Wednesday, 9 March 2022

స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదము లు

 స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదము లు

1. అంగన

2. అంచయాన

3. అంబుజాలోచన

4. అంబుజవదన

5. అంబుజాక్షి

6. అంబుజనయన

7. అంబురుహాక్షి

8. అక్క

9. అతివ

10. అన్ను

11. అన్నువ

12. అన్నువు

13. అబల

14. అబ్జనయన

15. అబ్జముఖి

16. అలరుబోడి

17. అలివేణి

18. అవ్వ

19. ఆటది

20. ఆడది

21. ఆడగూతూరు

22. ఆడుబుట్టువు

23. ఇంచుబోడి

24. ఇంతి

25. ఇదీవరాక్షి

26. ఇందునిభాష్య

27. ఇందుముఖి

28. ఇందువదన

29. ఇగురాకుబోణి

30. ఇగురాకుబోడి

31. ఇభయాన

32. ఉగ్మలి

33. ఉజ్జ్వలాంగి

34. ఉవిధ

35. ఎలతీగబోడి

36. ఎలనాగ

37. ఏతుల

38. కంజముఖి

39. కంబుకంఠ

40. కంబుగ్రీవ

41. కనకాంగి

42. కన్నులకలికి

43. కప్పురగంధి

44. కమలాక్షి

45. కరబోరువు

46. కర్పూరగంది

47. కలకంఠి

48. కలశస్తిని

49. కలికి

50. కలువకంటి

51. కళింగ

52. కాంత

53. కించిద్విలగ్న

54. కిన్నెరకంఠి

55. కురంగానయన

56. కురంగాక్షి

57. కువలయాక్షి

58. కూచి

59. కృషమధ్యమ

60. కేశిని

61. కొమ

62. కొమరాలు

63. కొమిరె

64. కొమ్మ

65. కోమ

66. కోమలాంగి

67. కొమలి

68. క్రాలుగంటి

69. గజయాన

70. గరిత

71. గర్త

72. గుబ్బలాడి

73. గుబ్బెత

74. గుమ్మ

75. గోతి

76. గోల

77. చంచరీకచికుర

78. చంచలాక్షి

79. చంద్రముఖి

80. చంద్రవదన

81. చక్కనమ్మ

82. చక్కెరబొమ్మ

83. చక్కెర

84. ముద్దుగుమ్మ

85. చాన

86. చామ

87. చారులోన

88. చిగురుంటాకుబోడి

89. చిగురుబోడి

90. చిలుకలకొలోకి

91. చెలి

92. చెలియ

93. చెలువ

94. చేడి(డియ)

95. చోఱుబుడత

96. జక్కవచంటి

97. జని

98. జలజనేత్ర

99. జోటి

100. ఝషలోచన

101. తనుమధ్య

102. తన్వంగి

103. తన్వి

104. తమ్మికింటి

105. తరళలోచన

106. తరళేక్షణ

107. తరుణి

108. తలిరుబోడి

109. తలోదరి

110. తాటంకావతి

111. తాటంకిని

112. తామరకంటి

113. తామరసనేత్ర

114. తియ్యబోడి

115. తీగ(వ)బోడి

116. తెఱువ

117. తెలిగంటి

118. తొగవకంటి

119. తొయ్యలి

120. తోయజలోచన

121. తోయజాక్షి

122. తోయలి

123. దుండి

124. ధవలాక్షి

125. ననబోడి

126. నళినలోచన

127. నళినాక్షి

128. నవల(లా)

129. నాంచారు

130. నాచారు

131. నాచి

132. నాతి

133. నాతుక

134. నారి

135. నితంబవతి

136. నితంబిని

137. నీరజాక్షి

138. నీలవేణి

139. నెచ్చెలి

140. నెలత

141. నెలతుక

142. పంకజాక్షి

143. పడతి

144. పడతుక

145. పద్మముఖి

146. పద్మాక్షి

147. పర్వందుముఖి

148. పల్లవాధర

149. పల్లవోష్ఠి

150. పాటలగంధి

151. పుచ్చడిక

152. పుత్తడిబొమ్మ

153. పువు(వ్వు)బోడి

154. పువ్వారుబోడి

155. పుష్కరాక్షి

156. పూబోడి

157. పైదలి

158. పొల్తి(లతి)

159. పొల్తు(లతు)క

160. త్రీదర్శిని

161. ప్రమద

162. ప్రియ

163. ప్రోడ

164. ప్రోయాలు

165. బంగారుకోడి

166. బాగరి

167. బాగులాడి

168. బింబాధర

169. బింబోష్ఠి

170. బోటి

171. భగిని

172. భామ

173. భామిని

174. భావిని

175. భీరువు

176. మండయంతి

177. మగువ

178. మచ్చెకంటి

179. మడతి

180. మడతుక

181. మత్తకాశిని

182. మదిరనయన

183. మదిరాక్షి

184. మసలాడి

185. మహిళ

186. మానవతి

187. మానిని

188. మించుగంటి

189. మించుబోడి

190.మీనసేత్రి

191. మీనాక్షి

192. ముగుద

193. ముదిత

194. ముదిర

195. ముద్దరాలు

196. ముద్దియ

197. ముద్దుగుమ్మ

198. ముద్దులగుమ్మ

199. ముద్దులాడి

200. ముష్ఠిమధ్య

201. మృగలోచన

202. మృగాక్షి

203. మృగీవిలోకన

204. మెచ్చులాడి

205. మెఱుగారుబోడి

206. మెఱుగుబోడి(ణి)

207. మెలుత

208. మెళ్త(లత)మెల్లు(లతు)

209. యోష

210. యోషిత

211. యోషిత్తు

212. రమణి

213. రామ

214. రుచిరాంగి

215. రూపరి

216. రూపసి

217. రోచన

218. లతకూన

219.లతాంగి

220. లతాతన్వి

సేకరణ 

Saturday, 5 March 2022

శ్రీ అరుణగిరి ప్రదక్షిణ

 శ్రీ అరుణగిరి ప్రదక్షిణ


అరుణాచల దివ్యక్షేత్రమునకు అత్యుత్తమ నివాళిగా చెప్పబడిన కార్యము "గిరి ప్రదక్షిణము". అరుణగిరి ప్రదక్షిణతో సకల పాపములు నశించి, అంత్యమున శివలోక ప్రాప్తి కలుగును.
దీనిపై ఎన్నో  గుహలు కలవు.
వాటిలో ఎందరో మహాత్ములు నేటికీ తపము చేసికొనుచున్నారు.
ఈ గిరి హిమాలయముల కన్నాప్రాచీనమైనది మరియు కైలాసము కన్నా మహత్తరమైనది. ఎందువలననగా

కైలాసము - శివుని నివాసము
అరుణాచలము - సాక్షాత్తు శివుడు

ఎన్నో యుగములుగా అరుణాచలము ఎందరో ఉపాసకులను తన వైపుకు ఆకర్షించి వారిని
కృతార్థులను చేసినది. ఈ పర్వతము చుట్టూ ఇరువది అయిదు మైళ్ళ వరకు దీని దివ్య తేజస్సు పడును. ఆ ప్రాంతమంతటా ఎటువంటి దీక్షా   నియమములు లేవు.
ఇంతటి సౌలభ్యము గల ఏకైక క్షేత్రము అరుణాచలము.

"యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే"

అని స్కాందపురాణము వర్ణించినది .
అరుణగిరి ప్రదక్షిణ గూర్చియే. జన్మాంతరముల యందు చేసిన పాపములు గూడా గిరి ప్రదక్షిణ వలన నశించును.
స్కాందపురాణము "గిరి ప్రదక్షిణ" వైభవమును ఎంతో ఉన్నతముగా వర్ణన చేసినది.
గిరి ప్రదక్షిణ చేసిన వారికి
1. కోటి అశ్వమేధ యాగములు,
2. కోటి వాజపేయ యాగములు,
3.  సమస్త తీర్థముల యందు స్నానములు చేసిన ఫలితము అనుగ్రహింపబడును.

మొదటి అడుగుతో భూలోకము, రెండవ అడుగుతో అంతరిక్షము, మూడవ అడుగుతో స్వర్గలోకము అనుగ్రహింపబడును.
అంతేగాదు, మొదటి అడుగుతో మానసిక పాపములు, రెండవ అడుగుతో శారీరిక పాపములు, మూడవ అడుగుతో వాచక పాపములు నశించును. ధ్యానము నందు కుదరని ఏకాగ్రత గిరి ప్రదక్షిణ వలన సంభవమగును.

సకల దేవతలు, నవగ్రహములు, బ్రహ్మదేవుడు, శ్రీమహావిష్ణువు గూడా సర్వకాలముల యందు గిరి ప్రదక్షిణ చేస్తూ యుండెదరు. ఉత్తరాయణ పుణ్యకాల సమయమందు (కనుమ పండుగ నాడు) మరియు కార్తీక మాస కృత్తికా దీపోత్సవ మూడవ దినమున సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే, పార్వతీ మాత మరియు తన భూతగణ సహితముగా, గిరి ప్రదక్షిణ చేస్తాడనిన ఈ ప్రదక్షిణ వైభవము వర్ణించుట ఎవరి తరము. దిక్పాలకులు మరియు నవగ్రహములు గిరి ప్రదక్షిణ చేసిన కారణముననే వారు వారివారి స్థానములు పొందిరి. పార్వతీ మాత గూడా గిరి ప్రదక్షిణ చేసిన కారణముననే పరమేశ్వరుని వామార్ధభాగమును పొంది పార్వతీపరమేశ్వరులు "అర్ధనారీశ్వరులు" అయినారు.
1. భానువారము ప్రదక్షిణ చేయువారు సూర్య మండలమును బేధన చేసి శివసన్నిధి పొందెదరు.

2. సోమవార ప్రదక్షిణము అజరామరత్వమును కలిగించును.

3. మంగళవార ప్రదక్షిణము సార్వభౌమత్వమును ఒసగును.
4. బుధవార ప్రదక్షిణము మహాపాండిత్యమును ప్రసాదించును.
5. గురువార ప్రదక్షిణము సర్వులు నమస్కరించెడి లోకగురుత్వమును కటాక్షించును.
6. శుక్రవార ప్రదక్షిణ చేయువారికి సకల సంపదలూ కలిగి, విష్ణుపధమును పొందదరు.
7. శనివార ప్రదక్షిణము వలన సమస్త గ్రహ పీడలూ తొలగిపోవును.
అదృశ్య రూపమున ప్రదక్షిణ చేయు దేవతలు, గిరి ప్రదక్షిణ చేయువారి భక్తిశ్రద్ధలకు సంతసించి అడగకనే వరములు అనుగ్రహించెదరు.

పౌర్ణమి, అమావాస్య మరియు ఇతర పర్వదినముల యందు చేయు గిరి ప్రదక్షిణ విశేష ఫలితములను అనుగ్రహించును.

"చిత్రం వటతరోర్మూలే వృద్ద శిష్యః గురుర్యువాః
గురోస్తూ మౌనం వ్యాఖ్యానం, శిష్యోస్తు ఛిన్న సంశయః"

వట వృక్షము నీడన ఆసీనుడై, చిన్ముద్ర పట్టి, మౌనమే వ్యాఖ్యానముగా యున్న యువకుడైన గురువు, తన వద్దకు చేరిన వృద్ధ శిష్యుల సంశయములు తీర్చుచుండెను.
ఆ స్వరూపమే "శ్రీ గురుదక్షిణామూర్తి".
పరమశివుని జ్ఞానరూపమైనట్టి శ్రీ దక్షిణామూర్తిని వేదములు బహుదా ప్రస్తుతించినవి. అటువంటి దివ్య స్వరూపమైన దక్షిణామూర్తి యే వటవృక్షము నీడన ఆసీనులై యున్నారో, ఆ వృక్షము అరుణాచలము పైనే యున్నది.
ఈ గిరికి ఉత్తర దిక్కుగా యున్న ఉన్నత శిఖరముపై ఈ స్వామి ఆసీనుడై యున్నాడని పురాణవచనము. ఈ స్వామినే "అరుణగిరి యోగి" అని పేర కొలిచెదరు. గిరి ప్రదక్షిణము చేసెడి వారు, వారికి తెలియకుండానే ఈ స్వామికి కూడా ప్రదక్షిణ చేసెదరు. అందువలననే అరుణాచల గిరి ప్రదక్షిణము మహత్తరమైన జ్ఞానమును కూడా అనుగ్రహించును.

అరుణగిరి ప్రదక్షిణమునకు ప్రత్యేక సమయమంటూ లేదు. ఎప్పుడైనా ప్రదక్షిణ చేయ్యవచ్చును. స్నానము చేసి, శుభ్రమైన వస్త్రములు ధరించి, భస్మధారణ గావించి, శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయవలెను. ప్రదక్షిణ చేయు సమయమున త్వరపడి నడవక నిండు గర్భిణి వలె నెమ్మదిగా అడుగులు వేయవలెను. దేవ, ఋషి, సిద్ధ, గంధర్వ, కిన్నెర, కింపురుష, నవగ్రహ, దిక్పాలక గణములన్నియూ ప్రదక్షిణ మార్గము యొక్క కుడి వైపు ప్రదక్షిణ చేయును. కనుక వారి త్రోవకు అడ్డము రాని రీతిలో మార్గాముకు ఎడమ వైపుగా ప్రదక్షిణ చేయవలెను.

అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి  కొన్ని వివరాలు


1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారు అక్కడికి చేరుకోవడంతో నే గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది '
రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రదర్శన పూర్తి అవుతుంది అని భావించకండి .
మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన కచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి అయినా ఉంటుంది .
అక్కడ స్వామికి నమస్కరించి మొదలుపెట్టవచ్చు '

2. గిరిప్రదక్షిణ అనేది కచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి " కుడివైపున కరుణగిరి కి దగ్గరలో ఉండే కుడి మార్గం లో  సూక్ష్మరూపంలో యోగులు ' సిద్ధులు ' దేవతలు ప్రదక్షిణలు చేస్తారట . అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు .

3. ఆరుణాచలం వెళ్లే ప్రతి వారు కచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి .
ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్ లు ఖచ్చితంగా ఇస్తారు .

4 . దర్శనానికి గిరిప్రదక్షిణ కి వెళ్లేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి . ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు .

5. ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెబుతారు .

6. నైఋతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు కచ్చితంగా  అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది '
ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు .

7. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని ' మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు " భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు . ఖాళీ కడుపుతో చేసే గిరిప్రదక్షణ వేగవంతంగా ఉంటుంది .

8. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరిప్రదక్షణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది .

9. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది '
మాక్సిమం కూర్చోకుండా నిలబడి గానీ ' తప్పనిసరి పరిస్థితుల్లో  బెంచీపై పడుకోండి " కూర్చోవడం అన్న చాలా ఇబ్బందులు ఉంటాయి .

10 . కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని  దర్శనానికి వెళ్లే వారు ' అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి . అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు .
లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు.

11. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత
ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది .
కచ్చితంగా దర్శనం చేసుకోండి .

12. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దపెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం ఉంటుంది '
ఆ మండపంపై కి వెళ్లి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది .
రమణ మహర్షి వారు  అక్కడే తపస్సు చేసారు .

13.రాజ గోపురానికి కుడివైపున అనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది . అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం .

14 ' ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం ' అది ఇది మహా భక్తురాలైన అమ్మాణి అమ్మన్‌ అని ఆవిడ కట్టించిన గోపురం .

15. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది .తప్పకుండా దర్శనం చేసుకోండి .

16 ' అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది దాని క్రింద రాతితో చెక్కిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది .
అద్భుతః

17. అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు .

18 ' అగ్ని లింగానికి ' రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది . చాలా పెద్ద విగ్రహం ' అత్యంత శక్తివంతమైన విగ్రహం '
అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు .
ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి . రూపాయలకు శెనగల దండ అమ్ముతారు . మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శెనగల దండలను స్వామివారికి సమర్పించండి . అది స్వామి వారి మీద వేస్తారు .

19. శివసన్నిధి రోడ్ లో కొంచెం ముందుకు వెళ్లి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది '
చాలా చాలా బాగుంటుంది . ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది .
రమణ మహర్షి వారి ఆశ్రమంలో కి వలె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి .
ఇక్కడ
ఉదయం టిఫిన్ ' మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు .
విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్ లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు .
ఒకసారి అక్కడి ప్రసాదం స్వీకరించండి

20 . ఈ రామ్ సూరత్ బాబా ఆశ్రమం లోనే అవధూత శ్రీ తోప్పి అమ్మాల్ వారు వుంటారు.
దర్శనం చేసుకొని తరించండి

ఓం అరుణాచలేశ్వరాయ నమః

సేకరణ : 

Sunday, 6 February 2022

విష్ణుమూర్తికి "24" పేర్లున్నాయి

 

విష్ణుమూర్తికి "24" పేర్లున్నాయి.

వాటిని కేశవనామాలంటారు..


ఇవి "24" మాత్రమే ఎందుకు ఉన్నాయి?వీటికి కాలచక్రానికి,గణితానికి ఏమైనా సంబంధం వున్నదా?


ఈ "24" కు గణిత పరమైన భూమిక ఏమిటి*?


విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం.అంటే నాలుగు చేతులు గలవాడని కదా?

ఈ నాలుగు చేతుల్లో శంఖం,చక్రం, గద,పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు.


నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి. 

ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు.


*1.కేశవ నామాలలో మొదటి నామం కేశవ.*


కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో 

*పద్మము, శంఖము*

ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో 

*గద,చక్రం* 

ధరించి ఉంటాడు.


 *2.విష్ణువు యొక్క మరొక నామము మాధవ.*


ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో

*గద,చక్రం* ధరించి,ఎడమవైపు ఉన్న రెండు చేతులతో

*పద్మము,శంఖము* ధరించి ఉంటాడు.


*3.మధుసూధన రూపంలో* 


కుడివైపు చేతులతో *చక్రం, శంఖము* 

మరియు ఎడమవైపు చేతులతో

*గద,పద్మము* ధరించి ఉంటాడు.


*ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు*(పక్షానికొకసారి) 


*పౌర్ణమికి, అమావాస్య కు* తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.


*ఈ మార్పులు లేదా అమరికలను* మనం గణిత శాస్త్ర పరిభాషలో *ప్రస్తారాలు(permutations)* 

అంటాం.

అనగా 4 వస్తువులను 4! 

(4 factorial) విధాలుగా అమర్చవచ్చు.


 4! = 4×3×2×1=24


*శంఖాన్ని* 'శ' తోను,

*చక్రాన్ని* 'చ' తోను,

*గదను* 'గ' తోను,

*పద్మాన్ని* ' ప'తోను సూచిస్తే,


*ఆ 24 అమరికలు* క్రింది విధంగా వుంటాయి.


*1) శచగప 2) శచపగ*

*3) శపచగ 4) శపగచ*

*5)శగచప 6)శగపచ*

*7)చపగశ 8)చపశగ*

*9)చగపశ 10)చగశప*

*11)చశగప 12)చశపగ*

*13)గపశచ 14)గపచశ*

*15)గచశప 16)గచపశ*

*17)గశపచ 18)గశచప*

*19)పచగశ 20)పతశగ*

*21)పశగచ 22)పశచగ*

*23)పగశచ 24)పగచశ.*


[పైవన్నీ *ఒక క్రమంలో* ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.]


ఈ 24 నామాలు పెద్దలందరికీ తెలిసినా‌...


మరోసారి క్రింద ఉదహరిస్తున్నాను.

      

*కేశవ,నారాయణ*

*మాధవ,గోవింద*

*విష్ణు,మధుసూధన*

*త్రివిక్రమ,వామన*

*శ్రీధర,హృషీకేశ*

*పద్మనాభ,దామోదర*

*సంకర్షణ,వాసుదేవ*

*అనిరుధ్ధ,ప్రద్యుమ్న,*

*పురుషోత్తమ,అధోక్షజ*

*నారసింహ,అచ్యుత*

*జనార్ధన,ఉపేంద్ర*

*హరి శ్రీకృష్ణ.*


సేకరణ


ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి 

*24 పక్షాలు* అంటే

*12 నెలలు*

అనగా *ఒక సంవత్సరం* పడుతుంది....


Saturday, 5 February 2022

శ్రీ సరస్వతీ కవచము

 శ్రీ సరస్వతీ కవచము


సంకలనం


శ్రీశ్రీశ్రీ వద్దిపర్తి పద్మాకర్ త్రిబాషా మహా సహస్రావధాని ప్రణవపీఠం


శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా, శిరోమేపాతు సర్వతః శ్రీ వాగ్దేవతాయై స్వాహా, ఫాలం మే సర్వదా వతు ॥


2. ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి, శ్రోత్రేపాతు నిరంతరమ్ ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా, నేత్రయుగ్మం సదావతు ॥


3. ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా, నాసాంమే సర్వదావతు హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై స్వాహా చౌష్ఠం సదావతు


4. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదావతు ఐమిత్యేకాక్షరో మంత్రో మమకంఠం సదావతు


5. ఓం శ్రీం హ్రీం పాతుమేగ్రీవాం, స్కంధౌమే శ్రీం సదావతు ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహావక్షః సదావతు ॥


6. ఓం హ్రీం విద్యాధి స్వరూపాయై స్వాహా మే పాతునాభికామ్ ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి, మమహస్తా సదావతు


7. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదావతు ఓం వాగధిష్ఠాతృ దేవ్యై స్వాహా సర్వం సదావతు |


8. 9. ఓం సర్వకంఠ వాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదావతు ఓం సర్వజిహ్వాగ్ర వాసిన్యై స్వాహాగ్నిదిశి రక్షతు ॥ ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహా సతతం మంత్రరాజోయం దక్షిణే మాం సదావతు ॥


10. ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రో, నైరృత్యాం సర్వదావతు ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహామాం వారుణేవతు ॥


11. ఓం సర్వాంబికాయై స్వాహా, వాయవ్యే మాం సదావతు ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు


12. ఐం సర్వ శాస్త్ర వాసిన్యై స్వాహైశాన్యాం సదావతు ఓం హ్రీం సర్వ పూజితాయై స్వాహా చోర్ధ్యం సదావతు ॥


13. ఓం హ్రీం పుస్తక వాసిన్యై స్వాహా ధో మాం సదావతు ఓం గ్రంథ బీజస్వరూపాయై స్వాహా మాం సర్వతోవతు ॥


14. ఇదం విశ్వజయం నామ కవచం బ్రహ్మరూపకమ్ | పంచలక్ష జపేనైవ సిద్ధంతు కవచంభవేత్ ॥ యది స్యాత్ సిద్ధకవచో, బృహస్పతి సమోభవేత్ ॥


ఈ సరస్వతీ కవచాన్ని రోజూ మూడుపూటలా పారాయణ చేస్తే జ్ఞానం కలుగుతుంది. తన జీవితంలో లక్షల పారాయణ చేసిన వాడు బృహస్పతితో సమానుడౌతాడు. ఈ కవచం అక్షరాభ్యాస సమయంలో పారాయణ చేయిస్తే పిల్లలకు మంచి విద్య లభిస్తుంది.

Saturday, 22 January 2022

వివాహం

 వివాహం

మన హిందు సాంప్రదాయం లో వివాహం లో చేసే ప్రక్రియ చాలా విలువైన ది...పవిత్ర మైనది...

 ఆ వివరాలు ..సేకరణ..

1. కన్యావరణం

2. పెళ్ళి చూపులు

3. నిశ్చితార్థం

4. అంకురార్పణం

5. స్నాతకం

6. సమావర్తనం:

7. కాశీయాత్ర:

8. మంగళస్నానాలు:

9. ఎదురుకోలు:

10. వరపూజ:

11. గౌరీపూజ:

12. పుణ్యాహవాచనం:

13. విఘ్నేశ్వరపూజ:

14. రక్షా బంధనం:

15. కొత్త జంధ్యం వేయడం:

16. గౌరీ కంకణ దేవతాపూజ:

17. కౌతుక ధారణ:

18. కంకణ ధారణ:

19. మధుపర్కము:

20. వధువును గంపలో తెచ్చుట:

21. తెరచాపు

22. మహా సంకల్పం:

23. కన్యాదానం:

24. వధూవరుల ప్రమాణములు:

25.సుముహూర్తం-జీలకర్ర-బెల్లం:

26. స్వర్ణ జలాభిషేకం:

27. చూర్ణిక:

28. వధూవర సంకల్పం:

29. యోక్త్రధారణం:

30. మాంగల్య పూజ:

31. మాంగల్య ధారణ:

32. అక్షతలు-తలంబ్రాలు:

33. బ్రహ్మముడి:

34. సన్నికల్లు తొక్కడం:

35. కాళ్లు తొక్కించడం:

36. పాణి గ్రహణం:

37. సప్తపది:

38. లాజహోమం:

39. యోక్త్రవిమోచనం:

40. స్థాలీపాకం:

41. ఉంగరాలు తీయడం:

42. బొమ్మని అప్పగింత:

43. నాగవల్లి:

44. ధ్రువనక్షత్రం:

45. అరుంధతి నక్షత్ర దర్శనం:

46. అప్పగింతలు:

47. అత్తమామలకు వధువు పూజ:

48. ఫలప్రదానం:

49. పానుపు:

50. మహదాశీర్వచనం:

51. వధువు గృహప్రవేశం:

52. కంకణ విమోచన:

53. గర్భాదానం:

54. పదహారు రోజుల పండుగ

55. అల్లెం.

Friday, 31 December 2021

నారాయణ స్తోత్రమ్

 నారాయణ స్తోత్రమ్



నారాయణ నారాయణ జయ గోవింద హరే ‖

నారాయణ నారాయణ జయ గోపాల హరే ‖


కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ ‖ 1 ‖

ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ ‖ 2 ‖


యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ ‖ 3 ‖

పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ‖ 4 ‖


మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ ‖ 5 ‖

రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ ‖ 6 ‖


మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ ‖ 7 ‖

బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ ‖ 8 ‖


వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ ‖ 9 ‖

జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ ‖ 10 ‖


పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ ‖ 11 ‖

అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ ‖ 12 ‖


హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ ‖ 13 ‖

దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ ‖ 14 ‖


గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ ‖ 15 ‖

సరయుతీరవిహార సజ్జన^^ఋషిమందార నారాయణ ‖ 16 ‖


విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ ‖ 17 ‖

ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ ‖ 18 ‖


జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ ‖ 19 ‖

దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ ‖ 20 ‖


ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ ‖ 21 ‖

వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ ‖ 22 ‖


మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ ‖ 23 ‖

జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ ‖ 24 ‖


తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ ‖ 25 ‖

గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ ‖ 26 ‖


సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ ‖ 27 ‖

అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ ‖ 28 ‖


నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ ‖ 29 ‖

భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ ‖ 30

Sunday, 1 August 2021

పచ్చి మిర్చి ఉపయోగాలు

 


పచ్చి మిర్చి

1. పచ్చిమిర్చిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా రోజూవారీ ఆహారంలో తీసుకోవడం వలన జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అ

3. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

4. పచ్చిమిర్చి తినడం వల్ల ప్రోస్టేట్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.

5. కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి.

6. పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది ఆహరపు రుచిని పెంచుతుంది. కానీ మెదడులోని ఒక భాగమైన హైపోథాలమస్‌ను ప్రభావితం చేసిన వెంటనే శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. భారతదేశంలోని అత్యంత హాటెస్ట్ ప్రదేశాలలో కూడా పచ్చిమిరపకాయలు సమృద్ధిగా తినడానికి కారణం ఇదే. ఇందులో కనిపించే క్యాప్సైసిన్ రక్త ప్రసరణను సమతుల్యంగా ఉంచుతుంది. దీనివల్ల జలుబు, సైనస్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.
7. జలుబు ఉన్నప్పుడు పచ్చిమిర్చి తినాలి. చలి నుంచి ఉపశమనం లభిస్తుంది. పచ్చిమిర్చి తినడం ద్వారా శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.
8. అల్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు మసాలా ఆహారాన్ని తినడం కష్టం అయినప్పటికీ,

9. పచ్చి మిరపకాయలు తీసుకోవడం వల్ల బొబ్బలు త్వరగా నయమవుతాయి.

10. ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటం వల్ల పచ్చిమిర్చి కళ్ళు, చర్మానికి చాలా మేలు చేస్తుంది.

12. పచ్చిమిర్చిని చల్లగా, చీకటి ప్రదేశాలలో ఉంచాలి. గాలి, కాంతికి గురికావడం వలన దాని విటమిన్‌ను నాశనం చేస్తుంది.

13. అంతేకాకుండా రక్తంలో షుగర్ లెవల్స్‏ను కంట్రోల్‏లో ఉంచుతాయి. డయాబెటిక్ రోగులు పచ్చిమిర్చిని తినడం మంచిదే.

14. వీటి ద్వారా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా..

15. పచ్చిమిర్చిని తినడం వలన బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

సేకరణ

Monday, 12 July 2021

స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు

 స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు, జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు?


ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుత్తుని వదలివేయటం ఎక్కువ అయింది .
అది ఎట్టి పరిస్థితుల్లో ఆమోద యోగ్యం కాదు.
అలా వదిలి వేయడం వలన కోరికలు పెరిగి ...అశాంతి ఏర్పడుతుంది.
కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకుంటారు.

రెండు జడలు వేసుకోవడం

రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్ల అని, పెళ్లికాలేదని అర్ధం.
అంటే ఆ అమ్మాయిలో జీవ + ఈశ్వర సంబంధం విడివిడిగా ఉందని అర్ధము

ఒక జడ వేసుకోవడం

పెళ్లి అయ్యిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకునేవారు. అంటే ఆమె తన జీవేశ్వరుడినిచేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం

ముడి పెట్టుకోవడం

జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానంకూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం

అయితే ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా చివరకు కొప్పు పెట్టుకున్నా
కూడా
జుట్టుని మూడు పాయలుగా విడతీసి త్రివేణీసంగమంలాగ కలుపుతూ అల్లీవారు. ఈ మూడు పాయలకు అర్ధము

1. తానూ, భర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం.

2. సత్వ, రజ, తమో గుణాలు,

3. జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అని అర్ధములు.

అమ్మాయిలు వేసుకున్న జడనిబట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేని వారా అన్న విషయం తెలిసిపోయేది. ఇంత అర్ధం ఉంది కాబట్టే, మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి.

జుత్తు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్టాదేవికి ఆహ్వానం. ...
అంతే కాదు రెండు చేతులతో తల గోక్కో కూడదు.
తల స్నానం చేశాక జుట్టు లోంచి చుక్కలు కింద పడకూడదు... అందుకే పూర్వం వారు తలకి టవల్ , కాటన్ క్లోత్ ని గాని కట్టుకునే వారు...

సేకరణ


Wednesday, 12 May 2021

అమ్మ

 అమ్మ

 

జగత్తు ఏలే అమ్మ వారి నుంచి 

జన్మ నిచ్చే అమ్మ వరకూ...

శక్తి స్వరూపాలే...

ఆ అమ్మ లేనిదే జగత్తు లేదు

ఈ అమ్మ లేనిదే జన్మ లేదు

అమ్మ లేనిదే బ్రతుకు లేదు..

అమ్మ లేనిదే భవిష్యత్తు లేదు...

అమ్మ ఒక వ్యక్తి కాదు...

మహా శక్తి...

మరో ప్రపంచం నుంచి

మన ప్రపంచం వరకూ ...

అమ్మ లేనిదే మనుగడ లేదు...

ప్రేమ కు అర్థం అమ్మ

మమత కు అర్థం అమ్మ

సమత కు అర్థం అమ్మ 

కరుణ కు అర్థం అమ్మ

త్యాగానికి అర్థం అమ్మ

గురువు కి అర్థం అమ్మ

ధైర్యానికి అర్థం అమ్మ 

ఉపేక్షించేది అమ్మ

ఆపేక్షించేది అమ్మ

నిరీక్షించేది అమ్మ

రక్షించేది అమ్మ

నిను నవ మాసాలు మోస్తూ,

నిను ప్రతిక్షణం తలుస్తూ

నీ రాకకై అనుక్షణం నిరీక్షిస్తూ

నిను అనుక్షణం తలుస్తూ

నువ్వే తన లోకమని కలలు కంటూ

తన ప్రాణం పణంగా పెట్టి 

నీకు జన్మ నిచ్చి

నిను రక్షించేది అమ్మ...

లాలి పాట అమ్మ

ముద్ద పాట అమ్మ (చందమామ రావే )

ముద్దు మాట అమ్మ

జోల పాట అమ్మ...

అమ్మ ని గురించి ఏమని చెప్పాలి

అమ్మని గురించి ఎంత ని చెప్పాలి

అనంత విశ్వమంత మనసు ఉన్న 

అమ్మ ప్రేమ ని కొలువ గలమా

ఇంకొక దానితో పోల్చగలమా...

ఆ భగవంతుడు కూడా...అమ్మ ప్రేమకోసం...భూమి మీద అవతరించి..

ఆ ప్రేమలో తరిస్తున్నాడు....కదా

అమ్మా......

మానవాళి మనుగడకు భూమి మీద

భగవంతుడు మనకు 

ఇచ్చిన వరం

అమ్మ...అమ్మ ...అమ్మ....



Sunday, 9 May 2021

ఏ పురాణంలో ఏముందో

 ఏ పురాణంలో ఏముందో



1. మత్స్యపురాణం
2. కూర్మపురాణం
3. వామన పురాణం
4. వరాహ పురాణం
5. గరుడ పురాణం
6. వాయు పురాణం
7. నారద పురాణం
8. స్కాంద పురాణం
9. విష్ణుపురాణం
10. భాగవత పురాణం
11. అగ్నిపురాణం
12. బ్రహ్మపురాణం
13. పద్మపురాణం
14. మార్కండేయ పురాణం
15. బ్రహ్మవైవర్త పురాణం
16. లింగపురాణం
17. బ్రహ్మాండ పురాణం
18. భవిష్యపురాణం

ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.
మత్స్యపురాణం

మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.*

కూర్మపురాణం

కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

వామన పురాణం

పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

వరాహపురాణం


వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.

గరుడ పురాణం

గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.*

వాయుపురాణం

వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.

అగ్నిపురాణం

అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.

స్కందపురాణం

కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.

లింగపురాణం

లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.

నారద పురాణం

బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన
సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.

పద్మపురాణం

మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.

విష్ణుపురాణం

పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.

మార్కండేయ పురాణం

శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.

బ్రహ్మపురాణం

బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.

భాగవత పురాణం

విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.

బ్రహ్మాండ పురాణం

బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.

భవిష్యపురాణం

సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.

బ్రహ్మాపవైపర్తపురాణము

ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి.

సేకరణ...