Sunday, 1 August 2021

పచ్చి మిర్చి ఉపయోగాలు

 


పచ్చి మిర్చి

1. పచ్చిమిర్చిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా రోజూవారీ ఆహారంలో తీసుకోవడం వలన జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అ

3. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

4. పచ్చిమిర్చి తినడం వల్ల ప్రోస్టేట్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.

5. కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి.

6. పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది ఆహరపు రుచిని పెంచుతుంది. కానీ మెదడులోని ఒక భాగమైన హైపోథాలమస్‌ను ప్రభావితం చేసిన వెంటనే శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. భారతదేశంలోని అత్యంత హాటెస్ట్ ప్రదేశాలలో కూడా పచ్చిమిరపకాయలు సమృద్ధిగా తినడానికి కారణం ఇదే. ఇందులో కనిపించే క్యాప్సైసిన్ రక్త ప్రసరణను సమతుల్యంగా ఉంచుతుంది. దీనివల్ల జలుబు, సైనస్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.
7. జలుబు ఉన్నప్పుడు పచ్చిమిర్చి తినాలి. చలి నుంచి ఉపశమనం లభిస్తుంది. పచ్చిమిర్చి తినడం ద్వారా శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.
8. అల్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు మసాలా ఆహారాన్ని తినడం కష్టం అయినప్పటికీ,

9. పచ్చి మిరపకాయలు తీసుకోవడం వల్ల బొబ్బలు త్వరగా నయమవుతాయి.

10. ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటం వల్ల పచ్చిమిర్చి కళ్ళు, చర్మానికి చాలా మేలు చేస్తుంది.

12. పచ్చిమిర్చిని చల్లగా, చీకటి ప్రదేశాలలో ఉంచాలి. గాలి, కాంతికి గురికావడం వలన దాని విటమిన్‌ను నాశనం చేస్తుంది.

13. అంతేకాకుండా రక్తంలో షుగర్ లెవల్స్‏ను కంట్రోల్‏లో ఉంచుతాయి. డయాబెటిక్ రోగులు పచ్చిమిర్చిని తినడం మంచిదే.

14. వీటి ద్వారా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా..

15. పచ్చిమిర్చిని తినడం వలన బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

సేకరణ