహర్షి
రాజర్షి మహర్షి
రేభుడు

వశిష్ట మహర్షి
వాలఖిల్యులు
వాల్మీకి మహర్షి
విశ్వామిత్ర మహర్షి
వ్యాస మహర్షి
విభాండక ఋషి
వాదుల మహర్షి
వాణక మహర్షి
వేదశ్రీ మహర్షి
వేదబాహు మహర్షి
విరాజా మహర్షి
వైశేషిక మహర్షి
వైశంపాయన మహర్షి
వర్తంతు మహర్షి
వృషాకపి
విరూపుడు‎
వత్సుడు‎
వేనుడు
వామదేవుడు‎
వత్సప్రి
విందుడు

శంఖ మహర్షి
శంకృతి మహర్షి
శతానంద మహర్షి
శుక మహర్షి
శుక్ర మహర్షి
శృంగి ఋషి
శశికర్ణుడు
శంభు‎
శౌనకుడు
శంయువు‎
శ్రుతకక్షుడు

సమ్మిత మహర్షి
సనత్కుమారులు
సప్తర్షులు
స్థంభ మహర్షి
సుధామ మహర్షి
సహిష్ణు మహర్షి
సాంఖ్య మహర్షి
సాందీపణి మహర్షి
సావిత్రీసూర్య
సుశబ్దుడు‎
సుతకక్షుడు‎
సుకక్షుడు‎
సౌభరి
సుకీర్తి‎
సవితామహర్షి సామావేదానికి మూలము.
సింధుద్వీపుడు
శునఃశేపుడు
సుదీతి

హవిష్మంత మహర్షి
హిరణ్యరోమ మహర్షి

తెలుగు భాష గొప్పదనం// స్త్రీ అను పదమునకు పర్యాయ పదములివి.

తెలుగు భాష గొప్పదనం

స్త్రీ అను పదమునకు పర్యాయ పదములివి. దాదాపుగా 300 పదములకు కొన్ని తక్కువగా ఉన్నటువంటి ఘనత . ఇన్ని ఆర్యాయ పదములు మరే భాషలో ఉండవేమో ...!!!
1. అంగన
2. అంచయాన
3. అంబుజాలోచన
4. అంబుజవదన
5. అంబుజాక్షి
6. అంబుజనయన
7. అంబురుహాక్షి
8. అక్క
9. అతివ
10. అన్ను
11. అన్నువ
12. అన్నువు
13. అబల
14. అబ్జనయన
15. అబ్జముఖి
16. అలరుబోడి
17. అలివేణి
18. అవ్వ
19. ఆటది
20. ఆడది
21. ఆడగూతూరు
22. ఆడుబుట్టువు
23. ఇంచుబోడి
24. ఇంతి
25. ఇదీవరాక్షి
26. ఇందునిభాష్య
27. ఇందుముఖి
28. ఇందువదన
29. ఇగురాకుబోణి
30. ఇగురాకుబోడి
31. ఇభయాన
32. ఉగ్మలి
33. ఉజ్జ్వలాంగి
34. ఉవిధ
35. ఎలతీగబోడి
36. ఎలనాగ
37. ఏతుల
38. కంజముఖి
39. కంబుకంఠ
40. కంబుగ్రీవ
41. కనకాంగి
42. కన్నులకలికి
43. కప్పురగంధి
44. కమలాక్షి
45. కరబోరువు
46. కర్పూరగంది
47. కలకంఠి
48. కలశస్తిని
49. కలికి
50. కలువకంటి
51. కళింగ
52. కాంత
53. కించిద్విలగ్న
54. కిన్నెరకంఠి
55. కురంగానయన
56. కురంగాక్షి
57. కువలయాక్షి
58. కూచి
59. కృషమధ్యమ
60. కేశిని
61. కొమ
62. కొమరాలు
63. కొమిరె
64. కొమ్మ
65. కోమ
66. కోమలాంగి
67. కొమలి
68. క్రాలుగంటి
69. గజయాన
70. గరిత
71. గర్త
72. గుబ్బలాడి
73. గుబ్బెత
74. గుమ్మ
75. గోతి
76. గోల
77. చంచరీకచికుర
78. చంచలాక్షి
79. చంద్రముఖి
80. చంద్రవదన
81. చక్కనమ్మ
82. చక్కెరబొమ్మ
83. చక్కెర
84. ముద్దుగుమ్మ
85. చాన
86. చామ
87. చారులోన
88. చిగురుంటాకుబోడి
89. చిగురుబోడి
90. చిలుకలకొలోకి
91. చెలి
92. చెలియ
93. చెలువ
94. చేడి(డియ)
95. చోఱుబుడత
96. జక్కవచంటి
97. జని
98. జలజనేత్ర
99. జోటి
100. ఝషలోచన
101. తనుమధ్య
102. తన్వంగి
103. తన్వి
104. తమ్మికింటి
105. తరళలోచన
106. తరళేక్షణ
107. తరుణి
108. తలిరుబోడి
109. తలోదరి
110. తాటంకావతి
111. తాటంకిని
112. తామరకంటి
113. తామరసనేత్ర
114. తియ్యబోడి
115. తీగ(వ)బోడి
116. తెఱువ
117. తెలిగంటి
118. తొగవకంటి
119. తొయ్యలి
120. తోయజలోచన
121. తోయజాక్షి
122. తోయలి
123. దుండి
124. ధవలాక్షి
125. ననబోడి
126. నళినలోచన
127. నళినాక్షి
128. నవల(లా)
129. నాంచారు
130. నాచారు
131. నాచి
132. నాతి
133. నాతుక
134. నారి
135. నితంబవతి
136. నితంబిని
137. నీరజాక్షి
138. నీలవేణి
139. నెచ్చెలి
140. నెలత
141. నెలతుక
142. పంకజాక్షి
143. పడతి
144. పడతుక
145. పద్మముఖి
146. పద్మాక్షి
147. పర్వందుముఖి
148. పల్లవాధర
149. పల్లవోష్ఠి
150. పాటలగంధి
151. పుచ్చడిక
152. పుత్తడిబొమ్మ
153. పువు(వ్వు)బోడి
154. పువ్వారుబోడి
155. పుష్కరాక్షి
156. పూబోడి
157. పైదలి
158. పొల్తి(లతి)
159. పొల్తు(లతు)క
160. త్రీదర్శిని
161. ప్రమద
162. ప్రియ
163. ప్రోడ
164. ప్రోయాలు
165. బంగారుకోడి
166. బాగరి
167. బాగులాడి
168. బింబాధర
169. బింబోష్ఠి
170. బోటి
171. భగిని
172. భామ
173. భామిని
174. భావిని
175. భీరువు
176. మండయంతి
177. మగువ
178. మచ్చెకంటి
179. మడతి
180. మడతుక
181. మత్తకాశిని
182. మదిరనయన
183. మదిరాక్షి
184. మసలాడి
185. మహిళ
186. మానవతి
187. మానిని
188. మించుగంటి
189. మించుబోడి
190.మీనసేత్రి
191. మీనాక్షి
192. ముగుద
193. ముదిత
194. ముదిర
195. ముద్దరాలు
196. ముద్దియ
197. ముద్దుగుమ్మ
198. ముద్దులగుమ్మ
199. ముద్దులాడి
200. ముష్ఠిమధ్య
201. మృగలోచన
202. మృగాక్షి
203. మృగీవిలోకన
204. మెచ్చులాడి
205. మెఱుగారుబోడి
206. మెఱుగుబోడి(ణి)
207. మెలుత
208. మెళ్త(లత)మెల్లు(లతు)
209. యోష
210. యోషిత
211. యోషిత్తు
212. రమణి
213. రామ
214. రుచిరాంగి
215. రూపరి
216. రూపసి
217. రోచన
218. లతకూన
219.లతాంగి
220. లతాతన్వి

Monday, 23 April 2018

వాకింగ్ రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల .......

1.  వాకింగ్ రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, కంగారు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
అలాగే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వచ్చే దెమెంతియా, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి
2 . నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.
కంటికి సంబంధించిన ప‌లు నాడులు
కాళ్ల‌లో ఉంటాయి. అందుక‌నే
 వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. నిత్యం వాకింగ్ చేస్తే క‌ళ్ల‌పై అధిక ఒత్తిడి త‌గ్గ‌డంతోపాటు గ్ల‌కోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట‌.
3. నిత్యం ర‌న్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా క‌లుగుతాయ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతోంది. 4. నిత్యం వాకింగ్ చేస్తే గుండె స‌మ‌స్య‌లు, హార్ట్ ఎటాక్‌లు రావ‌ట‌. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయ‌ట‌. దీంతోపాటు శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంద‌ట‌.
5. వాకింగ్  చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది.  ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.
6. డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం ర‌న్నింగ్ క‌న్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌.
 6 నెల‌ల పాటు వాకింగ్‌, ర‌న్నింగ్ చేసిన కొంద‌రు డ‌యాబెటిస్ పేషెంట్ల‌ను సైంటిస్టులు ప‌రిశీలించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. వాకింగ్ చేసిన వారిలో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వ‌చ్చాయ‌ని సైంటిస్టులు గుర్తించారు. అందువ‌ల్ల రోజూ వాకింగ్ చేస్తే డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.
 7. నిత్యం క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగే జీర్ణ‌ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది.
8. నిత్యం  10వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. దీంతోపాటు కండ‌రాలు దృఢంగా మారుతాయ‌ట‌.
9. నిత్యం  వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి. అవి అంత త్వ‌ర‌గా అరిగిపోవు. అలాగే ఎముక‌ల్లో సాంద్ర‌త పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చ‌ర్లు, కీళ్ల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇందుకు రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి.
10.బ్యాక్ పెయిన్‌తో  స‌త‌మ‌త‌మ‌య్యేవారికి వాకింగ్ చ‌క్క‌ని ఔష‌ధం అనే చెప్ప‌వ‌చ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కింద‌కు వాకింగ్ వ‌స్తుంది. క‌నుక న‌డుంపై పెద్ద‌గా ఒత్తిడి ప‌డ‌దు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి నొప్పి త‌గ్గుతుంది. క‌నుక వెన్ను నొప్పి ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.

Thursday, 12 April 2018

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది.
నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు… హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.

Wednesday, 11 April 2018

ఆహార సూత్రాలు //రుజిత దివేకర్ భారత దేశం లో ఎక్కువ వేతనం ఇవ్వబడుతున్న డైటీషియన్ .

రుజిత  దివేకర్
భారత  దేశం లో  ఎక్కువ  వేతనం  ఇవ్వబడుతున్న  డైటీషియన్.

జూనియర్  అంబానీ  108  కిలోల  బరువు  తగ్గేలా   చేసిన  వ్యక్తి .
ఆమె చెప్పిన కొన్ని ఆహార  సూత్రాలు        

1. స్థానికంగా  దొరికే  పండ్లను  తినండి

అరటిపళ్ళు ,  ద్రాక్ష , సపోటా ,  మామిడి , ఏదైనా  సరే
పళ్ళు  అన్నిటిలోనూ  ఫ్రక్టోజు   ఉంటుంది . మామిడి  తినడం  ఆపిల్  తినడం  కంటే  హానికరం  కాదు .  ఎందుకూ  అంటే  మామిడి  మీకు  లోకల్ ,  ఆపిల్  మీకు  లోకల్  కాదు ,
(  ఆపిల్  కాశ్మీరు  నుండి  వస్తుంది ,   మామిడి  మీకు  లోకల్  గా  దొరుకుతుంది )
ఫ్రక్టోజు   మీ  గ్లూకోజును  నియంత్రణలో ఉంచుతుంది  కనుక  మీరు  పళ్ళను నిరభ్యంతరంగా   తినండి.

 2. మీరు  గింజలనుండి  వచ్చిన  నూనెలను   వాడండి
.( వేరుశనగ నూనె , నువ్వులనూనె , కొబ్బరినూనె , ఆవనూనె ) పేకింగ్ లో  వచ్చే vegetable   నూనేలకన్నా ( ఆలివ్, రైస్  బ్రాన్ , refined ఆయిల్స్ )  మీరు  ఆడించుకున్న  ఆయిల్స్  మంచివి .

 3.  రుజిత  ఎక్కువగా  నెయ్యి  గురించి  చెబుతారు . ప్రతిరోజూ  నెయ్యి  ఎక్కువగా  తినండి 
    అంటారు  ఆమె   ఏ  ఆహారపదార్ధం  లో  నెయ్యి  ఎక్కువగా  తినవచ్చో దానిలో  ఎక్కువగానూ 
    దేనిలో     తక్కువ  తినాలో  దానిలో  తక్కువగానూ  తినమంటారు  ఆమె .
    నెయ్యి  వాడడం  వలన   కొలెస్టరాల్   తగ్గుతుంది .
4. మీ  ఆహారం  లో  కొబ్బరి  ఎక్కవగా  వాడండి . 
     అటుకుల  పులిహార ( పోహా ) లో  ఇడ్లీ  ,  దోశల  చట్నీ ,   అన్నం  లో  చట్నీ గా తినమని  చెప్తారు
   ! కొబ్బరిలో  కొలెస్టరాల్  అస్సలు  ఉండదు .  మీ  నడుము  సన్నబదడేలా  చేస్తుంది  కొబ్బరి

 5. మీరు   ఓట్స్  గానీ,  ధాన్యాలు గానీ  టిఫిన్  గా  తినవద్దు ,అవి   పేకేజ్డ్  ఆహారం  .
    అవి  మనకు  అవుసరం  లేదు .  వాటికి  రుచీ  పచీ  ఉండదు ,  బోరు  కొడుతూ  ఉంటాయి ,
    మనం  మొదటి  ఆహారం  బోరు  కొట్టకూడదు  అంటారు  రుజిత.
    అల్పాహారం  గా   పోహా ,  ఉప్మా ,  ఇడ్లీ ,  దోశ ,  పరోటా  తినమని  ఆమె  సలహా
    బిస్కట్  యాడ్   లో   కొరికిన   ప్రతి   ముక్కలోనూ  పీచు  ఉంది  అంటారు .పీచుకోసం 
    ఓట్స్    తినక్కరలేదు . ఓట్స్  బదులు పోహా ,  ఉప్మా ,  ఇడ్లీ ,  దోశ ,
6. మీ   నోట్లో  పళ్ళు  ఉన్నంత  కాలం  జ్యూసులు  త్రాగకండి . 
    మీకు  పళ్ళు  ఉన్నది  కూరలూ  పళ్ళూ  తినడానికే
7.  చెరుకు రసం  మిమ్మల్ని  డీ  టాక్సిఫై  చేస్తుంది .  అది ఫ్రెష్  జ్యూస్  రూపం  లో తాగినా
     చెరుకు  ముక్కలు  తిన్నా సరే !
8.   pcos, thyroid -  ఉన్నవారు  శక్తి  కారకాలూ ,  బరువు  తగ్గేవీ  అయిన  వ్యాయామాలు 
       చెయ్యండి   పేకేజీ  ఆహారం  వదిలిపెట్టండి
9.  RICE -  మామూలు  తెల్లని  అన్నం  తినండి .  బ్రౌన్  రైస్   తినవలసిన  అవుసరం  లేదు . 
     అది  ఉడికేటపుడు  మీ  కుక్కర్  కీ  ,  ఉడికాక  మీ  పొట్ట  కీ  శ్రమను  కలిగిస్తుంది . 
     ఎందుకు  ఆ  శ్రమ ?
    రైస్  యొక్క GI INDEX   చాలా  తక్కువ  . 
    అది  పప్పు ,  పులుసు ,  పెరుగు  వంటి  వాటితో  కలిస్తే  దాని GI index మరింత్ తగ్గుతుంది
   వీటికి తోడు  నెయ్యిని  కూడా  చేరిస్తే  అది  మరింత  తగ్గుతుంది .
   రైస్  లో   మినరేల్స్   ఉన్నాయి  .  కాబట్టి  మీరు  రోజుకు  మూడుసార్లు  కూడా  తినవచ్చు .
   ఎంత  తినాలి ?
  ఆకలిగా  ఉంటె  ఎక్కువ  తినండి .   మీ  పొట్ట  ఏమి చెప్తుందో  దాన్ని  బట్టి  చెయ్యండి
  మీరు  రైస్ ,  చపాతీ  రెండూ  తినవచ్చు , లేదా  ఒక్క  రైస్  మాత్రమె  తినవచ్చు . 
 మూడుపూట్లా మీ  ఇష్టం  వచ్చినట్టు  ఏమీ  భయపడకుండా  తినండి .  మీ  ఆకలిని  బట్టి  తినండి
మీరు  తినే  ఆహారం  మిమ్మల్ని  భయపెట్టకూడదు .
( నెయ్యి  ,  రైస్  తినకూడదు  అంటూ  భయం  వద్దు )
మీరు  తినే  ఆహారం  మిమ్మల్ని  మంచిగా ఫీల్  అయ్యేలా  ఉండాలి
అయ్యబాబోయ్  ఎన్ని  కేలరీలు  తిన్నానో  అని  భయపడకండి ,  ఎంత  పోషకాహారం  తీసుకున్నానో  అనేది  చూడండి
10. పిజ్జా , పాస్తా ,  బ్రెడ్ ,  బిస్కట్ ,  కేకులు  అస్సలు  తినవద్దు
11. మిమ్మల్ని  మీరు  ప్రశ్నిచుకోండి
      ఈ ఫుడ్  మా  అమ్మమ్మ  తినేదా ?  మీ జవాబు  ఎస్   అయితే  భయం  లేకుండా  తినండి .
 12. రుతువును  బట్టి  తినండి .
      వర్షాకాలం  లో  పకోడీలు, జిలేబీలు లాంటివి తినండి .  ఎందుకంటే  ఆకలి  రుతువును 
       బట్టి      ఉంటుంది . ఒక్కొక్క  సీజన  లో  వేపుళ్ళు తినాలి  .  తినండి
13.  ఉదయాన్నే   టీ  మీ  మొదటి  ఆహారం  గా  తీసుకోకండి .
      అలాగే  బాగా  ఆకలిగా  ఉన్నప్పుడు  కూడా  టీ  త్రాగకండి .
      రోజులో  రెండు  మూడు  సార్లు   పంచదార  వేసుకుని  టీ  త్రాగండి
       గ్రీన్ టీ  త్రాగకండి  .  ఎల్లో  టీ , గులాబీ  టీ , నీలం  టీ   ఏమీ  వద్దు .
14.  మీ   సాంప్రదాయ  ఆహారం  తీసుకోండి
       నిలవచేసిన  పేకేజీ  ఫుడ్ /  డ్రింక్స్ ఏమీ  వద్దు
15.  వ్యాయామం   చెయ్యండి .  వాకింగ్  చెయ్యండి .  అరగడానికీ ,  ఆరోగ్యంగా  ఉండడానికీ.