Wednesday, 26 April 2017

మటర్ పనీర్


మటర్ పనీర్ 

కావలసిన పదార్థాలు:
1. ఉడికించిన పచ్చి బఠాణీలు-2కప్పులు
2. పనీర్-2 కప్పులు
3. ఉల్లిపాయలు-4 
4. టమాటోలు-4
4. అల్లం ముక్కలు-1 చెంచా
5. వెల్లుల్లి ముక్కలు-1 చెంచా
6. పచ్చి మిరపకాయలు-2
7. లవంగాలు-2
8.దాల్చిన చెక్క- చిన్న ముక్క
9. ఏలకులు-2

తయారీ విధానము:
ఉల్లిపాయలు, టమాటోలు పెద్ద ముక్కలుగా తరుగుకోవాలి.
ఒక బాణలి లో కొంచం నూనె వేసి , 
మందుగా అల్లం,వెల్లుల్లి ముక్కలు  వేయంచికోవాలి. 
తర్వాత ఉల్లిపాయలు వేసి, వేగాక ,
పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు వేసి బాగా వేయంచుకోవాలి. 
ఈ మిశ్రమాన్ని చల్లారాక మెత్తగా రుబ్బుకోవాలి.
బాణలిలో నెయ్యి వేసి వేడెక్కాక లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు వేసి, రుబ్బుకున్న మిశ్రమాన్ని దగ్గరపడేదాక వేయంచుకోవాలి. 
ఉడికించిన పచ్చి బఠాణీలు, పనీర్ వేసి , 
కొంచము నీళ్ళు పోసి సన్నని మంట మీద మూత పెట్టి 5నిమిషాలు ఉడకనివ్వాలి.
స్టవ్‌ ఆపే ముందు గ్రేవీ మరీ చిక్కగా ఉంటే కొంచం నీళ్ళు కలుపుకోవచ్చు. 
కొత్తిమీర వేస్తే
నోరూరించేమటర్ పనీర్ రెడీ....😋

Writer : DEEPTI BURGULA.....U.S.A.,

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/