Wednesday, 4 October 2017

గోధుమ పిండి అప్పాలు


గోధుమ  పిండి  అప్పాలు

కావలిసిన  పదార్థాలు
1. గోధుమ  పిండి  1 గ్లాసు
2.వరిపిండి  2 స్పూన్స్
3. బెల్లం  తురుము  1 గ్లాసు
4.  భేకింగ్  పొడి  కొద్దిగా
5.   నీళ్లు గ్లాసు
6.ఆయిల్  తగినంత
7. ఏలకుల పొడి  కొద్దిగా

తయారీవిధానం
ముందుగా  స్టవ్  వెలిగించి  , వెడల్పయిన  బాణలి  పెట్టి ,
 అందులో నీళ్లు  ,బెల్లం  తురుము  ,ఒక  స్పూన్ ఆయిల్ ,
 కొద్దిగా  బేకింగ్ పొడి , ఏలకుల పొడి ,
వేసి  మరగనివ్వాలి ,
తరువాత  గోధుమ పిండి  ,వరిపిండి లను  ,
వేసి  అంతా బాగా కలిసేలా  కలిపితే  చలివిడి ముద్దలా  అవుతుంది .
ఇప్పుడు  స్టవ్  ఆఫ్  చేసుకుని చల్లారనివ్వాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక ,
తగినంత  ఆయిల్  వేసి  చల్లారిన  ,పిండి మిశ్రమాన్ని ,
ఒక సారి  బాగా  కలిపి మనకు  కావలిసిన    సైజు  లో ,
 ఉండలు చేసుకుని ,
ప్లాస్టిక్  పేపర్  మీద  ఆయిల్  ఆయిల్  రాసి  ,
ఈ  ఉండను  దాని మీద  పెట్టి  ,
అప్పం  మాదిరిగా  తట్టి  ,
ఆయిల్  లో వేసి  దోరగా  వేపుకోవాలి .
 వేగిన  తరువాత  వీటిని ,
రెండు  చిల్లుల చట్రా ల  మధ్య  పెట్టి  ,
అరిసెల  మాదిరిగా  నొక్కితే  అప్పాలు  రెడీ
ఇవి  4 రోజులపాటు  నిలువ ఉంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.



Sunday, 10 September 2017

మోతీ చూర్ లడ్డు


మోతీ  చూర్  లడ్డు

కావలిసిన  పదార్థాలు

1.సెనగ  పిండి  1. కప్పు 
2. పంచదార  2 కప్పులు 
3. ఇలాచీ పొడి  కొద్దిగా 
4  నీళ్లు  తగినన్ని 
5.  ఆయిల్  తగినంత 
 6.  నెయ్యి  కొద్దిగా
 7. జీడిపప్పు పలుకులు  12
  8. కిస్మిస్  12

 తయారీ  విధానం

ముందుగా  సెనగ  పిండిని  ఒక  బౌల్  లోకి  తీసుకుని  ,
తగినన్ని  నీళ్లు  పోసుకుంటూ
బజ్జీల  పిండి  మాదిరిగా  గట్టిగా  కలుపుకోవాలి. 
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  ,
పంచదార  , తగినన్ని  నీళ్లు  పోసి   ,
ఏలకుల  పొడిని  వేసి ,
బాగా  కలుపుతూ  ,
తీగ  పాకం  వచ్చేలా  చూసుకుని   స్టవ్  ఆఫ్  చేసుకోవాలి .
 స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి ,  వేడెక్కాక ,
తగినంత  ఆయిల్  వేసి  ,
బూందీ  ఛట్రం  తీసుకుని ,  బాణలి  పైన పెట్టి  ,
ముందుగా మనం  తయారుచేసి  పెట్టుకున్న  సెనగపిండి  ని ,
కొద్దికొద్దిగా   వేసుకుంటూ   బూందీ  తయారు చేసుకోవాలి.
ఇలా  తయారైన  బూందీని  ,
మనం  ముందుగా  తయారు  చేసి  పెట్టుకున్న  ,
పంచదార  పాకం  లో వేసి  ,
బాగా  కలిపి ,
చిన్న  సైజు  ఉండలుగా  చుట్టుకుని  ,
పైన  జీడిపప్పు  , కిస్మిస్ లతో  గార్నిష్  చేసుకుంటే  ,
మోతీ చూర్  లడ్డు  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.


Saturday, 9 September 2017

సేమ్యా పులావ్


సేమ్యా  పులావ్

కావలిసిన  పదార్థాలు
1 సేమ్యా  2 కప్పులు
2 ఉల్లిపాయ  1
3 పొటాటో 1
4క్యారట్  1
5 ఫ్రెంచ్  బీన్స్  5
6 గ్రీన్ పీస్   గుప్పెడు
7 కొత్తిమీర  కొద్దిగా
మసాలా  దినుసులు
1  లవంగాలు  2
2 దాల్చిన  చెక్క  1
3 ఏలకులు  2
4 జీలకర్ర  1 స్పూన్
5 పులావ్  ఆకులు  2
కొబ్బరి తురుము  2 స్పూన్స్
సోంపు  1 స్పూన్
అల్లం  చిన్న  ముక్క
పచ్చిమిర్చి  3
నెయ్యి  1 స్పూన్
ఆయిల్  1 స్పూన్
వేడి  నీళ్లు  3 న్నర కప్పులు
ఉప్పు  తగినంత

తయారీ  విధానం.
ముందుగా  పైన  చెప్పిన  కూరలను  శుభ్రం గా  కడిగి ,
చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి
కొబ్బరి  తురుము  ,సోంపు , అల్లం  ,పచ్చిమిర్చి  ,కొత్తిమీర  కలిపి   ,
మెత్తని  ముద్దలాగా  గ్రైండ్  చేసుకోవాలి
సేమ్యా  ను  కొద్దిపాటి  నేతిలో  దోరగా  వేపుకోవాలి   .
స్టవ్  వెలిగించి  వెడల్పయిన  లోతు గా  వుండే  బాణలి   తీసుకుని  వేడెక్కాక  ,
ఆయిల్   మరియు  నెయ్యి  వేసి  పైన  చెప్పిన  మసాలాదినుసులను   వేసి ,
అవి  దోరగా   వేగాక ,
ఉల్లిపాయ  ముక్కలు  , పుదీనా  ఆకులు  ,కొబ్బరి  పేస్ట్  వేసి  ,
కొద్దిసేపు  వేగనిచ్చి  , తరిగిపెట్టుకున్న  కూరముక్కలు  కూడా  వేసి  ,
8- 10. నిమిషాలు  మగ్గని చ్చి ,
సేమ్యా,  గ్రీన్ పీస్  లను  వేసి ,బాగా  కలిపి  ,
మూడున్నర  కప్పులు  వేడినీళ్లు  పోసి , తగినంత  ఉప్పును  వేసి ,
బాగా కలిపి  మూత  పెట్టి  ,సన్నని  మంట  మీద  ఉడకనివ్వాలి ,
మధ్య  మధ్యలో  కలుపుతూ  బాగా
ఉడకనివ్వాలి  .నీరు  అంతా  పోయి  విడివిడి  లాడుతూ  వచ్చాక ,
స్టవ్  ఆఫ్  చేసుకుని  ,ఒక  బౌల్లోకి  తీసుకుని  ,
పైన  కొత్తిమీరతో  గార్నిష్ చేసుకుంటే
సేమ్యా  పులావ్  రెడీ.

దీనిని  టొమాటో సాస్  తో గాని  చిల్లి  సాస్  తో  గాని  తింటే రుచిగా  ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.



  

Saturday, 2 September 2017

మైసూర్ పాక్


మైసూర్ పాక్

కావలిసిన  పదార్థాలు
1. సెనగ పిండి  1  గ్లాసు
2. పంచదార  2 గ్లాసులు
3.  నెయ్యి  మరియు  డాల్డా 2 గ్లాసులు
4.  ఏలకుల  పొడి  కొద్దిగా
5. నీళ్లు  తగినన్ని

తయారీ  విధానం
ముందుగా  స్టవ్  వెలిగించి , బాణలి  పెట్టి , వేడెక్కాక ,
కొద్దిగా నెయ్యి  వేసి  ,
సెనగపిండిని  పచ్చివాసన  పోయేంత  వరకు  వేపుకోవాలి  .
ఒక  వెడల్పయిన  బాణలిలో  ,
పంచదార  ,తగినన్ని  నీళ్లు  పోసి , స్టవ్  మీద  పెట్టి   ,
రెండు  పొంగులు  రానిచ్చి  ,
ఏలకుల  పొడి , సెనగపిండిని  వేసి  ,బాగా కలిపి  ,
తరువాత  కరగబెట్టుకున్న  డాల్డా , నెయ్యి  మిశ్రమాన్ని
 ఒక గుంత గరిట తో
కొంచెం , కొంచెం పోస్తూ  ,
అట్లకాడతో  కలుపుతూ  తూ ఉండాలి .
 నెయ్యి అంతా పిండిలోకి ఇంకి  ,
ఈ  మిశ్రమం  బాగా  దగ్గర పడి
గుల్లగా అవుతుంది అప్పుడు
బాణలి  గోడలకు  అంటుకోకుండా  వున్నప్పుడు  ,
స్టవ్   ఆఫ్  చేసుకుని  ,
నెయ్యి  రాసిన  ప్లేటులోకి  ఈ మిశ్రమాన్ని  పోసుకుని  ,
ఒక గ్లాసు తో  గాని , అట్లకాడ తో గాని ,
పైన నునుపు  చేసుకుని
చాకుతో  గాట్లు పెట్టు కుంటే
మైసూర్  పాక్  రెడీ.
బాగా ఆరిన తరువాత ముక్కలు విడివిడి గా వచ్చేస్తాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.


Saturday, 5 August 2017

పొన్నగంటి కూర పప్పు


పొన్నగంటి కూర  పప్పు

కంటిచూపు తగ్గుతోందన్న విషయం మన ఇంట్లోని బామ్మలు, అమ్మమ్మల చెవినబడితే
వెంటనే వాళ్లు రోజూ పొన్నగంటి కూర తినమని సలహా ఇస్తారు. నిజానికి చూపు పోయినవాళ్లకీ చూపు తెప్పించగలదనే అర్థంలో దీన్ని ‘పోయిన కంటి కూర’ అని పిలిచేవారు.
అదే వాడుకలో పొన్నగంటి అయింది. ఈ ఆకునే సంస్కృతంలో మత్స్యక్షి అనీ, ఇంగ్లిషులో డ్వార్ఫ్‌ కాపర్‌లీఫ్‌, సెసైల్‌ జాయ్‌వీడ్‌ అనీ పిలుస్తారు. సామాన్యుడి బంగారు భస్మంగానూ దీన్ని పిలుస్తారు.

ఇందులో పోషకాలు
వంద గ్రాముల ఆకులో
60 క్యాలరీల శక్తి , 12గ్రా. పిండిపదార్థాలూ, 4.7గ్రా. ప్రొటీన్లూ, 2.1గ్రా. పీచూ,
146మి.గ్రా. కాల్షియం, 45 మి.గ్రా. పొటాషియంలతోబాటు ఎ, సి- విటమిన్లూ
పుష్కలంగా లభ్యమవుతాయి.

పొన్నగంటి కూర  పప్పు  కి
కావలిసిన  పదార్థాలు

1. పొన్నగంటి కూర   ఒక కట్ట
2. కందిపప్పు  కప్పు
3.పచ్చిమిర్చి  3
4. కరివేపాకు
5.  పసుపు  కొద్దిగా
6. ఉప్పు  రుచికి  సరిపడ
7.  వెల్లుల్లి  రెబ్బలు  6  
8. నీళ్లు  తగినన్ని 

పోపు  దినుసులు
మినపప్పు  1 స్పూన్  ,ఆవాలు  అర స్పూన్ , జీలకర్ర  అర స్పూన్  ,ఎండుమిర్చి  2,
ఇంగువ  కొద్దిగా  ,ఆయిల్   2 స్పూన్స్

తయారీ  విధానం
ముందుగా   పొన్నగంటికూరను  బాగుచేసుకుని  ,శుభ్రంగా  కడిగి  ,
సన్నగా  తరుగుకోవాలి .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  ,వేడెక్కాక  ,
కందిపప్పును  వేసి  ,
కమ్మటి  వాసన  వచ్చేంత వరకు  వేపుకుని ,
ఒకసారి  కడిగి  ఒక గిన్నె  లోకి  ,
పప్పును  ,పొన్నగంటికూరను  వేసి  ,
తగినన్ని  నీళ్లు  పోసుకుని  ,
కుక్కరులో  పెట్టి  ఉడికించుకోవాలి .
పచ్చిమిర్చిని  చీలికలుగా  తరుగుకోవాలి  .
స్టవ్   వెలిగించి  బాణలి  పెట్టి , వేడెక్కాక ,ఆయిల్  వేసి,
పైన  చెప్పిన  పోపు దినుసులను ,  వెల్లుల్లి  రెబ్బలను  వేసి,
దోరగా  వేగాక  ,
కరివేపాకు  ,పచ్చిమిర్చి  లను  వేసి ,
అవి వేగాక ,
ఉడికిన పప్పు  మిశ్రమాన్ని  ,పసుపు , తగినంత  ఉప్పును  వేసి,
బాగా  కలిపి  ,దగ్గర  పడేంత  వరకు  ఉంచి ,
స్టవ్  ఆఫ్  చేసుకుంటే  పొన్నగంటికూర  పప్పు  రెడీ.
వేడి  అన్నం లో  నెయ్యి  వేసుకుని  తింటే  రుచిగా  ఉంటుంది 

మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.


Monday, 24 July 2017

దప్పళం


దప్పళం

కావలిసిన  పదార్థాలు

1. గుమ్మడి  కాయ   అర ముక్క
2.  ఆనపకాయ   అరముక్క
3.  చిలకడ  దుంపలు  3
4.  వంకాయలు  2
5.  బెండకాయలు  3
6.  టొమాటోలు  2
7.  మునగకాడ  1
8. పచ్చిమిర్చి  3
9. కరివేపాకు
10  చింతపండు  తగినంత
11 బెల్లం  తగినంత
12 పసుపు  కొద్దిగా
13. ఉప్పు  తగినంత
14 .. వరిపిండి  తగినంత
15  నీళ్లు  తగినంత
పోపు దినుసులు
1 ఆవాలు  కొద్దిగా
2. మెంతులు  కొద్దిగా
3  జీలకర్ర  కొద్దిగా
4. ఇంగువ  కొద్దిగా
5 ఎండుమిరపకాయలు  3
6..ఆయిల్  3 స్పూన్స్

 తయారీ  విధానం
చింత పండును   తగినన్ని  నీళ్లు  పోసి,  ఒక  గిన్నె  లోకి  నానబెట్టుకోవాలి .
పైన  చెప్పిన  కూరలను   ,శుభ్రంగా  కడిగి  ,సమానమైన  ముక్కలుగా  ,
తరుగు  కోవాలి
వరిపిండిని  ఒక  బౌల్  లోకి  తీసుకుని  ,కొద్దిగా  నీళ్లు  పోసుకుని  ,
కలుపుకోవాలి
స్టవ్  వెలిగించి , వెడల్పయిన బాణలి  పెట్టి  ,వేడెక్కాక  ,ఆయిల్  వేసి ,
 పోపు దినుసులను  వేసి
దోరగా  వేగాక,  కరివేపాకు  ,తరిగిన  కూర ముక్కలు  , వేసి ,
తగినంత   చింత పండు  రసం  పోసి  , తగినంత  బెల్లం, ఉప్పు, పసుపు  వేసి
బాగా  ఉడకనివ్వాలి
ముక్కలు  ఉడికిన  తరువాత  నీళ్లు  కలిపిన వరిపిండిని  వేసి  ,
బాగా  కలిపి  మరికొద్దిసేపు మరగనివ్వాలి  .
బాగా  మరిగిన  తరువాత  ఒక  బౌల్ లోకి  తీసుకుని
పైన  కొత్తిమీర తో  గార్నిష్
చేసుకుంటే  రుచికరమైన  " దప్పళం "  రెడీ
ముద్ద పప్పు తో తింటే  రుచిగా ఉంటుంది.

మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.


Friday, 21 July 2017

మునగాకు పెసరపప్పు పొడి కూర



మునగాకు  పెసరపప్పు  పొడి కూర

కావలిసిన  పదార్థాలు

1. మునగాకు  2 కప్పులు
2. పెసర  పప్పు  ఒక  కప్పు
3. పసుపు కొద్దిగా 
4. పచ్చిమిర్చి  2
5. ఉప్పు  తగినంత
6.  నీళ్లు  తగినంత

పోపు  దినుసులు
మినపప్పు  అర స్పూన్  ,ఆవాలు  కొద్దిగా  ,జీలకర్ర  కొద్దిగా  ,ఎండుమిరపకాయలు  2
ఇంగువ  కొద్దిగా  ,ఆయిల్  2 స్పూన్స్.

తయారీ  విధానం
ముందుగా  మునగాకును  ,పెసరపప్పును  ,శుభ్రంగా  కడుగుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి ,
అందులో  మునగాకును , పెసరపప్పును  వేసి  ,
తగినన్ని  నీళ్లు  పోసి  ఉడకనివ్వాలి .
ఉడికిన   తరువాత  చిల్లుల  పళ్లెం  లో  పోసి  ,చల్లార నివ్వాలి .
 స్టవ్  మీద  అదే  బాణలి  పెట్టి  ,వేడి క్కాక  ,ఆయిల్  వేసి  ,
పోపు దినుసులను  వేసి,  దోరగా  వేగాక  ,
ఉడికించి  చల్లార  బెట్టుకున్న  పెసర పప్పు , మునగాకులను  ,వేసి
పసుపు , తగినంత  ఉప్పులను , వేసి ,
బాగా కలిపి  ,తడి  పోయేంత  వరకు  ఉంచి
స్టవ్  ఆఫ్  చేసుకుని  ఒక  బౌల్  లోకి  తీసుకుంటే
మునగాకు  పెసర  పప్పు  పొడి  కూర  రెడీ.

ఈ కూర అన్నం లోకి  చపాతీలోకి  బాగుంటుంది.
ఆషాడ  మాసం లో  మునగాకు ను  తింటే  మంచిది
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.

Friday, 7 July 2017

మిరియాల ఆరోగ్య ప్రయోజనాలు .


మిరియాల ఆరోగ్య  ప్రయోజనాలు .

 1. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ K మరియు
      విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి.
2. మిరియాలు జీర్ణక్రియ, దగ్గు మరియు సాధారణ జలుబు ఉపశమనంనకు సహాయపడుతుంది.
3. మిరియాల్లో ఖనిజ కంటెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి.
4. మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి.
5. కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచుతాయి. దీంతో శరీరంలో ఉన్న కొవ్వు కరగడమే
    కాకుండా మలినాలు అన్నీ బయటికి పోతాయి.
6. మిరియాలతో చేసిన వాటిలో ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో
   మంచి   కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.
   
7. మిరియాల్లో విటమిన్ ‘C’ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో
    పోరాడే   సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా,
    సాధారణ స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది.
8. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేరిస్తే చర్మం మరియు జుట్టు మెరుగుదలకు
   సహాయపడుతుంది.
9. మిరియాలు ఒక యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది.
10. మిరియాలలో యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన లైన్స్,ముడతలు,నల్లని మచ్చలు,
      అకాల వృద్ధాప్య చిహ్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి చర్మాన్ని రక్షిస్తుంది.

Saturday, 1 July 2017

మినప పుణుకులు


మినప పుణుకులు

కావలిసిన  పదార్థాలు
1. మినపప్పు  2 కప్పులు
2. బియ్యం 3 స్పూన్స్
3. ఉప్పు తగినంత
4.జీలకర్ర  కొద్దిగా
5.ఆయిల్   పావు  లీటరు
6. ఉల్లిపాయలు  2.
7.పచ్చిమిర్చి  3.
8. అల్లం  చిన్న  ముక్క
9.  కొత్తిమీర  కొద్దిగా

తయారీ  విధానం
ముందుగా  మినపప్పును ,బియ్యమును  శుభ్రం  గా  కడిగి  ,
తగినన్ని  నీళ్లు  పోసి  6 గంటలసేపు  నానబెట్టుకోవాలి  .
నానిన  పప్పును  కడిగి  , తగినంత  ఉప్పును  వేసి  ,
గారెల  పిండి  మాదిరిగా  గట్టిగా  రుబ్బుకుని ,
ఒక  బౌల్  లోకి  తీసుకోవాలి .
ఉల్లిపాయలను  ,పచ్చిమిర్చి  ,అల్లము ,కొత్తిమీరలను  ,
శుభ్రం  గా  కడిగి  సన్నగా  తరుగుకోవాలి.
తరిగిన  వీటిని జీలకర్ర , రుబ్బుకున్న  మినప  పిండిలో  వేసి
బాగా  కలుపుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి వేడెక్కాక  ఆయిల్  వేసి
అందులో  ఈ పిండిని  పుణుగు ల  మాదిరి గా  వేసుకుని
దోరగా వేపుకుంటే  మినప పుణుకులు  రెడీ.
వీటిని చిన్నగా తరిగిన ఉల్లిపాయ  ముక్కలు ,మరియు చట్నీ తో తింటే బాగుంటాయి.






Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.

గాయత్రి అంటే…


గాయత్రి అంటే…

ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది.
వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా,
‘నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే " జ్ఞానము లేక వేదముగా "చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు.
నా నుండి అగ్ని. అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి,
హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.

గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:

01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను
ప్రాసాదిస్తాడు.
09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.

శ్రీ గాయత్రీ మాత మహాత్మ్యం

వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే.
గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.

" ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"

ఇదే గాయత్రీ మూల మంత్రం.
గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
 త్రికాలా ల లోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు.
అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం
మరెవరూ లేరన్నది అక్షర సత్యం.
హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ,
వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది.
నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు.
ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని
త్రికాలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి,
కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ
‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు.
 శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం.
ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.

* గాయత్రి మంత్రాక్షరాలు

సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’

గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు.
 ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి.
అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి.
 బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది.
పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే
శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు.
ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు.
వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి.
గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.
ఓం నమో గాయత్రీ మాత్రే’