Sunday, 31 July 2016

పాయసం


                                                                         పాయసం

కావలిసిన పదార్థాలు

1. సేమ్యా ఒక గ్లాసు
2. పాలు అరలీటరు
3. పంచదార పావుకేజీ
4. సగ్గు బియ్యం కొద్దిగా
5. ఇలాచీ పొడి కొద్దిగా
6. జీడిపప్పు పలుకులు 10
7. కిస్మిస్ 10
8. నెయ్యి కొద్దిగా
9. నీళ్లు ఒక చిన్న గ్లాసు

తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
నెయ్యి వేసి , జీడిపప్పు,  కిస్మిస్ , సేమ్యాలను,
దోరగా వేపుకోవాలి.
పాలు కాచుకోవాలి .
ఒక గిన్నెలో సగ్గు బియ్యం , నీళ్లు పోసుకుని
ఉడికించుకోవాలి .
ఉడికించిన సగ్గు బియ్యం చల్లారాక  ,
అందులో వేపుకుని పెట్టుకున్న
సేమ్యా , జీడిపప్పుపలుకులు , కిస్మిస్ ,
వేసి మరికొద్దిసేపుఉడకనిచ్చి
పంచదార , ఇలాచీపొడి వేసి ,
బాగా కలిపి కొద్దిసేపు ఉడకనివ్వాలి
దింపేముందు
జీడిపప్పు కిస్మిస్ తో గార్నిష్ చేసుకుంటే
సేమ్యా మరియు సగ్గుబియ్యం " పాయసం  " రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi






Friday, 29 July 2016

శ్రీ లలితా దేవి పంచరత్న స్తోత్రం



                                                  ॐ  శ్రీ లలితా దేవి పంచరత్న స్తోత్రం ॐ


ప్రాతః స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్||

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ |
మాణిక్యహేమవలయాంగదశోభమానాం
పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ ||

ప్రాతర్నమామి లలితాచరణారవిందం
భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ ||

ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ |
విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ ||

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి |
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ||
---------
యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే |
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్ ||

అందానికి , ఆరోగ్యానికి " తేనె, దాల్చిన చెక్క పొడి"

                                         
                                          అందానికి  ఆరోగ్యానికి  " తేనె, దాల్చిన చెక్క పొడి "

తేనె, దాల్చిన చెక్క పొడిని రోజూ తీసుకుంటే

చాలా వరకు వ్యాధులు నయమవుతా యంటున్నారు పరిశోధకులు.

ఆర్థరైటిస్‌ :
రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, ఒక చిన్న టీ స్పూన్‌ దాల్చిన చెక్కపొడిని
కప్పు వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే ఆర్థరైటిస్‌ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ తీసుకుంటే క్రానిక్‌ ఆర్థరైటిస్‌ సమస్య కూడా నయమవుతుంది.

మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు :
రెండు టేబుల్‌స్పూన్ల దాల్చినచెక్కపొడి, ఒక టీస్పూన్‌ తేనెను గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.

కొలెసా్ట్రల్‌ :
రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, మూడు టీస్పూన్ల దాల్చిన చెక్కపొడిని 16 ఔన్సుల టీ వాటర్‌తో కలిపి కొలెసా్ట్రల్‌ పేషెంట్స్‌ తీసుకోవాలి. ఇలా చేస్తే రెండు గంటల్లోగా 10 శాతం కొలెసా్ట్రల్‌ తగ్గిపోతుంది.

జలుబు :
సాధారణ జలుబు లేక తీవ్రమైన జలుబుతో బాధపడుతున్నా ఒక టేబుల్‌స్పూన్‌ తేనె, పావు చెంచా దాల్చినచెక్క పొడిని రోజుకొకసారి మూడు రోజుల పాటు తీసుకోవాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు, సైనస్‌ సమస్యలు దూరమవుతాయి.

కడుపునొప్పి :
దాల్చిన చెక్కను తేనె కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అల్సర్‌ సమస్య కూడా నయమవుతుంది.

గొంతు నొప్పి :
గొంతులో కిచ్‌ కిచ్‌గా ఉంటే ఒక టేబుల్‌స్పూన్‌ తేనె తీసుకోవాలి. ప్రతీ మూడు గంటలకొకసారి తీసుకుంటూనే ఉండాలి.
ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు త్వరగా దూరమవుతాయి.

మొటిమలు :
మూడు టేబుల్‌స్పూన్ల తేనె, ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని
పేస్టు మాదిరిగా చేసుకుని పడుకునే ముందు ముఖానికి పట్టించాలి.
ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
ఇలా రెండు వారాల పాటు చేస్తే మొటిమలు మొత్తం మటుమాయమవుతాయి.

వెయిట్‌లాస్‌ :
రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కంటే అరగంట ముందు పరగడుపున కప్పు నీటిలో తేనె, దాల్చిన చెక్కపొడి వేసుకుని మరిగించి తాగాలి. రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బరువుతు తగ్గుతారు.

నోటి సువాసన   :
ఒక టీ స్పూన్‌ తేనె, దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చటి నీళ్లలో వేసుకుని పుక్కిలిస్తే ఆ రోజంతా నోటి సువాసన తాజాదనాన్నిస్తుంది.

అలసట :
అర టేబుల్‌ స్పూన్‌ తేనెను గ్లాసు నీటిలో కలుపుకుని కొంచెం దాల్చిన చెక్కపొడిని అందులో వేసుకుని తాగితే అలసట దూరమవుతుంది. ముఖ్యంగీ సీనియర్‌ సిజిజన్స్‌కు ఇది బాగా ఉపకరిస్తుంది.

వినికిడి సమస్యలు :
రోజూ ఉదయం, రాత్రి తేనె, దాల్చిన చెక్క పొడిని సమానంగా తీసుకుంటే వినికిడి సమస్యలు తొలగిపోతాయి.

రోగనిరోధక శక్తి :
రోజూ క్రమంతప్పకుండా దాల్చిన చెక్కపొడిని తేనెతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది.

చర్మ వ్యాధులు :
తేనె, దాల్చినచెక్క పొడిని సమానంగా తీసుకుని సమస్య ఉన్న చోట పూస్తే ఎగ్జిమా, రింగ్‌వార్మ్స్‌, ఇతర స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.

కరివేపాకు పచ్చడి


                                                                 కరివేపాకు పచ్చడి

కావలిసిన పదార్థాలు
1. కరివేపాకు 3 కప్పులు
2. సెనగపప్పు 1 స్పూన్
3.  మినపప్పు 1 స్పూన్
4. ఆవాలు అరస్పూన్
5. జీలకర్ర అరస్పూన్
6. మెంతులు కొద్దిగా
7. ఇంగువ కొద్దిగా
8. ఎండుమిరపకాయలు 6
9. ఆయిల్ 2 స్పూన్స్
10.  చింతపండు కొద్దిగా
11పసుపు కొద్దిగా
12. ఉప్పు రుచికి సరిపడా
13. బెల్లం 3 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి
ఆరబెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని అది వేడెక్కాక,
 ఆయిల్ వేసుకుని  పైన చెప్పిన పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక
వేరే ప్లేట్ లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి .
అదే బాణలి లో ఆయిల్ వేసి,
 కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసి కొద్ధి సేపు వేగనివ్వాలి
ముందుగా  చల్లారిన పోపు ని మెత్తగా గ్రైండ్ చేసుకుని
దీంట్లో కరివేపాకుని , పసుపుని , ఉప్పు  , చింతపండు,
వేసుకుని గ్రైండ్ చేసుకుని ,
బెల్లం , కొద్దిగా నీళ్లుపోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే
కరివేపాకు పచ్చడి రెడీ అవుతుంది.
తీపిని ఇష్టపడని వాళ్ళు పోపుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తరువాత,
 కరివేపాకు పసుపు ఉప్పు చింతపండు వేసుకుని
కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే
కరివేపాకు పచ్చడి రెడీ అవుతుంది.

దీనిని వేడి అన్నంలోను ఇడ్లిలోకి దోసెలలోను చపాతీలోకి చాలాబాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

అటుకుల " సెట్ దోసె "


                                                        అటుకుల  " సెట్  దోసె "

కావలిసిన పదార్థాలు

1. అటుకులు ఒక గ్లాసు
2. బియ్యం 2 గ్లాసులు
3. పెరుగు ఒక గ్లాసు
4. ఉప్పు రుచికి సరిపడ
5. జీలకర్ర 1 స్పూన్
6. ఉల్లిపాయలు 2
7. కేరట్లు 2
8. పచ్చిమిర్చి 3
9. అల్లం చిన్న ముక్క
10.  కొత్తిమీర

తయారీ విధానం
ముందుగా అటుకులను పెరుగులోను ,
బియ్యాన్ని నీళ్లలోనూ నానబెట్టుకోవాలి .
ఎంత నానితే దోసెలు అంత రుచిగా వస్తాయి .
నానబెట్టుకున్న వీటిని శుభ్రంగా కడిగి ,
ఉప్పు , పచ్చిమిర్చి వేసుకుని  మెత్తగా ,
మినప దోసెలపిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి .
ఉల్లి పాయలను , అల్లం పచ్చిమిర్చి, కొత్తిమీర లను
 సన్నగా తరుగుకోవాలి ,
 క్యారెట్టును కొబ్బరికోరులాగా తురుముకోవాలి .
స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని అది వేడెక్కాక ,
ఆయిల్ వేసి పెనం అంతా రాసి ,
రుబ్బుకున్న పిండి ఒక గరిటెడువేసి ,
మధ్యస్తంగా తిప్పుకుని ,
పైన తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ , అల్లం , పచ్చిమిర్చి ముక్కలు ,
కారేట్టు తురుము , కొత్తిమీరలను  , జీలకర్రను  వేసి ,
అట్లకాడతో ఆదిమి
ఆయిల్ వేసి ,వేగాక
రెండో వైపుకి తిప్పి
ఆయిల్ వేసి దోరగా వేపుకుంటే
వేడి వేడి సెట్ దోసె  రెడీ
వీటిని కొత్తిమీర పచ్చడి తో గాని , పల్లి పచ్చడి తో గాని తింటే  బాగుంటుంది .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi



Thursday, 28 July 2016

కజ్జికాయలు


                                                                   కజ్జికాయలు

కావలిసిన పదార్థాలు

1. మైదా పిండి పావుకేజీ
2. బేకింగ్ పౌడర్ కొద్దిగా
3. వరిపిండి చిన్న గ్లాసు
4. ఆయిల్
5. ఉప్పు కొద్దిగా
6. కొబ్బరి కాయలు 2
7. బెల్లం పావుకేజీ
8. నెయ్యి కొద్దిగా

తయారీ విధానం

ముందుగా ఒక బౌల్ లోకి మైదాపిండి ని
వరిపిండిని , బేకింగ్ పౌడర్ ,   ఉప్పు వేసి ,
బాగా కలిపి నీళ్లు పోసుకుంటూ
పూరీ పిండి మాదిరిగా గట్టిగాకలుపుకోవాలి

కొబ్బరికాయలను చిన్న ముక్కలుగా తరుగుకుని
గ్రైండర్ లో కోరు లా చేసుకోవాలి
బెల్లాన్ని సన్నగా తురుముకోవాలి

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
వేడెక్కాక కొద్దిగా నెయ్యి వేసి
కొబ్బరి కోరును దోరగా వేపుకోవాలి

స్టవ్ పైన వేరే బాణలి పెట్టి
బెల్లం తురుము వేసి అది కరిగేక
వేపుకుని పెట్టుకున్న కొబ్బరి కోరును వేసి
కలిపి బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి
మధ్య మధ్య లో కలుపుతూ ఉండాలి
ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి

చల్లారిన తరువాత చిన్న ఉండలు గా చేసుకోవాలి
తరువాత ముందుగా నానబెట్టుకున్న
మైదాపిండిని చిన్న ఉండలుగా చేసుకుని
పూరీ మాదిరిగా వత్తుకోవాలి.

వత్తుకున్న ఈ పూరీలను కజ్జికాయలచట్రంపైన పెట్టి
దీంట్లో కొబ్బరి వుండలును పెట్టి
మడిచి  ఇవతలికి వచ్చినపిండిని తీసివేయాలి

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఆయిల్ పోసుకుని
వేడెక్కాక తయారు చేసుకున్న కజ్జి కాయలను వేసి
దోరగా వేపుకుని తీసుకుని
వీటన్నిటిని ఒక ప్లేటులో టిష్యూ పేపర్ వేసి
దాని మీద వేసుకోవాలి

కజ్జి కాయలు రెడీ
ఇవి ఒక 15 రోజులపాటు నిల్వవుంటాయి

Subha's kitchen 

సాంబారు


                                                                       సాంబారు

కావలిసిన పదార్థాలు

1. ఆనపకాయముక్కలు ఒక కప్పు
2. వంకాయలు 2
3. బెండకాయలు 2
4. టొమాటోలు 2
5. ఉల్లిపాయలు 4
6. మునగకాడ. 1
7. పచ్చిమిర్చి  3
8. కొబ్బరి తురుము అర కప్పు
9. కరివేపాకు
10. పసుపు
11. ఉప్పు రుచికి సరిపడ
12. చింతపండు
13.  కందిపప్పు ఒక గ్లాసు
14. బెల్లం కొద్దిగా

సాంబారు పొడికి
సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్,
 ఆవాలు అరస్పూన్ ,
జీలకర్ర అరస్పూన్ , ఇంగువ కొద్దిగా , మిరియాలు 4
ఎండుమిరపకాయలు 4 , ధనియాలు 1 స్పూన్
మెంతులు పావుస్పూన్ ,, బియ్యం అరస్పూన్
వెల్లుల్లి రెబ్బలు 5 , ఆయిల్ 2 స్పూన్స్.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
వేడెక్కాక , ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను ,
బియ్యాన్ని వేసి వేసి దోరగా వేపుకోవాలి
వీటిని చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి

తయారీ విధానం
ముందుగా పైన చెప్పిన కూర ముక్కలను ,
కందిపప్పును కుక్కరులో పెట్టి ఉడికించుకోవాలి.
 చింతపండు ను ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి
నానబెట్టుకోవాలి
నానిన చింతపండు ను పిప్పిలు తీసివేసి
పులుసులా చేసుకుని దీంట్లో
 ఉడికించి పెట్టుకున్న కూర ముక్కలను ,
మెత్తగా చిదుముకున్న
 కందిపప్పును,
పసుపు,  ఉప్పు,  బెల్లము ,
తయారుచేసుకున్న సాంబారు పొడి ,
కొబ్బరితురుములను  వేసీ బాగా కలిపి
స్టవ్ వెలిగించి దాని మీద పెట్టుకుని మరగనివ్వాలి.
 మధ్య మధ్య లో కలుపుతూ ఉండాలి.
వెల్లులి రెబ్బలు , కొద్దిగా ఆవాలు ,  మెంతులు ,జీలకర్ర ,
ఇంగువ కరివేపాకులను వేరే బాణలిలో వేపుకుని
మరుగుతున్న సాంబారులో వెయ్యాలి .
ఒక ఇరవై నిమిషాలు పాటు బాగా మరిగిన తరువాత
కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి

ఘుమ ఘుమ లాడేసాంబారు రెడీ

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi








Wednesday, 27 July 2016

వేరుశనగ చట్నీ



                                                                       
                                                                  వేరుశనగ  చట్నీ    

కావలిసిన పదార్థాలు

1. పల్లీలు ఒక కప్పు
2. సెనగపప్పు 1 స్పూన్
3. మినపప్పు 1 స్పూన్
4. ఆవాలు అర స్పూన్
5. జీలకర్ర అరస్పూన్
6. ఎండు మిరపకాయలు 4
7. బెల్లం చిన్న ముక్క
8. పసుపు కొద్దిగా
9. ఉప్పు రుచికి సరిపడా
10. పచ్చిమిర్చి 3
11. కరివేపాకు
12. ఆయిల్ 2 స్పూన్స్

తయారీవిధానం

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
సెనగపప్పు,  మినపప్పు ,
ఆవాలు , జీలకర్ర,
ఎండుమిరపకాయలు ,
వేసి దోరగా వేపుకోవాలి .

వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి
అదే బాణలిలో పల్లీలను వేసి
దోరగా వేగనిచ్చి చల్లారనివ్వాలి .

పల్లీలు చల్లారినతరువాత
పైన వున్న పొట్టును తీసిచెరగాలి.
 చెరిగిన తరువాత వీటిని వేగిన పోపును
మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకుని

ఈ పొడిలో పసుపు , ఉప్పు ,
పచ్చిమిరపకాయలు , బెల్లం ,
కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని
ఒకబౌల్ లోకి తీసుకోవాలి

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
మినపప్పు , ఆవాలు , జీలకర్ర , కరివేపాకు ,
వేసి దోరగా వేపుకుని

పచ్చడి మీద వేసుకుంటే
ఘుమ ఘుమ లాడే పల్లీ పచ్చడి రెడీ

మినపదోస , రవ్వ దోస , ఇడ్లిలో చాలా బాగుంటుంది 

Subha's kitchen 

Tuesday, 26 July 2016

పెసరట్టు


పెసరట్టు
పెసరట్టు తీసుకుంటే శరీరం లో వ్యర్దాలను బయటకు పంపుతుంది.

1).మొలకెత్తిన పెసలను తీసుకుని మనం పిండిగా చేసుకుంటే దానిలోని ఫైబర్,ప్రొటీన్ వంటివి రెండింతలు అవుతాయి.
2).ఇక దీన్ని అధిక బరువు,డయాబెటిస్,కొలెస్ట్రాల్ లేక ఇతరత్రా సమస్యలతో భాధపడుతున్న చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు.
3).న్యూట్రిషనల్ సైన్స్ & న్యాచురల్ సైన్స్ ప్రకారం పెసలు ఔషధీ గుణాలు కలిగి ఉండి, శరీరం నుండి వాత, పిత్త దోషాలను, శరీరం నుండి వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది
4).కనీసం వారానికి ఒక్కసారైనా తీసుకుంటే చాలా మంచిది.
5).పెసరట్టులో కొన్ని ఉల్లిపాయలు,జీలకర్ర,అల్లం,వెల్లుల్లి వేసుకుని తింటే శరీరానికి చాలా మంచిది.

కావలిసిన పదార్థాలు
1. పెసలు ఒక గ్లాసు
2. బియ్యం 2 స్పూన్
 3. ఉల్లిపాయలు 2
4. పచ్చిమిర్చి 3
5. అల్లం చిన్న ముక్క
6  జీలకర్ర
తయారీ విధానం
ముందుగా పెసలను, బియ్యాన్ని
 8 గంటలసేపు నాన బెట్టుకోవాలి .
బియ్యం వేసుకుంటే పెసరట్లు కరకరలాడుతూ వస్తాయి
నానిన  పెసలనుపచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఉల్లి పాయలను , మిరపకాయలను ,
అల్లాన్ని సన్నగా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి పెనం పెట్టి అది వేడెక్కాక
పెనమును నాన్ స్టికీ గా మార్చుకోవడము :
వేడి ఎక్కిన పెనము మీద
ఆయిల్ వేసి పెనం అంతా రాసి,
కొద్దిగా నీళ్లు చల్లి గుడ్డతో తుడిచెయ్యాలి
తరువాత కొంచెం ఆయిల్ వేసి
ఉల్లిపాయ సగానికి కోసి ఆ అరబద్దతో
పెనము అతా రాయాలి అప్పుడు పెనము మీద
ఆయిల్ పొర ఏర్పడి పెనము నాన్ స్టికీ గా మారుతుంది )
ముందుగా రుబ్బుకుని పెట్టుకున్న పెసరపిండిని
ఒకటిన్నర గరిటవేసి పెనం అంతా పరుచుకునేలా
తిప్పుకుని ,
జీలకర్రని , తరిగిపెట్టుకున్న ఉల్లిపాయాళ్ళం
ముక్కలని, మిరపకాయల   ముక్కలని  వేసి,
కొద్దిగా ఆయిల్ వేసి  వేగనివ్వాలి
అట్టు ని తిరగేసి మరలా కొద్దిగా ఆయిల్ వేసి
అట్టుదోరగా వేగాక
ఒక ప్లేట్ లోకి తీసుకుని పెడితే
పెసరట్టు రెడీ.
దీనిని అల్లం పచ్చడి తోగాని,
కొబ్బరి పచ్చడి తో గాని తింటే చాలాబాగుంటుంది
నూని బదులు
మంచి నెయ్యి వేసి  వేగనిస్తే
ఆ నేతి  పెసరట్టు రుచి ఇంకా బాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi









టొమాటో పప్పు


                                                              టొమాటో పప్పు

కావలిసిన పదార్థాలు

1 టమాటో లు 3
2. పచ్చిమిర్చి 3
3. కందిపప్పు ఒక కప్పు
4. పసుపు కొద్దిగా
5. చింతపండు కొద్దిగా
6.  ఉప్పు రుచికి సరిపడ

పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అరస్పూన్
 జీలకర్ర అర స్పూన్
ఇంగువ కొద్దిగా
ఎండుమిరపకాయలు 2
కరివేపాకు
ఆయిల్  2 స్పూన్స్
 వెల్లుల్లి రెబ్బలు 3
కొత్తిమీర

తయారీవిధానం
ముందుగా కందిపప్పును శుభ్రం గా కడుగుకొని
కుక్కరులో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి .
టొమాటోముక్కలను   సన్నగా తరుగుకోవాలి
పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసుకుని పైన చెప్పిన
పోపు దినుసులను వేసి
అవి దోరగా వేగాక
 టొమాటో ముక్కలను, వెల్లుల్లిరెబ్బలను,
 పచ్చిమిర్చి  చీలికలు ,కరివేపాకుని వేసి ,
అవి కూడా దోరగా వేగాక
ఉడికించి పెట్టుకున్న కందిపప్పును ,
చింత పండు గుజ్జును ,పసుపును ,
సరిపడినంత ఉప్పు ను వేసి
బాగా కలిపి స్టవ్ మంటను సిమ్  లో పెట్టుకుని
పప్పు అంత దగ్గరపడేంతవరకు ఉడకనిచ్చి
పైన
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
ఘుమఘుమ లాడే  టొమాటో పప్పు రెడీ
వేసివేడి  అన్నములో మంచి నెయ్యి వేసుకుని
ఆవకాయ తో బాగుంటుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi