Monday, 4 May 2020

నవగ్రహాలు విష్ణుమూర్తి అవతారాలు


నవగ్రహాలు విష్ణుమూర్తి అవతారాలు

శ్లో|| రామో೭వతార స్సూర్యస్య చంద్రస్యయదునాయకః|
నృసింహో భూమి పుత్రస్య బుద్ధ స్సోమసుతస్య చ|
వామనో విబుధేజ్యస్య భార్గవో భార్గవస్య చ|
కచ్ఛప సూర్య పుత్రస్య సైరిహకే యస్య సూకరః||
కేతోర్మీనావ తారస్య|| ఇతి పరాశ రేణోక్తం||

"పరి శేషాత్కాల రూపస్య మాందేః కల్కీ" ఇతి సూచ్యతే. అత ఏవోక్తం శ్రీమచ్ఛంకర భగవత్పూజ్య పాదైశ్చ స్రగ్ధరావృత్తం-

శ్లో|| మత్స్యః కూర్మో వరాహో నరహరిణపతి ర్వామనో జామదగ్న్యః|
కాకుత్థ్సః కంసఘాతీ మనసిజ విజయీ యశ్చకల్కీ భవిష్యన్‌||
విష్ణోరం శావతారా భువనహితకరా ధర్మ సంస్థాపనార్ధాః|
పాయాసుర్మాంత ఏ తేగురుతర కరుణా భార భిన్నాశయాయే||

కావున శ్రీ పరాశర మహర్షియు. పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ మచ్ఛంకర దేశికులును మాందితో గూడిన దశ సంఖ్యాక గ్రహములను శ్రీ మహావిష్ణుని దశ సంఖ్యాకమగు అంశావతారములని వచించి యుండిరి.

1. సూర్యుని అంశావతారము సూర్యుని వంశమున జనించిన దశరధ మహారాజపుత్రుడగు శ్రీ రాముడు
2. చంద్రుని అంశావతారము యుదు వంశోద్భవుడగు బలరాముడు (శ్రీ కృష్ణుడు)
3. కుజుని అంశావతారము ఆగ్ని స్వరూపుడగు నృసింహమూర్తి
4. బుధుని అంశావతారము బుద్థదేవుడు
5. బృహస్పతి అంశావతారము వామనమూర్తి
6. శుక్రుని అంశావతారము పరశురామమూర్తి
7. శని యొక్క అంశావతారము కూర్మమూర్తి
8. రాహుని అంశావతారము వరాహమూర్తి
9. కేతుని అంశా వతారము మన్మథుని కేతనం అగు మీనమూర్తి
10. పరిశేష న్యాయముచే మాందీ గ్రహాంశావతారము కాలమూర్తియగు కల్కిమూర్తిగను వర్ణింపబడియెను. ఇట్లు వరామిహహిరా చార్య కృతహోరా--శాస్త్ర మనియెడి జ్యోతిష గ్రంథరాజమున చెడ్పబడెను.

ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతార అధిదేవత ఉన్నారు. ఆయా గ్రహ అధిదేవతను ఉపాసిస్తే ఆ గ్రహ తీవ్రత తగ్గుతుంది. రవి కి రామావతారాన్ని, చంద్రుడికి కృష్ణావతారాన్ని, కుజుడికి నరసింహ అవతారాన్ని, బుధుడికి బుద్ధావతారాన్ని, గురువుకి వామనావతారాన్ని, శుక్రుడికి పరశురామావతారాన్ని, శనికి కూర్మావతారాన్ని, రాహువుకి వరాహావతారాన్ని, కేతువు కి మీనావతారాన్ని పూజించాలి.
నవగ్రహాలలో ఏ గ్రహం యొక్క తీవ్రత అధికంగా ఉందో తెలుసుకొని శ్రీమన్నారాయణ అవతార ధ్యానం చేస్తే ఆ గ్రహ తీవ్రత తగ్గుతుంది.
ఇది ఒక విధమైన శాంతి.
సేకరణ

Saturday, 2 May 2020

ఏ వారం.. ఏ పూజ...ఏ ఫలితం

ఏ వారం.. ఏ పూజ...ఏ ఫలితం

శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో
దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది.
మంత్రాలతో జపం, హోమం, దానం,
తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు.
సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది.
పూజలు మనకున్న ఏడు వారాలలో
ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు
చెయ్యాల్సి ఉంటుంది.

ఆదివారం:
ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర సమస్యలు, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.

సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవారు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.

మంగళవారం: రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.

బుధవారం: బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గురువారం: గురువారం ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు.

శుక్రవారం: శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల సంతృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించాలి.

శనివారం: శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి, నువ్వులను దానం ఇచ్చి, నువ్వులు కలిపిన అన్నంతో... పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

ఇలా ఏడు రోజులలో... ఏ దేవతకు పూజ చేసినా.... ముందుగా సంతోషపడేది శివుడేనని శివపురాణం వివరిస్తోంది.
ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే, తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక, శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. సృష్టి ప్రారంభంలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప,పుణ్యాలు రెండిటినీ శివుడు కల్పించాడు.
పాపం చేయటం లేదా? పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది. చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువుల నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి, పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి.
ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి. ఈ విషయాన్ని గ్రహించి, ఎవరు ఏ ఫలితం కావాలనుకుంటే.. ఆ రోజున,ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన.

సేకరణ.

Friday, 1 May 2020

ఏ ఏ సమయాలలో ఏ నామం జపించాలి

ఏ ఏ సమయాలలో ఏ నామం జపించాలి

ఔషధే చింతయేత్ విష్ణుం ,
భొజనే చ జనార్దనం
శయనే పద్మనాభం చ
వివాహే చ ప్రజాపతిం
యుద్ధే చక్రధరం దేవం
ప్రవాసే చ త్రివిక్రమం
నారాయణం తనుత్యాగే
శ్రీధరం ప్రియసంగమే
దుస్స్వప్నే స్మరగోవిందం
సంకటే మధుసూదనం
కాననే నారసింహం చ
పావకే జలశాయినం
జలమధ్యే వరాహం చ
పర్వతే రఘునందనం
గమనే వామనం చైవ
సర్వకాలేషు మాధవం
షోడశైతాని నామాని
ప్రాతరుత్థాయ యః పఠేత్
సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే.

స్త్రీల సౌభాగ్యాన్ని కాపాడే స్తోత్రం

 స్త్రీల సౌభాగ్యాన్ని కాపాడే స్తోత్రం

1నమః కాంతాయ భర్త్రేచ శిరశ్చంద్ర స్వరూపిణే
నమశ్శాంతాయ దాంతాయ సర్వదేవాశ్రయాయచ

2::నమో బ్రహ్మస్వరూపాయ సతీప్రాణపరాయ చ
నమస్యాయచ పూజ్యాయ హృదాధారాయతే నమః

3::పంచప్రాణాధిదేవాయ చక్షుషస్తారకాయ చ
జ్ఞానాధారాయ పత్నీనాం పరమానంద రూపిణే

4::పతిర్బ్రహ్మా పతిర్విష్ణుః పతిరేవమహేశ్వరః
పతిశ్చనిర్గుణాధారో బ్రహ్మరూప..నమోస్తుతే

5::క్షమస్వ భగవాన్..దోషం జ్ఞానాజ్ఞానామృతం చయత్
పత్నిబంధో..దయాసింధో..దాసీదోషం క్షమస్వమే

6::ఇతిస్తోత్రం మహాపుణ్యం సృష్టాదౌ పద్మయాకృతం
సరస్వత్యాచ ధరయా గంగయా చ పురావ్రజ

7::సావిత్ర్యా చ కృతం పూర్వం బ్రహ్మణే చాపి నిత్యశః
పార్వత్యా చ కృతం భక్త్యాకైలాసౌ శంకరాయచ

బ్రహ్మవైవర్త పురాణంలోని ఈ స్తోత్రాన్నిలక్ష్మీ, సరస్వతి, గంగ, భూదేవి, సావిత్రి, పార్వతి మున్నగు దేవతా మూర్తులు పఠించారు

మానసా దేవి స్తోత్రమ్

మానసా దేవి స్తోత్రమ్

అత్యంత మహిమాన్వితమైన, మరియు కోరిన కోర్కెలు తీర్చి, సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించు,
శ్రీ మానసా దేవి స్తోత్రం

ధ్యానం..
చారుచమ్పకవర్ణాభాం సర్వాఙ్గసుమనోహరామ్ ।
నాగేన్ద్రవాహినీం దేవీం సర్వవిద్యావిశారదామ్ ॥

శ్రీనారాయణ ఉవాచ..
నమః సిద్ధిస్వరుపాయై వరదాయై నమో నమః ।
నమః కశ్యపకన్యాయై శంకరాయై నమో నమః ॥ ౧॥

బాలానాం రక్షణకర్త్ర్యై నాగదేవ్యై నమో నమః ।
నమ ఆస్తీకమాత్రే తే జరత్కార్వ్యై నమో నమః ॥ ౨॥

తపస్విన్యై చ యోగిన్యై నాగస్వస్రే నమో నమః ।
సాధ్వ్యై తపస్యారుపాయై శమ్భుశిష్యే చ తే నమః ॥ ౩॥

॥ ఫలశ్రుతిః ॥

ఇతి తే కథితం లక్ష్మి మనసాయా స్తవం మహత్ ।
యః పఠతి నిత్యమిదం శ్రావయేద్వాపి భక్తితః ॥

న తస్య సర్పభీతిర్వై విషోఽప్యమృతం భవతి ।
వంశజానాం నాగభయం నాస్తి శ్రవణమాత్రతః ॥

॥ ఇతి శ్రీ మానసా దేవి స్తోత్రమ్ సంపూర్ణం ll

శ్రీసుబ్రహ్మణ్యదండకమ్


శ్రీసుబ్రహ్మణ్యదండకమ్

జయ వజ్రిసుతాకాన్త జయ శఙ్కరనన్దన
జయ మారశతాకార జయ వల్లీమనోహర

జయ భుజబలనిర్జితానేక విద్యాణ్డభీకారిసంగ్రామ కృత్తరకావాప్త గీర్వాణభీడ్వాన్త మార్తాణ్డ షడ్వక్త్ర గౌరీశ ఫాలాక్షి సమ్జాత తేజసముర్భూత దేవాపగా పత్మషణ్డోథిత స్వాకృతే, సూర్యకోటి ద్యుతే భూసురాణాంగతే,

శరవణభవ కృత్యకాస్తన్యపానాప్తషడ్వక్త్రపత్మాద్రిజాతాకరాంభోజ సంలాళనాతుష్ట కాళీసముత్పన్న వీరాగ్ర్యసంసేవితానేకబాలోచిత క్రీడితాకీర్ణవారాశిభూభృద్వనీసంహతే, దేవసేనరతే దేవతానాం వతే,

సురవరనుత దర్శితాత్మీయ దివ్యాస్వరూపామరస్తోమ సమ్పూజ్య కారాగృహావాప్తకజ్జాతస్తుత్యాశ్చర్యామాహాత్మ్య శక్త్యగ్రసంభిన్న శైలేన్ద్ర దైతేయ సంహార సన్తోషితామార్త్య సంకౢప్త దివ్యాభిషేకోన్నతే, తోషితశ్రీపతే,

సుమశరసమదేవరాజాత్మ భూదేవసేనాకర గ్రాహసమ్ప్రాప్త సంమోదవల్లీ మనోహారి లీలావిశేషేన్ద్రకోదణ్డభాస్వత్కలాపోచ్య బర్హీన్ద్ర వాహాధిరూఢాతిదీనం కృపాదృష్టిపాతేన
మాంరక్ష తుభ్యం నమో దేవ తుభ్యం నమః

శ్రీ సుబ్రహ్మణ్య దండకం సంపూర్ణమ్

Monday, 27 April 2020

సూర్య మండల స్తోత్రం,

 సూర్య మండల స్తోత్రం,

సమస్త పాపాల్ని హరించి..పుణ్యఫలం పెంచే స్తోత్రం

నమోస్తు సూర్యాయ సహస్రరశ్మయే
సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే
సహస్రసంఖ్యాయుధధారిణే నమః || 1 ||

యన్మండలం దీప్తికరం విశాలం |
రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 2 ||

యన్మండలం దేవగణైః సుపూజితం |
విప్రైస్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 3 ||

యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం |
త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |
సమస్త తేజోమయ దివ్యరూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 4 ||

యన్మండలం గూఢమతి ప్రబోధం |
ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వ పాపక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 5 ||

యన్మండలం వ్యాధివినాశదక్షం |
యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 6 ||

యన్మండలం వేదవిదో వదంతి |
గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 7 ||

యన్మండలం సర్వజనైశ్చ పూజితం |
జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాల కాలాద్యమరాది రూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 8 ||

యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం |
యదక్షరం పాపహరం జనానామ్ |
యత్కాలకల్పక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 9 ||

యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం |
ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతే ఖిలం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 10 ||

యన్మండలం సర్వగతస్య విష్ణోః |
ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 11 ||

యన్మండలం వేదవిదోపగీతం |
యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |
తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 12 ||

సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||

ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం..సంపూర్ణం.. ||

Thursday, 23 April 2020

భజగోవిందం - తాత్పర్య సహితం


భజగోవిందం - తాత్పర్య సహితం

ఓం స్థాపకయ చ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే |
అవతర వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ: ||

1) భజగోవిందం భజగోవిందం
గోవిందం భజమూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ్కరణే ||
తాత్పర్యం: గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు.
ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు.

2) మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం |
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ||
తాత్పర్యం: ఓ మూర్ఖుడా! ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడువుము. తృష్ణారాహిత్యమను సద్బుద్ధిని అలవరుచుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో నీ మనస్సును తృప్తి పరుచుకొనుము.

3) నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మాగామోహావేశం |
ఏతన్మాంసవసాది వికారం
మనసి విచింతయ వారం వారం ||
తాత్పర్యం: స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము. అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపోయుము.

4) నలినీదళగత జలమతి తరళం
తద్వజ్జీవితమతిశయచపలం |
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం ||
తాత్పర్యం: తామరాకుపైనున్న నీటి బిందువు మాదిరి, జీవితమెంతో చంచలమైనది. జనులందరును రోగములతో బాధపడుతు, దేహాభిమానమును విడువక దుఃఖములో చిక్కుకొని యుందురు. మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకొనుము.

5) యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః |
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్ఛతి గేహే ||
తాత్పర్యం: ధనమును సంపాదించుచున్నంత వరకే నీ బంధు మిత్ర పరివార జనము నీ యందు అనురాగము, ఆసక్తి చూపుదురు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలుకరించు వారు ఎవ్వరూ ఉండరు.

6) యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్ఛతి కుశలం గేహే |
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే ||
తాత్పర్యం: శరీరములో ఊపిరి ఉన్నంతవరకు ఇంటిలోనివారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును.

7) బాలస్తావత్క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః|
వృద్ధస్తావచ్చింతాసక్తః
పరే బ్రహ్మణి కోపిన సక్తః||
తాత్పర్యం: బాల్యమంతయు ఆటపాటలయందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను, వార్థక్యమును సంసార చింతల చేతను జీవితమంతా గడుపుదురే కాని, పరబ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరును లేరు.

8) కా తే కాంతా కస్తే పుత్రః
సంసారో యమతీవ విచిత్రః |
కస్య త్వం కః కుత ఆయాతః
తత్త్వం చింతయ తదిహ భ్రాతః ||
తాత్పర్యం: ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికిని, నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము.

9) సత్సంగత్వే నిః సఙ్గత్వం
నిఃసఙ్గత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||
తాత్పర్యం: జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగును.

10) వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారో
జ్ఞాతే తత్త్వే కః సంసారః ||
తాత్పర్యం: వయసు మళ్ళిన వానికి కామ వికార మెక్కడిది? నీరు ఎండిపోయిన యెడల అది చెరువు ఎలా అవుతుంది? అట్లే, ధనము లేనప్పుడు పరివార మెట్లుండును? తత్వము అనుభూతమైన తర్వాత సంసార బంధము ఏముండును?

11) మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం |
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||
తాత్పర్యం: ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.

12) దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిరవసంతౌ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః ||
తాత్పర్యం: రాత్రింబవళ్ళు, ఉదయ సాయంకాలములు, శిశిర వసంతాది ఋతువులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చుచు పోవుచుండును. ఈ విధముగా కాలము క్రీడించుచున్నది, ఆయువు క్షీణించుచున్నది. అయిననూ ఆశాపిశాచము మాత్రము నిన్ను వదలకయే ఉన్నది.

13) కాతే కాంతా ధనగతచిన్తా
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జనసంగతిరేకా
భవతి భవార్ణవతరణే నౌకా ||
తాత్పర్యం: ఓయీ! నీ భార్య ఎవరు? నీకు ఎల్లప్పుడును ధనమును గూర్చిన చింతయేనా? వేరొక చింతలేదా? నిన్ను సన్మార్గమున నడిపింప చేయగలవారెవ్వరు లేకపోయారా? నీవు ముల్లోకములు వెదకినను సంసార సాగరమును దాటించుటకు సజ్జన సాంగత్యము తప్ప వేరొక నౌక లేదని తెలుసుకొనుము.

14) జటిలో ముండీ లుంఛితకేశః
కాషాయాంబరబహుకృతవేషః |
పశ్యన్నపి చన పశ్యతి మూఢో
ఉదరనిమిత్తం బహుకృతవేషః ||
తాత్పర్యం: జుట్టును జడలుగా కట్టించుకొనుట, తలను నున్నగా గొరిగించుకొనుట, కాషాయవస్త్రములు ధరించుట, ఇట్లు ఉ

దరపోషణ నిమిత్తము పెక్కు వేషములను వేయుచున్నారే కాని లోక పరిస్థితులన్నియు చూచుచున్ననూ జ్ఞానోదయమునకై ఎంత మాత్రము ప్రయత్నించరు.

15) అంగం గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండం |
వృద్ధో యాతి గృహిత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండం ||
తాత్పర్యం: శరీరము కృంగి, కృశించి, చిక్కి, మడతలు పడినను, తల పూర్తిగా నెరసిపోయినను, పండ్లు ఊడిపోయి నోరు బోసి ఆయినను, ముసలితనము వచ్చి కర్రను పట్టుకుని కాని నడవలేక పోయినను ఆశ మాత్రము అతనిని వదలదు.

16) అగ్రే వహ్నిః పృష్ఠే భానూ
రాత్రౌ చుబుకసమర్పితజానుః |
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాశః ||
తాత్పర్యం: తనవారితో గల సంబంధముల నన్నిటిని విడిచి, చెట్ల నీడలలో నివసించుచు, రాత్రులందు చలికి ముడుచుకుని, మోకాళ్ళపై గడ్డమును ఉంచుకుని పండుకొనుచు, పగలు సూర్యుని ఎండను ఆశ్రయించుచు, చేతిలో పడవేసిన భిక్షాన్నమును తినుచూ గడుపుచున్నను ఆశ మాత్రము వదిలి పెట్టదు.

17) కురుతే గంగాసాగరగమనం
వ్రతపరిపాలనమథవా దానం |
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన ||
తాత్పర్యం: గంగాసాగర సంగమము మున్నగు చోట్ల స్నానములు చేసినను, నోములు, వ్రతములు చేసినను, దాన ధర్మముల నెన్ని చేసినను సరే అతడు జ్ఞానము పొందలేకపోయినచో, నూరు జన్మములు ఎత్తినను ముక్తిని పొందడు.

18) సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతల మజినం వాసః |
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః ||
తాత్పర్యం: దేవాలయముల వద్దనుండు చెట్ల కింద నివసించుచు, నేలపై పవళించుచు, జింకతోలు మున్నగు చర్మములే వస్త్రములుగా కలిగి యుండి, భోగముల నన్నిటిని త్యజించిన వానికి అట్టి వైరాగ్యము వలన సుఖము ఎందుకు కలగదు?

19) యోగరతో వా భోగరతోవా
సఙ్గరతో వా సఙ్గవిహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ ||
తాత్పర్యం: యోగమునందు ఆసక్తి కలవాడైనను, భోగమునందు ఆసక్తి కలవాడైనను, ఏకాంతముగా నుండువాడైనను, బంధుమిత్రులతో కలిసి ఉన్నవాడైనాను, తన మనస్సును పరబ్రహ్మమునందు ఏకాగ్రతతో లగ్నము చేసి వినోదించువాడు ఎల్లప్పుడునూ ఆనందమును అనుభవించుచున్నాడు.

20) భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా ||
తాత్పర్యం: భగవద్గీతను కొంచెము అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా పానము చేసినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు! అట్టివానికి యమునివలన ఎంతమాత్రము భయము లేదు.

21) పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే ||
తాత్పర్యం: మరల మరల జన్మించుచు, మరల మరల మరణించుచు, తిరిగి తల్లి గర్భమున శయనించుచు, ఈ సంసారమును దాటజాలక నానాబాధలకు గురౌతున్న నన్ను ఓ మురారీ! కృపతో సంసారము నుండి తరింపజేయుము.

22) రథ్యా చర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జిత పంథః |
యోగీ యోగనియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవదేవ ||
తాత్పర్యం: వీధులలో దొరికిన గుడ్డముక్కల బొంతను ధరించి పుణ్యపాపముల భేదములను వర్జించినవాడై యోగి తన చిత్తమును బ్రహ్మమునందు లగ్నము చేసి పసి బాలుని వలెను, ఉన్మత్తుని వలెను ఆనందముతో సంచరించును.

23) కస్త్వం కోఅహం కుత ఆయాతః
కా మే జననీ కో మే తాతః |
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||
తాత్పర్యం: సర్వవ్యాపకుడైన భగవంతుడు నీయందును, నాయందును కూడా ఉన్నాడు, అతడొక్కడే. సహనము కోల్పోయి, నిష్కారణముగా నాపై కోపముతో ఉన్నావు. నీవు శ్రీఘ్రముగా విష్ణువులో ఐక్యమును సాధింపగోరుదువేని, భేదబుద్ధిని వీడి, అంతటను సమచిత్తుడవై ఉండి గోవిందునే సేవింపుము.

24) త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః |
భవ సమచిత్తః సర్వత్ర త్వం
వాంఛస్య చిరాద్యది విష్ణుత్వమ్ ||
తాత్పర్యం: నాలోను, నీలోను, మనందరిలోను, ఈ చరాచర జీవకోటిలో ఉన్నవాడు ఆ విష్ణువే. అజ్ఞానముతో అన్నియు మరిచి అందరినీ దూషింతువు ఏల? సమ భావమును, సహనము పెంచుము, స్వార్ధము త్రెంచుము, సమతను పెంచుము, మానవ సేవే మాధవ సేవగా దైవత్వముతో దయతో మెలుగుము.

25) శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
మా కురు యత్నం విగ్రహసంధౌ |
సర్వస్మిన్నపి పశ్యా త్మానం
సర్వత్రో త్సృజ భేద జ్ఞానమ్ ||
తాత్పర్యం: శత్రువునైనా, మిత్రుడనైనా, పుత్రుడనైనా, బంధువునైనా కలహము చేయక, కూర్మిని చూపి శత్రు భావమును సంహరించుము. ఇతరుల పైన కోపము చేసిన నిన్ను నీవె కోపించిన తీరు నీలో, అందరిలొ శ్రీహరి నుండ ఇతరుల నేల దూషణ చేతువు?

26) కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వా ఆత్మానం భావయ కో అహం |
ఆత్మజ్ఞాన విహీనా మూఢాః
తే పచ్యంతే నరకనిగూఢాః ||
తాత్పర్యం: కామ క్రోధ లోభ మొహములను వదలి, నేను ఎవరిని అనే ఆత్మ విచారము చేయుము. ఆత్మజ్ఞాన విహీనులైన మూఢులు ఈ అరిషడ్వర్గమును వదలక వాటినంటి పెట్టుకొని సంసార నరకములో పడి మ్రగ్గుచుందురు.

27) గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం ||
తాత్పర్యం: భగవత్ గీతను, విష్ణు సహస్రనామములను సంకీర్తన చేయుచుండ వలయును, ఎల్లప్పుడూ శ్రీపతి రూపముపై మనసు ని

లిపి ద్యానింప వలెను. ఎల్లప్పుడునూ సజ్జనులతో సహవాసము చేయవలెను. బీదలకు ధనము పంచి పెట్టవలెను.

28) సుఖతః క్రియతే రామాభోగః
పశ్చాద్దంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం ||
తాత్పర్యం: ఇంద్రియ సుఖములు ఎన్నడూ తీరవు, కామ వాంఛలే కాల సర్పములై దేహమునకు రోగము మిగుల్చును. మనిషికి చివరకు మరణము తథ్యము, కాని అతని పాపములు అతనిని వదలవు.

29) అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యం |
పుత్రాదపి ధన భాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః ||
తాత్పర్యం: ధనమెల్లప్పుడును అనర్ధమునే కలిగించునని గ్రహించుము, ధనము వలన సుఖము కొంచెమైనను కలుగదు, ఇది సత్యము. ధనవంతులు పుత్రునివలన కూడా భయపడుదురు. ప్రపంచమంతా ఇదే రీతిగా ఉన్నది.

30) ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేకవిచారం |
జాప్యసమేత సమాధివిధాన
కుర్వవధానం మహదవధానం ||
తాత్పర్యం: సద్గురువులను ఆశ్రయించుము, వారి కరుణతో విబుధుడవగుము. ఇంద్రియములపై నిగ్రహమును ఉంచి మనసును గురు చరణములపై ఉంచి, భవ బంధములు త్యాగము చేసి ఆ హరిని గాంచు.

31) గురుచరణాంబుజ నిర్భర భక్తః
సంసారాదచిరాద్భవ ముక్తః |
సేంద్రియమానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ||
తాత్పర్యం: అష్టసాధనలు అవలంబించు, అంతర్ముఖముగ మనసును నిలుపు, ఏకాగ్రతను సంపాదించు. అటువంటి శాంతమునొందిన సమాధి స్థితిలో ఆనందము నీ సొంతము అగును.

ఇతి శ్రీమద్ఛంకరభగవత: కృతౌ
భజ గోవిందం సంపూర్ణం ||

భజగోవిందం భజగోవిందం | గోవిందం భజమూఢమతే ||

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి -


దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి -
శ్రీ దత్త నామ కవచం - ఫలితాలు

దత్తపరమైన జ్ఞానం చెప్పుకోవడం, వినడం అనే క్రియవల్ల అన్ని అమంగళములు నశించి పోతాయి అంటూ దత్తుడి మహిమ చెప్పుకోవడం వల్ల వచ్చే ఫలితం చెప్తూ వేదధర్ముడు దీపకునికి ఒక 108 అద్భుత దత్తనామములు చెప్తాడు. ఆ దత్తనామాలు నిత్యానుష్టానం చేసేవాడిని కవచంలా స్వామి కాపాడతాడు.

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం శివదత్తాయ నమః
ఓం విష్ణుదత్తాయ నమః
ఓం అత్రిదత్తాయ నమః
ఓం ఆత్రేయాయ నమః
ఓం అత్రివరదాయ నమః
ఓం అనసూయాయ నమః
ఓం అనసూయాసూనవే నమః 10
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్ధిపతయే నమః
ఓం సిధ్ధసేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః 20
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం మహిష్ఠాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగపతయే నమః
ఓం యోగీశాయ నమః 30
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః 40
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్ప మోహనాయ నమః
ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం వీరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షిణే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహరూపాయ నమః 50
ఓం స్ధవిరాయ నమః
ఓం స్ధవీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూఢాయ నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః 60
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలధారిణే నమః
ఓం శూలినే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం ఢమరుధారిణే నమః
ఓం మునయే నమః
ఓం మౌనినే నమః 70
ఓం శ్రీ విరూపాయ నమః
ఓం సర్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సహస్రాయుధాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః 80
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్ఠాయ నమః
ఓం ధ్యానస్ధిమితమూర్తయే నమః 90
ఓం ధూళిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః
ఓం భస్మోద్ధూళితదేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్ధ ప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః 100
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విశ్వరూపిణే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే
నమో నమః 108

ఓం శ్రీ దత్తాయనమః ఓం దేవదత్తాయనమః తో ప్రారంభమయ్యే ఈ దివ్య నామములు దివ్యదృష్టితో దత్తాత్రేయ స్వామి ని దర్శించి వేద ధర్ముడు దీపాకునికి చెప్పాడు. తరువాత ఈ నామములను కవచముగా ఎలా చేసుకొనవలెనో వివరించాడు. ఈ కవచమును ఉదయము, సాయంత్రం శ్రద్ధగా చదివిన పాపములనుంచి విముక్తి కలుగును అని శిష్యునకు కూడా చెప్పెను.

శ్రీ దత్త నామ కవచం

1. ఓం కారాది నమోంతానం! నామ్నామష్టోత్తరం శతమ్!
శ్రద్ధయా యః పఠేన్నిత్యం! త్రిసంధ్యం నియతః సుధీః॥

భావము:: వేదధర్ముడు ఇలా చెప్పారు - ఓం కారంతో మొదలు పెట్టి నమః శబ్దమును చివర చేర్చి నూట ఎనిమిది నామములను విద్వాంసుడు ఏకాగ్రతతో మూడు సంధ్యా కాలములలో శ్రద్ధగా చదవాలి.

2. సర్వపాప విముక్తాత్మా! జాయతే విమలాంతరః !
భుక్త్యా యథేప్సితాన్భోగాన్! ప్రేత్య
బ్రహ్మణి లీయతే ॥

భావము:: ఈ నామములు పఠించిన చో పాపచింతనలనుండి విడివడి స్వచ్ఛమైన మనస్సు కలవాడై. కోరిన కోర్కెలు తీరి సమస్త సుఖములను అనుభవించును . పరలోకమున శ్రీ దత్తునియందు ఐక్యము చెందును.

3. భక్తరక్షాక్షణో దేవః!స్మృతః సేవా స్వవేశ్మని!
స్వభోజ్యస్యార్పణం దానం! ఫలమింద్రాది దుర్లభమ్ ॥

భావము:: భక్తరక్షణ కొరకు ఎల్లప్పుడూ దత్తుడు సిద్ధంగా వుండును. భక్తులను రక్షించుటయే ఆయనకు ఆనందం. మన ఇంట్లోనే వుండి ఆయనను తలచినా, భోజనమునకు ముందు ఆ స్వామికి భోజనం అర్పించి తినినా, మనకు దానఫలము లభింస్తుంది. ఇంద్రాది దేవతలకు కూడా దుర్లభమైన ఐశ్వర్యమును ఇచ్చును.

4. య ఏతైర్నామభిర్దివ్యైః! కవచం ధారయేత్కృతీ!
రాజవేశ్మని కాంతారే! దుర్గాదిషు మహాభయే ॥

భావము:: ఈ అష్టోత్తర శతనామములు ఎవరు కవచముగా ధరించెదరో వారు కృతార్థులు అగుదురు. రాజభవనమునందు,అరణ్య ములందు,మహాభయములందు ఈ నామములతో కవచముగా ధరించిన విజయము పొందుతారు.

5. శత్రుచోరభయాకీర్ణే! శ్మశానే ప్రేతదూషితే!
న భయం విద్యతే తస్య! దృష్ట్వా తం విద్రువేద్భయమ్॥

భావము:: శత్రువులు, దొంగలు, శ్మశానములయందు,భయములువుండు చోట ఈ నామములు కవచముగా కలిగిన వానిని చూసి భయపడి అన్ని పారిపోవును.

6. శిరో లలాటం నేత్రేచ! భ్రూమధ్యం చ భ్రువౌ తథా!
నాసే కర్ణౌ తథోష్ఠౌ చ! హనుః కంఠం కకుత్తథా ॥

భావము:: శిరస్సు, నుదురు, నేత్రములు, కనుబొమల మధ్యభాగం,కనుబొమలు, ముక్కు, చెవులు, పెదవులు, దవడలు, కంఠము, ఈ నామములు చెప్పుచూ తాకవలెను. అక్కడ వున్న రోగములు పోతాయి.

7 . దౌతాంఘ్రిహస్త ఆచమ్య! స్మృత్యా దత్తం న్యసేత్సుధీః!
కరాంగన్యాసౌ విన్యస్య!షడ్భిః ష్షడ్భిః తతః క్రమాత్ ॥

భావము:: చేతులు, కాళ్ళు కడుగుకొని కేశవాది నామాలతో ఆచమనం చేసి దత్తాత్రేయుని స్మరించి ఈ అష్టోత్తర శతనామ కవచమును చదువుకొనవలెను. అంగన్యాస, కరన్యాసములు ఆరేసి నామములతో చేయవలెను.

8. జత్రుస్తనౌ చ చక్షుశ్చ! హృదయం నాభిరేవచ!
మూలాధార స్ఫిచావూరూ! జానుజంగాశ్చ గుల్ఫయౌః ॥

భావము:: మూపు సంధులు, వక్షస్థలము, నేత్రములు, నాభి, మూలాధార ము, పిరుదులు, కటిప్రదేశము,తొడలు, మోకాళ్ళు, పిక్కలు, గిలకలు.

9. ప్రపదౌ పాదమూలాభ్యం ! తథా పాదతలే ఉభే!
పాదాగ్రాంగుష్ఠయో శ్చైవ ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

భావము: మోకాళ్ళు, పాదమూలములు , పాదప్రదేశములు,బొటనవేళ్ళు,చేతుల యొక్క అగ్రభాగములకు,నామములతో కవచము చేసుకొనవలెను.నామ ప్రభావముతో ఆయా అవయము ల రోగములు పోవును మరియు కవచము వలె రక్షణ ఇచ్చును.

10. స్కంధయోర్బుజమూలాభ్యాం ! సంధిభ్యాం కరయోః పృథక్!
అంగుల్యం గుష్ఠయోశ్చైవ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

భావము: భుజస్కంధముల యందు,భుజముల మూలలయందు,హస్తముల సందులయందు,వ్రేళ్ళయందు, హస్తాగ్రములయందు .

11.హృదయాద్దస్త పాదాగ్ర! పర్యంతవ్యాపకం న్యసేత్!
దశేంద్రియాంతః కరణ! చతుష్టయధృతంన్యసేత్ ॥

భావము:: హృదయము నుంచి హస్తాది పాదాగ్రముల వరకు ఈ నామకవచమును కప్పవలెను. పది ఇంద్రియాలందు, మనో,బుద్ధి, చిత్త, అహంకారముల యందు ఈ కవచమును ఉంచవలెను.

12. రోమస్వేకం చ హృదయం! స్పృష్ట్వా నామాని పంచ చ !
జేద్భక్త్యా స్మరన్దేవం! కృతకృత్యో భవేన్నరః ॥

భావము: రోమమలయందు,హృదయము నందు స్పృశించి అయిదు నామములను చెప్పవలెను. ఇట్లు భక్తి తో తన అవయముల అన్నిటి అందును ఆ దేవదేవుని స్మరించుచూ ఆ స్వామి నామములను జపించవలెను.

జపమునకు ముందు చేయవలసిన ధ్యాన శ్లోకం:::
పీతాంబరాలంకృత పృష్టభాగం! భస్మావగుంఠామలరుక్మ దేహమ్!
విద్యుత్సదాపింగ జటాభిరామం! శ్రీ దత్తయోగీశమహంనతోస్మి ॥

భావము:: పట్టు వస్త్రాలు కట్టుకొన్న, విభుతితో పూయబడిన బంగారపు శరీరము కలవాడు, మెరుపు తీగ వలె పచ్చనైన జడలతో మనోహరమైన శ్రీ దత్తయోగీశ్వరునికి అన్నివేళలా వంగి వంగి నమస్కరిస్తాను.

చిదంబరంలోని నటరాజ స్వామి అర్చన నామాలు


చిదంబరంలోని నటరాజ స్వామి అర్చన నామాలు

9 శ్లోకాలు లో 108 శివనామాలు కలిగిన పతంజలి మహర్షి రచించిన అత్యద్భుత స్తోత్రం.
ఇప్పటికీ చిదంబరంలోని నటరాజ స్వామికి ఈ నామాలతోటి అర్చన జరుగుతుంది.
ప్రతి రోజూ ప్రదోష సమయంలో చదువుకోవాల్సిన స్తోత్రం.


సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకం |

పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ |

కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గళమ్

చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ || ౧ ||
హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణ-మఖండదయ-మంతరహితం

విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటమ్ |

పరం పద విఖండితయమం భసిత మండితతనుం మదనవంచన పరం

చిరంతనమముం ప్రణవసంచితనిధిం పర చిదంబర నటం హృది భజ || ౨ ||
అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృతవిధుం సురసరిత్-

తరంగ నికురుంబ ధృతి లంపట జటం శమనదంభసుహరం భవహరమ్ |

శివం దశదిగంతర విజృంభితకరం కరళసన్మృగశిశుం పశుపతిం

హరం శశిధనంజయపతంగనయనం పర చిదంబర నటం హృది భజ || ౩ ||
అనంతనవరత్నవిలసత్కటకకింకిణిఝలం ఝలఝలం ఝలరవం

ముకుందవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదమ్ |

శకుంతరథ బర్హిరథ నందిముఖ భృంగిరిటిసంఘనికటం భయహరమ్

సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిదంబర నటం హృది భజ || ౪ ||
అనంతమహసం త్రిదశవంద్య చరణం ముని హృదంతర వసంతమమలమ్

కబంధ వియదింద్వవని గంధవహ వహ్నిమఖ బంధురవిమంజు వపుషమ్ |

అనంతవిభవం త్రిజగదంతర మణిం త్రినయనం త్రిపుర ఖండన పరమ్

సనంద ముని వందిత పదం సకరుణం పర చిదంబర నటం హృది భజ || ౫ ||
అచింత్యమళివృంద రుచి బంధురగళం కురిత కుంద నికురుంబ ధవళమ్

ముకుంద సుర వృంద బల హంతృ కృత వందన లసంతమహికుండల ధరమ్ |

అకంపమనుకంపిత రతిం సుజన మంగళనిధిం గజహరం పశుపతిమ్

ధనంజయ నుతం ప్రణత రంజనపరం పర చిదంబర నటం హృది భజ || ౬ ||
పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం

మృడం కనక పింగళ జటం సనక పంకజ రవిం సుమనసం హిమరుచిమ్ |

అసంఘమనసం జలధి జన్మకరలం కవలయంత మతులం గుణనిధిమ్

సనంద వరదం శమితమిందు వదనం పర చిదంబర నటం హృది భజ || ౭ ||
అజం క్షితిరథం భుజంగపుంగవగుణం కనక శృంగి ధనుషం కరలసత్

కురంగ పృథు టంక పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దధతం |

ముకుంద విశిఖం నమదవంధ్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం

స చండికమముం ఝటితి సంహృతపురం పర చిదంబర నటం హృది భజ || ౮ ||
అనంగపరిపంథినమజం క్షితి ధురంధరమలం కరుణయంతమఖిలం

జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్ర సురవందితపదమ్ |

ఉదంచదరవిందకుల బంధుశత బింబరుచి సంహతి సుగంధి వపుషం

పతంజలి నుతం ప్రణవ పంజర శుకం పర చిదంబర నటం హృది భజ || ౯ ||
ఇతి స్తవమముం భుజగపుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః

సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృంగ రహితమ్ |

సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం

స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ || ౧౦ ||