Tuesday, 6 April 2021

విహారి.... కధ

 

విహారి....

సమయం ఉదయం 9 గంటలుఅవుతోంది.
అందరూ ఆఫీసులో తమ తమ సీట్లలో ఆసీనులవుతున్నారు.
అంతలో ఒక బెంజ్ కారు వచ్చి పోర్టికోలోఆగింది.
వాచ్ మాన్ గబగబా వచ్చి కారు డోర్ తీసి సెల్యూట్  చేసాడు ,
అందు లోంచి విహారి అతని స్నేహితుడు వినోద్ దిగారు.
ఆ బాగ్  ఇలా ఇవ్వు నేను పట్టుకువస్తాను అన్నాడు వినోద్.
ఇదిగో అంటూ ఇచ్చాడు .
ఇద్దరు లోపలికి వెళ్లారు అందరు
good morning చెపుతుంటే, 
విష్ చేస్తు తన చాంబర్ లోకి అడుగు పెట్టాడు విహారి .
వినోద్ అతని చిన్ననాటి స్నేహితుడు
ఎంబీఏ చదివాడు.
ఈ రెండువిషయాలు దృష్టిలో ఉంచుకొని అతనికి తన
పి ఏ గా పోస్టింగ్ ఇచ్చాడు.
ఆఫీసులో పీఏ .
ఆఫీస్ గేట్  దాటితే  మంచి స్నేహితులు గా మారిపోతారు .
ఇద్దరూ చాంబర్లో వున్నప్పుడు క్లోజ్ గానే వుంటారు .
ఇవాళ ప్రోగ్రామ్స్ ఏమిట్రా  అంటూ తన సీట్ లో కూర్చున్నాడు.
ఉదయం 10 .30 నుంచి 11.30  వరకు ఇంటర్వూస్ ఉన్నాయి.
ఆ తరువాత మన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి 12 గంటలకు ప్రెస్ మీటింగు1.30
లంచ్  విత్ delegates. 2.30 నుంచి వాళ్ళతో మీటింగ్. కొత్త టెండర్ల  ఫైనలైజ్ చెయ్యాలి .
అది సంగతి అన్నాడు వినోద్.
ఇంటర్వ్యూ కి  ఇవాళ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అని అడిగాడు విహారి .
ప్రైమరీ లెవెల్ ఇంటర్వ్యూస్ జనరల్ మేనేజర్  చేసేశారు.
ఫిల్టర్ చేయగా 10 మంది మిగిలారు .
వాళ్లలో మనము ఫైనలైజ్  చెయ్యాలి .
సరే ముందు కాఫీ చెప్పు .
వాళ్ళు వచ్చేస్తే మనం మొదలు పెడదాం  అంటూ అప్లికేషన్ ఫైల్ చూడటం మొదలు పెట్టాడు.
ఇంక మొదలు పెడదామా, అంటూ
ఒకొక్క రిని లోపలకి పంపించ మని
ఇంటర్ కం లో చెప్పాడు.
ఇంటర్వ్యూ లు మొదలు అయ్యాయి .
వినోద్ చేస్తున్నాడు.
విహారి మధ్య లో కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు.
అందరిని ఇంటర్వ్యూ అయ్యాక బైట వెయిట్ చేయమని చెపుతున్నాడు.
మూడో అభ్యర్థి ....సుహాసిని ని లొపలికి పంపించారు.
లోపలకి రాగానే ఒకసారి పరిశీలనగా చూసాడు విహారి.
మధ్య తరగతి కుటుంబం.
బాగా చదివిన వర్ఛస్సు కనిపిస్తోంది. 
తాను కష్టాలలో ఉన్నట్టు , ఈ ఉద్యోగం తనకి ఎలాగైనా రావాలని భావన ఆమె ముఖం లో కనిపిస్తోంది.
ఆమెని ఎక్కడో చూసినట్లు ఫీలింగ్.
ఆమె లోపలికి రాగానే మనసులో ఏదో అనుభూతి.
గుండె వేగం పెరిగింది...
తెలియని ఆనందం ఆమె ముఖం చూడగానే అనిపిస్తుంది...
ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది... అనుకున్నాడు విహారి...
పదేళ్ల క్రితం చదువులకు విదేశాలు వెళ్లి ఈమధ్యే వచ్చాను.
ఈమధ్య కాలం లో అయితే పరిచయం ప్రసక్తే లేదు... మరి ఎక్కడ చూసాను అబ్బా అనుకుంటున్నాడు విహారి...
మనసుకి తెలుస్తోంది బాగా కావలిసిన
వ్యక్తి గా...
కానీ ఎక్కడ పరిచయమో తెలియట్లేదు... అయినా కొంత మంది అంతే....
వాళ్ళ ఆహార్యం చూస్తే అలాగే
అనిపిస్తుంది.. లే ..
అనుకుని ఇంటర్వ్యూ పూర్తి చేసి బైట వెయిట్ చేయమన్నాడు...
ఏది ఆ  బయో డేటా ఒకసారి
ఇలాగ ఇవ్వు అన్నాడు.
వినోద్ ఇచ్చాడు
పేరు , అర్హత అన్ని చూస్తూ ఒక చోట ఆగిపోయాడు..
డాటర్ ఆఫ్ రాఘవ రావు...రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని ఉంది..
అప్పుడు గుర్తుకు వచ్చింది...రాఘవరావు మాస్టారు...
చిన్నప్పుడు చదువులో వెనుక పడితే ఆయనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చెప్పేవారు.. ఆ తరువాత అన్నీ మంచి మార్కులతో పాస్ అయ్యేను.
మంచి ప్రోత్సాహం ఇచ్చేవారు.. ఆ తరువాత మళ్ళీ వెనుకకు తిరిగి చూసుకోలేదు...
కాలేజీ లో చేరినా ఆయనని అప్పుడప్పుడు కలిసి సలహాలు తీసుకుంటూ ఉండే వాడిని...
ఒకరకం గా పై చదువులకు అమెరికా వెళ్ళను అంటే , ఆయనే ప్రోత్సహించి పంపేరు.
ఆయన మాటలు ఇప్పటికి మర్చిపోలేదు...
" నీకు అవకాశం ఉంది. బాగా చదువుకుంటే ఇంకో పది మందికి ఉద్యోగాలు ఇచ్చే సామర్ధ్య ము వస్తుంది...
ఆస్తమాను నీ కోసమేనా , కొంచెం సమాజం శ్రేయస్సు  కోసం కూడా ఆలోచించాలి కదామరి " ...
అని నచ్చ చెప్పారు...
ఆ మాటలు నన్ను ఆలోచింప చేశాయి..
అంతే మారు మాట్లాడకుండా
నాన్న గారి కోరిక ప్రకారం విదేశాలు వెళ్లి బాగా చదువుకుని ..ఇక్కడికి వచ్చి ఈ ఫ్యాక్టరీ పెట్టి అంతమంది కి ఉపాధి కల్పించే అవకాశం వచ్చింది..
నేను ఈ రోజు ఈ స్థాయి లో ఉన్నాను అంటే ఆయన నాకు చూపించిన మార్గమే... అనుకున్నాడు...
ఇండియా వచ్చిన తరువాత ఆ ఊరు వెళ్ళి.. కలుద్దామని ప్రయత్నాలు చేశాను.. కానీ ఆయన అప్పటికే రిటైర్ అయ్యి...వేరే ఊరు వెళ్లిపోయారని తెలిసింది...
ఎలాగైనా ఆ అడ్రెస్ పట్టుకోవాలని..ప్రయత్నాలు చేసినా దొరకలేదు...
తరువాత ఫేక్టరీ హడావిడి లో ఆ విషయం మరచి పోయాను...
మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన ఆచూకీ తెలిసింది...
ఒరేయ్ వినోద్ ఆ సుహాసిని ని ఒక సారి పిలిపించు...అన్నాడు..
సరే అంటూ ఇంటర్కం లో చెప్పాడు... తాను మళ్ళీ లోపలికి వచ్చింది..
రండి కూర్చోండి.. అన్నాడు విహారి.. రాఘవరావు గారు అంటే ..
విలేజ్ లో స్కూల్ హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు ఆయనే గా..అని అడిగాడు...
అవునండీ... మా నాన్నగారు మీకు తెలుసా...అని అడిగింది.
అవును బాగా తెలుసు... ఆయన
ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అని అడిగాడు...విహారి
ఈ ఊరిలో నే ఉంటున్నాం..అంది ...
ఒకప్పుడు నేను ఆయన స్టూడెంట్..అన్నాడు విహారి
వృధ్యాప్యం కదా ఇంట్లోనే
ఉంటు న్నారు.. అంది..
నన్ను గుర్తు పట్టారా అని అడిగాడు..
.క్షమించండి.. చాలామంది స్టూడెంట్స్ కదా .
గుర్తు పట్టలేక పోయాను...అంది..
నిజమే లెండి అది పాయింటే...అన్నాడు.
మా నాన్న గారు మీకు తెలుసు అంటున్నారు..
వీలుంటే ఈ ఉద్యోగం నాకు ఇప్పించండి... ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నాము...
అది మీకు నా qualification సరిపోతే... కొంచం ప్రాధాన్యం ఇమ్మని అడుగుతున్నా...
ఇలా అడగడం తప్పు అని తెలుసు...
కానీ పరిస్థితులు ...ఆడిగేలా చేశాయి..
కష్టపడి పనిచేస్తాను...అంది వినమ్రంగా...
అయ్యో అంతలా అడగాలా...
మీ నాన్న గారు మంచితనం,
నాకు తెలుసు... ఎంతో మందిలో స్ఫూర్తి నింపి అభివృద్ధి లోకి వచ్చేలా చేశారు..
అందులో నేనూ ఒకడిని...
ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు ప్రాధాన్యం ఇస్తాను... సరేనా ..
ఇంక మీరు వెళ్లొచ్చు...
మీ నాన్నగారి ని ఆడిగానని నమస్కారములు చెప్పు...
నేనె స్వయం గా వచ్చి కలుస్తానని చెప్పు అన్నాడు...
అలాగే అండి అంటూ..బైటకి వచ్చింది...
ఒరేయ్ వినోద్ ఆ అమ్మాయిని కార్ లో ఇంటిదగ్గర దిగపెట్టి రమ్మను మన డ్రైవర్ ని.
మనకి అడ్రెస్ తెలుస్తుంది అన్నాడు...
అలాగే కారులో ఉన్న ఫ్రూట్ బాస్కెట్ కూడా పంపు.. మాస్టారు గారికి... అన్నాడు విహారి.
అలాగే అంటూ బైటకి వచ్చి...
సుహాసిని గారు ఒక్క నిమిషం, 
నాతో రండి అంటూ తనతో తీసుకుని వెళ్ళాడు...
డ్రైవర్ ని పిలిచి అమ్మాయి గారి ని
వారి ఇంటి దగ్గర దిగపెట్టి రా...
కారులో ఫ్రూట్ బాస్కెట్ ఉంది ...
నువ్వే వాళ్ళ ఇంటిలో పెట్టి రా.
రేపు బాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి..అన్నారు.
ఇల్లు అడ్రస్ సరిగ్గా చూసి రా...
అని చెప్పాడు..
అలాగే సార్ అన్నాడు డ్రైవర్...
ఇప్పుడు ఎందుకు.. అండి నేను బస్ లో వెడతాను అంది...
అంత తెలిసిన వారైనా ,
ఆలోచించి అవకాశం ఉంటే ఇస్తాను అన్నాడు అంటే ..
ఈ ఉద్యోగం చాన్సు లు తక్కువే... అనుకుని
నిరాశ గా నాకు అలవాటే అండి ఎన్నో ఇంటర్వ్యూ లు చూస్తున్నా...పరవాలేదు బస్ లో వెళ్ళిపోతాను అంది..
మావాడి సంగతి మీకు పూర్తి గా తెలియదు...
చిన్నప్పుడు వాడితో కలిసి చదువుకున్నా అని ..
వాడి తో కలిసి తిరిగి ఫ్రెండ్ అయినందుకు... ఇండియా రాగానే నన్ను పిలిచి మరీ,
తన సెక్రెటరీ గా పెట్టుకున్నాడు..
అలాంటిది మిమ్మలిని వదిలేస్తాడా... నిజానికి
మేము మీ అడ్రెస్ గురించి చాల కాలం గా వెదుకుతున్నాం...కానీ దొరకలేదు..
అదృష్టం కొద్దీ ఇవాళ మీరే ఇంటర్వ్యూ కి వచ్చారు...
మా వాడు ఎవరి ని అంత తొందరగా మరచి పోడు అండి...
పైగా మాస్టర్ గారి అమ్మాయి ..మీరు... నిరాశ పడకండి..
అంతా మంచే జరుగుతుంది... అన్నాడు వినోద్.
రేపు మాస్టర్ గారిని కలవడానికి తన ప్రోగ్రాంలు అన్ని క్యాన్సల్ చేసేసాడు...తెలుసా అన్నాడు...
మరి ఈ పళ్ళు అవి అంది...
భలే వారే ఇది మా ఆచారం కాదండి...
మా  బాస్ ఆర్డర్..అన్నాడు..నవ్వుతూ...
కార్ వెళ్ళిపోయింది...
మళ్ళీ ఛాంబర్ లోకి వచ్చాడు...
ఇవాళ కొత్తగా కనిపిస్తున్నావ్..
ఎప్పుడూ ఇలా చేయలేదు నువ్వు...
ఏంటి బాస్ , ఏమిటి  విషయం...అన్నాడు...
అవును రా...ఇన్నాళ్లు వెతికినా దొరకలేదు ఆయన  అడ్రస్...
ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు దొరికింది ..
నేను వెతుకుతున్న మనిషి ఈయనే.. అన్నాడు..
ఎలాగైనా ఆయనని కలవాలనే నీ సంకల్పం ఆయన అడ్రస్ దొరికే లా చేసింది..
సరే మరి ఆ అమ్మాయికి అపోయింట్మెంట్ ఇచ్చేయనా.. అని అడిగాడు...
వద్దు... నేను చెపుతాను...
మిగతా ఇంటర్వ్యూ లు ఫినిష్ చేసి...
కావలిసిన వాళ్లకి లెటర్స్ తయారు చెయ్  అన్నాడు విహారి...
మరి ఆ అమ్మాయి అపోయింట్మెంట్ ఏమిటి చేద్దాం..అన్నాడు, వినోద్ .
రేపు ఫైనలైజ్ చేద్దాం..
ఇప్పుడు
నెక్స్ట్ అజండా లో కి వెళదాం అన్నాడు విహారి...
ఒకే...అంటూ కాన్ఫరెన్సు ఏర్పాట్లు చేయడానికి.. బైటకి వెళ్ళాడు...
 
విహారి కాస్త రిలాక్స్ గా చైర్ లో వెనక్కి వాలి..కళ్ళు మూసుకుని  గతం లోకి వెళ్ళాడు...
ఆ రోజుల్లో...ఎంత బాగుండేది ఈ అమ్మాయి..
కుందనపు బొమ్మ లా ,
అచ్చ తెలుగు ఆడపిల్ల లా తెలుగు తనం ఉట్టి పడుతూ.. చూసే వారు ఎవరికైనా గౌరవ భావం ఏర్పడేలా ఉండేది...
మృదు స్వభావం..
బాగా చదువుకునేది...
ఎంతైనా మాస్టారు అమ్మాయి కదా బాగానే చదువుతుంది లే అనుకునే వాళ్ళం..
క్లాస్ లో తానే ఫస్ట్.. కానీ...
ఎప్పుడూ ఆ అహం ఉండేది కాదు...
తన ప్రవర్తనకు ఇష్టపడని వాళ్ళు ఉండరు... అలాగే నాక్కూడా..తనంటే ఇష్టం ఏర్పడింది...
కానీ చదువు కునే వయసు కదా అప్పుడు ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు..
ఇప్పుడు స్థిర పడిన తరువాత..
మనసుకి అనిపిస్తోంది..ఆ ఇష్టం ..ఇష్టం మాత్రమే కాదు...ప్రేమిస్తున్నానేమో అని అవును
ఆ ఇష్టం ఇప్పుడు ప్రేమగా మారింది..
అది నా గుండెకు తెలిసింది..
కానీ నాకు తెలియలేదు...
తాను ఎవరో తెలియదు ముందు... కానీ  లోపలికి రాగానే .. తనని చూడగానే ఏదో ఉద్విగ్నత... ఒకరకమైన ఆనందం... మనసుకి ఏదో భావన... ఏర్పడ్డాయి...
ఇప్పుడు ఎవరో తెలిసిన తరువాత..
ఆ భావన బలపడింది...
అవును తనే నేను వెతుకుతున్న అమ్మాయి...
నా జీవిత భాగస్వామి...
కానీ నా ప్రపోజల్ కి తాను వప్పుకుంటుందా..
అసలే కష్టాలు అంటోంది..
భాద్యత ల మధ్య...ఇలాంటి విషయాలపై ప్రాధాన్యత ఇవ్వదు...
కానీ ఆ అమ్మాయి నా జీవిత భాగస్వామి అయితే ..
ఎంత అదృష్టం...
తనతో నా జీవితం సంతోషం గా ఉంటుంది ...
అయినా ఇప్పుడు ఎందుకు ఇలా ఉద్యోగానికి రావాల్సి వచ్చిందో... మరి ..
ఆయనికి ఒక కొడుకు ఉండాలి కదా..వాడేమి చేస్తున్నాడో...
తాను కూడా ఖాళీ గా ఉంటె తనకి ముందు జాబ్ ఇవ్వాలి...
అన్ని రేపు మాస్టారు గారి ఇంటికి వెళితే గాని తెలియదు...అనుకుంటూ ఉండగా ..
డోర్ తెరుచుకుని వినోద్ వచ్చాడు...
అంతా రెడి.. మీటింగ్ స్టార్ట్ చేయవచ్చు.. నీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు...
అంత వరకు కళ్ళు మూసుకుని ఉన్న విహారి,ఆలోచన లోనించి బైటకి వచ్చి,
ఒకసారి కళ్ళు తెరచి నవ్వుతూ పద అంటూ లేచాడు...
ఏంటి అన్నా... అంత దీర్ఘం గా ఆలోచిస్తున్నావు అంటే అది ఖచ్చితంగా ఆఫీస్ విషయం కాదు...
ఎందుకంటే
నువ్వు ఆఫీస్ కి సంబంధించిన ఎలాంటి నిర్ణయము అయినా ఇట్టే తీసుకుంటా వు..
నీ సామర్ధ్యం అలాంటిది.
ఇంతలా ఆలోచిస్తున్నావు అంటే...
ఇది ఖచ్చితంగా ఆ అమ్మాయి గురించే అయి ఉంటుంది...
నిజం చెప్పారా అన్నాడు..
నువ్వు నిజం గానే నా ఫ్రెండ్ వి రా...
నా మనసు ఇట్టే కనిపెట్టేస్తావు.
అవి అన్ని తరువాత మాట్లాడదాం...
అంటూ డోర్ హ్యాండిల్ మీద చేయి వేసాడు...
ఆగరా బాబు..
ఆ తలుపు దాటితే...నీలో బాస్ బైటకి వచ్చేస్తాడు....
ముందు చెప్పు.. నువ్వు ప్రేమించింది
ఆ అమ్మాయినే కదా...అన్నాడు...వినోద్..
అవును...ఈ విషయం నీతోనే మొదట చెప్పాను....ఎంతైనా ఫ్రెండ్ వి కదా ..ఈ విషయం లో నువ్వే హెల్ప్ చేయాలి... అన్నాడు...
కంగ్రాట్స్ రా ...తను నీకు కరెక్ట్ జోడి...
అందుకే నా ...సారు గారు
అపోయింట్మెంట్ లెటర్ ఆపుచేశారు... అన్నాడు వినోద్..
అవును కానీ తన మనసులో ఏముందో... తన పరిస్థితి ఏమిటో తెలియదు.. అడిగిన తరువాత కాదంటే ..మనసు కి బాధ గా ఉంటుంది... అందుకే ...ఆలోచిస్తున్నా..
ఆమె మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే..పెళ్లి....
లేక పోతే మన వేరే ఊరిలో ఉన్న బ్రాంచ్ కి మేనేజర్ గా వేసేయ్...ఇక్కడ చూస్తూ.. ఉండలేను.. అన్నాడు..విహారి
ఒరేయ్... నీ ఫ్రెండ్ ని నేను ఉండగా.. నీకు లోటు రానిస్తానా...
నీ పెళ్లి భాద్యత నాది.. ఇంకా ఆ విషయం నాకు వదిలేయ్...అన్నాడు...
సరే పద వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అంటూ మీటింగ్ హల్ కి బయలుదేరి వెళ్లారు.
*****
ఆ మరునాడు ఉదయం విహారి, వినోద్ మాస్టారు గారి ఇంటికి వెళ్లారు...బెల్ కోట్టగానే సుహాసిని ...తలుపు తీసింది.. గుడ్ మార్నింగ్ సుహాసిని గారూ...అంటూ పలకరించాడు వినోద్... రండి సర్ అంటూ లోపలికి ఆహ్వానించింది.. విహారి డ్రైవర్ కేసి తిరిగి చూసాడు... వెంటనే డ్రైవర్ ఫ్లవర్ బొకే తీసుకుని వచ్చి విహారి కి ఇచ్చాడు...అది తీసుకుని లోపలికి వచ్చారు.. మాస్టారు హాలులో పడక కుర్చీ లో కూర్చుని ఉన్నారు... నమస్తే మాస్టారు అంటూ .. బొకే ఇచ్చి, కాళ్ళకి దండం పెట్టాడు.
ఎవరు నాయనా నువ్వు... అంటూ అడిగారు కళ్ళజోడు సవరించు కుంటూ...
అదే నాన్నా నిన్న చెప్పాను కదా..
.నేనొక ఇంటర్వ్యూ కి వెళితే.. మీ స్టూడెంట్ అని చెప్పారు ఆయనే ఈ విహారి గారు...అంటూ పరిచయం చేసింది...
నేను మాస్టారు...మీ విహరిని...
నన్ను అమెరికా పై చదువులకు ఒప్పించి పంపించారు కదా...మీ మాట పై వెళ్ళాను...
బాగా చదువుకుని...ఇక్కడే ఫేక్టరీ పెట్టాను..
. మీరు ఆశీర్వదించి నట్లుగా ..
ఈ రోజు ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాను.... అన్నాడు విహారి...
ఆ ఆ...గుర్తుకు వచ్చావు...
వృధాప్యం కదా
వెంటనే గుర్తుకు రాలేదు.... చాలా సంతోషంగా ఉంది..నిన్ను చూస్తుంటే...
అమ్మాయి అబ్బాయి కి కాఫీ అది పట్టుకుని రా అన్నాడు...
ఆబ్బె ఇప్పుడు అవేమి వద్దండి...
ఇండియా కి రాగానే నేను మీ గురించి వాకబు చేశా...
కానీ అడ్రెస్  దొరకలేదు...
వీడు నా క్లాస్మేట్ వినోద్.. ఇప్పుడు నా దగ్గరే సెక్రెటరీ గా ఉంటున్నాడు... అంటూ పరిచయం చేశాడు...
నమస్తే సర్ అంటూ కాళ్ళకి దండం పెట్టాడు.... సంతోషంగా ఉండు నాయనా అంటూ ఆశీర్వదించారు... ఆ రోజు మీ మాటలు విన్నాను కాబట్టే ఈ రోజు ఈ స్థాయి లో ఉన్నాను అండి.. చాలా సంతోషం గా ఉంది మిమ్మలిని కలిసినందుకు అన్నాడు విహారి.
..మీ అమ్మగారు నాన్న గారు ఎలా ఉన్నారు... అన్నారు...బాగానే ఉన్నారు..
. వాళ్ళు వస్తామన్నారు... ముందు నేను కలిసి..
తరువాత తీసుకుని వస్తాను అన్నాను..
.తప్ప కుండా తీసుకుని రా బాబు.. అయినా
మీరు ఏంటి సర్ ఇక్కడ ఇలా ...
తాను ఉద్యోగానికి రావడం ఏమిటి...
మీకో అబ్బాయి ఉండాలి కదా
ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు... అన్నాడు..
.అదా ..అది అంతా ఓ పెద్దకధ...
ఇప్పుడు అదంతా ఎందుకు లే బాబు...అన్నారు..
.అన్నట్టు ఆంటీ ఎలా ఉన్నారు ఎక్కడ కనబడలేదు...అంటూ అడిగాడు విహారి..
. అదిగో అలా మంచం మీద ఉంది...అంటూమంచం మీద పడుకుని ఉన్న ఆవిడని చూపించారు..
అయ్యో అసలు ఏమి జరిగింది మాస్టారు...
మీరు చెప్పి తీరాల్సిందే అన్నాడు...
బైట ఎవరో వస్తే మాట్లాడటానికి వెళ్ళింది సుహాసిని..
వాడు కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు...
ఒరేయ్ ఎవరో చూడరా...అంటూ పంపించాడు...
వినోద్ కూడా బైటకి వెళ్ళాడు...
సుహాసిని గారు ఏమిటి సంగతి ..
ఎందుకు ఇతను గట్టిగా మాట్లాడుతున్నాడు..అంటూ వచ్చాడు..
అతను వినోద్ ని చూడగానే
వినోద్ భయ్యా మీరు ఏమిటి ఇక్కడ...అంటూ విష్ చేసాడు...
ఏమిటి నరసింగ్ ఇలా వచ్చావు..అన్నాడు...
.ఏమి లేదు సర్..
.ఈ ఇంటిమీద అప్పు చేశారు...
వడ్డీ కూడా కట్టట్లేదు....
ఇలాగ అయితే ఇల్లు వేలం వేయాల్సి వస్తుంది అంటూ చెవుతుంటే అర్థం చేసుకోవట్లేదు...
.కొంచెం టైం కొంచెం టైం అంటూ గడిపేస్తున్నారు...అన్నాడు నరసింగ్.
వీళ్ళు మా అతిధులు...వాళ్ళ ముందర అల్లరి చేయద్దు...ప్లీస్..అన్నా ,
మనం మళ్ళీ మాట్లాడుకుందాం , ప్రస్తుతం దయచేసి ఇక్కడి నుంచి వెళ్లి పోండి అంటూ ప్రాధేయ పడింది...
సుహాసిని గారు..ఇతను మాకు తెలిసిన వాడే...
నేను మాట్లాడి  టైం ఇప్పిస్తా...
ముందు  మీరు లోపలికి వెళ్ళండి...
అంతా ..నేను చూసుకుంటాను ...అన్నాడు...వినోద్
అదికాదండి..అంటూ ఏదో అన బోతుంటే...
ముందు మీరు లోపలికి వెళ్ళండి అంటూ
లోపలికి పంపించాడు.
లోపల విహారి ఉన్నాడు... అన్నాడు...
విహారి అన్న వచ్చాడా...
మరి చెప్పవే ....నేను పోయి మళ్ళీ వస్తా...అన్నాడు నరసింగ్...
వీళ్ళు ...తనకి బాగా కావలిసిన వాళ్ళు..
నువ్వు మళ్ళీ ఇక్కడి కి రావద్దు..
ఎంత ఇవ్వాలో మొత్తం అన్న సెటిల్ చేస్తాడు...
నువ్వు ఆఫీస్ కి వచ్చి నన్ను కలు.. సరేనా...నువ్వు మళ్ళీ కాగితాలు ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి వస్తావు... అర్థం అయ్యిందా... అన్నాడు గట్టిగా..
మీ వాళ్ళని...తెలియక గట్టి గా మాట్లాడాను...
భయ్యా ని మన్నించమని ఆడిగానని చెప్పు...
మరి నే పోతున్నా..
అరె బండి తీయరా బయ్...అంటూ వెళ్లిపోయారు...
వినోద్ లోపలికి వచ్చాడు.... ఎవరు రా అది అని అడిగాడు విహారి...
ఆ నర్సింగ్ గాడు...
లోపల నువ్వు ఉన్నావని చెప్పాను...అంతే .
.సారి చెప్పి వెళ్ళిపోయాడు..అన్నాడు వినోద్...
ఏమంటాడు...అని అడిగాడు విహారి.
ఈ ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు ట...
అందుకే ఏరియా బాగుంది కదా అని
అడిగే వాళ్ళు లేరు అని ఎలాగైనా లాగేసుకుందామని...చూస్తున్నాడు... అన్నాడు... వినోద్
అసలు ఏమైంది మాస్టారు..ఇప్పటికైనా చెప్పండి అన్నాడు...
నేను చెపుతా అంటూ సుహాసిని... మొదలు పెట్టింది...
అన్నయ్య  అమెరికా వెళ్లి చదువుకోవడం  కోసం ,అప్పు చేయాల్సి వచ్చింది..
అక్కడ చదువు అయ్యాక , అక్కడే జాబ్ లో జాయిన్ అయ్యాడు...
మొదట్లో కొన్నాళ్ళు డబ్బు పంపించేవాడు... తరువాత అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని , ఒకరోజు ఫోటోలు పంపించాడు...
పెళ్లి పెద్దవాళ్ళకి చెప్పి చేసుకో వచ్చు కదా...ఎందుకు ఇలా చేశావ్ , నీకో చెల్లెలు ఉంది కదా , దానికి పెళ్లి ఎలా అవుతుంది... కొంచెం అయినా ఆలోచించక్కరలేదా...
అని నిలదీసి అడిగారు ఫోన్ లో ..
నా జీవితం నా ఇష్టం అంటూ , ఫోన్ పెట్టేసాడు....
అంతే ఆ తరువాత మళ్ళీ కాంటాక్ట్ చేయలేదు...
వాడి మీద బెంగ తో అమ్మ మంచం పట్టింది...
వాడు ఇక్కడికి రాకుండా ఉండడానికి ఏదో వంక పెట్టి మాయమై పోయాడు..
వీళ్లకి అది అర్థం కాదు ఏదో ఒకరోజు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది..వైద్యం చేయిస్తున్నాం.కానీ ఫలితం లేదు.... మందులు శరీరానికి పనికి వస్తాయి కానీ ,మనసు కి కాదుగా...ఆలోచనలు పెట్టుకోవద్దు అంటే వినదు...బెంగతో మందులు కూడా సరిగ్గా ప్రభావం చూపట్లేదు...
..ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఇంట్లో తిరుగుతోంది.... అంది బాధగా...
పాపం ఆడపిల్ల , దాని రెక్కల కష్టం మీద ఆధారపడి బ్రతుకుతున్నాం.... అన్నారు మాస్టారు..
అలా అనొద్దని ఎన్ని సార్లు చెప్పాను...నాన్నా,
వాడు కొడుకు, నేను కూతురు అంతే తేడా..
ఇద్దరం మీ పిల్లలమే బాధ్యత లు సమానం గానే పంచుకుంటాం...
నేనూ చదువుకున్నాను గా...ఉద్యోగం చేస్తున్నాను.ఇంతకు ముందు ఆఫీస్ లో ఆ మేనేజర్ ప్రవర్తన బాగుండక ,
రాజీపడలేక రాజీనామా చేయాల్సి వచ్చింది...
దేశం గొడ్డు పోలేదు ..
ఇది కాకపోతే ఇంకొకటి...
కాకపోతే టైం పడుతుంది...
ఈ లోగా భరించాలి తప్పదు గా అంది సుహాసిని...
మీ మానసిక దేర్యము కి అభినందించకుండా ఉండలేక పోతున్నా....అన్నాడు విహారి..
జీవితమే అన్ని నేర్పిస్తుంది అంది వైరాగ్యం గా నవ్వుతూ....
ఎన్నాళ్ళు అని  కష్ట పడుతుంది ...
దీనిని ఒక అయ్య చేతిలో పెట్టాలి కదా...
మేము పెద్ద వాళ్ళము అయ్యాము...
పాపం కుటుంబ భారం అంతా ఇదే మొస్తోంది అన్నారు మాస్టారు...
కనీసం అప్పు అయినా తీర్చేయరా అంటే,నన్ను కన్నారు గాబట్టి  చదివించాల్సిన బాధ్యత మీదే కదా ..అందుకే .చదివించారు..అంటాడు
.ఇంగ్లీష్ పిల్లని చేసుకున్నానని  నన్ను  కాదన్నది మీరు...
నేనేమి చేయను... అంటూ వాదిస్తాడు
ఇక ఏమనాలి వాడిని .
ఒకపక్క కుటుంబం గడవాలి..
మరో పక్క వాడికోసం చేసిన అప్పు తీర్చాలి...
వచ్చిన కాస్తో కూస్తో కుటుంబ అవసరాలకే సరిపోతుంది...
పైగా దీని వైద్యం..
వాడి గురించి ఆలోచించకే అంటే వినదు...అంటూ నిట్టూర్చారు మాస్టారు...
నిజానికి ఇండియా రాగానే మిమ్మలిని కలిసే ప్రయత్నం చేశాను...
కానీ మీ ఆచూకీ తెలియలేదు...
ఎక్కడి కి వెళ్లిపోయారో తెలియదు..
. లేకపోతే ఇంత దూరం రానిచ్చే వాడిని కాదు...
మీ వాడిని నాలుగు పీకి ఇక్కడికి రప్పించేయానా...అన్నాడు..
వద్దులే బాబు...వాడి పాపాన వాడే పోతాడు...
వాడికి మనసులో మా మీద ప్రేమ ఉండాలి గాని..
కొడితే నో తిడితే నో పుట్టదు...
మా తల రాత ఇంతే
అనుకుంటాము...
మమ్మలిని " వాడు  " కాదనుకుంటున్నాడు..
కానీ మేము కాదుగా..
వాడి సంగతి వదిలేయ్ బాబు ,
ఎంతైనా కొడుకే కదా అన్నారు మాస్టారు....
అది రా అమ్మ ,నాన్న అంటే...ప్రేమకి ,త్యాగానికి ప్రతిరూపాలు... ఆ మూర్ఖుడికి వీళ్ళ విలువ తెలియట్లేదు...  అన్నాడు.. వినోద్
విహారి కి కోపం వచ్చే సింది...
ఒరేయ్ వినోద్ నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు...
ఆ నర్సింగ్ గాడు వీళ్ల ఇంటి పేపర్ లతో అరగంటలో ఇక్కడ ఉండాలి...అన్నాడు..
ఇదిగో పావు గంట లో ఇక్కడ ఉంటాడు... అంటూ ఫోన్ చేయడానికి బైటకి వచ్చాడు.
నర్సింగ్ కి ఫోన్ చేసాడు..
అన్న నీమీద బాగా కోపం గా ఉన్నాడు..
అది కాదు భాయ్..మీ వాళ్ళు అని తెలియక రుబాబ్ చేసినా...
అయినా వచ్చేసా గా ...
నేనేమి పెద్దగా ఏమి అనలేదు భయ్యా...
ఆ పక్క ఇంట్లో ఓ పొట్టోడు ఉన్నాడు..
వాడు జరంత ఎక్కువే చేసిండు... అన్నాడు...
నువ్వు ఈ ఇంటి కాగితాలు పట్టుకుని,
పది నిమిషాలలో ఇక్కడ ఉండాలి అన్నాడు అన్న...
"లేకపోతే " ...
వద్దు పూర్తి చేయద్దు...
ఆ మాత్రం టైం చాలు...
..నేను ఐదు నిమిషాలు లో నీ ముంగిట ఉంటాను..అన్నాడు..
సర్ మని జీప్ వచ్చి ఆగింది... అందు లోనించి కాగితాలు పట్టుకుని నర్సింగ్,  ఇంకా నలుగురు రౌడీ లు దిగారు...
పక్కింటి గోడ మీదనుంచి,
వీళ్ళు మళ్ళీ వచ్చారు ఏమిటి...
ఈ సారి ఖాళీ చేయించడం ఖాయం అనుకున్నాడు..
ఏమిటండి మళ్ళీ వచ్చారు..
ఖాళీ చేయిస్తే వెంటనే చేయించేయండి.. నుసెన్సు తట్టుకోలేక పోతున్నాం...
ఇలా రౌడీ లు, గుండాలు అస్తమాను వచ్చిపోతుంటే...
మాకు పరువు తక్కువగా నూ, నుసెన్సు గాను ఉంది అన్నాడు...
అసలు ఈ పొట్టోని మూలం గా కదూ.. మాటర్ అన్న దాకా పోయింది...
ఒరేయ్ ఆడిని ఎత్తుకు రారా....
నా చేతిలో అయిపోయాడు... ఇవాళ అంటూ..పురమా ఇంచి...
గబ గబా పేపర్ లు తీసుకుని వెళ్లి విహారి చేతిలో పెట్టాడు..
చేతులు కట్టుకుని నుంచున్నాడు...
ఇంతలో బ్రహ్మి ని కూడా తీసుకుని వచ్చారు ..నర్సింగ్ మనుషులు...
అక్కడ చేతులు కట్టుకుని నుంచున్నారు... అందరూ...
మాఫ్ కర్ నా భాయ్... తెలియ క జరిగిన పొరపాటు.... అన్నాడు..
నాకు కాదు మాష్టారి చేతి లో పెట్టు... అన్నాడు విహారి...
కాగితాలు మాస్టారు చేతిలో పెట్టి...
సార్ ఇవిగో మీ పేపర్లు...
మీ అప్పు మొత్తం మాఫ్ చేసిన...
అంటూ ఆయన చేతిలో పెట్టాడు...
పరవాలేదు బాబు ,ఎలాగో అలా మీ అప్పు తీర్చేస్తాము...కొంచెం టైంఇవ్వు చాలు అన్నారు మాస్టారు...
అదేం లేదు సార్ అన్న చెప్పినాక , నేను మళ్ళీ ఈ చుట్టుపక్కలకి కూడా రాను... మీరు కంగారు పడకండి... చుడు చెల్లెమ్మా , నా ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంది గా ...నీకు ఏదైనా సమస్య వస్తే నాకు ఫోన్ చెయ్...నేను చూసుకుంటా....అన్నాడు నర్సింగ్...
మరి నేను పోయి రానా విహారి భాయ్ అన్నాడు....
ఏంటి బెదిరిస్తున్నవట...
అంటే అడిగే వాళ్ళు లేరు అనా...
ఏదో అప్పిచ్చి ...ఇల్లు లాగేసుకుందామనా...అని అడిగాడు కోపం గా...
ఆబ్బె అలాంటి ది ఏమి లేదు అన్నా...
నేను కేవలం అప్పు ఎప్పుడు తీరుస్తారని మాత్రమే అడిగా...
ఇదిగో ఈ పొట్టోడు..
తెగ రెచ్చి పోయాడు... అంటూ
డిప్ప మీద ఒక్కటిచ్చాడు...
ఏంటండి కొడతారేమి టి.. అయాం ఫ్రమ్
డీసెంట్ ఫామిలీ... తెలుసా ..
మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి చెత్త నాయాల...
అంటూ మళ్ళీ పీకాడు...
అసలు ఇది అంతా నీ మూలం గా కాదూ.. అస్తమాను అప్పుల వాళ్ళు వస్తే మీ పరువు పోతోంది.. అంటూ రెచ్చి పోయావ్.
.పైగా కత్తి చూపించాడు సర్...అన్నాడు...
ఒరేయ్ పొట్టి...
ఇలా రా రా, అని గట్టి గాపిలిచాడు ..విహారి..
ఏమిటి నన్ను " రా " నా...నన్ను అంటూ అడిగాడు...
అవును రా నిన్నే ఇలాగ రారా అన్నాడు విహారి.....
అరే ఎల్లు బే అంటూ ముందుకి తోసాడు నర్సింగ్......
ఆ ఎలతామండి... తోస్తారేమిటి....రెస్పెక్ట్ లేకుండా...
ఎందుకండి దగ్గరకి పిలిచారు... కొట్టరు..కదా అని అడిగాడు భయం భయం గా...లాగి లెంపకాయ కొట్టాడు విహారి... చెంప మీద వేలి ముద్రలు పడ్డాయి....
చెంప రాసుకుంటూ...
ఎందుకు లెండి ఇక్కడి నుంచే మాట్లాడతా...అన్నాడు....
రమ్మన గానే రాక పోతే ఇంకా గట్టిగా కొడతాను...తరువాత నీ ఇష్టం అన్నాడు విహారి....
పర్లేదు సర్...అన్నాడు బ్రహ్మి..
పర్లేదు ఏంట్రా...నేను ఏమైనా నీకు సారి చెపుతున్నానా...అన్నాడు..
రా ఇలాగ అంటూ అరిచాడు....
భయపడుతూ దగ్గరికి... వచ్చాడు... లాగి లెంపకాయ ఇచ్చాడు.. గబ గుయ్ మంది.. రమ్మంటే రావేంట్రా... నీ లెవెల్ కి ,
నేనే  , నీ దగ్గరకి  వచ్చి కొట్టాలా...అంటూ ఇంకోటి..పికాడు.. సార్ బుగ్గలు వాచిపోతున్నాయి ...ఇంక ఆపమని చెప్పండి సార్... అంటూ బ్రతిమాలాడు. మాస్టారిని...
ఆడ పిల్ల కష్టాలలో ఉంది... వీలైతే సాయం చేయాలి కానీ , రాళ్లు వేస్తావు రా..అసలు మనిషి వేనా నువ్వు.. అయినా
ఏంటి రా కత్తి చూపిస్తున్నవట..
అంత మొగోడి వా అన్నాడు విహారి...
ఆబ్బె అదేం లేదు సార్....ఇంట్లో కూరలు తరుగుతూ...
ఏదో శబ్దం వస్తే అలాగే వచ్చేసా....వీళ్ళేమో బెదిరించానని అనుకున్నారు... అంతే సార్...
అయిన నేను వంట చేసుకోవాలి....
వస్తా సార్...అంటూ బయలుదేరబోయాడు..
ఆగు...ఈ  వంట ,
ఏమిటి రా అన్నాడు...
ఆదా ఒకసారి మా బాస్ విషయంలో
ఇలాగే కొంచెం కల్పించు కున్నాను...
వాడు... ఉద్యోగం లోనించి పీకేశాడు... అప్పటి నుంచి మా ఆవిడ ఆఫీస్ కి , నేను వంటకి...ఫిక్స్ అయిపోయాం...అన్నాడు మూసి మూసి గా నవ్వుతూ....
నీకు నోటి దూల బాగా ఎక్కువ రోయ్... అన్నాడు వినోద్...
ఏదో మీదయ అన్నాడు బ్రహ్మి..
ఈడు మారడు...అంటూ ఒకటి పీకాడు వినోద్...
నర్సింగ్ ఇంక నువ్వు  వెళ్ళు... నీ కాంటాక్ట్ సంగతి నేను చూసుకుంటాను....అన్నాడు విహారి...
థాంక్స్ అన్నా... అంటూ బయలుదేరి వెళ్లి పోయాడు...
మరి నేనూ వస్తా ను సర్... అంటూ బయలుదేరబోయాడు బ్రహ్మి... నువ్వు ఎక్కడికి ...నీతో పని ఉంది... ఆగు..
అన్నాడు...
నాతో పనులు ఏముంటాయి సార్...ఏదో కూరలు తరుక్కోవడం....వంట చేసుకోవడం...తప్ప అన్నాడు
ఆ అదే చేద్దువు గాని.... రోజు ఉదయం సాయంత్రం ఇక్కడికి వచ్చి కూరలు తరిగేసి వెళ్ళిపో...సరేనా..నెల పాటు.. అదే నేను నీకు వేసిన శిక్ష... అన్నాడు....
శిక్ష లు ఏమిటండి ...మీరేమయినా జడ్జి ఆ..శిక్ష లు వేయడానికి... అన్నాడు...
మళ్ళీ లెంపకాయ ఇచ్చాడు...విహారి..
చ్ఛి... దీనమ్మ బ్రతుకు... తబల కన్నా దారుణమైపోయింది...నా ఫెస్..అంటూ గోనిగాడు...
ఏంట్రా అన్నావు..అన్నాడు...
ఆబ్బె ఏమి లేదండి.... నాకు అలవాటైన పనిని శిక్ష గా వేశారు... అంటున్నా...
ఎల్లుండి నుంచి వచ్చి చేస్తా మంచి రోజు..రేపు నాకు కొంచెం పని ఉంది... అన్నాడు బ్రహ్మీ..
ఇవాళ కూడా మంచిదే అన్నాడు..విహారి
ఓహో ...
ఇవాళ కూడా మంచిదే ట... కాలండర్ కూడా చూసేసారన్న మాట...అన్నాడు..
ఈ మాత్రం దానికి కెలండర్ ఎందుకు.. నువ్వే చెప్పావు గా ఎల్లుండి మంచిది అని... రేపు తీసేస్తే..ఇవాళ మంచిదే గా...అన్నాడు విహారి..
అదికూడా నేనె చెప్పానా ..నా గొయ్యి నేనె తవ్వుకున్నా అన్నమాట....సరే.. ఆ కత్తి పీట ఇలా పారేయండి... అన్నాడు బ్రహ్మి
ఏ నీదగ్గర కత్తి ఉంది గా ...దానితో కానియ్...అన్నాడు
మరి కూరలు అన్నాడు....అవి కూడా నువ్వే తీసుకుని రావాలి....
నీ డబ్బుతో....అన్నాడు..ఇంకా చూస్తావేమి....పో బయలు దేరు అన్నాడు...విహారి...
బ్రహ్మి బయలు దేరి వెళ్ళిపోయాడు...
*******
ఇంక అసలు విషయానికి వద్దాం... అంటూ మొదలు పెట్టాడు విహారి...
నేను చిన్నప్పటి నుంచి మీ అమ్మాయి అంటే ఇష్టం... ఆఫ్ కోర్సు అందరి తో స్నేహం గా ఉంటూ...బాగా చదువుకునే ఆ అమ్మాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదు....
ఆ ఇష్టమే ఇప్పుడు పెద్ద అయ్యాక ...ప్రేమ గా మారింది అని తెలుసుకున్నాను...
తాను నా జీవిత భాగస్వామి అయితే ...
నా లైఫ్ హ్యాపీగా గడిచి పోతుంది అని
నా నమ్మకం....
ఆ విషయం మొదట మీకే చెపుతున్నాను..
ఇంకా తనకి ఆ విషయం తెలియదు...
తీరా అడుగుదామని వస్తే...
ఇక్కడి పరిస్థితులు అర్థం అయ్యాయి...
ఒక్క విషయం మనస్ఫూర్తిగా చెపుతున్నా...
మీ పరిస్థితులు కి జాలి పడో,
లేక మీ మీద గౌరవం తో నో ఈ మాట అడగట్లేదు... తన మీద ఉన్న ప్రేమతో మిమ్మలిని తనని నాకిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాను ..
.మీ అభిప్రాయం చెప్పండి సార్..అన్నాడు విహారి...
అమ్మాయి కి ఎలాగూ పెళ్లి చేయాలి...
తనని ఇష్టపడే వాడు అయితే సుఖపడుతుంది అని నా నమ్మకం..
కానీ మీ అంతస్థు కి మేము తగమేమో బాబు అన్నారు...
ప్రేమ ముందు డబ్బుకు విలువ ఉండదు మాస్టారు... మీరు ఒప్పుకుంటారన్న నమ్మకం తో నే వచ్చాను...
అదీ మీ అమ్మాయి మనస్ఫూర్తిగా ఇష్ట పడితేనే... ఇంకో విషయం..నేనేదో సహాయం చేశానని కృతజ్ఞతతో ఒప్పుకోవద్దు....
నా ప్రేమను అర్థం చేసుకుని ఒప్పుకో మని అడుగుతున్నాను...
నువ్వు మొదటి నుంచి నాకు తెలుసు...
నాకేమి అభ్యంతరం లేదు...
మరి నీకో అంటూ వాళ్ళ ఆవిడ వైపుకి చూసారు... ఆవిడ కళ్ల లో ఆనందం కనిపిస్తోంది.
. ఒప్పుకో మని సైగ చేసింది..అమ్మా సుహాసిని
అమ్మ కూడా ఒప్పుకుంది...
మరి నీ అభిప్రాయం కూడా చెపితే బాగుంటుంది అన్నారు...
నా కీ పెళ్లి ఇష్టం లేదు నాన్న గారు...
ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్లి పోతే ..
.మిమ్మలిని ఎవరు చూస్తారు... అంది..
మా సంగతి సరే ముందు నీ జీవితం ఒడ్డున పడాలి కదా తల్లి...
మాకు వచ్చే వయసే కానీ తగ్గేది కాదు...
వాడి దారి వాడేలాగు తీసుకున్నాడు...
కనీసం నీ బాధ్యత అయినా తీర్చుకోవాలి గా...అన్నారు...
ఆయన మీ నాన్న గారు అయితే..
నాకు గురువు గారు..
ఆయన్ని ఎలా వదిలేస్తా అనుకున్నారు...
వాళ్ల బాధ్యత కూడా మనదే అవుతుంది.
.. ఇంకా మీకు మొహమాటం అయితే.
..మీకు ఎలాగూ జాబ్ వస్తుంది కదా.
..పెళ్లి అయిన తరువాత..
ఎలాగూ ఆఫీస్ కి వస్తారు.
. ఆ జీతం వాళ్ళ కోసం ఇచ్చేయండి... అన్నాడు విహారి..
ఎందుకో ..మీకు నామీద ప్రేమ కన్నా..మా కుటుంబం పట్ల జాలి ఎక్కువగా కనిపిస్తోంది.. అందుకే  ఒప్పుకో లేక పోతున్నాను.
క్షమించండి అంది...
ఇప్పుడు నా ప్రేమ ని రుజువు చేసుకోవడం ఎలా...
ఇప్పటికిప్పుడు నేనేమి చేయలేను...
మీరు నమ్మితే నమ్మండి... లేదంటే ...లేదు...
ఇదిగో మీ అపోయింట్మెంట్ లెటర్...
మా వేరే ఊరిలో బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ నెలకి 50,000 శాలరీ...కోర్టర్స్ అన్ని ఇస్తాం..
వెళ్లి జాయిన్ అవ్వండి..
ఇంక నేను చేసేది ఏముంది...
.బాగా ఆలోచించి చెప్పండి..
ఈ పెళ్లి ఇష్టమైతే...ఆ కవర్ చింపేయండి.. లేదంటే ...ఆ ఊరు వెళ్లి జాయిన్ అవ్వండి...
.మరి నేను వస్తాను మాస్టారు అంటూ లేచి నమస్కారం పెట్టాడు...
లోపల కోపం బాధ అన్నీ కలబోసి ...ఒకరకమైన ..చిరాకు వచ్చేసింది
విహారి కి...
అరే ఇలాగ అనేసింది ఏమిటి.. అనుకుంటూ ఇప్పుడు ఏమి చేయాలి అంటూ సందిగ్దత లో ఉండి పోయాడు వినోద్...
తనంతట తాను నమ్మితే గాని ఈ పెళ్లి కి వప్పుకోదు...
ఇప్పుడు ఎలాగబ్బా అంటూ ఆలోచిస్తున్నాడు... పద రా ఇంకా ఇక్కడ ఉండి ఏమి చేస్తాం... అంటూ గుమ్మం దాకా వెళ్ళివెనక్కి తిరిగి చూసాడు... మనసు మార్చుకుంటుందేమో అన్న ఆశతో... వినోద్ ఇంకా అక్కడే కూర్చుని ఉన్నాడు...
ఆమె లో ఏ మార్పు కనబడలేదు...హు అనుకుంటూ...
జేబు లోంచి తన పర్సు తీసి వినోద్ కి ఇచ్చి...
అడ్వాన్స్ ఎంత కావాలో ఇచ్చేసి రా...
మళ్ళీ నన్ను కలవద్దని...చెప్పు...
ఇక్కడ నుంచే ఆ ఊరు వెళ్లి పొమ్మని చెప్పు ...అంటూ పర్సు వినోద్ చేతిలో పెట్టి బయటికి వెళ్లి పోయాడు విహారి...
పర్స్ చూడగానే తనకి గుర్తుకు వచ్చింది.. 
విహారి పర్సు లో చిన్నప్పటి ఫ్రెండ్స్ ఫోటో ఉంటుంది....
తనకి ఒకసారి ...చూపించాడు విహారి...
అందులో ముఖ్య స్నేహితులతో పాటు ఈ అమ్మాయి కూడా ఉంది..
.ఐడియా వచ్చేసింది...
సుహాసిని గారు కొంచెం మంచినీళ్లు ఇస్తారా తాగేసి వెడతా అన్నాడు..వినోద్..
అలాగే అండి అంటూ కిచెన్ లోకి వెళ్ళింది... వెంటనే పర్సు లోనించి...ఫోటో తీసి.... అక్కడ టేబుల్ పైన ఉన్న రెడ్ స్కెచ్ పెన్ తో ఆ అమ్మాయి ఫేస్ మీద లవ్ సింబల్ హార్ట్ బొమ్మ గిసేశాడు...
మళ్ళీ పెన్ అక్కడ పెట్టేసాడు..
ఇంతలో మంచి నీళ్ళు తీసుకుని వచ్చింది.. సుహాసిని..
ఆ నీళ్లు తాగేసి ఇంక వస్తానండి అంటూ ఇదిగో అండి అడ్వాన్స్ ..అంటూ కాష్ తీసాడు వినోద్... అలా కాష్ తీస్తూ ఫోటో కింద పడేసాడు....
కింద పడ్డ ఫోటో ని సుహాసిని తీసింది...
అందులో తన ఫోటో ఉండడం..దాని మీద లవ్ సింబల్ చూసింది..
ఆ ఫోటో ఇవ్వండి సుహాసిని గారు...
అది వాడు ఎప్పటి నుంచో పర్స్ లో ఉంచుకున్నాడు...
ఇదిగో ఈ సింబల్ చూసారా...
వాడు చిన్నప్పటి నుండి మిమ్మలిని ఇష్టపడుతున్నాడు....
మీ పరిస్థితులు చూసి కాదు అని....
వస్తానండి మరి అంటూ...ఆ అమ్మాయి చేతిలో పర్సు వదిలేసి బైటకి వచ్చేసాడు..
వీడు ఇంకా రాడేమి టి అంటూ విసుగు గా కార్ దగ్గర నుంచున్నాడు.. విహారి, 
బైటకి వస్తూ లోపలికి చూసాడు వినోద్
తన ప్లాన్ ఏమైందో అని..
ఆమె అపోయింట్మెంట్ లెటర్ చింపేస్తోంది..
హమ్మయ్య అనుకుని .
కొంచెం నెమ్మది గా  కార్ దగ్గరకి నడుస్తున్నాడు... ఇంతలో.. సుహాసిని వెనుక నుండి పరిగెత్తు కుంటూ వచ్చి విహారి ని కౌగలించుకొని..
మీ పర్సు లో ఉన్న ఈ ఫోటో సాక్షి....
నమ్ముతున్నాను అండి...మీరు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారని...
నాకు మిమ్మలిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే..
నాకు మీరు అంటే ప్రేమే..
కానీ మీరు కాదంటే లోకువ అయిపోతాను అని బైట పడలేదు...
తరువాత భాద్యత లు నా నోరు కట్టేసాయి..
అంది ఆర్తిగా...
అనందం లో పొంగి పోయాడు..
.తన ఫోటో లో లవ్ సింబల్ ఎలా వచ్చింది అబ్బా అనుకుంటూ...
ఆమె కౌగిలి లోనించి.. వినోద్ వైపు చూసాడు...
వినోద్ కన్ను గీటి...బొటన వేలు చూపించాడు...
ఓహో ఇది నీ పనా....థాంక్స్ రా అంటూ కృతజ్ఞతతో చూసాడు వినోద్ వైపు.....
అలా ఆ ప్రేమ కథ పెళ్లి పీట ల వైపు ...ప్రయాణం సాగించింది.....
శుభం..
( కధ, కధనం ,పేర్లు, పాత్రలు కేవలం కల్పితం... ఎవరిని ఉద్దేశించి నది కాదు...)

ఆమె ఎవరు ? ...కధ

 

ఆమె ఎవరు ?


ఆమె ఎవరు ?

భోజనాలు వడ్డించేసాను రండి అందరూ అంటూ పిలిచింది తులసి.
వస్తున్నాం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు నరేష్, కూతురు అను.
నరేష్ బాంక్ లో మేనేజర్ .
ఒక కొడుకు, కూతురు.
ఇద్దరు ఇంజినీరింగ్ చదువుతున్నారు. కొడుకు ఫైనల్ ఇయర్ కూతురు ఫస్ట్ ఇయర్. చాలా సరదా అయిన కుటుంబం.
ఎక్కడ నీ పుత్ర రత్నం ఇంకా కొంప చేరలేదా అంటూ అడిగాడు నరేష్.
మీరు మరీనూ ఏదో కంబైన్డ్ స్టడీస్ అంటూ వెళ్ళాడు వచ్చేస్తాడు అంది తులసి.
ఆ ఆ ఇలా గారం చేసే వాడిని అడ్డగాడిద లా చేసావు .
వాడొచ్చేసరికి ఎంతవు తుందో .
ఏమే నీకు ఏమైనా చెప్పాడా అని అడిగాడు ఏమో నాకు చెప్ప లేదు నాన్నా అంది అమాయకంగా అను .
ఆహా ఏం నటిస్తున్నావే,
ఉట్టి అప్పుడు కొట్టుకు చచ్చిపోతూ వుంటారు.
ఇలాంటప్పుడు ఐకమత్యం పెరిగిపోతూ ఉంటుంది.
ఇద్దరికిద్దరూ తోడుదొంగలే,
నువ్వు వడ్డించు , వాడు వస్తాడు లే అంటూ కూర్చున్నాడు నరేష్.
వడ్డిస్తుంటే వచ్చాడు విజయ్ .
తొందరగా కాళ్ళు కడుక్కుని రారా నీకూ వడ్డించే స్తాను అంది.
సరే అమ్మ ఆంటూ లోపలికి వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చాడు .
ఇంత ఆలస్యమైంది ఏంట్రా అని అడిగాడు నరేష్ .
రికార్డ్ వర్క్ ఉంది , నా దగ్గర మెటీరియల్ లేదు , అందుకే ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి రాసుకు వస్తున్నాను అన్నాడు .
సరే కానివ్వండి నువ్వు కూర్చో వే ,
అందరం వడ్డించేసుకుందాము అన్నాడు నరేష్ .
ఉండండి అన్నీ సర్దుతున్నానుగా... ఒక్కొక్కటే తేవాలి..
మీ గారాల కూతురు ఒక్క పనికి సాయం రాదు... అంది...
అమ్మా...అంటూ నీలిగింది అను...
పోనీ లేవే చేస్తుంది లే రేపటి నుంచి... అన్నాడు నరేష్...
అలాగే నాన్నా అంది... అను
చూసావా ఎంత బుద్ధి మంతురాలో, చెప్పగానే ఒప్పేసు కుంది... అన్నాడు నవ్వుతూ...
ఇలా ఎన్ని సార్లు అయ్యింది..
ప్రతీసారి రేపటి నుంచి అంటూనే ఉంటుంది...అంది తులసి..
భోజనాలు చేస్తూ ఏరా అబ్బాయి ఎలా సాగుతోంది నీ చదువు అంటూ అడిగాడు నరేష్ .
బాగానేసాగుతోంది నాన్నా ,
ఈ ఏడాది తో అయిపోతే క్యాంపస్ సెలక్షన్ లో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాను అన్నాడు విజయ్ .
ఏమిటి తండ్రి కొడుకుల గుసగుసలు అంటూ వచ్చింది , వేడివేడి చారు గిన్నె టేబుల్ మీద పెడుతూ.
ఆ ఏమీలేదు ఈఏడాదితో వీడి చదువు అయిపోతోంది కదా వీడికి పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాను ,
అదే అడుగుతున్నాను అంటూ నవ్వాడు . వీడికి అప్పుడే పెళ్లి ఏమిటి ఇంకా ఉద్యోగం కూడా లేదు . ఏరా నాకు తెలియకుండా ఏదయినా గూడు పుటా ని చేస్తున్నారా అంది .
అదేం లేదు అమ్మా , నాన్న అంతే ఎప్పుడు జోక్స్ వేస్తూ వుంటారు అన్నాడు.
వారం అంతా మీకు కాలేజీ లతో , నాకు బేంక్ తో సరిపోతుంది , కనీసం ఆదివారమైనా అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పానా, ఎన్నిపనులున్నా ఆది వారం పెట్టుకోకండి రా అన్నాడు నరేష్ .
సరే నాన్నా అన్నారు .
ఇంతకీ రికార్డ్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి అన్నాడు నరేష్ .
ఇవాళ 30 కదా 1తేదీ న ఇవ్వాలి ఇంకా రెండు రోజులుంది అన్నాడు.
నీ తలకాయ ఇవాళ 31స్ట్ , 30 కాదు చూసుకో , చవటాయి ,
ఇంకో రోజు ఉంది కదాని నిర్లక్ష్యం చేయకు వెర్రిమాలోకం అన్నాడు నరేష్ .
అయ్యో నేను ఇంకా 30 అనుకుంటున్నాను అన్నాడు .
ఎంత పని జరిగింది ,అంటూ
ఇవాళ కూర్చుని రాసేయాలి అన్నాడు . ఏమిట్రా ఎంత పని జరిగింది అంటూ అడిగింది.
అదా వాడు ఇంకా ఇవాళ 30 అనుకుంటున్నాడు 31 అయితే అన్నాడు నరేష్ .
అయితే ఏమిటి టి చెప్పరా అంటూ గద మాయించింది .
వాడు ఒక అమ్మాయి తో లేచి పోదామని అనుకుంటున్నాడు .
రైల్వే స్టేషన్ దగ్గర వుండమన్నాడుట..
ఆ విషయం మర్చిపోయాడుట అన్నాడు నరేష్ కన్నుకొడుతూ,
నీకెలా చెప్పాలో అర్థంకాక ఇద్దరం ఆలోచిస్తున్నాం అన్నాడు విజయ్ .
ఏరా ఎంత పని చేశావురా అంటూ తిట్లు మొదలుపెట్టింది.
అయ్యబాబోయ్ ఊరికే అన్నా అదేం లేదే బాబు
రికార్డ్ వర్క్ గురించి అన్నా అంతే అన్నాడు కంగారుగా,
నేనేదో జోక్ చేసాను అంతే అన్నాడు .
నాకు తెలుసు మీరిద్దరూ ఏదో చేస్తున్నారు నాకు తెలియకుండా ఏమయినా పిచ్చివేషా లు వేశావో మర్యాద గా ఉండదు అంది తులసి..
నువ్వయినా చెప్పవే అంటూ చెల్లెల్ని అడిగాడు విజయ్ .
ఏమో నాకుతెలీ దు ఇందులో నన్ను
ఇన్ వాల్వ్ చెయ్యద్దు అంది అను.
అమ్మ దొంగ శబరి పొద్దున్న నువ్వు అడిగిన 100 ఇవ్వలేదని ఇప్పుడు సైడ్
అయిపోతావా అన్నాడు.
ఇంతలో ఫోన్ వచ్చిందని వెళ్ళింది ఇంటి అడ్రస్ చెప్పి , మాట్లాడివచ్చింది.
ఎవరే ఫోన్ మన అడ్రస్ చెపుతున్నావు అంటూ అడిగాడు నరేష్.
ఆపిల్లే మీరు చెప్పారుగా రైల్వే స్టేషన్ లో ఎదురుచూసి వీడు రాకపోయేసరికి ఫోన్ చేసింది.
ఇంటి అడ్రస్ ఇచ్చాను . వస్తోంది .
మీరు భోజనాలు కానియ్యండి .
కంగు తిన్నారు అందరూ.
అమ్మా నువ్వు కూడా ఏమిటి అన్నాడు విజయ్ దీనంగా.
ఏమో నాకేం తెలుసు, వస్తోందిగా దాని సంగతి నీ సంగతి తేలుస్తాను అంటూ భోజనం ముగించింది.
విజయ్ గాభరాగా భోజనము ముగించి రూమ్ లోకి పారిపోయాడు.
ఎవరై వుంటారబ్బా , నాన్న జోక్ గా అంటే అమ్మ ఇలా అంటోంది.... నీకు ఏమైనా తెలుసా ఏమిటి అని చెల్లెల్ని అడిగాడు. ఏమో నాకేం తెలుసు అంది.
నీవంద కోసం నన్ను ఇబ్బంది పెట్టకే కనుక్కునిరా అంటూ వంద చేతి లో పెట్టాడు. ఇప్పుడు రెండు వందలు రేటు మారింది. అంది.
నా బలహీనతను అడ్డు పెట్టుకుని blackmail చెయ్యకే, నీ కు దణ్ణం పెడతాను. ఇస్తాలే ముందు వెళ్లి విషయం కనుక్కుని రా అంటూ గదిలోనుంచి తోసాడు.
అబ్బా వెళతాను వుండరా బాబు అంటూ బయటకు వచ్చి ,
నాన్నా నీకు ఏమైనా తెలుసా అంది.
నాకూ అదే డౌట్ గా ఉంది .
మనం సరదాగా అన్న మాటలు వీడు నిజం చేస్తున్నాడా అని.
ఛ ఛ ...అన్నయ్య అలాంటి వాడు కాదు నాన్నా అంది .
మరి విషయం నాకూ తెలియదు.
ఏదో జరుగుతోంది. రానీ ఆ అమ్మాయిని నిజంగా వస్తే అప్పుడు చూద్దాం.
మీ అమ్మ కూడా నాలా జోక్ వేసిందేమో అన్నాడు.
అవును నాన్నా అదీ నిజమే అంది .
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.
పరిగెత్తుకు వెళ్లి తలుపు తీసింది.
ఎదురుగా అందమైన అమ్మాయి బ్యాగ్ తో నిలబడి ఉంది.
నరేష్ గారి ఇల్లు ఇదేనాండి అంది.
షాక్ అయ్యిపోయింది చెల్లెలు.
అవును రండి లోపలికి అంటూ పక్కకి తప్పుకుంది.
నాన్నోయి నిజంగా నే వచ్చేసింది.
అంటూ లోపలికి పరిగెత్తింది.
అందరూ హాల్లో కి వచ్చారు.
నమస్కారమం డి అంటూ కాళ్లకు దణ్ణం పెట్టింది.
నరేష్ షాక్ లో వున్నాడు ఆ అమ్మాయితో అలా సోఫా లోకూర్చో అంటూ చూపించాడు. ఎంతపనిచేశావురా నువ్వుజోక్ అన్నావు ఇప్పుడు చూడు నిజంగా వచ్చేసింది అన్నాడు.
నాకేం తెలియదు నాన్నా ,
అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, ఒట్టు అన్నాడు ఇంచుమించు ఏడుపు మొహం తో .
ఒట్టా , గాడిదగుడ్డా ఎదురుగా కనబడుతుంటేను , నిజం చెప్పరా.
ఎవరు ఆఅమ్మాయి . అన్నాడు. నిజంగా నాకేం తెలియదు నాన్నా , నన్ను నమ్ము అంటూ మొర పెట్టుకున్నాడు.
వాడు అలాగే అంటాడు గానీ ముందు భోజనం పెట్టు ఎప్పుడు తిందో ఏమో పాపం .
మిగతావిషయాలు తరువాత చూసుకుందాం అన్నాడు నరేష్.
విజయ్ మేడ మీదకు పారిపోయాడు.
నువ్వు పెట్టవే అంటూ కూతురికి పురమాయించి కోపంగా తనగదిలోకి వెళ్లి పోయింది తులసి.
అను నువ్వు చూడు తల్లీ ఆ విషయం .
మీ అమ్మ చాలా వేడి గా ఉంది అని అన్నాడు నరేష్.
అలాగే అంటూ నువ్వురా వదినా అంటూ తీసుకెళ్లింది.
వీడెక్కడికి పోయాడు అంటూ వెతుక్కుంటూ వెళ్ళాడు.
మేడమీద వున్నాడు .
వెళ్లి ఒక్క సిగరెట్టు వెలిగించి గట్టిగా పీల్చి వదిలాడు.
పక్కకు వచ్చి కూర్చున్నాడు.
ఇప్పుడు చెప్పరా అబ్బాయి, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు , ఒక ఫ్రెండ్ గా అడుగుతున్నాను అన్నాడు నరేష్.
నిజం నాన్నా నాకు ఏమి తెలియదు మీరేదో అమ్మ మీద జోక్ వేస్తే ఇంకాస్త ఏడిపిద్దామని నేనూ వంత పాడా ను.
ఇంతకుమించి నాకు ఏమీ తెలియదు.
అని అన్నాడు విజయ్ .
మరి నీకు తెలియకుండా మన ఇంటికి ఎలా వచ్చింది చెప్మా అన్నాడు.
అదే నాకూ అర్థం కావట్లేదు అని అన్నాడు దిగులుగా.
సరేలే చూద్దాం కిందకి రా అంటూ సిగరెట్టు పారేసి ఇద్దరూ కిందకి వెళ్లారు అనూ ని పిలిచాడు.
ఆ అమ్మాయి ఏమైనా చెప్పిందా అన్నాడు. లేదు నాన్నా ఎంత అడిగినా ఏమీ మాట్లడలేదు.
నా గదిలో రెస్ట్ తీసుకుకోమన్నాను అంది.
ఇంతలో పక్కింటి పంకజం వచ్చింది .
తన కూతురిని విజయ్ కి చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఏదో వంకతో ఆ ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది.
వదినా, వదినా అంటూ పిలిచింది.
మీ అమ్మ లేదా అల్లుడూ అంది.
ఛ.... అలాపిలవకండి, నాకు చిరాకు ,
అంటూ అమ్మా అంటూ అరిచాడు తులసి బయటకు వచ్చింది.
కొంచెం కాఫీ పొడి ఉంటే ఇస్తావా వదినా మళ్లీ రేపు ఇచ్ఛేస్తాను అంది.
లోపలికి వెళ్ళి తీసుకువచ్చి ఇచ్చింది.
అది తీసుకుంటూ ఈ ఏడాది పెళ్లి చేసేస్తారా మీవాడికి అంటూ అడిగింది.
ఇప్పుడు అదొక్కటే తక్కువ మీరు వెళ్ళండి ఇబ్బందిగావుంది అంటూవిసుక్కున్నాడు. అల్లుడికి చిరాకు ఎక్కువ అంటూ నవ్వింది. ఛీ దీనమ్మ జీవితం అంటూ తనని తాను తిట్టుకున్నాడు.
ఇంతలో పక్కింటి అచ్యుత్ వచ్చాడు.
ఏమోయ్ నరేష్ ఎవరో అమ్మాయి వచ్చింది మీ బంధువులా అంటూ అడిగాడు లోపలికి తొంగి చూస్తూ...
అవును అవును , కాదు కాదు అంటూ తడబడ్డాడు నరేష్.
అవునంటావు, కాదంటావు, ఇంతకీ అవునా, కాదా చెప్పవోయి అన్నాడు అచ్యుత్. బంధువులే అంకుల్ అంది అను,
మధ్యలో కల్పించుకుని.
మరి హుషారు గా ఉండక అలా
ఉన్నారేమిటి , మీ వాడు ఎవరినో లేపుకు వచ్చినట్లుగా , కొంపతీసి అలాంటి వ్యవహారమేదైనా నడిపాడా మీ వాడు.
అబ్బెబ్బే అల్లాంటిది ఏమి లేదు.
ఆ అమ్మాయి మా బంధావుల అమ్మాయి అన్న మాట.
ఇవాళ వచ్చింది అన్న మాట ...ఆదన్న మాట.. అన్నాడు నరేష్.
ఇంతకీ ఎందుకు వచ్చినట్టో అన్నాడు గది వైపుకు అనుమానంగా చూస్తూ.
మీకు అక్కర లేని విషయం లేదు కదా ఎందుకు వచ్చిందంటే అందుకు వచ్చిందన్న మాట అన్నాడు నరేష్.
అందుకు అంటే ఎందుకో అన్నాడు అచ్యుత్.
ఇంక మమ్మలిని ఆలోచించుకొనివ్వరా.
అయినాఎందుకు చెప్పాలి మీకు చెప్పం , నాకు కోపం వచ్చింది , నేను అలిగాను అని అన్నాడు నరేష్.
నువ్వు బుంగ మూతి పెడితే బాగుండ దోయ్ నరేష్... అన్నాడు
ఈ చమత్కారాలకేమి తక్కువ లేదు... అన్నాడు నరేష్.
చెప్పకపోయినా పరవాలేదు , ఏదయినా గోడవేమో సాయం చేద్దామని వచ్చాను. అన్నాడు అచ్యుత్ .
మీసాయాని కి ఓ దండం ఇక బయలుదేరండి సార్ అన్నాడు నరేష్.
అలాంటి వ్యవహారేమయినా ఉంటే చెప్పు విజయ్ ఇట్టే సెటిల్ చేసేస్తాను వాళ్ళ వాళ్ళతో మాట్లాడి ఓప్పించేద్దాము.
ఈ రోజుల్లో ఇదంతా మోస్ట్ కామనూ అంటూ
సాగ దీసాడు.
బాబూ అలాంటిది ఏమీ లేదు మీరు బయలుదేరండి అంకుల్ అంటూ భుజం మీద చెయ్యి వేసి బయటకు తీసుకునివచ్చి వదిలేసాడు విజయ్.
లోపలికి వచ్చి అమ్మా ...నీకు దణ్ణం పెడతానే, నిజం గా నాకేం తెలియదు,
ఏదో సరదా గా నాన్న అంటే ,
నేను వంత పాడి కామెడీ ఎక్స్టెండ్ చేసాను.
అది ఇలా నా పీకల మీదకు వస్తుంది అనుకోలేదు .
ఇంకెప్పుడూ నీ మీదజోకులు వేయను , క్షమించు, అంటూ బతిమాలాడు.
తులసి సీరియస్ గా నరేష్ వైపు చూసింది.
దండం పెట్టాడు నేను కూడాఅంటూ.
అప్పుడు ఆమె ముఖం లో నవ్వు వచ్చింది. అదీ అలా రండి దారికి .
అమ్మ అంటే ఆట బొమ్మ కాదు , లాలించడమే కాదు తోలు తీయడం కూడా తెలుసు అంటూ
అమ్మా శైలజా అంటూ పిలిచింది.
ఆ ఆంటీ వస్తున్నా అంటూ బయటకు వచ్చింది.
పిలిచారా ఆంటీ అంటూ అడిగింది.
ఇది శైలజ అని నా చిన్న నాటి స్నెహితురాలి కూతురు.
ఈ ఊరిలో ఏదో పరీక్ష ఉంది అంటే వచ్చింది. మీరు నన్ను ఆట పట్టిస్తుంటే ,
అదే సమయానికి ఫోన్ వచ్చింది.
అంతే ఫోన్ లోఅన్నీ చెప్పి ఇలా ఆక్ట్ చేయించాను, అంది నవ్వుతూ .
నన్ను క్షమించండి అంకుల్ ,
ఆంటీ చెపితే నే ఇలా చేసాను అంటూ చెవులు పట్టుకుంది .
అదేం పరవాలేదు అమ్మా,
మాఇంట్లో జోకులు అలవాటే గానీ,
మా ఆవిడ ప్రాక్టికల్ జోక్ వేసేసరికి షాక్ అయ్యాము అంతే.
మొత్తానికి భలే గడుసుదానివి బోండాం అంటూ తులసిని పొగిడాడు.
పిల్ల ల ముందు బొండాం అనొద్దని చెప్పానా అంటూ మూతి ముడిచింది .
అందరూ నవ్వుకున్నారు.
బ్రతికానురా దేవుడా అంటూ విజయ్ అక్కడ నుండి జారుకోబోయాడు.
ఒరేయ్ విజయ్ రేపు కాస్త ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పరీక్ష రాయించి తీసుకు రా అర్థమయ్యిందా అంది తులసి.
అలాగే అమ్మా అంటూ జారుకున్నాడు. అనూ తనని లోపలికి తీసుకుని వెళ్ళు అంది తులసి.
రా శైలూ అంటూహుషారుగా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లింది. అమ్మాయి బాగుంది, పైగా మీ ఫ్రెండ్ కూతురు అంటున్నావు.
మనవాడికి ఇచ్చిచేస్తే ఎలా ఉంటుంది అన్నాడు నరేశ్.
ఆ మాటే నా ఫ్రెండ్ కూడా అడిగింది. బాగా చదువుకుంటోంది, చాలా నెమ్మదస్తురాలు.. పైగా నా ఫ్రెండ్ కూతురు, నాకూ మనసులో
ఆ ఉద్దేశ్యమే ఉంది... కానీ ఇంట్లో అందరూ ఒప్పుకోవాలిగా...
అందుకే పరీక్ష ఉంది అంటే మన ఇంటికి పంప మన్నాను, మీరు అందరూ కూడా చూస్తారని అంది నవ్వుతూ.
నాకేమీ అభ్యంతరం లేదు.
వాడికా ఇంక ఇప్పుడప్పుడే నీ మాటకి ఎదురు చెప్పే దైర్యం రాదు .
నీ ఇష్టం అలాగే కానీ అన్నాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి వచ్చిన అను,
వాళ్ళ మాటలు విని ఈ అమ్మాయి చాలా బాగుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. అన్నయ్యకి ఇచ్చి చేసేయ్ అమ్మా అంది హుషారుగా.
ఆగండి ఆగండి ముందు వాడి చదువు అవ్వాలి,
ఉద్యోగం లో చేరాలి అప్పుడే పెళ్లి. అప్పటివరకు ఎదురు చూడమను
మీ ఫ్రెండ్ ని అన్నాడు నరేష్.
సరే మీ ఇష్టం ,
మీరు ఎలాగంటే అలాగే
అంది తులసి.
చేసిందంతా చేసేసి , చివర్లో నా ఇష్టం అంటోంది చూసావా మీ అమ్మ తెలివితేటలు అంటూ నవ్వాడు.
ఆ మాటలకు అందరూ హాయిగా నవ్వుకున్నారు. ....

శుభం...
ఇందులో పాత్రలు ,కధ, కధనం , అంతా కల్పితం... ఎవరినీ ఉద్దేశించినది కాదు...

Tuesday, 2 February 2021

దశ మహావిద్యలు

 దశ మహావిద్యలు 




1. కాళీ

2. తార

3. త్రిపుర సుందరి

4. ధూమావతి

5. భువనేశ్వరి

6. భైరవి

7. ఛిన్నమస్త

8. మాతంగి

9. బగళాముఖి

10. కమలాత్మిక

ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.

కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము

తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము

త్రిపుర సుందరి, కమల - ఆనందము, సౌందర్యము

భువనేశ్వరి, ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి

భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి

శ్రీకాళీదేవి

కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2వ మహావిద్య శ్రీతారాదేవి

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

3వ మహా విద్య శ్రీషోడశీదేవి

అరుణారుణ వర్ణంతో ప్రకాశించే *శ్రీషోడశీదేవి* దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి

దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5వ మహావిద్య శ్రీ త్రిపుర భైరవీ దేవి

దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి

దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7వ మహావిద్య శ్రీ ధూమవతీ దేవి

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8వ మహావిద్య శ్రీ జగళాముఖీ దేవి

దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే

శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9వ మహావిద్య శ్రీ మాతంగీదేవి

దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే

శ్రీ మాతంగీదేవి కి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10వ మహావిద్య శ్రీ కమలాత్మికాదేవి

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.

Friday, 22 January 2021

శ్రీ మహా లక్ష్మీ అష్టోత్తర శత నామావళి

 శ్రీ మహా లక్ష్మీ అష్టోత్తర శత నామావళి

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)
ఓం ఋద్ధయే నమః
ఓం అనఘ్యై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)
ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)

శ్రీ సూక్తం

 ఓం ‖ హిర'ణ్యవర్ణాం హరి'ణీం సువర్ణ'రజతస్ర'జాం | చంద్రాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ ‖


తాం మ ఆవ'హ జాత'వేదో లక్ష్మీమన'పగామినీం'' |
యస్యాం హిర'ణ్యం విందేయం గామశ్వం పురు'షానహం ‖

అశ్వపూర్వాం ర'థమధ్యాం హస్తినా''ద-ప్రబోధి'నీం |
శ్రియం' దేవీముప'హ్వయే శ్రీర్మా దేవీర్జు'షతాం ‖

కాం సో''స్మితాం హిర'ణ్యప్రాకారా'మార్ద్రాం జ్వలం'తీం తృప్తాం తర్పయం'తీం |
పద్మే స్థితాం పద్మవ'ర్ణాం తామిహోప'హ్వయే శ్రియం ‖

చంద్రాం ప్ర'భాసాం యశసా జ్వలం'తీం శ్రియం' లోకే దేవజు'ష్టాముదారాం |
తాం పద్మినీ'మీం శర'ణమహం ప్రప'ద్యేఽలక్ష్మీర్మే' నశ్యతాం త్వాం వృ'ణే ‖

ఆదిత్యవ'ర్ణే తపసోఽధి'జాతో వనస్పతిస్తవ' వృక్షోఽథ బిల్వః |
తస్య ఫలా'ని తపసాను'దంతు మాయాంత'రాయాశ్చ' బాహ్యా అ'లక్ష్మీః ‖

ఉపై'తు మాం దే'వసఖః కీర్తిశ్చ మణి'నా సహ |
ప్రాదుర్భూతోఽస్మి' రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృ'ద్ధిం దదాతు' మే ‖

క్షుత్పి'పాసామ'లాం జ్యేష్ఠామ'లక్షీం నా'శయామ్యహం |
అభూ'తిమస'మృద్ధిం చ సర్వాం నిర్ణు'ద మే గృహాత్ ‖

గంధద్వారాం దు'రాధర్షాం నిత్యపు'ష్టాం కరీషిణీం'' |
ఈశ్వరీగం' సర్వ'భూతానాం తామిహోప'హ్వయే శ్రియం ‖

శ్రీ''ర్మే భజతు | అలక్షీ''ర్మే నశ్యతు |

మన'సః కామమాకూ'తిం వాచః సత్యమ'శీమహి |
పశూనాం రూపమన్య'స్య మయి శ్రీః శ్ర'యతాం యశః' ‖

కర్దమే'న ప్ర'జాభూతా మయి సంభ'వ కర్దమ |
శ్రియం' వాసయ' మే కులే మాతరం' పద్మమాలి'నీం ‖

ఆపః' సృజంతు' స్నిగ్దాని చిక్లీత వ'స మే గృహే |
ని చ' దేవీం మాతరం శ్రియం' వాసయ' మే కులే ‖

ఆర్ద్రాం పుష్కరి'ణీం పుష్టిం పింగలాం ప'ద్మమాలినీం |
చంద్రాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ ‖

ఆర్ద్రాం యః కరి'ణీం యష్టిం సువర్ణాం హే'మమాలినీం |
సూర్యాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ ‖

తాం మ ఆవ'హ జాత'వేదో లక్షీమన'పగామినీం'' |
యస్యాం హిర'ణ్యం ప్రభూ'తం గావో' దాస్యోఽశ్వా''న్, విందేయం పురు'షానహం ‖

ఓం మహాదేవ్యై చ' విద్మహే' విష్ణుపత్నీ చ' ధీమహి | తన్నో' లక్ష్మీః ప్రచోదయా''త్ ‖

శ్రీ-ర్వర్చ'స్వ-మాయు'ష్య-మారో''గ్యమావీ'ధాత్ పవ'మానం మహీయతే'' | ధాన్యం ధనం పశుం బహుపు'త్రలాభం శతసం''వత్సరం దీర్ఘమాయుః' ‖

ఓం శాంతిః శాంతిః శాంతిః' ‖


Thursday, 21 January 2021

ఏమి చదివితే... ఫలితం

 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు 

శివాష్టకం - శివ అనుగ్రహం
ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం
శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది
అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి
కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం
దుర్గష్టోత్తర శతనామం - భయహరం
విశ్వనాథ అష్టకం - విద్య విజయం
సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం
హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ
విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి
శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి
భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి
శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం
లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం
కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం
ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత
శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం
లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి
శ్యామాల దండకం - వాక్శుద్ధి
త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి
శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి
శని స్తోత్రం - శని పీడ నివారణ
మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం
అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి
కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం
కనకధార స్తోత్రం - కనకధారయే
శ్రీ సూక్తం - ధన లాభం
సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది
సుదర్శన మంత్రం - శత్రు నాశనం
విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం
రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి
దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు
భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు
వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు
దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు
లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి

పంచరత్నం - 5 శ్లోకాలతో కూడినది
అష్టకం - 8 శ్లోకాలతో కూడినది
నవకం - 9 శ్లోకాలతో కూడినది
స్తోత్రం - బహు శ్లోకాలతో కూడినది
శత నామ స్తోత్రం - 100 నామాలతో స్తోత్రం
సహస్రనామ స్తోత్రం - 1000 నామాలతో స్తోత్రం

పంచపునీతాలు
వాక్ శుద్ధి
దేహ శుద్ధి
భాండ శుద్ధి
కర్మ శుద్ధి
మనశ్శుద్ధి

వాక్ శుద్ధి :
వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు .... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు .... మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి .... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి ....

దేహ శుద్ధి :
మన శరీరం దేవుని ఆలయం వంటిది .... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి .... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు ....

భాండ శుద్ధి :
శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి .... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది ....

కర్మ శుద్ధి :
అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు .... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ....

మనశ్శుద్ధి :
మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది .... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది .... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి .... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది .... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...

ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది 
ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది 
నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది
యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది 
సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది 
గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది 
సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది 
పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది 
భక్తి ప్రవేశిస్తే మనిషి మనీషి అవుతాడు 

సేకరణ.

Wednesday, 30 December 2020

రామ నామం విశిష్టత

 రామ నామం విశిష్టత



శ్రీరాముడి కంటే శ్రీరామ నామం గొప్పది అనడం వెనక ఆంతర్యము..


"రామ"..! ఈ మంత్రానికి అత్యంత శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. 

ఈ మంత్ర జపం వల్ల.. అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెబుతాయి. 

అందుకే ఈ నామంలో కలిగిన రాముడి కంటే..కూడా రామ నామమే గొప్పదని చాలా కథలు మనకు 

చెబుతూ ఉంటాయి. 


అసలు రాముడితో పుట్టిన రామ నామం రాముడి కంటే ఎందుకు గొప్పది అయింది..


రామ నామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. 

తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి

మరణం వరకు.. జీవితం సాఫీగా సాగుతుంది.

చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి 

ఈ రామనామం సహాయపడుతుంది. 

కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉండాలి.


భగవన్నామ స్మరణకు మించిన సాధన కలియుగంలో మరొకటి లేదని శాస్త్రాలు చెబుతాయి. 

అలాగే ప్రతి దేవుడి నామస్మరణలో అద్భుతమైన శక్తి, మహిమ ఉంటుంది. 

మన హిందువులకు ఉన్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండు అక్షరాల రామ మంత్రానికి ఉన్న విశిష్టత మరే మంత్రానికి లేదు. 

ఇంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామ నామం విశిష్టత, రామ నామం గొప్పదనం, 

రామనామం శక్తి సామర్థ్యాలను తెలుసుకుందాం..


రామ నామం పుట్టుక..

తారక మంత్రంగా పిలిచే రామ మంత్రం.. 

రెండు మహా మంత్రాల నుంచి పుట్టింది. 

ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో 

రా..అనే అక్షరం జీవాక్షరం. 

అలాగే ఓం నమ: శివాయ అనే పంచాక్షరి మంత్రంలో 

మ..అనేది జీవాక్షరం.

అంటే.. ఈ రెండు మంత్రాలలో జీవాక్షరాలు తొలగిస్తే.. అర్థం ఉండదు. 

అందుకే.. ఈ రెండు మంత్రాల నుంచి తీసిన రా, మ అనే అక్షరాల ద్వారా రామ అనే నామం వచ్చింది. 

ఈ రెండు అక్షరాలు లేకపోతే.. 

ఆ రెండు మహామంత్రాలకు విలువ ఉండదు. 

అందుకే ఈ రెండు జీవాక్షరాల సమాహారంగా రామ అనే నామం లేదా మంత్రం పుట్టింది.


శివకేశవ మంత్రం..

ఓం నమో నారాయణాయలో రా, 

ఓం నమ: శివాయలో మ అనేవి జీవాక్షరాలు. 

అందుకే శివకేశవుల అత్యంత శక్తి కలవడం వల్ల రామ అనే మంత్రం అత్యంత శక్తివంతమైంది. 

అందుకే ఈ మంత్రాన్ని హరిహరతత్వం కలిసిన మహామంత్రమని పిలుస్తారు.


లంకపై దండెత్తడానికి రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తారనే సంగతి అందరికీ తెలుసు. 

అయితే.. రాయిపై రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది. 

ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి.. 

తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా.. 

తానే రాయి వేస్తే అనే ఆలోచన వచ్చింది.

తనకు వచ్చిన ఆలోచనతో రాముడు ఒక రాయి తీసి సముద్రంలోకి విసిరాడు. 

కానీ.. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది.

రాముడు ఆశ్చర్యపోయాడు.

తాను వేసిన రాయి మునిగిపోవడంతో రాముడు వెంటనే తన పక్కన ఉన్న హనుమంతుడిని అడిగాడు. 

అప్పుడు హనుమంతుడు.. 

రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి. 

మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా.. 

అందుకే మునిగిపోయిందని హనుమంతుడు వివరించాడు.

ఇలా రాముడి కంటే.. రామ నామం ఎంతో బలమైనది, శక్తివంతమైనది, విశిష్టమైనదని భావించడం మొదలుపెట్టారు.


రామ నామం అర్థం..

రామ అనే మంత్రంలో ర, అ, మ అనే అక్షరాలున్నాయి. 

ర అంటే అగ్ని, 

అ అంటే సూర్యుడు, 

మ అంటే చంద్రుడు అని అర్థం. 

అంటే రామ అనే మంత్రంలో ఈ లోకానికి మూలమైన మూడు శక్తులున్నాయని వివరిస్తుంది.


రామ నామ జపం విశిష్టత..

రామ అనే పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని 

నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నికి ఆహుతి అవుతాయి. 

అలాగే మ అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోకి ప్రవేశించవని వివరిస్తుంది.


విష్ణుసహస్రనామం..

రామ రామ రామ అని మూడు సార్లు జపం చేస్తే.. 

విష్ణు సహస్ర నామం చేసినంత ఫలితం లభిస్తుందట.


రామ నామ మంత్రం..

శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే 

13 అక్షరాల నామమంత్రం. 

ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందట. 

సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి.. రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. 

కాబట్టి ఈ నామజపం మంచి ఫలితాన్నిస్తుంది.


శనీశ్వరుడినే జయించిన రామనామం..

పూర్వం ఒకసారి హనుమంతుడిని కష్టాలపాలు చేయాలని శనీశ్వరుడు అతని దగ్గరకు వచ్చాడు. 

అప్పుడు హనుమంతుడు రామనామం జపిస్తున్నాడు. శనీశ్వరుడు హనుమంతుడికి విషయం చెప్పగా.. 

తాను రామనామ జపంలో ఉన్నానని... 

అది పూర్తయిన తర్వాత రమ్మని చెప్పాడు. 

శనీశ్వరుడు ఎంతసేపు నిరీక్షించినా.. 

రామనామ జపం పూర్తవలేదు. 

దీంతో.. శనీశ్వరుడు.. రామనామం జపించేవాళ్ల దరిచేరడం కష్టమని వెనక్కి వెళ్లిపోయాడు. 

కాబట్టి రామ నామాన్ని జపించేవాళ్లకు శనిబాధలు ఉండవు.


 శ్రీరాముని యొక్క శ్రీ రామ నామం జపించడం కానీ 

శ్రీ రామకోటి ని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి.


మన పురాణాల్లో " ఆది కావ్యం గా "చెప్పబడుతున్న 

వాల్మీకి మహర్షి యొక్క  "శ్రీరామాయణం" లో చెప్పబడింది.

రామ నామం యొక్క గొప్పదనం శ్రీ రామాయణం లో అడుగు అడుగున చెప్పబడుతుంది.

ఈ నామాన్ని చిన్నపిల్లల నుంచి వృద్ధులు వరకు   జపించవచ్చు స్మరించవచ్చు రాయవచ్చు.

 

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సకల చరాచర సృష్టికి 

ఆది దేవుడు అయినా "శివపరమాత్ముడు"  నిత్యం రామనామం జపిస్తారు అంత గొప్పది. " రామ నామం"

 

అందుచేత యావన్మంది భక్తకోటి రామ నామం యొక్క గొప్పతనం తెలుసుకొని రామకోటి  రాయండి. జపించండి మీకు శ్రీరాముని యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి.

(సేకరణ)

Thursday, 24 December 2020

శ్రీగురు_దక్షిణామూర్తి

 శ్రీగురు_దక్షిణామూర్తి





దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు
ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది.
మరో కాలు పైకి మడిచి ఉంటుంది.
చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు.
ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.

బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన
సనక, సనందన, సనాతన, సనత్కుమారులు
బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు.
అయినా వారికి అంతుపట్టలేదు.
వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు.

అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా
ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు.
ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది.

ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.
ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే..
జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది,
కేవలం అనుభవించదగినది అని.
గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు.
అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో
విస్తృతంగా వర్ణించారు.

శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం.
దక్షిణ అంటే సమర్థత అని అర్ధం.
దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం.
అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోతాయి.
దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే
ఆ రూపమే దక్షిణామూర్తి.

మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి.
ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి.
దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు.

విష్ణు,
బ్రహ్మ,
సూర్య,
స్కంద,
ఇంద్ర
తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.

ఆ రూపాలు వరుసగా.....
శుద్ధ దక్షిణామూర్తి,
మేధా దక్షిణామూర్తి,
విద్యా దక్షిణామూర్తి,
లక్ష్మీ దక్షిణామూర్తి,
వాగీశ్వర దక్షిణామూర్తి,
వటమూల నివాస దక్షిణామూర్తి,
సాంబ దక్షిణామూర్తి¸
హంస దక్షిణామూర్తి,
లకుట దక్షిణామూర్తి,
చిదంబర దక్షిణామూర్తి,
వీర దక్షిణామూర్తి,
వీరభద్ర దక్షిణామూర్తి¸
కీర్తి దక్షిణామూర్తి,
బ్రహ్మ దక్షిణామూర్తి¸
శక్తి దక్షిణామూర్తి,
సిద్ధ దక్షిణామూర్తి.

ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది.

భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు,
చంద్రకళాధరుడు,
జ్ఞానముద్ర,
అక్షమాల,
వీణ,
పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి.
తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.

పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు.
సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి.
మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను
సొంతం చేసుకుంటారు.

చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,
సంపద(ధనము) దగ్గర నుండి,
పెద్దలకు మోక్షము వరకు,
దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అదిష్టానం
అయి ఉంటాడు.

ఓం శ్రీ గురు దక్షిణామూర్తియే నమః..!

(సేకరణ)




Wednesday, 23 December 2020

నీలకృత ఆంజనేయ స్తోత్రం



ఈ స్తోత్రము నిత్యము పఠించు వారికి హనుంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వలె కోరికలన్నిటిని తీర్చగలడు.

 


 

నీలకృత ఆంజనేయ స్తోత్రం 


ఓం జయ జయ! శ్రీ ఆంజనేయ! కేసరీ ప్రియనందన! వాయుకుమారా! ఈశ్వరపుత్ర! పార్వతీ గర్భ సంభూత! వానరనాయక! సకల వేదశాస్త్ర పారగ! సంజీవి పర్వతోత్పాటన! లక్ష్మణ ప్రాణరక్షక! గుహప్రాణదాయక! సీతాదుఃఖ నివారణ! ధాన్యమాలీ శాపవిమోచన దుర్దండీ బంధవిమోచన! నీలమేఘ రాజ్యదాయక! సుగ్రీవ రాజ్యదాయక! భీమసేనాగ్రజ! ధనంజయ ధ్వజవాహన! కాలనేమి సంహార! మైరావణ మర్దన! వృతాసుర భంజన! సప్త మంత్రిసుత ధ్వంసన! ఇంద్రజిద్వధకారణ! అక్షకుమార సంహార! లంకిణీ భంజన! రావణమర్దన! కుంభకర్ణ వధపరాయణ! జంబూ మాలి నిషూదన! వాలినిర్హరణ! రాక్షసకుల దాహన! అశోకవన విదారణ! లంకాదాహక! శతముఖవధకారణ! సప్తసాగర వాలసేతు బంధన! నిరాకార నిర్గుణ సగుణ స్వరూప! హేమవర్ణ పీతాంబరధర! సువర్చలా ప్రాణనాయక! త్రయస్తింశత్కోట్యర్బుద రుద్రగణపోషక! భక్తపాలనచతుర! కనకకుండలాభరణ! రత్న కిరీట హార నూపుర శోభిత! రామభక్తి తత్పర! హేమరంభావన విహార! వక్షతాంకిత మేఘవాహక! నీలమేఘశ్యామ! సూక్ష్మకాయ! మహాకాయ! బాలసూర్యగ్రసన! ఋష్యమూక గిరి నివాసక! మేరు పీఠకార్చన! ద్వాత్రింశతాయుధధరా! చిత్రవర్ణ! విచిత్ర సృష్టినిర్మాణకర్తా! అనంతనామ! దశావతార! అఘటన ఘటనా సమర్థ! అనంతబ్రహ్మన్! నాయక! దుర్జనసంహార! సుజనరక్షక! దేవేంద్రవందిత! సకలలోకారాధ్య! సత్యసంకల్ప! భక్తసంకల్పపూరక! అతిసుకుమారదేహ! అకర్దమ వినోదలేపన! కోటి మన్మథాకార! రణకేళిమర్దన! విజృంభమాణ! సకలలోక కుక్షింభర! సప్తకోటి మహామంత్ర తంత్ర స్వరూప! భూతప్రేత పిశాచ శాకినీ ఢాకినీ విధ్వంసన! శివలింగ ప్రతిష్ఠాపనకారణ! దుష్కర్మ విమోచన! దౌర్భాగ్య నాశన! జ్వరాది సకలరోగహర! భుక్తి ముక్తిదాయక! కపటనాటక సూత్రధారీ! తలావినోదాంకిత! కళ్యాణ పరిపూర్ణ! మంగళప్రద! గానప్రియ! అష్టాంగయోగ నిపుణ! సకల విద్యా పారీణ! ఆదిమధ్యాంతరహిత! యజ్ఞకర్త! యజ్ఞభోక్త! షణ్మత వైభవసానుభూతి చతుర! సకల లోకాతీత! విశ్వంభర! విశ్వమూర్తే! విశ్వాకార! దయాస్వరూప! దాసజన హృదయకమల విహార! మనోవేగగమన! భావజ్ఞ నిపుణ! ఋషిగణగేయ! భక్తమనోరథదాయక! భక్తవత్సల! దీనపోషక దీనమందార! సర్వస్వతంత్ర! శరణాగత రక్షక! ఆర్తత్రాణ పరాయణ! ఏక అసహాయవీర! హనుమాన్! విజయీభవ! దిగ్విజయీభవ! దిగ్విజయీభవ!

Tuesday, 8 December 2020

మహామృత్యుంజయస్తోత్రం

 మహామృత్యుంజయస్తోత్రం



రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧ ||


నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౨ ||


నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౩ ||


వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౪ ||


దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౫ ||


గంగాధరం మహాదేవం సర్వాభరణభూషితమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౬ ||


త్ర్యక్షం చతుర్భుజం శాంతం జటామకుటధారిణమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౭ ||


భస్మోద్ధూళితసర్వాంగం నాగాభరణభూషితమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౮ ||


అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౯ ||


ఆనందం పరమం నిత్యం కైవల్యపదదాయినమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౦ ||


అర్ధనారీశ్వరం దేవం పార్వతీప్రాణనాయకమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౧ ||


ప్రళయస్థితికర్తారమాదికర్తారమీశ్వరమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౨ ||


వ్యోమకేశం విరూపాక్షం చంద్రార్ధకృతశేఖరమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౩ ||


గంగాధరం శశిధరం శంకరం శూలపాణినమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౪ ||


అనాథః పరమానందం కైవల్యఃపదగామినమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౫ ||


స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థిత్యంతకారణమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౬ ||


కల్పాయుర్దేహి మే పుణ్యం యావదాయురరోగతామ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౭ ||


శివేశానాం మహాదేవం వామదేవం సదాశివమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౮ ||


ఉత్పత్తిస్థితిసంహారకర్తారమీశ్వరం గురుమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౯ ||


మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |

తస్య మృత్యుభయం నాస్తి నాగ్నిచౌరభయం క్వచిత్ || ౨౦ ||


శతావర్తం ప్రకర్తవ్యం సంకటే కష్టనాశనమ్ |

శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్ || ౨౧ ||


మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతమ్ |

జన్మమృత్యుజరారోగైః పీడితం కర్మబంధనైః || ౨౨ ||


తావకస్త్వద్గతః ప్రాణస్త్వచ్చిత్తోఽహం సదా మృడ |

ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యమనం జపేత్ || ౨౩ ||


నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే |

ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః || ౨౪ ||