Sunday, 19 April 2020

సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం


సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం



క్షమంవ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే!
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే!!

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే!
త్వయా వినా జగత్పర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్!!

సర్వ సంపత్స్వ రూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ!
రాసేశ్వర్యది దేవీత్వం త్వత్కలా సర్వయోపిత!!

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా!
స్వర్గేచ స్వర్గ లక్ష్మీస్త్వం మర్త్య లక్షీశ్చ భూతలే!!

వైకుంఠేచ మహాలక్ష్మీ: దేవదేవీ సరస్వతీ !
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః!!

కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే!
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ!!

పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే!
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే!!

కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననేపిచ!
రాజాలక్ష్మీ: రాజ గేహే గృహలక్ష్మీర్గ్రుహే గృహే !!

ఇత్యుక్వ్తా దేవతాస్సర్వా మునయో మనవాస్తథా!!
రూరూదుర్న మ్రవదనా శుష్క కంఠోష్ఠ తాలుకా!!

ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవై కృతం శుభమ్!
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ద్రువమ్!!

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్!
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్!!

పుత్రా పౌత్ర పతీం శుద్ధాం కులజాం కోమలాం వారామ్!
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్!!

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్!
భ్రష్టరాజయో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్!!

హత బందుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్!
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ద్రువమ్!!

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్!
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్!!



ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్


విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత


విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..

రోజుకు కనీసం ఒక్క సారైనా
విష్ణుసహస్ర నామ పారాయణం చేయండి.
ఉత్తమ ఫలితాలు పొందండి..

మంత్రాల ఘనికి మూల మంత్రం శ్రీ విష్ణుసహస్రనామం

ఓం నమో నారాయణాయ .
ఓం నమో భగవతే వాసుదేవాయ .

ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది...

విష్ణు సహస్ర నామ స్తోత్రము
పారాయణ చేసిన

అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యము కలుగును,
పాపములు తొలగును.

స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం.
మన నిత్య జీవితంలోని అన్నీ సమస్యలకు పరిష్కరాలు ఇందులో వున్నాయి

విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు.

అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి.
విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ.. ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంటి దేవతా పూజతో, ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు.

అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే

1. అదృష్టం

2. ఆర్థిక ఇబ్బందులు వుండవు

3. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం

4. కోరిన కోరికలు నెరవేరుతాయి

5. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది

విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్ర నామం నుంచి వెలువడే శబ్ధం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. అలాగే తులసీ మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు.

అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను
108 మార్లు జపించవలెను.
పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:

1. విద్యాభివృద్ధికి :-
14వ శ్లోకం.
సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||

2. ఉదర రోగ నివృత్తికి:-
16వ శ్లోకం.
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||

3. ఉత్సాహమునకు:-
18వ శ్లోకం.
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||

4. మేధాసంపత్తికి:-
19వ శ్లోకం.
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||

5. కంటి చూపునకు:-
24వ శ్లోకం.
అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |
సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||

6. కోరికలిడేరుటకు:-
27వ శ్లోకం.
అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |
సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||

7. వివాహ ప్రాప్తికి:-
32వ శ్లోకం.
భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||

8. అభివృద్ధికి:-
42వ శ్లోకం.
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |
పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||

9. మరణ భీతి తొలగుటకు:-
44వ శ్లోకం.
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||

10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:-
46వ శ్లోకం.
విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం |
అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||

11. జ్ఞానాభివ్రుద్ధికి:-
48వ శ్లోకం.
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |
సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||

12. క్షేమాభివ్రుధ్ధికి:-
64వ శ్లోకం
అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |
శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||

13. నిరంతర దైవ చింతనకు:-
65వ శ్లోకం.
శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||

14. దుఃఖ నివారణకు:-
67వ శ్లోకం.
ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |
భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||

15. జన్మ రాహిత్యమునకు:-
75వ శ్లోకం.
సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||

16. విద్యా ప్రాప్తి కి :-
80వ శ్లోకం.
అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||

17. శత్రువుల జయించుటకు:-
88వ శ్లోకం.
సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !
న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||

18. భయ నాశనమునకు:-
89వ శ్లోకం.
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |
అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||

19. సంతాన ప్రాప్తి కి :-
90వ శ్లోకం.
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|
అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||

20. మంగళ ప్రాప్తికి:-
96వ శ్లోకం.
సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |
స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||

21. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:-
97 & 98వ శ్లోకం.
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |
శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||

22. దుస్వప్న నాశనమునకు:-
99వ శ్లోకం.
ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |
వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||

23. పాపక్షయమునకు:-
106వ శ్లోకం.
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |
దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాసనః ||

24.సర్వ రోగ నివారణకు:-
103వ శ్లోకం.
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః
తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||

25. సుఖ ప్రసవమునకు:-
107వ శ్లోకం.
శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|
రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||
శ్రీ స్సర్వ ప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి

విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించవలెను.

(సేకరణ)

సరస్వతీ దేవి చరిత్ర


సరస్వతీ దేవి చరిత్ర

హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది.
ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి.
వేదాలు, పురాణాలలో విపులంగాసరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది.
కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి.
నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది.

స్వరూపం.....
ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ,
బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95),
పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి.
సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని
వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు.
బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా
బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు
శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది.
సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ.

వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం – వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు.
ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది.
సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం.
“శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు”నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో
తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు.
సరస్వతి ధరించే వీణ పేరు”కచ్ఛపి”.

పరాశక్తి, జ్ఞాన ప్రదాతసరస్వతి –
రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం –
9వ శతాబ్దానికి చెందినది
పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు
సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని
దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది.
మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.

జ్ఞాన ప్రదాతగా సరస్వతి – కొన్ని గాధలు...
పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు.
శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు.
ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు.

అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది.
అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు.
ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు.

పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు.
వాల్మీకి జగదాంబను స్మరించాడు.
అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు.
వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు.
ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు.

ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు.
శివుడు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు.
ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు.
అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి
వేయి దివ్య సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.

పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు
యాజ్ఞవల్క్య మహర్షి.
అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు.
సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు.
అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటాన్ని గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు.
యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు.
ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు.
తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని,
విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని,
గ్రంధ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు.
సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది.
ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది.

ఆలయాలు....
ఆంధ్రప్రదేశ్...బాసర.
ఆదిలాబాదు జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం
నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో
గోదావరి నది ఒడ్డున ఉంది.
హైదరాబాదు కు సుమారు 200 కి.మీ. దూరం.
బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము.
బాసరలో జ్ఙాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు.
ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది.
ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది.

వరంగల్..
హైదరాబాదు కు సుమారు 48 కి.మీ. దూరం లోగల వరంగల్ లోని ఈఆలయం క్రమంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.

జమ్ము ‍‍& కాష్మీర్..
కాష్మీర్ లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది.
ఇప్పుడు పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాష్మీర్ భూభాగంలో ఉన్న ఈ మందిరం చారిత్రికంగా చాలా ముఖ్యమైనది. కాష్మీర్ చరిత్రకారుడైన కల్హణుడు తన రాజ తరంగిణిలో ఈ మందిరం గురించి విపులంగా వ్రాశాడు.
“నమస్తే శారదా దేవి కాష్మీర మండల వాసిని” అన్న ప్రార్ధన దేశమంతటా వాడబడేది.
శాండిల్య మునికి శారదా దేవి ఇక్కడ (ఎగువ కిషన్ గంజ్ లోయ ప్రాంతంలో) ప్రత్యక్షమైనదని కధనం. దేశమంతటినుండీ పండితులకు ఇది పరమ పవిత్ర క్షేత్రం. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి గురువులు ఇక్కడికి వచ్చి దేవి దర్శనం చేసుకొన్నారని అంటారు.

ఈ మందిరం ఉన్న స్థలాన్ని కూడా కల్హణుడు
(8వ శతాబ్దం) తన కాష్మీర రాజ చరిత్రలో వర్ణించాడు (శిర్హసిల కోట ముట్టడి గురించి చెప్పిన సందర్భంలో Raj. viii- 2556-2706).
అంతకంటె ముందు కాలం గ్రంధం “శారదా మహాత్మ్యం” లో ఈ మందిరానికి వెళ్ళే యాత్రీకుల ప్రయాణ మార్గం వర్ణన ఉంది.
ఆ రెండు వర్ణనల ప్రకారం ఈ మందిరం ఎగువ కిషన్‌గంజ్ లోయ ప్రాంతంలో ఉండాలి.
శాండిల్య మునికి శారదా దేవి ప్రత్యక్షమైనదని చెప్పే స్థలం లోనే ఈ మందిరం నిర్మింపబడింది.
ప్రధానాలయం 22 అడుగుల చదరపు ఆకారంలో నిర్మింపబడింది.
10వ శతాబ్దంలో ‘అల్ బెరూని’ కూడా ఈ మందిరాన్ని వర్ణించాడు.

కర్ణాటక..శృంగేరి..
కర్ణాటక లోని శృంగేరిలో ఆదిశంకరాచార్యులచే ప్రతిష్టింపబడిన సరస్వతీ మూర్తిని అనేకులు దర్శిస్తారు.

తమిళనాడు..కూతనూర్..
తమిళనాడులో ‘కూతనూర్’ వద్ద మరొక సరస్వతీ మందిరం ఉంది. ఈ వూరు మైలాదుతురై – తిరువారూర్ రైలు మార్గంలో పూన్‌తోట్టమ్ గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది.
త్రివేణి సంగమానికి సంబంధించిన ఒక కధ ఇక్కడి స్థలపురాణంలో చెబుతారు.
కంబన్ కవి సమకాలీనుడైన ఊతకూత్తల్ కవి జీవితగాధతో ఈ క్షేత్రానికి సంబంధం ఉంది. హంసవాహనయైన ఈ దేవి దర్శనానికి అనేకులు వస్తూ ఉంటారు.
ఇంకా ఈ దేవాలయంలో వినాయకుడు, బ్రహ్మ, నాగరాజు, మురుగన్, హంస, నారద వినాయకుల విగ్రహాలున్నాయి. ఇక్కడ 1941, 1968, 1987 సంవత్సరాలలో కుంభాభిషేకం జరిగింది.

రాజస్థాన్...పిలానీ..
రాజస్థాన్ లోని పిలానిలో బిర్లా కుటుంబీకులు నిర్మించిన శారదా మందిరం ఉంది.
‘బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎండ్ సైన్సెస్’ ఆవరణ అయిన విద్యావిహార్‌లో ఈ మందిరం ఉంది.
ఖజురాహో ఖండరీయ మహాదేవ ఆలయం శైలిలో నిర్మింపబడిన ఆధునిక మందిరం ఇది.

ఇంకా..
హిందూమత ప్రభావం ఉన్న బౌద్ధమతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహా సరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్ర సారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది.
జైనులు శృతదేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించారు.
శ్వేతాంబరులు హంసవాహిని అని ఈ దేవిని స్తుతించారు. “శ్రీ మద్భోజ నరేంద్ర చంద్ర నగరీ విద్యాధరీ” అని భోజుడు వాగ్దేవిని ప్రతిష్టించాడని ప్రసిద్ధి ఉన్నది.

క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహము
ఉత్తర ప్రదేశ్‌లో మధుర సమీపంలోని ‘ఖజ్జాలీటీలా’లో లభించింది.
గుప్తరాజులలో ఒకడైన సముద్ర గుప్తుడు
తన సువర్ణ నాణెములపై ఒకవైపు సరస్వతీ దేవిని, మరొకవైపు వీణను ముద్రించాడు.
అలాగే క్రీ.పూ. 550-575 ప్రాంతంలో ఒక గౌడ వంశ రాజుల తన నాణెములపై సరస్వతీ దేవి రూపమును ముద్రించాడు.
క్రీ.శ. 10వ శతాబ్దంలో ఒరిస్సా (ఖచ్చింగ్)లో వీణాపాణియైన సరస్వతి విగ్రహం చెక్కబడింది.
పాల వంశపు రాజుల నాటివని చెప్పబడుచున్న
సరస్వతి విగ్రహాలు పాట్నాలోను, కలకత్తా (హాష్‌తోష్) మ్యూజియంలోను భద్రపరచబడ్డాయి.
ఇంకా వివిధ మ్యూజియంలలో సరస్వతి శిల్పాలున్నాయి. ఖజురాహోలోని పార్శ్వనాధాలయంలోను, ఖందరీయ మహాదేవాలయంలోను వాగ్దేవి విగ్రహాలున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్‌లోని ఘంటసాలలో క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహం లభించింది.
క్రీ.శ. 10వ శతాబ్దికి చెందిన చాళుక్యుల కాలం నాటి విగ్రహం సామర్లకోట భీమేశ్వరాలయంలో ఉంది. కారెంపూడి, తంజావూరు, హలెబీడు, శ్రీరంగంలలో సరస్వతీ దేవి విగ్రహాలున్నాయి.

పేర్లు..
అనేక హిందూ దేవతలకు వలెనే సరస్వతి అష్టోత్తర శత నామాలు, సహస్ర నామాలు ఉన్నాయి.
ఇంకా వివిధ స్తోత్రాలలో అనేక నామాలు వాడబడ్డాయి. అయితే శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రంలో చెప్పబడిన పేర్లు..
1. భారతి
2. సరస్వతి
3. శారద
4. హంస వాహిని
5. జగతీ ఖ్యాత
6. వాగీశ్వర
7. కౌమారి
8. బ్రహ్మ చారిణి
9. బుద్ధి ధాత్రి
10. వరదాయిని
11. క్షుద్ర ఘంట
12. భువనేశ్వరి

ఇదే స్తోత్రం ఆరంభంలో సరస్వతి, వీణాపుస్తక ధారిణి, హంస వాహన, విద్యా దానకరి అన్న సంబోధనలు, చివరిలో బ్రాహ్మీ, పరమేశ్వరి, బ్రహ్మ రూపి అన్న సంబోధనలు ఉన్నాయి.
ఇంకా వివిధ సందర్భాలలో చెప్పబడిన కొన్ని నామములు – అనుష్టుప్, ఆదిత్య, ఈ, ఉక్తి, ఐందవి, కభార్య కాదంబరి, కాషాయ మోహిని, కాషాయ వల్లభ, గీః, గీర్దేవి, గౌః, జూం, పుస్తకమ్, బ్రాహ్మీ, భగవతీ, భారతీ, భాషా, మహాలక్ష్మీః, వర్ణ రూపిణీ, వాక్, వాణీ, వారీ, శారదా, శ్రీః, సావిత్రీ – అన్న నామాలు వాడబడినాయి.
అచ్చ తెలుగులో వివిధ కవులు వాడిన సంబోధనలు –

అంచ తత్తడి చెలియ, తూటిగానపు తేజీగల బోటి (హంస వాహిని)
కలన తపసి తల్లి (నారదుని తల్లి)
చదువుల తల్లి, చదువుల వెలది
తల వాకిటను మెలగు చెలువ, పలుకు చెలి (వాగ్రూప)
నలువ రాణి, వెన్నుని కొడుకు రాణి (బ్రహ్మకు భార్య)
పొత్తము ముత్తో (పుస్తక రూపిణి)
మినుకు జేడియ (విద్యుద్రూపిణి)
లచ్చి కోడలు (లక్ష్మీ దేవికి కోడలు)
వెల్ల ముత్తైదువ (తెల్లని రూపము గలది)

ప్రార్ధనలు, స్తోత్రాలు..
తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్యం.
ఇది పోతన రచించిన పద్యమని కొందరంటారు.

తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్
నీవునాయుల్లంబందున నిల్చి జృంభణముగా సుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా

పెక్కు సంస్కృత ప్రార్ధనా స్తుతులతో బాటు తెలుగులో కూడా అనేకానేక స్తోత్రాలున్నాయి. ఏదైనా రచన ఆరంభంలో గురువునూ, వినాయకునీ, తల్లిదండ్రులనూ, ఇష్ట దైవాన్నీ స్తుతించడం
తెలుగు సాంప్రదాయిక రచనలలో ఆనవాయితీ గనుక సరస్వతి స్తుతులు చాలా ఉండవచ్చును.
వాటిలో కొన్ని ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి.

శ్రీ సరస్వతీ నిత్యపూజా విధానము
శ్రీ సరస్వతీ కవచం
శ్రీ మహాసరస్వతీ ధ్యానం
పుస్తక పూజ (అక్షరాభ్యాసం)
శ్రీ సరస్వతీ ప్రార్ధన
శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం
శ్రీ సరస్వతీ సహస్ర నామావళి
శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామ స్తోత్రం
శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామావళి
శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రం
శ్రీ సరస్వతీ స్తోత్రము (అగస్త్య ప్రోక్తం)
శ్రీ సరస్వతీ సూక్తము
శ్రీ సరస్వతీ గాయత్రి.

( వివరాలు సేకరణ )

Tuesday, 17 March 2020

రోగ నిరోధక మంత్రాలు

రోగ నిరోధక మంత్రాలు


మంత్రం చదివేటప్పుడు ఆ శబ్దనికి ప్రతిస్పందించే ప్రకృతిలోని కొన్ని శక్తులు మన శరీరాన్ని ఆకర్షిస్థాయి..
అప్పుడు మనకు రోగ నిరోధక శక్తి మనో ధైర్యం,
బలం లభిస్తుంది..

ఒకప్పుడు వైద్యులు ఔషధం తో పాటు ఒక మంత్రం కూడా ఇచ్చే వాళ్ళు ఔషధం సేవించే టప్పుడు ఆ మంత్రాన్ని చదివి ఔషధం తీసుకోమని చెప్పే వాళ్ళు,
తేలు మంత్రం..పాము మంత్రంతో ప్రాణాలు నిలుపుకున్న పల్లె ప్రజలు ఉన్నారు..
ఇప్పుడు అలాంటి కొన్ని మంత్రాల గురించి కొన్ని వివరాలు :

1. నారాయణీయం

(ఇది గురువాయురు కృషుడి గురించి రాసిన వేయి పద్యాల అద్భుతమైన వర్ణన )
ఈ శ్లోకాలు జబ్బుతో ఉన్న వారు కానీ లేక వారి కోసం ఎవరు చదివినా భయంకరమైన  ప్రాణాపాయ జబ్బులు, కాన్సర్, దీర్ఘకాలిక రోగాలు నశించి పోతాయి.
ఒకసారి ఆ పుస్తకం తెచ్చుకుని ప్రయత్నం చేయండి, కృషుడి పైన పద్యాలు వాటి అర్థాలు ఎంతో భక్తి భావనతో భావోద్వేగాలు కలిగిస్తుంది...
చక్కటి ఆరోగ్యం ఆలోచన కలిగిస్తుంది..

2. వైద్యనాద్ స్త్రోత్రం

శివయ్య గొప్ప వైద్యుడు కూడా  
పురాణకాలం నుండి వైద్యంకోసం శివుని ఆరాధించేవారు, చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు
ప్రదోష కాలంలో ఈ వైద్యనాద్ స్త్రోత్రం,
శివ స్త్రోత్రాలు పారాయణం ప్రతి రోజు చేయాలి, సోమవారంనాడు శివునికి వాయుప్రతిష్ఠ చేసిన లింగానికి వారి చేత్తో అబీషేకం చేయాలి,
ఆరుద్ర నక్షత్రం రోజు ప్రదోష కాలంలో మట్టితో శివలింగాన్ని చేసుకుని, బియ్యం పిండి, గంధం, విభూది వీటితో
ఒక్కో దానితో ఓం నమః శివాయ అని 108 సార్లు
అర్చన చేసి, నైవేద్యం పెట్టి వైద్యనాద్ స్త్రోత్రం పఠించి  హారతి ఇవ్వాలి ,
కాసేపు  ధ్యానం చేసి ప్రసాదం భక్తిగా స్వీకరించాలి.. సంకల్పంతో మీకు ఆరోగ్యం ప్రసాదించమని వేడుకోవాలి, ప్రసాదం తినేటప్పుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుని తినాలి..
తర్వాత మీరు చేసిన మట్టి శివలింగాన్ని ప్రవహిస్తున్న నీటిలో కలపాలి
చెరువు అయినా పర్వాలేదు...
అలా నిమర్జన చేయడంలోనే మీకు మీ బాధ నుండి
చాలా ఉపశమనం లభిస్తుంది..
ఇలా ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తూ రావాలి
మీకు పూర్తి ఆరోగ్యం లభించాక శివాలయంలో
అభిషేకం చేయించండి...

3.చిన్న చిన్నవి తరచూ వచ్చే జ్వరాలు , కీళ్ల నొప్పులు, ఊబకాయం , తిన్నది అరగక పోవడం,
వంటికి పట్టకపోవడం, తరచు నీరసం లాంటి
కారణం తెలియని రోగాలు మంచి ఉపాయం హనుమంతుడి గుడి సందర్శన,
 హనుమాన్ చాలీసా రోజు చదవడం..

4. రాహుకాలం లో దుర్గ దేవి, సుబ్రహ్మణ్యస్వామి , కాలభైరవ స్వామి శ్లోకములు చదువుతూ ఉన్నా అకారణంగా వచ్చే భయాలు, నిద్రలో ఉలిక్కి పడటం, తరచు క్రిందపడటం ఇలాంటి బాధలు ఉండదు,.

5. ఏ ఔషధం సేవిస్తున్న కూడా
"ఓం నమో భగవతే వాసుదేవాయా " అని సేవిస్తే
ఆ మందు మీకు బాగా పనిచేస్తుంది.

6. రోజూ ఐదు తులసి ఆకులు తినండి,
కాసేపు తులసికి దగ్గరగా కూర్చోండి.
తులసి మొక్క ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది,
రేఖీ, విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే గుణం తులసికి ఉంది ,
 ఇలాగే ఆవుకి కూడా.
అవకాశం ఉన్న వారు కాసేపు గోసాలలో గడపండి..

వైద్యం చేయించు కుంటూ ఇవి పాటిస్తే
త్వరగా గుణం ఉంటుంది.
మానవ ప్రయత్నం మానకూడదు.
దైవ బలం వదులు కొకూడదు.

                 

Sunday, 15 March 2020

ఇంటిదగ్గరే కల్తీని కనిపెట్టడానికి తేలికపాటి పరీక్షలు

ఆహార భద్రత, ప్రమాణాల శాఖ
ఇంటిదగ్గరే కల్తీని కనిపెట్టడానికి తేలికపాటి పరీక్షలు ఎలా చేయొచ్చో చెప్పే ఒక మాన్యూల్‌ని రూపొందించింది.
‘డిటెక్ట్‌ అడల్టరేషన్‌ విత్‌ రాపిడ్‌ టెస్ట్‌’ అనే ఈ పుస్తకాన్ని 41 పరీక్షల వివరాలతో తమ వెబ్‌సైట్‌లో పెట్టింది.
అందులో కొన్ని...
* చిన్న సీసాలోకి కొద్దిగా పాలు తీసుకునిగిలకొట్టాలి. డిటర్జెంట్‌లాంటివి ఏమైనా కలిపితే నురగ ఎక్కువగా వస్తుంది.
* తెల్లని బ్లాటింగ్‌పేపర్‌ని తడిపి కానీ తడి దూదితో కానీ కూరగాయలూ పండ్లూ తుడిస్తే కృత్రిమరంగు ఉంటే తెలిసిపోతుంది.
* ఐస్‌క్రీమ్‌ కొంచెం విడిగా తీసి దానిమీద రెండు చుక్కలు నిమ్మరసం పిండాలి. నురగలు వస్తే వాషింగ్‌పౌడర్‌లాంటి పదార్థమేదో కల్తీ జరిగినట్లు.
* మిరియాలను ఆల్కహాల్‌లో వేయాలి. మిరియాలు మునిగిపోతాయి. బొప్పాయి గింజలు కలిసినట్లయితే అవి తేలతాయి.
* కాసిని ఆవగింజల్ని దంచి చూడాలి. ఆవగింజలైతే పైన నున్నగా ఉండి లోపల పసుపు పచ్చగా ఉంటాయి. వేరే గింజలు కల్తీ చేస్తే అవి పైన గరుగ్గా ఉండి లోపల తెల్లగా ఉంటాయి.
* పంచదార, ఉప్పుల్లో కల్తీ జరిగినట్లు అనుమానమొస్తే చెంచాడు తీసుకుని నీటిలో వేయాలి. ఉప్పైనా పంచదార అయినా కరిగిపోతాయి. కల్తీ చేసిన చాక్‌పొడి అడుగున పేరుకుంటుంది.
* కాస్త తేనెలో దూదిని ముంచి తీసి వెలిగిస్తే మంచి తేనె అయితే మండుతుంది. కల్తీ అయితే చిటపటలాడుతుంది.
* టీపొడిని పేపరు మీద పోసి దానిలో అయస్కాంతం పెడితే ఇనుపరజను కలిపినట్లయితే తెలిసిపోతుంది. తడిగా ఉన్న ఫిల్టర్‌ పేపర్‌మీద కాస్త టీపొడి చల్లితే- ఒకవేళ వాడేసిన టీపొడికి రంగువేసి అమ్మినట్లయితే ఆ రంగు పేపరుకు అతుక్కుంటుంది.
* కరిగిన నెయ్యిలో ఒక స్పూను చక్కెర వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాల తర్వాత అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ జరిగినట్లు.
* కారం పొడిని నీళ్ల గ్లాసులో వేసినప్పుడు అందులో ఇటుకపొడి కలిసినట్లయితే అది అడుగున పేరుకుంటుంది.
* పసుపు కానీ పప్పు కానీ కొద్దిగా నీళ్లలో వేసి దాంట్లో కొన్ని చుక్కలు హైడ్రోక్లోరిక్‌ ఆసిడ్‌ వేయాలి. మెటానిల్‌ ఎల్లో కల్తీ జరిగినట్లయితే నీరు ఊదా రంగులోకి మారుతుంది. పసుపులో లెడ్‌ క్రొమేట్‌ కలిసినట్లయితే నీళ్లు మరీ ఎక్కువ పచ్చగా మారతాయి. మంచి పసుపు నీళ్లలో కరగకుండా అడుగున పేరుకుంటుంది.
* మంచి ఇంగువ వెలిగిస్తే కర్పూరంలా మండుతుంది. కల్తీ జరిగితే అలా మండదు.

సేకరణ....

Friday, 28 February 2020

రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో

రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి..

1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
= వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
= నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
= తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
=24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
=కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
=సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
=కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
=సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
=కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
=పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?
=జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
= దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
=హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
=శ్రీరాముడు.

16. భరతుని తల్లి పేరేమిటి?
=కైకేయి.

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
=వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
=12 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
=మారీచ, సుబాహులు.

21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
=బల-అతిబల.

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
=సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
=సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
=అగస్త్యుడు.

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
=భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

27. అహల్య భర్త ఎవరు?
=గౌతమ మహర్షి.

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
=శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?
=నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
=దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
=విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
=మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
=జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
=కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
=వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
=యధాజిత్తు.

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
=మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
=గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
=శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
=గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
=భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
=మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
=తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
=జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
=నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
=అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
=విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
=అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
=గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
=శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
=జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
=మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
=బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
=జటాయువు.

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
=దక్షిణపు దిక్కు.

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
=కబంధుని.

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
=మతంగ వనం, పంపానదీ.

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
=ఋష్యమూక పర్వతం.

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
=హనుమంతుడు.

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
=అగ్ని సాక్షిగా.

61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

62. సుగ్రీవుని భార్య పేరు?
=రుమ.

63. వాలి భార్యపేరు?
=తార.

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
=కిష్కింధ.

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
=మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
=దుందుభి.

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
=మతంగముని.

68. వాలి కుమారుని పేరేమిటి?
=అంగదుడు.

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
=ఏడు.

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
=ప్రసవణగిరి.

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=వినతుడు.

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=అంగదుడు.

73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
=మామగారు, తార తండ్రి.

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=శతబలుడు.

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
=మాసం (ఒక నెల).

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
=దక్షిణ దిక్కు.

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
=స్వయంప్రభ.

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
=సంపాతి.

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
=పుంజికస్థల.

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
=మహేంద్రపర్వతము.

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
=మైనాకుడు.

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
=సురస.

84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
=సింహిక.

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
=నూరు యోజనములు.

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
=లంబ పర్వతం.

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
=అశోక వనం.

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
=రెండు.

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
=త్రిజట.

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
=రామ కథ.

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
=చూడామణి.

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
=ఎనభై వేలమంది.

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
=విభీషణుడు.

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
=మధువనం.

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
=ఆలింగన సౌభాగ్యం.

98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
=నీలుడు.

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
=నికుంభిల.

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
=అగస్త్యుడు.

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
=ఇంద్రుడు.

102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
=మాతలి.

103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
=హనుమంతుడు.

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
=శత్రుంజయం.

106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
=స్వయంగా తన భవనమునే యిచ్చెను.

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
=బ్రహ్మ.

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
=తన మెడలోని ముత్యాలహారము

Thursday, 20 February 2020

గాంధారి వంద మంది పుత్రులు పేర్లు

గాంధారికి వంద మంది పుత్రులు .
వీరినే కౌరవులుగా మహాభారతంలో పేర్కొంటారు. ఈ వంద మంది పేర్లు

1. దుర్యోధనుడు. 2. దుశ్సాసనుడు. 3. దుస్సహుడు. 4. దుశ్శలుడు. 5. జలసంధుడు. 6. సముడు. 7. సహుడు. 8. విందుడు. 9. అనువిందుడు. 10. దుర్దర్షుడు. 11. సుబాహుడు. 12. దుష్పప్రదర్శనుడు. 12. దుర్మర్షణుడు. 13. దుర్మఖుడు. 15. దుష్కర్ణుడు. 16. కర్ణుడు. 17. వివింశతుడు. 18. వికర్ణుడు. 19.శలుడు. 20. సత్వుడు. 21. సులోచనుడు. 22. చిత్రుడు. 23. ఉపచిత్రుడు. 24. చిత్రాక్షుడు. 25. చారుచిత్రుడు. 26. శరాసనుడు. 27. ధర్మధుడు. 28. దుర్విగాహుడు. 29. వివిత్సుడు. 30. వికటాననుడు. 31. నోర్ణనాభుడు. 32. నునాభుడు. 33. నందుడు. 34. ఉపనందుడు. 35. చిత్రాణుడు. 36. చిత్రవర్మ. 37. సువర్మ. 38. దుర్విమోచనుడు. 39. అయోబావుడు. 40. మహాబావుడు. 41. చిత్రాంగుడు. 42. చిత్రకుండలుడు. 43. భీమవేగుడు. 44. భీమలుడు. 45. బలాకుడు. 46. బలవర్థనుడు. 47. నోగ్రాయుధుడు. 48. సుషేణుడు. 49. కుండధారుడు. 50. మహోదరుడు. 51. చిత్రాయుధుడు. 52. నిషింగుడు. 53. పాశుడు. 54. బృఎందారకుడు. 55. దృఢవర్మ. 56. దృఢక్షత్రుడు. 57. సోమకీర్తి. 58. అనూదరుడు. 59. దఢసంధుడు. 60. జరాసంధుడు. 61. సదుడు. 62. సువాగుడు. 63. ఉగ్రశ్రవుడు. 64. ఉగ్రసేనుడు. 65. సేనాని. 66. దుష్పరాజుడు. 67. అపరాజితుడు. 68. కుండశాయి. 69. విశాలాక్షుడు. 70. దురాధరుడు. 71. దుర్జయుడు. 72. దృఢహస్థుడు. 73. సుహస్తుడు. 74. వాయువేగుడు. 75. సువర్చుడు. 76. ఆదిత్యకేతుడు. 77. బహ్వాశి. 78. నాగదత్తుడు. 79. అగ్రయాయుడు 80. కవచుడు. 81. క్రధనుడు. 82. కుండినుడు. 83. ధనుర్ధరోగుడు. 84. భీమరధుడు. 85. వీరబాహుడు. 86. వలోలుడు. 87. రుద్రకర్ముడు. 88. దృణరదాశ్రుడు. 89.అదృష్యుడు. 90. కుండభేది. 91. విరావి. 92. ప్రమధుడు. 93. ప్రమాధి. 94. దీర్గరోముడు. 95. దీర్గబాహువు. 96.ఉడోరుడు. 97. కనకద్వజుడు. 98. ఉపాభయుడు. 99. కుండాశి. 100. విరజనుడు. 101వ బిడ్డగా దుశ్శల అనే ఆడపిల్ల జన్మిస్తుంది.

Tuesday, 18 February 2020

శ్రీ మీనాక్షి స్తోత్రము


శ్రీ మీనాక్షి స్తోత్రమ్

మహిమాన్వితమైన స్తోత్రం ఇది !
సమస్త విద్యలయందారితేరిన వాడుగ, అనంతభోగలాలసుడుగ రాణించుటకు;
అన్ని విధములైన అపశ్రుతులను అణగార్చుటకు ఈ మీనాక్షి స్తోత్రమును మించినది మరొకటి లేదు.


శ్రీవిద్యే శివ వామభాగ నిలయే శ్రీరాజరాజార్చితే
శ్రీనాథధి గురుస్వరూప విభవే చింతామణీ పీఠికా
శ్రీవాణీ గిరిజానుతాంఘ్రి కమలే శ్రీశాంభవీ శ్రీశివే
మధ్యాహే ముభయద్వజాధిప సుతే మాం పాహి మీనాంబికె !!

చక్రస్థే చతుర్ చరాచర జగన్నాథే జగత్పూజితే
వార్తాళీ పరదేవతా భయకరే వక్షోజా భారాన్వితే
వేద్యే వేదకళాప మౌళిగుళికే వే విద్యుల్లతా విగ్రహే
మధ్యే పూర్ణ సుధా రాసార్ధ్రు హృదయే మాం పాహి మినాంబికె !!

కోటిరాంగద రత్నకుండలధరే కోదండ బాణాంచితే
కోకాకార కుచద్వయోప విలసత్ ప్రాలంబి హారాంచితే
మద్దారిద్ర్య భుజంగ గారుడ ఖగే మాం పాహి మీనాంబైక్ !!

బ్రహ్మే శాచ్యుత గీయమాన చరితే ప్రేతసనాంతస్థితే
పాశాదంకుశ చాపబాణ కలితే బాలేందు చూడార్చితే !!
ముద్రారాధిత దైవతే మునిసుతే మాం పాహి మీనాంబికే

గంధర్వామర యక్ష పన్నగ నుతే గంగాధ రాలింగితే
గాయత్రీ గరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే
ఖాతీతే ఖిం దారు పావక శిఖే ఖద్యోత కోట్యుజ్జ్వలే
మంత్రారాధిత దైవతే మునుసుతే మాం పాహి మినాంబికే !!

నాదే నారద తుంబురాద్య వినుతే నాదాంత నాదాత్మికే
నిత్యే  నీలవసాత్మికే నిరుపమే నీవార శూకోపమే
కాంతే కామకళే కదంబనిలయే కామే కారంతస్థితే
మద్విద్యే మ దభీష్ట కల్పలలితే మాం పాహి మీనాంబికే !!

వీణానాద నిమీలి తార్ధనయనే విప్రస్త చూళింభరే
తాంబూలారుణ పల్లవాధర యుతే తాటంక హారాన్వితే
శ్యామే చంద్రకళా వసంత కలితే కస్తూరికా పాలికే
పూర్ణే కైరవ బందురూప వదనే మాం పాహి మీనాంబికే !!

శబ్ద బ్రహ్మమయీ చరాచరమాయీ జ్యోతిర్మయీ వాజ్మయీ
నిత్యానందమయీ నిరంజనమయీ తత్త్వంమయీ చిన్మయీ
తత్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వరమయీ సదాశివమయీం మాం పాహి మీనాంబికే !!





Monday, 17 February 2020

ఉసిరి మెంతికాయ


ఉసిరి మెంతికాయ
కావలసిన పదార్థాలు
1. ఉసిరి కాయలు 500 గ్రాములు
2. ఎర్ర కారం పొడి 250 గ్రాములు
3. ఆవాలు 2 స్పూన్స్
4. మెంతులు 2 స్పూన్స్
5. నువ్వుల నూనె 250 గ్రాములు
6. ఇంగువ కొద్దిగా
7. ఉప్పు తగినంత
8. పసుపు కొద్దిగా

తయారీ విధానం

ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి ఆర బెట్టుకోవాలి.
ఆరిన ఉసిరికాయలకు గాట్లు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని వేడెక్కాక కొద్దిగా నూనె వేసుకుని మెంతులు , ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసి దోరగా వేపుకుని
చల్లార్చుకోవాలి.
చల్లారిన వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
మరల స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 5 స్పూన్స్ ఆయిల్ వేసి గాట్లు పెట్టిన ఉసిరికాయలను వేసి , కొద్దిగా పసుపు వేసి ఒక 15 నిమిషాలు వేగనిచ్చి , వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
తిరిగి అదే బాణలి లో నువ్వుల నూనె , ఇంగువ వేసి వేడెక్క నివ్వాలి .
నూనె బాగా వేడెక్కిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈనూనెలో కారం , ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి, ఆవపొడి , ఉప్పు వేసి బాగా కలిపి, దీనిలోముందుగా మనం వేపుకుని పెట్టుకున్న ఉసిరికాయలను వేసి
బాగా కలిపి పొడి సీసాలో గాని
జాడీలో గాని పెట్టుకుని 3 రోజులపాటు బాగా ఊర నివ్వాలి.
ఇలా 3 రోజులు ఊరిన తరువాత బాగాకలుపుకుని వాడుకుంటే ఘుమఘుమలాడే ఉసిరి మెంతి కాయ రెడి.
ఇది ఒక 6 నెలలపాటు నిలువ ఉంటుంది.

సూచన :

ఉసిరి ఆదివారం, మరియు రాత్రులు తినడం నిషేధం అని పెద్దలు చెపుతారు..

Subha's Kitchen
Rachana: Subha Achanta
Facebook page: Achanta Kadhalu

ఉసిరి ఆవకాయ


ఉసిరి ఆవకాయ
కావాల్సిన పదార్థాలు:

1. ఉసిరికాయలు - అర కేజీ
2. నువ్వులనూనె - పావు కేజీ
3. ఉప్పు - 50 గ్రాములు
4. కారం - 50 గ్రాములు
5. ఆవపొడి - 50 గ్రాములు
6. మెంతులు - అర స్పూన్

తయారీ విధానం :

ఉసిరికాయలని కడిగి, తడి లేకుండా పొడి బట్టతో తుడవాలి.
ఆ  తరువాత చాకుతో అక్కడక్కడ నిలువుగా గాట్లు పెట్టాలి.
మూకుడులో నూనె పోసి కొంచం కాగాకా ఉసిరికాయలను వేసి సన్నని మంట మీద వేయించాలి.
కొంచం ఎరుపు రంగు వచ్చేదాకా వేగనిచ్చి ,చల్లారనివ్వాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నువ్వుల నూనె వేసి కొంచెం సేపు కాగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని కారం, ఉప్పు , ఆవ పొడి, మెంతులు , మరియు
ముందుగా మనం వేపుకుని పెట్టుకున్న
ఉసిరి కాయలు,చిటికెడు పసుపు వేసి
బాగా కలిపి ,
అన్ని బాగా కలిసాకా పొడి సీసాలోకి  తీసిపెట్టుకుని ఒక రోజు తర్వాత వాడుకుంటే రుచిగా వుంటుంది.

కొంత మంది నిమ్మరసం కూడా కలుపుతారు. అలా కలపాలంటే ఓ పావుకప్పు నిమ్మరసాన్ని పై మిశ్రమంలో ఆఖరున కలిపితే సరిపోతుంది.
ఇది కూడా 6 నెలలపాటు నిలవ ఉంటుంది.

Subha's Kitchen
Rachana : Subha Achanta
facebook page : Achanta Kadhalu