Thursday, 7 May 2020

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

దత్తపరమైన జ్ఞానం చెప్పుకోవడం,
వినడం అనే క్రియవల్ల అన్ని అమంగళములు నశించి పోతాయి అంటూ దత్తుడి మహిమ చెప్పుకోవడం వల్ల వచ్చే ఫలితం చెప్తూ వేదధర్ముడు దీపకునికి ఒక 108 అద్భుత దత్తనామములు చెప్తాడు. ఆ దత్తనామాలు నిత్యానుష్టానం చేసేవాడిని కవచంలా స్వామి కాపాడతాడు.

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం శివదత్తాయ నమః
ఓం విష్ణుదత్తాయ నమః
ఓం అత్రిదత్తాయ నమః
ఓం ఆత్రేయాయ నమః
ఓం అత్రివరదాయ నమః
ఓం అనసూయాయ నమః
ఓం అనసూయాసూనవే నమః 10
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్ధిపతయే నమః
ఓం సిధ్ధసేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః 20
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం మహిష్ఠాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగపతయే నమః
ఓం యోగీశాయ నమః 30
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః 40
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్ప మోహనాయ నమః
ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం వీరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షిణే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహరూపాయ నమః 50
ఓం స్ధవిరాయ నమః
ఓం స్ధవీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూఢాయ నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః 60
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలధారిణే నమః
ఓం శూలినే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం ఢమరుధారిణే నమః
ఓం మునయే నమః
ఓం మౌనినే నమః 70
ఓం శ్రీ విరూపాయ నమః
ఓం సర్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సహస్రాయుధాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః 80
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్ఠాయ నమః
ఓం ధ్యానస్ధిమితమూర్తయే నమః 90
ఓం ధూళిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః
ఓం భస్మోద్ధూళితదేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్ధ ప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః 100
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విశ్వరూపిణే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే
నమో నమః 108

ఓం శ్రీ దత్తాయనమః ఓం దేవదత్తాయనమః తో ప్రారంభమయ్యే ఈ దివ్య నామములు దివ్యదృష్టితో దత్తాత్రేయ స్వామి ని దర్శించి వేద ధర్ముడు దీపాకునికి చెప్పాడు.

శ్రీ దత్త నామ కవచం


ఓం శ్రీ దత్తాయనమః ఓం దేవదత్తాయనమః తో ప్రారంభమయ్యే ఈ దివ్య నామములు దివ్యదృష్టితో దత్తాత్రేయ స్వామి ని దర్శించి వేద ధర్ముడు దీపాకునికి చెప్పాడు.
తరువాత ఈ నామములను కవచముగా ఎలా చేసుకొనవలెనో వివరించాడు. ఈ కవచమును ఉదయము, సాయంత్రం శ్రద్ధగా చదివిన పాపములనుంచి విముక్తి కలుగును అని శిష్యునకు కూడా చెప్పెను. ఈ నామములు ఆచార్య భరద్వాజ మాష్టరు గారు వ్రాసిన దత్తమహత్యం లో చివరలో కలవు.

శ్రీ దత్త నామ కవచం

1. ఓం కారాది నమోంతానం! నామ్నామష్టోత్తరం శతమ్!
శ్రద్ధయా యః పఠేన్నిత్యం! త్రిసంధ్యం నియతః సుధీః॥

భావము:: వేదధర్ముడు ఇలా చెప్పారు - ఓం కారంతో మొదలు పెట్టి నమః శబ్దమును చివర చేర్చి నూట ఎనిమిది నామములను విద్వాంసుడు ఏకాగ్రతతో మూడు సంధ్యా కాలములలో శ్రద్ధగా చదవాలి.

2. సర్వపాప విముక్తాత్మా! జాయతే విమలాంతరః !
భుక్త్యా యథేప్సితాన్భోగాన్! ప్రేత్య బ్రహ్మణి లీయతే ॥

భావము:: ఈ నామములు పఠించిన చో పాపచింతనలనుండి విడివడి స్వచ్ఛమైన మనస్సు కలవాడై. కోరిన కోర్కెలు తీరి సమస్త సుఖములను అనుభవించును . పరలోకమున శ్రీ దత్తునియందు ఐక్యము చెందును.

3. భక్తరక్షాక్షణో దేవః!స్మృతః సేవా స్వవేశ్మని!
స్వభోజ్యస్యార్పణం దానం! ఫలమింద్రాది దుర్లభమ్ ॥

భావము:: భక్తరక్షణ కొరకు ఎల్లప్పుడూ దత్తుడు సిద్ధంగా వుండును. భక్తులను రక్షించుటయే ఆయనకు ఆనందం. మన ఇంట్లోనే వుండి ఆయనను తలచినా, భోజనమునకు ముందు ఆ స్వామికి భోజనం అర్పించి తినినా, మనకు దానఫలము లభింస్తుంది. ఇంద్రాది దేవతలకు కూడా దుర్లభమైన ఐశ్వర్యమును ఇచ్చును.

4. య ఏతైర్నామభిర్దివ్యైః! కవచం ధారయేత్కృతీ!
రాజవేశ్మని కాంతారే! దుర్గాదిషు మహాభయే ॥

భావము:: ఈ అష్టోత్తర శతనామములు ఎవరు కవచముగా ధరించెదరో వారు కృతార్థులు అగుదురు. రాజభవనమునందు,అరణ్య ములందు,మహాభయములందు ఈ నామములతో కవచముగా ధరించిన విజయము పొందుతారు.

5. శత్రుచోరభయాకీర్ణే! శ్మశానే ప్రేతదూషితే!
న భయం విద్యతే తస్య! దృష్ట్వా తం విద్రువేద్భయమ్॥

భావము:: శత్రువులు, దొంగలు, శ్మశానములయందు,భయములువుండు చోట ఈ నామములు కవచముగా కలిగిన వానిని చూసి భయపడి అన్ని పారిపోవును.

6. శిరో లలాటం నేత్రేచ! భ్రూమధ్యం చ భ్రువౌ తథా!
నాసే కర్ణౌ తథోష్ఠౌ చ! హనుః కంఠం కకుత్తథా ॥

భావము:: శిరస్సు, నుదురు, నేత్రములు, కనుబొమల మధ్యభాగం,కనుబొమలు, ముక్కు, చెవులు, పెదవులు, దవడలు, కంఠము, ఈ నామములు చెప్పుచూ తాకవలెను. అక్కడ వున్న రోగములు పోతాయి.

7 . దౌతాంఘ్రిహస్త ఆచమ్య! స్మృత్యా దత్తం న్యసేత్సుధీః!
కరాంగన్యాసౌ విన్యస్య!షడ్భిః ష్షడ్భిః తతః క్రమాత్ ॥

భావము:: చేతులు, కాళ్ళు కడుగుకొని కేశవాది నామాలతో ఆచమనం చేసి దత్తాత్రేయుని స్మరించి ఈ అష్టోత్తర శతనామ కవచమును చదువుకొనవలెను. అంగన్యాస, కరన్యాసములు ఆరేసి నామములతో చేయవలెను.

8. జత్రుస్తనౌ చ చక్షుశ్చ! హృదయం నాభిరేవచ!
మూలాధార స్ఫిచావూరూ! జానుజంగాశ్చ గుల్ఫయౌః ॥

భావము:: మూపు సంధులు, వక్షస్థలము, నేత్రములు, నాభి, మూలాధార ము, పిరుదులు, కటిప్రదేశము,తొడలు, మోకాళ్ళు, పిక్కలు, గిలకలు.

9. ప్రపదౌ పాదమూలాభ్యం ! తథా పాదతలే ఉభే!
పాదాగ్రాంగుష్ఠయో శ్చైవ ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

భావము: మోకాళ్ళు, పాదమూలములు , పాదప్రదేశములు,బొటనవేళ్ళు,చేతుల యొక్క అగ్రభాగములకు,నామములతో కవచము చేసుకొనవలెను.నామ ప్రభావముతో ఆయా అవయము ల రోగములు పోవును మరియు కవచము వలె రక్షణ ఇచ్చును.

10. స్కంధయోర్బుజమూలాభ్యాం ! సంధిభ్యాం కరయోః పృథక్!
అంగుల్యం గుష్ఠయోశ్చైవ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

భావము: భుజస్కంధముల యందు,భుజముల మూలలయందు,హస్తముల సందులయందు,వ్రేళ్ళయందు, హస్తాగ్రములయందు .

11.హృదయాద్దస్త పాదాగ్ర! పర్యంతవ్యాపకం న్యసేత్!
దశేంద్రియాంతః కరణ! చతుష్టయధృతంన్యసేత్ ॥

భావము:: హృదయము నుంచి హస్తాది పాదాగ్రముల వరకు ఈ నామకవచమును కప్పవలెను. పది ఇంద్రియాలందు, మనో,బుద్ధి, చిత్త, అహంకారముల యందు ఈ కవచమును ఉంచవలెను.

12. రోమస్వేకం చ హృదయం! స్పృష్ట్వా నామాని పంచ చ !
జేద్భక్త్యా స్మరన్దేవం! కృతకృత్యో భవేన్నరః ॥

భావము: రోమమలయందు,హృదయము నందు స్పృశించి అయిదు నామములను చెప్పవలెను. ఇట్లు భక్తి తో తన అవయముల అన్నిటి అందును ఆ దేవదేవుని స్మరించుచూ ఆ స్వామి నామములను జపించవలెను.

జపమునకు ముందు చేయవలసిన ధ్యాన శ్లోకం:::
పీతాంబరాలంకృత పృష్టభాగం! భస్మావగుంఠామలరుక్మ దేహమ్!
విద్యుత్సదాపింగ జటాభిరామం! శ్రీ దత్తయోగీశమహంనతోస్మి ॥

భావము:: పట్టు వస్త్రాలు కట్టుకొన్న, విభుతితో పూయబడిన బంగారపు శరీరము కలవాడు, మెరుపు తీగ వలె పచ్చనైన జడలతో మనోహరమైన శ్రీ దత్తయోగీశ్వరునికి అన్నివేళలా వంగి వంగి నమస్కరిస్తాను.

పితృ దేవతల ఆశీర్వచనం కోసం

పితృ దేవతల ఆశీర్వచనం కోసం

ఏ నక్షత్రం నాడు
అమ్మానాన్నలను/కాలం చేసిన పెద్దలను పూజిస్తే ఏ ఫలం దక్కుతుందో కూడా ఈ విధంగా మహాభారతం, కూర్మపురాణం చెబుతున్నాయి.

1)అశ్విని: వాహనాలు కావాలనుకున్న వారు అశ్వినీ నక్షత్రం ఉన్నప్పుడు తల్లి తండ్రుల సేవ చేయాలి.

2)భరణి: ఆయువు కావలసిన వారు భరణిలో అమ్మానాన్నలను అర్చించాలి.

3)కృత్తిక: అగ్నిసహితంగా కుమారునితో కలసి పితరులను కృత్తిక ఉన్నప్పుడు అర్చిస్తే రోగశోకాలు లేనివాడవుతాడు.

4)రోహిణి: సంతానం కావాలనుకున్నవారు తమ పితరులను రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు ప్రార్థించాలి.

5)మృగశిర: బ్రహ్మతేజస్సు కలుగుతుంది.

6)ఆర్ద్ర: శౌర్యం కావాలనుకున్నవారు ఆరుద్రా నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను పార్వతీపరమేశ్వరులుగా అర్చించాలి. అంటే పోలీసులు, సైన్యం, అగ్నిమాపకదళం, భద్రతాదళాలు, అంగరక్షకులు వంటి వృత్తులలోని వారు ఈ రోజు తమ తల్లితండ్రులను పూజించాలి. దీని వల్ల శూరత్వం కలిగి తమ శౌర్యవృత్తుల్లో రాణిస్తారు.

7)పునర్వసు: ధనం, భూమి కావాలనుకున్న వారు పునర్వసులో పెద్దలను సేవించాలి.

8)పుష్యమి: తాతముత్తాలను పుష్యమి నాడు సేవిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పుష్టికలుగుతుంది.

9)ఆశ్రేష: ఈ నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను ప్రసన్నం చేసుకుంటే ధీరులైన పుత్రసంతానం, సర్వ కోరికలూ తీర్చే కుమారులు కలుగుతారు.

10)మఖ: తన దాయాదులలో మేటి కావాలను

కున్న వారు మఖనాడు పితరుల అర్చన చేయాలి.

11)పుబ్బ: పాపనాశనం, సౌభాగ్యం పుబ్బ వల్ల కలుగుతాయి.

12)ఉత్తర: సంతానధనాలు ఉత్తరానక్షత్రం వల్ల కలుగుతాయి.

13)హస్త:తన కులంలో శ్రేష్ఠత్వం హస్తా నక్షత్రం ద్వారా పొందుతారు.

14)చిత్త: అందమైన కొడుకులు కావాలనుకున్న వారు చిత్తా నక్షత్రంలో పెద్దలను సేవిస్తే సౌందర్యంకల పుత్రులు అనేకం కలుగుతారు.

15)స్వాతి: వ్యాపారాల వృద్ధిని స్వాతి కలిగిస్తుంది. (ఉద్యోగాలలో వృద్ధి కూడా కలుగుతుంది.)

16)విశాఖ: స్వర్ణరజతాలు పొందవచ్చు. అలాగే అనేక మంది పుత్రులు విశాఖ నక్షత్రం నాడు అమ్మానాన్నలను సేవిస్తే కలుగుతాయి.

17)అనూరాధ: రాజ్యాధికారం, మంచి మిత్రులను అనూరాధ ద్వారా పొందవచ్చు.

18)జ్యేష్ఠ: సర్వసమృద్ధి, కోరుకున్న రంగంలో అధిపతి కావాలంటే జ్యేష్ఠా నక్షత్రంలో పితరుల అర్చన చేయాలి.

19)మూల: ఆరోగ్యం, చేసే కృషి ఫలించాలంటే మూలా నక్షత్రంలో అమ్మానాన్నలకు మ్రొక్కాలి.

20)పూర్వాషాఢ: సమృద్దీ కీర్తిప్రతిష్ఠలు కలుగడానికి పూర్వాషాఢలోని పితృదేవతార్చన తోడుపడుతుంది.

21)ఉత్తరాషాఢ: నిశ్శోకవంతుడు, శుభగృహం (మంచి ఇల్లు) పొందాలి అంటే ఉత్తరాషాఢలో తాతముత్తాల ఆశీర్వచనాలు పొందాలి.

22)శ్రవణం: బ్రతికినన్నాళ్ళూ శ్రేష్ఠత్వం అనంతరం స్వర్గప్రాప్తి శ్రవణం నాటి మాతాపితరుల సేవ కలిగిస్తుంది.

23)ధనిష్ఠ: రాజ్యప్రాప్తి. నేడు రాజకీయాల్లో రాణించాలనుకున్న వారు ధనిష్ఠ నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను సేవించాలి. వారికి పదవీయోగం కలుగుతుంది.

24)శతభిషం:వైద్యులు హస్తవాసి కోసం అమ్మానాన్నలను శతభిష నక్షత్రం ఉన్న సమయంలో అర్చించాలి. మహాబలవంతులు అవుతారు.

25)పూర్వాభాద్ర: మేకలు గొర్రెలు వంటివి పొందవచ్చు. అంటే యానిమల్ హజ్బెండరీస్ కు చెందిన వారు పూర్వాభాద్రలో పితరులను అర్చించాలి. అలా అర్చిస్తే వారి అనుగ్రహంతో పశువుల మందలు వృద్ధిపొందుతాయి. అంటే ఇవి వ్యవసాయప్రధానులైన శూద్రవైశ్యులకు కూడా ఇవి చెప్పారని తెలుసుకోవాలి.

26)ఉత్తరాభాద్ర: గోసంపద వృద్ధి అవుతుంది.

27)రేవతి: వెండి బంగారం తప్ప ఇతర వజ్రవైఢూర్యాదులు పొందాలంటే రేవతిలో అమ్మానాన్నల ఆశీర్వాదాలు పొందాలి.

సేకరణ

దత్తాత్రేయ స్తోత్రము

దత్తాత్రేయ స్తోత్రము

జటాధరం పాండురంగం, శూలహస్తం కృపానిధిమ్‌
సర్వరోగహరం దేవం, దత్తాత్రేయ మహం భజే
జగదుత్పత్తికర్త్రే చ, స్థితి సంహారహేతవే
భవనాశ విముక్తాయ దత్తాత్రేయ! నమోస్తుతే
జరాజన్మవినాశాయ, దేహశుద్ధికరాయ చ
దిగంబర! దయామూర్తే ! దత్తాత్రేయ! నమోస్తుతే
కర్పూరకాంతిదేహాయ, బ్రహ్మమూర్తిధరాయ చ
వేదశాస్త్ర పరిజ్ఞాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
హ్రస్వదీర్ఘకృత స్థూల నామగోత్రవివర్జిత !
పంచభూతైకదీప్తాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
యజ్ఞభోక్త్రే చ యజ్ఞాయ, యజ్ఞరూపధరాయ చ
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ ! నమోస్తుతే
ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యే హ్యంతే దేవ స్సదాశివ:
మూర్తిత్రయస్వరూపాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
భోగాలయాయ భోగాయ, యోగయోగ్యాయ ధారిణి
జితేంద్రియ జితజ్ఞాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
దిగంబరాయ దివ్యాయ, దివ్యరూప ధరాయ చ
సదోదిత పరంబ్రహ్మ దత్తాత్రేయ ! నమోస్తుతే
జంబూద్వీపే మహాక్షేత్రే, మాతా పురనివాసినే
జయమానసతాం దేవ ! దత్తాత్రేయ ! నమోస్తుతే
భిక్షాటనం గృహే గ్రామే, పాత్రం హేమమయం కరే
నానా స్వాద్యమయీ భిక్షా, దత్తాత్రేయ ! నమోస్తుతే
బ్రహ్మజ్ఞానమయీముద్రా, వస్త్రేచమాకాశభూతలే
ప్రజ్ఞానఘనబోధాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
అవథూత సదానంద, పరబ్రహ్మ స్వరూపిణి
విదేహదేహరూపాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
సత్యరూప! సదాచార! సత్యధర్మపరాయణ !
సత్యాశ్రయ ! పరోక్షాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
శూలహస్త ! గదాపాణ ! వనమాలాసుకంధర !
యజ్ఞసూత్రధర ! బ్రహ్మన్‌ ! దత్తాత్రేయ ! నమోస్తుతే
క్షరక్షరస్వరూపాయ, పరాత్పరతరాయ చ
దత్తముక్తి పరస్తోత్ర, దత్తాత్రేయ ! నమోస్తుతే
దత్తవిద్యా(ఢ్య)య లక్ష్మీశ ! దత్తస్యాత్మస్వరూపిణి
గుణనిర్గుణరూపాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
శత్రునాశకరం స్తోత్రం, జ్ఞానవిజ్ఞానదాయకమ్‌
సర్వపా పప్రశమం, దత్తాత్రేయ ! నమోస్తుతే
ఇదం స్తోత్రం మహద్దివ్యం, దత్త ప్రత్యక్షకారకమ్‌
దత్తాత్రేయ ప్రసాదాచ్ఛ, నారదేన ప్రకీర్తితమ్‌

ఇతి నారదపురాణే నారద విరచితం దత్తాత్రేయ స్తోత్రమ్

గణేశ ఋణ విమోచక స్తోత్రం

గణేశ ఋణ విమోచక స్తోత్రం

ఎవరికీ అయితే ఋణ ( అప్పులు ) భాధలు వుంటాయో వారు .. ఈ గణేశ ఋణ విమోచక స్తోత్రముని ప్రతి రోజు ఉదయము 6 గంటల లోపు వినాయక పటము ముందుకొబ్బరి నూనె తో దీపము పెట్టి చదివాలి .... లేకపోతే వినాయక దేవాలయము లో అయిన కొబ్బరి నూనె తో దీపము పెట్టి , ఋణ విమోచక స్తోత్రం చదవాలి

ధ్యానం
సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||

స్తోత్రం

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౧ ||

త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౨ ||

హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౩ ||

మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౪ ||

తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౫ ||

భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౬ ||

శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౭ ||

పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౮ ||

ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||

దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్
పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||

శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్
ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||

ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం
సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||

బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్
అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||

లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్
భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||

ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం.

సేకరణ

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౧ ||

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౨ ||

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౩ ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౪ ||

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౫ ||

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౬ ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౭ ||

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౮ ||

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్

Tuesday, 5 May 2020

తిధి , అధిపతి దేవత ...వ్రత ఫలం

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది.

అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి అని చెపుతారు

తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.

పాడ్యమి : అధిదేవత - అగ్ని.
వ్రత ఫలం - సత్ఫల ప్రాప్తి.
విదియ : అధిదేవత - అశ్విని దేవతలు.
వ్రత ఫలం - ఆరోగ్య వృద్ది.
తదియ : అధిదేవత - గౌరీ దేవి.
వ్రత ఫలం - సుమంగళీ అనుగ్రహం.
చవితి: అధిదేవత - వినాయకుడు.
వ్రత ఫలం - కష్టములు తొలగిపోవుట.
పంచమి: అధిదేవత - నాగ దేవత.
వ్రత ఫలం - వివాహము, వంశ వృద్ది.
షష్టి : అధిదేవత - సుబ్రహ్మణ్య స్వామి.
వ్రత ఫలం - పుత్ర ప్రాప్తి.
సప్తమి: అధిదేవత - సూర్య భగవానుడు. వ్రత ఫలం - ఆయురారోగ్య వృద్ది.
అష్టమి: అధిదేవత - అష్టమాత్రుకలు.
వ్రత ఫలం - దుర్గతి నాశనము.
నవమి: అధిదేవత - దుర్గాదేవి.
వ్రత ఫలం - సంపద ప్రాప్తిస్తుంది.
దశమి: అధిదేవత - ఇంద్రాది దశ దిక్పాలకులు.
వ్రత ఫలం - పాపాలు నశిస్తాయి.
ఏకాదశి: అధిదేవత - కుబేరుడు.
వ్రత ఫలం - ఐశ్వర్యము ప్రాప్తించును.
ద్వాదశి: అధిదేవత - విష్ణువు.
వ్రత ఫలం - పుణ్య ఫల ప్రాప్తించును.
త్రయోదశి: అధిదేవత - ధర్ముడు.
వ్రత ఫలం - మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.
చతుర్దశి: అధిదేవత - రుద్ర.
వ్రత ఫలం - మ్రుత్యున్జయము, శుభప్రదం.
అమావాస్య: అధిదేవతలు - పితృదేవతలు. వ్రత ఫలం - సంతాన సౌఖ్యం.
పౌర్ణమి: అధిదేవత - చంద్రుడు.
వ్రత ఫలం - ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.

సేకరణ

Monday, 4 May 2020

గోమాత దర్శనము చేయునప్పుడు చదివే శ్లోకాలు:–


గోమాత దర్శనము చేయునప్పుడు చదివే శ్లోకాలు:–

నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్య ఏవచ l
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః ll

భావం:-శ్రీమంతంబులై కామధేను సంతతులైన బ్రహ్మాదులచే స్తుతించబడిన పవిత్రములైన గోవులకు నా నమస్కారము….

గావో మమాగ్రతః నను గావో మే సంతు పృష్టతః l
గావో మే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యాహం ll

భావం:–గోవులు నాముందు-వెనుకలందు యుండుగాక. గోవులే నా హృదయము. గోవుల మధ్యయందు నేను నివసించుచున్నాను…..

సర్వ దేవమయే దేవి సర్వ దేవైరలం కృతే l
మమాభిలషితంకర్మ సఫలం కురు నందిని ll

భావం:–ఓ గోమాతా ! సర్వదేవతాస్వరూపిణి, సర్వదేవతలచే అలంకరింపబడినదానా ! నా కోర్కెలను సఫలం చేయుము….

మహాలక్ష్మి ధ్యాన శ్లోకం


మహాలక్ష్మి ధ్యాన శ్లోకం

పద్మనాభ ప్రియాం
దేవీం పద్మాక్ష్మీం పద్మవాసినీం
పద్మవక్త్రాం పద్మహస్తాం
వందే పద్మామ హర్నిశమ్
పూర్ణేందు బింబవదనాం
రత్నాభరణ భూషితాం
వరదాభయ హస్తాడ్యాం
ధ్యాయే చ్చంద్ర సహొదరీమ్
ఇచ్చా రూపాం
భగవత స్సచ్చిదానంద రూపిణీం
సర్వజ్ఞాం సర్వజననీ,
విష్ణువక్ష స్త్ఫాలాలయామ్
దయాళుమనిశం
ధ్యాయేత్ సుఖసిద్ధ స్వరూపిణీమ్

పద్మముల వంటి నేత్రములు కలిగినది పద్మనాభునికి ప్రియమైనది
పద్మమునందు కూర్చున్నది
పద్మమువలె వికసించినటువంటి సుందర వదనం కలిగినది
పద్మముల వంటి చేతులు కలిగినది
నిండుగా ఉదయించిన చంద్రుని వంటి వదనంతో ఉన్నది
శిరస్సు మొదలుకొని పాదముల వరకు అన్ని రకాల రత్నాభరణములను అలంకరించుకున్నది
క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు
చంద్రునితో పాటు పుట్టింది.
భగవానుడైన నారాయణుని యొక్క ఇచ్ఛా శక్తి స్వరూపిణి సచ్చిదానంద రూపిణి అయిన తల్లి.
అన్నీ తెలిసిన తల్లి
సర్వ జగత్తుకూ తల్లి
నారాయణుని వక్ష స్థలంలో ఉన్నది
దయ గలిగిన తల్లి
ఎల్లవేళలా ధ్యానిస్తున్నాను.
ఆనందము, సిద్ధి(కార్య సిద్ధి, మోక్షము)
ఈ రెండింటి యొక్క రూపమే మహాలక్ష్మి.

భాస్కర భగవానుడు అనుగ్రహించిన అక్షరౌషధము

"ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" అని శాస్త్రవచనం.
వేదంలో సౌర, అరుణమంత్రాలు శక్తివంతమైన ప్రభావం కలిగినవి.
వాటిలోని భావాలను, శబ్దశక్తులను మిళితం చేసిన దివ్యస్తోత్రమిది.
శ్రీకృష్ణుని పుత్రుడైన సాంబుడు ఒకసారి మహావ్యాధిగ్రస్తుడై, కృష్ణోపదేశంతో సూర్యోపాసన దీక్షను వహించాడు. సముద్ర తీరంలో దీక్షాబద్ధుడైన సాంబునకు ఆకాశమార్గం నుండి ఒక దివ్యపత్రం ఎగిరవచ్చి చేరింది. ఆ పత్రంలోనివి ఈ శ్లోకాలు. వీటిని నియమంగా రోజూ పారాయణ చేస్తే సంపూర్ణారోగ్యం చేకూరుతుంది.
వ్యాధులన్నిటినీ నివారింపజేసే ఈ స్తోత్రంలో వైదికమంత్ర స్ఫురణ నిబద్ధమై ఉంది. సాక్షాత్తు భాస్కర భగవానుడు అనుగ్రహించిన అక్షరౌషధమిది.

౧. ఉద్యన్నద్య వివస్వా-
నారోహన్నుత్తరాం దివం దేవః!
హృద్రోగం మమ సూర్యో
హరిమాణం చాశు నాశయేదఖిలమ్!!
౨. నిమిషార్ధేనైకేన
ద్వేచ శతే ద్వే సహస్రే ద్వే!
క్రమమాణ యోజనానాం
నమోస్తుతే నళిననాథాయ!!
౩. కర్మజ్ఞానఖదశకం
మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ
ద్వాదశథా యో విచరతి
స ద్వాదశమూర్తి రస్తు మోదాయ!!
౪. త్వం హి యజూ ఋక్సామ
త్వమాగమస్త్వం వషట్కారః!
త్వం విశ్వం త్వం హంస -
స్త్వం భానో! పరమహంసశ్చ!!
౫. శివరూపాద్ జ్ఞానమహం
త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్!
శిఖిరూపాదైశ్వర్యం
త్వత్త స్సంప్రాప్తుమిచ్ఛామి!!
౬. త్వచి దోషా దృశి దోషా
హృది దోషా యేఖిలేంద్రియజదోషాః!
తాన్పూషా హతదోషః
కించిద్రోషాగ్నినా దహతు!!
౭. ధర్మార్థ కామ మోక్ష -
ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్
బందీకృతేంద్రియగణాన్
గదాన్విఖండయతు చండాంశుః!!
౮. యేన వినేదం తిమిరం
జగదేతద్ గ్రసతి చరమచర మఖిలం
తం నళినీ భర్తారం
హర్తారం చాపదామీడే!!
౯. యస్య సహస్రాభీశో -
రభీశులేశో హిమాంశుబింబగతః
భాసయతి నక్తమఖిలం
భేదయతు విపద్గణానరుణః
౧౦. తిమిరమివ నేత్రతిమిరం
పటలమివాశేషరోగపటలం నః
కాశమివాధినికాయం
కాలపితా రోగశూన్యతాం కురుతాత్!!
౧౧. వాతాశ్మరీగదార్శస్
త్వగ్దోషమహోదరప్రమేహాన్
గ్రహణీభగందరాఖ్యా
మహారుజోప్యేష మే హన్తి!!
౧౨. త్వం మాతా త్వం శరణం
త్వం దాతా త్వం ధనం త్వమాచార్యః
త్వం త్రాతా త్వం హర్తా
విపదామర్క ప్రసీద మమ భానో!!
౧౩. ఇత్యార్యాద్వాదశకం
సాంబస్య పురో నభస్స్థ లాత్పతితం
పఠతాం భాగ్యసమృద్ధి -
స్సమస్తరోగప్రశాంతిశ్చ స్యాత్!!
ఇతి ద్వాదశార్యా స్తుతిః
సేకరణ...