Wednesday, 27 May 2020

శ్రీ మహాలక్ష్మీ


శ్రీ మహాలక్ష్మీ

హరికిం బట్టపుదేవి,
పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క,
చందురు తోబుట్టువు,
భారతీ గిరిసుతల్‌తో నాడు పూబోడి,
తామరలందుండెడి ముద్దరాలు,
జగముల్ మన్నించు నిల్లాలు,
భాసురతన్ లేములు వాపు తల్లి,
సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్

లక్ష్మి లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత.
త్రిమూర్తిలలో ఒకరైన విష్ణువు నకు ఇల్లాలు. క్షీర సాగర మధనం సమయంలో అవతరించింది.

సంస్కృతంలో "లక్ష్మి" అన్న పదానికి మూల ధాతువులు - లక్ష్ - పరిశీలించుట, గురి చూచుట .
ఇదే ధాతువును "లక్ష్యం" అనే పదంలో కూడా చూస్తాము. వేదాలలో లక్ష్యాయిధి లక్ష్మిః - అనగా జనులను ఉద్ధరించే లక్ష్యం కలిగినది - అని అన్నారు.

మహాలక్ష్మిని శ్రీ అని కూడా అంటారు. తమిళంలో తిరుమగళ్ అంటారు. ఆమె ఆరుసుగుణములు పరిపూర్ణముగా కలిగినది. నారాయణుని శక్తికి ఆమెయే కారణము. ఆమె విష్ణువునకు ఇల్లాలు.
సీతగా రాముని పెండ్లాడినది. రాధ, రుక్మిణి మరియు శ్రీకృష్ణుని భార్యలందరును లక్ష్మీదేవి అంశలే.

భోజన నియమాలు

భోజన నియమాలు

1. భోజనానికి ముందు,తరువాత తప్పక
కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.
తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.)
తినే పళ్ళానికి తాకించరాదు.
అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి.
ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు.
చాలా దోషం.

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.

7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.
ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.

10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.

11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.

12. ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు
ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.

13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు.
(ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)

14. మాడిన అన్నాన్ని నివేదించరాదు.
అతిథులకు పెట్టరాదు.

15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు.
(వెంట్రుకలు కత్తిరించడం)

16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే
మనం తినగా మిగిలినవి పెట్టరాదు.
మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.

17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు.

18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.

19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.

20. భగవన్నామము తలుచుకుంటూ లేదా
భగవత్ కథలు వింటూ వంట వండడం,
భోజనం చేయడం చాలా ఉత్తమం.

21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని
ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు)

22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.

23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు .
ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.

26. అరటిఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు
(తిన్న విస్తరిని మడవడం అనాచారం).
తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.

27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం.
(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)

28. భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి.
అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి.
నోరు నీటితో పుక్కిలించుకోవాలి.

29. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)

30. స్నానం చేసి మాత్రమే వంట వండాలని
కఠోర నియమము.
పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం. అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,
పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.
అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.

31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు.
ద్విపాక దోషం వస్తుంది.

32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.

సేకరణ ...

Saturday, 23 May 2020

శ్రీకృష్ణతాండవ స్తోత్రమ్ |

భజే వ్రజైకనందనం సమస్తపాపఖండనం
స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనమ్ |
సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం
అనంగరంగసారగం నమామి సాగరం భజే || ౧ || 
మనోజగర్వమోచనం విశాంఫాలలోచనం
విఘాతగోపశోభనం నమామి పద్మలోచనమ్ |
కరారవిందభూధరం స్మితావలోకసుందరం
మహేంద్రమానదారణం నమామి కృష్ణ వారణమ్ || ౨ || 
కదంబసూనకుండలం సుచారుమండగండలం
వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభమ్ |
యశోదయా సమోదయా సకోపయా దయానిధిం
హ్యులూఖలే సుదుస్సహం నమామి నందనందనమ్ || ౩ || 
నవీనగోపసాగరం నవీనకేళిమందిరం
నవీన మేఘసుందరం భజే వ్రజైకమందిరమ్ |
సదైవ పాదపంకజం మదీయ మానసే నిజం
దరాతినందబాలక-స్సమస్తభక్తపాలక || ౪ || 
సమస్త గోపసాగరీహ్రదం వ్రజైకమోహనం
నమామి కుంజమధ్యగం ప్రసూనబాలశోభనమ్ |
దృగంతకాంతలింగణం సహాస బాలసంగినం
దినే దినే నవం నవం నమామి నందసంభవమ్ || ౫ || 
గుణాకరం సుఖాకరం కృపాకరం కృపానవం
సదా సుఖైకదాయకం నమామి గోపనాయకమ్ |
సమస్త దోషశోషణం సమస్త లోకతోషణం
సమస్త దాసమానసం నమామి కృష్ణబాలకమ్ || ౬ || 
సమస్త గోపనాగరీ నికామకామదాయకం
దృగంతచారుసాయకం నమామి వేణునాయకమ్ |
భవో భవావతారకం భవాబ్ధికర్ణధారకం
యశోమతే కిశోరకం నమామి దుగ్ధచోరకమ్ || ౭ || 
విముగ్ధముగ్ధగోపికా మనోజదాయకం హరిం
నమామి జంబుకాననే ప్రవృద్ధవహ్ని పాయనమ్ |
యథా తథా యథా తథా తథైవకృష్ణసర్వదా
మయా సదైవగీయతాం తథా కృపా విధీయతామ్ || ౮ || 
ఇతి శ్రీకృష్ణతాండవ స్తోత్రమ్ |

అచ్యుతాష్టకం 2

అచ్యుతాచ్యుత హరే పరమాత్మన్
రామ కృష్ణ పురుషోత్తమ విష్ణో |
వాసుదేవ భగవన్ననిరుద్ధ
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౧ || 
విశ్వమంగళ విభో జగదీశ
నందనందన నృసింహ నరేంద్ర |
ముక్తిదాయక ముకుంద మురారే
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౨ || 
రామచంద్ర రఘునాయక దేవ
దీననాథ దురితక్షయకారిన్ |
యాదవేంద్ర యదుభూషణ యజ్ఞ-
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౩ || 
దేవకీతనయ దుఃఖదవాగ్నే
రాధికారమణ రమ్యసుమూర్తే |
దుఃఖమోచన దయార్ణవ నాథ
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౪ || 
గోపికావదనచంద్రచకోర
నిత్య నిర్గుణ నిరంజన జిష్ణో |
పూర్ణరూప జయ శంకర శర్వ
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౫ || 
గోకులేశ గిరిధారణ ధీర
యామునాచ్ఛతటఖేలనవీర |
నారదాదిమునివందితపాద
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౬ || 
ద్వారకాధిప దురంతగుణాబ్ధే
ప్రాణనాథ పరిపూర్ణ భవారే |
జ్ఞానగమ్య గుణసాగర బ్రహ్మన్
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౭ || 
దుష్టనిర్దళన దేవ దయాళో
పద్మనాభ ధరణీధర ధన్విన్ |
రావణాంతక రమేశ మురారే
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౮ || 
అచ్యుతాష్టకమిదం రమణీయం
నిర్మితం భవభయం వినిహంతుమ్ |
యః పఠేద్విషయవృత్తినివృత్తిం
జన్మదుఃఖమఖిలం స జహాతి || ౯ || 
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం అచ్యుతాష్టకం |

అచ్యుతాష్టకం 1

అచ్యుతం కేశవం రామ నారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || ౧ ||
అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికాఽరాధితమ్ |
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || ౨ ||
విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీరాగిణే జానకీజానయే |
వల్లవీవల్లభాయాఽర్చితాయాత్మనే
కంసవిధ్వంసినే వంశినే తే నమః || ౩ ||
కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక || ౪ ||
రాక్షసక్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూపుణ్యతాకారణమ్ |
లక్ష్మణేనాన్వితో వానరైస్సేవితో-
ఽగస్త్యసంపూజితో రాఘవః పాతు మామ్ || ౫ ||
ధేనుకారిష్టహానిష్టకృద్ద్వేషిణాం
కేశిహా కంసహృద్వంశికావాదకః |
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మామ్ సర్వదా || ౬ ||
విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం
ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ |
వన్యయా మాలయా శోభితోరఃస్థలం
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే || ౭ ||
కుంచితైః కుంతలైర్భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్కుండలం గండయోః |
హారకేయూరకం కంకణప్రోజ్జ్వలం
కింకిణీమంజులం శ్యామలం తం భజే || ౮ ||
అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |
వృత్తతస్సుందరం వేద్య విశ్వంభరం
తస్య వశ్యో హరిర్జాయతే సత్వరమ్ || ౯ ||

Wednesday, 20 May 2020

భస్మం/విభూది

భస్మం/విభూది

కైలాసం నుండి శంకరుడు బ్రాహ్మణుని వేషములో ఒకనాడు రాముడి వద్దకు వెళ్లేను రాముడు మీ యొక్క నామమును నివాసమును తెలుపుమని అడుగగా
" నా పేరు శంభుడు నేను కైలాసం నా యొక్క నివాసము అని రాముడికి చెప్పగా గ్రహించి అతనిని శంకరునిగా గ్రహించి రాముడు వీభూతి యొక్క మహిమ ను తెలుపవలసినిదని అని అడుగగా శివుడు చెప్పసాగెను .
" రామ భస్మమహత్యమును చెప్పుటకు బ్రహాదులకు కూడా శక్యము కాదు బట్టమీది చారలను అగ్ని కాల్చినట్లు మన నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతలను కూడా తుడిచివేయగలిగే శక్తి భస్మంనకు ఉన్నది విభూతిని మూడు రేఖలుగా పెట్టుకున్నచో త్రిమూర్తులను మన దేహముమీద ధరించినట్లగును ,
ముఖమున భస్మమును ధరించిన నోటి పాపములను (తిట్టుట చెడు మాటలు పలుకుట ,
అభక్ష్యములను తినకూడని పధార్థములను తినడం అనుపాపములు)
చేతులపై ధరించిన
చేతిపాపములను ( కొట్టటం మొ") హ్రదయముపై ధరించిన మనఃపాతకములను (దురాలోచనాలు మొదలైనవి)
పాపములను భర్త్సనము చేసి (బెదిరించి) పోగొట్టునది కావున భస్మము అని పేరు దీనికి కలిగెను భస్మము మీద పడుకొన్నను తిన్నను
ఒంటికి పూసుకున్నను పాపములన్ని భస్మీభూతములు అగును
ఆయువు పెరుగును గర్భిణి స్త్రీలకు
సుఖ ప్రసవం కలిగించును
సర్ప వృశ్చికాదీ దోషములను హరించును భూత పిశాదులను పారద్రోలును
ఆవుపేడ పిడుకలను శతారుద్రీయ(నమకము)మంత్రముచేప్పుచు కాల్చి భస్మము చేయవలెను మంత్రములు రాకున్నచో ప్రణవము ఉచ్చరించుచు ధరింపవలెను.
ఓం మంత్రము రానీ వారు
ఓం నమశ్శివాయ మంత్రముచే భస్మమును ధరించుట శ్రేష్టం అని ''పద్మ పురాణము లో చెప్పబడినది.

Sunday, 17 May 2020

దేవతల ప్రీత్యర్ధం సమర్పించవలసిన నైవేద్యాలు


దేవతల ప్రీత్యర్ధం సమర్పించవలసిన నైవేద్యాలు

శ్రీ వేంకటేశ్వరస్వామి:

శ్రీ వేంకటేశ్వరస్వామికి వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టవలెను. తులసిమాల మెడలో ధరింపవలెను.

వినాయకుడు:

వినాయకునకు బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజింపవలెను.

ఆంజనేయస్వామి:

ఆంజనేయస్వామికి అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజింపవలెను.

సూర్యుడు:

సూర్యుడుకు మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం.

లక్ష్మీదేవి:

లక్ష్మీదేవికి క్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజింపవలెను.

లలితాదేవి:

లలితాదేవికి క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.

సత్యన్నారాయణస్వామి:

సత్యన్నారాయణస్వామికి ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం.

దుర్గాదేవి:

దుర్గాదేవికి మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం.

సంతోషీమాత:

సంతోషీమాతకు పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.

శ్రీ షిర్డీ సాయిబాబా:

శ్రీ షిర్డీ సాయిబాబాకు పాలు, గోధుమరొట్టెలు నైవేద్యం

శ్రీకృష్ణుడు:

శ్రీకృష్ణునకు అటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసి దళములతో పూజించవలెను.

శివుడు:

శివునకు కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.

కొత్తిమీర పచ్చడి


కొత్తిమీర పచ్చడి

కావలిసిన పదార్ధాలు
1. ఆవాలు 2 స్పూన్స్
2.మెంతులు 2 స్పూన్స్
3.ఎండు మిరపకాయలు 10
4. ఇంగువ కొంచెం
5. చింత పండు నిమ్మ కాయ అంత
6. బెల్లం చిన్న ముక్క
7.ఉప్పు తగినంత

తయారీ విధానం
ముందుగా మూకుడు తీసుకుని అందులో
2 స్పూన్స్ నూని వేసి దానిలో
2 చెంచాలు ఆవాలు
2 చెంచా మెంతులు
10 ఎండు మిరపకాయలు
కొంచం ఇంగువ వేసి వెయించాలి.
తరువాత
నిమ్మకాయ అంత చింతపండు వేరే గిన్నె లో నీళ్లు పోసి నానపెట్టి మెత్తని గుజ్జుగా చేసుకొవాలి .
దానిలో కొంచెం బెల్లం ,
తగినంత ఉప్పు పసుపు వేసి
చివర గా కొత్తిమీర పచ్చిది వేసి
గ్రైండర్ లో మెత్తగా చెయ్యాలి .
కొంచము నీళ్ళు మరగిన్చి ఉంచుకొని మెత్తగా రావాలంటే ఈ నీళ్లు కాసిని పొయాలి.
అంతే కొత్తిమీర పచ్చడి రెడీ...

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు

హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1. విద్యా ప్రాప్తికి:-
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

2. ఉద్యోగ ప్రాప్తికి :-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

3. కార్య సాధనకు :-
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

4. గ్రహదోష నివారణకు :-
మర్కటేశ మహోత్సాహా సర్వ గ్రహదోష నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

5. ఆరోగ్యమునకు :-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

6. సంతాన ప్రాప్తికి :-
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

7. వ్యాపారాభివృద్ధికి :-
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

8. వివాహ ప్రాప్తికి :-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

Saturday, 16 May 2020

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే
శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే
సకల దేవతలని పూజించిన ఫలితం వస్తుందని పరాశర సంహిత'లో ఉంది.

నవగ్రహాల అనుగ్రహం త్వరగా పొందాలంటే వాల్మీకి రామాయణం లోని ఈ 9 శ్లోకాలు నిత్యం పారాయణ చేయడం మంచిది.

నవగ్రహాలు అత్యంత కరుణా స్వరూపులు. మనం పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపాల బట్టి ఫలితాలని ఇస్తారు.

కానీ భక్తితో వారిని ఇటువంటి స్తోత్రాలతో స్తుతిస్తే శుభఫలితాల్ని అనుగ్రహిస్తారు.

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం, సత్సంతానము మరియు వృద్దులకు ఆరోగ్యం కలుగుతుంది.

నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభఫలితాలని పొందవచ్చు.

వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము.సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.

రత్నములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామి వారికి సమర్పించబడినది. ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది.

ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది.

శ్లోకము తత్సంబంధిత గ్రహము, రత్నముల వివరములు స్తోత్రంలో తెలుపబడినవి. నవగ్రహములకు ఆయా శ్లోకములతో జపముచేసి ఫలితం పొందవచ్చునని చెప్పబడినది.

మాణిక్యం (సూర్యుడు)..
తతో రావణనీతాయా: సీతాయాశ్శత్రుకర్శన: |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||

అర్థము : అనంతరము అరివవీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతజాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను.

ముత్యం (చంద్రుడు).
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృ తిర్ధాక్ష్యం స కర్మసు న సీదతి ||

అర్థము : నీవలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వముగలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు.

పగడం (కుజుడు).
అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం |
అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక: ||

అర్థము : దిగులుపడకుండా ఉత్సాహముతో నుండుటవలన కార్యసిద్ధియు, పరమ సుఖము కలుగును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి యుండటయే శ్రేయస్కరము.

మరకతం (బుధుడు).
నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చతస్యై జనకాత్మజాయై |
నమోస్తు రుద్రేంద్రయమనిలేభ్య:
నమోస్తు చంద్రార్కమరుద్గణభ్య: ||

అర్థము : శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు.

హీరకం (శుక్రుడు)
రామ: కమలపత్రాక్ష: సర్వసత్త్వమనోహర: |
రూపదాక్షిణ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే ||

అర్థము : ఓ జానకీ! శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులుగలవాడు. తన నిరుపమానకాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహసౌందర్యము, గుణసంపదయు గలవాడు.

ఇంద్రనీలం (శని)..
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ: ||

అర్థము : మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. అసహాయ శూరుడు, కోసలదేశప్రభువు ఐన శ్రీరామునకు నేను దాసుడను.

గోమేదికం (రాహువు)..
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తప: |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమత: ||

అర్థము : నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచిరించియున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా! హనుమంతుని చల్లగా చూడుము.

వైడూర్యం (కేతువు)..
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||

అర్థము : శత్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతోగూడి అయోధ్య యందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలో చూడగలవు.

ఇతి శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం సంపూర్ణం.