Thursday, 14 January 2016

ఆరోగ్య చిట్కాలు 2


ఆరోగ్య చిట్కాలు  2

1. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

2.  అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

3.  కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

4. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

5.  ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.

6. బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

7. క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.•

8. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

9. ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.•

10. అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

శ్రీ సాయి కష్ట నివారణ స్తోత్రం



                                                      శ్రీ  సాయి  కష్ట  నివారణ  స్తోత్రం


ఓం
అవిఘ్నమస్తు
సాయినాథాయ  నమః


ప్రథమం  సాయినాథాయ  నమః   


ద్వితీయం ద్వారకా మాయినే 

తృతీయం  తీర్థ  రాజాయ  


చతుర్థం  భాక్తవత్సలే


పంచమం  పరమార్థాయ  


షష్టించ  షిర్డీ  వాసనే


సప్తమం  సద్గురు  నాధాయ  


అష్టమం  అనాథ  నాధనే


నవమం  నిరాడంబరాయ


దశమం  దత్తావతారమే

Wednesday, 13 January 2016

నారాయణ జయ గోవింద హరే


నారాయణ జయ గోవింద హరే
(శంకరాచార్య )

నారాయణ నారాయణ జయ గోవింద హరే ||

నారాయణ నారాయణ జయ గోపాల హరే ||
కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ || ౧ ||

ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ || ౨ ||
యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ || ౩ ||

పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ || ౪ ||
మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ || ౫ ||

రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ || ౬ ||
మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ || ౭ |
|
బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ || ౮ ||
వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ || ౯ ||

జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ || ౧౦ ||
పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ || ౧౧ ||

అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ || ౧౨ ||
హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ || ౧౩ ||

దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ || ౧౪ ||
గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ || ౧౫ ||

సరయుతీరవిహార సజ్జనఋషిమందార నారాయణ || ౧౬ ||
విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ || ౧౭ ||

ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ || ౧౮ ||
జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ || ౧౯ ||

దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ || ౨౦ ||
ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ || ౨౧ ||

వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ || ౨౨ ||
మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ || ౨౩ ||

జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ || ౨౪ ||
తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ || ౨౫ ||

గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ || ౨౬ ||
సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ || ౨౭ ||

అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ || ౨౮ ||
నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ || ౨౯ ||

భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ || ౩౦ ||

Tuesday, 12 January 2016

ఆరోగ్య చిట్కాలు 1


ఆరోగ్య చిట్కాలు 

1. అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.• 

2. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.•

 3. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.• 

4. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.•

5.  అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.•

 6. జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.• 

7. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.•

8  సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.•

 9. మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

10. బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.• 

11. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

12. దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

Sunday, 10 January 2016

గోమాత సర్వ శుభ రూపిణి


  "సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం
                                          సురబిం యజ్ఞా స్య జననీ మాతరం త్వానమామ్యాహం"-

                          శ్లోకాన్ని బట్టి సర్వ తీర్ధములు గోమాతలోనే ఉన్నాయని,
                  వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.
                     గోమాత సర్వ శుభ రూపిణివి. యజ్ఞమునకు తల్లివంటి దానిదని,
                                     ముప్పదిమూడు కోట్ల దేవతలకు నిలయం
                                                         గోమాత.

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో     సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.

గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.

గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.
అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం.

 ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట. ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

గోమాత సర్వదేవతలు కొలువై వుంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.  యజ్ఞయాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్లు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ వుంటుంది. గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టుగా భావిస్తుంటారు.

 గోవును పూజకు కొన్ని విశేషమైన పుణ్యతిథులున్నాయి. ఈ తిథుల్లో పూజించడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది. అలాంటి పుణ్యతిథుల్లో ఒకటిగా 'ఆశ్వయుజ బహుళ ద్వాదశి' కనిపిస్తుంది. దీనినే 'గోవత్స ద్వాదశి' అని కూడా అంటారు. ఈ రోజున దూడతో కూడిన గోవుని పూజించాలని పండితులు అంటున్నారు. ఈ రోజున ఆవు దూడలను పసుపు కుంకుమలతో, పూల దండలతో అలంకరించి, భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి వుంటుంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో చేసిన వంటకాలను ఈ రోజున స్వీకరించరాదనే నియమం ఉంది.

 దూడతో కూడిన ఆవును పూజించిన వాళ్లు ఆ రోజున బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపై పడుకోవలసి వుంటుంది. ఈ నియమాలను పాటిస్తూ గోపూజ చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు

గోమాతను దానం చేస్తే.. కోటి పుణ్య ఫలం దక్కుతుందని పురోహితులు చెబుతున్నారు. గోమాత లక్ష్మీదేవి స్వరూపం. ఆవు పాలు ఎంతో శ్రేయస్కరం. గోమాతను దానం చేయడం ద్వారా వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. పశువులకు మేతను దానం చేస్తే పాపాలను హరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

 ఇంకా గోమాతను శుక్రవారం పూజిస్తే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివెరుస్తాయి. ఇంట్లో గోపూజ చేయడం కుదరని పక్షంలో ఆలయాల్లోని గోశాలల్లో నిర్వహించే పూజల్లో పాల్గొనడం ద్వారా శుభఫలితాలుంటాయి. శుభ ముహూర్త కాలంలో గోపూజ చేయించడం, గోమాతను ఆలయాలను దానంగా ఇవ్వడం వంటివి చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు.
మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని గోమాత వహించింది. గోమాత మనల్ని పోషిస్తున్నాయి. పూర్వం బ్రహ్మన అచేతనాలైన నదులు, పర్వతాలు మొదలైనవాటిని సృష్టించి, జీవాత్మతో కూడిన చేతనమగు వస్తుజాతకమును అగ్నినుండి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని, అగ్నియందు ఉత్పత్తికి సాధకమగ హోమాన్ని చేశాడు. శరీరం కొరరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వల్ల గోవు ఒక్కటే అందునుంచి ఆవిర్భవించింది.
 గోవుకు వేద ప్రమాణమయిన విశిష్టత ఉంది. అగ్ని సంబంధమైన హోమం వల్ల, గోవు జన్మించడంవల్ల గోవు అగ్నిహోత్ర సమానమైంది. కవ్వంచేత గో క్షీరాన్ని మధిస్తే వచ్చేటువంచి వెన్న, నెయ్యి దేవతలకు ప్రియమైనవి. గోదాన, హిరణ్య దానాలను యజ్ఞయాగాది క్రతువుల్లోనూ, పితృకర్మల్లోనూ చేయాలని మన శృతి బోధిస్తోంది.

 గోవులున్న ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. పుణ్యఫలం లభిస్తుంది. ఆవుకు గో గ్రాసం సమర్పణ చేస్తే చక్కని సత్ఫలితాలు లభిస్తాయి. ఆవుపాలును శ్రేష్ఠమైందని అంటున్నారు.

పూజాకార్యక్రమాలు, వ్రతాలు, యజ్ఞాల్లో  ఆవుపాలును శ్రేష్ఠమైందని అంటున్నారు.గోవు సమస్త సృష్టిలోకి పవిత్రమైంది. సకల దేవతలకి గోమాత నివాస స్థలం.
ఆవుపాలంటే సమస్త దేవతలనూ మన శుభకార్యానికి ఆహ్వానించినట్లవుతుంది. అందుకే మన ఇళ్ళల్లో జరిగే ప్రతి శుభకార్యానికి, వేడుకలు, యజ్ఞాలకు దేవతలను ఆహ్వానించే రీతిలో ఆవుపాలను వాడుతారని చెబుతున్నారు.
       గంగి గోవు పాలు గరిటడైనను చాలు  ....అని వేమన  గారు  శతకములో  ప్రస్తుతించారు.
                  గోమాతను ....రక్షిద్దాము......పూజిద్దాము ...  సకల శుభాలను  పొందుదాము



. " శక్తినిచ్చే ‘ ఖర్జూరం’ "




                                                           "" శక్తినిచ్చే ‘ ఖర్జూరం’"

1. పొటాషియం ఎక్కువగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి. అలాగే ఇవి గుండెకు సంబంధించిన అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.

2. ఖర్జూరం పండ్లలో శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల ఎదుగుదలకు చాలా అవసరం.

3. ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా.. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే బరువు పెరుగుతామన్న భయం ఉండదు.

4. ఖర్జూరం పండ్లలో యాంటీఆక్సిడెంట్ల రూపంలో ఉండే విటమిన్ ‘ఎ’ కంటికి చాలా మంచిది. ఈ పండు వల్ల రేచీకటి వంటి కంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

5. క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్.. వంటి మినరల్స్ ఈ పండులో అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి.. కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి.. మాంగనీస్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి.

6. ఖర్జూరాలు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు..
     బాగా సన్నగా ఉండి ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకునే వారికి కూడా
      మంచి ఫలితాన్నిస్తాయి.

7. ఖర్జూరం పండు శరీరానికి తక్షణ శక్తినిస్తుంది.

8. అలాగే ఇది త్వరగా జీర్ణమవుతుంది.

9. మలబద్ధకంతో బాధపడే వారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున
వాటిని తిని, ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

10. ఖర్జూరంలో బి-కాంప్లెక్స్‌తో పాటు విటమిన్ ‘కె’ కూడా ఉంటుంది. ఇందులోని నియాసిన్, రైబోఫ్లేవిన్, పాంటోథెనికామ్లం, పైరిడాక్సిన్.. మొదలైన విటమిన్లు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.

11. ఖర్జూరాలు తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయని చాలామంది వాటిని తినడానికి భయపడుతుంటారు. వీటిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు మరీ గణనీయంగా పెరగవని ఓ పరిశోధనలో వెల్లడైంది.

***కానీ డయాబెటిస్‌తో బాధపడే వారు మాత్రం డాక్టర్ సలహా మేరకే వీటిని ఆహారంలో
            భాగం     చేసుకోవడం మంచిది.

12. ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి6 వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

13. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఖర్జూరాలు తమవంతు పాత్ర పోషిస్తాయి.

14. మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరగాలంటే ఖర్జూరాల్ని తరచూ తినాలి. అలాగే కొంతమందికి మూత్రం
     సరిగ్గా రాకపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. తదితర సమస్యలుంటాయి. ఇవన్నీ ఖర్జూరం తినడం
     వల్ల   తగ్గే అవకాశం ఉంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/


Saturday, 9 January 2016

ధనియాల చారు


                                                                ధనియాల  చారు

కావలిసిన  పదార్ధాలు :

1. కంది  పప్పు  3 స్పూన్స్,
2. ధనియాలు 1 స్పూన్,
3. ఎండు  మిరప కాయలు 2,
4. మిరియాలు 4,
5.  టమాటో  1
6.  పచ్చి మిరపకాయ 1.
7 . చింతపండు ,
,8. ఉప్పు ,
9. బెల్లము,
10.  పసుపు

తయారీ విధానము :
ముందుగా  కంది  పప్పు , ధనియాలు , ఎండు  మిరప కాయలు , మిరియాలు
ఒక గంట సేపు నానబెట్టు కోవాలి.
నానిన తరువాత  , మెత్తగా  గ్రైండ్ చేసుకోవాలి.
ఆ మిశ్రమాన్ని ఒక గిన్నె లోకి తీసుకుని ,
చింతపండు పులుసు ,( చింత పండు నీళ్ళలో పిండి గుజ్జు తీసేయాలి )
ఉప్పు , బెల్లము, పసుపు  ,టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ వేసుకుని ,
స్టవ్ మీద పెట్టి, బాగా మరిగించాలి .
ఇది మరిగేటప్పుడు స్టవ్ మంటచిన్నది  గా  ఉండేలా చూసుకోవాలి. ,
పేన్  లో కొంచెము నూని  వేసి ,ఆవాలు,మెంతులు  జీలకర్ర, కొద్దిగా ఇంగువ ,
ఎండుమిరపకాయ ముక్కలు  , కరివేపాకు వేసి , పోపు పెట్టుకుని
అందులో కలపాలి.
ఆ తరువాత బాగా మరిగించాలి.
బాగా మరిగిన తరువాత
దించే ముందు  ,
కొత్తిమీర వేసి  మూత పెట్టుకోవాలి.
రుచికరమైన ఘుమఘుమలాడే ధనియాల చారు రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi





.

Friday, 8 January 2016

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం


శ్రీ లక్ష్మీ అష్టోత్తర పారాయణం :

ధ్యానమ్  :
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||
సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||
ఓం ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్ |
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 ||
వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ |
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ || 2 ||
అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్ |
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్ || 3 ||
అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్ |
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 ||
నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్ |
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ || 5 ||
పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్ |
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 ||
పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్ |
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ || 7 ||
చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్ |
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 ||
విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్ |
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ || 9 ||
భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్ |
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 ||
ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్ |
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 ||
శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్ |
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||
విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ |
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 ||
నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |
త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 ||
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 ||
మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||
త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||
భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||
భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||

ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్

Thursday, 7 January 2016

తెలుగు సాహిత్యము వికట కవిత్వము


                                                    తెలుగు సాహిత్యము  వికట కవిత్వము

ఎందరో మహా కవులు.సాహిత్యములో వారు చేసిన , చేస్తున్న కృషి ఎనలేనిది.సాహిత్యము లోచెప్పుకోదగ్గ ముఖ్యమైన వాటిలో వికట కవిత్వము ఒకటి. మనకు తెలిసిన ప్రముఖ కవి తెనాలి రామకృష్ణ.ఆయన హాస్య చతురుడు,
వికట కవిత్వములో ఆయన ప్రతిభ అమోఘము.ఆయనే కాదు ఇంకా చాలామంది
కవులు ఈ విధానములో తమ ప్రతిభను చూపించారు.

వికట అంటే హాస్యము అని అర్థము ఉన్నా ,అసలు వికట అంటే ఏ వైపు నుంచి చదివినా ఒకే లా వస్తుంది .అంతే కాదు వేరే అర్థాలు కూడా ఉంటాయి .ఉదాహరణకు  ఈ పద్యము చూద్దాము.

వాసుదేవ. వాసుదేవ. వాసుదేవ.
"తం భూసుతా ముక్తిముదార హాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీః|
శ్రీ యాదవం భవ్య భతోయ దేవం
సంహారదా ముక్తి ముతా సుభూతం||"
వాసుదేవ.

ఈ శ్లోకం 'శ్రీ రామకృష్ణ విలోమ కావ్యం' లోనిది. కవి పేరు పండిత దైవజ్ఞ సూర్య సూరి. 14వ శతాబ్దపు, దివిసీమ తాలూకా కవి.
  ఈ శ్లోక విశేషమేమిటంటే మొదటినుంచి చివరకు చదివినా, చివరనుంచి వెనుకకు చదివినా ఒకేలాగ ఉంటుంది, అంటే వికటకవి లాగా అన్నమాట. ఇంగ్లీషులో దీనిని ప్యాలిన్డ్రోమ్ అంటారు. అర్థభేదం మాత్రం ఉంటుంది.

 ఎడమనుండి కుడికి చదివినప్పుడు శ్రీరామ పరంగానూ, కుడినుండి ఎడమకు చదివినప్పుడు శ్రీకృష్ణ పరంగానూ ఉంటుంది. చూడండి,  ఎడమనుండి చదివినప్పుడు 'ఎవరైతే సీతను రక్షించారో, ఎవరి చిరునవ్వు మనోమోహకంగా ఉంటుందో, ఎవరి అవతార విశేషం పరమ అద్భుతమో, ఎవరినుండైతే దయ, అద్భుతమూ అన్నిచోట్లా వర్షిస్తుందో అట్టి శ్రీరామునికి నమస్కరిస్తున్నాను,' అనే అర్థం వస్తుంది.

 అదే కుడినుండి ఎడమకు చదివినప్పుడు 'శ్రీ యాదవ కులంలో ఆవిర్భవించిన, సూర్యచంద్రులకు ప్రాణాధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మయైనట్టి శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాను,' అని అర్థం వస్తుంది.

Tuesday, 5 January 2016

VEERA SAINIKA VANDANAM



వీర సైనికా వందనం

   సౌర్య కీర్తి  ---  జాతి స్ఫూర్తి  

మీ బుల్లెట్ల  వర్షం  తొలకరి  జల్లు లా ప్రారంభమై , 
పెను తుఫాను లా మారి , 
ప్రళయ  మారుతము  గా 
సరిహద్దు  శత్రువులను 
చుట్టు ముట్టి,
తరిమి కొట్టి,
భారతీయులపై  కురిపించాయి  
విజయ మల్లెల  వర్షం
పెల్లుబికింది  మీ పట్ల అంతటా  హర్షం . 
వర్షం వెలిసిన తరువాత  వీచే 
ఈదురు  గాలులలో ఎగురుతోంది  
ఎగురుతోంది మువన్నెల  జెండా
అనంతమైన  ఎత్తులో  
అశేష  హిమాలయా పర్వతాల మీద 
మ్రోగిస్తూ  విజయ దుందుభి
 శిఖరాగ్రము ఫై  తల ఎత్తి సగర్వం గా
మిలమిలా  మెరుస్తూ  ,
అందరు  యోధుల  విజయానికి  సంకేతము లా ,
మరెందరో  యోధుల  త్యాగానికి ఫలితం లా ,
దేశ మంతటా విజయోత్సావాలు  వెల్లి విరుస్తుంటే  ,
తల్లీ భారతి 
ఏమిటమ్మా నీ కళ్ళలో  నీళ్ళకు అర్థం మన వీర సైనికుల సౌర్యము  అనిర్వచనియము. ,
పరాక్రమము  అత్యద్భుతం  ,
త్యాగం  చిర స్మరణియమ్  ,
శత్రువులను తరిమి కొట్టి మన జాతి  గౌరవాన్ని  ,
మన దేశ ప్రతిష్టను కాపాడిన   
ఇలాంటి  వీరులను కన్నందుకు  
కళ్లలొ కలిగిన  ఆనంద భాష్పాలా,
లేక  
వీర పరాక్రమము  తో యుద్ధము లో 
దేశ రక్షణ  కై  ,  
అశువులు బాసిన  
వీర యోధుల త్యాగానికి అశ్రు తర్పణమా  ......

మన దేశ రక్షణ కై పోరాడే ప్రతీ వీరునికి 
వినమ్రము గా  వందనము  చేస్తూ  
 కవితను  అంకితమిస్తున్నా