Wednesday, 29 June 2022

సుందర హనుమాన్ మంత్రం 27నామాలు



సుందర హనుమాన్ మంత్రం 27నామాలు


లంకిణిని హనుమంతుడు దెబ్బకొట్టడం తర్వాత దేవతలు కుసుమవృష్టి కురిపించారు ఆంజనేయస్వామి వారిమీద. 
కుసుమ వృష్టి కురిపించగనే 
బ్రహ్మదేవుడు స్వయంగా దిగి 
వచ్చి హనుమంతుని స్తుతి చేసారు.

ఈ 32 నామాల వరుసని సుందర మంత్రము అంటారు. 

 32 నామాల శక్తి సుందరకాండలో వ్యాపించి ఉంది. . అందుకే సరిగ్గా లంకలో ప్రవేశించబోయే ముందు చేసిన స్తోత్రం .

సంహితా గ్రంథాలలో ఉంటుంది.

 ఎవరైతే ఈ నామాలు పఠిస్తారో వారికి అన్నిరకాల ఆధివ్యాధులు నశిస్తాయి. 


" హనుమానంజనా సూనుః
వాయుపుత్రో మహాబలః
కపీంద్రః
పింగళాక్షశ్చ
లంకా ద్వీప భయంకరః
ప్రభంజన సుతః
వీరః
సీతాశోక వినాశకః
అక్షహంతా రామ సఖః
రామకార్య దురంధరా
మహౌషధ గిరేర్హారీ
వానర ప్రాణదాయకః
వాగీశ తారకశ్చైవ
మైనాక గిరిభంజనః
నిరంజనో జితక్రోధః
కదళీవన సంవృతః
ఊర్ధ్వ రేతా మహాసత్వః
సర్వమంత్ర ప్రవర్తకః
మహాలింగ ప్రతిష్ఠాతా
బాష్పకృత్ జపతాం వరః
శివధ్యానపరో నిత్యం శివపూజా పరాయణః

ఇవి మొత్తం ఇరవై ఏడు నామాలు. 27 నామాలు కలుపుకుంటే దీనికి సుందరహనుమన్మంత్రము అని పేరు. 

Tuesday, 28 June 2022

ఆంజనేయుని నవ అవతారాలు

 ఆంజనేయుని నవ అవతారాలు 


బాలార్కయుత తేజసం
త్రిభువన ప్రక్షోభకం సుందరం
సుగ్రీవాది సమస్తవానర గణైః
సంసేవ్య పాదాంబుజమ్
నాదేనైవ సమస్త రాక్షసగణాన్
సంత్రాస యంతం ప్రభుం
శ్రీమద్రామ పదాంబుజ స్మృతిరతం
ధ్యాయామి వాతాత్మజమ్

"పదివేలమంది బాలసూర్యుల యొక్క కాంతిని కలిగినవాడు. ముల్లోకాలను సైతం కల్లోలపరచే శక్తిసామర్థ్యాలున్నవాడు. సుందరుడైన  సుగ్రీవాది వానరుల అందరిచేత పూజించబడే పాద పద్మాలు కలిగివాడు. తన నాదం చేత రాక్షసులని భయపెట్టేవాడు. తన ఇష్టదైవమైన  శ్రీరామపాదాలను నిరంతరం పూజించగల ఆసక్తి కలిగినవాడు. వాయుపుత్రుడు అయిన హనుమంతుని ధ్యానిస్తున్నాను." అని పై ప్రార్థనకు అర్థం.

హనుమంతుని స్మరించినంత మాత్రానికే బుద్ధి, బలం, తేజస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం కలుగుతాయని చెప్పబడుతోంది. సాక్షాత్తు ఆ పరమ శివుడే దుష్టశిక్షణకై, శిష్టరక్షణకై, రామకార్యసిద్దికై హనుమంతునిగా అవతరించాడు. రుద్రతేజస్స్వ రూపుడైన ఆంజనేయుడు సకలదేవతాత్మకుడు. అందుకే హనుమంతుని పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లే! తన భక్తులను అనుగ్రహించేందుకు ఆంజనేయస్వామి నవ అవతారాలను ధరించాడు.

హనుమంతుని నవ అవతారాలు :-
1. ప్రసన్న హనుమదవతారం.
2. వీరాంజనేయావతారం.
3. విశంతిభుజాంజనేయావతారం.
4. పంచముఖాంజనేయావతారం.
5. అష్టాదశభుజాంజనేయావతారం.
6. సువర్చలా సహిత హనుమదావతారం.
7. చతుర్భుజాంజనేయావతారం.
8. ద్వాత్రింశద్భుజాంజనేయావతారం.
9. వానరాంజనేయావతారం.



Wednesday, 15 June 2022

నీరు పోసిన మొక్కలు

 నీరు పోసిన మొక్కలు



ఆరోజు విశ్వ ...షూటింగ్ స్పాట్ కి కొంచెం ఆలస్యంగా వచ్చాడు...
రాగానే డైరెక్టర్ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు...
క్షమించండి సర్...కొంచెం ఆలస్యం అయింది... ఇంకెప్పుడు ఇలా జరగదు... అని అడిగాడు..
నీ దగ్గర ఇవాళ్టి స్క్రిప్ట్ ఉండిపోయింది... హీరోయిన్ చాలా బిజీ అని తెలుసుగా...
ఆవిడ ఎదురుచూస్తున్నారు..
వెళ్ళు ..ముందు డైలాగ్ పేపర్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించు.
నీ సంగతి నాకు తెలుసు కాబట్టి నేను ఏమి అనను...
ఆవిడ కోప్పడితే ఏమీ మాట్లాడకు...
కాస్త సంయమనం పాటించు...
అర్థం అయిందా అన్నాడు రమేష్....
సరే సర్ ...
థాంక్స్ సర్...
అని కృతజ్ఞతతో చూసి పేపర్ పట్టుకుని వెళ్ళాడు...
మిగతా వాళ్లు రెడీ అవ్వండి...
ఈ లోగా వేరే షాట్స్ కంప్లీట్ చేద్దాం...
అని కెమెరా మెన్ ని పిలిచాడు..
సర్ మిగతా షాట్స్ చేద్దాం...
ఈ లోగా ఆవిడ డైలాగ్ వెర్షన్ ప్రాక్టీసు అవుతుంది...
ఇంకా నయం హీరో తో కాంబినేషన్ లేదు ఈవేళ... లేకపోతే ...ముందు నా పని అయిపోయేది... అన్నాడు నవ్వుతూ రమేష్...
ఏమి పరవాలేదు సర్ ..
ఆవిడకి వేరే చోట షూటింగ్ ఉంది ట...
అందుకే కంగారు... అక్కడ పెద్ద హీరో గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి ట...
ఆ విడకూడా ఆలస్యం కి సమాధానం
చెప్పుకోవాలిగా..D.O.P., అన్నాడు
వివేక్...
విశ్వ పేపర్స్ పట్టుకుని కార్వాన్ దగ్గరికి వెళ్ళాడు...
నిత్యా మామ్ ...అంటూ డోర్ కొట్టాడు... అసిస్టెంట్ తలుపు తీసింది...
మేడం కోసం... డైలాగ్స్ పేపర్ ...అన్నాడు...
రా నిగురించే ఎదురు చూస్తున్నారు...
అంటూ తలుపు తీసింది...
లోపలికి రాగానే క్షమించండి మేడం... అనుకోకుండా ఈ రోజు ఆలస్యం అయింది.. అని క్షమాపణ అడిగాడు...
నీకు అసలు బుద్ధి లేదు...
నీ కోసం ఇంత మంది ఎదురు చూడాలా... అసలు నిన్ను పెట్టిన ఆ రమేష్ ని అనాలి... అవతల ...వేరే షూట్ ఉంది అని తెలుసు గా అని విరుచుకుపడ్డారు...
తల వంచి మౌనంగా విన్నాడు...
రెండు నిమిషాలు బైట కూర్చో... కోపం తగ్గాక పిలుస్తా...అంది...
సరే అండి అంటూ బైటకి వచ్చాడు...
ఇదిగొండి జ్యూస్ అంటూ ఇచ్చింది అసిస్టెంట్... అది తాగి చల్లబడింది...
రమ్మను.. మళ్ళీ ఆలస్యం అవుతుంది...
అంటూ ఆర్డర్ వేసింది నిత్యా...
రమ్మన్నారు అంటూ పిలిచింది అసిస్టెంట్...
గబ గబ లోపలికి వచ్చాడు...
ఇవాళ చిన్న డైలాగ్స్ అండి...5 సీన్స్... అంతే అరగంటలో అయిపోతాయి...
అంటూ షీట్స్ ఇచ్చి... ఫీల్ , డిక్షన్... ఎక్స్ప్లెయిన్ చేసాడు...
నువ్వు చెప్పే విధానము నాకు నచ్చుతుంది... బట్టి అక్కర్లేదు...
అర్థం అయిపోతుంది...
డైలాగ్స్ అలాగే గుర్తు ఉంటాయి... అంది...
ఇందాక కోపం లో ఏదో అనేసా....
అవతల పెద్దాయన తో ...వర్క్...
ఆయనని వైట్ చేయించే సాహసం ఇంకా ఇండస్ట్రీలో ఎవరికి లేదు..
ఆ కోపం లో తిట్టేసా....
పద నేను రెడీ. ..కొంచెం టచ్ అప్ చెయ్ సరిపోతుంది... అంది అసిస్టెంట్ తో...
వాన్ దిగి లొకేషన్ కి వచ్చింది...
అంతే అందరు పరుగులు....
షాట్ రెడి... అంటూ మొదలు పెట్టారు...
అర గంట లో మొత్తాన్ని షూట్ చేసేసారు..
చాలా బాగా వచ్చాయి... అన్ని సీన్స్...
కట్ చెప్పి... నిత్యా గారు...
చాలా బాగా వచ్చాయి ...
మీ అభినయం 100 శాతం బాగా వచ్చాయి... అభినందనలు... అన్నాడు రమేష్...
థాంక్స్... విశ్వ ని పిలు ఒకసారి అంది నిత్యా... వెళ్లి పిలుచుకుని వచ్చాడు...
ఒక అసిస్టెంట్...
పిలిచారుట ...
నీకు అసలు కోపం రాదా...
ఇందాక అన్ని తిడుతుంటే కనీసం ..
తల ఎత్తలేదు... అన్ని భరించావ్... అంది... అదేం లేదు అండి... నా వలనే ఆలస్యం కావడం ఒక కారణం అయితే...
రెండవది... మీకు కోపం వస్తే ...మూడ్ పాడవుతుంది...
ఆ కోపము లో అభినయం అంత బాగా రాదు... మీరు మంచి కళాకారిణి..
మీ నుంచి ప్రేక్షకులు బెస్ట్ కోరుకుంటారు...
నేను తల దించుకోవడం వలన...
మీ కోపం తగ్గి... ఇదిగో.. ఇలా మంచి మూడ్ లో ఉంటే ...బెస్ట్ ఇస్తారు...అందుకే... నేను ఏమి మాట్లాడలేక పోయా ..
.నిజానికి నేను కూడా మీకు బెస్ట్ ఫ్యాన్...
ని మేడం... అన్నాడు వినయం గా...
నీ సింపుల్ సిటీ నాకు నచ్చింది...
ఇదిగో తీసుకో అంటూ 10,000 చేతిలో పెట్టింది...
అయ్యో వద్దు మేడం...
మీరు మరోలా భవించవద్దు..
ఇప్పడు నాకు డబ్బు ఇవ్వొద్దు... అండి...
మీకు కోపం పోయింది అది చాలు అన్నాడు... విశ్వ....
ఇంతలో మేడం అక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి.. మనం బయలుదేరి వెళ్ళాలి... అంది అసిస్టెంట్..
సరే మనం తరువాత మాట్లాడదాం...
అంటూ రమేష్ నేను వెడుతున్నా అని వెళ్ళిపోయింది నిత్యా
..
హమ్మయ్య... ఇవాళ ఎంత గొడవ అవుతుందో అనుకున్నా ..కానీ అంతా సవ్యంగా నే జరిగింది... అన్నాడు రమేష్... ఒకే..pakup చెప్పేస్తానంటూ... చెప్పేసాడు... రమేష్...
ఆ సినిమా సూపర్ హిట్... అయింది..
నిత్యా పేరు పెద్ద రెమ్యూనరేషన్ లిస్ట్ లోకి వెళ్లి పోయింది... వరుసగా సినిమాలు ...బిజీ హీరోయిన్ అయిపోయింది...
ఒకరోజు ఒక స్టూడియో లో నిత్యా షూటింగ్ ...సాంగ్ జరుగుతోంది... అని తెలిసింది విశ్వ కి...ఆ పక్క ఫ్లోర్ లో రమేష్ మూవీ జరుగుతోంది...
రమేష్ గారు నేను నిత్య మేడం ని పలకరించి వస్తా ...ఇంకా బ్రేక్ టైం ఉంది గా అన్నాడు విశ్వ...
సరే వెళ్ళు ...
మళ్ళీ అక్కడినుంచి ఎక్కడికి వెళ్లకు...
నేను వెతుక్కోవాలి... అన్నాడు నవ్వుతూ... సర్...మీరు మరీనూ... అంటూ వెళ్ళాడు...
ఒక అసిస్టెంట్ కి అంత వాల్యూ ఇస్తారు ఏమిటీ సర్ అన్నాడు కొత్త ప్రొడ్యూసర్...
వాడు చాలా మంచి వాడు అండి.. నాదగ్గరే చాలా కాలం గా పని చేస్తున్నాడు... వాడు ఒక్కడు ఉంటే చాలు నేను ఇంక ఏమి చూసుకోవక్కరలేదు... మొత్తం తానే చూసుకుంటాడు... బైట ఆఫర్ లు వచ్చినా ...నన్ను వదిలి పోలేదు...చాలా టాలెంటెడ్... అన్నాడు రమేష్.
***
అక్కడ డాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది...
విశ్వ వెళ్ళాడు...
ఇంకో అసిస్టెంట్ చూసాడు..
రా విశ్వ అన్నా... ఇలా వచ్చారు... మీరు ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారా అని అడిగాడు...
లేదు నిత్యా మామ్ కోసం వచ్చా...
కలవచ్చా అన్నాడు...
సాంగ్ అవుతోంది...
మాస్టర్ ని అడగాలి...
నేను వెళ్లి అడిగి వస్తా... అని వెళ్ళాడు...
కొంచెం బ్రేక్ అవగానే...
నిత్యా దగ్గరకి వెళ్ళాడు...
మామ్ మిమ్మలిని కలవాలి ట విశ్వా వచ్చాడు... అన్నాడు...
ఒక్క నిమిషం వైట్ చేయమని చెప్పు...
ఈ స్టెప్ అవగానే కలుస్తా...
అని మళ్ళీ డాన్స్ లోకి వెళ్ళిపోయింది...
బ్రేక్ ఇచ్చాడు మాస్టర్...
మేడం ఇంకొక్క చరణం ఉంది...
వెంటనే అయిపోతుంది... అన్నాడు మాస్టర్... ఒక్క నిమిషం ..తనతో మాట్లాడి వస్తా... అంటూ విశ్వా దగ్గరకి వచ్చింది...
ఎమ్ విశ్వ ఎలా ఉన్నావ్... అంటూ పలకరించింది... బాగున్నా అండి... మీ షూట్ ఉంది అని తెలిసి వచ్చా...
.ఆ కబుర్లు కెమిటి గాని ముందు విషయం చెప్పు అంది...
అదేం లేదు మేడం అన్నాడు...
కొంచెం తడబాటు గా...
మళ్ళీ వాళ్ళు పిలుస్తారు..తొందరగా చెప్పు అంది...
అది కొంచెం డబ్బు కావాలి... అన్నాడు నెమ్మది గా...
ఇచ్చి నప్పుడు తీసుకోవు...
ఇప్పడు వచ్చి అడుగుతున్నా వు... అంది... నిత్యా...
నిజానికి కొంచెం అర్జెంట్ అండి... తప్పలేదు...ఇది వరకు మీరు ఆఫర్ ఇచ్చారని నమ్మకంతో వచ్చా... అన్నాడు...
సరేలే ఎంత కావాలి అని అడిగింది నిత్యా...
అది అది అన్నాడు...
మొహమాటం గా పరవాలేదు లే చెప్పు ఎంత కావాలి అంది.. నిత్యా..
మీరు ఎంత ఇవ్వాలి అనుకుంటే అంత ఇవ్వండి... అన్నాడు సిగ్గు గా...
నీ సిగ్గు బంగారం కాను... చెప్పు... నీ మీద నాకు సదాభిప్రాయం ఉందిలే... అంది... నిత్యా...
50 వేలు అండి ...కానీ మీరు ఎంత ఇచ్చిన పరవాలేదు.. అన్నాడు...
మేడం షాట్ రెడీ ...మాస్టర్ పిలుస్తున్నారు... అని వచ్చాడు అసిస్టెంట్...
పద  వస్తున్నా... అంది నిత్య...
నేను మళ్ళీ కలుస్తా అండి ...అన్నాడు వినయం గా
ఒక్క నిమిషం ఉండు... అంటూ తన pa నిపిలిచింది... ఇతనికి ఒక లక్ష రూపాయలు ఇవ్వు... అంది.. అంత ఎందుకు అండి ...అన్నాడు...
ఏదో కారణం లేకుండా అడగవు గా...తీసుకో నేను వెళ్ళాలి... మళ్ళీ కలుద్దాం అంది...
మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు... నమస్తే మేడం అన్నాడు...
సరే ఫోన్ చెయ్... అంటూ వెళ్ళిపోయింది... నిత్యా...
ఒకరోజు కలెక్టర్ కార్యాలయం నుండి ఫోన్ వచ్చింది...
నిత్యా ఆఫీస్ కి ..
pa తీసాడు...
మేము కలెక్టర్ కార్యాలయం నుండి మాట్లాడుతూ ఉన్నాం...
సాంస్కృతిక సంస్థలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ...
అందులో భాగం గా ...కళాకారులకు మరియు ఆ సంవత్సరం 10 వ తరగతి ...విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చిన కొంతమంది కి అభినందన ..ఉన్నాయి..
నిత్యా గారిని ప్రత్యేక అతిధి గా ఆహ్వానం పంపుతున్నాం...
ఆవిడ డేట్స్ కొంచెం ఆరోజుకి ...ఫంక్షన్ కి వచ్చేలా చేయమని కలెక్టర్ గారు చెప్పారు... అన్నాడు...
ఒకే సర్ ఆరోజు మేడం కి పనులు అవి నేను adjust చేసుకుంటా...
మీరు ఆహ్వాన పత్రిక లో పేరు వేసేయండి... అన్నాడు... థాంక్స్ అని ఫోన్ పెట్టేసాడు...
అంతలో కిందికి వచ్చింది...
మేడం కలెక్టర్ కార్యాలయం నుండి ఫోన్ వచ్చింది... ఆరోజు ఫంక్షన్ కి మీరు గెస్ట్ గా రావాలి అని.. డేట్స్ adjust చేశా...మనకి ఆ రెండు రోజులు షూటింగ్ లేదు... ఆహ్వానం పత్రిక మీద మీ పేరు కూడా వేస్తున్నారు... అన్నాడు...
ఇప్పడు మనం ఏమి చేశామని గెస్ట్ గా పిలుస్తున్నారు... అంది... నవ్వుతూ...
ఈ మధ్య ప్రతి ఫంక్షన్ కి సినిమా సెలైబ్రెటీ లని పిలవడం అలవాటు అయింది... కదా అలాగే ఏమో అండి... ఈ సారి కలెక్టర్ గారు చెప్పామన్నారు అన్నాడు ...అందుకే ఒకే చేశా అన్నాడు...
సరే ఆరోజు ఏర్పాటు చూడు... అంది... నిత్యా...
ఆరోజు ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు... ఫ్లెక్స్ లు దండలు ...లైటింగ్ తో చాలా గొప్పగా ఉంది... వరుసగా కార్స్ వస్తున్నాయి... అతిథుల్ని దింపేసి.. వాలెట్ పార్కింగ్ వైపు వేడుతున్నాయి... ముందు కలెక్టర్ కాన్ వోయ్ వచ్చింది... వెనుకే నిత్యా కార్... వచ్చింది.. అందరూ నినాదాలు చేస్తున్నారు... ఆమె అందరికి అభివాదం చేస్తోంది... రండి అంటూ పూల గుచ్చాల తో అందరికి ఆహ్వానం పలికారు... సభ మొదలైన ది...
అందరూ ఆశీనులు అయ్యారు... ఒక్కొక్కరు మాట్లాడుతూ సాంస్కృతిక సంస్థలు, కార్యక్రమాలు గురించి... వారు సాధించిన విజయాలు గురించి అభినందనలు తెలిపారు...అందరికీ సన్మానించారు... కలెక్టరు మాట్లాడుతూ... అందరికి ప్రభుత్వం అన్నీ రకాల సాహాయాలు చేస్తున్నా ఇంకా చాలామంది కి అవి అందట్లేదు... ఈ మధ్యనే నాకు తెలిసిన ఒక విషయం మీతో పంచుకుంటా... అంటూ ...ఆగి అటూ ఇటూ చూసారు... అక్కడే ఒక ములగా నిలబడి చూస్తున్నాడు ..విశ్వ
ఇలా రండి అన్నారు... ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు... విశ్వ మిమ్మల్నే  అని పిలిచారు... అప్పడు చూసాడు...
గబ గబా స్టేజి మీదకి వెళ్ళాడు...
నిత్యా కి నమస్తే పెట్టి సర్ పిలిచారు... అన్నాడు..
ఇలా నుంచో ...అని ఆయన ప్రక్కన నిలబెట్టుకుని... ఈ రోజు మీ గురించి అందరికి తెలియాలి... అన్నారు.. సర్ వద్దు సర్ ...ప్లీజ్ అన్నాడు... విశ్వ..
ఆశ్చర్యం గా చూస్తోంది నిత్య... విస్వ ఏమిటీ ఇక్కడ ఇలా అని...నువ్వు ఉండు... అని అతని చేతిని తన ఎడమ చేతితో పట్టుకుని ...ఇతను కనబడకుండా తాను చేయాల్సినది చేసేసి ..ఎలా వినమ్రంగా ఉన్నాడో చూసారా...ఇతను.. కష్టపడి ఒక అసిస్టెంట్ దర్శకుడు గా పనిచేస్తూ... కొంత డబ్బు ని అనాధ ఆశ్రమం లో కొంతమంది పిల్లలని దత్తత కి తీసుకుని ...వాళ్ళని చదివిస్తున్నాడు... నాకు ఈ మధ్య తెలిసింది... ప్రభుత్వం నుండి ఏమాత్రం సహాయం ఆశించకుండా... తన వంతు సాయం చేస్తూ ఆ పిల్లలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు... తల్లి దండ్రులు లేని ఆ పిల్లల కోసం తాను ఇంత చేస్తున్నాడు.. ఈ రోజున వాళ్ళు అందరూ10/10 GPA తో ఉత్తీర్ణులై... పేరుకి అనాథ లే కానీ చదువుకు కాదు అని నిరూపించారు... ఈ 20 మంది ఒకే ఆశ్రమానికి చెందినవారు...ఆ పిల్లలని ఈ రోజు ప్రత్యేకంగా అభినందిస్తున్నా... అంతే కాదు.. అతనికి ఏ సహాయం కావాల్సి వచ్చినా నాకు డైరెక్ట్ గా వచ్చి కలవమని ఈ సభా ముఖం గా ప్రకటిస్తున్నా... అన్నారు...
మైక్ విశ్వ చేతికి ఇచ్చి మాట్లాడు అన్నారు...అభినందనీయం గా చూస్తోంది నిత్యా... అందరూ చప్పట్లు కొట్టారు... ఆగిన తరువాత... విశ్వ మొదలు పెట్టాడు...
అందరికి నమస్కారం... ఏదో నాకు తోచిన సాయం చేస్తూ... వస్తున్నా... ఇక్కడ మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి.. ఈ క్రెడిట్ మొత్తం నాదీ కాదు... అందుకు ముఖ్యమైన కారకులు వేరే ఉన్నారు... వారు ఇక్కడే ఈ వేదిక మీద ఉన్నారు.. ఈ సన్మానాలు నిజానికి వారికే చెందాలి అన్నాడు విశ్వ...
అందరూ ఆశ్చర్యం గా చూస్తున్నారు ఎవరా అని...
ఎవరు వారు పిలు ,
ఎవరికి కనబడకుండా సహాయం చేసే వారి గురించి మనకి తెలియాలి...
వారిని చూసి మరికొంతమంది ముందుకు రావాలి... అన్నారు కలెక్టర్...
వారు ఎవరో కాదు... నిత్యా మామ్... అన్నాడు... అంతటా తమకి ఇష్టమైన కళాకారిని... లో ఇంత మంచి గుణం... సాయం చేసే తత్వం... ఒక్కసారి గా బైట పడడం తో హాలు అంతా చప్పట్లు తో మారుమ్రోగింది...
ఆరోజు పరీక్ష ఫీజు కట్టడానికి రెండు రోజులు గడువు మాత్రమే ఉంది..నా దగ్గర ఉన్న మనీ సరిపోలేదు... ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి లో... ఉండగా.. మామ్ నాకు ఒకసారి 10000 టిప్ ఇచ్చారు... కానీ అది అప్పుడు తీసుకోలేదు... ఆ పక్క ఫ్లోర్ లో ఆవిడ షూటింగ్ జరుగుతోంది అని తెలిసి వెళ్ళా... ఆవిడని కొంత డబ్బు కావాలి అని అడిగా... ఎందుకు ఏమిటీ అని అడగలేదు... నేను 50 వేలు అడిగి తే ఒక లక్ష ఇచ్చారు... ఆ తరువాత ఆవిడ బిజీ గా ఉండి , కనీసం ఏం చేశావ్ అని కూడా అడగలేదు...నీమీద నమ్మకం ఉంది ఏదో మంచి పనికోసం అడిగి ఉంటావు... తీసుకో మళ్ళీ కలుద్దాం అని వెళ్లిపోయారు... ఆ డబ్బు తో వీళ్ళ ఫిజులు ఇంకా కొన్ని అవసరాలు తీర్చి... సదుపాయాలు కల్పించా...

మేడం ఆరోజు మీరు నీరు పోసిన మొక్కలే ...ఈరోజు పెద్దవై విజయాల పూవులు పూశాయి... ఉత్తమ విద్యార్థులు గా తమని తాము నిరూపించుకున్నారు....

పిల్లలు మేడం కి కృతజ్ఞతలు చెప్పండి అన్నాడు విశ్వ....
అందరూ..ఆమెకి నమస్కారం చేసి చాలా థాంక్స్ మేడం మీరు చేసిన ఈ సాయం మేము ఎప్పటికి మరిచిపోము అంటూ సెల్యూట్ చేశారు...
సర్ మీకు అభ్యంతరం లేకపోతే వాళ్లకి సన్మాన పత్రాలు , షీల్డ్స్ నిత్య గారి చేతులు మీదుగా అందజేయాలని కోరుతూన్నా.. అన్నాడు విశ్వ.
తప్పకుండా ఇది ఆవిడ చేతుల మీదుగా జరగాల్సిన విషయం అంటూ నవ్వుతూ... రండి నిత్యా గారు... ఇన్నాళ్లు మీరు హీరోయిన్ గానే తెలుసు.. ఈ రోజు ఇంకా ఎత్తు కి ఎదిగి పోయారు...మీకు నా ప్రత్యేక అభినందనలు... అన్నారు కలెక్టర్...
తనకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు... రండి నిత్యా గారు... అంటూ సాదరంగా ఆహ్వానించారు... కర తాళ ధ్వనులు మధ్య ఆమెకి శాలువా కప్పి ,పూల గుచ్చాన్ని ఇచ్చి సత్కరించారు
ఆమెచే పిల్లలకి అవార్డ్స్ ఇప్పించారు... తరువాత ఆమెకి మైక్ ఇచ్చారు... రెండు మాటలు మాట్లాడమ ని...
కళ్ళ లో ఆనంద బాష్పాలు తో...అందరికి నమస్కారం... చాలా సంతోషం గా ఉంది.. అసలు ఈ సన్మానం విశ్వ కి చెందాలి... అతని కృషి వలనే ఇది సాధ్యమైంది... నేను ఆర్థిక సాయం చేశా అంతే... తన పని తాను చేసుకుంటూ.. సమాజ శ్రేయస్సు కూడా తమ బాధ్యత ఆని భావించే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి... అందుకే నేను మళ్ళీ5 లక్షల రూపాయలు అదే ఆశ్రమానికి విరాళం గా ఇస్తున్నా... దీని ద్వారా మరింత మంది విద్యార్థులు కి లబ్ది.. సహాయం అందుతుంది ని భావిస్తున్నా... అంది...
మళ్ళీ మొత్తం చప్పట్లు తో మారు మ్రోగింది... తరువాత ...విశ్వ కి కూడా శాలువా కప్పి సత్కరించారు.... విచ్చేసిన పెద్దల కి కలెక్టరేట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు....
అందరికి నమస్కారం తెలిపి నిత్యా తన కార్ లో వెళ్ళిపోయింది...

మనం ఎలాగూ అంత పని చేయలేము... కొన్ని ఉద్యోగ కారణాల వలన సమయం కేటాయింపు చేయలేము... చేసే వాళ్లకి కొంత చేయూత నిస్తే మనకి కూడా కొంత ...సంతృప్తి ఉంటుంది అని భావిస్తున్నా...

ఇట్లు రచయిత

కథ ..కధనం ..పాత్రలు... అన్ని కల్పితం.
రచయిత...
నచ్చితే దయచేసి
షేర్ చెయ్యండి..స్టికర్ ఇవ్వండి...


Saturday, 11 June 2022

నాన్నకు ప్రేమతో

 నాన్నకు ప్రేమతో ....కధ



నాన్నా నాకు ఇంకా పై చదువులు చదవాలని ఉంది అంది శైలు...
ఇంజినీరింగ్ అయిందిగా... ఇంకానా అన్నాడు రమేష్...
నాకు M.B.A., చేయాలని ఉంది..తరువాత బిసినెస్ చేస్తా...అంది...శైలు
మరి పెళ్లి ...సంగతి ఏమిటి...ఇంకా ఆలస్యం అయితే ..అందరూ ఏమనుకుంటారు...అని అడిగాడు రమేష్.
అందరూ ఏమనుకుంటున్నారో...అని అలోచిస్తే
నా గోల్ ఎలా రీచ్ అవుతా...
ముందు జీవితంలో
ఏదైనా సాధించాలి...
పెళ్లి చేసుకుంటే ఒక్కోసారివీలు పడవచ్చు , పడకపోవచ్చు..
పెళ్లి అనేది ఒక బాధ్యత...
అది నెత్తిమీద ఉంటే ...
మనం అనుకున్నది సాధిచాలంటే చాలా కష్టంపడాలి ..కదా నాన్నా...
నీ సంగతే చూడు...
నీకు బోల్డ్ అంబిషన్ ఉండేది...కుటుంబపరిస్థితులు వలన వెంటనే
ఉద్యోగం లో చేరడం ,  వెంటనే పెళ్లి...
మేము పుట్టడం...
ఇలా ఒకదానిమీద ఒకటి బాధ్యతలు పెరిగిపోయాయి...రిస్క్ చేసే అవకాశం దేర్యం లేకుండా పోయాయి...కదా
ఆ ఆశలు అలాగే చంపుకుని మమ్మలిని కష్టపడి
పెంచావు..చదివించావు...ఈ స్థాయిలో ఉంచావు...ఇంకాస్త కష్టపడితే ...
నీ ఆశ నేను నెరవేర్చే అవకాశం వస్తుంది...
నీ ఆశలని నీ కూతురిగా నెను సాధిస్తా...
నీ కూతురిగా అది నా బాధ్యత...కూడా...అంది శైలజ...
నిన్ను చూస్తుంటే  నాకు గర్వంగా ఉంది..
సరే తల్లీ నీకు నచ్చినట్లు చెయ్...
ఈ రోజే అప్లైచెయ్..
చదవాలి అనుకున్నది చదువు...
ఎదగాల్సిన ఎత్తుకు ఎదుగు.. నీకు నే ఉన్నా...

" నీ రెక్కల బలం తెలుసుకుని ఎగరగలిగిన ఎత్తుకి ఎదుగు...
అలిసిపోతే నువ్వు వాలడానికి చెట్టులా  ఎప్పుడూ  నేను ఉంటా..."

అన్నాడు రమేష్....

థాంక్స్ నాన్నా అంటూ లాప్టాప్ దగ్గరికి పరిగెత్తింది...
ఆనందం తో గర్వంతో తన కూతురివైపు చూసాడు..." ఈ కాలంలో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తగిన ప్రోత్సాహం ఇస్తే...ఏదైనా సాధించగలరు అన్న నమ్మకంతో.." .....

(కల్పిత కధ...కథ కధనం పాత్రలు...కల్పించి రాసినవి..)
రచయిత...ఆచంట గోపాలకృష్ణ
ఆచంట కథలు


Sunday, 15 May 2022

మన దేశం లో విశిష్ట దేవాలయలు

 మన  దేశం లో విశిష్ట దేవాలయలు


సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయo
హాసంబా దేవాలయం
హాసన్ కర్ణాటక.
సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

నీటితో దీపం వెలిగించే దేవాలయం
మధ్యప్రదేశ్

ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,   అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇకనుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.

స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయం

1.  కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయన మందిరం.

12 ఏళ్లకు ఒకసారి
పిడుగుపడే తిరిగి అతుక్కునేదేవాలయం

బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.

సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు

1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా
7. బ్రమరాంబికా సమేత సిద్దేశ్వర ఆలయం చెన్నారావుపేట.

నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు
1. మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా


నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్. 
3. మంజునాథ్.

శ్వాస తీసుకునే దేవాలయం
శ్రీ కాళహస్తీశ్వర్

సముద్రమే వెనక్కివెళ్లే దేవాలయం

1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్.

2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

స్త్రీవలె నెలసరి అయ్యే

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు, 

2. కేరళ దుర్గామాత.

రంగులు మారే ఆలయం

1. ఉత్తరాయణం,  దక్షిణాయనంలో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.

2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు

1. కాణిపాకం, 
2. యాగంటి బసవన్న, 
3. కాశీ తిలభండేశ్వర్, 
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి

స్వయంభువుగా
సంవత్సరానికి ఒకసారి వెలిసే  దేవాలయం

అమర్నాధ్.

ఆరునెలలకు ఒకసారి తెరిచే

1. బదరీనాథ్, 

2. కేదారనాథ్ ( ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)

3. గుహ్యకాళీమందిరం.

ఒంటి స్తంభంతో
యుగాంతానికి గుర్తుగా ఉండే
పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

రూపాలు మారే
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.

మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు

1. హేమాచల నరసింహ స్వామి.

2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

మనిషి వలె గుటకలు
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.

ఛాయా విశేషం

1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.

2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.

3. బృహదీశ్వరాలయం

నీటిలో తేలే విష్ణువు (టన్నుల బరువుంటుంది ),  నేపాల్

ఇంకా...
తిరుమల వెంకటేశ్వరస్వామి, అనంత పద్మనాభస్వామి, రామేశ్వరం , కంచి,
చిలుకూరి బాలాజీ,  పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం .

పూరీ

పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడపడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమఘుమలాడే  పూరి ప్రసాదం.
సేకరణ: 

Thursday, 10 March 2022

శ్రీ ఆంజనేయ స్వామి ద్వాదశాక్షరీ మహామంత్రం

 శ్రీ ఆంజనేయ స్వామి ద్వాదశాక్షరీ మహామంత్రం


  "  ఓం హరిమర్కట మర్కటాయ నమః "


విజయ మంత్రం : కార్య సిద్ధి మంత్రం
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి సత్తమ | హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ ||





హనుమ/ "ఆరోగ్య రక్ష "శ్లోకం

 


తీవ్ర అనారోగ్యము' లేదా ఎముకలు విరిగినప్పుడు మరియు 
ప్రమాదాలు కలగకుండా ఉండుటకు, 
వాల్మీకి రామాయణం లోని 
ఈ శ్లోకం చదవాలని శాస్త్రం.


సర్వథా క్రియతాం యత్న స్సీతామధిగమిష్యథ
పక్షలాభో మమాయం వస్సిద్ధిప్రత్యయకారకః."

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు

Wednesday, 9 March 2022

స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదము లు

 స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదము లు

1. అంగన

2. అంచయాన

3. అంబుజాలోచన

4. అంబుజవదన

5. అంబుజాక్షి

6. అంబుజనయన

7. అంబురుహాక్షి

8. అక్క

9. అతివ

10. అన్ను

11. అన్నువ

12. అన్నువు

13. అబల

14. అబ్జనయన

15. అబ్జముఖి

16. అలరుబోడి

17. అలివేణి

18. అవ్వ

19. ఆటది

20. ఆడది

21. ఆడగూతూరు

22. ఆడుబుట్టువు

23. ఇంచుబోడి

24. ఇంతి

25. ఇదీవరాక్షి

26. ఇందునిభాష్య

27. ఇందుముఖి

28. ఇందువదన

29. ఇగురాకుబోణి

30. ఇగురాకుబోడి

31. ఇభయాన

32. ఉగ్మలి

33. ఉజ్జ్వలాంగి

34. ఉవిధ

35. ఎలతీగబోడి

36. ఎలనాగ

37. ఏతుల

38. కంజముఖి

39. కంబుకంఠ

40. కంబుగ్రీవ

41. కనకాంగి

42. కన్నులకలికి

43. కప్పురగంధి

44. కమలాక్షి

45. కరబోరువు

46. కర్పూరగంది

47. కలకంఠి

48. కలశస్తిని

49. కలికి

50. కలువకంటి

51. కళింగ

52. కాంత

53. కించిద్విలగ్న

54. కిన్నెరకంఠి

55. కురంగానయన

56. కురంగాక్షి

57. కువలయాక్షి

58. కూచి

59. కృషమధ్యమ

60. కేశిని

61. కొమ

62. కొమరాలు

63. కొమిరె

64. కొమ్మ

65. కోమ

66. కోమలాంగి

67. కొమలి

68. క్రాలుగంటి

69. గజయాన

70. గరిత

71. గర్త

72. గుబ్బలాడి

73. గుబ్బెత

74. గుమ్మ

75. గోతి

76. గోల

77. చంచరీకచికుర

78. చంచలాక్షి

79. చంద్రముఖి

80. చంద్రవదన

81. చక్కనమ్మ

82. చక్కెరబొమ్మ

83. చక్కెర

84. ముద్దుగుమ్మ

85. చాన

86. చామ

87. చారులోన

88. చిగురుంటాకుబోడి

89. చిగురుబోడి

90. చిలుకలకొలోకి

91. చెలి

92. చెలియ

93. చెలువ

94. చేడి(డియ)

95. చోఱుబుడత

96. జక్కవచంటి

97. జని

98. జలజనేత్ర

99. జోటి

100. ఝషలోచన

101. తనుమధ్య

102. తన్వంగి

103. తన్వి

104. తమ్మికింటి

105. తరళలోచన

106. తరళేక్షణ

107. తరుణి

108. తలిరుబోడి

109. తలోదరి

110. తాటంకావతి

111. తాటంకిని

112. తామరకంటి

113. తామరసనేత్ర

114. తియ్యబోడి

115. తీగ(వ)బోడి

116. తెఱువ

117. తెలిగంటి

118. తొగవకంటి

119. తొయ్యలి

120. తోయజలోచన

121. తోయజాక్షి

122. తోయలి

123. దుండి

124. ధవలాక్షి

125. ననబోడి

126. నళినలోచన

127. నళినాక్షి

128. నవల(లా)

129. నాంచారు

130. నాచారు

131. నాచి

132. నాతి

133. నాతుక

134. నారి

135. నితంబవతి

136. నితంబిని

137. నీరజాక్షి

138. నీలవేణి

139. నెచ్చెలి

140. నెలత

141. నెలతుక

142. పంకజాక్షి

143. పడతి

144. పడతుక

145. పద్మముఖి

146. పద్మాక్షి

147. పర్వందుముఖి

148. పల్లవాధర

149. పల్లవోష్ఠి

150. పాటలగంధి

151. పుచ్చడిక

152. పుత్తడిబొమ్మ

153. పువు(వ్వు)బోడి

154. పువ్వారుబోడి

155. పుష్కరాక్షి

156. పూబోడి

157. పైదలి

158. పొల్తి(లతి)

159. పొల్తు(లతు)క

160. త్రీదర్శిని

161. ప్రమద

162. ప్రియ

163. ప్రోడ

164. ప్రోయాలు

165. బంగారుకోడి

166. బాగరి

167. బాగులాడి

168. బింబాధర

169. బింబోష్ఠి

170. బోటి

171. భగిని

172. భామ

173. భామిని

174. భావిని

175. భీరువు

176. మండయంతి

177. మగువ

178. మచ్చెకంటి

179. మడతి

180. మడతుక

181. మత్తకాశిని

182. మదిరనయన

183. మదిరాక్షి

184. మసలాడి

185. మహిళ

186. మానవతి

187. మానిని

188. మించుగంటి

189. మించుబోడి

190.మీనసేత్రి

191. మీనాక్షి

192. ముగుద

193. ముదిత

194. ముదిర

195. ముద్దరాలు

196. ముద్దియ

197. ముద్దుగుమ్మ

198. ముద్దులగుమ్మ

199. ముద్దులాడి

200. ముష్ఠిమధ్య

201. మృగలోచన

202. మృగాక్షి

203. మృగీవిలోకన

204. మెచ్చులాడి

205. మెఱుగారుబోడి

206. మెఱుగుబోడి(ణి)

207. మెలుత

208. మెళ్త(లత)మెల్లు(లతు)

209. యోష

210. యోషిత

211. యోషిత్తు

212. రమణి

213. రామ

214. రుచిరాంగి

215. రూపరి

216. రూపసి

217. రోచన

218. లతకూన

219.లతాంగి

220. లతాతన్వి

సేకరణ 

Saturday, 5 March 2022

శ్రీ అరుణగిరి ప్రదక్షిణ

 శ్రీ అరుణగిరి ప్రదక్షిణ


అరుణాచల దివ్యక్షేత్రమునకు అత్యుత్తమ నివాళిగా చెప్పబడిన కార్యము "గిరి ప్రదక్షిణము". అరుణగిరి ప్రదక్షిణతో సకల పాపములు నశించి, అంత్యమున శివలోక ప్రాప్తి కలుగును.
దీనిపై ఎన్నో  గుహలు కలవు.
వాటిలో ఎందరో మహాత్ములు నేటికీ తపము చేసికొనుచున్నారు.
ఈ గిరి హిమాలయముల కన్నాప్రాచీనమైనది మరియు కైలాసము కన్నా మహత్తరమైనది. ఎందువలననగా

కైలాసము - శివుని నివాసము
అరుణాచలము - సాక్షాత్తు శివుడు

ఎన్నో యుగములుగా అరుణాచలము ఎందరో ఉపాసకులను తన వైపుకు ఆకర్షించి వారిని
కృతార్థులను చేసినది. ఈ పర్వతము చుట్టూ ఇరువది అయిదు మైళ్ళ వరకు దీని దివ్య తేజస్సు పడును. ఆ ప్రాంతమంతటా ఎటువంటి దీక్షా   నియమములు లేవు.
ఇంతటి సౌలభ్యము గల ఏకైక క్షేత్రము అరుణాచలము.

"యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే"

అని స్కాందపురాణము వర్ణించినది .
అరుణగిరి ప్రదక్షిణ గూర్చియే. జన్మాంతరముల యందు చేసిన పాపములు గూడా గిరి ప్రదక్షిణ వలన నశించును.
స్కాందపురాణము "గిరి ప్రదక్షిణ" వైభవమును ఎంతో ఉన్నతముగా వర్ణన చేసినది.
గిరి ప్రదక్షిణ చేసిన వారికి
1. కోటి అశ్వమేధ యాగములు,
2. కోటి వాజపేయ యాగములు,
3.  సమస్త తీర్థముల యందు స్నానములు చేసిన ఫలితము అనుగ్రహింపబడును.

మొదటి అడుగుతో భూలోకము, రెండవ అడుగుతో అంతరిక్షము, మూడవ అడుగుతో స్వర్గలోకము అనుగ్రహింపబడును.
అంతేగాదు, మొదటి అడుగుతో మానసిక పాపములు, రెండవ అడుగుతో శారీరిక పాపములు, మూడవ అడుగుతో వాచక పాపములు నశించును. ధ్యానము నందు కుదరని ఏకాగ్రత గిరి ప్రదక్షిణ వలన సంభవమగును.

సకల దేవతలు, నవగ్రహములు, బ్రహ్మదేవుడు, శ్రీమహావిష్ణువు గూడా సర్వకాలముల యందు గిరి ప్రదక్షిణ చేస్తూ యుండెదరు. ఉత్తరాయణ పుణ్యకాల సమయమందు (కనుమ పండుగ నాడు) మరియు కార్తీక మాస కృత్తికా దీపోత్సవ మూడవ దినమున సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే, పార్వతీ మాత మరియు తన భూతగణ సహితముగా, గిరి ప్రదక్షిణ చేస్తాడనిన ఈ ప్రదక్షిణ వైభవము వర్ణించుట ఎవరి తరము. దిక్పాలకులు మరియు నవగ్రహములు గిరి ప్రదక్షిణ చేసిన కారణముననే వారు వారివారి స్థానములు పొందిరి. పార్వతీ మాత గూడా గిరి ప్రదక్షిణ చేసిన కారణముననే పరమేశ్వరుని వామార్ధభాగమును పొంది పార్వతీపరమేశ్వరులు "అర్ధనారీశ్వరులు" అయినారు.
1. భానువారము ప్రదక్షిణ చేయువారు సూర్య మండలమును బేధన చేసి శివసన్నిధి పొందెదరు.

2. సోమవార ప్రదక్షిణము అజరామరత్వమును కలిగించును.

3. మంగళవార ప్రదక్షిణము సార్వభౌమత్వమును ఒసగును.
4. బుధవార ప్రదక్షిణము మహాపాండిత్యమును ప్రసాదించును.
5. గురువార ప్రదక్షిణము సర్వులు నమస్కరించెడి లోకగురుత్వమును కటాక్షించును.
6. శుక్రవార ప్రదక్షిణ చేయువారికి సకల సంపదలూ కలిగి, విష్ణుపధమును పొందదరు.
7. శనివార ప్రదక్షిణము వలన సమస్త గ్రహ పీడలూ తొలగిపోవును.
అదృశ్య రూపమున ప్రదక్షిణ చేయు దేవతలు, గిరి ప్రదక్షిణ చేయువారి భక్తిశ్రద్ధలకు సంతసించి అడగకనే వరములు అనుగ్రహించెదరు.

పౌర్ణమి, అమావాస్య మరియు ఇతర పర్వదినముల యందు చేయు గిరి ప్రదక్షిణ విశేష ఫలితములను అనుగ్రహించును.

"చిత్రం వటతరోర్మూలే వృద్ద శిష్యః గురుర్యువాః
గురోస్తూ మౌనం వ్యాఖ్యానం, శిష్యోస్తు ఛిన్న సంశయః"

వట వృక్షము నీడన ఆసీనుడై, చిన్ముద్ర పట్టి, మౌనమే వ్యాఖ్యానముగా యున్న యువకుడైన గురువు, తన వద్దకు చేరిన వృద్ధ శిష్యుల సంశయములు తీర్చుచుండెను.
ఆ స్వరూపమే "శ్రీ గురుదక్షిణామూర్తి".
పరమశివుని జ్ఞానరూపమైనట్టి శ్రీ దక్షిణామూర్తిని వేదములు బహుదా ప్రస్తుతించినవి. అటువంటి దివ్య స్వరూపమైన దక్షిణామూర్తి యే వటవృక్షము నీడన ఆసీనులై యున్నారో, ఆ వృక్షము అరుణాచలము పైనే యున్నది.
ఈ గిరికి ఉత్తర దిక్కుగా యున్న ఉన్నత శిఖరముపై ఈ స్వామి ఆసీనుడై యున్నాడని పురాణవచనము. ఈ స్వామినే "అరుణగిరి యోగి" అని పేర కొలిచెదరు. గిరి ప్రదక్షిణము చేసెడి వారు, వారికి తెలియకుండానే ఈ స్వామికి కూడా ప్రదక్షిణ చేసెదరు. అందువలననే అరుణాచల గిరి ప్రదక్షిణము మహత్తరమైన జ్ఞానమును కూడా అనుగ్రహించును.

అరుణగిరి ప్రదక్షిణమునకు ప్రత్యేక సమయమంటూ లేదు. ఎప్పుడైనా ప్రదక్షిణ చేయ్యవచ్చును. స్నానము చేసి, శుభ్రమైన వస్త్రములు ధరించి, భస్మధారణ గావించి, శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయవలెను. ప్రదక్షిణ చేయు సమయమున త్వరపడి నడవక నిండు గర్భిణి వలె నెమ్మదిగా అడుగులు వేయవలెను. దేవ, ఋషి, సిద్ధ, గంధర్వ, కిన్నెర, కింపురుష, నవగ్రహ, దిక్పాలక గణములన్నియూ ప్రదక్షిణ మార్గము యొక్క కుడి వైపు ప్రదక్షిణ చేయును. కనుక వారి త్రోవకు అడ్డము రాని రీతిలో మార్గాముకు ఎడమ వైపుగా ప్రదక్షిణ చేయవలెను.

అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి  కొన్ని వివరాలు


1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారు అక్కడికి చేరుకోవడంతో నే గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది '
రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రదర్శన పూర్తి అవుతుంది అని భావించకండి .
మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన కచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి అయినా ఉంటుంది .
అక్కడ స్వామికి నమస్కరించి మొదలుపెట్టవచ్చు '

2. గిరిప్రదక్షిణ అనేది కచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి " కుడివైపున కరుణగిరి కి దగ్గరలో ఉండే కుడి మార్గం లో  సూక్ష్మరూపంలో యోగులు ' సిద్ధులు ' దేవతలు ప్రదక్షిణలు చేస్తారట . అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు .

3. ఆరుణాచలం వెళ్లే ప్రతి వారు కచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి .
ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్ లు ఖచ్చితంగా ఇస్తారు .

4 . దర్శనానికి గిరిప్రదక్షిణ కి వెళ్లేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి . ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు .

5. ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెబుతారు .

6. నైఋతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు కచ్చితంగా  అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది '
ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు .

7. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని ' మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు " భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు . ఖాళీ కడుపుతో చేసే గిరిప్రదక్షణ వేగవంతంగా ఉంటుంది .

8. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరిప్రదక్షణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది .

9. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది '
మాక్సిమం కూర్చోకుండా నిలబడి గానీ ' తప్పనిసరి పరిస్థితుల్లో  బెంచీపై పడుకోండి " కూర్చోవడం అన్న చాలా ఇబ్బందులు ఉంటాయి .

10 . కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని  దర్శనానికి వెళ్లే వారు ' అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి . అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు .
లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు.

11. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత
ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది .
కచ్చితంగా దర్శనం చేసుకోండి .

12. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దపెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం ఉంటుంది '
ఆ మండపంపై కి వెళ్లి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది .
రమణ మహర్షి వారు  అక్కడే తపస్సు చేసారు .

13.రాజ గోపురానికి కుడివైపున అనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది . అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం .

14 ' ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం ' అది ఇది మహా భక్తురాలైన అమ్మాణి అమ్మన్‌ అని ఆవిడ కట్టించిన గోపురం .

15. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది .తప్పకుండా దర్శనం చేసుకోండి .

16 ' అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది దాని క్రింద రాతితో చెక్కిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది .
అద్భుతః

17. అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు .

18 ' అగ్ని లింగానికి ' రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది . చాలా పెద్ద విగ్రహం ' అత్యంత శక్తివంతమైన విగ్రహం '
అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు .
ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి . రూపాయలకు శెనగల దండ అమ్ముతారు . మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శెనగల దండలను స్వామివారికి సమర్పించండి . అది స్వామి వారి మీద వేస్తారు .

19. శివసన్నిధి రోడ్ లో కొంచెం ముందుకు వెళ్లి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది '
చాలా చాలా బాగుంటుంది . ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది .
రమణ మహర్షి వారి ఆశ్రమంలో కి వలె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి .
ఇక్కడ
ఉదయం టిఫిన్ ' మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు .
విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్ లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు .
ఒకసారి అక్కడి ప్రసాదం స్వీకరించండి

20 . ఈ రామ్ సూరత్ బాబా ఆశ్రమం లోనే అవధూత శ్రీ తోప్పి అమ్మాల్ వారు వుంటారు.
దర్శనం చేసుకొని తరించండి

ఓం అరుణాచలేశ్వరాయ నమః

సేకరణ : 

Sunday, 6 February 2022

విష్ణుమూర్తికి "24" పేర్లున్నాయి

 

విష్ణుమూర్తికి "24" పేర్లున్నాయి.

వాటిని కేశవనామాలంటారు..


ఇవి "24" మాత్రమే ఎందుకు ఉన్నాయి?వీటికి కాలచక్రానికి,గణితానికి ఏమైనా సంబంధం వున్నదా?


ఈ "24" కు గణిత పరమైన భూమిక ఏమిటి*?


విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం.అంటే నాలుగు చేతులు గలవాడని కదా?

ఈ నాలుగు చేతుల్లో శంఖం,చక్రం, గద,పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు.


నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి. 

ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు.


*1.కేశవ నామాలలో మొదటి నామం కేశవ.*


కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో 

*పద్మము, శంఖము*

ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో 

*గద,చక్రం* 

ధరించి ఉంటాడు.


 *2.విష్ణువు యొక్క మరొక నామము మాధవ.*


ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో

*గద,చక్రం* ధరించి,ఎడమవైపు ఉన్న రెండు చేతులతో

*పద్మము,శంఖము* ధరించి ఉంటాడు.


*3.మధుసూధన రూపంలో* 


కుడివైపు చేతులతో *చక్రం, శంఖము* 

మరియు ఎడమవైపు చేతులతో

*గద,పద్మము* ధరించి ఉంటాడు.


*ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు*(పక్షానికొకసారి) 


*పౌర్ణమికి, అమావాస్య కు* తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.


*ఈ మార్పులు లేదా అమరికలను* మనం గణిత శాస్త్ర పరిభాషలో *ప్రస్తారాలు(permutations)* 

అంటాం.

అనగా 4 వస్తువులను 4! 

(4 factorial) విధాలుగా అమర్చవచ్చు.


 4! = 4×3×2×1=24


*శంఖాన్ని* 'శ' తోను,

*చక్రాన్ని* 'చ' తోను,

*గదను* 'గ' తోను,

*పద్మాన్ని* ' ప'తోను సూచిస్తే,


*ఆ 24 అమరికలు* క్రింది విధంగా వుంటాయి.


*1) శచగప 2) శచపగ*

*3) శపచగ 4) శపగచ*

*5)శగచప 6)శగపచ*

*7)చపగశ 8)చపశగ*

*9)చగపశ 10)చగశప*

*11)చశగప 12)చశపగ*

*13)గపశచ 14)గపచశ*

*15)గచశప 16)గచపశ*

*17)గశపచ 18)గశచప*

*19)పచగశ 20)పతశగ*

*21)పశగచ 22)పశచగ*

*23)పగశచ 24)పగచశ.*


[పైవన్నీ *ఒక క్రమంలో* ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.]


ఈ 24 నామాలు పెద్దలందరికీ తెలిసినా‌...


మరోసారి క్రింద ఉదహరిస్తున్నాను.

      

*కేశవ,నారాయణ*

*మాధవ,గోవింద*

*విష్ణు,మధుసూధన*

*త్రివిక్రమ,వామన*

*శ్రీధర,హృషీకేశ*

*పద్మనాభ,దామోదర*

*సంకర్షణ,వాసుదేవ*

*అనిరుధ్ధ,ప్రద్యుమ్న,*

*పురుషోత్తమ,అధోక్షజ*

*నారసింహ,అచ్యుత*

*జనార్ధన,ఉపేంద్ర*

*హరి శ్రీకృష్ణ.*


సేకరణ


ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి 

*24 పక్షాలు* అంటే

*12 నెలలు*

అనగా *ఒక సంవత్సరం* పడుతుంది....