Tuesday, 1 April 2025

అభిమానం. కథ

 

ప్రయాణికులకు విజ్ఞప్తి,
ట్రైన్ నెంబర్...
అంటూ మరికొద్ది సేపటిలో 2 వ నెంబర్ ప్లాట్ ఫారం మీదకి వచ్చును...
అంటున్న ప్రకటన వినగానే ఒక్క సారిగా జనం సర్దుకోవడం మొదలు పెట్టారు...
ఆ రోజు ఫ్లాట్ ఫారం అంతా సందడి గా,
కోలాహలం గా ఉంది.
ఎందుకంటే ఆరోజు వాళ్ళ  అభిమాన  హీరో
ఆరోజు అదే ట్రైన్ లో వస్తున్నారు.
షూటింగ్ కోసం.
అభినవ్ ఈమధ్యే రెండు హిట్స్ తో మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు.
విజయ్ కి కూడా చాలా ఇష్టం ..
తనకి చూడాలని ఉంది ...
అంతమంది జనం , తోపులాట ఎందుకు అనిపించినా...
మనసు ఆగలేక బయకుదేరాడు
రైల్వే స్టేషన్ కి...
అప్పటికే జనాల అరుపులతో,
అంతా హడావుడి గా ఉంది.
కనీసం దూరం నుంచి అయినా చూద్దామని అలా దూరం గా ఒక బెంచ్ మీద కూర్చుని చూస్తున్నాడు. ఇంతలో రైలు వచ్చి ఆగింది...
అందరూ ఉత్సాహం గా ఎగబడి పోయారు.. కంపార్ట్మెంట్ దగ్గరకి....
గేట్ తీయగానే...ఎవరో దిగారు... అతనికి దారి ఇచ్చేసారు...
తరువాత ఒక ముసలి ఆమె దిగారు.... మళ్ళీ ఫాన్స్ లో నిరుత్సాహాం...
ఈసారి ఒక ముసలి ఆయన సంచీ పట్టుకుని దిగాడు....
ఆయనకి దారి ఇచ్చేసారు....ఆయన మెల్లిగా నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న బెంచి మీద కూర్చున్నారు.
ఇంతలో ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి..
ఆయన లొకేషన్ కి వెళ్లి పోయారు మీరు అందరూ అక్కడి కి వచ్చేయండిి...
లంచ్ తరువాత కలిసే ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు...
అందరూ కొంత నిరుత్సాహ పడినా ,
అక్కడికి రమ్మన్నారు కదా అని రెండు గంటలకు అందరూ అక్కడికి చేరుకోవాలి అని ప్లాన్ చేసుకుని ఒక్కో క్కరూ బయలు దేరసాగారు.

బాబు కొంచెం మంచినీళ్లు ఇస్తావా అడిగారు.
చెమట తుడుచుకుంటూ...
అయ్యయ్యో ఇవి నేను తాగాను అండి...
ఉండండి ఒక్క నిమిషం అంటూ ఒక మినరల్ వాటర్ బాటిల్ కొని ఆయనకి ఇచ్చాడు...
అదేమిటి బాబు కొత్తది కొని ఇచ్చావు...
అంటూ అడిగాడు...
ఏమీ పరవాలేదు తాతగారు...
మీరు పెద్దవారు...మీకు దాహం తీర్చడం లో
వాడిన నీళ్లు ఎందుకని... ఇచ్చాను...
ఇంతలో నా ఆస్తులు ఏమీ కరిగి పోవులెండి అన్నాడు నవ్వుతూ...
సంతోషం బాబు...
ఇంతకీ అంతా అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు
అని ఆడిగాడు... నీళ్లు తాగుతూ..
నేను బాగా అభిమానించే హీరో
వస్తున్నారని చెప్పారు...
అందరితో పాటు నేను చూద్దామని వచ్చాను ...
కానీ జన సందోహం చూసి ఇక్కడే ఆగిపోయాను. ఆయన ముందు స్టేషన్ లో దిగి లొకేషన్ కి వెళ్లి పోయారుట...
రెండు గంటలకి అక్కడికి రమ్మని చెప్పారట...అన్నాడు విజయ్ .
మరి వెళుతున్నావా అని అడిగారు పెద్దాయన.
నాకూ వెళ్లాలనే ఉంది కానీ , అక్కడ కి చాలామంది వస్తారు...
పైగా షూటింగ్ హడావిడి స్ట్రిక్ట్ గా ఉంటుంది... కలిసే అవకాశం ఉండదు... ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఉంది...అన్నాడు...
సరే అబ్బాయి
ఇంతకీ నీ పేరు ఏమిటన్నావ్ అన్నాడు.
విజయ్ సర్... అని చెప్పాడు.
మీ హీరో గారు నాకు ట్రైన్ లో పరిచయం అయ్యారు.
తన విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చాడు.
షూటింగ్ కి ఖాళీగా ఉంటే నన్ను అక్కడికి రమ్మని ఆహ్వానించారు.
ఇదిగో
ఈ కార్డ్ చూపిస్తే ,లోపలికి రానిస్తారు
అని చెప్పాడు.
ఈ వయసులో అలాంటి సరదాలు మాకేముంటాయి .
నీకు కావాలంటే ఈ కార్డ్ ఇస్తా... తీసుకుని వెళతావా అన్నాడు పెద్దాయన .
విజయ్ ఎగిరి గంతేసినంత పని చేసాడు.
మొహం లో ఒక్కసారి గా ఆనందం.
కానీ అంతలో నే మాయమైంది.
కానీ సర్ ఆయన కార్డ్ వలన అక్కడి వరకు వాళ్ళు వెళ్ళనిస్తారు.
కానీ ఆయన కి నేను తెలియదు కదా,
బైటకి పంపేస్తారు... ఇప్పుడు ఎలా మరి అని అడిగాడు.
ఓరి నీ దుంప తెగ... సర్లే నీకోసం నేనూ వస్తా...పద బండి తీయి...
నీకు సంతకం పెట్టించి... నేను వెళతాను సరేనా అన్నాడు పెద్దాయన.
అలా అన్నారు బాగుంది... ఇప్పుడు చూడండి అంటూ హుషారుగా బండి తీసుకుని రావడానికి వెళ్ళాడు.
దూరం గా నుంచుని ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ ని పిలిచి... నేను ఇతనితో వస్తా...మీరు ఫాలో అవ్వండి... మేకప్ బాగా వేసాడు...ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు....నా క్యారెక్టర్ బాగా పండుతుంది అనడం లో సందేహం లేదు అన్నాడు నవ్వుతూ...
ఇవాళ లంచ్ కూడా నాతోనే ఏర్పాటు చేయండి... అభిమాని థ్రిల్ ఫీల్ అవుతాడు...
వాళ్ళని సంతోష పెట్టడమేగా మన పని...అంటూ నవ్వాడు...
అలాగే సర్..అంటూ లగేజీ, కార్ వ్యాన్ లో పెట్టించి...వెనుకే ఫాలో అవసాగాడు.
ఇద్దరు బయలు దేరారు..
భుజం మీద చేయి వేసి గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు ..
ఆ చేయి వేయగానే ఏదో ఆనందం... తెలియదు...ఎందుకో..
తన అభిమాన హీరో ని ,చూడడానికి వెళుతున్నాను కదా అందుకే నేమో...అనుకున్నాడు... విజయ్..
ఇద్దరు షూటింగ్ లొకేషన్ కి చేరుకున్నారు... ...తన అభిమాన హీరో ని కలవ బోతున్నా అన్న ఆనందం చెప్పలేనిది గా ఉంది...సర్ చాలా థాంక్స్ అండీ...
మీ దయ వలన నేను మా అభిమాన హీరో ని కలవ బోతున్నా... అన్నాడు..
అప్పుడే ఏమైంది... ఇంకా చాలా ఉంది.
ముందు ముందు నీ కే తెలుస్తుంది లే అన్నారు .
అర్థం కాలేదు విజయ్ కి
ఏమిటో మరి అనుకుంటూ అక్కడ ఆగాడు...ఆయన బండి దిగుతుంటే...
అందరూ పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చేసారు...
నమస్తే సర్..మీ గురించే ఎదురు చూస్తున్నాము....అంటూ గబగబా దండలు అవి వేయ బోయారు...
వద్దు వద్దు మేకప్ పోతుంది....
ముందు సీన్ చేసేద్దాం... తరువాత మాట్లాడుకుందాం... అన్నాడు.
విజయ్ కి ఏమి జరుగుతోందో అర్ధం కాలేదు... ఇంత సేపు తన బైక్ మీద వచ్చింది తన అభిమాన హీరోనా..
ఆయన తోనే నేను ఇక్కడి కి వచ్చానా.
ఆయనే నన్ను ఇక్కడి కి తీసుకుని వచ్చారా..సంభ్రమాశ్చర్యాలలో మునిగి పోయాడు.
.. ప్రొడక్షన్ మేనేజర్ ని పిలిచి ఇవాళ ఇతను నా గెస్ట్ ...లంచ్ కూడా నాతోనే...జాగ్రత్తగా చూసుకోండి... అన్నాడు
సరే సర్ అంటుంటే...
దర్శకుడు వచ్చారు... సర్ షాట్ రెడీ...
మీరు ఒక రిహార్సల్స్ చేసేస్తే...
టేక్ చేస్తాను... అంటూ చెప్పాడు... పదండి...అంటూ...
మిస్టర్ విజయ్ ఇవాళ నాతోనే ఉంటున్నావ్....సరేనా అంటూ భుజం మీద ఆప్యాయంగా తట్టి , నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు అభినవ్.
ఇవాళ షూటింగ్ అంత సేపు నువ్వు ఇక్కడే ఉండొచ్చు....హీరో గారితో లంచ్... కూడా ఏర్పాటు చేసాను. తరువాత నీకు కావలిసిన ఆటోగ్రాఫ్ తీసుకుని వెళ్లొచ్చు ..సరేనా అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్..
చాలా థాంక్స్ అండీ....
ఇవాళ చాలా సంతోషంగా ఉంది..
ముందు లోపలికి వెళ్ళు....
నేను మళ్ళీ కలుస్తాను.
ఇదిగో ఈ పాస్ నీ దగ్గర ఉంచు...
ఎవరు ఆడిగినా చూపించు... ఎవరూ ఆపరు...
అని అతనికి పాస్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఆ రోజంతా గడిపి ఆటోగ్రాఫ్ తీసుకుని...
బండి మీద బయలు దేరాడు...
ఆ రోజు నిజంగా జీవితం లో మరచి పోలేని రోజు.... అనుకుంటూ..
గాల్లో తేలి నట్టుంది అంటూ పాడుకుంటూ ...నడువుతున్నాడు...బండి...ఆ థ్రిల్ నించి ఇంకా బైటకి రాలేక పోతున్నాడు... ఇంతలో బండికి అడ్డం గా ఎవరో వచ్చేసారు... చూసుకోలేదు.
సడెన్ బ్రేక్ వేసాడు... కంట్రోల్ తప్పి...దబ్ మని పడిపోయాడు.... ఎవరో తనని లేపుతున్నారు....
కళ్ళు తెరిచి చూసేటప్పటికి...
మంచం కింద ఉన్నాడు...
ఏరా... మళ్ళీ కల వచ్చిందా....
మంచం మీదనించి పడ్డావ్...
అసలు ఈ కలలు కనే మాయ రోగం ఎక్కడి నుంచి వచ్చింది రా.
అర్ధరాత్రి దాకా తిరగటం , బారెడు పొద్దెక్కే దాకా లేవక పోవడం...
అన్ని దిక్కుమాలిన అలవాట్లే వీడికి....
కాలేజీ కి టైం అవుతోంది, తొందరగా లేచి తయారవుదాం...అన్న జ్ఞానం లేదు
ఇంతకీ ఇవాళ కాలేజ్ కి వెళుతున్నారా లేదా దొరగారు, అంటూ తిట్ల దండకం మొదలు పెట్టాడు విజయ్ వాళ్ల నాన్న.
ఆ ఆ వెళుతున్నాను నాన్నా...ఆంటూ లేచాడు .
ఇదంతా కలా... ఎంత రియల్ గా అనిపించింది...
అభిమానం ఉండొచ్చు కానీ ఇంత ఎక్కువ గా ఉండకూడదు...
ఇంకా నయం మంచం మీదనించి పడ్డాను గాబట్టి సరిపోయింది లేకపోతే అదే బండి మీద నుంచి అయితే...ఎంత ప్రమాదం..తప్పింది.. అనుకుని...తనలో తాను నవ్వుకుంటూ తయారవడానికి బయలు దేరాడు...
విజయ్ టిఫిన్ చేస్తుండగా ఫ్రెండ్ వచ్చాడు బండి మీద...ఒరేయ్ విజయ్ అని అరిచాడు..
అదిగో వచ్చాడు
కూసే గాడిద వచ్చి మేసే గాడిద ని చెడగొట్టిందట...
సుబ్బరంగా మెక్కడం....
ఊరి మీద పడి బలాదూర్ తిరగడం...
ఇంక చదువుకోవడాలు ఏవి లేవుట్రా....అంటూ వాడి మీదకుడా అరిచాడు ...
ఆబ్బె అలాంటిదేమి లేదు అంకుల్ ...
కాలేజ్ కే వెళుతున్నాం...
మేము చాలా బాగా చదువుకుంటున్నాం అంకుల్... అన్నాడు..
ఆహా అలాగా మరి ఎన్ని బాక్ లాగ్స్ ఉన్నాయో చెప్పు మరి...అన్నాడు...
అంకుల్ అవి మరి అవి , ఏమిటి అలా నీళ్లు నములుతున్నావ్ చెప్పు మరి అని అన్నాడు,
అవి ఒకటి రెండు మూడు లెక్కపెడుతున్నాడు... చేతి వేళ్ళు సరిపోతాయా , కాలి వేళ్ళు కూడా కలపాలా ..
మీ సంగతి నాకు చెపుతున్నారురా....
ఇక్కడ ఫీజులు లు కట్టేది నేనే నని మర్చిపోయి నట్టున్నారు...
ఒక్కొక్కళ్ళు ఎలా తయారయ్యారో...
ఎప్పుడు మారతారు రా,
జీవితం విలువ ఎప్పుడు తెలుసు కుంటారు రా ...
అని క్లాస్ మొదలు పెట్టాడు.
నాన్నా బాయ్ అంటూ విజయ్ వచ్చి బండి ఎక్కాడు...
తొందరగా ఎక్కరా బాబు....
ఇంకొంచెం సేపు ఉంటే మీ నాన్న
నన్ను చంపే సేలా ఉన్నారు... అంటూ
బండి స్టార్ట్ చేసి.. బై అంకుల్ అంటూ చెప్పాడు...
దీనికేమి తక్కువ లేదు...బాయ్ బాయ్...లు టా టా లు...వేధవల్లారా...
ఆ వెధవ స్పీడ్ తగ్గించి , కాస్త స్లోగా అఘోరించండి....
జాగ్రత్తగా వెళ్లి రండి...అన్నారు.
ఎందుకండి వాడ్ని అలా తిడతారు.
అసలే కాలేజ్ కి వెళ్లే కుర్రాడు...అంటూ అడిగింది భార్య...
తమరి దిక్కుమాలిన సలహా ఇక్కడ ఎవరికి అక్కరలేదు..
ముందు నాకు టిఫిన్ పెట్టు.
ఆఫీస్ కి టైం అవుతోంది.
అసలు నీ గారాబం వల్ల నే కదూ వాడు అలా తయారు అయ్యింది అన్నాడు...
అయ్యో రామా మధ్య లో నా మీద పడతారేమిటి,
ఇదిగో టిఫిన్ తినండి అంటూ ప్లేట్ టేబుల్ మీద పెట్టింది.
వాడిని ఒక్క ముక్క కూడా అననీయవు, మధ్య లో దూరిపోతావ్...మనం కాక పోతే ఎవరు చెపుతారు..

" ఇప్పుడు కష్టపడి చదవక పోతే
జీవితాంతం కష్టపడి పని చేయాల్సి వస్తుంది"

అది నీకు సంతోషమేనా....
నేను కోప్పడేది వాడి భవిష్యత్ కోసమేగా...
కనీసం నువ్వైనా అర్థం చేసుకో
నాన్న మనసుని
అంటూ చేయి కడుక్కోవడానికి లేచాడు..
ఇటు ఎక్కడికి రా ,
కాలేజ్ అటు కదా అని అడిగాడు విజయ్.
ఏరా మరచి పోయావా
ఇవాళ మన అభిమాన హీరో
అభినవ్ షూటింగ్ ఉందని తెలుసుగా....
మనం అక్కడి కే వెడుతున్నాం.
కాలేజ్ కి వెళ్లటం లేదు... అన్నాడు... వేణు.
వద్దు రా , అభిమానం సినిమా చూసే వరకు ఉంచుకుందాం... కాలేజ్ మానేసి...అక్కడికి వెళ్లడం ...ఉహూ...
వద్దు లే...
ఇవాళ క్లాస్ మిస్ అయితే మళ్ళీ చెప్పే వాళ్ళు ఉండరు.
ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసాం...
ఎప్పుడైనా సెలవులో ఉంటే వెళదాం....
ముందు బండి కాలేజీ కి పోనీ అన్నాడు... విజయ్..
ఇంత జ్ఞానోదయం ఎప్పుడు అయింది బాబూ అని ...వెటకారం గా అడిగాడు వేణు.
ఉదయమే గానీ,
నువ్వు మూసుకుని పద బే...అన్నాడు విజయ్.
సరే ..అలాగే కానీ
ఇలా మర్యాద గా చెపితే ఎవరు కాదంటారు, అలాగే కానీ,
అయినా,
నువ్వు చెప్పింది పాయింటే గా...
చలో కాలేజ్ ...అంటూ
బండి కాలేజ్ వైపు తిప్పేసాడు....

కల్పిత కథ 

కథ కథనం పాత్రలు కల్పితం 


Sunday, 23 March 2025

తెలుగు సంవత్సములు పేర్లు అర్థములు

తెలుగు సంవత్సములు పేర్లు అర్థములు 

1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.

2. విభవ - వైభవంగా ఉండేది.

3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.

4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.

5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.

6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.

7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.

8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.

9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.

10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.

11. ఈశ్వర... పరమేశ్వరుడు.

12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.

13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.

14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.

15. వృష ... చర్మం.

16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.

17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం

18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.

19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.

20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.

21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.

22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.

23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.

24. వికృతి... వికృతమైనటువంటిది.

25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.

26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.

27. విజయ... విశేషమైన జయం కలిగినది.

28. జయ.... జయాన్ని కలిగించేది. 

29. మన్మథ... మనస్సును మధించేది.

30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.

31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.

32. విలంబి... సాగదీయడం.

33. వికారి.... వికారం కలిగినది.

34. శార్వరి... రాత్రి.

35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.

36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.

37. శోభకృత్... శోభను కలిగించేది.

38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.

39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.

40. పరాభవ ... అవమానం.

41. ప్లవంగ... కోతి, కప్ప.

42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.

43. సౌమ్య... మృదుత్వం.

44. సాధారణ... సామాన్యం.

45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.

46. పరీధావి... భయకారకం.

47. ప్రమాదీచ... ప్రమాద కారకం.

48. ఆనంద... ఆనందమయం.

49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.

50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.

51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.

52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.

53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.

54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.

55. దుర్మతి... దుష్ట బుద్ధి.

56. దుందుభి ... వరుణుడు.

57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.

58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.

59. క్రోదన... కోప స్వభావం కలది.

60. అక్షయ... నశించనిది

సేకరణ 🙏💐

Saturday, 14 September 2024

రామ మంత్రము


రామ మంత్రము 

1. రామ మంత్రం:


 "ఓం శ్రీ రామాయ నమః" ప్రయోజనాలు:

 ఈ మంత్రం శాంతి, సంతోషం, శ్రేయస్సుకు మూలం మరియు భక్తుడిని పరమాత్మతో ఐక్యం చేస్తుంది.


2. రామ ధ్యాన మంత్రం: మంత్రం:


 "వదాని రామణం వరనేందు శిరోధియా చరణౌ యో ధృత్వా, దేవః శిరసా నమతి రామన్ పాతురమః" లాభాలు: ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, అంకితభావం పెరుగుతాయి.


3. రాముని పూజించే మంత్రం:


మంత్రం: "శ్రీరామచంద్ర కృపాలు భజమాన హరణ భవభయ దారుణం| నవకంజ లోచన, కంజముఖ కర కంజపద కంజరుణం." ప్రయోజనం: ఈ మంత్రం శ్రీరాముని అనుగ్రహాన్ని కలిగిస్తుంది. భక్తిని పెంచుతుంది.


4. రామ నామ మహిమే మంత్రం:


"రామ నామ సత్య హై" ప్రయోజనాలు: ఈ మంత్రాన్ని పఠించడం వల్ల భక్తి పెరుగడంతోపాటు.. భక్తుడు మోక్షాన్ని పొందుతాడు.


5. శ్రీరాముని కృతజ్ఞతా మంత్రం:


 మంత్రం: "ధన్యవాదాలు రాముడు" ప్రయోజనం: ఈ మంత్రాన్ని జపించడం ద్వారా, ఒక వ్యక్తి భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడు. స్వీయ-అభివృద్ధిని పొందుతాడు.


6. రామ భక్తి మంత్రం:


మంత్రం: "రామ భక్తి దే దే రే మంత్రం" ప్రయోజనాలు: ఈ మంత్రాన్ని జపించడం వల్ల భక్తి పెరుగుతుంది. ఒక వ్యక్తి దేవునితో లోతైన సంబంధాన్ని పెంచుకుంటాడు.


7. రామ రక్షా స్తోత్రం: మంత్రం:


 "శ్రీరామ జయ రామ జయ జయ రామ." ప్రయోజనాలు: ఈ స్తోత్రాన్ని పఠించడం వలన వ్యక్తికి రక్షణ, శ్రేయస్సు, శాంతి లభిస్తుంది.


సేకరణ 🙏

Friday, 13 September 2024

కాశీపురాధీశ్వరీ శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్రం

 


కాశీపురాధీశ్వరీ శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్రం 


నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ

నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ।

ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 1 ॥


నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ

ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ ।

కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 2 ॥


యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ

చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ ।

సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 3 ॥


కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ

కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ ।

మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 4 ॥


దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ

లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విజ్ఞాన-దీపాంకురీ ।

శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 5 ॥


ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ

వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ ।

సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 6 ॥


ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ

కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ ।

స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 7 ॥


దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ

వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ ।

భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 8 ॥


చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ

చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ

మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 9 ॥


క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ

సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ ।

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 10 ॥


అన్నపూర్ణే సదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే ।

జ్ఞాన-వైరాగ్య-సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ ॥ 11 ॥


మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః ।

బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం ॥ 12 ॥


సర్వ-మంగళ-మాంగళ్యే శివే సర్వార్థ-సాధికే ।

శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే ॥ 13 ॥


ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ అన్నపూర్ణా స్తోత్రమ్ ।

సేకరణ 🙏 

కాలభైరవ అష్టకం

 కాలభైరవ అష్టకం 


దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం 

వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం 

నారదాది యోగివృంద వందితం దిగంబరం 

కాశికా పురాధినాథ కాలభైరవం భజే॥ 1॥


భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం 

నీలకంఠం ఈప్సితార్థ దాయకం త్రిలోచనం । 

కాలకాలం అంబుజాక్షం అక్షశూలం అక్షరం 

కాశికా పురాధినాథ కాలభైరవం భజే॥2॥


శూలటంక పాశదండ పాణిమాది కారణం 

శ్యామకాయం ఆదిదేవం అక్షరం నిరామయం ।భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం 

కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥3॥


భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం 

భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహం । 

వినిక్వణన్ మనోజ్ఞహేమకింకిణీ లసత్కటిం 

కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥4॥


ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం 

కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుం ।స్వర్ణవర్ణశేషపాశ శోభితాంగమండలం 

కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥ 5॥


రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం 

నిత్యం అద్వితీయం ఇష్టదైవతం నిరంజనం ।మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం 

కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥6॥


అట్టహాస భిన్నపద్మజాండకోశ సంతతిం 

దృష్టిపాతనష్టపాప జాలముగ్రశాసనం । 

అష్టసిద్ధిదాయకం కపాల మాలికంధరం 

కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥7॥


భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం 

కాశివాసలోక పుణ్యపాపశోధకం విభుం ।

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం 

కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥8॥


కాలభైరవాష్టకం పఠంతి యేమనోహరం 

జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం । 

శోక మోహ దైన్య లోభ కోప తాప నాశనం 

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం 


ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం 

కాలభైరవాష్టకం సంపూర్ణం

సేకరణ 🙏 

అపరాజిత_అమ్మవారు

 అపరాజిత_అమ్మవారు


విజయవాడ ఇంద్రకీలాద్రి మీదకు వెళ్ళినప్పుడు గర్భగుడిలో అమ్మవారికి ఎదురుగా బయటకు వచ్చి చూసినప్పుడు ఒక చెట్టు కింద క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ఉంటారు. 

ఆ స్వామికి వెనకాల చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది. 

ఈ అమ్మవారే అపరాజిత , అమ్మవారు 

చాలా శక్తివంతమైనటువంటి మూర్తి.

అమ్మవారిని ప్రార్థిస్తే విజయం కలుగుతుంది ఆని 

చండీ సప్తశతి వివరించింది

సప్తశతి  శక్తివంతమైనది .  దేవతలు  జయం కోసం ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమవుతారు ఆ ప్రత్యక్షమైన రూపమే ఈ అపరాజితాదేవి అమ్మవారు.

అపరాజితా దేవి స్తోత్రమ్

1)నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |

నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ ||

2)రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |

జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః ||

3)కల్యాణ్యై ప్రణతా వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః |

నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః ||

4)దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై |

ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః ||

5)అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః |

నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః ||

6)యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

7)యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

8)యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

9)యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

10)యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

11)యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

12)యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

13)యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

14)యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

15)యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

16)యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

17)యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

18)యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

19)యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

20)యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

21)యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

22)యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

23)యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

24)యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

25)యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

26)యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

27)ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా |

భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః ||

28)చితిరూపేణ యా కృత్స్నమేతద్ వ్యాప్య స్థితా జగత్ |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః |

సేకరణ 🙏🌷

Wednesday, 8 May 2024

ఆవుపాలు

ఆవుపాలు

1. కొంచెము పలుచగా ఉంటాయి. కావున సులభంగా/త్వరగా జీర్ణమగును.

2. చిన్నపిల్లలకు మంచిది, తల్లిపాలతో సమానము.

3. మనిషిలో చలాకీని పెంచుతుంది.

4. ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతాయి. ప్రేగులలో క్రిములు నశిస్తాయి.

5. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

6. చదువుకునే పిల్లలకు తెలివిని పెంచి, వారిని నిష్ణాతులను చేస్తాయి.

7. మనస్సును, బుద్ధిని చైతన్యవంతం చేస్తాయి.

8. సాత్విక గుణమును పెంచుతాయి.

9. సాధువులు ఋషులు మునులు ఆవుపాలనే సేవిస్తారు.

10. యజ్ఞ,హోమాదులకు ఆవుపాలను వినియోగిస్తారు.

11. దేవాలయములలో పూజకు, అభిషేకానికి ఆవుపాలు వాడతారు.

12. కార్తీకపురాణములో ఆవునెయ్యితో దీపారాధన చేస్తే పాపములు నశించి, పుణ్యం లభిస్తుందని తెలిపారు.

13. గోవు దేవతాస్వరూపము. కైలాసం దగ్గరలోని గోలోకము నుండి వచ్చినది. ఆవుపాలు, ఆవు నెయ్యితో మనకు దేవతాశక్తి వస్తుంది.

14. ఆవుపాలలో – బంగారము ఉన్నది. ఆవు మూపురములో స్వర్ణనాడి సూర్య కిరణాలతో ఉత్తేజితమై బంగారు (చరక సంహిత) తత్వంగల ఒక పుసుపుపచ్చని పదార్ధాన్ని విడుదలవుతుంది. అందువల్ల ఆవుపాలు పచ్చగా ఉంటాయి, ఆవుపాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపు తత్వం ఇమిడి ఉన్నది.

15. తెల్లఆవు పాలు వాతాన్ని, నల్లఆవు (కపిలగోవు) పాలు పిత్తాన్ని, ఎఱ్ఱనిఆవు పాలు కఫాన్ని హరిస్తాయి.

16. ఆవుపాలు సర్వరోగ నివారణి. ఆవుపాలు వృద్ధాప్యానికి దూరంగా ఉంచుతాయి.

17. ఘృతేన వర్దేతే బుద్ధిః క్షీరేణాయుష్య వర్ధనం, ఆవు నెయ్యి బుద్ధి బలమును పెంచును. ఆవుపాలు ఆయుష్షును పెంచును, ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండములో చెప్పారు. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.

18. చందోగ్య ఉపనిషత్ (6–6–3) మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరాలులోని స్థూల భాగం శరీరంలోని ఎముకలుగా మారుతుంది.

మధ్యభాగం మజ్జ (మూలుగ)గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన ఎముకలు, మజ్జ (మూలుగ) మంచి సాత్విక, శ్రావ్యమైన హక్కు కోసం ఆవు నేయ్యి, వెన్న తప్పక తినవలెను.

19. భారతీయ గోవులకు మూపురము వుండును. ఈ మూపురములోని వెన్ను పూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉన్నది, అందువలన ఈ ఆవుపాలు, నెయ్యి, వెన్నలకు పైన చెప్పిన ప్రత్యేక గుణములున్నవి.


పాశ్యాత్య గోవులైన జర్సీ, హె.యఫ్ వంటి గోవులకు మూపురము ఉండదు. యివి సూర్యశక్తిని గ్రహించలేవు. అందువలన వీటి పాలు మంచివి కావు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు మూపురము ఉన్న ఆవుపై ఆధారపడి ఉంది. ఈ ఆవుపాలు చలాకిని, తెలివిని, జ్ఞాపకశక్తిని, సత్వగుణమును, బుద్ధిబలమును, ఒజస్సును పెంచును, ఓజస్సు మనిషి యొక్క తెలివికి, ఆకర్షణశక్తి, వ్యాధి నిరోధక శక్తిని ప్రధాన కారణము, నెయ్యి – ఆరోగ్యమైన మంచి ఎముకలను మంచి రక్తమును ఉత్పత్తి చేయు మూలుగను, మంచి హక్కును, మేధాశక్తిని, కాంతిని, బుద్దిబలమును పెంచుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చెడు కొలెస్టిరాల్ అయిన యల్.డి.యల్ కొలెస్టిరాలును పెరగనివ్వదు.

సేకరణ 


ఆవు నెయ్యి వలన ఉత్పత్తి అయిన మూలుగ నుండి మంచి రక్తము ఉత్పత్తి అయి, వ్యాధికారక క్రిములను (AIDSను కలుగచేయు విష (Virus) క్రిములతో సహా) చంపి వేసి, ఆరోగ్యమును కలుగజేయును. స్త్రీలలో ఎముకలు బలహీనమై Osteoporosis, Arthritis అనే వ్యాధి రాకుండా ఉండటానికి , వచ్చిన వ్యాధిని తగ్గించుటకు, గర్భిణి స్త్రీలు మంచి కాల్షియం పొందడానికి – Calcium మాటల కన్నా ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. స్త్రీ గర్భములోని బిడ్డకు ఎముక పుష్టికి, మేధాశక్తికి పునాది వేస్తుంది.


ఈ జన్మలో నిత్యమూ తీసుకొనే ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి యొక్క సూక్ష్మ అంశతో ఏర్పడే ‘మనస్సు, బుద్ధి’ రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలము ప్రసాదిస్తుంది. మన ఋషులు తపశ్శక్తితో చెప్పిన సూక్ష్మ విషయములు శాస్త్రవేత్తలు కొంతవరకే నిర్ధారించగలరు. ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మ చైతన్యము గురించిన వివరములు విజ్ఞానశాస్త్రము ఇంకనూ కనుగొనలేదు. వాటి గురించిన వివరములు తెలుసుకో గలిగినప్పుడే శాస్త్రవేత్తలు పై విషయములు చెప్పగలుగుతారు. ఆరోగ్యము మేధాశక్తితో కూడిన ప్రజలు మన దేశ భవిష్యత్తుకు మూలము 

Monday, 29 April 2024

హనుమాన్ చాలీసా

 


హనుమాన్ చాలీసా

దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥

ధ్యానం
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥

చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥

రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥

మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥

కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।
కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥

శంకర సువన కేసరీ నందన ।
తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥

విద్యావాన గుణీ అతి చాతుర ।
రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥

ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
రామలఖన సీతా మన బసియా ॥ 8॥

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥

భీమ రూపధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥

లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥

రఘుపతి కీన్హీ బహుత బడాయీ (ఈ) ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥

సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥

సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥ 14 ॥

యమ కుబేర దిగపాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥

తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥

యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥

దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥

రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥

సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥

ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥

భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై ॥ 24 ॥

నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥

సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥

సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥

ఔర మనోరథ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥

చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥

సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥ 30 ॥

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥

రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥

తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥

అంత కాల రఘుపతి పురజాయీ ।
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥

ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥

సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥

జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥

జో శత వార పాఠ కర కోయీ ।
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥

జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥

తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥

దోహా
పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।

Sunday, 22 October 2023

తెలుగు–సంస్కృతం పేర్లు

 తెలుగు–సంస్కృతం పేర్లు

అరటిపండు – కదళీఫలం

ఆపిల్ – కాశ్మీరఫలం

ఉసిరికాయ – అమలక

కిస్మిస్ – శుష్కద్రాక్ష

కొబ్బరికాయ పూర్తిగా – నారికేళం

కొబ్బరికాయ చిప్పలు – నారికేళ ఖండద్వయం

ఖర్జూరం – ఖర్జూర

జామపండు – బీజాపూరం

దబ్బపండు – మాదీఫలం

దానిమ్మపండు – దాడిమీఫలం

ద్రాక్షపళ్ళు – ద్రాక్షఫలం

నారింజ – నారంగ

నిమ్మపండు – జంభీరఫలం

నేరేడుపండు – జంబూఫలం

మామిడి పండు – చూతఫలం

మారేడుపండు – శ్రీఫలం

రేగు పండు – బదరీ ఫలం

వెలగపండు – కపిత్తఫలం

సీతాఫలం – సీతాఫలం


విశేష నివేదనలు 


అటుకులు – పృథక్

అటుకుల పాయసం – పృథక్పాయస

అన్నము (నెయ్యితో) – స్నిగ్ధౌదనం

అన్నం (నెయ్యి, కూర, పప్పు, పులుసు, పెరుగు) – మహానైవేద్యం

ఉగాది పచ్చడి – నింబవ్యంజనం

కట్టుపొంగలి (మిరియాల పొంగలి) – మరీచ్యన్నం

కిచిడీ – శాకమిశ్రితాన్నం

గోధుమ నూక ప్రసాదం – సపాదభక్ష్యం

చక్కెర పొంగలి – శర్కరాన్నం

చలిమిడి – గుడమిశ్రిత తండులపిష్టం

నిమ్మకాయ పులిహోర – జంభీరఫలాన్నం

నువ్వుల పొడి అన్నం – తిలాన్నం

పరమాన్నం (పాలాన్నం) - క్షీరాన్నం

పానకం – గుడోదకం, మధుర పానీయం

పాయసం – పాయసం

పిండివంటలు – భక్ష్యం

పులగం – కుశలాన్నం

పులిహోర – చిత్రాన్నం

పెరుగన్నం – దధ్యోదనం

పేలాలు – లాజ

బెల్లపు పరమాన్నం –గుడాన్నం

వడపప్పు – గుడమిశ్రిత ముద్గసూపమ్

వడలు – మాసపూపం

శెనగలు (శుండలు) – చణకం

హల్వా – కేసరి

వివిధ పదార్థాలు

అప్పాలు – గుడపూపం

చెరుకు ముక్క – ఇక్షుఖండం

చక్కెర – శర్కర

తేనె – మధు

పాలు – క్షీరం

పెరుగు – దధి

బెల్లం – గుడం

వెన్న – నవనీతం 

Thursday, 24 August 2023

హనుమ నవ అవతారములు నామాలు

 

ప్రసన్న హనుమాన్ ,
వీర అంజనేయుడు,
వింశతి భుజహా,
పంచవక్తృత,
అష్టాదశ భుజహా,
సువర్చలాపతి ,
చతుర్భుజహ,
కజిత శ్రీమాన్ ద్వాత్రిమ్స  భుజమండలహా ,
వానరాకారహ
నవావతార నామములు ఎవరైతే పఠిస్తారో వారికి హనుమ రక్ష ఉంటుంది అని శాస్త్ర విదితం..

సేకరణ : శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం నుండి...🙏🌷🙏