Thursday, 29 December 2016

సగ్గుబియ్యంలో


1. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.

2. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.

3. బరువు తగ్గాలనుకునేవాళ్లకు సగ్గుబియ్యం సరైన ఆహారం.

4. ఇందులో స్టార్చ్ శాతం ఎక్కువగా ఉంటుంది.

5. తక్షణ శక్తినిచ్చే అహార పదార్ధంగా దీన్ని ఉపయోగిస్తారు.

6. కండరాల గ్రోత్ కి సగ్గుబియ్యం చాలా ముఖ్యం.

7. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ప్రొటీన్ తీసుకోవడం వల్ల కండరాలు పెరగడమే కాకుండా బలంగా మారుతాయి.

8. సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.

9. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంతో పాటు.. బ్లడ్ కొలెస్ట్రాల్ ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల.. రక్తప్రసరణ సజావుగా సాగి.. గుండె సంబంధింత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.

10. సగ్గు బియ్యంను పాల లేదా నీటితో ఉడికించి ,తర్వాత పంచదార మిక్స్‌ చేసి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలన్నీ దూరమవుతాయి.

11. ఇందులో విటమిన్ కె ఉంటుంది.

12. ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతేమా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Wednesday, 28 December 2016

కాకర కాయ బెల్లం పెట్టి కూర


కాకర  కాయ  బెల్లం  పెట్టి  కూర

కావలిసిన  పదార్థాలు
1. కాకర  కాయలు  పావుకేజీ
2.  ఉల్లిపాయ  1
3. కరివేపాకు
4. పసుపు  కొద్దిగా
5. ఉప్పు  రుచికి  సరిపడా
6.  బెల్లం  తగినంత
7.  వరిపిండి  1 స్పూన్
8. చింత  పండు  కొద్దిగా
9. నీళ్లు  తగినన్ని

పోపు  దినుసులు
 సెనగ పప్పు  1 స్పూన్ , మినపప్పు  1 స్పూన్ , ఆవాలు  అర  స్పూన్  ,
జీలకర్ర  అర  స్పూన్  ఎండుమిరపకాయలు  2, ఆయిల్  2  స్పూన్స్

తయారీ  విధానం
ముందుగా  కాకర  కాయలను శుభ్రం  గా  కడిగి ,  గుండ్రంగా  చక్రాలుగా తరిగి ,
మధ్యలో  వున్న గుజ్జును  తీసివేయాలి .
 ఉల్లిపాయలను  సన్నగా  తరుగుకోవాలి ,
ఇలా  తరిగిన  కాకర కాయ  చక్రాలను ,
 తగినన్ని  నీళ్లు  పోసి ,   కొద్దిగా  చింతపండును  వేసి ,
కుక్కరులో  పెట్టి  ఉడికించుకుని చల్లార్చుకోవాలి.
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,
ఆయిల్  వేసి  పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి
దోరగా  వేగాక   కరివేపాకును, ఉల్లిపాయ ముక్కలను  వేసి ,
అవి కూడా  దోరగా  వేగిన  తరువాత  ,
ముందుగా   ఉడికించి  పెట్టుకున్న  కాకరకాయ  ముక్కలు  ,
పసుపు  ,ఉప్పు  , బెల్లం  , వరిపిండి ,  వేసి  బాగా   కలిపి  ,
కొద్దిసేపు  మగ్గనిచ్చి కూర  అంతా  దగ్గర. పడేంత  వరకు  ఉంచి ,
 స్టవ్   ఆఫ్  చేసుకుంటే
కాకర  కాయ  బెల్లం  కూర  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Tuesday, 27 December 2016

బేబీ పొటాటోస్ ఉల్లికారం కూర


బేబీ  పొటాటోస్  ఉల్లికారం  కూర

కావలిసిన  పదార్థాలు
1. బేబీ  పొటాటోస్. పావుకేజీ
2. పసుపు  
3. ఆయిల్ 5 స్పూన్స్

ఉల్లికారమునకు
 ఉల్లిపాయలు  2,  ఎండుమిరపకాయలు  6,  సెనగపప్పు  1 స్పూన్  ,
మినపప్పు  1 స్పూన్  ,ధనియాలు  1 స్పూన్  ,ఆవాలు  అర స్పూన్  ,జీలకర్ర  అరస్పూన్  ,
ఉప్పు  రుచికి  సరిపడా

తయారీ  విధానం
 ముందుగా  బేబీ  పొటాటాస్  ను  శుభ్రం  గా కడిగి  ,
పైన  వున్న  తొక్కను  తీసి  కుక్కరులో  పెట్టి  ఉడికించుకుని  చల్లారబెట్టుకోవాలి  .
ఉల్లిపాయలను  సన్నగా  చిన్న ముక్కలుగా  తరువుకోవాలి .
స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక  ,ఆయిల్  వేసి  ,
పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి  దోరగా  వేపుకుని  ,
ఒక ప్లెట్  లోకి  తీసుకుని  చల్లార్చికోవాలి.
 అదే  బాణలిలో  కొద్దిగా  ఆయిల్  వేసి  ,తరిగిపెట్టుకున్నఉల్లిపాయ  ముక్కలను  వేసి  ,
దోరగా  వేపుకుని, చల్లార్చుకోవాలి .
చల్లారిన  పోపును  తగినంత  ఉప్పు  వేసి ,మెత్తని  పొడిలాగా  గ్రైండ్  చేసుకుని ,
తరువాత వేపుకుని  పెట్టుకున్న  ఉల్లిపాయ  ముక్కలను  కూడా  వేసి  ,
మెత్తని  ముద్దలాగా  గ్రైండ్  చేసుకోవాలి  .
స్టవ్   వెలిగించి  వెడల్పయిన  బానలిపెట్టి  ,వేడెక్కాక  ఆయిల్  వేసి  ,
ముందుగా ఉడికించి  చల్లారబెట్టుకున్న  బేబీ  పొటాటోస్  ను వేసి  ,
దోరగా వేపువేపుకొవాలి  .
ముందుగా  మనం  తయారుచేసి  పెట్టుకున్న  ఉల్లికారమును  కూడా  బాగా  కలిపి ,
ఒక స్పూన్  ఆయిల్  వేసి , కొద్దిసేపు  మగ్గనిచ్చి ,
 స్టవ్  ఆఫ్  చేసుకుంటే
 బేబీ పొటాటోస్  ఉల్లికారం  కూర  రెడీ  అవుతుంది
ఈ కూర అన్నము  లోకి  చపాతీలలోకి  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Sunday, 25 December 2016

బంగాళాదుంప , బ్రెడ్ టోస్ట్


బంగాళాదుంప , బ్రెడ్ టోస్ట్

కావలిసిన  పదార్థాలు
1. బంగాళాదుంపలు  3
2. గ్రీన్ పీస్  అర కప్పు
3. బ్రెడ్ స్లైసెస్  8
4. గరం మసాలాపొడి  అర స్పూన్
5. అల్లం  వెల్లుల్లి  పేస్ట్  1 స్పూన్
6. జీడిపపప్పు  పొడి  1 స్పూన్
7. కారం  1 స్పూన్
8. ఉప్పు  రుచికి  సరిపడా
9.  కొత్తిమీర  తురుము  1 స్పూన్
10. జీలకర్ర  పొడి  1 స్పూన్
11.   ధనియాల  పొడి  1 స్పూన్
12.  ఆయిల్  4 స్పూన్స్
13.   నెయ్యి

తయారీ  విధానం
ముందుగా  బంగాళదుంపలను , గ్రీన్ పీస్  ను  శుభ్రం  గా  కడిగి ,
కుక్కరులో  పెట్టి  ఉడికించుకోవాలి . చల్లారిన  బంగాళదుంపలను  ,
పైన  వున్న తొక్కను  తీసి ఒక పక్కన  పెట్టుకోవాలి .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక,  ఆయిల్  వేసి,
అల్లం వెల్లుల్లి పేస్ట్  వేసి  , దోరగా  వేగాక ,
బంగాళదుంపలను  ,గ్రీన్ పీస్  ను  ,పసుపు ,
,ఉప్పు  ,కారం  ,జీలకర్రపొడి  ,ధనియాలపొడి  ,
జీడిపప్పుపొడి  ని , వేసి  ,బాగా కలిపి  కొద్దిసేపు  మగ్గనివ్వాలి .
ఒక బౌల్ లోకి  కూరను  తీసుకుని  ,పైన  కొత్తిమీరను  చల్లుకోవాలి ,
కూరను గట్టిగా  లేకుండా  చూసుకోవాలి .
స్టవ్  పైన  పెనం  పెట్టి  వేడెక్కాక , నెయ్యి  వేసి  ,బ్రెడ్  స్లైసెస్ ను  వేసి ,
దోరగా  కాల్చుకోవాలి  .
కాల్చుకున్న  రెండు  బ్రెడ్  స్లైసెస్  మధ్య
మనం తయారుచేసి  పెట్టుకున్న  కూరను  పెట్టి  సర్వ్  చేసుకోవాలి.
బంగాళాదుంప బ్రేడ్ టోస్ట్ రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Saturday, 24 December 2016

" పూరీ"


" పూరీ "

కావలిసిన పదార్ధములు
1. గోధుమ పిండి 3 కప్పులు
2.మైదా  పిండి   3. కప్పులు
3 ఉప్పు కొద్దిగా
4 నీళ్లు పిండి కలపడానికి సరిపడా
5. ఆయిల్ పావు లీటరు

తయారీ  విధానము
ముందుగా ఒక వెడల్పయిన బేసిన్ లోకి గోధుమ పిండి , మైదాపిండి ,
ఉప్పులను వేసి బాగా కలిపి ,కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ,
పిండి ని చపాతీ పిండి  మాదిరిగా  కలుపుకోవాలి .ఇలా  కలుపుకున్న
 పిండిని  బౌల్ లో ఉంచి కాసేపు నాననివ్వాలి.

కలిపి  పెట్టుకున్న  పిండిని , చిన్న  ఉండలుగా  చేసుకుని  ,
మధ్యస్తంగా , గుండ్రం గా ఒత్తుకోవాలి . దీనివలన  పూరీ లు  బాగా పొంగుతాయి .

స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  వొత్తుకున్న  పూరీ లను వేసి ,
ఆయిల్  లో మునిగిన తరువాత చిల్లుల గరిట తో ఒక సారి  నెమ్మదిగా ,
నొక్కి పెట్టి ఉంచితే పూరి పొంగుతుంది.
బాగా పొంగినతరువాత , పూరి ని తిరగేసి , వేయించాలి .

 వేగిన  తరువాత  , ఒక ప్లేట్ లో టిస్స్యు పేపర్ వేసి ,
పూరి ని ,  ఆయిల్ ఓడిన తరువాత ఆ పేపర్ మీద వెయ్యాలి.
మిగతా నూని ని పేపర్ పీల్చుకుంటుంది.
పూరి రెడీ అవుతుంది.
 వేడి వేడి పూరీలను " శనగ పిండి బంగాళాదుంప "
కూర  తో  సర్వ్  చేసుకుంటే  బాగుంటుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi

పూరీ సెనగ పిండికూర


పూరీ  సెనగ పిండికూర
కావలిసిన పదార్థాలు
1.  ఉల్లిపాయలు 5
2. బంగాళాదుంపలు 2
3. కేరట్లు 2
4. పసుపు కొద్దిగా
5. సెనగపిండి 3 స్పూన్స్
6. పచ్చిమిర్చి 3
7. అల్లం చిన్న ముక్క
8. కరివేపాకు9. పంచదార 1 స్పూన్
10. నీళ్లు కూరకి సరిపడా
11. ఉప్పు రుచికి సరిపడా
12. కొత్తిమీర

పోపుదినుసులు
సెనగ పప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అరస్పూన్ ,
జీలకర్ర అరస్పూన్ , ఎండుమిరపకాయ 1, ఆయిల్  2 స్పూన్స్

తయారీ విధానం
ఉల్లిపాయలను  చీలికలుగాను   ,అల్లమును  చిన్న  ముక్కలుగా  ,
పచ్చిమిర్చిని  చీలికలుగాను , బంగాళాదుంప,  కేరట్  లను  ,
చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి .

సెనగ పిండిని ఒక  బౌల్ లోకి  తీసుకుని , అందులో  ఒక  స్పూన్  పంచదారను ,
ఒక  గ్లాసు  నీళ్లను  పోసి  ,ఉండలు  లేకుండా  కలుపుకోవాలి  .

స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,
ఆయిల్  వేసి,   పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి  ,
దోరగా  వేగాక  ,
తరిగి పెట్టుకున్న  కూర  ముక్కలను,  కరివేపాకును,  పసుపు ,
 ఉప్పు ను  వేసి  బాగా కలిపి , తగినన్ని  నీళ్లు  పోసి   ,ఉడకనిచ్చి  ,
దీంట్లో  ముందుగా  నీళ్లలో  కలిపి  పెట్టుకున్న ,
 సెనగ పిండిని  వేసి  బాగా  కలిపి ఉడకనివ్వాలి  .

మధ్య  మధ్య లో  కలుపుతూ  ఉండాలి  లేకపోతే
అడుగంటుతుంది .
కూర  బాగా  దగ్గర  పడ్డాక  ,ఒక  బౌల్  లోకి  తీసుకుని  ,
కొత్తిమీర  తో  గార్నిష్  చేసుకుంటే  పూరీ   సెనగ  పిండి  కూర
రెడీ   అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi




సాష్టాంగ నమస్కారం


సాష్టాంగ నమస్కారం

స + అష్ట + అంగ = సాష్టాంగ.
అనగా 8 అంగములతో నమస్కారం చేయడం.
అలా నమస్కారం చేసే
సమయంలో ఈ శ్లోకం చదవాలి.

" ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే "

అష్టాంగాలు :
ఉరసు అంటే తొడలు,
శిరసు అంటే తల,
దృష్టి అనగా కళ్ళు,
మనసు అనగా హృదయం,
వచసు అనగా నోరు,
పద్భ్యాం - పాదములు,
కరాభ్యాం - చేతులు,
కర్నాభ్యాం - చెవులు.
బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నెలకు
తగిలించాలి.

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేకూడదు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

Friday, 23 December 2016

దొండకాయ ఉల్లి కారం కూర


దొండకాయ  ఉల్లి  కారం  కూర

కావలిసిన  పదార్థాలు
1. దొండకాయలు  పావుకేజీ
2.   పసుపు  కొద్దిగా
3. ఉప్పు రుచికి  సరిపడా
4. ఆయిల్ 5స్పూన్స్

ఉల్లి కారమునకు
ఉల్లిపాయలు  2 , ఎండుమిరపకాయలు  6 , సెనగపప్పు  1 స్పూన్,
మినపప్పు 1 స్పూన్ , ఆవాలు  అర స్పూన్ , జీలకర్ర అర  స్పూన్ ,
 ధనియాలు  1 స్పూన్ ,

తయారీ  విధానము
ముందుగా  దొండకాయలను  శుభ్రం గా  కడిగి ,
పైన  కింద  వున్న  తొడిమలు  తీసి ,
గుత్తి వంకాయ  మాదిరిగా  కాయలపడంగా  తరుగుకోవాలి  .

ఉల్లిపాయలను  సన్నగా చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి.

స్టవ్  వెలిగించి   బాణలి  పెట్టి ,  వేడెక్కాక  ఒక  స్పూన్  ఆయిల్  వేసి   ,
పైన  చెప్పిన  పోపు దినుసులను  వేసి,   దోరగా  వేపుకుని ,
 ఒక  ప్లేటులోకి  తీసకుని  చల్లార్చుకోవాలి .

మరల ఒక  స్పూన్  ఆయిల్  వేసి   , ఉల్లిపాయముక్కలు  కూడా   దోరగా  వేపుకుని,
చల్లార్చుకోవాలి .
ముందుగా  చల్లారిన  పోపును , తగినంత  ఉప్పు  వేసి  ,
మెత్తని  పొడిలాగా   గ్రైండ్ చేసుకుని ,
దీంట్లోనే  వేపుకున్న  ఉల్లిపాయ  ముక్కలను  వేసి   ,
మెత్తని  ముద్దలాగ  గ్రైండ్  చేసుకోవాలి .

ఇలా  గ్రైండ్  చేసి  పెట్టుకున్న  ఉల్లి కారమును  ,
తరిగి పెట్టుకున్న  దొండకాయలలో  కూరుకోవాలి .

 స్టవ్  వెలిగించి  వెడల్పయిన  బాణలి  పెట్టి  వేడెక్కాక   ,
3  స్పూన్స్  ఆయిల్  వేసి  ,
ఉల్లికారం కూరు కున్న  దొండకాయలను  వేసి, అట్లకాడ తో  కలిపి  ,
పైన  మూత  పెట్టి  బాగా  వేగనివ్వాలి.

మధ్య  మధ్యలో  అట్లకాడతో  కలుపుతూ  ఉండాలి.
అవసరమైతే  ఆయిల్  కూడా  వేస్తూ  ఉండాలి  .
కాయలన్ని  బాగా  వేగిన  తరువాత, స్టవ్  ఆఫ్  చేసుకుంటే  ,

దొండకాయ  ఉల్లికారం  కూరరెడీ  అవుతుంది.

ఈ  కూరకి  సన్నని  లేతగా  వుండే  దొండకాయలు  తీసుకుంటే  కూర  రుచిగా  వస్తుంది
ఈ కూరను  వేడి అన్నంలో  నెయ్యి  వేసుకుని  తింటే  రుచిగా  ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi


దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు


దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు

1. బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి.

2. అన్నదానం చేస్తే పేదరికం తొలగిపోయి ధనవృద్ధి కలుగుతుంది.

3. బంగారం ని దానం చేస్తే దోషాలు తొలగుతాయి.

4. వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది

5. పెరుగును దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు.

7. పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు.

8. తేనెను దానం చేస్తే సంతానం కలుగుతుంది.

9.ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది.

10. టెంకాయ  దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.

11. దీపాలు దానం చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది.

12.గోదానం చేస్తే ఋణ విముక్తులౌతారు.ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.

13. భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది ఈశ్వరలోక దర్శనం
      కలుగుతుంది.
14. వస్త్ర దానం చేస్తే ఆయుషు పెరుగుతుంది.

15. పండ్లను దానంచేస్తే బుద్ధి,సిద్ధి కలుగుతాయి.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

Thursday, 22 December 2016

చిక్కుడు కాయ వేపుడు


చిక్కుడు  కాయ  వేపుడు

కావలిసిన  పదార్థాలు
1. చిక్కుడుకాయలు  పావుకేజీ
2. పసుపు
3. కొద్దిగా  ఉప్పు  రుచికి  సరిపడా
4. కారం  తగినంత
5. ఆయిల్ 3 స్పూన్స్

తయారీ విధానము
ముందుగా  చిక్కుడుకాయలును  శుభ్రం  గా  కడిగి
ఈనెలు  తీసి  రెండు ముక్కలుగా  చేసుకోవాలి   .
స్టవ్  వెలిగించి బాణలి  పెట్టి  వేడెక్కాక  , ఆయిల్  వేసి  చిక్కుడుకాయముక్కలను ,
పసుపు  వేసి బాగా  కలిపి,  పైన  మూత  పెట్టి ,  మూత  మీద  కొద్దిగా  నీళ్లు  పోసుకోవాలి  .
మూత  మీద  నీళ్లు పోసుకోవడం  వలన  కూర  తొందరగా  మగ్గుతుంది .
మధ్యమధ్యలో  కలుపుతూ  ఉండాలి  . చిక్కుడుకాయ  ముక్కలు  బాగా వేగిన  తరువాత ,
 తగినంత ఉప్పు  కారం  వేసి ,  బాగా  కలిపి  స్టవ్  ఆఫ్  చేసుకుంటే  ,
చిక్కుడుకాయ  వేపుడు రెడీ అవుతుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi