Sunday, 29 January 2023

అమ్మవారి అర్చనా విశేషాలు

 అమ్మవారి అర్చనా విశేషాలు


అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం, ఏ నైవేద్యం పెట్టాలి....

#పాడ్యమి రోజు - ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగలు నివారణ అవుతాయి.

#విదియ రోజు - చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది.

#తదియ రోజు - ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి.

#చవితి రోజున - పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి.

#పంచమి రోజు - అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు, బుద్ది శక్తి పెరుగుతుంది.

#షష్టి రోజున - తేనే తో అమ్మవారిని అభిషేకించడము వలన కాంతి పెరుగుతుంది, యషస్సు పెరుగుతుంది.

#అష్టమి రోజున - బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అనీ తీరిపొతయి అంటారు.

#నవమి రోజున - నైవేద్యం పెట్టడం వలన సకల సౌభాగ్యలు కలుగుతాయి.

#దశమి రోజున - నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్గాయుషు పెరుగుతుంది.

వారాలలో ఏ నైవేద్యం....

#ఆదివారం రోజు - పాలు
#సోమవారం - పాయసం
#మంగళవారం - అరటిపళ్ళు
#బుధవారం - వెన్న
#గురువారం - పటికబెల్లం
#శుక్రవారం - తీపి పదార్ధాలు
#శనివారం - ఆవు నేయి

అమ్మవారికి ఇష్టమయిన అన్నం
పులగం - అన్నం + పెసరపప్పు
పాయసన్నం
పెరుగు అన్నం
బెల్లం అన్నం

సేకరణ

శ్రీ వేంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామవళి

  శ్రీ వేంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామవళి



ప్రతిరోజూ కలియుగ ప్రత్యక్షదైవమైన వేంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామవళిని జపించడం వలన దారిద్ర్యం దూరమవుతుంది. సిరి సంపదలు కలుగుతాయి. పాపకర్మఫలితంగా భవిష్యత్తులో రాబోవు చెడు కర్మఫలితములు హరింపబడుతాయి. ఏలినాటి శని వంటి దశలలో ఉన్నవారిని కూడ శ్రీహరికి భక్తుడైన శనిశ్చరుడు వారి యందు ప్రసన్నుడై వారిని అనుగ్రహిస్తాడు. ప్రతిరోజూ వేంకటేశ్వర స్వామిని పూజించే ఇంటిని విష్ణుభగవాణుడి సుదర్శన చక్రం కాపాడుతూ ఉంటుంది. భూత, ప్రేత, పిశాచాది గణములు ఆ ఇంట ప్రవేశించలేవు. జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేనివారు కూడా నిత్యం “నమో వేంకటేశాయ” అనే ఉత్కృష్టమైన మంత్రాన్ని జపించడం వలన చెడు గ్రహఫలితాలు శాంతిస్తాయి. వారి యందు కలిపురుషుడి ప్రభావం ఉండదు. వారి జోలికి యమధర్మరాజు వెళ్ళలేడని మనకు శాస్త్రాలు వివరిస్తున్నాయి.


శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి


1. ఓం శ్రీవేంకటేశ్వరాయ నమ: |

2. ఓం అవ్యక్తాయ నమ: |

3. ఓం శ్రీశ్రీనివాసాయ నమ: |

4. ఓం కటిహస్తాయ నమ: |

5. ఓం లక్ష్మీపతయే నమ: |

6. ఓం వరప్రదాయ నమ: |

7. ఓం అనమయాయ నమ: |

8. ఓం అనేకాత్మనే నమ: |

9. ఓం అమృతాంశాయ నమ: |

1-. ఓం దీనబంధవే నమ: |

11. ఓం జగద్వంద్యాయ నమ: |

12. ఓం ఆర్తలోకాభయప్రదాయ నమ: |

13. ఓం గోవిందాయ నమ: |

14. ఓం ఆకాశరాజ వరదాయ నమ: |

15. ఓం శాశ్వతాయ నమ: |

16. ఓం యోగిహృత్పద్మ మందిరాయ నమ: |

17. ఓం ప్రభవే నమ: |

18. ఓం దామోదరాయ నమ: |

19. ఓం శేషాద్రినిలయాయ నమ: |

20. ఓం జగత్పాలాయ నమ: |

21. ఓం దేవాయ నమ: |

22. ఓం పాపఘ్నాయ నమ: |

23. ఓం కేశవాయ నమ: |

24. ఓం భక్తవత్సలాయ నమ: |

25. ఓం మధుసూదనాయ నమ: |

26. ఓం త్రివిక్రమాయ నమ: |

27. ఓం అమృతాయ నమ: |

28. ఓం శింశుమారాయ నమ: |

29. ఓం మాధవాయ నమ: |

30. ఓం జటామకుటశోభితాయ నమ: |

31. ఓం కృష్ణాయ నమ: |

32. ఓం శంఖమధ్యోల్లసన్మంజుక కిణ్యాఢ్య కరందరాయ నమ: |

33. ఓం శ్రీహరయే నమ: |

34. ఓం నీలమేఘశ్యామ తనవే నమ: |

35. ఓం జ్ఞానపంజరాయ నమ: |

36. ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమ: |

37. ఓం శ్రీవత్సవక్షసే నమ: |

38. ఓం జగద్వ్యాపినే నమ: |

39. ఓం సర్వేశాయ నమ: |

40. ఓం జగత్కర్త్రే నమ: |

41. ఓం గోపాలాయ నమ: |

42. ఓం జగత్సాక్షిణే నమ: |

43. ఓం పురుషోత్తమాయ నమ: |

44. ఓం జగత్పతయే నమ: |

45. ఓం గోపీశ్వరాయ నమ: |

46. ఓం చింతితార్ధ ప్రదాయకాయ నమ: |

47. ఓం పరంజ్యోతిషే నమ: |

48. ఓం జిష్ణవే నమ: |

49. ఓం వైకుంఠపతయే నమ: |

50. ఓం దాశార్హాయ నమ: |

51. ఓం అవ్యయాయ నమ: |

52. ఓం దశరూపవతే నమ: |

53. ఓం సుధాతనవే నమ: |

54. ఓం దేవకీనందనాయ నమ: |

55. ఓం యాదవేంద్రాయ నమ: |

56. ఓం శౌరయే నమ: |

57. ఓం నిత్యయౌవనరూపవతే నమ: |

58. ఓం హయగ్రీవాయ నమ: |

59. ఓం చతుర్వేదాత్మకాయ నమ: |

60. ఓం జనార్దనాయ నమ: |

61. ఓం విష్ణవే నమ: |

62. ఓం కన్యాశ్రవణతారేడ్యాయ నమ: |

63. ఓం అచ్యుతాయ నమ: |

64. ఓం పీతాంబరధరాయ నమ: |

65. ఓం పద్మినీ ప్రియాయ నమ: |

66. ఓం అనఘాయ నమ: |

67. ఓం ధరాపతయే నమ: |

68. ఓం వనమాలినే నమ: |

69. ఓం సురపతయే నమ: |

70. ఓం పద్మనాభాయ నమ: |

71. ఓం నిర్మలాయ నమ: |

72. ఓం మృగయాసక్త మానసాయ నమ: |

73. ఓం దేవపూజితాయ నమ: |

74. ఓం అశ్వారూఢాయ నమ: |

75. ఓం చతుర్భుజాయ నమ: |

76. ఓం ఖడ్గధారిణే నమ: |

77. ఓం చక్రధరాయ నమ: |

78. ఓం ధనార్జనసముత్సుకాయ నమ: |

79. ఓం త్రిధామ్నే నమ: |

80. ఓం ఘనసారలసన్మధ్య కస్తూరీ తిలకోజ్వలాయ నమ: |

81. ఓం త్రిగుణాశ్రయాయ నమ: |

82. ఓం సచ్చిదానంద రూపాయ నమ: |

83. ఓం నిర్వికల్పాయ నమ: |

84. ఓం జగన్మంగళ దాయకాయ నమ: |

85. ఓం నిష్కళంకాయ నమ: |

86. ఓం యజ్ఞరూపాయ నమ: |

87. ఓం నిరాతంకాయ నమ: |

88. ఓం యజ్ఞభోక్త్రే నమ: |

89. ఓం నిరంజనాయ నమ: |

90. ఓం చిన్మయాయ నమ: |

91. ఓం నిరాభాసాయ నమ: |

92. ఓం పరమేశ్వరాయ నమ: |

93. ఓం నిత్యతృప్తాయ నమ: |

94. ఓం పరమార్ధప్రదాయ నమ: |

95. ఓం నిరూపద్రవాయ నమ: |

96. ఓం శాంతాయ నమ: |

97. ఓం నిర్గుణాయ నమ: |

98. ఓం శ్రీమతే నమ: |

99. ఓం గదాధరాయ నమ: |

100. ఓం దోర్దండవిక్రమాయ నమ: |

101. ఓం శార్ ఘ్న పాణయే నమ: |

102. ఓం పరాత్పరాయ నమ: |

103. ఓం నందకినే నమ: |

104. ఓం పరబ్రహ్మణే నమ: |

105. ఓం శంఖధారకాయ నమ: |

106. ఓం శ్రీవిభవే నమ: |

107. ఓం అనేకమూర్తయే నమ: |

108. ఓం జగదీశ్వరాయ నమ: |


 ఇతి శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి సంపూర్ణం 


గోవిందా గోవిందా

Saturday, 28 January 2023

రథసప్తమి

రథసప్తమి


మహాతేజం రథసప్తమి :


రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ.
మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు.
రథసప్తమి మహా తేజం.
మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.

సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు

1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'
2. వైశాఖంలో అర్యముడు ,
3. జ్యేష్టం - మిత్రుడు ,
4. ఆషాఢం - వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు ,
6. భాద్రపదం - వివస్వంతుడు ,
7. ఆశ్వయుజం - త్వష్ణ ,
8. కార్తీకం - విష్ణువు ,
9. మార్గశిరం -అంశుమంతుడు ,
10. పుష్యం - భగుడు ,
11. మాఘం - పూషుడు ,
12. ఫాల్గుణం - పర్జజన్యుడు .

ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు.

పురాణ కథనం ప్రకారం
బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినేపండు అనుకుని
తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరాభాను
అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు.

దీన్ని లెక్క కడితే యుగం.. 12000 ఏళ్లు ,
సహస్రం 1000 , యోజనం 8 మైళ్లు , మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే

ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.

ఆ ఏడు గుర్రాల పేర్లు
1. గాయత్రి ,
2. త్రిష్ణుప్పు ,
3. అనుష్టుప్పు ,
4. జగతి ,
5. పంక్తి ,
6. బృహతి ,
7. ఉష్ణిక్కు
వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
రామ రావణ యుద్ధం సమయంలో
అగస్త్య మహాముని
ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది
ఇందులో 30 శ్లోకాలున్నాయి.
వీటి స్మరణ వల్ల శారీరక ,
మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.
సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు
పగలు , రాత్రికి ప్రతీక అని ,
చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు ,
ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది.
అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది.
సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు , ఐశ్వర్యం , ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.
ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి , రోగము , శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు , రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది.
జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు.
సూర్యునికి "అర్కః" అని పేరు.
అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక , ఏడు జన్మల్లో చేసిన పాపములను , ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ


పూజ విదానం

చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి , ఒక్కొక్క దళం చొప్పున రవి , భాను , వివస్వత , భాస్కర , సవిత , అర్క , సహస్రకిరణ , సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం , ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది
ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి.
ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు.
చిక్కుడు , జిల్లేడు , రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.
జిల్లేడు , రేగు , దూర్వాలు , ఆక్షతలు , చందనాలు కలిపిన నీటితోగాని , పాలతో గాని , రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.
మనం చేసే పూజలు
వ్రతాలు అన్ని పుణ్యసంపాదన కొరకే
శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది.

ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ - ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు
ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తీ శ్రద్ధ లతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని , ఐశ్వర్యాన్ని పొందుదాం.
చదుకొవలిసిన స్తోత్రాలు
ఆదిత్యహృదయం , సూర్య స్తోత్రం , నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదయకమని గురు వాక్యం

మాఘ శుద్ద షష్టి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది , చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈ రోజు అంటే మాఘ శుద్ధ షష్టి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిధిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చేయాలి.
సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు , ఇబ్బందులు తొలగుతాయని శాస్త్రవచనం.

1. ఈ జన్మలో చేసిన
2. గత జన్మలో చేసిన
3. మనస్సుతో
4. మాటతో
5. శరీరంతో
6. తెలిసీ
7. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.

ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశం లో నక్షత్ర కూటమి రధం ఆకారం లో ఉంటుంది
రోగ నివారణ / సంతాన ప్రాప్తి కోసం రధ సప్తమి వ్రత విధానం
స్నానాతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి.
అష్టదల పద్మం ముగ్గు (బియ్యం పిండి తో ) వేసి అందులో సూర్య నామాలు చెప్తూ 7 రంగులు నింపాలి.
అష్ట దళ పద్మ మద్య లో శివ పార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రథాన్ని (7 గుర్రాలు) నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు
చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి.
సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చెస్తున్నామొ లేదా ఎవరికీ సంతానం కలగాలని చెస్తునామొ వారి పేరు గోత్రనామలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు దానం ఇవ్వాలి
తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని ఉపవాసం ఉండాలి
ఈ సంవత్సర కాలం నియమం నేనుగా నిష్టగా ఉండాలి
సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి
ఇలా శక్తి ఆసక్తి కలిగిన వారు చేసినచో వారికి సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది

ఓం సూర్యనారాయణ నమః
ఓం  నమో భగవతే వాసుదేవాయ నమః

సేకరణ 

Friday, 27 January 2023

శ్రీ పంచమి అనగా వసంత పంచమి

  శ్రీ పంచమి అనగా వసంత పంచమి 


విద్యాభ్యాసానికి ప్రారంభం - అక్షరాభ్యాసం  అక్షరాలను దిద్దించడంతో విద్యాభ్యాసం ప్రారంభం అవుతుంది. 


"అక్షరం " అంటే క్షయము లేనిది, 

నాశనం లేనిది అని అర్ధం. 

మనం సంపాదించే సంపదల్లో ఏదైనా నశిస్తుంది కానీ....

అక్షర సంపద, విద్యా సంపద మాత్రం నశించదు. అటువంటి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించే ముందు


"సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమేసదా..."


అని చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతీ దేవిని ప్రార్ధించడం ఆచారం.

చదువుల తల్లి...

అక్షరాల అధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణిని, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతి జన్మదినo - మాఘ మాసం శుక్ల పక్ష పంచమి. 

ఈ సంధర్భంగా జరుపుకునే పండుగే - 

శ్రీ పంచమి . దీనికే వసంత పంచమి అని కూడా పేరు. విద్యలకు అధిదేవత అయిన శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మదేవుడి దేవేరి. తెల్లటి పద్మంపైన నిలుచుని, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దానిపైన అడ్డముగానూ ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకములను చేతులందు ధరించి ఉంటుందని శ్రీ సరస్వతీ దేవిని గురించి పద్మ పురాణం పేర్కొంది. అంటే సరస్వతీ దేవి అహింసా దేవత.

చల్లని తల్లి.

బ్రహ్మవైవర్త పురాణం లో కూడా ఈ విషయమే ఉంది. 

ఈ పురాణంలో దుర్గ, సావిత్రి, శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, శ్రీ రాధాదేవి...

అనే ఐదుగురు ప్రకృతి శక్తులనీ..

వీరిలో మూడో శక్తులని, 

వీరిలో సరస్వతి పరమాత్మనుంచి వచ్చిన ఉద్భవించిన వాణికి, విద్య, ఙ్ఞాన ,బుద్ధులనీ చెప్తోంది. 

అటువంటి ఙ్ఞానప్రదాయిని కరుణ వుంటేనే విద్యాప్రాప్తి, ఙ్ఞానప్రాప్తి కలుగుతుంది అని 

పురాణ వచనం.

 శ్రీ సరస్వతీ దేవి జన్మదినమైన శ్రీ పంచమి పండుగకు దక్షిణభారతం లో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. శ్రీ పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చెస్తే అపారమైన ఙ్ఞానం లభిస్తుంది ..నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది అనే శాస్త్ర వచనం. 

ఈ రోజున ఉదయాన్నే లేచి, స్నానాది క్రతువులు తీర్చుకుని, అమ్మ వారి పూజలు తెల్లటి వస్త్రాలు, పూసలతో అలంకరణ చేసి, 

పాలు, వెన్న...అలాంటి మొదలైన పదార్ధాలు నివేదన చేసి, 

ఆ తరువాయి చిన్న పిల్లలకు విద్య ని ఆరంభం చేసినచో ఆ చిన్నారులకు ఆ సరస్వతీ దేవి విద్యను ప్రసాదిస్తుంది.

 ఈ రోజున, శ్రీ సరస్వతి దేవితో పాటు, వినాయకుడు, శ్రీ మహా విష్ణువు, పరమ శివుడు, సూర్య భగవానుడు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు.


ధ్యాన శ్లోకము...


యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణావరదండమండిత కరా యా శ్వేత పద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా

సామాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా



         

Monday, 2 January 2023

ఏకాదశి

 ఏదైనా ఒక సంవత్సరంలో అధిక మాసం వస్తే 26 ఏకాదశి తిథులు రావొచ్చు.


మాసం పేరు                  శుక్ల పక్షం                       కృష్ణ పక్షం

1. చైత్రమాసం                 కామద                           పాపవిమోచన

2. వైశాఖమాసం             మోహిని                         వరూధిని

3. జ్యేష్ట మాసం               నిర్జల                             అపద

4. ఆషాఢం                      శయనైకాదశి                 యోగిని

5. శ్రావణ మాసం             పుత్ర ఏకాదశి                 కామద

6. భాద్రపద మాసం          పరివర్తన                       ఇందిర

7. ఆశ్వయుజ మాసం      పాశంకుశైకాదశి             వాల్మీకి

8. కార్తీకమాసం               ఉత్థానైకాదశి                  ప్రబోధినైకాదశి

9. మార్గశిరమాసం           వైకుంఠ ఏకాదశి             మోక్షదా నైకాదశి

10. పుష్యమాసం             షేష పుత్రాడ                   ఏకాదశి సఫల

11. మాఘమాసం            భీష్మ ఏకాదశి                   విజయ

12. ఫాల్గుణ మాసం          ఉత్పన్న ఏకాదశి             అమలవి

అధికమాసం                    పరమ ఏకాదశి               పద్మిని ఏకాదశి

1. ప్రతి సంవత్సరం ఆషాడ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి, శయనైకాదశి, ప్రథమ ఏకాదశి, ప్రబోధ నైకాదశిగా పిలుస్తారు. ఈ రోజు శ్రీ మహాశిష్ణువు క్షీరసాగరంలో శేష శయ్యపై యోగ నిద్రలోకి జారుకుంటాడని, తిరిగి కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడని ప్రతీతి. ఈ 4 నెలల పుణ్య కాలాన్ని చాతుర్మాస్యం అంటారు.

2. ఆషాఢ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు.

3. శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్ర ఏకాదశి అంటారు. సంతానం లేని వాళ్ళ ఈ ఏకాదశి రోజు వ్రతాన్ని చేస్తే సంతానం లుగుతుందని పురాణ వాక్యం.

4. శ్రావణ బహుళ ఏకాదశిని కామద ఏకాదశి అంటారు.

5. భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అంటారు. శ్రీమన్నారాయణుడు శేష శయనం మీద పక్కకు ఒరుగుతాడు. కనుక దీనిని పరివర్తిని ఏకాదశి అంటారు.

6. భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిర ఏకాదశి అంటారు.

7. ఆశ్వయుజ శుక్ల ఏకాదశిని పాశాంకు శైకాదశి అంటారు. పాశం అంటే యమపాశం. ఈ రోజు ఉపవాసం చేస్తే ఆ వ్రత ఫలం అంకుశంలా యమపాశాన్ని అడ్డు కుంటుందట. యముడు ఏకాదశి వ్రతం చేసిన వారి పట్ల కరుణ చూపు తాడని పురాణ కావ్యం.

8. ఆశ్వయుజ బహుళ ఏకాదశిని వాల్మీకి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని వాల్మీకి జయంతిగా కూడా జరుపుకుంటారు. రత్నాకరుడు అనే కిరాతకుడు ఆదికవిగా అవతరించిన ఘట్టం మనిషిలో అంతర్లీనంగా ఉన్న మహాశక్తికి సంకేతం. కృషి ఉంటే మనుషులు ఋషులవు తారు అన్న మహత్తర సందేశాన్ని ఇది తెలుపుతుంది.

9. కార్తీక శుక్ల ఏకాదశిని ఉత్థాన ఏకాదశి (ప్రబోధనే కాదశి) అంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి మేల్కొంటాడని అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి అంటారని సాంప్రదాయ కథనం. ఇది దేవతలు మేల్కొనే రోజు అయినందున ఉపవాసకులకు అత్యంత ముఖ్యమైనది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పునర్జన్మ ఉండదని శాస్త్రవచనం.

10. కార్తీక బహుళ ఏకాదశిని రమ ఏకాదశి అంటారు. ఆ రోజు యధావిధిగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపిండితో చేసిన లడ్లు, బెల్లం దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.

11. మార్గశిర మాస బహుళ పక్ష ఏకాదశిని మోక్షదా లేక ఉత్పత్తి ఏకాదశి అంటారు. ఈ రోజు వైవాహిక ఆలోచనలను దూరంగా పెట్టి హరినామామృతాన్ని ఆహారంగా భావించి ఆధ్యాత్మిక సాధనకు తొలి అడుగువేస్తే మంచి ఫలితముంటుంది.

12. మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిగా ప్రసిద్ది చెందింది. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి నాడు సర్పాలంకారాలతో, శ్రీదేవి, భూదేవితో కలసి గరుడ వాహనంలో వైకుంఠానికి వచ్చేటప్పుడు వైకుంఠం ఉత్తర ద్వారం వద్ద సకల దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించినందున దీనిని వైకుంఠ ఏకాదశి అంటారు.

– వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ రోజు తెల్లవారు జామున ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని చెప్తారు. అందుకే ఈ ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారంగా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు 33 కోట్ల దేవతలు భూమికి దిగి వస్తారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసి రాత్రికి జాగరణ ఉండి మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుమూర్తికి పూజ చేసి, నైవేద్యం సమర్పించి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తే మంచిది. ఈ ఏకాదశి వ్రత మహిమను శివుడు పార్వతికి స్వయంగా చెప్పాడని పద్మపురాణం వివరిస్తుంది. ఈ సంవత్సరం డిసెంబర్‌ 29న ముక్కోటి ఏకాదశి వస్తుంది.

13. అధిక మాస శుక్ల ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటారు.

14. అధిక మాస కృష్ణ పక్ష ఏకాదశిని పరమా ఏకాదశి అంటారు. పరమా అంటే చాలా గొప్పది.

15. పుష్య శుక్ల ఏకాదశిని పుత్ర ఏకాదశి అంటారు.

16. పుష్య బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు.

17. మాఘ శుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. మాఘ మాసంలో వచ్చే 2 ఏకాదశులు ముఖ్యమైనవే. మాఘ శుద్ధ సప్తమి మొదలుకొని ఏకాదశి వరకు భీష్ముడు ఒక్కొక్కరోజు ఒక్కొక్క ప్రాణాన్ని విడిచి పెట్టాడట. ఈ 5 రోజులను భీష్మ పంచకాలంటారు. భీష్ముడు శ్రీ కృష్ణ పరమాత్మలో ఐక్యమైంది మాఘ శుద్ధ అష్టమి నాడైనా శ్రీహరి ఆయన గొప్పదనాన్ని లోకానికి తెలియజేయడం కోసం తనని దివి నుండి భువికి దింపిన భక్తునిగా గౌరవిస్తూ తనకు ప్రీతిపాత్ర మైన ఏకాదశి తిథిని అతనికి ఏర్పాటు చేస్తూ భీష్మ ఏకాదశిని పర్వదినంగా ప్రకటించాడు. ఈ ఏకాదశి రోజు మాఘ స్నానంచేసి ఉపవాసం ఉంటే 24 ఏకాదశుల ఫలితం వస్తుందని పురాణ వచనం.

18. మాఘ మాస కృష్ణ పక్ష ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఆనాడే రామసేతువు నిర్మాణం పూర్తి అయిందని పురాణ వాక్యం.

19. ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. విష్ణువును శేషపుష్పాలతో పూజిస్తారు. పూర్వం మేధావి అనే మహర్షి రోజూ ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలేవాడు. మంజుఘోష అనే అప్సర అతనికి తపోభంగం కలిగించింది. కోపానికి గురైన ఆ మహర్షి అప్సరసను శపించాడు. విష్ణుమూర్తి కటాక్షంతో ఆ దేవకన్య ఫాల్గుణ ఏకాదశి నాడే శాప విముక్తురాలైంది.

20. ఫాల్గుణ బహుళ ఏకాదశిని అమలిక ఏకాదశి అంటారు.

21. చైత్రమాస శుక్ల ఏకాదశిని కామద ఏకాదశి అంటారు.

22. చైత్రమాస కృష్ణ పక్ష ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు.

23. వైశాఖ శుక్ల ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు.

24. వైశాఖ బహుళ ఏకాదశిని వరూధిని ఏకాదశి అంటారు.

25. జ్యేష్ట శుక్ల ఏకాదశిని నిర్మల ఏకాదశి అంటారు.

26. జ్యేష్ట మాస బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు.

ఏకాదశి వ్రతాలను మించిన వ్రతం లేదని, ఏకాదశి ఉపవాసం అన్నిటి కంటే శ్రేష్ఠమైందని శ్రీ కృష్ణ భగవానుడు ధర్మరాజుకు వినిపించాడు.