Monday, 16 October 2017

విష్ణువు వేయి నామములు- 101-150


విష్ణువు వేయి నామములు- 101-150

101) వృషాకపి: - అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమెత్తి ఉద్ధరించినవాడు.
102) అమేయాత్మ - అపరిమిత స్వరూపము గలవాడు.
103) సర్వయోగ వినిస్సృతః - సర్వ విధములైన సంగత్యములనుండి విడిపడినవాడు.
104) వసు: - సర్వ భూతములయందు వశించువాడు.
105) వసుమనా: - పరిశుద్ధమైన మనస్సు గలవాడు.
106) సత్య: - సత్య స్వరూపుడు.
107) సమాత్మా: - సర్వప్రాణుల యందు సమముగా వర్తించువాడు.
108) సమ్మిత: - భక్తులకు చేరువై భక్తాధీనుడైనవాడు.
109) సమ: - సదా లక్ష్మీదేవితో కలిసి విరాజిల్లువాడు.
110) అమోఘ: - భక్తులను స్తుతులను ఆలకించి ఫలముల నొసగువాడు.
111) పుండరీకాక్ష: - భక్తుల హృదయ పద్మమున దర్శనీయుడైనవాడు. పద్మనయునుడు.
112) వృషకర్మా - ధర్మకార్యములు నిర్వర్తించువాడు.
113) వృషాకృతి: - ధర్మమే తన స్వరూపముగా గలవాడు.
114) రుద్ర: - దు:ఖమును లేదా దు:ఖ కారణమును పారద్రోలువాడు.
115) బహుశిరా: - అనేక శిరములు కలవాడు.
116) బభ్రు: - లోకములను భరించువాడు.
117) విశ్వయోని: - విశ్వమునకు కారణమైనవాడు.
118) శుచిశ్రవా: - శుభప్రధమై శ్రవణము చేయదగిన దివ్యనామములు కలిగినవాడు.
119) అమృత: - మరణము లేనివాడు.
120) శాశ్వతస్థాణు: - నిత్యుడై, నిశ్చలుడైనవాడు.
121) వరారోహ: - జ్ఞానగమ్యమైనవాడు.
122) మహాతపా: - మహాద్భుత జ్ఞానము కలవాడు.
123) సర్వగ: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
124) సర్వవిద్భాను: - సర్వము తెలిసినవాడు.
125) విష్వక్సేన: - అసురుల సేనలను నిర్జించినవాడు. తాను యుద్దమునకు ఉపక్రమించినంతనే అసురసేన యంతయు భీతితో పారిపోవుటచే భగవానుడు విష్వక్సేను డాయెను.
126) జనార్దన: - దు:ఖమును కల్గించువాడు. ఆనందము నొసగూర్చువాడు.
127) వేద: - మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా గలవాడు.
128) వేదవిత్ - వేదజ్ఞానమును అనుభవములో కలిగినవాడు.
129) అవ్యంగ: - ఏ కొఱతయు, లోపము లేనివాడు.
130) వేదాంగ: - వేదములనే అంగములుగా కలిగినవాడు.
131) వేదవిత్ - వేదములను విచారించువాడు.
132) కవి: - సర్వద్రష్ట యైనవాడు.
133) లోకాధ్యక్ష: - లోకములను పరికించువాడు.
134) సురాధ్యక్ష: - దేవతలకు కూడా తానే అధ్యక్షుడైనవాడు.
135) ధర్మాధ్యక్ష: - ధర్మాధర్మములను వీక్షించువాడు.
136) కృతాకృత: - కార్య, కారణ రూపములతో భాసించువాడు.
137) చతురాత్మా - విభూతి చతుష్టయము తన స్వరూపముగా గలవాడు.
138) చతుర్వ్యూహ: - నాలుగు విధముల వ్యూహము నొంది సృష్టి కార్యములను చేయువాడు.
139) చతుర్దుంష్ట్ర: - నాలుగు కోరపండ్లు గలిగినవాడు.
140) చతుర్భుజ: - నాలుగు భుజములు కలిగినవాడు.
141) భ్రాజిష్ణు: - అద్వయ ప్రకాశరూపుడు.
142) భోజన: - భోజ్యరూపమైనవాడు.
143) భోక్తా: - ప్రకృతిలోని సర్వమును అనుభవించు పురుషుడు.
144) సహిష్ణు: - భక్తుల అపరాధములను మన్నించి క్షమించ గలిగినవాడు.
145) జగదాదిజ: - సృష్ట్యారంభముననే వ్యక్తమైనవాడు.
146) అనఘ: - పాపరహితుడైనవాడు.
147) విజయ: - ఆత్మజ్ఞానముతో వైరాగ్యసంపన్నుడై, శ్రేష్టమైన జయమునొందువాడు.
148) జేతా: - సదాజయము నొందువాడు.
149) విశ్వయోని: - విశ్వమునకు కారణభూతమైనవాడు.
150) పునర్వసు: - పదే పదే క్షేత్రజ్ఞుని రూపమున ఉపాధుల నాశ్రయించువాడు.

Saturday, 14 October 2017

విష్ణువు వేయి నామములు- 51-100


విష్ణువు వేయి నామములు-

51) మను: - మననము(ఆలోచన) చేయువాడు.
52) త్వష్టా - ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.
53) స్థవిష్ఠ: - అతిశయ స్థూలమైన వాడు.
54) స్థవిరోధ్రువ: - సనాతనుడు, శాశ్వతుడైనవాడు.
55) అగ్రాహ్య: - ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలులేనివాడు.
56) శాశ్వత: - సర్వ కాలములందున్నవాడు.
57) కృష్ణ: - సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు.
58) లోహితాక్ష: - ఎఱ్ఱని నేత్రములు గలవాడు.
59) ప్రతర్దన: - ప్రళయకాలమున సర్వమును నశింపచేయువాడు.
60) ప్రభూత: - జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు.
61) త్రికకుబ్ధామ - ముల్లోకములకు ఆధారభూతమైనవాడు.
62) పవిత్రం - పరిశుద్ధుడైనవాడు.
63) పరం మంగళం - స్మరణ మాత్రముచే అద్భుతముల నంతమొందించి శుభముల నందించువాడు.
64) ఈశాన: - సర్వ భూతములను శాసించువాడు.
65) ప్రాణద: - ప్రాణి కోటికి ప్రాణశక్తి నొసగువాడు.
66) ప్రాణ: - ప్రాణశక్తి స్వరూపమైనవాడు.
67) జ్యేష్ఠ: - వృద్ధతముడు. (సృష్టికి పూర్వమునుండే ఉన్నవాడు)
68) శ్రేష్ఠ: - అత్యంత ప్రశంసాపాత్రుడు.
69) ప్రజాపతి: - సమస్త ప్రజలకు పతి.
70) హిరణ్యగర్భ: - విశ్వగర్భమున నుండువాడు.
71) భూగర్భ: - భూమిని తన గర్భమునందు ఉంచుకొన్నవాడు.
72) మాధవ: - శ్రీదేవికి భర్తయైనవాడు.
73) మధుసూదన: - మధువను రాక్షసుని వధించినవాడు.
74) ఈశ్వర: - సర్వశక్తి సంపన్నుడైనవాడు.
75) విక్రమీ - శౌర్యము గలవాడు.
76) ధన్వీ - ధనస్సును ధరించినవాడు.
77) మేధావీ - ఏకకాలములో సర్వవిషయగ్రహణ సామర్ధ్యము కలిగినవాడు.
78) విక్రమ: - గరుడుని వీపుపై ఎక్కి ఇచ్ఛామాత్రముచే ఎచ్చటైనను విహరించగలవాడు.
79) క్రమ: - నియమానుసారము చరించువాడు.
80) అనుత్తమ: - తనకంటె ఉత్తములు లేనివాడు.
81) దురాధర్ష: - రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు.
82) కృతజ్ఞ: - ప్రాణులు చేయు కర్మములను చేయువాడు.
83) కృతి: - కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.
84) ఆత్మవాన్ - తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.
85) సురేశ: - దేవతలకు ప్రభువైనవాడు.
86) శరణ: - దు:ఖార్తులను బ్రోచువాడై, వారి ఆర్తిని హరించువాడు.
87) శర్మ - పరమానంద స్వరూపుడు.
88) విశ్వరేతా: - సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.
89) ప్రజాభవ: - ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు.
90) అహ: - పగలువలె ప్రకాశించు వాడు.
91) సంవత్సర: - కాలస్వరూపుడైనవాడు.
92) వ్యాళ: - పామువలె పట్టశక్యము గానివాడు.
93) ప్రత్యయ: - ప్రజ్ఞా స్వరూపుడైనవాడు.
94) సర్వదర్శన: - సమస్తమును దర్శించగలవాడు.
95) అజ: - పుట్టుకలేని వాడు.
96) సర్వేశ్వర: - ఈశ్వరులందరికి ఈశ్వరుడైనవాడు.
97) సిద్ధ: - పొందవలసిన దంతయు పొందినవాడు.
98) సిద్ధి: - ఫలరూపుడైనవాడు.
99) సర్వాది: - సర్వమునకు మూలమైనవాడు.
100) అచ్యుత: - స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు.

విష్ణువు వేయి నామములు- 1 - 50


విష్ణువు వేయి నామములు-

1) విశ్వం - మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు.
2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.
3) వషట్కార: - వేద స్వరూపుడు.
4) భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.
5) భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు.
6) భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు.
7) భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.
8) భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు.
9) భూత భావన: - జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.
10) పూతాత్మా - పవిత్రాత్ముడు.
11) పరమాత్మ - నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు.
12) ముక్తానాం పరమాగతి: - ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు.
13) అవ్యయ: - వినాశము కానివాడు. వినాశము లేని వాడు.
14) పురుష: - నవద్వారములు కలిగిన పురము నందు ఉండువాడు.
15) సాక్షీ - చక్కగా సమస్తమును దర్శించువాడు.
16) క్షేత్రజ్ఞ: - శరీరము లో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు.
17) అక్షర: - నాశరహితుడు.
18) యోగ: - యోగము చే పొందదగిన వాడు.
19) యోగ విదాంనేతా - యోగ విదులకు ప్రభువైన వాడు.
20) ప్రధాన పురుషేశ్వర: - ప్రకృతి పురుషులకు అధినేత.
21) నారసింహవపు: - నరుని సింహమును బోలిన అవయువములు గల వాడు.
22) శ్రీమాన్ - సదా లక్ష్మీ దేవితో కూడి యుండువాడు.
23) కేశవ: - కేశి యనెడి అసురుని వధించిన వాడు.
24) పురుషోత్తమ: - పురుషులందరిలోను ఉత్తముడు.
25) సర్వ: - సమస్తమును తానై అయినవాడు.
26) శర్వ: - సకల జీవులను సంహరింప జేయువాడు.
27) శివ: - శాశ్వతుడు.
28) స్థాణు: - స్థిరమైనవాడు.
29) భూతాది: - భూతములకు ఆదికారణమైన వాడు.
30) అవ్యయనిధి: - నశించని ఐశ్వర్యము గల వాడు.
31) సంభవ: - వివిధ అవతారములను ఎత్తినవాడు.
32) భావన: - సర్వ జీవులకు సమస్త ఫలముల నొసగువాడు.
33) భర్తా: - సకలములను కనిపెట్టి, పోషించువాడు. సకలమును భరించువాడు.
34) ప్రభవ: - పంచభూతములకు, దేశకాలాదులకు మూలమైనవాడు.
35) ప్రభు: - సర్వశక్తి సమన్వితమైనవాడు.
36) ఈశ్వర: - ఒకరి సహాయములేకనే సమస్త కార్యములు నెరవేర్చగల్గిన వాడు.
37) స్వయంభూ : - తనంతట తానే ఉద్భవించిన వాడు.
38) శంభు: - సర్వశ్రేయములకు మూలపురుషుడు.
39) ఆదిత్య: - సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు.
40) పుష్కరాక్ష: - పద్మముల వంటి కన్నులు గలవాడు.
41) మహాస్వన: - గొప్పదియగు వేదరూప నాదము గలవాడు.
42) అనాదినిధన: - ఆద్యంతములు లేని వాడు.
43) ధాతా - నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమై యున్నవాడు.
44) విధాతా - కర్మఫలముల నందించువాడు.
45) ధాతురుత్తమ: - సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు.
46) అప్రమేయ: - ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.
47) హృషీకేశ: - ఇంద్రియములకు ప్రభువు.
48) పద్మనాభ: - నాభియందు పద్మము గలవాడు.
49) అమరప్రభు: - దేవతలకు ప్రభువైనవాడు.
50) విశ్వకర్మా - విశ్వరచన చేయగల్గినవాడు.








చింతచిగురు పచ్చడి


చింతచిగురు పచ్చడి

కావాలిసిన పదార్ధాలు

1. లేత చింత చిగురు 3 కప్పులు
2.వెల్లుల్లి రెబ్బలు 8
3.ఎండు మిరపకాయలు 8
4.ఆవాలు 1 స్పూన్
5.మెంతులు 1 స్పూన్
6.ఇంగువ కొద్దిగా
7.పసుపు కొద్దిగా
8.ఉప్పు తగినంత
9.ఆయిల్ 8   స్పూన్ లు

తయారి విధానము

చింత చిగురు ని శుభ్రం గా కడిగి ,ఆరబెట్టుకోవాలి.
 స్టవ్  వెలిగించి బాణలి పెట్టి, వేడి ఎక్కాక, ఒక స్పూన్ ఆయిల్ వేసి
 ఎండు మిరపకాయలు ,ఆవాలు  ,మెంతులు  ,ఇంగువ ,వేసి
దోరగా వేపుకుని ,ఒక ప్లేట్ లోకి  తీసుకుని
అదే బాణలిలో వెల్లుల్లి రెబ్బలు  వేసి ,వాటిని  కూడా దోరగా వేపుకుని
ప్లేట్ లోకి  తీసుకుని , మరల అదే  బాణలిలో  1 స్పూన్  ఆయిల్ వేసి
చింత చిగురును  వేసి  దోరగా వేపుకుని  ,
చల్లార్చు కోవాలి .
ముందుగా  పోవును  మెత్తని  పొడిలాగా  గ్రైండ్  చేసుకుని  ,
తరువాత వెల్లుల్లిరెబ్బలు  చింత చిగురు మిశ్రమం ,పసుపు , తగినంత  ఉప్పు వేసి
మెత్తగా  ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణళి  పెట్టి  వేడెక్కాక
ఆయిల్  కొద్దిగా ఇంగువ వేసి కొద్దిసేపు  కాగనిచ్చి
రుబ్బుకున్న  పచ్చడిని ఈ నూనె లో  వేసి
నూనె అంతా  పచ్చడిలో  ఇంకెలా కలిపి
స్టవ్  ఆఫ్ చేసేసుకుంటే  చింత చిగురు  పచ్చడి  రెడి అవుతుంది
ఈపచ్చడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే  రుచిగా ఉంటుంది
ఈ పచ్చడి ఒక వారం రోజులునిలువ ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.


Friday, 13 October 2017

క్యాబేజీ పచ్చడి


క్యాబేజీ  పచ్చడి

కావలిసిన  పదార్థాలు
1. సన్నగా తరుగుకున్న  క్యాబేజీ  2 కప్పులు
2. చింత పండు కొద్దిగా
3. పచ్చిమిర్చి 2.
4. పసుపు  కొద్దిగా
5.  ఉప్పు తగినంత
6. ఆయిల్ 4 స్పూన్స్
7.  సెనగ  పప్పు  1 స్పూన్
8. మినపప్పు 1
9. ఆవాలు అర  స్పూన్
10. జీలకర్ర  ఆర స్పూన్
11. ఇంగువ  కొద్దిగా
12 . ఎండుమిరపకాయలు 6
13. కరివేపాకు
14.  నీళ్లు  తగినన్ని

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి ,  బాణలి పెట్టి  వేడెక్కాక  ,
ఆయిల్ వేసి  పైన చెప్పిన  పోపు  దినుసులను  వేసి ,
 అవి  దోరగా  వేగాక ఒకప్లేట్  లోకి తీసుకుని  ,
మరల  అదే  బాణలిలో  2 స్పూన్స్  ఆయిల్ వేసి ,
క్యాబేజీ తురుము , చింతపండు  , పసుపు  , వేసి
పచ్చి వాసం పోయేంత వరకు  మగ్గనిచ్చి  ,
స్టవ్ ఆఫ్  చేసుకోవాలి .
 చల్లారిన పోపును  మీత్తని  పొడిలాగా  గ్రైండ్  చేసుకుని  ,
దీనిలో కాబేజీ మిశ్రమాన్ని వేసి  , తగినంత  ఉప్పు  వేసి,
 మెత్తగా గ్రైండ్  చేసుకోవాలి  .
అవసరమైతే  కొద్దగా  నీళ్లు పోసుకుని ,
గ్రైండ్  చేసుకోవాలి . తరువాత  ఒక బౌల్లోకి తీసుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక  , ఆయిల్  వేసి ,
 కొద్దిగా ఆవాలు జీలకర్ర  ఇంగువ కరివేపాకు  ,
వేసి దొరగా  వేగనిచ్చి  ,పచ్చడిలో కలుపుకుంటే  ,
ఘుమఘుమ లాడే  క్యాబేజీ  పచ్చడి రెడీ
ఈపచ్చడి వేడి  అన్నంలో ను  చపాతీ లోకి  బావుంటుంది .

మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.


Saturday, 7 October 2017

డోక్లా


డోక్లా
కావలిసిన పదార్థాలు
1.   సెనగ పిండి  ఒకటిన్నర  కప్పులు
2.  గోధుమ నూక  ఒకటిన్నర కప్పులు
3. పంచదార  2 స్పూన్
4  అల్లం పచ్చిమిర్చి  పేస్ట్  1 స్పూన్
5. నిమ్మ రసం  1 స్పూన్
6. ఉప్పు  తగినంత
7.భేకింగ్  పొడి  1 స్పూన్
8.  ఆయిల్  4 స్పూన్స్
9. ఆవాలు  1 స్పూన్
10. ఇంగువ  కొద్దిగా
11. కరివేపాకు
12. పచ్చిమిర్చి  చీలికలు  4
13. కొబ్బరి తురుము  2 స్పూన్స్
14.  కొత్తిమీర
15.  నీళ్లు కప్పు

తయారీ  విధానం
ముందుగా  ఒక  బేసిన్ లోకి  , సెనగ పిండి , గోధుమనూక  , పంచదార ,
 అల్లం పచ్చిమిర్చి పేస్ట్  ,నిమ్మరసం  ,తగినంత  ఉప్పు వేసి ,
బాగా  కలిపి  3//4 నీళ్లు పోసి , బాగాకలిపి  ,
మెత్తగా  మృదువుగా  ఉండేలా  చూసుకోవాలి .
లోతు  తక్కువ వుండి వెడల్పయిన  గిన్నె  తీసుకుని  ,
నెయ్యి రాసి , ముందుగా  మనం  తయారుచేసి  పెట్టుకున్న
మిశ్రమానికి  బేకింగ్  పొడి  కలిపి  ,
దీనిని  నెయ్యి  రాసి  ఉంచుకున్న  గిన్నె లో  వేసి  ,
గిన్నె  అంతా  పిండి  సమానంగా  పరుచుకునేలా  చేసి  ,
మూత  పెట్టి  కుక్కరులో  పెట్టి
10  లేక  15  నిమిషాల పాట ఆవిరి మీద  ఉడకని వ్వాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  , వేడెక్కాక  ,
ఆయిల్  వేసి  ఆవాలు  , ఇంగువ  వేసి  ,
అవి వేగిన  తరువాత కొత్తిమీర  , పచ్చిమిర్చి  చీలికలు  , కొబ్బరితురుము  వేసి
ఒకసారి  కలిపి ,
స్టవ్  ఆఫ్  చేసుకుని  ,అర కప్పు  నీళ్లు  పోసి  బాగా  కలిపి
ముందుగా  ఉడికించి  చల్లార  బెట్టుకున్న
మిశ్రమం పైన  వేస్తే  పీల్చుకుంటుంది ...తరువాత
ముక్కలు గా  కోసుకుంటే
 డోక్లా  రెడీ .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.


Friday, 6 October 2017

రవ్వ కిచిడి


రవ్వ  కిచిడి

కావలిసిన  పదార్థాలు

1.  తెల్ల గోధుమ నూక  1 గ్లాసు
2.   జీడిపప్పు 10 పలుకులు
3. సెనగ పప్పు 1 స్పూన్
4. మినపపప్పు 1 స్పూన్
5. ఆవాలు  అర  స్పూన్
6.  నెయ్యి  8 స్పూన్స్
7. నీళ్లు  3 గ్లాసులు
8.  ఉల్లిపాయ 1
9. కేరట్  1
10. బీన్స్  4
11. టమాటా  1
12. అల్లం చిన్న ముక్క
13. పచ్చిమిర్చి 3
14. కాప్సికం  1.
15. కరివేపాకు కొద్దిగా
16. పసుపు
17. ఉప్పు  తగినంత

తయారీ విధానం
ముందుగా  కూరలన్నిటిని  శుభ్రంగా  కడిగి ,
  ఉల్లిపాయ ,  కారట్  , టమాటా , బీన్స్ , కాప్సికం , అల్లము,
లను సన్నని చిన్న ముక్కలుగా ను  , పచ్చిమిర్చి  ని చీలికలుగాను , తరుగుకోవాలి  .
స్టవ్  వెలిగించి  వెడల్పయిన  మందమైన  , బాణలిని  పెట్టి , వేడెక్కాక
1 స్పూన్  నెయ్యి వేసి  ,గోధుమ నూకను  దోరగా  వేపుకుని  ,
ఒక ప్లేటులోకి తీసుకోవాలి  .
అదే  బాణలిలో  5 స్పూన్స్  నెయ్యి  వేసి  , జీడిపప్పు పలుకులువేసి,
 అవి  దోరగా  వేగాక ,  పైన చెప్పిన  పోపు  దినుసులను  వేసి  , అవి దోరగా  వేగాక
కరివేపాకు  , తరిగి పెట్టుకున్న కూర ముక్కలు  , పచ్చిమిర్చి  చీలికలు ,
 వేసి  కొద్దిసేపు వేగనివ్వాలి .
 ఇవి  మగ్గిన తరువాత  3 గ్లాసుల నీళ్లు  పోసి  ,
తగినంత  ఉప్పు,  పసుపు  , వేసి  బాగా  కలిపి  ,
నీళ్లను  మరగనివ్వాలి  నీళ్లు బాగా  మరిగిన తరువాత  ,
స్టవ్  మంటను సిమ్  లో పెట్టి ,
 ఒక  చేత్తో  నూకను  పోసుకుంటూ ,  రెండో  చేత్తో కలుపుతూ  ఉండాలి  .
దీనివలన ఉండలు  కట్టకుండా  ఉంటుంది.
 బాగా కలిపి  మరి కొంచెం  నెయ్యి  వేసి  ,అవసరమైతే  కొద్దిగా  నీళ్లు  చిలకరించుకుని
మూత  పెట్టి  కొద్దిసేపు  మగ్గనిచ్చి
స్టవ్ ఆఫ్  చేసుకుంటే
 ఘుమ ఘుమ  లాడే  కిచిడి  రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.






Thursday, 5 October 2017

ములక్కాడల కూర్మా


ములక్కాడల  కూర్మా

కావలిసిన  పదార్థాలు
1. ములక్కాడలు  5.
2. ఉల్లిపాయలు 2.
3. టమాటాలు  2
4. క్యాప్సికం  1
5. అల్లం  చిన్న ముక్క
6. పచ్చిమిర్చి  2.
7.  కొత్తిమీర  కొద్దిగా
8. కరివేపాకు
9. పసుపు
10. ఉప్పు  తగినంత
11. కారం  తగినంత
12. ఆయిల్  4 స్పూన్స్
13. సెనగపిండి  5 స్పూన్స్
14.ధనియాలపొడి   అరస్పూన్
15.  గరం మసాలా పొడి  అరస్పూన్
16. చింత పండుగుజ్జు 2 స్పూన్స్
17. జీలకర్ర  అర  స్పూన్
18. ఆవాలు  అర  స్పూన్

తయారీ  విధానం
ముందుగా  కూరలన్నిటిని  శుభ్రంగా  కడిగి ,
 అల్లమును సన్నని ముక్కలుగాను  ,పచ్చిమిర్చిని  చీలికలుగాను  ,
టమాటా  ,క్యాప్సికం ,ఉల్లిపాయలను ,
చిన్న ముక్కలుగాను ,
ములక్కాడలను పొడవుగాను తరుక్కోవాలి  .
ముందుగా  ములాక్కాడలను విడిగా ఉడికించి ,
దానిలోనుండి ములక్కాడలు  తీసి ,
ఆ ఉడికించిన  నీళ్లు  విడిగా  పెట్టుకోవాలి .
స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి వేడెక్కాక  ఆయిల్  వేసి  ,
జీలకర్ర , ఆవాలు  , వేసి  దోరగా  వేగాక  ,
అల్లం ,పచ్చిమిర్చి , కరివేపాకు  , వేసి
అవివేగాక  ఉల్లిపాయ  ,టమాటాలు  ,వేసి  కొద్దిసేపు  మగ్గనిచ్చి
క్యాప్సికం ముక్కలు  వేసి , కొద్దిసేపు  ఉడకనిచ్చి  ,
అందులో ఉడికించి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు  ,
పసుపు , కారం  , ఉప్పు  , ధనియాల  పొడి  ,గరం మసాలా పొడి  ,
చింతపండుగుజ్జు  ,సెనగపిండి  వేసి  బాగా  కలిపి
అందులో ములక్కాడలు  ఉడికించిన  నీళ్లు  పోసి ,
బాగాకలిపి  మూత  పెట్టి  కూర  అంతా  దగ్గర  పడేంత  వరకు  ఉంచి
స్టవ్  ఆఫ్ చేసుకుని  ఒక  బౌల్  లోకి  తీసుకుని
 పైన  కొత్తిమీరతో  గార్నిష్  చేసుకుంటే
 ములక్కాడల కూర్మా  రెడీ.

దీనిని  చపాతీ  పరోటాలతో ను ,
వేడి అన్నం తో తింటే రుచిగా ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.




Wednesday, 4 October 2017

పుల్ల అట్లు


పుల్ల  అట్లు

కావలిసిన  పదార్థాలు
1. చిక్కని  మజ్జిగ  2 కప్పులు
2.  బియ్యం  2 కప్పులు
3. మెంతులు  కొద్దిగా
4. ఉప్పు  తగినంత
5. ఆయిల్  తగినంత
6. ఉల్లిపాయ  1
7. పచ్చి  మిర్చి  3

తయారీ  విధానం
ముందుగా  బియ్యమును , మెంతులను  ,
శుభ్రం  గా  కడిగి  ఒక  గిన్నె లోకి  తీసుకుని   ,
అందులో  మజ్జిగ  పోసి  6. గంటలు  నాన బెట్టాలి  .
ఇలా  నానిన  బియ్యమును  ,
తగినంత  ఉప్పు  వేసి  ,
మెత్తగా  గ్రైండ్  చేసుకోవాలి .
 ఇలా  గ్రైండ్  చేసుకున్న, పిండి ,
ఒక  రాత్రి  అంతా  బాగా  ఊర నివ్వాలి .
మరునాడు ఇలా  ఊరిన  పిండిని,
దోసెల మాదిరి గా వేసుకోవాలి  ,
ఉల్లి పాయను , పచ్చిమిర్చిని , సన్నగా తరుగుకోవాలి.
 స్టవ్  వెలిగించి  పెనం  పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి ,
అట్లకాడతో పామి ,
పిండిని  వేసి , దోస మాదిరిగా గరిటతో  తిప్పి
పైన ఉల్లి , పచ్చిమిర్చి  ముక్కలు  వేసి ,
ఒక  స్పూన్  ఆయిల్  వేసి ఒక  పక్క వేగిన  తరువాత  తిరగేసి
మరల  ఒక స్పూన్  ఆయిల్  వేసి రెండో పక్క  కూడా  వేగనిచ్చి
ప్లేట్ లోకి  తీసుకుని
అల్లం  పచ్చడితో  గాని టమాటో  పచ్చడి తో  గాని తింటే  రుచిగా ఉంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.

గోధుమ పిండి అప్పాలు


గోధుమ  పిండి  అప్పాలు

కావలిసిన  పదార్థాలు
1. గోధుమ  పిండి  1 గ్లాసు
2.వరిపిండి  2 స్పూన్స్
3. బెల్లం  తురుము  1 గ్లాసు
4.  భేకింగ్  పొడి  కొద్దిగా
5.   నీళ్లు గ్లాసు
6.ఆయిల్  తగినంత
7. ఏలకుల పొడి  కొద్దిగా

తయారీవిధానం
ముందుగా  స్టవ్  వెలిగించి  , వెడల్పయిన  బాణలి  పెట్టి ,
 అందులో నీళ్లు  ,బెల్లం  తురుము  ,ఒక  స్పూన్ ఆయిల్ ,
 కొద్దిగా  బేకింగ్ పొడి , ఏలకుల పొడి ,
వేసి  మరగనివ్వాలి ,
తరువాత  గోధుమ పిండి  ,వరిపిండి లను  ,
వేసి  అంతా బాగా కలిసేలా  కలిపితే  చలివిడి ముద్దలా  అవుతుంది .
ఇప్పుడు  స్టవ్  ఆఫ్  చేసుకుని చల్లారనివ్వాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక ,
తగినంత  ఆయిల్  వేసి  చల్లారిన  ,పిండి మిశ్రమాన్ని ,
ఒక సారి  బాగా  కలిపి మనకు  కావలిసిన    సైజు  లో ,
 ఉండలు చేసుకుని ,
ప్లాస్టిక్  పేపర్  మీద  ఆయిల్  ఆయిల్  రాసి  ,
ఈ  ఉండను  దాని మీద  పెట్టి  ,
అప్పం  మాదిరిగా  తట్టి  ,
ఆయిల్  లో వేసి  దోరగా  వేపుకోవాలి .
 వేగిన  తరువాత  వీటిని ,
రెండు  చిల్లుల చట్రా ల  మధ్య  పెట్టి  ,
అరిసెల  మాదిరిగా  నొక్కితే  అప్పాలు  రెడీ
ఇవి  4 రోజులపాటు  నిలువ ఉంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.